వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 2

పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3

కొత్త సంవత్సరానికి కొత్త స్వాగతం

మార్చు

కొత్త సంవత్సరంలో నూతన సభ్యులకు స్వాగతం తెలుపటానికి కొత్త స్వాగతం మూసను ఉపయోగించాలని నా మనవి. వైజాసత్య తయారు చేసిన ఈ కొత్త సందేశంలో నేను స్వాగతం మూసలో ఇంకొన్ని మార్పులు చేసాను. వాటిలో ముఖ్యమైనవి:

__మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 12:40, 29 డిసెంబర్ 2006 (UTC)

అవును కొత్త మూస ప్రవేశ పెడదాం. గూగుల్ గుంపుల్లోని RTS వ్యాసము చాలా టెక్నికల్ గా ఉంది దానికి బదులు వికీలోనే క్లుప్తంగా, సరళంగా ఒక పేజీ రాస్తే బాగుంటుంది. ఎడిట్ బాక్సు పైన కూడా ఒక చిన్న క్విక్ రెఫరెన్సు పట్టిక పెట్టాలని నా ఆలోచన --వైఙాసత్య 14:32, 29 డిసెంబర్ 2006 (UTC)
అవును గూగుల్ గుంపులలో ఉన్న ఆ వ్యాసం చాలా టెక్నికల్ గా ఉంటుంది. తెలుగు వ్యాసంలో ఉన్న ఈ పట్టికకు లింకు ఇస్తే ఎలా ఉంటుంది. కానీ ఆ పట్టికను ఇంకొంచెం మెరుగు పరచాలేమో. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:17, 29 డిసెంబర్ 2006 (UTC)

స్వాగతం మూసను మార్చేసాను. గూగుల్ గుంపులలో ఉన్న వ్యాసానికి లింకును మార్చలేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 16:14, 15 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమాలు ప్రాజెక్టు

మార్చు
  • సభ్యులు గమనించే ఉంటారు. భారతదేశం రాష్ట్రాల అనువాదం దాదాపు పూర్తి అయ్యింది. అక్కడక్కడా సాంకేతికమైన కొద్ది పేరాలను అలాగే ఉంచేశాను (తెలుగు మాటలు తెలియక).
  • తెవికీలో గ్రామాలు, సినిమాలు - ఈ రెండింటిదే సింహభాగమని మనకందరికీ తెలుసు గదా! ముందుగా తెలుగు సినిమాలగురించి సమాచారం పెంచడానికి తెలుగుసినిమా ప్రాజెక్టు పై దృష్టి పెట్టాలని నా అభిప్రాయం.
  • ఇందులో నేను ప్రతిపాదించే ప్రధానాంశాలు: సినిమా సమాచారం, చరిత్ర, నటులు, తెర వెనుక, ఆర్ధికం, సంస్కృతి, రివ్యూలు (ఇక్కడ "తటస్థ దృక్కోణం" అనే విషయంలో కాస్త వెసులుబాటు ఉండడాలేమో?), బొమ్మల కొలువు, రాజకీయాలు, అభిమానసంఘాలు, సినిమాహాళ్ళు - వగైరా.
  • తెలుగు సినిమాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా చాలా సమాచారం మనకు మీడియాలో లభించే అవకాశం ఉన్నది. అందుచేత ఈ అదను చూసుకొని వీలయినంత సమాచారాన్ని పొందుపరచండి.
  • మీ సూచనలను, సలహాలను ఇక్కడ వ్రాయమని కోరుతున్నాను

కాసుబాబు 19:36, 9 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


బహుమతులు, పురస్కారాలు

మార్చు

వర్గాలు తయారుచేసేప్పుడు నేను గమనించిన విషయం. "బహుమతులు", "పురస్కారాలు" అనే రెండు పదాలనూ వాడడం జరిగింది. ఏదో ఒక పదాన్ని మనం ప్రామాణికం చేయాలి. "పురస్కారం" కంటే "బహుమతి" వాడుకలో ఎక్కువగా ఉంటుంది. త్వరగా అర్ధమౌతుంది. కనుక అన్నింటినీ "బహుమతి"గా మార్చాలని నా ప్రతిపాదన. ఏమంటారు? --కాసుబాబు 06:53, 24 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకలో (అంటే మీడియాలో) నోబెల్ బహుమతి అని జ్ఞానపీఠ పురస్కారం అని అనటం పరిపాటు, అలవాటు కాబట్టి ..అలా ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది..మిగిలిన వాళ్లేమంటారు..ఏది ఎలా ఉంచినా మనకు దారిమార్పులు మాత్రం తప్పవు :-) --వైఙాసత్య 16:45, 26 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ ప్రతిపాదనలు

మార్చు
కొత్త మొదటి పేజీ నిర్మాణము ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ దాని నిర్మాణము కోసం కావలిసిన అంశాలను చర్చించండి.

వేవెన్ గారు, వికీపీడియా కన్నడా పేజిని చూశారా చాలా ఆకర్షనీయంగా ఉంది, విశేషవ్యాసం వారానికి ఒకసారి మార్చే పద్దతిని ఎప్పటి నుంచి ప్రారంగభిస్తారూ!--చామర్తి 04:56, 14 మే 2007 (UTC)  

వీవెన్, మీరు చేస్తున్న మొదటి పేజీ డిజైన్ మెరుగు అవుతున్నది. కొన్ని సూచనలు:

  • "ఈ వారం బొమ్మ"ను "ఈ వారం వ్యాసం" ప్రక్కకు మార్చి, "మీకు తెలుసా" శీర్షిక క్రిందికి తెస్తే బాగుంటుంది.
  • For your information, కన్నడ ముఖ్యపేజీ బాగుందనే నాకూ అనిపిస్తుంది. ఎడమవైపు బాక్సులో కన్నడ వికిపిడియా గురించి వ్రాసిన పరిచయ, ఆహ్వాన వాక్యాల సారాంశము ఇది:
Welcome to Kannada WIkipedia. This is a Free Encyclopaedia to put together essays on all Topics, which anyone can contribute, add or edit. Here are the memebers contributing to this encyclopaedia, and here are the administrators.
Kannada Wiki started in Sept 2004 and has now this many essays. You can also contribute to take this effort forward. Look at community portal to see requests and for works on hand. You can experiment in Sandboxes. Here is the place to discuss on WIkipedia. This wikipedia is available in many languages
Please See "About Us" for more information and for news features on Kannada Wikipedia.
  • ఇక చామర్తి గారి ప్రశ్నకు - "విశేష వ్యాసం" బదులు "ఈవారం వ్యాసం"గా మార్చడం ద్వారా వ్యాసాలు తరచు మార్చే విధానం సరళీకృతం చేయాలనుకొంటున్నాను. త్వరలో ఈ విషయమై ప్రతిపాదనలు సూచిస్తాను. --కాసుబాబు 06:05, 14 మే 2007 (UTC) [ప్రత్యుత్తరం]
    • విశేషవ్యాసం ఉండాలి అప్పుడే తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాల గురించి కొత్త వాళ్ళకు తెలుస్తుంది. ఈ వారం బొమ్మకు బదులుగా "ఈ వారం వ్యాసం" పెట్టటం బాగుంటుంది. ఈ వారం బొమ్మ పెట్టటం వలన నాకు పెద్దగా ఉపయోగం కనిపించటం లేదు, నాకు తెలిసి తెలుగు వికీపీడియాలో బొమ్మలు చాలా తక్కువగా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:46, 14 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల చర్చ పేజిలొ మార్చు ప్రక్కన + గుర్తు ఉంది, ఆఏర్పాటు రచ్చబండ పేజిలొ మార్చు దగ్గర + కుడా చెయ్యడానికి అవుతుందా!!!! ఆంగ్ల వికీపిడియా బోమ్మలు తెలుగు వికీపిడీయాలొకి తేవచ్చా?? --చామర్తి 10:11, 14 మే 2007 (UTC)  

