వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 7
|
శ్రవణ వికీ విశేషపతాకం
మార్చుశ్రవణ వికీ విశేషపతాకం ఇచ్చినందుకు ధన్యవాదాలు.నాకు ఆపతాకం చూసి చాలా అశ్చర్యము అమితానందం కలిగాయి.మళ్ళి ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను--మాటలబాబు 16:48, 9 జూలై 2007 (UTC)
- మీరు అందుకు అర్హులు. కృతజ్ఞతలు --వైజాసత్య 16:50, 9 జూలై 2007 (UTC)
నా పతాకానికి నేనుకూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు--విశ్వనాధ్vissu 06:04, 6 ఆగష్టు 2007 (UTC)
మూస
మార్చురవీ [చంద్రశేఖర్(అరవం)] లాగా మూస మనకు ఉంటే బాగుంటుంది. --నాగడు 22:13, 9 జూలై 2007 (UTC)
- అదే ప్రయత్నములో ఉన్నాను --వైజాసత్య 22:19, 9 జూలై 2007 (UTC)
- బాగుంది. ఇంత త్వరగా ఊహించలేదు :) --నాగడు 22:28, 9 జూలై 2007 (UTC)
మలకలచి
మార్చుమలకలచి చూశారేమిటి???
సంగీతం
మార్చుమెన్న ఖాళీగా ఉన్నాను కదా అని వికీ సోర్సు ప్రక్క బారు లొకి చెళ్ళి నొక్కే ఆట ఆడాను, ఆడినప్పుడల్లా నాకు త్యాగరాజ కీర్తనలు వచ్చాయి, చరితం నొక్కితే మీ పేర్లు కనిపించాయి. సంగీత ప్రవేశం ఎంతవరకు ఉన్నదేమిటి, వామనగుంతలు గురించి త్యాగయ్య రచించిన కీర్తన మీరు ఆ వ్యాసం చర్చాపేజిలొ వ్రాయడం చూశాను--మాటలబాబు 17:23, 10 జూలై 2007 (UTC)
- ఒక సినిమా పాటవిని ఆహా బాగుంది అనేంత వరకే నా సంగీత జ్ఞానం. ఆ త్యాగరాజ కీర్తనలన్నీ ఒక అజ్ఞాత సభ్యుడు ఇక్కడే వికీపీడియాలో చేర్చాడు. అప్పట్లో తెవికీలో పట్టుమని వెయ్యి వ్యాసాలు కూడా లేవు..అందుకని ఎవరూ అభ్యంతర పెట్టలేదు కానీ కొంత రాశి పెరిగిన తర్వాత సోర్స్ కి తరలిద్దాం అని అనుకున్నాం. నేనే వాటిని సోర్స్ కి తరలించాను అందుకని అవి నా పేరుతో ఉన్నాయి. ఇక వామన గుంటల వ్యాసంలోని కీర్తన వామన గుంటల సమాచారం కోసం గూగులో శోధిస్తుంటే దొరికిందంతే --వైజాసత్య 02:10, 12 జూలై 2007 (UTC)
ప్రాణం
మార్చుమిమ్మల్ని చూసి నాప్రాణం లేచొచ్చింది.మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి వనరులు ఉన్నాయా. సమిష్టి వ్యాసం వనరులతో కూడినదయితే మిగతా సభ్యులు సహాయం చేస్తారు. నన్ను శొధ గాడుగా(మాటలు ఎక్కువ చేతలు తక్కువ) మాత్రం పరిణగించకండి, బొమ్మలు ఉన్నాయి కదా అని వనరులు ఉంటే కొద్దిగా విషయం వ్రాయవచ్చు అని అడిగాను--మాటలబాబు 01:29, 12 జూలై 2007 (UTC)
- మంచి ఆలోచన..ఆ వ్యాసంలో బొమ్మలు వర్మగారని ఒక సభ్యుడు పెట్టారు. వనరులు కొన్ని వెతికాను. త్వరలోనే వ్యాసం అడుగున చేర్చుతాను --వైజాసత్య 02:04, 12 జూలై 2007 (UTC)
- నిజానికీ నేనే పనితక్కువ..ఫోజెక్కువ అనుకుంటా. ఇక్కడ బాట్లన్నీ దాదాపు ప్రదీపు గారు నడుపుతారు, ఇంటర్‌ఫేజునంతా (ఈ సైటంతా తెలుగుమయం ఆయనవల్లే) అనువదించి కొల్లలుగా సహాయపేజీలు రాశారు చదువరిగారు, మొదటిపేజీని డిజైన్ చేసింది వీవెన్ గారు, ఈ నెలన్నర నుండి బిజీగా ఉన్నారని నేనందుకున్నాను కానీ తెలుగు వికీ దశాదిశ నిర్దేశము చేస్తున్నది కాసుబాబుగారే. సినిమా వ్యాసాలన్నీ పలువురు బ్లాగర్లు వికీ సభ్యులు చేసిన సమన్వయ కృషి..అందులో కామేష్ గారు, నవీన్ ప్రధానపాత్ర పోషించారు. ఎప్పటికైనా నిర్వహణా భాధ్యతలు త్యజించి తీరిగ్గా కూర్చుని అచ్యుతరాయలు లాంటి వ్యాసాలు నెలకొకటి మాత్రమే రాయాలని నా కోరిక. (చూశారుగా ఆ అచ్యుతరాయలు వ్యాసాన్ని 8 నెలల నుండి రాస్తున్నా)..ఇంకా పూర్తికాలేదు. --వైజాసత్య 02:26, 12 జూలై 2007 (UTC)
