వాడుకరి చర్చ:రవిచంద్ర/పాత చర్చ 1

తాజా వ్యాఖ్య: అభినందనలు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Dev

{{సహాయం కావాలి}}నేను ముచ్చివోలు అనే గ్రామాన్ని గురించి వెతికాను. అక్కడ ఒక తప్పు ఉన్నది. అందులో ఒక లింకు శ్రీకాళహస్తి జిల్లా లోని శ్రీకాళహస్తి మండలం లో ఉన్నట్టు గా ఉంది. శ్రీకాళహస్తి జిల్లా కాదు ఒక మండలం. దీన్ని తీసివేయడం ఎలా? అలాగే హైపర్ లింకులు ఎలా పెట్టాలో కూడా చెప్పండి.

  • ముచ్చివోలు సంగతి సరిచేశాను.
  • హైపర్ లింకులు ఇవ్వడానికి [[ ]] మధ్యలొ విషయం వ్రాయాలి. మచ్చివోలు హైపర్ లింకులొ ఉంచాలంటే [[మచ్చివోలు]]
  • ఇంకా ఏమైన సందేహాలు ఉంటే తప్పక అడగండి.--మాటలబాబు 11:25, 22 సెప్టెంబర్ 2007 (UTC)

వివేకానందుడు అని వెతికాను. ఆ పేరుతో వ్యాసాలు ఏవీ లేవు అని వచ్చింది. దాని వల్ల ప్రత్యేక పుట ప్రారంభించాను. దానిని స్వామీ వివేకానంద తో విలీనం చెయ్యండి. కానీ వివేకానందుడు లేదా,వివేకానంద లేదా స్వామి వివేకానంద అని ఏది వెతికినా అదే పేజీకి వెళ్ళేలా ఏర్పాటు చేయండి. అందువల్ల ఒకే విషయం గూర్చి రెండు వ్యాసాలు తగ్గుతాయి. ఇదే ప్రతిపాదన చాలా పేజీ లకు వర్తిస్తుంది.Ravichandrae 13:12, 29 సెప్టెంబర్ 2007 (UTC)

సాధారణంగా గూగుల్లో కూడా ఒకసారి వెతికిచూడటం మంచిది. గూగూల్ శోధన మంచి ఫలితాలనిస్తుంది. విస్తృత శోధన (ఎక్స్టెండెడ్ సెర్చ్) పేజీలో డ్రాప్ డౌన్ లిస్టులో గూగూల్ ను ఎంచుకొని శోధించే అవకాశం కల్పించబడింది కూడా. మీరు చేసిన ప్రతిపాదన అమలుపరుస్తాం --వైజాసత్య 04:55, 23 సెప్టెంబర్ 2007 (UTC)
  • గూగుల్ గ్రూప్ ను తెలుగులో గూగుల్ గుంపులు అనడం కన్నా గూగుల్ సమూహం అంటే బావుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు?
సమూహం కూడా బాగానే ఉంటుంది. మార్చటానికి మిగిలిన సభ్యుల అభిప్రాయం కూడా తీసుకోవాలి --వైజాసత్య 04:55, 23 సెప్టెంబర్ 2007 (UTC)

ఊరి పేర్ల అనువాదం

మార్చు
  • అనువాదం చేసేటప్పుడు ఆంగ్ల పదాలను పూర్తిగా తీసివేయమంటారా? (ఉదాహరణకు నేను మార్చిన వికీ ప్రాజెక్టు లోని తాలూకాలను గమనించండి)
ఆంగ్ల పేర్లను అలాగే ఉంచండి. ఆంగ్ల పేరుకు పక్కనే తెలుగులోకి అనువదించిన పేరును ఉంచండి. అలా చేయటం వలన భవిశ్యత్తులో ఆ ప్రాతాలకు పేజీలను సృష్టించిన తరువాత వాటి నిర్వహణ, ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలతో లింకులు ఏర్పాటు చేయగలగటం వంటివన్నీ సులభమవుతాయి. అలాగే "చర్చా పేజీలలో" ఏదయినా రాసిన తరువాత ~~~~ చేరిస్తే మీ పేరూ తేదీ పడుతుంది, వికీపీడియాలో దానిని మీ సంతకంగా చూస్తారు. అలా సంతకం చేయటం వలన ఎవరు ఎప్పుడు చెర్చజరిపారో తెలుస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:41, 29 సెప్టెంబర్ 2007 (UTC)
ఊరి పేర్లను మీరు ఇప్పుడు ఎలా అనువదిస్తున్నారో అలాగే చేయండి. బాగా అనువదిస్తున్నారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:44, 29 సెప్టెంబర్ 2007 (UTC)

ప్రాజెక్టులలో చేరటం ఎలా

మార్చు
  • నేను కూడా ఏదైనా వికీ ప్రాజెక్టులలో చేరాలంటే ఎలా? నేను అచ్చుతప్పులు సరి చేయగలను. Ravichandrae 07:00, 30 సెప్టెంబర్ 2007 (UTC)
  • ఒక వాక్యం తరువాత కొత్త లైను రావాలంటే ఎలా? సబ్ సెక్షన్ ఎలా ప్రారంబించాలో కూడా తెలియ చేయండి. Ravichandrae 07:08, 30 సెప్టెంబర్ 2007 (UTC)
మీరు సముదాయ పందిరికెళ్ళి ఒకసారి మొత్తంగా అన్నిటినీ చూడండి. అలాగే ప్రాజెక్టు మూసను మీ సభ్యుని పేజీలో తగిలించుకొంటే సరిపోతుంది మీరూ సభ్యునిగా మారిపోతారు. ఉదా'ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యుడు రాసి అటు ఇటు బ్రాకెట్స్ {{ }} తగిలించి మీ పేజీలో పెడ్తే సరిపోతుంది.విశ్వనాధ్. 07:32, 30 సెప్టెంబర్ 2007 (UTC)
తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులను ఒక సారి సందర్శించి వాటిలో మీకు కావలిసిన వాటిలో మీకు తోచిన పనిని మొదలుపట్టవచ్చు. ప్రతీ ప్రాజెక్టుకూ ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీలో సభ్యుడిగా ఎలా చేరాలో వివరాలు ఉంటాయి. ఏదయినా ప్రాజెక్టు వ్యాసాలైపై పనిచేయడానికి అందులో సభ్యుడిగా చేరాల్సిన అవసరంలేదు. సభ్యుడిగా చేరటం అనేది నిర్వహణాపరమైన సౌలభ్యంకోసం మాత్రమే. అంతేకాదు మీకు కావలిసిన అంశం ఎటువంటి ప్రాజెక్టూ లేకపోతే మీరే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టండి. అందుకు వికీపీడియా:రచ్చబండలో ఒక ప్రతిపాదన చేయండి, ప్రాజెక్టును సృష్టించడానికి, దానికి దశా ఇతర సభ్యులు మీకు సహాయపడతారు. వికీపీడియాలో ప్రస్తుతం ఉన్న దళాలు ఇవీ: శుద్ధి దళం, అక్షరదోష నిర్మూలన దళం, వాటి పేజీలను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:16, 30 సెప్టెంబర్ 2007 (UTC)
  • మన రాష్ట్ర మంత్రుల జాబితాను తయారు చేస్తున్నాను. దానిని సరైన స్థానంలో పెట్టండి Ravichandrae 09:43, 2 అక్టోబర్ 2007 (UTC)
ఇక్కడాంటిస్తారు ఆ బొమ్మని ఇప్పుడు??--బ్లాగేశ్వరుడు 10:39, 2 అక్టోబర్ 2007 (UTC)
తెలియక అప్లోడ్ చేశాను. దానిని మీరు తీసివేయవచ్చు. ఏమీ అనుకోకండి.Ravichandrae 13:45, 8 అక్టోబర్ 2007 (UTC)