బొమ్మలను కామన్స్ నుండి అరువు తెచ్చుకోవచ్చు. కొందరిని ఈ చిత్ర విచిత్రమైన విజ్ఞానదాయక బొమ్మలే ఆకర్షిస్తాయి.అందుకే ఆంగ్ల వికీలో చాలా మంది సభ్యులు ఈ వారం బొమ్మ మూసను తమ సభ్యుని పేజీలో పెట్టుకోవటం చూశా --వైఙాసత్య 13:44, 15 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వికీగురించి ఉన్న ఈ వ్యాసాన్ని ఇంకో పేజీలోకి మార్చి దానిని మొదటి పేజీ నుండి లింకు ఇస్తే బాగుంటుంది. కొత్త సబ్యులందరికీ వికీగురించి మంచి పరిచయం చేసినట్లుంటుంది కూడా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:47, 23 మే 2007 (UTC) [ప్రత్యుత్తరం]
ప్రదీపు, వికీపీడియా మొదటి పేజీ పైభాగములో ఉన్న బొద్దు లింకు క్రిందనే ఈ పేజీ పెట్టాను. --వైజాసత్య 17:09, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేజీల్లో సమాచార పెట్టెలు

మార్చు

మండలాలకు సమాచార పెట్టెలు పెట్టాం. ఇక గ్రామాలకు కూడా పెడితే బాగుంటుంది. కింది వివరాలు మనదగ్గర ఎలాగూ ఉన్నాయి:

  • జనాభా
    • పురుషులు
    • స్త్రీలు
  • అక్షరాస్యత శాతం
    • పురుషులు
    • స్త్రీలు

వీటిని ఓ బాటు ద్వారా అన్ని పేజీల్లోనూ చేరిస్తే బాగుంటుంది. అయితే కొన్ని ఇబ్బందులున్నాయి. నాకు తట్టిన కొన్ని:

  1. మన దగ్గరున్న సమాచారంలో గ్రామం పేరు ఇంగ్లీషులో ఉంది. ముందు దాన్ని తెలుగులోకి మార్చాలి.
  2. తనిఖీలు చెయ్యాల్సిన గ్రామాల పేజీలు ఇంకా చాలా ఉన్నాయి.
  3. అయోమయ నివృత్తి చెయ్యాల్సిన పేజీలు కూడా ఇంకా ఉన్నాయి

ఎలా చేద్దాం? సభ్యులు అభిప్రాయాలు చెప్పగలరు. __చదువరి (చర్చ, రచనలు) 10:11, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మొదట ఆంగ్ల పేర్లకు తెలుగులో ఏ పేరు పెట్టామో ఒక చిట్టా తయారు చేసుకోవాలి. అన్ని ఊళ్ళనూ ఒకే సారి మొదలుపెట్టే బదులుగా ఒక్కొక్క జిల్లాను తీసుకుని చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎంతవరకూ అవుతుంది ఏమిటి అనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అయితే మొదట ఏ జిల్లా నుండి మొదలు పెడదాము? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:26, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీ జిల్లాతోటి మొదలెట్టండి:) __చదువరి (చర్చరచనలు) 10:28, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ గ్రామాల పేర్లు తనీఖీలు, అయోమయ నివృత్తులు చేస్తున్న కొద్దీ మారతాయి కాబట్టి అవన్నీ కాకముందే గణాంకాలు చేర్చితే మరలా వాటిని సరిదిద్దడానికి చాలా సమయవవుతందని నా అభిప్రాయం. ముందు అన్ని గ్రామాలకు పేజీలే పూర్తికాలేదు. అందుకని తనిఖీలయ్యేదాకా ఆగుదామని నా అభిప్రాయం --వైఙాసత్య 05:36, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఔను, మీరన్నది నిజమే. తనిఖీ చెయ్యాల్సినవి ఇంకా దాదాపు రెండువేల దాకా ఉన్నట్టున్నాయి. వాటి సంగతి చూడాలి. __చదువరి (చర్చరచనలు) 05:58, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం

మార్చు

తెవికీలో విశేషవ్యాసాల స్థాయిలో ఉన్న వ్యాసాలు వేళ్లమీద లెక్కించవచ్చు. ఇదివరకు విశేషవ్యాసాలుగా ప్రదర్శించిన వ్యాసాలలో చాలామటుకు వ్యాసాలు అసమగ్రమైనవే.కాబట్టి మనం కొంత అభివృద్ది చెందే వరకు మొదటి పేజీలో విశేష వ్యాసాల స్థానే ఈ వారం వ్యాసం పెట్టె కావలని పైన ఒక ప్రతిపాదనలో చర్చించటం జరిగింది. ఇలా ఒక మాదిరి అభివృద్ధి చెందిన వ్యాసాన్ని ప్రదర్శిస్తే చాలామంది దాని మీద పనిచేసే అవకాశం ఉంది. ఉదాహారణకు సుడోకు వ్యాసం మొదటిపేజీలో ప్రదర్శించిన తర్వాత ముందు కంటే చాలా మెరుగైంది. ఇది విశేషవ్యాసాల అభివృద్ధికి ఏ మాత్రం రిప్లేస్‌మెంట్ కాదు అనుబంధకం మాత్రమే. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా నేను ఒక ఈ వారం వ్యాసం పద్ధతిని తయారు చేశాను. ఇది చరిత్రలో ఈ రోజు మూస లాగా ఆటోమేటికగ్గా పనిచేస్తుంది. మన మందుగా ప్రదర్శించిన వ్యాసాలను జాబితాలో చేర్చితే ప్రతి వారం ఒక కొత్త వ్యాసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్రింది పేజీలను చూసి మీ సలహాలు, సూచనలు, ఆమోదాలు తెలియజేస్తే మొదటిపేజీలో ప్రదర్శించవచ్చు.