- అరరే ఏంత మాట అంటున్నారు, మీరు తెవికీ మూలపురుషుడు. 2005 సంవత్సరం తెవికి ఆవిర్భావించినప్పటి నుంది మీరు ఉన్నారు. పెద్దలు పలికే చాలా వినమ్ర, నిగర్వమాటలు పలికారు. కాని పేరు కి మీరు మీ సభ్యత్వ పేజి లొ అచ్యుతరాయలు వ్యాసము వ్రాస్తున్నాను అని పెట్టారు కాని ఈ మధ్యలొ ఎన్ని అద్భుత వ్యాసాలు వ్రాశారో.--మాటలబాబు 03:58, 12 జూలై 2007 (UTC)
తెలుగు వీక్షనరీ
మార్చుతెలుగు వీక్షనరీలో కూడా వికీపీడియా CSS మరియూ javascriptను చేర్చేస్తారా. ఇప్పుడున్న CSS వలన కొత్త మూసలు ఏవయినా దిగుమతి చేసుకుంటే వెంటనే పని చేయవు. పైగా borders, మరియు అక్షరాలు చాలా పెద్దగా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 06:13, 12 జూలై 2007 (UTC)
వీక్షనరీ బాటు
మార్చువీక్షనరీలో బాటుతో కొన్ని పదాలకు పేజీలను చేర్చాను. ఆ పేజీలలో ఉన్న సమాచారాన్ని ఒక సారి గమనించి, ఇంకేమయినా కలపొచ్చేమో లేకపోతే, సమాచారాన్ని ఇంకో విధంగా చేర్చాలేమో చెప్పండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:26, 12 జూలై 2007 (UTC)
- బాగుంది ఈ పద్ధతి సరిపోతుంది. కాకపోతే ఆ రెఫరెన్స్ సమాచారాన్ని ఒక మూసలో పెట్టి ప్రతిపేజీలో ఆ మూస మాత్రమే వాడితే బాగుంటుంది. --వైజాసత్య 03:48, 13 జూలై 2007 (UTC)
- సరే అలాగే. మీరు అక్కడి మార్పులను గమనిస్తే, నేను ఇప్పటికే అలాంటి మూసను తయారు చేసాను. అయితే దానిని, వేరే అవసరానికి తయారు చేసాను. బయటి లింకులను (IIITకి మరియు sf.netకి) చేరుస్తుంటే ఆ లింకుల వలన, స్పాము జరుగుతుందని వీక్షనరీ ఒక capthaను ఇస్తుంది, దీని వలన బాటూ ఆగిపోతుంది. మూసలో పెట్టటం వలన సమస్య తీరిపోతుందేమో అని అనుకున్నాను, కానీ వాళ్ళు సాఫ్టూవేరును కొంచెం తెలివిగానే తాయారుచేసారు, మూసకూడా పనిచేయడంలేదు. అందుకని దానిని ఉపయోగించడం మానేసాను. అయితే ఇప్పుడు మూసలో ఆ లింకులను తీసేసి వాడుకోవాలన్నమాట. ఇంకోటి బ్రౌను డిక్షనరీలోనే కొన్ని పదాలు ఒకటికంటే ఎక్కువసార్లు వస్తున్నాయి (యూనీకోడులోకి మార్చినప్పుడు జరిగిన పొరపాటు గావచ్చు) దీనికి తనిఖీ మూస లాంటిదానిని ఒకటి తయారు చేస్తున్నాను(ఇలాంటి పదాలు 100 - 200 కంటే ఎక్కువ ఉండవని నా ఊహ). __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 04:03, 13 జూలై 2007 (UTC)
- ప్రస్తుతానికి లింకులు ఇవ్వకుండా వాడండి. మూసనే కదా దీన్ని బైపాస్ చెసే మార్గం దొరికినప్పుడు మూసలో లింకులు చేర్చవచ్చు --వైజాసత్య 04:07, 13 జూలై 2007 (UTC)