సలహా కావాలి

మార్చు
  • వికీపీడియాలో వ్యాసాల నాణ్యత గురించి నాకు పెద్దగా పెద్దగా తెలియదు. నేను అనువదించిన హిందూ మతంలోని వ్యాసాలను చూసి మీరు భరోసా ఇస్తే నేను ఇలాగే కొనసాగిస్తాను. Ravichandrae 13:44, 12 అక్టోబర్ 2007 (UTC)
  • ఎవరో ఒకరు చూసి సలహా ఇవ్వండి! Ravichandrae 05:27, 17 అక్టోబర్ 2007 (UTC)
మీరు కొనసాగించండి.తరువాత తెలిసిన వారు మరికొమ్త చేరుస్తూ వికీకరిస్తారు.విశ్వనాధ్. 05:32, 17 అక్టోబర్ 2007 (UTC)
హిందు మతం వ్యాసాన్ని అభివృద్ధి పరచుతున్నందుకు ధన్యవాదాలు --బ్లాగేశ్వరుడు 09:26, 27 అక్టోబర్ 2007 (UTC)
వికీపీడియా లాంటి స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వంలో హిందూ మతంలాంటి గొప్ప వ్యాసాన్ని మొత్తం అనువదించే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. Ravichandrae 09:34, 28 అక్టోబర్ 2007 (UTC)

అవును మీరు మంచి వ్యాసాన్ని ఎన్నుకొన్నారు. విశ్వనాధ్. 10:04, 28 అక్టోబర్ 2007 (UTC)

పేరు మార్చుకోగలనా

మార్చు
  • నా పేరును రవిచంద్ర గా మార్చుకోవాలనుకుంటున్నాను. మార్చుకుంటే లాగిన్ మారుతుందా? నేను ముందు చేసిన మార్పులు నాపేరు మీదనే ఉంటాయా?

Ravichandrae 12:23, 29 అక్టోబర్ 2007 (UTC)

అధికారులకు (నేను, చదువరి) పేరును మార్చగలిగే హక్కులుంటాయి. అవును లాగిన్ మారుతుంది. కానీ ఇప్పటిదాకా చేసినమార్పులన్నీ మీ కొత్తపేరుకు బదిలీ అవుతాయి. పేరు మార్చమంటారా? --వైజాసత్య 12:26, 29 అక్టోబర్ 2007 (UTC)
  • అలాగే మార్చండి Ravichandrae 12:30, 29 అక్టోబర్ 2007 (UTC)
  చేశాను --వైజాసత్య 12:38, 29 అక్టోబర్ 2007 (UTC)
  • ధన్యవాదాలండీ! కొత్త పేరుతో లాగిన్ అయ్యి చూశాను.పనిచేస్తుంది. రవిచంద్ర 12:43, 29 అక్టోబర్ 2007 (UTC)
హిందుమతం వ్యాసంలోని మీ అనువాదం చూశాను. చాలాబాగా చేశారు. ఎప్పటికి అనువాదమౌతుందో అనుకున్న అంతపెద్ద వ్యాసాన్ని దీక్షగా అనువదించినందుకు నెనర్లు. మూలాలు చేర్చి కొంత భాగము ఇంగ్లీషులో ఉన్న పాఠ్యాన్ని నేను తొలగించాను కూడా! --వైజాసత్య 07:36, 31 అక్టోబర్ 2007 (UTC)

అనువాదాలు, వగైరా

మార్చు

రవి చంద్ర గారూ! హిందూమతము వ్యాసం అనువాదం మీరు చాలా భాగం బాగా చేశారు. ధన్యవాదాలు. మిగిలిన కొద్దిగా నేను పూర్తి చేశాను. (1) కాని ఆంగ్ల భాగాన్ని తొలగించడానికి మీరు కాస్త వెనుకాడినట్లున్నారు. ఏమీ పరవాలేదు. మీ అనువాదంలో వంకలు లేవు. కనుక ఇకముందు మీరు అనువదించిన వెంటనే సంబంధిత ఆంగ్ల భాగాన్ని తొలగించండి. (2) ఏదైనా రిఫరెన్స్ "<ref> మరియు </ref>ల మధ్య వచ్చేది" ఉంచాలనిపిస్తే దానిని యధాతధంగా తెలుగు అనువాద భాగంలో కూడా చేర్చేయవచ్చును. --కాసుబాబు 09:17, 6 నవంబర్ 2007 (UTC)

  • హిందూ మత వ్యాసం చాలా ముఖ్యమైన వ్యాసం కనుక కొద్ది మంది సీనియర్ సభ్యులు చూసి మార్పులు చేసిన తరువాత ఆంగ్ల భాగాన్ని తీసివేద్దామనుకున్నాను. మీరు భరోసా ఇచ్చారు కదా! ఇక మీదట అలాగే చేస్తాను.