--వైఙాసత్య 05:52, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే! --వీవెన్ 06:02, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బావుంది. ఎలాంటి వ్యాసాలను చేర్చాలి? ఒక స్థాయి చేరిన వాటినా లేక, ఆ స్థాయికి చేర్చదలచిన వాటినా? రెండో రకం వాటిని కూడా ఈ జాబితాలో చేర్చితే కనీసం ఓ రెండు వారాలు సమయం ఉండేలా చూడాలి, వ్యాసాన్ని మెరుగుపరచేందుకు. అలాగే, అలా మెరుగుపరచాల్సిన వ్యాసాలను ప్రముఖంగా ప్రదర్శించాలి; సభ్యులు వాటిమీద శ్రద్ధ పెట్టేలా! __చదువరి (చర్చరచనలు) 06:18, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక స్థాయిని చేరిన వ్యాసాలే అని నేననుకున్నాను. మరీ మొలకలను చేర్చలేం. సమాచారమున్నా అస్తవ్యస్తంగా ఉన్న వాటిని కూడా చేర్చలేం. మంచిఅయ్యేది స్థాయి వ్యాసాలైతే సరిపోతుంది. వీటిలో కొంత సమాచారముంటి కానీ సమగ్రం కాదు. ఉదాహరణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి అంతర్వేది వరకు. అలాగని వీటికంటే అభివృద్ధి చెందిన వ్యాసాలను చేర్చకూడదనికాదు. విశేషవ్యాసాలేవైనా తయారవుతే వాటినీ చేర్చవచ్చు. ప్రధానంగా విశేషవ్యాసాలను, ప్రదర్శిత వ్యాసాలను వేరుచేయటానికి ప్రయత్నిస్తున్నా. ఉదాహరణకి గోదావరి ప్రదర్శిత వ్యాసమేకానీ విశేషవ్యాసంగా పరిగణించటం అనుచితం. ఇక మెరుగుపరచాల్సిన వ్యాసాలను చేర్చి రెండు వారాల పాటు కూడా ప్రదర్శంచవచ్చు. లేకపోతే ఈ వారం సమైక్యకృషి అని మొదటి పేజీలో ఒక డబ్బా పెట్టి అందులో మెరుగుపరచాల్సిన వ్యాసాలను ఇలాగే ప్రదర్శిద్దామా? మొత్తానికి లక్ష్యం వ్యాసాలను మెరుగుపర్చటంతో పాటు సందర్శకులకు ప్రతివారం కొంత తాజా సరుకు చూపించటమే. ఒక స్థాయి వ్యాసాలు తెవికీలో చాలానే ఉన్నాయికానీ అవి మెలకల్లో మునకలేస్తున్నాయి --వైఙాసత్య 06:39, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పద్దతి చాలా బాగుంది. దీనికి నేను కూడా ఓఖే. నిజంగా చెప్పాలంటే..తెవికీలో సొంతంగా విస్తరణ చేయబడిన విశేష వ్యాసాలు ఒక్కటి కూడా లేవు (ఆంగ్ల వికీతో స్థాయితో పోల్చుకుంటే). ఈ వారం వ్యాసం అనటం చాలా సముచితముగా ఉంది. నేటి వారపు వ్యాసాలే రేపటి విశేష వ్యాసాలౌతాయని ఆశిద్దాం --నవీన్ 06:44, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే చేద్దాం. __చదువరి (చర్చరచనలు) 06:45, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
సమిష్టికృషి వ్యాసం కూడా మొదటి పేజీకి చేర్చుదామా? ఏమంటారు? --వైఙాసత్య 06:48, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మొదటి పేజీకి చేర్చే బదులు పందిరి కిందే ఉండనిచ్చి, రచ్చబండలో కూడా పెడితే ఎలా ఉంటుంది?. __చదువరి (చర్చరచనలు) 07:15, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ఆలోచన బాగుంది. దాన్ని ఒక మూసలాగా తయారు చేస్తే సభ్యులు తమ సభ్య పేజీలలో కూడా అతికించుకునే అవకాశం ఉంటుంది --వైఙాసత్య 07:19, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
రవి గారు , చదువరి గారు ఒకే ఒకే అనుకోంటే ఎలా..ప్రదీప్ గారు ,కాసుబాబుగారు, వీవెన్ గారు ,శ్రీనివాస్ గారు, నవీన్ గారిని కూడా అభిప్రాయాన్ని చెప్పించిడానికి ప్రేరేరించాలనుకోంటా. వైజా సత్యా గారి ఐడియా చాలా బాగుంది. ఒక మాదిరిగా అభివృద్ది చెందినవి, మంచి మూలాలుగా ఊన్న వాటినే ఆ చెట్టాలో ఉంచాలని నా అభిప్రాయం. *సభ్యుడు:వైజాసత్య/ఇసుకపెట్టె3/ఈ వారపు వ్యాసం జాబితా - అన్ని వారాల జాబితా, సభ్యుని పేజిలో పెట్టుకోవడానికి బాగుంటుంది. కాని ఒకే భయం ఏమిటంటె సభ్యులు తమ కాలాన్ని అంతా ఈ వ్యాసాల మీదే వెచ్చి మిగిలిన వ్యాసాలను నిర్లక్షం అవుతుయౌ అని సం దేహం. ఆ చిట్టాలో అన్ని విషయాలకు సంబంధించిన వ్యాసాలు ఊండాలి, నేను చెప్పదలచినది సభ్యులకు అర్థం అయ్యిందని భావిస్తున్నాను..--మాటలబాబు 10:26, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాలను ఎవరైనా ఎంపిక చేయవచ్చు. ప్రతిపాదించవచ్చు. ఒక వ్యాసం ఈ వారం వ్యాసంలో ప్రదర్శింపదగినదిగా ఉంటే దాని చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూస తగిలించండి చాలు --వైజాసత్య 16:58, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సాంప్రదాయక తిధులు

మార్చు

చైత్ర శుద్ధ అష్ఠమి‎ మొదలైన సాంప్రదాయక తిధులకు ఆంగ్ల రోజులగా పేజీలు సృష్టించాలన్న మీ ఆలోచన బాగుంది. కాకపోతే ఇవి ఎంతవరకు అర్ధవంతమైన పేజీలుగా మనగలుగుతాయోనని నా అనుమానం. అన్ని పేజీలు సృష్టించేముందు మిగిలిన సభ్యుల అభిప్రాయము కూడా తీసుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడ ఏదైనా రాయటానికి ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు కానీ ఇది సలహా మాత్రమే. తెలుగు వికీ ఇలాగే మరిన్ని మంచి ఆలోచనలతో తోడ్పతారని ఆశిస్తున్నా --వైజాసత్య 06:10, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదములు,

మనలో చాలామందికి తెలుగు సాంప్రదాయ తిథులు తెలుసు. కానీ దీనిని ఇంగ్లీష్ లో లాగ సర్వసాధారణం అవాలి అని నా అభిప్రాయము. దానికి ఇది చిన్న ప్రారంభం. మీకు నా అభిప్రాయం నచ్చిందా. అయితే వీలయినంత సహాయం చెయ్యండి.Rajasekhar1961 06:22, 25 జూన్ 2007 (UTC)Rajasekhar1961[ప్రత్యుత్తరం]

ఇవన్నీ కేవలం ఫ్రేంవర్కు వ్యాసాలే కాబట్టి ఒక బాటును ఉపయోగించి 10 నిమిషాల్లో సృష్టించవచ్చు కానీ ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు అర్ధం కావటం లేదు. మచ్చుకు ఒక వ్యాసాన్ని సమాచారంతో పూరించి చూపించండి --వైజాసత్య 06:43, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీలను placeholdersలాగా ఉంచేయవచ్చనుకుంటా, ప్రతీ పేజీలోనూ ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాల జాబితాలో ఎన్నో సంవత్సరంగా వస్తుందో రాయవచ్చు. తరువాత పురాణాలలో ఈ సంవత్సరంలో జరిగిన విశేషాలుంటే రాయవచ్చు. అలాగే ఆ సంవత్సరానికి అదే పేరును ఎందుకు పెట్టారో కూడా రాయవచ్చు. ఇక్కడి నుండి ఆంగ్ల సంవత్సరాలకు కూడా లింకులు ఇవ్వవచ్చు. కృష్ణుడు మొదలయిన వారి పుట్టుక వివరాలు ఈ సంవత్సరాలలోనే పేరంటారు, వాటిని ఆంగ్ల సంవత్సరాలలో రాయలేము, అవికూడా ఇక్కడ చేర్చవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:19, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి నేను తిదులను సంవత్సరాలుగా భావించాను. కానీ తిదులకు కూడా పైన ఉన్న నా అభిప్రాయం వర్తిస్తుందని అనుకుంటున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:24, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సలహాకు ధన్యవాదములు,

మీరు దయచేసి ఈ ప్రేంవర్కు వ్యసాల్ని అన్ని తెలుగు నెలలకు, తిథులకు తయారు చెయ్యాండి. ఇంగ్లీష్ కాలండర్ లాగే మనం అందరం (తెలుగు వారు) ఈ కాలెండర్ వాడుతుంటే అది చాలా ఉపయోగము. ఇది మీరు తెలుగు వికీపీడియాలో తయారు చేసిన గ్రామముల మాదిరిగా ఒక మూలస్తంభము అవుతుంది. నేను పుట్టినరోజు తెలుగు కాలెండర్ ప్రకారము జేష్ట శుద్ధ త్రయోదశి నాడు జరుపుకుంటాను. నాలాగే కొంత మంది ముందు తరాలవారు ఎక్కువగా ఇలా తెలుగు పద్ధతిలో వారి జీవితములో ముఖ్యమైన సంఘటనలు జ్ఞాపకము చేసుకుంటారు. మీ కుటుంబంలో పెద్దవారితో చర్చించండి. 60 సంవత్సరాల చక్రం కూడా దీనిలో ఇమడ్చగలిగితే మనం చాలా సాధించినవారు అవుతాము. ఇది ఏ ఇతర భారతీయ భాషలో ఇంతవరకు ప్రయత్నించలేదు. పురాతన భారతగ్రంధాలలో గొప్ప గొప్పవారి పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇందులో చేర్చవచ్చు.

