వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 3
← పాత చర్చ 2 | పాత చర్చ 3 | పాత చర్చ 4 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2007 అక్టోబరు 16 - 2007 డిసెంబరు 8
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
నిజామాబాదు జిల్లా
మార్చునిజామాబాదు జిల్లాలోని సదాశివనగర్ (నం.25)మండలము క్లిక్ చేస్తె మెదక్ జిల్లా అని వస్తుంది. దయచేసి సరిచేయగలరు.
- గమనించి తెలియజేసినందుకు నెనర్లు. నేను దాన్ని సరిచేశాను --వైజాసత్య 14:35, 16 అక్టోబర్ 2007 (UTC)
RTS is not working
మార్చుOn my computer I could not type in telugu, using TELUGU TYPING SAHAYAM, in telugu editor window. RTS is not working. Why? Should I have to down load some files? Please advise.----కంపశాస్త్రి 17:26, 7 అక్టోబర్ 2007 (UTC)
- Sastry garu, nothing changed in the script here. It is as it has been for a couple of months now. The only way it could not be working is that if you have some how disabled javascript in your browser. Do you see this sentence (తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. ESC - భాషల మధ్య మారడానికి. IEలో ESC తరువాత ctrl+z కూడా నొక్కాలి.) displayed below the toolbar in edit window?? --వైజాసత్య 17:47, 7 అక్టోబర్ 2007 (UTC)
- MY RTS is not working as well, kindly help in this regard, i am not sure whether my java script is switched off , kindly tell me how to switch it on if is is switched off --బ్లాగేశ్వరుడు 17:58, 7 అక్టోబర్ 2007 (UTC)
- బ్లాగేశ్వరా, ఎడిట్ బాక్సు యొక్క తెరపట్టు (స్క్రీన్ షాట్) నా మెయిలుకు పంపగలరా. నాకేమౌతుందో అర్ధం కావట్లేదు --వైజాసత్య 18:14, 7 అక్టోబర్ 2007 (UTC)
- tera pattlu has been sent please review and help me in this regard, otherwise i have to learn inscript now. lekhini is also not working for me , thankyou---బ్లాగేశ్వరుడు 18:32, 7 అక్టోబర్ 2007 (UTC)
- If the javascript was disabled , how to find it and rectify(enable) it? Please advise. (తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. ESC - భాషల మధ్య మారడానికి. IEలో ESC తరువాత ctrl+z కూడా నొక్కాలి). I do not find this sentence on my computer.----కంపశాస్త్రి 18:44, 7 అక్టోబర్ 2007 (UTC)
- I dont know how to enable javascript and rectify the problem in Internet Explorer as most of the time I use firefox. For time-being can you use firefox before we can figure it out. --వైజాసత్య 18:54, 7 అక్టోబర్ 2007 (UTC)
- http://www.nasa.gov/home/How_to_enable_Javascript.html (try following the instructions given in the link to enable javascript) and let me know how it goes --వైజాసత్య 19:22, 7 అక్టోబర్ 2007 (UTC)
- పైలింకులో ఇచ్చిన విధానము పనిచేస్తుందని బ్లాగేశ్వరుడు గారు నిర్ధారించారు --వైజాసత్య 19:30, 7 అక్టోబర్ 2007 (UTC)
- http://www.nasa.gov/home/How_to_enable_Javascript.html (try following the instructions given in the link to enable javascript) and let me know how it goes --వైజాసత్య 19:22, 7 అక్టోబర్ 2007 (UTC)
- I dont know how to enable javascript and rectify the problem in Internet Explorer as most of the time I use firefox. For time-being can you use firefox before we can figure it out. --వైజాసత్య 18:54, 7 అక్టోబర్ 2007 (UTC)
- పనిచేయలేదు.----కంపశాస్త్రి 22:49, 10 అక్టోబర్ 2007 (UTC)
- శాస్త్రి గారు మీ జావా స్క్రిక్టు పనిచేస్తోందా?? నా జావా స్క్రిక్టు ని పై విధంగా చేస్తే పనిచేసింది. ఒకసారి లేఖిని ప్రయత్నించి చూడండి , అక్కడ కూడా పనిచేయకపోతే మీ జావా స్క్రిక్టు లో తేడా ఉన్నట్లు లెక్క--బ్లాగేశ్వరుడు 23:38, 10 అక్టోబర్ 2007 (UTC)
- లేఖినిలో పనిచేసింది.----59.93.118.200 16:41, 13 అక్టోబర్ 2007 (UTC)
బ్లాగేశ్వరా మీరు ఎ login user నుండి పనిచేయుచున్నారు? మీరు పని చేయుచున్నuser profile లొ IE controls మారినట్ల ఉన్నాయ. ఒకవేళ Administrator నుండి కాకుంటె Administrator user తొ login కండి. మీ సమస్య తొలగవచ్చు. ఒక వేళ Administrator user తొ login అవుతుంటె మరొ userని create చేసి దానికి Administrator previlages ఇచ్చి ఆ user తొ login కండి. userని create చేయువిదానము: Go DeskTop - Move Mouse curssor on to My Computer Icon, Click on Right Button of Mouse, Select 'Manage' from menu. Expand 'Local Users and Groups' from Computer Management window. Right Click on Users. Select New user. Type 'UseName' and 'Full Name' as same one as you wish. (eg. user1). and give password and confirmation password. and check on 'Password Never Expire' check box. and close it.
right click on new user tag(user1) and select properties and click on 'Member of' Tab. click on Add and type 'administrators' and click 'ok' and 'ok'. now logoff from Administrator User and Login with New user and Password. -ఎ జ ఆర్.
సభ్యుడు-సభ్యురాలు
మార్చుసభ్యుల పేజీలలో కేవలం 'సభ్యుడు' మాత్రమే ఉంది. మరి ఎవరైనా స్త్రీ సభ్యులు ఉంటే వారికి సభ్యురాలు అని చేర్చాలిగా? ఆంగ్లంలో మెంబర్ అనేది ఎవరికైనా నడుస్తుంది. తెలుగులో దెనికి సంభందించి ఏవైనా మార్పులు చేస్తారా ?...పరిశీలించగలరు. విశ్వనాధ్. 08:34, 9 అక్టోబర్ 2007 (UTC)
- 'సభ్యులు' అని మార్చాలనుకున్నాము. అందుకనే చర్చాపేజీకి 'సభ్యులపై చర్చ' అని ఉందని గమనించగలరు. మార్పులు ప్రతిపాదించాము. కానీ ప్రోగ్రామర్లు అమలుపరిచినట్లు లేదు. మళ్ళీ ఒకసారి వాళ్ళకు అభ్యర్ధన పంపిస్తా --వైజాసత్య 14:37, 9 అక్టోబర్ 2007 (UTC)
- అందుకనే కావచ్చు వికీపీడియాలో చాలా తక్కువమంది స్త్రీలు కనపడుతున్నారు :) __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:41, 9 అక్టోబర్ 2007 (UTC)
- ఇప్పుడే ఇంకోటి గమనించాను... మనం తయారు చేస్తున్న సభ్యుల మూసలకు చివరన "సభ్యుడు" అని చేరుస్తున్నాము; ఆ మూసల పేర్లను కూడా "సభ్యులు"గా మార్చాలి!!! __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:46, 9 అక్టోబర్ 2007 (UTC)
- మూసల పేర్లే కాదు. మూసలలో కూడా సభ్యుడు అని ఉంది.
ఇలాంటి స్త్రీలింగ,పులింగ సమస్యలున్న మూసలన్నింటిలో సభ్యుడు|సభ్యురాలు స్విచ్ పెట్టాలనుకుంటా--వైజాసత్య 18:01, 9 అక్టోబర్ 2007 (UTC)
- మూసల పేర్లే కాదు. మూసలలో కూడా సభ్యుడు అని ఉంది.
- ఇప్పుడే ఇంకోటి గమనించాను... మనం తయారు చేస్తున్న సభ్యుల మూసలకు చివరన "సభ్యుడు" అని చేరుస్తున్నాము; ఆ మూసల పేర్లను కూడా "సభ్యులు"గా మార్చాలి!!! __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:46, 9 అక్టోబర్ 2007 (UTC)
- అందుకనే కావచ్చు వికీపీడియాలో చాలా తక్కువమంది స్త్రీలు కనపడుతున్నారు :) __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:41, 9 అక్టోబర్ 2007 (UTC)
పరిశీలించి మార్పులు చేస్తున్నందుకు వైజాసత్య,ప్రదీప్ గార్లకు కృతజ్ఞతలు.వీలయితే టి.సుజాతగారి పేజీలో ఇతర స్త్రీ సబ్యుల పేజీలలో కూడా మార్పుచేయగలిగితే మరింత సంతోషం. విశ్వనాధ్. 04:01, 10 అక్టోబర్ 2007 (UTC)
- అసలు లింగబేధం సూచించని వాడుకరి పదం వాడితేనో? ఎన్వికీలో కూడా అది 'member' కాదు 'user' కదా. —వీవెన్ 06:53, 11 అక్టోబర్ 2007 (UTC)
సాధారణ తెలుగు పదాలు
మార్చుతెలుగు వికీపీడియా శ్రేయోభిలాషిగా నేను గుర్తించిన ఒక విషయాన్ని మీరందరికీ తెలియజేయాలనుకొంటున్నాను. మన విజ్ఞాన సర్వస్వంలో సాధారణంగా వాడే తెలుగుపదాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక మనిషిగా మనకు తారసపడే వస్తువులు, విషయాలు, సంగతులు ఇందులో సీరియస్ గా లోపిస్తున్నాయి. ఇవి మనం ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం చేరిస్తే బాగుంటుందని నా ఆలోచన. మీ అభిప్రాయం, ఆలోచనల్ని, ప్రణాలికల్ని అనుచరణ యోగ్యమైనవిగా ఉండాలి. ఎక్కువ సమయం పట్టకూడదు మరి.Rajasekhar1961 12:59, 22 అక్టోబర్ 2007 (UTC)
- అంటే, దైనందిన జీవితంలో మనం వాడే మాటల గురించి, వాడే వస్తువుల గురించి, తారసపడే విషయాల గురించి వ్యాసాలు రాయడం లేదు అని మీ ఉద్దేశ్యమా? మరింత వివరంగా రాయగలరు. __చదువరి (చర్చ • రచనలు) 13:10, 22 అక్టోబర్ 2007 (UTC)
- పిన్నీసు, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ లాంటివా? --వైజాసత్య 14:06, 22 అక్టోబర్ 2007 (UTC)
సాధారణంగా మనం వాడే తెలుగు పదాలమద్య ఆంగ్లశాతం ఎక్కువ కద. అదేకాక ప్రాంతాల వారీగా వాడే తెలుగు పదాలు వివిద రూపాల్లో ఉంటాయి. విశ్వనాధ్. 04:04, 23 అక్టోబర్ 2007 (UTC)
- మీరన్న పని కోసం విక్షనరీ సరైన వేదిక అనుకుంటాను. __చదువరి (చర్చ • రచనలు) 04:12, 23 అక్టోబర్ 2007 (UTC)
- మరికొంచెం వివరంగా వ్రాయాలంటే ప్రయత్నిస్తాను. మనం చాలా పెద్ద విషయాలను వివరంగా వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాము. వైజసత్య, చదువరి లు సరిగా అర్థం చేసుకున్నారు. విశ్వనాధ్ గారు వ్రాసినట్టుగా ఆంగ్లభాషతో కలసి ఉన్న పదాలు, కాలక్రమేణా మారుతున్న తెలుగు పదాలు గురించి క్లుప్తంగా వ్రాయడాం అవసరం అనుకొంటున్నాను. విక్షనరీలో తెలుగు పదం అర్ధ వివరణ వరకు మాత్రమే వ్యాయగలం. వికీపీడియా ఈ సాధారణ పదాలను వివరంగా వ్రాయడం మంచిది అని నా అభిప్రాయం. ఉదాహరణకు. ఇల్లు, గది, గోడ, ఇటుక, పెన్సిల్ వంటి పదాలు మన తెవికీలో లేవు. ఈ పదాల్ని ఒక వర్గం క్రింద లేదా కొన్ని వర్గాల క్రింద వ్రాయవచ్చు. ఉదా హరణకు వాహనాలు, కట్టడాలు, గృహోపకరణాలు, వంట సామాన్లు, దుస్తులు, పరికరాలు/పనిముట్లు... ఇతరత్రా. ఒక సాధారణ నిఘంటువుతో ఈ పని మొదలుపెడదాం మీరందరూ అంగీకరిస్తేనే.Rajasekhar1961 06:15, 23 అక్టోబర్ 2007 (UTC)
మంచి ఆలోచన అనిపిస్తుంది. ఇంతకుముందు నేనూ అనుకొన్నా ఇంట్లో ఉపయోగించు వాటి వ్యాసాలురాయాలని... ఉదా" చాప,మంచం,పొయ్యి,కంచం,తోలుపెట్టె,ట్రంకు పెట్టె,మూకుడు,తపేలా,బిందె,చీపురు,కుంచం,తవ్వ,చీర,పంచె,లాగూ,గౌను,గాజులు,బొట్టు,చెప్పులు,చేట,కత్తిపీట,పంద్రిమంచం,పరుపు,మజ్జిగ కవ్వ,మరచెంబు,ముంత,విసనకర్ర.....అబ్బో బొచ్చెడున్నాయి...కాకుమ్టే ఇలాంటి వ్యాసాలు బాగుంటయ్యో బావుండవో అని చిన్న సంశయం...విశ్వనాధ్. 06:26, 23 అక్టోబర్ 2007 (UTC)
- మొదలుపెట్టండి. నేనూ ఓ చేయి వేస్తా. దేవా 06:31, 23 అక్టోబర్ 2007 (UTC)
- రాజశేఖర్ గారూ, ఆలోచన బాగుంది. తప్పకుండా అమలు చేద్దాం. ఒక ఎర్రలింకుల జాబితా తయారుచేసుకుంటే వాటిని రాస్తూ పోవచ్చు. ఉదాహరణకి సుప్రసిద్ధ ఆంధ్రులు జాబితా ఉండటం వళ్ళ నేను దానిలోని వ్యాసాలు వీలుదొరికినప్పుడల్లా మొలకలు నాటుతుంటాను. ఎందుకు బాగుండవు మనం ఇలాంటివాటిని యధాలాపంగా ఉపయోగిస్తుంటాముగానీ చాలామందికి వాటి వెనుక కథలు తెలియదు --వైజాసత్య 06:33, 23 అక్టోబర్ 2007 (UTC)
- మొదలుపెట్టండి. నేనూ ఓ చేయి వేస్తా. దేవా 06:31, 23 అక్టోబర్ 2007 (UTC)
- సాధారణ తెలుగు పదాలు మొదలు పెట్టాను. మీకు తెలిసిన పదాల్ని ఇందులో అక్షర క్రమంలో చేర్చండి.Rajasekhar1961 07:09, 23 అక్టోబర్ 2007 (UTC)
- జాబితా పెద్దదిగా ఉన్నది. ఈ పని ఒక్కరివల్ల అయ్యేదిగా కనిపించడంలేదు. అన్నీ మొలకలుగా చేయడం ఇష్టంలేదు. మనం అందరం ఒక్కొక్క చిన్నచిన్న ముక్కలుగా మనకు తెలిసిన సమాచారం చేరిస్తే అవి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని నా అబిప్రాయం. అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 13:59, 24 అక్టోబర్ 2007 (UTC)
- తలా ఒక చెయ్యేసి అభివృద్ధి చేద్దాం. ఏకవాక్య మొలకలు సృష్టించకుండా. మొలక ప్రారంభిస్తే అది కనీసం రెండు కేబీలైనా ఉండేట్టు చూడాలి --వైజాసత్య 20:44, 24 అక్టోబర్ 2007 (UTC)
తెవికి లో ఆంగ్ల వ్యాసాలా ?
మార్చుతెవికి లో ఉన్న పెద్ద పెద్ద వ్యాసాలు పూర్తిగా తెలుగులో కాకుండా ఆంగ్లం నుంచి కాపీ చేయబడి అలాగే ఉన్నాయి. ఏదో కొద్ది భాగాన్ని మాత్రమే అనువాదం చేయబడి వాటిని అలాగే వదిలి ఎవరో చేస్తారులే అన్నట్లుగా వదలివేయడం ఏ మాత్రం సరికాదు. అసలు అలాంటి ఆంగ్ల వ్యాసాలు తెవికి లో ఉండుట భావ్యమేనా అని మనమొక్క పర్యాయం ఆలోచించవసిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త సభ్యులు ఏదో సమాచారం కోసం అలాంటి వ్యాసాలు చూస్తే మరో సారి తెవికి ని ముట్టుకోకపోవచ్చు. వ్యాసాలు చిన్నవైనా సరే అవి పూర్తిగా తెలుగులోనే ఉండి సరైనా సమాచారమ్ అందిస్తే చాలు అదే పదివేలు. అనువాదం చేసేవారికి వనరులు కోకొల్లలు, వారికొరకై ఆంగ్ల వ్యాసాలు అలానే ఉంచడం అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదముంది. అంతే కాకుండా తెవికి లొ ఉన్న పెద్ద పెద్ద వ్యాసాలు మన రాష్ట్రానికి, మన దేశానికి, మన సంస్కృతికి, మన భాషకు సంబంధం లేనివై ఉండడం విచారకరం.C.Chandra Kanth Rao 19:37, 25 అక్టోబర్ 2007 (UTC)
- అవును మీరన్నది సరైనది. అందుకనే అలాంటి ఆంగ్ల వ్యసాలను తగ్గించటానికి ప్రయత్నాలు చేస్తునే ఉన్నాము. ఎవరైనా ఆంగ్ల వ్యాసాలను ఇక్కడకు తెస్తుంటే వాటిని వెంటనే తొలగించడం జరుతుంది. అలా తొలగించిన తరువాత మీరు సూచించినట్లే చిన్న చిన్న వ్యాసాలను సృష్టించమని చెప్పటం కూడా జరుగుతుంది. ఇతర భారతీయ భాషలతో పోలిస్తే తెలుగు వికీపీడియాలో ఇంగ్లీషు శాతం కొద్దిగా తక్కువగానే ఉంది, కానీ సాధారణం కంటే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. మీరు కూడా ఈ ఇంగ్లీషు శాతాన్ని తగ్గించటానికి ప్రయత్నించవచ్చు, సాధారణంగా వర్గం:అనువాదము కోరబడిన పేజీలులో కనపడిన పేజీలను అనువదించడమో లేకపోతే వాటిలో ఉన్న ఇంగ్లీషు వ్యాఖ్యలను తీసేయడమో చేయవచ్చు. కొన్ని వ్యాసాలను కొంత మంది సభ్యులు అనువదిస్తూ ఉంటారు, అందుకని పేజీ చరిత్ర ఒకసారి చూసి ముందుకు సాగండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 20:42, 25 అక్టోబర్ 2007 (UTC)
- మీరన్నది అక్షరాలా నిజం. అందుకనే అలా ఆంగ్ల వ్యాసాలు అతికించవద్దని పదేపదే మనవి చేస్తుంటాం. అనువదిద్దామని సదుద్దేశముతో తెచ్చిన వ్యాసాలు ఆ తరువాత సభ్యులు ఇతర వ్యాపకాలతో తీరికలేక వాటిని అలాగే వదిలెయ్యటం జరుగుతుంది. ఉన్న కొంతమంది క్రియాశీలక సభ్యులు ఎంతని చెయ్యగలరు. అప్పటికి వీలైనంతగా చేస్తూనే ఉన్నారు. అసలేమాత్రం అనువదించని వ్యాసాలను ఇదివరకు నేను చాలా తుడిచేశాను. కానీ ఎంతోకొంత అనువదించిన వ్యాసాలను తుడిచివేయబుద్ధికాలేదు. --వైజాసత్య 20:43, 25 అక్టోబర్ 2007 (UTC)
- ఆంగ్ల శాతాన్ని లెక్కించడం లొ వ్యాసాలలొ పొందుపరచిన మూలాలు కూడా పరిగణన లొకి తీసుకోవడం జరిగింది, మూలాలు ఆంగ్లములొ ఉంటాయి.అందుచేత ఆంగ్లశాతం చెప్పవలెనంటే ఇంకా చాలా తక్కు--బ్లాగేశ్వరుడు 20:55, 25 అక్టోబర్ 2007 (UTC)వ
ఇంగీష్ వీకీపీడియాను అనువదించి తెలుగు వీకీపీడియాలో వ్యాసము వ్రాయడములో చట్టపరమైన సమస్యలు ఉన్నాయా? t.sujatha 16:25, 30 అక్టోబర్ 2007 (UTC)
- అలాంటి సమస్యలేమీ లేవు. మీరు నిశ్చింతగా వ్రాయవచ్చు--వైజాసత్య 16:45, 30 అక్టోబర్ 2007 (UTC)
ధన్యవాదాలు వైజాసత్యగారు ప్రపంచమఖ్యనగరాల గురించి వ్రాయాలని అనుకుంటున్నాను ఇక నాపని కొనసాగిస్తాను.
t.sujatha 17:06, 30 అక్టోబర్ 2007 (UTC)
ప్రపంచ ముఖ్య నగరాల గురించి వ్రాయాలనుకోవడం ఇది చాలా మంచి నిర్ణయం, కాని ఆంగ్ల వ్యాసాలను అనువదించేటప్పుడు ఏ వాక్యానికి ఆ వాక్యం అనువదిస్తే తెలుగులో కూర్పు సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆంగ్ల వ్యాసాలలోని ముఖ్య విషయాలను ఆకళింపు చేసుకొని మన ఆలోచన ప్రకారం వ్రాస్తే బాగుంటుందని నా అబిప్రాయం.C.Chandra Kanth Rao 18:50, 30 అక్టోబర్ 2007 (UTC)
వర్గాల వర్గీకరణ
మార్చుఒక వర్గాన్ని మరో వర్గము క్రింద చేర్చవచ్చా, ఒక వంశవృక్షం మాదిరిగా. వికటకవి 13:34, 2 నవంబర్ 2007 (UTC)
- వ్యాసాన్ని ఎలా చేరుస్తామో వర్గాన్ని కూడా ఇతర వర్గాల లోకి చేర్చవచ్చండి. ప్రత్యేకపేజీలు లింకు కెళ్తే, వర్గీకరించని వర్గాలు అనే లింకు ఉంటుంది కూడా, చూడండి__చదువరి (చర్చ • రచనలు) 13:57, 2 నవంబర్ 2007 (UTC)
సంకీర్ణ సంఖ్యలు
మార్చు- పై పేరుతో ఒక వ్యాసం రెండు,మూడు రోజుల క్రితం ఇందులో వచ్చింది. అందులో పదాలు చాలా విచిత్రం గా ఉన్నాయి. అదే విషయం ఆ వ్యాసం చర్చ లో నేను సూచించాను. ఇప్పుడు ఆ వ్యాసం,దానిపై చర్చ, నామార్పులు-చేర్పులు తో సహా అంతటా అది మాయ మయింది. ఎందుచేత? ----కంపశాస్త్రి 13:31, 4 నవంబర్ 2007 (UTC)
- దానిని నిర్వాహకులు తొలగించారు. దానికి ప్రాణ ప్రతిష్ట చేయాలి. మీరు మళ్ళి మొదలు పెట్టవచ్చు సంకీర్ణ సంఖ్యలు మొదలు పెట్టండి--బ్లాగేశ్వరుడు 14:01, 4 నవంబర్ 2007 (UTC)
- దానిని నిర్వాహకులు తొలగించడానికి కారణం ఏమిటి? ఏకారణమూ చెప్పకుండా తొలగించే నిరంకుశాధికారం నిర్వాహకులకు ఉంటే ఇది స్వేచ్చా విహార ప్రదేశం ఎలా అవుతుంది? కాస్త విచిత్రంగానే ఉంది.----కంపశాస్త్రి 17:56, 8 నవంబర్ 2007 (UTC)
- బహుశా విద పర నొసొత్రొస్ నొ ఎస్ మస్ ఉఎ ఉన్ జుఎగొ, య్ సి నొ స��) అనే విషయం ఉండుటవల్ల ఏదో స్పాము అనుకోని తొలగించి ఉంటారు Chavakiran 18:10, 8 నవంబర్ 2007 (UTC)
- ఆ పేజీలను నేనే తొలగించాను. మొదట్లో ఆ వ్యాసంలో అర్థంలేని అక్షరాలు ఉన్నాయి. అందుకనే దానిని అప్పుడు తొలగించేసాను. అలా తొలగించడం నిర్వాహకులు చేయవలసిన పనులలో ఒకటి. వ్యాసాలను త్వరితగతిన తొలగించడానికి ఆంగ్లవికీలో పాటిస్తున్న నియమాలు పరిశీలించండి. ఇలాంటి పేజీలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి, వీటి తొలగింపుపై చర్చ కూడా అనవసరం. నేను ఇటువంటి పేజీలను తొలగించేటప్పుడు వాటి చర్చాపేజీని కూడా తొలగిస్తూ వచ్చాను. ఆ క్రమంలోనే ఈ చర్చా పేజీని కూడా తొలగించాను. ఇక నుండీ ఇలాంటి అర్థంలేని వాక్యాలు మాత్రమే ఉన్న పేజీలను తొలగించేటప్పుడు, వాటి చర్చాపేజీలను తొలగించకుండా వదిలిపెడతాను. నా అభిప్రాయం ప్రకారం స్పాముపై జరిగిన చర్చ కూడా స్పామే!!! __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 20:58, 8 నవంబర్ 2007 (UTC)
తెలుగు ప్రముఖుల పేర్లు
మార్చుసుప్రసిద్ధ ఆంధ్రులులో మన ప్రముఖుల పేర్లు ఒక పద్ధతిలో లేవు. కొన్ని ఇంటిపేరులు ముందు, తరువాత ఉన్నాయి. కొందరివి పొట్టిపేర్లున్నాయి. కొందరి పేర్లకు ముందు డా., శ్రీ, మాస్టర్ లాంటివి పెట్టబడ్డాయి. పాశ్చాత్యుల పేర్లు వేరే పద్ధతిలో ఉంటాయి కాబట్టి ఇవికీని అనుకరించడం అంతమంచిది కాదేమో. అందరికీ అమోదయోగ్యమైన పద్ధతిలో అందరూ వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.Rajasekhar1961 07:08, 7 నవంబర్ 2007 (UTC)
- ఆ పేర్లను చెరిపేయకుండా రిఫరెన్స్ లో ఉంచి మీరే కొత్తగా రాయండి. నచ్చని వారు తిరిగి పాతపేరును రిఫరెన్స్ నుమ్డి చేర్చుకొంటారు..విశ్వనాధ్. 07:22, 7 నవంబర్ 2007 (UTC)
సాధారణంగా ఒక వ్యక్తి ఏ పేరుతో ప్రసిద్ధి చెందితే ఆ పేరుతోనే ఉండనిద్దాం. ఈ విషయంలో గుడ్డిగా పాశ్చాత్యులను అనుకరించకుండా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం కొనసాగిద్దాం. ఇటీవల కాలంలో వ్యక్తి పేరు కు ముందు ఇంటి పేరు పొట్టి అక్షరాలతో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందే కాబ్బట్టి విశ్వనాథ్ గారు చెప్పినట్లు రెపరెన్సులో మరో విధంగానూ వ్రాస్తే అందరికీ సౌలభ్యం.C.Chandra Kanth Rao 18:11, 8 నవంబర్ 2007 (UTC)
మొదటి పేజీ/పాత చర్చ
మార్చుఇక్కడ ఒక చిన్న మార్పు చేయాలి. సుప్రసిద్ద ఆంధ్రులు వర్గంలో చర్చ:మొదటి పేజీ/పాత చర్చ 1. కూడా చేరింది. అదేకాక ఇదేవర్గంలో సాహితీకారులు వర్గం కూడా ఉన్నది. ఈ రెండిటిని తగిన స్థానాలకు ఎవరయినా చేర్చగలరా..విశ్వనాధ్. 07:48, 19 నవంబర్ 2007 (UTC)
- చర్చ:మొదటి పేజీ/పాత చర్చ 1ను ఆ వర్గంలో కనిపించకుండా చేసాను. ఒక వ్యాసంలో వర్గం లింకును చూపించాలంటే ':'ను వాడాలి, [[:వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]. అలాగే వ్యాసాన్ని ఆ వర్గం చేర్చాలనుకుంటే ':'ను తీసేస్తే సరి. సాహితీకారులు గురించి మీరన్నది అర్ధంకాలేదు, "తెలుగు సాహితీకారులు" అనే వర్గం "సుప్రసిద్ద ఆంద్రులు" అనే వర్గంలో ఉండకూడదని అంటున్నారా. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 10:19, 19 నవంబర్ 2007 (UTC)
- సుప్రసిద్ద ఆంధ్రులు వర్గంలో ఉన్న సాహితీకారులు వ్యాసంలో సాహితీకారుల జాభితాలు ఉన్నాయి. దానిని క్రింది ఉపవర్గం నుండి పైకి మార్చి వేరు చేయగలిగితే బావుండునని అనుకొంటున్నాను..విశ్వనాధ్. 11:28, 19 నవంబర్ 2007 (UTC)
మొదటి పేజీలో క్రీడారంగానికి లింకు లేదు
మార్చుఅత్యంత ప్రాధాన్యం కల్గిన క్రీడారంగానికి తెవికి మొదటి పేజీలో లింకు లేదు. కాబట్టి ఏర్పాటుచేయగలరు. అంతేకాకుండా క్రీడారంగానికి సంబంధించిన వ్యాసాలు తెవికిలో చాలా తక్కువగా ఉన్నాయి. వ్యాసాల సంఖ్య పెంచడానికే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా తెవికిని మరల్చడానికి ఇది మంచి అవకాశం. సభ్యులు కృషి చేస్తే ఈ రంగంలో వ్యాసాల సంఖ్య గణనీయంగా పెర్గే అవకాశముంది.C.Chandra Kanth Rao 18:54, 28 నవంబర్ 2007 (UTC)
- క్రీడలకు లింకు యేర్పాటు చేశాను. వివిధ క్రీడాకారుల వ్యాసాలు పెంపొందించి తెవికీ విస్తృతికి కృషి చేస్తున్నందుకు నెనర్లు --వైజాసత్య 19:44, 28 నవంబర్ 2007 (UTC)
భారతీయ సాంప్రదాయ సంగీతం
మార్చుభారతీయ సంగెతం, భారతీయ సాంప్రదాయ సంగీతం రెండు పేజీలుగా ఉన్నాయి. మొదటిది ఉన్నది తెలియక మరొకటి మొదలెట్టా. కాని రెండిటిని కలిపి ఒకటిగా మార్చాలనుకొంటున్నాను. ఏపేరు ఉంచను?. దానికి అనుబందముగా కర్ణాటకసంగీతం,హిందూస్థానీ సంగీతం,జానపద సంగీతం, తాళం,రాగం, లయ,పల్లవి,చరణమ్, ఇలా వేరు వేరు పేజీలు సృస్టించాలి ఒకే వర్గంలో. ఆ తరువాత భారతీయ వాద్య పరికరాలు అదేవర్గంలో వస్తాయి. కాకుంటే అది ఏ వర్గం అనేది నాకు చిన్న కన్ప్యూషన్. కళలా?,సంగీతమా?,భారతీయ సంగీతమా చాలా వర్గాలు ఉన్నయి.ఏది ఏ వర్గం క్రిందకొస్తుందో తెలియడం లేదు. అది ఏ వర్గం కావాలి?. తెలియ చేయగలరు.విశ్వనాధ్. 05:09, 29 నవంబర్ 2007 (UTC)
- సంగీతం అనేది అన్నింటికీ మూలం. దానిలో వివిధరకాలు కర్ణాటక, హిందుస్థానీ, జానపద మొదలైనవి. మీరు రాసిన తాళం, రాగం, లయ మొదలైనవి అన్ని రకాల సంగీతాలకు సంబంధించినవి.Rajasekhar1961 15:14, 29 నవంబర్ 2007 (UTC)
- భారతీయ సంగీతం, భారతీయ సాంప్రదాయ సంగీతం రెండూ వేరువేరు. భారతీయ సాంప్రదాయ సంగీతం అనేది భారతీయ సంగీతంలో ఒక భాగం. ఇందులో హిందుస్థానీ, కర్ణాటక లాంటి సాంప్రదాయ సంగీతాలకే స్థానం. కాబట్టి రెండింటికీ వేర్వేరు వ్యాసాలున్ననూ ఇబ్బందిలేదు. ఇక భారతీయ వాద్య పరికరాల గురించి చెప్పాలంటే అవి భారతీయ వాద్య పరికరాలు అనే వర్గంలో చేరిస్తే సరి. అన్ని వ్యాసాలు ఆ వర్గంలోకి వస్తాయి. C.Chandra Kanth Rao 18:41, 29 నవంబర్ 2007 (UTC)
- రెండు వ్యాసాలూ వ్రాసేట్టయితే అలాగే చెయ్యండి. ఒకే వ్యాసం క్రిందకి తెచ్చేట్టైతే భారతీయ సంగీతం అని ఉంచండి. భారతీయ సాంప్రదాయ సంగీతం కంటే జనాలు భారతీయ సంగీతం అని వెతికే సంభావ్యత ఎక్కువ. రాజశేఖర్ గారన్నట్టూ అవి అన్ని సంగీతాలకీ వర్తిస్తాయి కాబట్టి సంగీతం వర్గంలో ఉంటేనే బాగుంటుంది. ఒక వ్యాసం ఒకటికంటే ఎక్కువ వర్గాలలో ఉండటం వళ్ళ నష్టమేమీ లేదు. ఆ వ్యాసానికి అనేక మార్గాలలో చేరుకోవచ్చు. --వైజాసత్య 18:57, 29 నవంబర్ 2007 (UTC)
మూలాలు లేని మరియు వర్గీకరించబడని పేజీలు
మార్చు- మన తెలుగు వికీ లో కొన్ని మూలాలు లేని పేజీలు, కొన్ని వర్గీకరించబడని పేజీలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని గుర్తించడానికి ఒక రెండు చిన్న ప్రోగ్రాంలు వ్రాసినచో బాగుంటుందని నా ఆలోచన. మొత్తం అన్ని పేజీలను తిరగవేయడం ఎవరికైనా కష్టం. మీరెవరైనా ఈ సహాయం చెయ్యగలరా?Rajasekhar1961 16:07, 29 నవంబర్ 2007 (UTC)
- అలాగే, ఒక ప్రోగ్రాం రాయటానికి ప్రయత్నిస్తాను --వైజాసత్య 16:36, 1 డిసెంబర్ 2007 (UTC)
- ధన్యవాదాలు. మూలాలు లేని వాటికి మీ ప్రోగ్రాం పనిచేస్తుంది. అలాగే వర్గీకచించబడని వాటికి కూడా మరొక ప్రోగ్రాం వ్రాయండి.Rajasekhar1961 13:22, 2 డిసెంబర్ 2007 (UTC)
- వర్గీకరించబడని పేజీలకు ప్రత్యేక పేజీ ఉంది. —వీవెన్ 02:13, 3 డిసెంబర్ 2007 (UTC)
- వికీపీడియా:మూలాలు లేని వ్యాసాలు - మూలాలు లేని వ్యాసాల జాబితా ఇదిగో --వైజాసత్య 20:24, 5 డిసెంబర్ 2007 (UTC)
- వర్గీకరించబడని పేజీలకు ప్రత్యేక పేజీ ఉంది. —వీవెన్ 02:13, 3 డిసెంబర్ 2007 (UTC)
తెలుగు
మార్చుఎన్దుకుగాను మీరు తెలుగు తప్పనిసరిగా వాడాలని కొరడా ఝుళిపిన్ఛలేదు యెన్దుకు?