--రవిచంద్ర రవిచంద్ర 12:53, 6 నవంబర్ 2007 (UTC)

సహాయ అభ్యర్ధన

మార్చు
  • ఒక గ్రామం గురించిన వ్యాసంలో ఏమేమి వివరాలు పొందుపరుచాలో తెలుపగలరు. లేదంటే ఒక గ్రామానికి సంభందించిన సంపూర్ణ వ్యాసాన్ని సూచించండి. నాకు వివిధ గ్రామాల స్నేహితులు ఉన్నారు. వారినుండి ఈ వివరాలు రాబట్టి వికీపీడియాలో పొందుపరుస్తాను. సభ్యుడు:రవిచంద్ర రవిచంద్ర 13:12, 6 నవంబర్ 2007 (UTC)
బ్రాహ్మణగూడెం ఒకసారి చూడండి. 202.164.53.226 13:31, 6 నవంబర్ 2007 (UTC)
అలాగే చిమిర్యాల, మండపాక కూడా చూడండి. వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు, వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1 అనే రెండు ప్రచార పేజీలు కూడా ఒకమారు చూడండి. మిత్రులను సంప్రదించి వారి గ్రామాల గురించి వ్రాయడం చాలా మంచి ఐడియా. విశ్వనాధ్ కూడా ఇలా చేశాడు. తెలుగు వికీ సమస్యను పరిష్కరించడానికి ఇది అద్భుతమైన కిటుకు. నేను కూడా ఇలా చేయడానికి ప్రయత్నిస్తాను. --కాసుబాబు 19:56, 6 నవంబర్ 2007 (UTC)

వ్యాసము- మార్పు

మార్చు

రవిగారూ ఆ సభ్యుని సమాచారాన్ని అతని సభ్యుని పేజీకి తరలించాను. మీరైనా ఇది చేయవచ్చు. ముందుగా అతని చర్చాపేజికి వెళ్ళి అది కాళీగా ఉంటే అతనికి ఆహ్వానపు పత్రమును అంటించండి. అదెలాగో మీ పేజీలో ఉంది. సబ్జెక్ట్:సబ్యుడు ఇలా. తరువాత మీ అబ్యంతరముగా అనిపించిన సమాచారమును మార్పుకు వెళ్ళి కట్ చేసి సేవ్ చేయండి. లేదా ఆపేజీ తొలగించవలసినదిగా ఆవ్యాసపు చర్చాపేజీలో రాయండి. ఎవరో ఒకరు పరిశీలించి తొలగిస్తారు.విశ్వనాధ్. 05:09, 9 జనవరి 2008 (UTC)Reply

చిట్కాలు

మార్చు

రవిచంద్రగారు! మీరు కొన్ని చిట్కాలు వ్రాయగలరా? వికీపీడియా:వికీ చిట్కాలు సందర్శించండి. δευ దేవా 12:10, 10 జనవరి 2008 (UTC)Reply

థాంక్స్ రవిచంద్ర గారు! అలానేనండి. వికీపీడియా:వికీ చిట్కాలు పేజీలో ఉన్న ఎరుపు రంగులో ఉన్న తేదీలలో ఒక్కోరోజుకు ఒక్కోచిట్కాగా వ్రాయండి. నేను చేసిన మార్పులు ఇటీవలి పేజీలో గమనించండి. δευ దేవా 12:47, 10 జనవరి 2008 (UTC)Reply
మీరు {{చిట్కా మాస్టర్}} మూసను మీ సభ్యపేజీలో తగిలించుకోవచ్చు. δευ దేవా 13:00, 10 జనవరి 2008 (UTC)Reply

