వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 7
← పాత చర్చ 6 | పాత చర్చ 7 | పాత చర్చ 8 →
1, 2, 3, 4, 5, 6, 7 |
సేకరించిన పుస్తక సమీక్షలకు సరైన స్థానం వికీసోర్స్
మార్చుఏ భాషా సాహిత్యంలో ఐనా పుస్తక పరిచయాలు/సమీక్షలు, దాదాపుగా ఆయా పుస్తకాలను ఔపోసన పట్టి, ఆ పుస్తకాల సారాంశాన్ని పాఠకులకు అందించి, అందులోని మంచి చెడులగురించి వివరిస్తాయి. పూర్తి పుస్తకం చదవటానికి చాలినంత వ్యవధి లేని పాఠకుడు, ఈ పరిచయాల ద్వారా తను చదవలసిన పుస్తకాలను ఎంచుకుంటాడు.
Wikisource లో ఆసక్తికరమైన, విజ్ఞానపరమైన, కాపీరైట్ హక్కుల సమస్యలు లేనివి ఇంకా హక్కుదారుల అనుమతితో పుస్తకాలు ఉంచే వీలుంది. పుస్తక ప్రియులకు పుస్తకాలెంత ముఖ్యమో, పుస్తక పరిచయాలు అంతే అవసరం. పుస్తక పరిచయం వ్రాయటానికి సమీక్షకుడు ఎంతో శ్రమించి సమీక్షిస్తాడు. వీటికి వికిసోర్స్ లో స్థానం కల్పించవలసిన అవసరం ఉన్నది. ఆంగ్ల వికీ లో ఉన్న నియమాలను స్థానిక భాషల వికీ కు వర్తింపచేయనవసరం లేదని ముంబాయి WikiConference India 2011 సభలో వికీ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ ఉద్ఘాటించాడు. ఏక వ్యక్తి వ్రాసిన పుస్తక సమీక్షలు, రచయితల అనుమతితో, వికీసోర్స్ లో ఉంచాలని ప్రతిపాదిస్తున్నాను. పలువురి అభిప్రాయాలు వ్యక్తమయే వ్యాసాలను ఎప్పటివలే వికీపీడియా లో ఉంచాలి. cbrao 10:23, 23 జనవరి 2012 (UTC)
- ఈ విషయం మీరు వికీసోర్స్ రచ్చబండలో రాసి అక్కడే చర్చించండి. --అర్జున 11:55, 24 జనవరి 2012 (UTC)
- పుస్తకాల ప్రాజెక్టులోనున్న సుమారు 168 పైగా వ్యాసాలు అన్నీ ఇతరుల సమీక్షలే కదా. అవి మాత్రం వికీపీడియాలో ఉంచి కొన్నింటిని వికిసోర్స్ లో ఉంచితే సగటు రచయితకు అర్ధం కావడం కష్టం. ఇప్పుడున్న వ్యాసాల్ని అలాగే వుంచి కొన్ని ప్రత్యేకమైన ఏకవ్యక్తి వ్రాసిన పుస్తక సమీక్షలు మాత్రం రచయిత అనుమతితో వికీసోర్సులో ఉంచడం సబబుగానే ఉన్నది. రచయితతో అనుమతికి సంబంధించిన అనుమతి లాగ్ చర్చా పేజీలో ఉంచడం ఎంతైనా మంచిది. లేకపోతే కాపీహక్కుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.Rajasekhar1961 10:26, 25 జనవరి 2012 (UTC)
- ఈ చర్చను అదనపు సమాచారం తో వికీసోర్స్ లో ఉంచటమైనది. cbrao 13:47, 25 జనవరి 2012 (UTC)
గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి
మార్చుగూగుల్ అనువాద వ్యాసాలు శుద్ది కొరకై తమిళ వికీ వారితో సంప్రదించాను. వారు ఎర్రలింకుల తొలగింపు కొరకు బాటు చేశారు. మన వికీలో కూడా దానిద్వారా సహాయం చేస్తామన్నారు. ఇది చేయకలిగి వాటిలో బాగున్న వాటిని శుద్దిచేసే ప్రాజెక్టు చేపట్టితే సమగ్రవ్యాసాలు చాలా తయారవుతాయి. ఈ రోజు వ్యాసం నడపడానికి కూడా వీలవవచ్చు. అభ్యంతరాలేవైనా వుంటే ఒక వారం రోజులలోతెలపండి, అలాగే దీనిని సమన్వయ చేయటానికి బాధ్యతతీసుకునేవారెవరైనా ముందుకొస్తే బాగుంటుంది--అర్జున 14:51, 9 ఫిబ్రవరి 2012 (UTC)