- సరే అలాగే. మీరు అక్కడి మార్పులను గమనిస్తే, నేను ఇప్పటికే అలాంటి మూసను తయారు చేసాను. అయితే దానిని, వేరే అవసరానికి తయారు చేసాను. బయటి లింకులను (IIITకి మరియు sf.netకి) చేరుస్తుంటే ఆ లింకుల వలన, స్పాము జరుగుతుందని వీక్షనరీ ఒక capthaను ఇస్తుంది, దీని వలన బాటూ ఆగిపోతుంది. మూసలో పెట్టటం వలన సమస్య తీరిపోతుందేమో అని అనుకున్నాను, కానీ వాళ్ళు సాఫ్టూవేరును కొంచెం తెలివిగానే తాయారుచేసారు, మూసకూడా పనిచేయడంలేదు. అందుకని దానిని ఉపయోగించడం మానేసాను. అయితే ఇప్పుడు మూసలో ఆ లింకులను తీసేసి వాడుకోవాలన్నమాట. ఇంకోటి బ్రౌను డిక్షనరీలోనే కొన్ని పదాలు ఒకటికంటే ఎక్కువసార్లు వస్తున్నాయి (యూనీకోడులోకి మార్చినప్పుడు జరిగిన పొరపాటు గావచ్చు) దీనికి తనిఖీ మూస లాంటిదానిని ఒకటి తయారు చేస్తున్నాను(ఇలాంటి పదాలు 100 - 200 కంటే ఎక్కువ ఉండవని నా ఊహ). __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 04:03, 13 జూలై 2007 (UTC)
వీక్షనరీలో చిన్న సమస్య
మార్చువీక్షనరీ Common.js చర్చా పేజీలో, అక్కడ వచ్చిన సమస్య, దానికి పరిష్కారం తెలియజేసాను. మీకు వీలునప్పుడు దానిని సరి చేయండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 02:17, 19 జూలై 2007 (UTC)
- సరిచేశాను, ఇప్పుడు బాగానే ఉందనుకుంటా. ఒకసారి చూసి తెలియజేయండి --వైజాసత్య 06:18, 19 జూలై 2007 (UTC)
- ఇప్పుడు పని చేస్తుంది. "వ్యాసము" tab పక్కన వస్తున్న చిన్న బొమ్మ, వలన వ్యాసం నాణ్యత తెలుస్తుంది ఇప్పుడు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 07:48, 19 జూలై 2007 (UTC)
వేంపెంట లో దిద్దుబాటు ఘర్షణ
మార్చువేంపెంట పేజీలో నేను దిద్దుబాటు చేస్తూండగా మీతో దిద్దుబాటు ఘర్షణ వచ్చింది. మీరు చేసిన మార్పులను నావాటితో కలిపి మళ్ళీ భద్రపరచాను. ఎంచేతనో మీరిచ్చిన పాఠశాల మూలం అక్కడ రాలేదు. ఒకసారి చూస్తారా? __చదువరి (చర్చ • రచనలు) 14:31, 19 జూలై 2007 (UTC)
- ==మూలాలు=={{Reflist}} తిరిగి చేర్చటం మరచిపోయినట్టున్నారు. అందుకే మూలాలు కనిపించలేదు. సరిచేశాను --వైజాసత్య 14:40, 19 జూలై 2007 (UTC)
ప్రపంచ దేశాలకు మొలకలు
మార్చువైఙా సత్యా! ప్రపంచ దేశాలు అన్నింటికీ మొలకలు సృష్టించగలవా! ఎర్ర లింకులు నా పనికి కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. జాబితాల పని అయినాక దేశాలకు ఒకో దానికి 2 కిలోబైట్లు తగ్గకుండా ఉపోద్ఘాత వ్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అనువాదం చేయాల్సిన వ్యాసాలు పెంచడం నాకు ఇష్టం లేదు కాని, ఇది మినహాయింపుగా అనుకోవచ్చునని నా అభిప్రాయం. మొలకలు నిదానంగా ఆలోచించి చేయండి. ఉదాహరణకు
- ఆసియాలోని దేశాలకు {{ఆసియా}} మూస కూడా మొలకతోపాటే పెట్టేయాలి.
- ఆంగ్లంలోంచి సంబంధిత వ్యాసాన్ని కాపీచేసి అనువదించమని సభ్యులకు విజ్ఞప్తి కూడా అందులోనే ఇరికించాలి.
తరువాత దేశాల వ్యాసాలు అనువాదం కార్యక్రమం ఒక ప్రాజెక్టులాగా చేయాలనుకొంటాను. --కాసుబాబు 07:30, 25 జూలై 2007 (UTC)
- అలాగే. ప్రతి దేశపు వ్యాసంలో ఆంగ్లవికీలోని ఆ దేశపు సమాచారపెట్టె, మీరు చెప్పినట్టు క్రింది భాగములో ఖండములోని దేశాల మూస, పై భాగములో ఒక ప్రత్యేక అనువాద విజ్ఞప్తి చేర్చుతాను --వైజాసత్య 07:39, 25 జూలై 2007 (UTC)
- దేశాల జాబితా పనిలో మూసలతో నాకు కొంత అయోమయంగా ఉంది. నా లక్ష్యం -
- {{Flagcountry|Germany}} అని వ్రాస్తే "(జెండా బొమ్మ) జర్మనీ" అని బాగానే వస్తున్నది.