దక్షిణ భారతదేశం

మార్చు

సరేనండి. నేను ప్రయత్నించి చూస్తాను. δευ దేవా 13:01, 11 జనవరి 2008 (UTC)Reply

లినక్సులో తెలుగు

మార్చు

ఇంకొక సందేహం. ఇక్కడ లినక్స్, యునిక్స్ లాంటి పదాలలో చివరి భాగం సరిగా కనిపించడం లేదు. దీనిని ఎవరికి చెప్పాలి? రవిచంద్ర 08:41, 5 జనవరి 2008 (UTC)Reply

నాకు లినక్సులో తెలుగు గురించి పెద్దగా తెలియదు. వీలైతే ఇక్కడో స్క్రీనుషాట్ అతికించండి. నాకు తెలిసిన లినక్సు మిత్రులను కదిలిస్తా --వైజాసత్య 08:47, 5 జనవరి 2008 (UTC)Reply
నేను కనుక్కున్న మిత్రులు, ఈ సమస్య ఫాంటువల్ల అయ్యుండచ్చని అంటున్నారండి. మీరే ఫాంటు వాడుతున్నారు? పోతన కానీ గౌతమి కానీ వాడి చూడండి --వైజాసత్య 17:17, 18 జనవరి 2008 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

మీరు నాపై ఉన్న నమ్మకంతో నా స్వీయప్రతిపాదనకిచ్చిన మద్దతుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. δευ దేవా 06:55, 21 జనవరి 2008 (UTC)Reply

దక్షిణ బారత దేశం

మార్చు

రవీ! నేను ప్రస్తుతం సెలవులో ఉన్నాను. ఇంటర్నెట్ వాడకం పరిమితం. త్వరలో నా వికీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. --కాసుబాబు 13:04, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు
  • మూసలు ఎలా తయారు చేయాలి? ఏదైనా లింకు ఇవ్వగలరా? రవిచంద్ర 13:14, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply
  • వ్యాసం తయారును మీ పేజీలో పెట్టు కొనుట బావుంది.విశ్వనాధ్. 13:22, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply
  • రవిచంద్రగారు! ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు అనే మూస ఇంతకుముందే ఉంది, మీరు తయారుచేసిన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు అనే మూసను తొలగిస్తున్నాను. మూసలు తయారుచేయడం ఎలానో తెలుసుకోవాలంటే ఆంగ్లవికీ సహాయం చూడండి, లేదా మన తెలుగు వికీలో ఉన్న మూసలను పరిశీలించండి. δευ దేవా 13:43, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply

రచ్చబండ

మార్చు

నేనొకసారి కాషే రిఫ్రెష్ చేస్తే నాక్కనిపిస్తుంది. మీకు కనిపించకపోతే మీరూ కాషే రిఫ్రెష్ చేసుకోండి --వైజాసత్య 04:30, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు

మార్చు

నా స్వీయ నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 12:36, 16 ఫిబ్రవరి 2008 (UTC)Reply

దిద్దుబాట్లు

మార్చు

రవిచంద్ర గారు, మీరు ఇప్పటివరకు 599 దిద్దుబాట్లుచేశారు. మీ దిద్దుబాట్లు తెలుసుకోవాలంటే పై భాగంలో ఉండే నా అభిరుచులు నొక్కితే చాలు. నేంస్పేసు వారీగా దిద్దుబాట్లు రావాలంటే http://tools.wikimedia.de/~interiot/cgi-bin/count_edits?user=%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0&dbname=tewiki_p లింకుపై నొక్కండి.--

ధన్యవాదాలు చంద్రకాంతరావుగారూ... ఈ మధ్య చిన్న చిన్న విషయాలమీదే సందేహాలు వస్తున్నాయి. :-) --రవిచంద్ర 12:24, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