ఈ విషయం గురించి మిగిలిన వారితో చర్చించండి.Rajasekhar1961 07:25, 25 జూన్ 2007 (UTC)Rajasekhar1961

పానకంలో పుడకల గా, నాదో సలహా

నేను ఆంధ్రప్రదేశ్ పుణ్య క్షేత్రాల ప్రాజెక్టు లొ పాలు పంచుకొంటున్నాను. ప్రతి దేవాలయానికి పండుగలున్నాయి కాద, నేను ఏమి చేశాను అంటే పండుగలతిథులకు ఒక ఇంకు ఇచ్చను, మాసానికి ఒక లింకు, తరువాత్ తిధి ఒక లింకు. ఉదాహరణకు-- చైత్ర మాసం లో ని పండుగలు అన్ని ఒకచోట వచ్చేటట్లు, అలాగే పాడ్యమి తిధులవన్ని ఒకచోట వచ్చేటట్లు. ఇది నాలసహ, ఇలా ఐయే ఒక పేజి సుమారు గా నిండు తుంది. చైత్రశుద్ధ పాడ్యమి అంటె అన్ని ఎక్కువ సంఘటనలు ఉండాక పోవచ్చని నాఅభిప్రాయం. రాజశేఖర్ గారు మీరు ఈ సంవత్సరం పుట్టిన రొజు రెండు సార్లు జరుపుకొంటున్నారా ( జేష్ఠ మాసం రెండు సార్లు వస్తోంది. అధిక మాసం క్రింద) --మాటలబాబు 10:45, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సరే అలాగే ఈ తిధుల పేజీలు, తెలుగు నెలలకు, తెలుగు సంవత్సరాలకు పేజీలు సృష్టిద్దాం --వైజాసత్య 16:46, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విషయంలో మీతో విభేదిస్తున్నాను.

నెలకి ఒక పేజీ చొప్పున=12; తిథికి ఒక పేజీ చొప్పున=15-16; సంవత్సరంకి ఒక పేజీ చొప్పున=60

ఇది శాస్త్రీయమయిన పద్ధతి కాదు. ఇంగ్లీషు క్యాలెండర్ పద్ధతిలో తయారు చెయ్యడము మంచిది. The scope of application is more than in English calender. because the hindu calender is ancient and very long. ఇక తయారు చెయ్యడము ఎలాగో ఆలోచించండి. ఎన్ని సంఘటనలు, ఎందరి జన్మదినాలు, మరణాలు లేదా పండుగలు ప్రతి రోజూ ఉంటాయని ఊహించలేము.దేనినయినా ముందుకు నడిపీంచేది తెలుగువారయిన మనమందరము.Rajasekhar1961 17:47, 25 జూన్ 2007 (UTC)Rajasekhar1961[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు చాలా సంతోషం, విభేధించేవారితో తర్కించడం అంటె నాకు భలే సరదా.మీ ఆలోచన బాగుంది, కాని కార్యాచరణం లొ పెట్టడం కష్టం, దేవత కార్యలకు సంబంధించిన సంఘటనలు తెలుగు క్యాలండరు ని అననుసరించి జరుగుతున్నాయి. కాని ఒక వంతెన నిర్మాణం గాని లేక శంఖుస్థాపన గాని తెలుగు క్యాలండర్ అనుసరించి జరిగినా తరువాత సంవత్సరం నుండి ఆంగ్ల్ క్యాలండర్ ప్రకారం గుర్తు పెట్టు కొంటున్నారు.. మీరు నేను తప్పితే పుట్టిన రోజులను తెలుగు క్యాలండరు ప్రకారం గుర్తు పెట్టుకొనేవారు తక్కువ, అందుకని పాడ్యమి రోజు అన్ని మాసాలనుండి వచ్చే పండుగలు అన్ని ఒకచోత రాద్దాం, ఒక మాసం లో వచ్చే పండుగలు అన్ని ఒకచోట రాద్దం, సంవత్సరాలకు పేజిలు అవసరం లేదని అనుకొంటున్నాను. ఇంతకఇ మీరు అధిక జేష్థమాసం లొ పుట్టిన రోజు జరుపుకొన్నారా. నేను మరచి పోయాను మా అమ్మ గారు కూడా ఆవిషయాన్ని నాకు చెప్పడం మరచారు.పుట్టిన రోజు మళ్ళి జూలై లొ వస్తోంది లెండి --మాటలబాబు 18:14, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఇలా అనుకున్నాను..సరిగా వ్యక్తపరచినట్టు లేను. క్షమించాలి. నేననుకున్నది ఏంటంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుండి ఫాల్గుణ బహుళ పౌర్ణమి వరకు = 300+ పేజీలు, మాసాలు =12, సంవత్సరాలు = 60. ఇది కాకుండా మీరంకెలా అనుకుంటున్నారు? ఇక సంవత్సరాలు 60 అనే ఎందుకంటే తెలుగు సంవత్సరాలు సైక్లికల్ సంవత్సరాలు అందునా మనవాళ్లు ఇది 40వ సైకిల్, 42వ సైకిల్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టినట్టు లేదు. పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు అని నేను అనుకుంటున్నాను. --వైజాసత్య 18:27, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అన్ని పేజిలు సృష్తించవచ్చు తప్పు లేదు వాటిలో అంత ఎక్కువ సమాచారం ఉంచగలమ్ని నేను భావించడం లేదు, నేను అనేది ఏమిటంటే 16 తిధుల కు 16 పేజిలు(పాడ్యమి-పౌర్ణమి మరియు అమావాస్య), 12 మాసాలకు 12 పేజిలె అంతే.మెత్తం 28 పేజిలు. పాడ్యమి పేజి లొ అన్ని మాసాల విశేషాలు.. మాసాల పేజిలో అన్ని తిథుల విషయాలు , విషయాలు డూప్లికేట్ అవుతాయి.నేను అన్న ప్రకారం వ్రాస్తే విషయం సరిపడ చేకూరుతుంది--మాటలబాబు 18:53, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈమెయిలు ద్వారా "ఈ వారం వ్యాసం"

మార్చు

మనం ప్రతీ వారం మొదటి పేజీలో ఉంచే ఈ వారం వ్యాసాన్ని ఈమెయిలు ద్వారా అందుకోగలిగే సౌకర్యం ఇస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఈమెయిలు వ్యవస్తను నిర్వహించడం పెద్ద కష్టమయిన పని కూడా కాదు. దీని వలన మనం వికీలో ఉన్న వ్యాసాలను సభ్యులు కానివారి చేత కూడా proactiveగా చదివించటానికి కృషిచేసినట్లవుతుంది. ప్రయోగాత్మకంగా teluguwiki గుంపుకు ఈ వ్యాసాలను పంపి చూడవచ్చు. అంతేకాదు పొద్దులో, కూడలిలో, తెలుగుబ్లాగర్.కాంలో ఇంకా వీలయితే ఈమాటలో కూడా ఈ వారం వ్యాసానికి లింకు చేర్పించగలిగితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:53, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు ఇంగ్లీషు వికీ నుండి ఇలా వస్తూనే ఉంటాయి, వారు ఎలా చేసినారో చూస్తే మనము కూడా ఫాలో అవ్వ వచ్చు. Chavakiran 06:20, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆలోచన అద్భుతంగా ఉంది --వైజాసత్య 06:27, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతి సభ్యుడి ఇ-మైలు కి ఈ వారం వ్యాసం చేరుతుందా... నా ఇ-మైల్ కి ఇంతవరకు చేరలేదు. ప్రతి సభ్యుడి ఈ-మైల్ కి విశేషంగా ఉన్న వ్యాసాలు పంపితే స్తుప్తావస్థ లొ ఉన్న సభ్యులలొ ఉత్సాహం పెరుగుతుంది --మాటలబాబు 01:31, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికీ చేరే సదుపాయమేదీ లేదు. అందరి మెయిల్ అడ్రసులు ఎవరికీ తెలియవు. కేవలం స్వాగత సందేశంలో ఒక మెయిలింగు లిస్టు లింకు ఇచ్చారు చూడండి. దానికి నమోదు చేసుకున్నవాళ్ళకే వస్తుంది. --వైజాసత్య 03:00, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
స్వాగత సందేశంలో ఉన్న మెయిలింగు లిస్టుకు కూడా పంపించటం లేదు, ఆ మెయిలింగు లిస్టుతో ఏదో సమస్య ఉంది. మనం పంపించే మెయిలు కాంటెంటు మరీ ఎక్కువ ఉంటే అది అంగీకరించటం లేదు. announce only గుంపు ఒక దానిని సృష్టిద్దామని అనుకుంటున్నాను. ఈవారం వ్యాసం ఈ-మెయిలు కావలిసిన వాళ్ళందరూ అందులో చేరతారు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:13, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భోగోళీక వ్యాసాల పేర్లు

మార్చు

ఉదాహరణ కు చిత్తూరు తీసుకొందాం ఇది జిల్లా ను మరియు పట్టణం, అప్పుడు ఈ పేరు మీద నిజం చెప్పాలంటే రెండు వ్యాసాలు ఉండాలికదా... ప్రస్తుతానికి ఒక పేజి మాత్రమే ఉన్నట్టు ఉంది,జిల్లా వ్యాసం మొదలు లొనే చిత్తురు పట్టణానికి లింకు ఇది అని, పట్టణ వ్యాసం మొదలులొ జిల్లా వ్యాసానికి లింకు ఇది అని వ్రాయాలేమో--మాటలబాబు 01:31, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అలా జిల్లాకు పట్టణానికి వేరు వేరు పేజీలు ఉండాలి..భవిష్యత్తులో ఉంటాయి..కానీ ప్రస్తుతం అసలే సమాచారం తక్కువున్న పేజీల్ని అక్కడా ఇక్కడా పరిస్తే (ఒకటి రిండండెన్సీ ఎక్కువవుతుంది. రెండవది ఉన్న సమాచారాన్నెతుక్కోవటానికి 3-4 పేజీలు తిరగాలి ఉదాహరణకు చిత్తూరు జిల్లా, చిత్తూరు, చిత్తూరు మండలం, చిత్తూరు మున్సిపాలిటీ, చిత్తూరు లోకసభ నియోజకవర్గం, చిత్తూరు శాసనసభ నియోజకవర్గం వగైరా. ఈ జిల్లా పేజీల్లో సమాచారం చాలా ఎక్కువై విభజనలు ఆలోచిస్తున్నప్పుడు ఎన్ని పేజీలు చేయాల్సింది ఆలోచిద్దాం అని నా ఆలోచన --వైజాసత్య 03:07, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

announcements group

మార్చు

నేను ఇప్పుడే "tewiki-maiku" అనే ఒక గుంపును నిర్మించాను. ఈ గుంపులో కేవలం గుంపు నిర్వాహకులు మాత్రమే టపాలు పంపించేటట్లుగా తయారు చేసాను. "tewiki-maiku-subscribe@googlegroups.com" అనే చిరునామాకు ఒక టపా పంపితే ఎవరయినా సభ్యులయిపోవచ్చు. ఇక నుండీ ఈ వారం వ్యాసాన్ని ఈ గుంపు ద్వారా (మాత్రమే) పంపిద్దామని అనుకుంటున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:33, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మన భాషను బ్రతికించుకుందాం

మార్చు

ఎంతమంది భాషాభిమానులు ఎన్ని విధాల ప్రాదేయపడినా, ప్రభుత్వాలు ఎన్ని మారినా, నిర్వీర్యమైపోతున్న తీయని తెలుగు భాషను పునరిద్ధరించేందుకు నడుం బిగించిన వారు కరువయ్యారు, తన నపుంసక సంతానాన్ని చూసి తెలుగు భాషామతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

తెలుగు మాట్లాడేందుకు సిగ్గు, చదివేందుకు నామోషి, ఎందుకీ దుస్తితి? ఎవరు కారణం?

మనకున్న కొద్ది అవకాశాలను ఉపయోగించుకొని భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపి కొనఊపిరితొ ఉన్న మన భాషామతల్లిని రక్షించుకొనే భాధ్యత ప్రతి తెలుగు వాడిదీ, ఈ వికీ పీడియా మనకు కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించికొని మనం చెయ్యగలిగిన దేమిటో ఆలోచించి తెలుగువారంతా ఒక్క త్రాటిపై నిలిచి మన భాషను బ్రతికించుకుందా.... ఈ ప్రతిపాదన సమ్మతించి మీ యొక్క ఆలోచనలను తెలియచేయగలరని ఆశిస్తూ

మహాదేవ్

== sarpavaram charitra == సర్పవరం చరిత్ర

సర్పవరం తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడరూరల్ మండలం లోని గ్రామము ఈ గ్

50,000కు ముందు

మార్చు

తెలుగు వికీ ఆరోగ్యకరంగా ముందుకు సాగుతున్నది. వికీ శ్రామికులకు నా అభినందనలు. 50,000 వ్యాసాలను త్వరలోనే చూస్తామనిపిస్తుంది. పట్టు విడవకండి. 50వేలుకు ముందు, ప్రధానంగా నాణ్యతను పెంచే దృష్టిలో, కొన్ని చేయవలసిన పనులను సూచిస్తున్నాను.