- {{Flag|Germany}} అని వ్రాస్తే "(జెండా బొమ్మ) జర్మనీ" అని రావాలి. కాని ప్రస్తుతం "(జెండా బొమ్మ) Germany" అని వస్తున్నది.
ఒకసారి చూడ గలరా? దీనిని గురించి నేను చేసిన ప్రయోగాలు మీరు గమనించే ఉంటారు. అవుసరమైతే అన్ని మూసలూ చెరిపివేసి క్రొత్తవి పెట్టవచ్చును. --కాసుబాబు 11:40, 27 జూలై 2007 (UTC)
- (మరి కొంత కెలికిన తర్వాత -) హమ్మయ్య - ఇప్పుడు సరిగానే వస్తున్నట్లున్నది - అయినా ఒకసారి పరిశీలించగలరు --కాసుబాబు 11:45, 27 జూలై 2007 (UTC)
బొమ్మలు
మార్చునేను శ్రమ కోర్చి ఒక 50-75 బొమ్మలు సంగ్రహించాను. వాటిని వికీపీడియా కామన్స్ లొ చేర్చాల తెలుగు వికీ లొ చేర్చాలా!! అర్థం కావడం లేదు--మాటలబాబు 05:19, 27 జూలై 2007 (UTC)
- పటిష్టంగా లైసెన్సు వివరాలు అందించగలిగితే కామన్స్ లోనే చేర్చండి. లేకపోతే వాటిని వారంలోపు డిలీట్ చేసేస్తారక్కడ. (ఫెయిర్ యూజ్ లాంటివైతే వాళ్ళు అసలు అంగీకరించరు). ఇక నిర్ణయం మీదే --వైజాసత్య 05:50, 27 జూలై 2007 (UTC)
- బొమ్మలు అన్ని నేను సృష్టించిన కృతులే , ఇక్కడ అలోడ్ చెయ్యమంటారా... కామన్స్ లొ చెయ్యమంటారా, పేర్లు ఇవ్వడానికి సహకరించమని కోరుకొంటున్నాను.--మాటలబాబు 15:32, 27 జూలై 2007 (UTC)
- అయితే కామన్స్‌లో అప్లోడ్ చెయ్యండి. అన్ని వికీపీడియాలకీ ఉపయోగపడతాయి. అలాగే --వైజాసత్య 15:40, 27 జూలై 2007 (UTC)
- అందరికి ఉపయోగపడతాయికదా అని కామన్స్ లొ చేరిస్తే అక్కడ మోసం జరిగింది. తెవికీ ఉన్నట్లు ఫైలు పేరు లొడ్ చేసేటప్పుడు ఒకపేరు, లోడ్ అయ్యక ఇంకో పేరు ఉంటుందని అనుకొంటే అలా జరగలేదు. ఒకసారి మీ పలుకబడి ఉపయోగించి అ వికీ పీడియా కామన్స్ లొ పేరు మార్చగలరేమో చూడండి.ఇంకో సందేహం మీరు వికీపీడియా కి దానం ఎప్పుడైనా చేశారా, దాత అయ్యారా...--మాటలబాబు 17:07, 27 జూలై 2007 (UTC)
- మరళా కొత్త పేరుతో లోడ్ చెయ్యడం తప్ప బొమ్మలను రీనేం కానీ తరలింపు కానీ చెయ్యలేం. కొత్తపేరుతో లోడ్ చేసిన తర్వాత {{db|duplicate}} తగిలించండి. శ్రమదానం చేస్తున్నాం కదా అని నేనెప్పుడూ వికీపీడియాకి ధనసహాయం చెయ్యలేదు. --వైజాసత్య 17:25, 27 జూలై 2007 (UTC)
సహాయం
మార్చునా వద్ద రెండు భీమిలి బొమ్మలు ఉన్నాయి వాటిని మీరు కలపగలరా???????--మాటలబాబు 03:22, 29 జూలై 2007 (UTC)
- పంపించండి --వైజాసత్య 07:44, 29 జూలై 2007 (UTC)
- పమించానండి అంటిస్తున్నారా లేదా??--మాటలబాబు 09:08, 29 జూలై 2007 (UTC)
- ఏమండి ఎడోబ్ ఫొటో షాప్ లొ మీరు బొమ్మలు బాగా అంటిస్తున్నారు, మరి నా బొమ్మ సంగతంతేమిటీ?--మాటలబాబు 05:36, 31 జూలై 2007 (UTC)
- ఒకసారి బొబ్బర్లంక ను పరిశీలించండి. ఊబలంక లొ అంటించిన బొమ్మ లొ కూడా బొబ్బర్ల్ంక పేరు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లొ అన్ని గ్రామాల పేర్లు ఉన్నాయి కదా, ధవళేశ్వరం పేజి కుడా కనిపించడం లేదు...దయచేసి పేజి చేస్తే అక్కడ బొమ్మలు అంటింస్తాను,బొబ్బర్ల్ంక పేజిలొ కూడా డ్యాం బొమ్మలు అంటిస్తాను--మాటలబాబు 09:46, 29 జూలై 2007 (UTC)
- ఏ బొబ్బర్లంక. ఇదా? (బొబ్బర్లంక) --వైజాసత్య 09:50, 29 జూలై 2007 (UTC)