చంద్రకాంత్ గారు మీకు సహాయం చేసినట్లున్నారు కదా! కామన్స్లో ఏ పేరుతో ఉందో అదే పేరుతో చేరిస్తే సరిపోతుంది. కామన్స్ బొమ్మలను చేర్చడానికి ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. δευ దేవా 14:41, 29 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సహాయం కావాలి

మార్చు

సహాయ అభ్యర్ధన

మార్చు
ప్రస్తుతం ఆంగ్ల వికీ నుండి బొమ్మను సేవ్ చేసి మళ్ళీ అవే హక్కులతో అప్లోడ్ చేయండి.--విశ్వనాధ్. 13:07, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply
కామన్స్‌లో ఉన్న బొమ్మను మళ్ళీ అప్లోడ్ చేయనవసరం లేదండి రవిచంద్ర గారు. వాటిని యధాతథంగా అదే ఫైలుపేరుతో మనమూ ఉపయోగించుకోవచ్చు. ప్రతుతం నేను అక్కడ మీరు అప్లోడ్ చేసిన బొమ్మను తొలిగించి కామన్స్‌లోని బొమ్మనే ఉపయోగించాను చూడండి.--C.Chandra Kanth Rao 13:53, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply
ధన్యవాదాలండీ! నేను పదానికీ పదానికీ మద్య అండర్స్కోర్ పెట్టడం మరిచాను అదీ సంగతి. నేను అప్లోడు చేసిన బొమ్మను తుడిచి వేయండి. రవిచంద్ర 14:01, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply
ఒక బొమ్మ కామన్సు లో ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడం ఎలా?--రవిచంద్ర 12:09, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఉదాహరణకు ఈ బొమ్మను తీసుకోండి. http://en.wikipedia.org/wiki/Image:Centaur_%28ARTV09088%29.jpg ఆ పేజీ కి వెళ్తే అక్కడ

This is a file from the Wikimedia Commons. The description on its description page there is shown below. Commons is a freely licensed media file repository. You can help.

అని ఉంది. కాబట్టి ఆ బొమ్మ కామన్స్ లో ఉన్నది.సాయీ(చర్చ) 04:23, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

వేణు మాధవ్ వ్యాసం

మార్చు

సత్య గారూ! నేరెళ్ళ వేణు మాధవ్ గారు సినిమా నటుడు వేణు మాధవ్ కి గురువు గారు. నేరెళ్ళ వేణు మాధవ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారు.వీలీన ప్రతిపాదన ను ఉపసంహరిస్తున్నాను. రవిచంద్ర 04:29, 19 ఫిబ్రవరి 2008 (UTC)Reply

అవునా..నేను ఇద్దరూ ఒకటే అనుకున్నాను. తెలియజేసినందుకు నెనర్లు --వైజాసత్య 17:26, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కొడవగంటి కుటుంబరావు

మార్చు

కొడవగంటి కుటుంబరావు గారి వ్యాసం ఇక్కడుంది. చిన్న వ్యాసంలోని సమాచారం ఇక్కడ] కల ఈ వ్యాసంలో చేర్చాలేమో చూసి, తరువాత మీ వ్యాసం తుడిచివేయాలేమో చెప్పండి.--విశ్వనాధ్. 12:19, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply

వ్యాసం పేరు మార్చాలి . ఆయన పేరు కొడవగంటి కుటుంబరావు. నా వ్యాసాన్ని తుడిచి వేయండి. రవిచంద్ర 12:25, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply
పేరు కూడా మార్చనక్కరలేదు నేనే పొరపాటు పడ్డాను. రవిచంద్ర 12:27, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ప్రసిద్ద భారతీయులకు వ్యాసాలతో పాటు వర్గం:సుప్రసిద్ధ భారతీయులు అనేది కూడా చెర్చేయండి.--విశ్వనాధ్. 12:38, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కొత్త వ్యాసాలు