  1. వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు ప్రాజెక్టు - పటిష్టంగా వర్గీకరణ జరిగినవాటిలో ఇది ఒకటి. ఇతర వనరులనుండి కాపీ లాగా కాకుండా తెలుగు వికీకి ప్రతిష్టాత్మకంగా రూపొందగల అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉంది. ఇప్పుడు ఇందులో ప్రగతి నామమాత్రంగానే ఉన్నది. అయినా నిరుత్సాహం వలదు. వీలు దొరికినప్పుడల్లా క్రొత్తవారిని తమతమ గ్రామాల గురించిన వ్యాసాలు వ్రాయమని పోరండి.
  2. వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు ప్రాజెక్టు - కొంత కాలం పరుగులెత్తిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిదానించింది. (నవీన్ ఇప్పుడు స్వకార్యాలపై బిజీగా ఉన్నట్లున్నాడు). మీరు టీవీలో ఏదైనా సినిమా చూసినప్పుడల్లా ఆ సినిమా వివరాలు ఇక్కడ వ్రాస్తూ ఉండండి. మీ వూళ్ళో సినిమా పోస్టర్లు ఫొటో తీసి "ఫెయిర్ యూజ్" క్రింద ఆ యా పేజీలలో అతికించండి.
  3. వికీపీడియా:WikiProject/ప్రపంచదేశాలు ప్రాజెక్టు - ఇందులో మొదటి మెట్టుగా ఇప్పుడు దేశాల జాబితాల జాబితాను తయారు చెస్తున్నాను. ఒకో దేశానికీ ఒకో వ్యాసమైనా చేయాలి. అంటే షుమారు 250 - 300 వ్యాసాలు. ఒక్కో సభ్యుడినీ కనీసం రెండు వ్యాసాలు అనువదించమని కోరుతున్నాను.
  4. అక్షర దోషాలు - చదువరి, శాస్త్రి ఈ విషయాలపై అధిక శ్రద్ధ చూపుతున్నారు. - అందరికీ విన్నపం. ఎక్కడైనా దోషాలు కనిపిస్తే పోనీలే అని వదల వద్దు. దిద్దండి.
  5. వికీపీడియా:WikiProject/పుస్తకాలు - క్రొత్తగా మొదలు పెట్టవలసిన ప్రాజెక్టు. ఇందులో తెలుగు లేదా ఇతర భాషలలోని రచనలనుగురించిన వ్యాసాలు వ్రాయాలి. - శ్రీ మదాంధ్ర మహాభారతం, మను చరిత్రము, కన్యాశుల్కం, సుమతీ శతకం, పాండవోద్యోగ విజయములు, బుడుగు, చివరకు మిగిలేది, మహా ప్రస్థానం, పురాణ వైర గ్రంధమాల, అమరావతి కధలు, తులసి దళం, రత్తాలు-రాంబాబు, చక్రనేమి, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, మహాంధ్రోదయం - ఇలా ఎన్నో రచనలను గురించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టులో భాగంగా చేయవచ్చును. మాటల బాబూ! శాస్త్రీ! - ఎవరైనా ముందుకు రాగలరా?.
  6. బొమ్మలు - వికీలో ఉచిత లైసెన్సు గల బొమ్మల కొరత స్పష్టంగా ఉన్నది. ఈ సారి మీవూరు వెళ్ళినపుడు స్కూటరుపై మీ మిత్రునితో ఏదైనా దారిలో వెళుతుంటే, ప్రతివూరికీ ఒకో ఫొటో తీసి ఆయా వూరి వ్యాసాలలో ఎక్కించండి.
  7. వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు: ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు కింద కొన్ని వ్యాసాలు వచ్చాయి. సభ్యులు ఇందులో చురుగ్గా పాల్గొంటే మంచి ప్రాజెక్టు కాగలదు. తెవికీలో తప్ప మరెక్కడా ఇంత విస్తృతంగా దొరకని వ్యాసాలవి.

చెప్పడానికి చాలా ఉంది. మీకు తెలియదని కాదు. అయినా "రచ్చబండ"లో అనదగును. వినదగును - --కాసుబాబు 08:24, 29 ఆగష్టు 2007 (UTC)

వినదగు కాసుబాబు చెప్పిన!:) మంచి విషయాలు చెప్పారు కాసుబాబు గారూ!
3. ప్రపంచదేశాల ప్రాజెక్టులో నా వంతు కృషి నేనూ చేస్తాను.
4. వ్యాసాల్లో అక్షరదోషాలు ఎక్కువగా ఉండి, నాణ్యతాపరంగా ఉన్నతంగా ఉండడం లేదు. అంచేత నాదొక సూచన. కొందరు సభ్యులు కలిసి ఒక దళంగా ఏర్పడి ఈ అక్షరదోషాలను తొలగించడాన్ని ఉద్యమం లాగా చేపట్టాలి. దోషాలను తొలగించడం పట్లే కాకుండా, వాటిని నివారించడం పట్ల, దోషాలు రాయకుండా సభ్యులకు సూచనలివ్వడం పట్లా నడుం కట్టాలి. ఎన్వికీలో ఇలాంటి దళాలుంటాయి. (క్లీనప్ అనే దళంలో వైజాసత్య సభ్యుడిగా ఉన్నాడు.) తెవికీలో చురుగ్గా ఉన్న సభ్యులంతా ఈ దళంలో చేరితే బాగుంటుంది.
5. పుస్తకాల ప్రాజెక్టులోనూ నన్ను ఒక సభ్యుడిగా వేసుకోవచ్చు.
6. ఈ మధ్య నాకూ ఇలాంటి ఆలోచనే వచ్చి మా ఊరి ఫోటోలు కొన్ని చేర్చాను. మీ సూచన పాటించి, ఇతర ఊళ్ళ ఫోటోలు కూడా సంపాదిస్తాను.
7. నేనెప్పుడో మొదలెట్టిన జలవనరులు ప్రాజెక్టు ఆగిపోయింది. దాన్ని కూడా మీ జాబితాలో చేర్చాను. సభ్యులు దానికీ ఒక ఊపు ఇవ్వగలరని ఆశిస్తాను.__చదువరి (చర్చరచనలు) 10:00, 29 ఆగష్టు 2007 (UTC)
పెద్ద ఎత్తున గ్రామాల వ్యాసాలు జోడించే పనులు దాదాపు అయిపోయినట్లే (ఒక 300 తనిఖీ చెయ్యాల్సిన పేజీలు తప్ప). కాబట్టి 50,000 చేరటానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈలోగా వ్యాసాలన్నింటినీ వర్గీకరించి బేరీజు వెయ్యటం, అక్షర దోషాలు దిద్దటం, వ్యాసాలను శుద్ధి (క్లీనప్) చెయ్యటం, మిగిలిన ప్రాజెక్టులతో పాటు వీలైనన్ని గ్రామాల పేజీలను అభివృద్ధి పరచటం చెయ్యటానికి మంచి సమయం.
వికీ నిర్వహణకు చదువరి అన్నట్టు ముఖ్యంగా మూడు దళాలు సృష్టించుకుందాం భాష మెరుగుపరచే దళం, వికీకరించి శుద్ధిచేసే దళం (ఎన్వికీలోని క్లీనప్ దళం లాగా), వ్యాసాలను బేరీజు వేసే దళం.
ప్రదీపు, నేను కలిసి గ్రామాలకు గణాంకాలు చేర్చే పని చేపడతాం..బేరీజు వేయటంలో, శుద్ధి చేయటంలో ఇంకా ఇతర ప్రాజెక్టులలో తగిన సహాయం తెయ్యగలను. (వివిధ ప్రాజెక్టులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో సమీక్షిస్తూ..ఒక దీర్ఘ ప్రణాళిక త్వరలో రాస్తాను..మీరు రాసినా సరే) --వైజాసత్య 11:25, 29 ఆగష్టు 2007 (UTC)

ప్రతిపాదన

మార్చు

ఫైర్ ఫాక్స్ ని జ్వాలాజంబుకి అనవచ్చునా?ఇలాంటి సంస్కృతపదాలకు మన తెవికీలో స్ట్హానం వుందా?

ప్రతిపాదన

మార్చు

ఫైర్ ఫాక్స్ ని జ్వాలాజంబుకి అనవచ్చునా?ఇలాంటి సంస్కృతపదాలకు మన తెవికీలో స్ట్హానం వుందా?

ఇక్కడ కొత్తపదాలు (కనీసం వ్యాసాల)లో ప్రయోగించకూడదు. సర్యజనామోదమై అచ్చులో (పత్రికలలో వగైరా) ఉపయోగిస్తుంటే తప్ప ఇక్కడ ఉపయోగించకూడదు. ప్రస్తుతానికి ఇక్కడ ఫైర్‌ఫాక్స్ అనే అందాం. భవిష్యత్తులో పరిస్థితి మారితే అప్పుడు పునరాలోచించవచ్చు. (ఇక లీగల్ గా ఫైర్‌ఫాక్స్ అనేది నమోదైన ట్రేడ్ మార్క్. అటువంటి వాటిని అనువదించకూడదు) --వైజాసత్య 17:47, 12 అక్టోబర్ 2007 (UTC)


మార్చు

తెలుగువికీ మొదటి పేజీ లో ఉన్న మార్గదర్శినిలో అర్థశాస్త్రానికి ఎలాంటి లింకు లేదు, దయచేసి ఏర్పాటుచేయగలరు.

