చలం వ్యాసం

మార్చు

రంగారావుగారూ! నమస్తే. మీరు చలం గారు కుటుంబ వ్యవస్తను విమర్శించారని వ్యాసంలో వ్రాశారు. అట్లా విమర్శించిన చలం కుటుంబం అలా అయిందని వ్రాశారు.కానీ మీ జవాబులో నేను కోరినది చలం ఎక్కడ ఏ నవలళొ/కథలో కుటుంబ వ్యవస్తను విమర్శించారో తెలియ చేయమని. మరొక్క సారి మీరు వ్యాసంలో వ్రాసిన వాక్యాలు, నా స్పందన చూడమని నా మనవి. తరువాత అరుణాచలం వెళ్ళటం గురించి. ఆయన సొంత ఆత్మ కథ చదివి నేను నా స్పందన వ్రాశాను. ఆయన మనుమరాలు వేఋఏ విధంగా వ్రాసినా, చలం గారు తన గురించి తాను తన ఆత్మ కథలో వ్రాసుకున్నదే ప్రామణికం అని నా అభిప్రాయం. ఏమంటారు.--SIVA 19:49, 30 మార్చి 2008 (UTC)Reply

నిర్వాహకుల వాండలిజం

మార్చు

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.

మొదటి పేజీ వ్యాసాలు

మార్చు

రంగారావు గారూ! మీరు చొరవగా అనేక వ్యాసాలను 'ఈ వారం వ్యాసం' కొరకు ప్రతిపాదిస్తున్నారు. ఇదే కృషికి తరువాతి అంచెగా 'ఈ వారం వ్యాసం' నిర్వహణ పనులు తీసికోగలరా? ఈ పనికి కనీసం ఇద్దరు సభ్యులు కావాలి. అందులో ఒకరుగా మీరుండగలరా? - ఏమి పని చేయాలనే విషయం తరువాత వివరిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:00, 29 మార్చి 2008 (UTC)Reply

రంగారావు గారూ! మీకు వీలు చిక్కితే 17వ వారం (ఐఐటీ), 19వ వారం (శ్రీశైలం) "ఈ వారం వ్యాసాలు" తయారు చేయగలరా?. అందుకు పద్ధతి చాలా సింపుల్ - వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితాలో టేబుల్ చూడండి. 17 పై నొక్కితే ఖాళీ మూస తెరుచుకొంటుంది. అందులో ఆ వారం వ్యాసం సంక్షిప్తంగా వ్రాయండి. అలాగె 19 వారం కూడా. ఏమైనా సందేహాలుంటే అడగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:35, 7 ఏప్రిల్ 2008 (UTC)Reply

కాసుబాబు గారు, కొద్ది రోజు తెవికీకి దూరంగా ఉండవలసి వచ్చింది, అందుకే ఈ వారం వ్యాసాలను వ్రాయలేకపోయాను. ఇక నుండి కూడా ఖచ్చితమయిన సమయాన్ని కేటాయించలేను. వీలు ఉన్నపుడు తప్పక ప్రయత్నించగలను.--Svrangarao 17:15, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

పరవాలేదు. వీలున్నప్పుడే చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:53, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఆంగ్ల వ్యాసాలు

మార్చు

రంగారావు గారూ, తెవికీలో చాలా రోజులనుంచి పేరుకొని ఉన్న వ్యాసాలలోని ఆంగ్ల భాగాలను తొలిగించినందుకు కృతజ్ఞతలు. తెవికీలో ఆంగ్ల వ్యాసాలు ఉండటం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. నేను ప్రారంభంలోనే ఈ విషయంపై రచ్చబండలో ప్రతిపాదన కూడా చేశాను (తెవికి లో ఆంగ్ల వ్యాసాలా ?). ఇటీవల నేనే స్వయంగా తొలిగించాలనే నిర్ణయానికి వచ్చి ముందుగా నిస్సార్ గారికి అనువాదం చేయని వ్యాసాల గురించి తెలియాజేశాను. ఇంతలోనే మీరు ఈ పని ప్రారంభించడం నాకు సంతృప్తినిచ్చింది. తొలిగించే ముందు చరితంను పరిశీలించి ఇటీవలి కాలంలో అనువాదం కోసం తెచ్చికున్నట్లయితే ఆ సభ్యులకు ముందస్తుగా తెలియపర్చడం బాగుంటుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 16:45, 29 మార్చి 2008 (UTC)Reply

దిద్దుబాట్ల సారాంశము వ్రాయండి

మార్చు

రంగారావు! మీ దిద్దుబాట్లలో నేను గమనించిందేమంటే మీరు దిద్దుబాటు సారాంశం వ్రాయడానికి అలవాటు పడలేదు. దిద్దు బాటు చేసిన తరవాత భద్రపరిచే ముందు పెట్టె క్రింది భాగంలో "సారాంశము" ప్రక్క డైలాగ్ బాక్స్ లో సారాంశం క్లుప్తంగా వ్రాస్తే ఉపయోగ కరంగా ఉంటుంది. మీరు చేసిన పని ఏమిటో ఆ వ్యాసం తెరవకుండానే ఇతరులకు అవగాహన వస్తుంది. ఇది నిర్వహణలో చాలా ఉపయోగం. ఉదా: "ఆంగ్ల భాగం తొలగింపు", "అక్షర దోషాల సవరణ", "విస్తరణ", "అనువాదం", "మూస తొలగింపు", "అంతర్వికీ లింకులు" ఇలా.. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:43, 29 మార్చి 2008 (UTC)Reply

నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి

మార్చు

నా నిర్వాహక హోదా విజ్ఞప్తికి వ్యతిరేకిత తెలిపినందుకు కృతజ్ఞతలు. చర్చసాయీరచనలు 01:33, 28 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:39, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఎస్వీయార్ వ్యాసం

మార్చు

ఎస్వీయార్ వ్యాసంలో మీ కృషికి అభినందనలు. __చదువరి (చర్చరచనలు) 18:21, 6 మే 2008 (UTC)Reply

పున:స్వాగతం

మార్చు

రంగారావు గారు, చాలా రోజుల తరువాత మళ్ళీ దిద్దుబాట్లు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాగే తెవికీ వృద్ధికి తోడ్పడండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 10:19, 10 అక్టోబర్ 2008 (UTC)

వివాదాస్పద వ్యాసాలు

మార్చు

రంగారావు గారూ, వ్యాసంలోని విషయం వివాదాస్పదమైనంతమాత్రాన ఆ వ్యాసాన్ని తొలగించాలని వికీ నియమాల్లో ఎక్కడా లేదు. అందుకు కారణం ఒకరికి వివాదాస్పదమనిపించినది ఇంకొకరికి అలా అనిపించకపోవచ్చు. ఏదైనా సొంత వ్యాఖ్యలు, ఆధారాల్లేని విషయాలుంటే, వివాదస్పదము, అవివాదాస్పదం అన్న పట్టింపులు లేకుండా అలాంటి సొంత అభిప్రాయాలను తొలగించాలి. --వైజాసత్య 05:48, 10 డిసెంబర్ 2008 (UTC)

వైజాసత్య గారు, ఈ రోజు మీకు చేతి నిండా పని  :) just kidding :) --Svrangarao 07:00, 28 డిసెంబర్ 2008 (UTC)
హహ్హహ్హ :-) --వైజాసత్య 07:02, 28 డిసెంబర్ 2008 (UTC)

కృతజ్ఞతలు

మార్చు

రంగారావుగారూ, నమస్తే. మీరు వివాదాస్పదవ్యాసాలపట్ల చూపిన స్పందనలకు అభినందనలు. మాకినేని ప్రదీపుగారు, కాసుబాబుగారు, ఈ వివాదాస్పద వ్యాసాలకొరకు నిర్దేశాలు, మార్గదర్శకాలు తయారు చేయడానికి శ్రీకారం చుట్టారు, ఇవి బాగున్నాయి. మీరునూ ఇందులో పాలుపంచుకొని, గత కొన్ని రోజులుగా తెవికీకి పట్టిన బూజును దులపండి. ఆఖరుగా నా మీద చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. సోదరుడు నిసార్ అహ్మద్ 04:42, 14 డిసెంబర్ 2008 (UTC)

రంగారావుగారు గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు, ఈ వ్యాసాలకు మరియు వ్యాసకర్తలకు వారి మానాన వారికి వదిలివేయండి. మన తెవికీ నిర్వాహక బృందం చాలా చక్కగా వున్నది. వారు చూస్తూ ఊరుకోరు, చక్కదిద్దడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. సభ్యులైన మేము వారికి పూర్తి సంఘీభావాన్ని సహకారాన్ని అందించాలి. ఈ వ్యాసకర్తలు వారి రచనలు వాటిలో ఉండే సత్తువ బహుతక్కువ. కొన్ని రోజులకు ఈ వ్యాసకర్తల 'డబ్బా' ఖాళీ అయిపోతుంది, వారే కూలబడిపోతారు. కంగారు పడకండి. "సర్వజనో సుఖినోభవంతు". నిసార్ అహ్మద్ 06:35, 15 డిసెంబర్ 2008 (UTC)

ICD-10 వ్యాసాలు

మార్చు

ICD-10 వ్యాసాలు వ్యాధుల గురించి వ్రాయటానికి చాలా ముఖ్యమైన వ్యాసాలు. వాటిలోని ఆంగ్ల పాఠం తొలగించవద్దు. వీటి గురించి వికీపీడియా:రచ్చబండ#ICD-10 అధ్యాయాలు అవసరమా? లో చర్చ జరిగింది చూడండి --వైజాసత్య 07:02, 21 డిసెంబర్ 2008 (UTC)

ఈ వారం వ్యాసం

మార్చు

రంగారావు గారూ! ఒకమారు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి. వీటిలో రిపీట్ అయినవాటిని తొలగించగలరు. మరేమైనా మార్పులు అవుసరమైతే చేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:58, 27 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

మార్చు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:10, 28 డిసెంబర్ 2008 (UTC)

ధన్యవాదాలు

మార్చు

రంగారావుగారూ నమస్తే, నామీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞుణ్ణి, నా నిర్వాహక హోదా అభ్యర్థిత్వానికి మద్దతు నిచ్చినందుకు ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 21:59, 17 జనవరి 2009 (UTC)Reply

Bambi

మార్చు

Hello, I am a huge fan of Disney. Could you do more Bambi and other Disney movies? I want: Dumbo, The Fox and the Hound, and The Lion King. And please addd to the Bambi articles, and maybe work on it in Hindi? Thanks. 69.85.235.3 14:55, 27 మార్చి 2009 (UTC)Reply


ఓసారి పరికించండి

మార్చు

రంగారావుగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:17, 9 జూలై 2009 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

మార్చు

@Svrangarao గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Planning.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

మార్చు

@Svrangarao గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)Reply

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

మార్చు

@Svrangarao గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:52, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply