ప్రధాన మెనూను తెరువు

వికారాబాద్

తెలంగాణ, వికారాబాదు జిల్లా, వికారాబాదు మండలం లోని పట్టణం
(వికారాబాదు నుండి దారిమార్పు చెందింది)

వికారాబాద్, తెలంగాణ రాష్ట్రములోని వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలానికి చెందిన పట్టణం.[1]

వికారాబాద్
—  రెవిన్యూ గ్రామం  —
[[Image:
అనంత పద్మనాభస్వామి దేవాలయం
|250px|none|]]
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండలం వికారాబాద్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు, రైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్బనికి రైలుమార్గం ఉంది.

విషయ సూచిక

చరిత్రసవరించు

ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా స్వంత జాగీరు అవడంవల్ల ఈ జాగీరుకు వికారాబాద్ అని పేరు వచ్చింది.[2][3]

రవాణా సౌకర్యాలుసవరించు

 
అనంతగిరి అడవి ప్రాంతం,కొండలు

ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీ.పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డిపో కూడా పట్టణంలో ఉంది.

పురపాలక సంఘంసవరించు

 
అనంతగిరి కొండలలో పుట్టిన మూసీనది

పట్టణంలో పురపాలక సంఘాన్ని1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డి పేట్, కొత్రెపల్లి, అనంతగిరిపల్లి, వెంకటాపూర్ తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషను‌కు అతిసమీపంలో ఉంది.

పట్టణంలోని కాలనీలుసవరించు

  • రామయ్యగూడ: ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలని. ఇక్కడి ప్రజలంతా చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ జీవితాలు వెళ్ళదీసుకుంటారు.
  • ఎన్నెపల్లి: ఒకప్పుడు ప్రత్యేక గ్రామంగా ఉన్న ఎన్నెపల్లి ఇప్పుడు పూర్తిగా వికారాబాద్ పట్టణంలో కలిసింది. వికారాబాదులో ముఖ్యమైన కాలనీలలో ఒకటి.
  • వేంకటేశ్వర కాలని : ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలనీ. ఇక్కడి ప్రజలంతా విద్యావంతులు, ఉపాధ్యాయులు,వ్యాపారస్తులు. ఇది ఆదర్శ కాలని. ఇక్కడ వేంకటేశ్వర ఆలయం ఉంది.

విద్యాసంస్థలుసవరించు

ప్రాథమిక పాఠశాలలు[4]
  • ప్రభుత్వ పాఠశాలలు: 2,
  • మండల పరిషత్తు పాఠశాలలు: 43,
  • ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3,
  • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 10
ప్రాథమికోన్నత పాఠశాలలు[5]
  • మండలపరిషత్తు పాఠశాలలు: 7
  • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 8
ఉన్నత పాఠశాలలు[6]
  • ప్రభుత్వ పాఠశాలలు: 3
  • మండల పరిషత్తు పాఠశాలలు: 15
  • ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3
  • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 11
కళాశాలలు
  • శ్రీ అనంత పద్మనాభ కళాశాల, వికారాబాదు
  • శ్రీ సరస్వతి విద్యాలయ కళాశాల, వికారాబాదు
  • విద్యాసాగర్ డిగ్రీకళాశాల, వికారాబాదు

సమీప పర్యాటక ప్రదేశాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/240.Siddipet-240-1.pdf
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (5 June 2016). "భగ్నహృదయాల మేడ - వికార్ మంజిల్". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 3 May 2019. Retrieved 3 May 2019.
  3. నమస్తే తెలంగాణ, ఆదివారం. "మార్కండేయుడి తపోవనం వికారాబాద్!". బక్క బాబూరావు. Archived from the original on 3 May 2019. Retrieved 3 May 2019.
  4. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.153
  5. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.155
  6. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.157

వెలుపలి లింకులుసవరించు