అర్థశాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు కన్పించడమ్ లేవు. సామాజిక శాస్త్రాలలొ అర్థ శాస్త్రము అతి ముఖ్యమైనప్పటికిని ఇప్పటివరకు తెలుగువికీ లో ఉన్న 37 వేలకు పైగా వ్యాసాలలో పేదరికం, నిరుద్యోగం, పారిశ్రామిక ప్రగతి, పంచవర్ష ప్రణాళికలు, బడ్జెట్, వ్యవసాయ ప్రగతి లాంటి అందరికీ ఉపయోగపడే వ్యాసాలు అలాగే డిమాండ్, సప్లై, మార్కెట్ సిద్ధాంతాలు, సాంప్రదాయ, నవ్య సాంప్రదాయ సిద్దాంతాలు, స్థూల అర్థశాస్త్రం, ఆర్థిక వృద్ధి సిద్దాంతాలు, ఆర్థిక వేత్తల సమాచారం మొదలగు వ్యాసాలు చేర్చుటకు మంచి అవకాశముంది. కాబట్టి అర్థశాస్త్రంలో వ్యాసాలు చేర్చుటలో సబ్యులు చాలా కృషిచేయవలది ఉంటుంది. నా వంతు కృషి నేను చేస్తాను.

చాలా మంచి ఆలోచన, మొదటి పేజీలో వ్యాసపుష్టి గల వర్గాలనే చేర్చాము. ఆర్ధిక శాస్త్ర వ్యాసాలు కూడా పెరుగితే, ఆర్ధిక శాస్త్రాన్ని చేర్చుతాము --వైజాసత్య 01:52, 25 అక్టోబర్ 2007 (UTC)

Deleting our essays & stories by others is possible in wikipedia...

మార్చు

సభ్యులు వ్రాసిన వ్యాసాలు ఇతరులు తొలగించుటకు వీలులేకుండా చేస్తే బాగుంటుంది. చేర్పులు,సూచనలు,అబ్యర్దనలు,మాత్రమే ఉండాలి. తొలగింపులు,మార్పులు ఉంటే కొన్నాళ్ళకు తెవికీ లో మంచి అంతాపోయి చెడుమాత్రమే మిగిలే ప్రమాదము ఉందికదా? నెట్ లో అకతాయిలు ఎక్కువగా ఉన్నారు. డియర్ మెంబర్ మీఅభిప్రాయం ఏమిటో?

వికీపీడియాలో వ్రాసినవి శాశ్వతముగా ఉంటాయి. ఎవరైనా ఆకతాయి తొలగించినా వెంటనే ఒక మౌసు క్లిక్కుతో పునఃస్థాపించగలం. అయినా పేజీని తొలగించే అధికారము కేవలం నిర్వాహకులకే ఉన్నది. అలా ఒక నిర్వాహకుడు చేసినా సబబు కాదనిపిస్తే మరో నిర్వాహకుడు పునస్థాపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిశ్చింతగా మీరు వికీపీడియాలో వ్రాయవచ్చు--వైజాసత్య 01:58, 25 అక్టోబర్ 2007 (UTC)

మొదటి పేజీ సుస్వాగతం

మార్చు

వికీపీడియా:మొదటి పేజీ సుస్వాగతం/1 పేజీలో ఉన్నట్లుగా మొదటి పేజీలోని సుస్వాగతం విభాగాన్ని మారుద్దామని అనుకుంటున్నాను. సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:09, 5 నవంబర్ 2007 (UTC)

పాతదానికంటే కొంచెం మెరుగుగా ఉంది. నేను కొద్ది మార్పులు సూచించాను. పరిశీలించగలరు. --కాసుబాబు 14:17, 5 నవంబర్ 2007 (UTC)
ఇప్పుడు ఇంకా బాగుంది. స్వాగత సందేశాన్ని చదివేవారితో మాట్లాడుతున్నట్లుగా ఉంటే ఇంకా బాగుంటుందని అలా రాయటానికి ప్రయత్నించాను. అలాగే వికీపీడియాలో ఊళ్ళ వ్యాసాలు మాత్రమే ఉంటాయేమోననే భ్రమ కలగకూడదని, వారి ఊరు ఉందేమో చూడమనటాన్ని కిందకు జరిపాను. అలాగే స్వాగత సందేశాన్ని ఇంకొంచెం కుదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం, ఎవరయినా సూచనలు ఇవ్వగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:09, 5 నవంబర్ 2007 (UTC)

అసలు ఆ పెట్టెని తీసేస్తే ఎలా ఉంటుంది? శీర్షంలో ఎలాగూ స్వాగతం అన్న లింకు ఉంది కదా. ఇంకా ముఖ్యమైన లింకులు శీర్షంలో కుడివైపున మరియు దిగువన ఉన్నాయి. ఈ సుస్వాగతం పెట్టె స్థానంలో 'ఈ వారం బొమ్మ' పైకి వస్తుంది. ఆ మేరకు మార్గద్శిని కూడా పైకి జరుగుతుంది.—వీవెన్ 07:57, 6 నవంబర్ 2007 (UTC)

తెలుగు వికీపీడియాలో మరీ ఎక్కువ సంఖ్యలో సభ్యులు లేరు. సభ్యుల సంఖ్య ఐదు వేలు, లేదా పదివేలు చేరినప్పుడు ఆ పెట్టెను తీసేయవచ్చు. అప్పటివరకూ దానిని ఉంచటమే మంచిదని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:00, 6 నవంబర్ 2007 (UTC)
వికీ గురించి ఏమీ తెలియని వారు ఇక్కడికి వచ్చినపుడు ఏమనుకుంటారు అని ఆలోచిస్తే.. కాస్త తికమకకు లోనవుతారని నాకు తోస్తోంది. కారణాలివి:
  • మిగతా వెబ్సైట్లలా కాక, ఇక్కడ చదవడంతో పాటు రాయడం కూడా చెయ్యవచ్చు; ఇదో కొత్త విషయం వారికి.
  • 'ఇక్కడ ఎలా రాయాలో తెలుసుకోండి', 'శైలి గురించి తెలుసుకోండి', 'ఇంకా ప్రశ్నలుంటే ఇక్కడ అడగండి' వగైరా లింకులు ఏమిటో, ఇక్కడ ఎందుకున్నాయో ముందు అర్థం కాదు.
అంచేత మనం వికీని చదవడానికి మాత్రమే అవసరమైన సమాచారాన్ని ఒకచోట, రాయడానికి దోహదం చేసే సమాచారాన్ని విడిగానూ ఉంచాలనుకుంటా. అంటే నా ఉద్దేశ్యం.. "వెతకడం ఎలాగా", "ఏది నొక్కితే ఏమొస్తుంది", "వర్గాల ద్వారా వెతకడం", "ఎకౌంటు సృష్టించుకోడం ఎలాగా" వగైరా విషయాలను ఒకచోట చూపించాలి. శైలి, దిద్దుబాట్లు మొదలైన వాటి గురించి విడిగా చెప్పాలి. ప్రస్తుతం చాలా ఎక్కువ విశేషాలను, చాలా క్లుప్తంగా పెట్టామేమోనని నా ఉద్దేశ్యం. విషయాల సంఖ్యను తగ్గించి, లేదా మరింత సరళంగా వర్గీకరించి, వీలైనంత విపులంగా రాయాలని నా ఉద్దేశ్యం. __చదువరి (చర్చరచనలు) 13:40, 6 నవంబర్ 2007 (UTC)


వివిధ అభిప్రాయాలను సమన్వయ పరచడానికి ప్రయత్నిస్తున్నాను.

  • కనీసం పది వేల సభ్యులు అయ్యేంత వరకూ "స్వాగతం" పెట్టెలో ఉన్న విషయాలు మొదటి పేజీలో ఉండాలి.
  • అయితే ఇప్పుడు కొంత సమాచారం మొదటి పేజీలోనే పునరుద్ఘాటించబడుతున్నది. ఇది అనవుసరం. పై భాగం పెట్టెలో (వీవెన్ చెప్పినట్లు) "వికీపీడియాకు స్వాగతం" అన్న పేరా ప్రక్కనే "స్వాగతం" పెట్టెలోని సమాచారాన్ని అమర్చవచ్చును. (ఇప్పుడున్న విషయాలూ (ప్రయోగ శాల, సహాయం వంటివి), "స్వాగతం" పెట్టెలోని విషయాలూ దాదాపు ఒకటే.
  • అప్పుడు ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ ప్రక్క ప్రక్కనే వస్తాయి.
  • పై భాగం పెట్టెను మూడు అడ్డ పెట్టెలు (కాలమ్‌లు)గా విడగొట్టవచ్చును. (1) ప్రధాన స్వాగత సందేశం (2) వికీపీడియా వాడేవారికి (3) వికీపీడియాలో వ్రాసేవారికి - ఇలా చేయడం సాధ్యమే అనుకొంటున్నాను.

నాది మరో సూచన - "మీకు తెలుసా" శీర్షికను మనం మెయింటెయిన్ చేయలేకపోతున్నాము. కొంత కాలం దానిని తొలగించడం మంచిదనుకొంటున్నాను. --కాసుబాబు 07:52, 9 నవంబర్ 2007 (UTC)

(ప్రదీప్ - ఈ చర్చను "మొదటి పేజీ చర్చ" లోకి మార్చ గలవా? - కాసుబాబు)
ఇంకో సూచన మొదటి పేజిలొ స్వాగతం మూసలొ డబ్బాని కొద్దిగా చిన్నదిగా చేయడ్మ్ అవుతుందా?(వెడల్పు తగ్గించి, పొడవు పెంచడానికి)--బ్లాగేశ్వరుడు 18:27, 9 నవంబర్ 2007 (UTC)

about our culture & traditions

మార్చు

మన సంస్క్రుతి గురింఛి తెలుసు కోవడానికి ఆ విషయాలను చర్చించడానికి, వాని గురించి తెలుసు కోవడానికి అవకాశము వుంటె బాగుంటంది. ఈ రోజులలో ఈ విషయం గురించి ఆలోచించేవారు అంత అంతకూ తగ్గిపోతున్నారు.ఈ విషయాలు ఛాందస బావాలని, నేటి తరంవారి భావన. కానీ అందులో యంత విగ్నాన విషయాలు దాగి వున్నాయో ఇప్పటి కైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలని నా అభిప్రాయము.````మాధురీరావ్2007

  • మేమందరమూ చేయడానికి ప్రయత్నిస్తున్నది అదే. మీకేవయినా ముఖ్యమైన విషయాలు తెలిసిన అవి అందరికీ తెలియజేయండి. శాస్త్రీయంగా చర్చించండి. ఇదిక విజ్ఞాన సర్వస్వం. మనం తెలుగువారం కాబట్టి మనకు ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉండడం సబబు.Rajasekhar1961 13:42, 23 నవంబర్ 2007 (UTC)
  • మాధురీరావ్ గారూ!,మీరు వెలుబుచ్చిన అభిప్రాయాలు చాల వాస్తవమే. ప్రస్తుతం మన భాష, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు, మన పండుగలు, కట్టుబాట్లు, నడవడి ఇవన్నీ తెలుకొనే ఓపిక, అవసరం ఈనాటి సమాజంలో మన తెలుగు వారికి కరువైంది. పాశ్చాత్య సమాజంలోని అలవాట్లనే గుడ్డిగా అనుసరిస్తున్నాము. దీంతో వేల సంవత్సరాల చరిత్ర కల మన ఉన్నతమైన సంస్కృతీ, సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి. వీటిని నిలబెట్టే బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి తెవికి లో ఈ అంశాలపై అధిక ప్రాధాన్యత ఇచ్చి విశేష వ్యాసాలను కూర్చి తెలుగు ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం ఒక మహోన్నత కార్యక్రమం. ఈ విషయంలో పరిజ్ఝానం ఉన్న సభ్యులు కృషిచేస్తే సాధించలేనిదేముంది!C.Chandra Kanth Rao 19:48, 23 నవంబర్ 2007 (UTC)

discussion hinduism

మార్చు

నేను చేసిన మొదటి ప్రతిపాదనకు వచ్చిన స్పందన నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. వారికి నా ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొక చర్చాఅంశాన్ని హిందూమతం అన్న వర్గంలో ఉంది.madhuriprakash 07:24, 24 నవంబర్ 2007 (UTC)మాధురీరావు2007 హిందూ మతము గురించి ఎంతగా తెలుసుకున్నా తరగనిది. కాబట్టీ మనము ఎంతయినా దీని గురించి వ్రాయగలము. పూర్తి సహయము అందుతందని ఆశిస్తున్నాను.

నిఘంటువు

మార్చు

నేను అనువాదం చేసేటప్పుడు చాలా సార్లు ఆంగ్ల-తెలుగు నిఘంటువు అవసరమనిపిస్తున్నది. అలాంటిది మనమందరం కలిసి ఒకటి ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని నా ఆలోచన. అలాగే తెలుగు నిఘంటువు కూడా. దీనివల్ల కొన్ని ఏక వ్యాక్య వ్యాసాలను దీనిలో చేర్చే వీలుకలుగుతుంది.

రవిచంద్ర 10:05, 22 డిసెంబర్ 2007 (UTC)

అదే పనికి విక్షనరీ ఉందండి. ఇక బయటి నిఘంటువులకు వికీపీడియా:అనువాదకులకు వనరులు చూడండి. నేను ఎక్కువగా వేమూరి వారి ఆంగ్ల-తెలుగు నిఘంటువు ఉపయోగిస్తుంటాను --వైజాసత్య 17:08, 22 డిసెంబర్ 2007 (UTC)

Bhagavadgeetha

మార్చు

భగవద్గీత హిందువులకు పూర్తి విజ్ఞాన సర్వస్వము. దీని మీద నేను వ్యాసమును రాస్తాను. దీన్ని ఆమోదించండి.

భగవద్గీత పై ఇదివరకే ఒక వ్యాసం ఉందండీ ఒకసారి దానిని చూడగలరు రవిచంద్ర 12:07, 1 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గణాంకాలు

మార్చు

గణాంకాల పేజీలో వికీమీడియాలోని ఆని సైట్ల ట్రాఫిక్ వివరాలు: రోజువారీ, నెలవారీ, సంవత్సరానికి లింకు పనిచేయడం లేదు. ఇదే సమాచారాన్ని అందించే ఇంకొక లింకును ప్రతిక్షేపించండి. ముఖ్యంగా ఒక్క తెలుగు వికీపీడియా సైట్ ట్రాఫిక్‌ను మాత్రమే (మొత్తం వికీపీడియా కాకుండా) వివరించే ఏదైనా లింకు ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేవా/DeVచర్చ 07:00, 4 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పనిచేయని లింకులను సరిచేశాను. తెలియజేసినందుకు ధన్యవాదాలు దేవా గారు. అయితే ప్రత్యేకంగా తెలుగు వికీపీడియా ట్రాఫిక్కు వివరాలు ప్రస్తుతానికి ఎక్కడా లభ్యమవ్వట్లేదు --వైజాసత్య 15:39, 4 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]