మార్చు

రవిచంద్ర గారు, మీరు కొత్త వ్యాసాలు ప్రారంభించే ముందు ఇది వరకే ఆ వ్యాసం ఉందో లేదో ఒకసారి పరీక్షించండి. మీరు ఈ రోజు ప్రారంభించిన కొత్తపేజీలు సి నారాయణ రెడ్డి‎, సర్వేపల్లి రాధాక్రిష్ణన్‎, సర్దార్ వల్లభాయ్ పటేల్‎ వ్యాసాలు కొద్ది పేరు మార్పుతో ఇప్పటికే ఉన్నాయి. నేను కొత్తవ్యాసాలలోని కొత్త సమాచారాన్ని తరలించి మీ వ్యాసాలను ఖాళీ చేసి ప్రస్తుత వ్యాసాలకు దారిమార్పు చేశాను. ఉన్న వ్యాసాలే మళ్ళీ ప్రారంభిస్తే మీ శ్రమ వృధాకావచ్చు.--

నేనప్పటికీ గూగుల్ సర్చ్ ఉపయోగించి చూసిన తరువాతే కొత్త వ్యాసాలు ప్రారంభిస్తున్నానండీ. గూగుల్ సర్చ్ కూడా కొన్ని సందర్భాలలో సరిగా పని చేయడం లేదు. ఒక వ్యాసాన్ని రాసినపుడు ఆ వ్యాసం పేరు ఎన్ని రకాలుగా రాయగలరో, వాటన్నింటికీ దారి మార్పు పేజీలు తయారు చేస్తే ఈ సమస్య ఉండదని నా భావన. మీరు మిగతా వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. నేను రాసే వ్యాసాలన్నింటికీ సాధ్యమైనన్ని దారి మార్పు పేజీలు తయారు చేస్తుంటాను. -- రవిచంద్ర 04:24, 22 ఫిబ్రవరి 2008 (UTC)Reply

"నా" వ్యాసాలు

మార్చు

నేను రాసే వ్యాసాలను నావి అని నేను ఎప్పుడు అనుకోలెదు. అనుకోను కూడ. నన్ను అభినందిచినందుకు ధన్యవాదములు. సాయీ (చర్చ) 03:43, 22 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఇంగ్లాండు ప్రస్తుత రాణి రెండవ ఇలిజబెథ్ వ్యాసం తెవికీ లో ఉందో లేదో కాస్త చెప్తారా? సాయీ (చర్చ) 11:12, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply
మీరు ఇక్కడికి వెళ్ళి చూడండి. తెలుగులో ఇలిజబెథ్ అని వ్రాయాలి. ఎలిజబెథ్ కాదు. అందువలనే నేను మిమ్మల్ని అడిగాను. సాయీ (చర్చ) 11:52, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply
అలాగే చేద్దాం. నేను ప్రస్తుతం ఆస్ట్రేలియా వ్రాస్తున్నాను. అయిపొయిన తరువాత ఇది ప్రారంభిస్తాను. సాయీ (చర్చ) 12:01, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply
Human Settlement ని తెలుగోలో ఏమంటారు? సాయీ (చర్చ) 12:07, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply

copyvios

మార్చు

ఈ క్రింది బొమ్మలు copyright violations. దయచేసి వెంటనే delete చేసెయ్యండి

  2006లో ప్రచురించిన పుస్తకం నుండి తీసినది. అప్లోడ్ చేసిన వారంలో తీసేసేయాలి. 2 సంవత్సరాలు కావస్తోంది.
దస్త్రం:Akkineni Nageswara Rao .jpg దీన్ని ఎక్కడ నుండి తీసారో తెలీదు. ఇది కూడ 2006లో అప్లోడ్ చేసారు.
దస్త్రం:శ్రీNTR.jpg ఇది ఏదో సినిమా నుండి తీసినది. దీనికి బదులుగా వాడటానికి free బొమ్మలు ఉన్నాయి కాబట్ట దీన్ని తీసేయండి. ఇది కూడ 2006 నుండి ఇక్కడ ఉంది.
100ప్క్px దీన్ని తొలగించాలని ట్యాగ్ వేసారే కాని తొలగించలేదు.

ఇంకా దొరికే కొద్ది చెప్తాను సాయీ(చర్చ) 05:15, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

క్షమించండి. మీరు నిర్వాహకులు అనుకున్నాను. సాయీ(చర్చ) 10:11, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply
మరి sorryని తెలుగులో ఏమంటారు? సాయీ(చర్చ) 00:17, 28 ఫిబ్రవరి 2008 (UTC)Reply
బాగా చెపారు రవిచంద్ర గారు. అవును చిన్నచిన్న వాటికి క్షమాపణలు అవసరం లేదు :) ఇంకొకటి. ఒక మూసలో వ్యాకరణం సరిగా లేదు. నాకు ఎల సరిచేయాలో తెలీదు. ఇక్కడకి వెళ్ళి చూడండి. సాయీ(చర్చ) 11:26, 28 ఫిబ్రవరి 2008 (UTC)Reply

bracket

మార్చు

మీరు వ్రాస్తున్న వ్యాసాలకు బ్రాకెట్ తరవాత స్పేస్ ఇవ్వడం మరచిపోతున్నారు... సాయీ(చర్చ) 14:00, 8 మార్చి 2008 (UTC)Reply

ఒకో సారి అంతే :) సాయీ(చర్చ) 14:07, 8 మార్చి 2008 (UTC)Reply

వ్యాసం తొలగించాలంటే

మార్చు

రవీ! ఏదైనా వ్యాసం తొలగించాలంటే అందులో విషయం తీసివేయనక్కరలేదు. ఆ వ్యాసంలో {{తొలగించు|కారణం}} అనే మూసను పెట్టవచ్చు. తరువాత నిర్వహణ సమయంలో నిర్వాహకులు ఎవరైనా తొలగిస్తారు.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:45, 9 మార్చి 2008 (UTC)Reply

బిజీ బిజీ

మార్చు

నా దురదృష్టవశాత్తూ కొన్ని వ్యక్తిగత కారణాల వలన సరిగ్గా నేను నిర్వాహక ప్రతిపాదన చేసిన తరువాతే ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లభించుట లేదు. కాబట్టి నేను ఒక రెండు నెలల సమయం పాటు ఎక్కువ మార్పులు చేయలేకపోవచ్చు.అన్యదా భావించకండి. తరువాత నా సొంత ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొంటే యధావిధిగా మార్పులు చేయగలను. రవిచంద్ర ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, అని మిగతా నిర్వాహకులు కూడా నాకు మద్దతు తెలిపారు. ఎక్కువ దిద్దుబాట్లు చెయ్యలేకపోతున్నందుకు బాధగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. రవిచంద్ర(చర్చ) 13:23, 17 మార్చి 2008 (UTC)

రవీ! ఈ విషయం గురించి నువ్వు అలా ఫీల్ అవ్వడం అస్సలు ఉచితం కాదు. స్వకార్యాలు విస్మరించ దగదు. అందరూ తమ వీలును బట్టే పని చేయగలరు. అసలు ఈ 'స్వేచ్చ'యే వికీ లో పని చేయడంలో ఇంత ఆనందాన్నిస్తుందని నా అభిప్రాయం. ఇక దిద్దుబాట్ల టార్గెట్ అనే ఆలోచనే వద్దు. సందర్భం బట్టి చెబుతున్నాను. నేను సెలవులో ఉన్నపుడు ఇంటర్నెట్ వాడడం దాదాపు కుదరదు. కాని వూళ్ళ వెంట తిరిగేటప్పుడు కెమెరా వెంట వుంచుకొని ఒకో వూరుకూ ఒకటి రెండు ఫొటోలు తీశేవాడిని. నాతో ప్రయాణించడానికి అందరూ విసుక్కొనేవారు! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:38, 17 మార్చి 2008 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:23, 20 మార్చి 2008 (UTC)Reply

అభినందనలు

మార్చు

మీరు వికీపీడియా నిర్వాహకుడైనందుకు నా అభినందనలను తెలుపుతున్నాను. సెలవులో ఉండడం వలన మీ ప్రతిపాదనను చూసుకోలేదు. δευ దేవా 22:14, 20 మార్చి 2008 (UTC)Reply

Return to the user page of "రవిచంద్ర/పాత చర్చ 1".