- ఆ బొమ్మలో బొబ్బర్లంక పేరున్నట్టు గమనించాను. కానీ పేరుపై సందేహమొచ్చిన బొబ్బర్లంక (బొబ్బిల్లంక)ఈ బొబ్బర్లంక ఒకటేనా కాదా అన్నది నిర్ధారించుకోవాలి --వైజాసత్య 09:52, 29 జూలై 2007 (UTC)
- ధవళేశ్వరం గ్రామానికి పేజీ లేకపోవటం ఇది వరకోసారి నాకూ ఆశ్చర్యం కలిగించింది. కానీ అని ఏమండలంలో గ్రామమో తెలియని పేజీ సృష్టించలేదు (నేను రాజమండ్రిలో కలిసిపోయిందేమో అనుకున్నాను) --వైజాసత్య 09:55, 29 జూలై 2007 (UTC)
- ఏ బొబ్బర్లంక. ఇదా? (బొబ్బర్లంక) --వైజాసత్య 09:50, 29 జూలై 2007 (UTC)
- బొబ్బర్లంక ఆత్రేయపురం మండలం, ధవళేశ్వ్రరం గ్రామం రాజమండ్రి (గ్రామీణ) మండలం లొ ఉన్నది--మాటలబాబు 10:02, 29 జూలై 2007 (UTC)
ఈ చర్చాంతా వాటి వాటి వ్యాసాల అనుబంధ చర్చా పేజికి మారుస్తాని(తరలిస్తారని) ఆశిస్తున్నాను, ధన్యవాదాలు--మాటలబాబు 10:02, 29 జూలై 2007 (UTC)
- ఈ లింకు పరిశీలించవలసిందిగా కోరడమైనది[1]--మాటలబాబు 10:25, 29 జూలై 2007 (UTC)
- బొబ్బర్లంక కోసం లింకు[2]--మాటలబాబు 10:29, 29 జూలై 2007 (UTC)
- మిమ్మల్ని ఈ విధంగా షంటుతున్నందుకు(shunting) క్షమించండి--మాటలబాబు 10:33, 29 జూలై 2007 (UTC)
- సత్యా గారి ధన్యావాదాలు మీ ఓపికకు నేర్పు కి చాలా అభినందనలు--మాటలబాబు 10:43, 29 జూలై 2007 (UTC)
- సమస్య లేవనేత్తింది, పరిష్కరించి మీరే. ఏదో మీ అభిమానం కానీ --వైజాసత్య 10:46, 29 జూలై 2007 (UTC)
బొమ్మ editing
మార్చుబొమ్మ:AyappaSwamyTempleDwaaram.JPGను చాలా బాగా edit చేసారు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:11, 30 జూలై 2007 (UTC)
- షుక్రియా, ఫోటోషాపుతో ప్రయోగం చేశాను --వైజాసత్య 04:14, 30 జూలై 2007 (UTC)
- ఇప్పుడు ఆ బొమ్మకు లైసెన్సు వివరాలు మీరు జతచేయాలా లేకపోతే దానిని అప్లోడు చేసిన అసలు సభ్యుడు చేయాలా? __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:20, 30 జూలై 2007 (UTC)
- అది ఆ సభ్యుడే చేయాలి. ఈయన తెలుగు బ్లాగరనుకుంటా. సొంత ఫోటో కావాలనే విడుదల చేశాడనే నేను అజ్యూం చేసుకొని కొద్దిగా తొందరపాటులో మార్పులు చేశాను. ఇప్పుడు సదరు సభ్యుడు దీన్ని ఉచిత లైసెన్సులో విడుదల చేయకపోతే నా దిద్దుబాటు చెల్లదు. బొమ్మను తుడిచివేయాల్సి వస్తుంది. నేనాయన్ను కనుక్కుంటా --వైజాసత్య 04:29, 30 జూలై 2007 (UTC)
- ఇప్పుడు ఆ బొమ్మకు లైసెన్సు వివరాలు మీరు జతచేయాలా లేకపోతే దానిని అప్లోడు చేసిన అసలు సభ్యుడు చేయాలా? __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:20, 30 జూలై 2007 (UTC)
- బొమ్మ:Bhimli2.jpg బొమ్మ ఎడింటిగ్ చాలా బాగా చేశారు.చాలా చాలా అనందం కలిగింది. ఆ విద్య నాకూడా నేర్పరాదా, ఇంతకి మాయమైన ముక్క లొ నేను ఉన్నాను, మరచాను చెప్పడం , నేను విశాఖపట్టణం లొ చదువుకొనే సమయం లొ తీసుకొన్న బొమ్మ అది, అప్పట్లొ నేను బీదవాడిని నాదగ్గర డిజిటల్ కెమెరా లేదు, ఇప్పుడిప్పుడే ఒక కెమెరా ఫోను కొనుక్కొన్నాను, అందువల్ల ఆబొమ్మ నాణ్యత సరిగా లేదు.ఇంతకి భీమిలి బొమ్మ కనిపిస్తోందా, మునిసిపాలిటి అని తెలుస్తొందా..--మాటలబాబు 17:58, 31 జూలై 2007 (UTC)
- అవునా, నాకు ఇది మునిసిపాలిటి అని తెలియలేదు. అక్షరాలు అంత స్పష్టంగా లేవు. నేనెప్పుడూ భీమిలి చూడలేదు (మా చిన్నమామయ్య భీమిలిలో చదువుకునే రోజుల్లో లైటు హౌసు దగ్గర తీయించుకున్న ఫోటో తప్ప నేనేదీ చూడలేదు). ఇప్పుడు మీరి చెప్పిన తర్వాత పరిశీలించి నిఘాగా చూస్తే ఆ బోర్డులో పై వరుస భీమిలి పుర పాలక సంఘం అని ఉన్నట్టు లీలగా అనిపించింది. మీకభ్యంతరం లేకపోతే మూడవ ముక్క నాకు మెయిల్లో పంపించండి. అందులో మిమ్మల్ని మాయంచేసి సంపూర్ణ చిత్రం తయారుచేయటానికి ప్రయత్నిస్తాను. అయినా ఇదేమంత గారడీ కాదు, నేనూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. --వైజాసత్య 20:47, 31 జూలై 2007 (UTC)
- మీ ఈ-మైయిల్ కి బొమ్మ పంపించాను, చూడండి కొద్దిగా--మాటలబాబు 22:24, 31 జూలై 2007 (UTC)
- నన్ను ఊరించారు నిన్న బొమ్మ కొసం ఇంకా బొమ్మ దర్శనం కలగలేదు--మాటలబాబు 15:22, 2 ఆగష్టు 2007 (UTC)
- షంటింగ్ మాష్టారు బొమ్మలు కావాలి అని షంటు తున్నాడు--మాటలబాబు 19:39, 2 ఆగష్టు 2007 (UTC)
- వ్యఘ్రముగా ఉన్న సత్యాగారు వ్యఘ్రముగా అంటే ఏమిటి అర్థం చెప్పరా???--మాటలబాబు 19:43, 1 ఆగష్టు 2007 (UTC)
- వ్యఘ్రత = బిజీ కి తెలుగుపదం --వైజాసత్య 19:52, 1 ఆగష్టు 2007 (UTC)
భీమిలి బొమ్మ
మార్చు- మాటలబాబు, ఇదిగో నాయనా నీ బొమ్మ. ఎలా వచ్చింది బొమ్మ:Bhimli2.jpg --వైజాసత్య 20:32, 2 ఆగష్టు 2007 (UTC)
- అత్యాద్భుతం.. మీరు అసాధ్యులు--మాటలబాబు 20:43, 2 ఆగష్టు 2007 (UTC)
- ఆబొమ్మకి మీరు కృతి కర్త క్రింద, గుర్తింపు వచ్చే టట్లు చెయ్యాలంటే ఏమి చెయ్యాలి. మీకు నేణు ఈ-మైల్ లొ కదా పంపాను, అసలు బొమ్మ, ముక్కలు కాకుండా ఉన్నది.--మాటలబాబు 20:43, 2 ఆగష్టు 2007 (UTC)
- అవను ఈ మెయిళ్ళోనే వచ్చింది. ఆ బొమ్మ పేజీలో ఫోటోషాపులో నేను కొంచెం పనిచేశానని రాస్తే సరిపోతుంది. --వైజాసత్య 20:46, 2 ఆగష్టు 2007 (UTC)
తొలగించు
మార్చువ్రాసే సభ్యుడు బాధ పడతాడని ఆయన సభ్య పేజిలొ వివరణ వ్రాశాను, మీరు భలే పని పెట్టుకొన్నారు,--మాటలబాబు 16:29, 2 ఆగష్టు 2007 (UTC)
కిమ్మనకుండా
మార్చుఏవండీ ఈ మధ్య కిమ్మనకుండా ఊంటున్నారే???? కారణం తెలుసుకోవచ్చా?? --మాటలబాబు 23:22, 2 ఆగష్టు 2007 (UTC)
- ఈ మధ్య కాస్త పని ఎక్కువైపోయింది. కాస్త వెసలుబాటు దొరికితే మరళా విజృభించవచ్చు. ఏమంటారు? --వైజాసత్య 00:44, 3 ఆగష్టు 2007 (UTC)
- మీ జీమైల్ ఉత్తరాల డబ్బా ఒకసారి చూసుకొండి--మాటలబాబు 20:59, 3 ఆగష్టు 2007 (UTC)
- తిరుగుటపా పెట్టా --వైజాసత్య 21:01, 3 ఆగష్టు 2007 (UTC)
- బొమ్మ రెండు మూడు రోజులలొ పంపుతాను, నావద్ద దేవస్థానం వారి చిత్రం ఉన్నది, దానిని తెవికీ పెట్టడానికి అంగీకారం అయితే దానియదాతదంగా స్కాను చేసి అప్లోడ్ చేస్తాను , తెవికీ అంగీకరించదు అని అంటే మీకు పని పడుతుంది. రెండు బొమ్మలు ఒకలాగే ఉన్నాయి కానికెమెరా పోటో లొ చందనబ్రదర్స్ వారి వ్యాపార ప్రకటన ఉన్నది.--మాటలబాబు 10:28, 5 ఆగష్టు 2007 (UTC)
- క్రొద్దిగా పై ప్రశ్నకి సమాధానం చెప్పండి.