తోటపల్లి లక్ష్మీనృసిమ్హ రాఘవేన్ద్ర శర్మ. ఆళ్ళగడ్డ. కర్నూలు జిల్లా. ఆన్ధ్హ్రప్రదేసశ్
- మీకిక్కడ దాదాపు కనిపిస్తున్నదంతా తెలుగేకదండి శర్మగారూ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో వివరించండి. --వైజాసత్య 16:35, 1 డిసెంబర్ 2007 (UTC)
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా నియోజక వర్గాలు
మార్చుఆంధ్ర ప్రదేశ్ శాసన సభ లోని అన్ని నియోజక వర్గాల గురించి ఎన్నికైన వారు, పార్టీల గురించి [1] లో వివరాలు ఉన్నాయి. దీని మనం గ్రామాలు విషయంలో చేసినట్లుగా పట్టిక రూపంలో లేదా మరే ఇతర పద్ధతిలో కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా పేజీలు తయారుచేసినచో బాగుంటుంది. ఇందులో మన రాష్ట్రంలోని కొంతమంది ప్రముఖులు వస్తారు. ఇంచుమించు నియోజక వర్గాలు పెద్ద పట్టణాలకు సంబంధించిన వివరాలు వస్తాయి. మీ అందరి అభిప్రాయం తెలియజేయండి.Rajasekhar1961 07:01, 5 డిసెంబర్ 2007 (UTC)
- ప్రతి నియోజక వర్గం కు సంబంధించి ప్రత్యేక వ్యాసాలే తయారుచేస్తే ఇంకనూ బాగుంటుంది. ప్రతి నియోజక వర్గం పరిధిలో వచ్చే మండలాలు, జనాభా, ఓటర్ల సంఖ్య, నియోజక వర్గపు గత చరిత్ర, ప్రారంభం నుంచి ఆ నియోజక వర్గంలో గెల్చిన సభ్యులు, నియోజక వర్గంలో రాజకీయ పార్టీల పరిస్థితి, నియోజక వర్గంలో వివిధ పార్టీల ప్రముఖులు, ప్రస్తుత సంఘటనలు మొ.లగు విషయాలు చేర్చవచ్చు.C.Chandra Kanth Rao 16:13, 5 డిసెంబర్ 2007 (UTC)
- మంచి ఆలోచన, బాటు ద్వారా కొంతవరకు వీటిని తయారుచేయవచ్చు. క్రితంసారి ఇండియా వెళ్ళినప్పుడు నియోజకవర్గాలు త్వరలో పునర్వ్యవస్థీకరిస్తున్నట్టు విన్నాను. జరిగిందా? జరగబోతోందా? ఏవరికైనా తెలుస్తే తెలియజేయగలరు. --వైజాసత్య 18:08, 5 డిసెంబర్ 2007 (UTC)
- నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది కాని రాజకీయ నాయకుల ఒత్తిళ్ళతో మార్పులు చేర్పులు జర్గుతున్నాయి. ఇంకనూ ఎన్నిల కమీషన్ ఆమోదించలేదు.C.Chandra Kanth Rao 18:17, 5 డిసెంబర్ 2007 (UTC)
- ఇంతవరకు ఉన్న సమాచారంతో ముందు బాటుద్వారా నియోజక వర్గాల పేజీలు తయారుచేసుకొంటే మంచిది. పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్త సమాచారం చేర్చవచ్చును. ఎన్నికలు జరిగిన ప్రతిసారి అవి దీనికి కలుపుకొనవచ్చు. చంద్రకాంత్ గారు తెలిపినవిధంగా ఆయా నియోజక వర్గాఅర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారం చేర్చవచ్చు.Rajasekhar1961 06:47, 6 డిసెంబర్ 2007 (UTC)
బయోడేటా
మార్చుC.Chandra Kanth Rao ఏ ఊరు వాళ్ళో ? Seshagirirao 15:17, 8 డిసెంబర్ 2007 (UTC)
- నేను ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడినే. పట్టణం మాత్రం సస్పెన్స్.C.Chandra Kanth Rao 17:53, 8 డిసెంబర్ 2007 (UTC)