- నిడదవోలు పేజిలొ ఒక బొమ్మ అంటించాను అందులొ సింటెక్స్ ట్యాంక్ ని మాయం చెయ్యగలరా.. నాకు మీ మాయాజాలం నేర్పిస్తే నేను కూడా ప్రయత్నిస్తా, ఏ సాప్టవేర్ ఏలా డౌన్ కొద్దిగా చెప్పండి--మాటలబాబు 20:22, 5 ఆగష్టు 2007 (UTC)
- నిడదవోలు పేజిలొ నేను అంటించిన దాని కంటే మంచి బొమ్మ ఆవ్యాసం లొనే దొరికింది కాబట్టి మీకు శ్రమ లేదు. కాని మాయాజాలం ఎలాగో చెప్పరు, ప్లీజ్.. ప్లీజ్.. మీకు పుణ్యం ఉంటుంది, --మాటలబాబు 23:03, 5 ఆగష్టు 2007 (UTC)
- సత్యా గారు మీరు ఉన్నారా? లేక నిద్ర పోతున్నారా...మీరు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంటుంది.--మాటలబాబు 22:24, 5 ఆగష్టు 2007 (UTC)
- సత్యా గారికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నాకు సాయింత్రం నిద్ర వచ్చుచున్నది మమ్మలిని రాత్రి కలుసుకొంటాను.--మాటలబాబు 23:12, 5 ఆగష్టు 2007 (UTC)
- మీక్కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు చందనాబ్రదర్స్, దేవస్థానం అని చెబుతున్న విషయం నాకు సరిగా అర్ధం కాలేదు. ఇక బొమ్మల్ని సరిచేయటానికి నేను అడోబ్ ఫోటోషాప్ అనే సాఫ్ట్వేరు ఉపయోగిస్తున్నాను (ఇది ఉచితం కాదు) కానీ మీరు తత్సమమైన ఉచిత సాఫ్ట్వేరు జింప్ ను ఉపయోగించికూడా అదే పని చెయ్యవచ్చు. జింప్ ను ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.(http://gimp-win.sourceforge.net/stable.html ). ఇక ఫోటోలలో మనుషులను, అవసరంలేని వస్తువులను జింప్ ఊపయోగించి ఎలా మాయం చెయ్యాలో ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది చూడండి [3] --వైజాసత్య 00:27, 6 ఆగష్టు 2007 (UTC)
- నేను బొమ్మ అప్లోడ్ చేస్తాను మీరే గమనిస్తారు,కాని ఇది సందేహం లొ ఒక భాగం మాత్రమే. దేవస్థానం వారి అచ్చు వేసి ప్రజల సౌకర్యార్థం వితరణ చేసే దేవస్థాన దేవతల బొమ్మలు మనం వికీపీడీయా లొ అప్లోడ్ చేసుకోవచ్చా --మాటలబాబు 13:02, 6 ఆగష్టు 2007 (UTC)
- బొమ్మ:Ryali.JPG గమనించండి,--మాటలబాబు 13:15, 6 ఆగష్టు 2007 (UTC)
- మీరు ఏ సాప్టవేర్ ఉపయోగిస్తారొ చెప్పండి నేను అదేవాడతాను, అవసరమయితే కొనుక్కొంటాను, ఎడోబ్ వారు ప్రయోగించడానికి ఫ్రీ సి>డి. ఇస్తారను కొంటా.. దయచేసి చెప్పరు.జింప్ పేరు నేను వినలేదు ఎంతవరకు మంచి దో కాదో తెలియదు.కాబట్టి మీరే నన్ను సరైన దిశలొ పెట్టాలి--మాటలబాబు 14:51, 6 ఆగష్టు 2007 (UTC)
- నేను పైన చెప్పినట్టు ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్ ఉపయోగిస్తాను. జింప్ కూడా ఫ్రీగా వస్తుందన్నమాటే కానీ చాలా ప్రసిద్ధ సాఫ్ట్‌వేరు. నేనిదివరకు జింప్ కూడా ఉపయోగించాను. ఫోటోషాప్ తో చేయగలిగినవన్నీ జింప్ తోనూ చెయ్యచ్చు. (వీవెన్ అదే ఉపయోగిస్తాడు..ప్రదీపు ఏం ఉపయోగిస్తాడో నాకు తెలియదు). కొనేముందు ఎందుకైనా మంచిది ట్రయల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా కొన్ని రోజులు ఉపయోగించి చూడండి. ఈ సాఫ్ట్వేర్లు చాలా ఖరీదైనవి. నా దగ్గరున్నది కొంత పాత వర్షన్ (ఫోటోషాప్ 10 అనుకుంటా). ఇక ఆపై మీ ఇష్టం. (నా సలహా: జింప్ ఉపయోగించి చూడండి కొన్నాళ్ళు అదికాదనుకుంటే ఫోటోషాప్ ట్రయల్ వర్షన్ తో పోల్చిచూసుకోండి. అహా, కొనాల్సిందే అంటే అప్పుడు ఫోటోషాప్ కొనుక్కోండి) --వైజాసత్య 15:04, 6 ఆగష్టు 2007 (UTC)
- సలహా కు చాలా ధన్యవాదం ఉచితం లభిస్తోంది అంటే నేనెందుకు కొంటాను, సరే ఈ రాత్రికి జింప్ డౌన్ లోడ్ పేడతాను, నా ఇంటర్నెట్ వేగం చాలా తక్కువ , అందుకని రాత్రి కి పెట్టాలి డౌన్ లోడ్ లేక పోతే నా ఇతర కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది.--మాటలబాబు 15:46, 6 ఆగష్టు 2007 (UTC)
- నేను డౌన్ లోడ్ చేసుకొన్నాను, పని ప్రారంభించాను, కాని కొద్దిగా కష్టంగానే ఉన్నది.--మాటలబాబు 18:04, 6 ఆగష్టు 2007 (UTC)
- మొదట్లో అలానే అనిపిస్తుంది. కానీ కొద్దిగా అనుభవం గడిస్తే అంత కష్టమేమీ కాదు అని తెలుస్తుంది --వైజాసత్య 18:14, 6 ఆగష్టు 2007 (UTC)
సహాయం
మార్చు{{మీకు తెలుసా}} అనే మూస నేను తెచ్చాను కొద్దిగా పార్‌సర్ ఫంక్షన్స్ లొ సహాయం చెయ్యగలరేమో చూడండి--మాటలబాబు 10:28, 5 ఆగష్టు 2007 (UTC)
- సరిచేశాను --వైజాసత్య 10:44, 5 ఆగష్టు 2007 (UTC)
పరిశీలనలు
మార్చుbonked
మార్చుమీరు bonked అన్నారు.మీరు గోడకు తగులుకొని దెబ్బలు తగుల్చుకొని అలసి పోయి పడిపోయారా? లేక రతి క్రీడ ఎక్కువ జరిపి అలసిపోయి పడిపోయారా? మీకు దెబ్బలు పెద్దగా ఏమి తగల లేదు కదా. ఆరోగ్యం గానే ఉన్నారు కదా, త్వరలొ నే కోలుకొంటారు కదా,నేను చాలా బెంగ పెట్టుకొన్నాను. --మాటలబాబు 19:40, 6 ఆగష్టు 2007 (UTC)
- హా..హా..హా అవేమీ కావు..బాంక్‌డ్ అంటే డస్సిపోవటం కూడా --వైజాసత్య 03:43, 7 ఆగష్టు 2007 (UTC)
సంస్కృతం
మార్చుమీకు సంస్కృతం వచ్చా. వారాల పేర్లు సంస్కృతం లొ ఏమేంటారో తెలుసా...--మాటలబాబు 17:22, 7 ఆగష్టు 2007 (UTC)
- సంస్కృతం తర్వాత సంగతి నాకు తెలుగే సరిగా రాదు. వారాలంటే మీరనేది ఆది, సోమ గురించే కదా. సంస్కృతంలో కూడా దాదాపు ప్రస్తుత హిందీలోలా రవి వార్, సోమ వార్, బుధ వార్ అని అంటారనుకుంటా --వైజాసత్య 17:31, 7 ఆగష్టు 2007 (UTC)
కానేకాదు,
- ఆదివారము = భానువారము
- సోమవారము=??? భౌమ వారము??
- మంగళవారము=???
- ఇంక తెలియదు
- ఇప్పుడే ఆలోచన వచ్చింది బాల శిక్షలొ దొరుకొతుంది. వేంటనే దానిని తెరువాలి. బాలశిక్ష కూడా ఒక విజ్ఞాన సారస్వము లాంటిదే--మాటలబాబు 17:45, 7 ఆగష్టు 2007 (UTC)
- దొరికింది బాలశిక్షలొ
- ఆదివారము=భానువారము
- సోమవారము=ఇందువారము
- మంగళవారము=భౌమవారము
- బుధవారము=సౌమ్యవారము
- గురువారము=బృహస్పతివారము
- శుక్రవారము=భృగువారము
- శనివారము=మందవారము
- --మాటలబాబు 17:58, 7 ఆగష్టు 2007 (UTC)