వికీపీడియా:సంప్రదింపుల కేంద్రం పేరు మార్పు
మార్చువికీపీడియా:సంప్రదింపుల కేంద్రం స్పష్టత ఇవ్వటం లేదు.వికీపీడియా:సహాయ కేంద్రం తో పోలిక వుంది. దీనిని వికీపీడియా: పరిశోధన సంప్రదింపుల కేంద్రంగా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను. పాత దానికి వున్నలింకులు దీనికి మార్చి, పాతది తొలగించటం మంచిది. అభ్యంతరాలుంటే వారం రోజులలో స్పందించండి--అర్జున 02:23, 10 ఫిబ్రవరి 2012 (UTC)
- సంప్రదింపులకు సహాయంనకు తేడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పేర్లకు మార్పులు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:03, 17 ఫిబ్రవరి 2012 (UTC)
- ఇంగ్లీషులోని రిఫరెన్స్ డెస్క్ కు సరియైన అనువాదం పరిశోధనల సంప్రదింపు కేంద్రం అని నా ఆలోచన. ఇటీవల తెవికీ మొదటిపేజీని మార్చినతరువాత సంప్రదింపు పేజీ చేర్చబడింది. అది సాధారణ సంప్రదింపులకొరకు. అందుకని దీనిని మరింత అర్థవంతమైన పేరుకు మార్చటాన్ని మరల పరిశీలించండి.--అర్జున 16:14, 20 ఫిబ్రవరి 2012 (UTC)
విక్షనరీ లింకులు
మార్చువిక్షనరీ లింకులు వికీపీడియా పేజీలనుండి అంత వుపయోగంగా వుండవు (ఉదాహరణ). వీలైతే వికీసోర్స్. వికీబుక్స్, కామన్స్ లాంటి వ్యాసాని కన్న ఎక్కువ సమాచారము ఇవ్వగల వి మాత్రమే చేర్చుట మంచిది.--అర్జున 07:15, 23 ఫిబ్రవరి 2012 (UTC)
వికీపేజీలనుండి పుస్తకాల తయారీకి కలెక్షన్ పొడిగింపు స్థాపన ప్రతిపాదన
మార్చువికీపీడియాలో చాలా సమాచారము చేరింది. అయితే దీనిని వాడుకోటానికి ఆన్లైన్ తో పాటు ఆఫ్‌లైన్‌లో సౌలభ్యాలు పెంచాలి. దీని సమాచారం నుండి పుస్తకాలు తయారు చేస్తే ఆఫ్‌లైన్ లో వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నేరుగా తెలుగులో పుస్తకం చేయలేకపోయనా, ఈ కలెక్షన్ పొడిగింత (Collection Extension)వుంటే సమాచారాన్ని లిబ్రెఆఫీస్ దస్త్రతీరుతో దిగుమతి చేసుకోవచ్చు. ఈపొడిగింత ఇప్పటికే తెలుగు వికీబుక్స్లో స్థాపించబడివుంది. దానినుపయోగించి ఉబుంటు వాడుకరి దర్శిని అనే పుస్తకాన్ని చేయటం జరిగింది. వికీపీడియాలో దీన్ని ప్రవేశపెట్టటానికి అభ్యంతరాలేవైనా వుంటే ఒక వారం రోజులు లో (అనగా 27 మే 2012లోగా) తెలియచేయండి. దీనికోసమై బగ్ నివేదించబడింది. బగ్‌లో స్పందన ప్రకారం ఈ చర్చ లేక అభిప్రాయసేకరణ జరుపుతున్నాను--అర్జున (చర్చ) 11:19, 20 మే 2012 (UTC)
- ఇది ఉపయోగకరమైనది కనుక ఈ విధానాన్ని వికీపీడియాలో ప్రవేశపెట్టవచ్చని అభిప్రాయపడుతున్నాను.--t.sujatha (చర్చ) 16:49, 23 మే 2012 (UTC)
- సుజాత గారు మీ సానుకూల స్పందనకు ధన్యావాదాలు. ఈ పొడిగింత ప్రవేశపెట్టటానికి తదుపరి చర్యలు తీసుకుంటాను. (Translation for the understanding of bugzilla staff: Thanks Sujatha for your supporting response. I will take the next steps for implementation).--అర్జున (చర్చ) 03:30, 28 మే 2012 (UTC)
- తెలుగు వికీపీడియాలో మంచి వ్యాసాలు తక్కువ. అయినా భవిష్యత్తులో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తెలుగు వికీపీడియాలో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం మంచిది.Rajasekhar1961 (చర్చ) 05:46, 28 మే 2012 (UTC)
- Thanks Rajasekhar for your support. --అర్జున (చర్చ) 09:16, 28 మే 2012 (UTC)
- పొడిగింత స్థాపించబడింది. దీనిని పరీక్షించటానికి మీకు కావలసిన వర్గానికి లేక వ్యాసానికి వెళ్లి పక్క పట్టీలో అడుగునవున్న ముద్రించండి/ఎగుమతి చేయండి ఎంచుకొని ఆతరువాత ఓ పుస్తకాన్ని సృష్టించండి ఎంచుకొని అప్పుడు మీ తెరపై పుస్తక కూర్పరి ప్రత్యేక పేజీ కనబడుతుంది. దానిలో పుస్తకం సృష్టికర్తను ప్రారంభించు ఎంచుకుంటే ఆతరువాత మీరు కావలసిన వ్యాసాలను వర్గాలను పుస్తకంలో చేర్చవచ్చు. దానిని పీడియా ప్రెస్ ద్వారా మునుజూపు చూడవచ్చు. భౌతిక పుస్తకం రూపంలో డబ్బు చెల్లించి పొందవచ్చు(ప్రస్తుతానికి ముఖపత్ర పేజీ తప్ప, మిగతా పేజీలలో తెలుగు రూపం సరిగావుంది). దానిని పిడిఎఫ్(.pdf) (ఇది సరిగా లేదు), స్వేచ్ఛా పత్రతీరు (.odt) మరియు ఇతర తీరులలో మీ కంప్యూటర్ లోకి ఉచితంగా తెచ్చుకొని, మీరు ఇతరులతో పంచుకోవచ్చు, నెట్ సంపర్కంలేకున్నా చదువుకోవచ్చు. స్వేచ్ఛా పత్రతీరుని లిబ్రెఆఫీస్ లో తెరచి
(బొమ్మలు మానవీయంగా చేర్చాలి)సరిగా కనబడే పిడిఎఫ్ ఫైల్ చేయవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పుస్తకం తయారు చేస్తే 328 పేజీల పుస్తకం తయారవటం నాకే అశ్చర్య మనిపించింది. మీరు ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 03:51, 3 జూన్ 2012 (UTC)
- పొడిగింత స్థాపించబడింది. దీనిని పరీక్షించటానికి మీకు కావలసిన వర్గానికి లేక వ్యాసానికి వెళ్లి పక్క పట్టీలో అడుగునవున్న ముద్రించండి/ఎగుమతి చేయండి ఎంచుకొని ఆతరువాత ఓ పుస్తకాన్ని సృష్టించండి ఎంచుకొని అప్పుడు మీ తెరపై పుస్తక కూర్పరి ప్రత్యేక పేజీ కనబడుతుంది. దానిలో పుస్తకం సృష్టికర్తను ప్రారంభించు ఎంచుకుంటే ఆతరువాత మీరు కావలసిన వ్యాసాలను వర్గాలను పుస్తకంలో చేర్చవచ్చు. దానిని పీడియా ప్రెస్ ద్వారా మునుజూపు చూడవచ్చు. భౌతిక పుస్తకం రూపంలో డబ్బు చెల్లించి పొందవచ్చు(ప్రస్తుతానికి ముఖపత్ర పేజీ తప్ప, మిగతా పేజీలలో తెలుగు రూపం సరిగావుంది). దానిని పిడిఎఫ్(.pdf) (ఇది సరిగా లేదు), స్వేచ్ఛా పత్రతీరు (.odt) మరియు ఇతర తీరులలో మీ కంప్యూటర్ లోకి ఉచితంగా తెచ్చుకొని, మీరు ఇతరులతో పంచుకోవచ్చు, నెట్ సంపర్కంలేకున్నా చదువుకోవచ్చు. స్వేచ్ఛా పత్రతీరుని లిబ్రెఆఫీస్ లో తెరచి
- Thanks Rajasekhar for your support. --అర్జున (చర్చ) 09:16, 28 మే 2012 (UTC)
- తెలుగు వికీపీడియాలో మంచి వ్యాసాలు తక్కువ. అయినా భవిష్యత్తులో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తెలుగు వికీపీడియాలో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం మంచిది.Rajasekhar1961 (చర్చ) 05:46, 28 మే 2012 (UTC)
- ఈ పుస్తకం రూపొందించడంలో అర్జునరావుగారు చేసిన కృషి అబినందనీయం.--t.sujatha (చర్చ) 13:26, 3 జూన్ 2012 (UTC)
ఇంగ్లీషు వికీ నుండి మూసలు దిగుమతి చేసికొనుట
మార్చుఇంగ్లీషులో ప్రాంతాలకు కొత్త మూసలు (ఉదా:Infobox Settlement) ఇంతకు ముందలవాడే (IndianJurisdiction లో చాలా దోషాలు వున్నందున) బదులు తయారయ్యాయి. వాటిని తెలుగు వికీలో సులువుగా తెచ్చుకోవాలంటే Special:Import అధికారి నిర్వాహక ఆ పై హోదాగలవారికి పనిచేయాలి. ప్రస్తుతము అది పనిచేయుటలేదు. దానికి మీడియావికీ అమరిక మార్చాలి. దానికి సముదాయ అంగీకారం కావాలి కాబట్టి వికీపీడియన్లస్పందన క్రింది వరుసలలో వారం రోజులలో (అనగా 28 ఆగష్టు లోపల) కోరడమైనది.--అర్జున (చర్చ) 11:46, 21 ఆగష్టు 2012 (UTC)
- మద్దతు
- --అర్జున (చర్చ) 11:46, 21 ఆగష్టు 2012 (UTC)
- రాజశేఖర్Rajasekhar1961 (చర్చ) 15:13, 21 ఆగష్టు 2012 (UTC)
- (దీని పైవరుసలో వికీ సంతకం)
- తటస్థం
- (దీని పైవరుసలో వికీ సంతకం)
- వ్యతిరేఖం
- (దీని పైవరుసలో వికీ సంతకం)
- తీర్మానం 2-0 ఆధిక్యతతో ఆమోదించబడింది.--అర్జున (చర్చ) 11:10, 8 నవంబర్ 2012 (UTC)
- వికీ అమరికలలో మార్పులు కలిగినతర్వాత
అధికారులందరికినిర్వాహక ఆ పై హోదాగలవారికి ఈహక్కు వున్నట్లుగా తెలియవచ్చింది. --అర్జున (చర్చ) 05:00, 15 జనవరి 2013 (UTC)
లోగో ప్రతిపాదన
మార్చుమిత్రులంతా వివరించిన విధంగా తెవికీ లోగో. రహ్మానుద్దీన్ (చర్చ) 18:25, 11 అక్టోబర్ 2013 (UTC)
- బాగానే వుంది. --అర్జున (చర్చ) 05:18, 12 అక్టోబర్ 2013 (UTC)
- తదుపరి చర్య ఏమిటి? బగ్జిల్లా లో బగ్ రెయిజ్ చేసి ఈ బొమ్మను ప్రతిపాదించాలా? రహ్మానుద్దీన్ (చర్చ) 06:43, 15 అక్టోబర్ 2013 (UTC)
- వికీసోర్స్ లోగో బగ్ చెప్పినట్లు కామన్స్ కి అప్లోడ్ చేసి అక్కడి నిర్వాహకుడికి అభ్యర్ధన చేర్చాలనుకుంటాను. వాడుకరి:Veevenలేక వాడుకరి:రవిచంద్ర కు అనుభవం వుండవచ్చు.--అర్జున (చర్చ) 09:35, 15 అక్టోబర్ 2013 (UTC)
- https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=56149 వద్ద బగ్ ను ప్రతిపాదించాను.
- With consent of the above discussion and previous discussions linked above, I propose change of logo. రహ్మానుద్దీన్ (చర్చ) 06:06, 25 అక్టోబర్ 2013 (UTC)
- కొత్త లోగో సచేతనమయింది. రహ్మానుద్దీన్ (చర్చ) 07:41, 26 అక్టోబర్ 2013 (UTC)
- ధన్యవాదాలు. రహ్మానుద్దీన్ మరియు వాడుకరి:విశ్వనాధ్.బి.కె. కృషి మరియు సహ సభ్యుల సహకారంతో మూడు సంవత్సరాల తరువాత మెరుగైన లోగోని ప్రవేశపెట్టగలిగాము.--అర్జున (చర్చ) 09:40, 26 అక్టోబర్ 2013 (UTC)
- వికీసోర్స్ లోగో బగ్ చెప్పినట్లు కామన్స్ కి అప్లోడ్ చేసి అక్కడి నిర్వాహకుడికి అభ్యర్ధన చేర్చాలనుకుంటాను. వాడుకరి:Veevenలేక వాడుకరి:రవిచంద్ర కు అనుభవం వుండవచ్చు.--అర్జున (చర్చ) 09:35, 15 అక్టోబర్ 2013 (UTC)
- తదుపరి చర్య ఏమిటి? బగ్జిల్లా లో బగ్ రెయిజ్ చేసి ఈ బొమ్మను ప్రతిపాదించాలా? రహ్మానుద్దీన్ (చర్చ) 06:43, 15 అక్టోబర్ 2013 (UTC)
కొత్త ఫైల్ అప్లోడ్ విజర్డ్ తెలుగులో వాడుట
మార్చు సహాయం అందించబడింది
-->
వికీపీడియా:File Upload Wizard ను తెలుగులో వాడటానికి ప్రయత్నం ఇటీవలే ప్రారంభించాను. దాదాపు ఐదేళ్లపైన మారని మన దస్త్రపు ఎక్కింపుని తాజాచేసుకోవలసిన అవసరముంది. దీనిద్వారా నకలుహక్కులపై విజ్ఞానాన్ని పెంచుటకు, అవసరమైన మూసలు ఫైల్ ఎక్కింపుతోపాటు చేర్చుటకు తద్వారా అనవసర నిర్వహణ పనులు లేకుండా చేయుటకు వీలున్నది. ఇది తెలుగు వికీలో ప్రవేశపెట్టినా ఇంకా నడపడంలో అనుమతి సంపాదించవలసి వున్నందున, దీని వివరాల కొరకు Wikipedia:File_Upload_Wizard/doc చూడండి . ఆంగ్ల వికీలో ప్రయత్నించి చివరిదాకా పరీక్షించండి కాని భద్రపరచవద్దు . దీని ద్వారా ఆంగ్ల వికీలో ఎక్కించిన దస్త్రం వివరాలుఉదాహరణ చూడవచ్చు. రచ్చబండలో ప్రతిపాదించిన సముచిత వినియోగానికి సంబంధించిన తెవికీ నిర్ణయం ఏ విధంగా ఖరారైనా ఇది జరగవలసిన పనే కాబట్టి ప్రతిపాదన సభ్యుల ఒక వారం లోగా (4 నవంబర్ 2013 లోగా) స్పందించమని మనవి.
- మద్దతు
- రహ్మానుద్దీన్ (చర్చ) 07:52, 28 అక్టోబర్ 2013 (UTC). అయితే, ప్రతి సభ్యుడూ కామన్స్ లో దస్త్రాలను జోడించాలని విజ్ఞప్తి చేయటం కూడా చేయాలి.
- విశ్వనాధ్ (చర్చ)।..బావుంది.ఇలా అయితే భవిష్యత్తులో బొమ్మల హక్కుల ఇబ్బందులు రావు.
- మంచి ప్రయత్నం. ముందుకు వెళ్ళండి.--Rajasekhar1961 (చర్చ) 07:00, 31 అక్టోబర్ 2013 (UTC)Mediawiki:Common.js --అర్జున (చర్చ) 07:37, 6 నవంబర్ 2013 (UTC)
- పాలగిరి (చర్చ) 08:27, 31 అక్టోబర్ 2013 (UTC)
- ఇదివరకున్న అప్లోడ్ విజర్డ్ కంటే ఇది మరి క్షుణ్ణంగా ఉంది. --వైజాసత్య (చర్చ) 08:04, 4 నవంబర్ 2013 (UTC)
- < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
- వ్యతిరేఖం
- < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
- తటస్థం
- < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
- దీనిలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ప్రతిపాదన 5-0 ఆధిక్యతతో ఆమోదించబడింది. (Resolution for using the new File Upload Wizard is approved with 5-0 majority)--అర్జున (చర్చ) 03:50, 5 నవంబర్ 2013 (UTC)
- నేను ఈ ఫైల్ కి వికీమీడియా సంస్థనుండి ప్రత్యేక అనుమతులు కావాలని పొరబడ్డాను. నివేదించిన బగ్ కి వారు చేయగలిగిందేమి లేదని తెలిపారు. తెవికీలో ఈవిజర్డ్ పనిచేయకపోవటానికి మన తెవికీలో common.cs పాతదైనదని గ్రహించాను.
ఆంగ్ల వికీలోని en:Mediawiki:Common.js ని నా వాడుకరి పేజీ యొక్క ఉపపేజీలోకి నకలు చేసి నిష్క్రమించి మరల ప్రవేశించినతరువాత విజర్డ్ పనిచేయటం గమనించాను. మధ్యమధ్యలో పరీక్షకోసం వున్న కోడ్ నుండి సందేశ పెట్టెలు వస్తున్నాయి. వాటిని స్పందిస్తే ఫైళ్లు కోరిన మూసలు మరియు వివరాలతో ప్రవేశపెట్టబడుతున్నాయి. సహ సభ్యులు కూడా అలాగే కామన్స్.జెఎస్ ఫైలుని వారి వాడుకరిపేజీలో ఉపపేజీగా నకలు చేసిస్వల్ప మార్పులు చేయటంతో పనిచేసింది. సహసభ్యులు కూడా పరీక్షించి దోషాలు విజర్డ్ చర్చా పేజీలో తెలపవలసినది. --అర్జున (చర్చ) 07:37, 6 నవంబర్ 2013 (UTC)
- నేను ఈ ఫైల్ కి వికీమీడియా సంస్థనుండి ప్రత్యేక అనుమతులు కావాలని పొరబడ్డాను. నివేదించిన బగ్ కి వారు చేయగలిగిందేమి లేదని తెలిపారు. తెవికీలో ఈవిజర్డ్ పనిచేయకపోవటానికి మన తెవికీలో common.cs పాతదైనదని గ్రహించాను.
అర్జునకు ఇంపోర్ట్అప్లోడ్ హక్కు కొరకు
మార్చుఇటీవల బొమ్మల నకలు హక్కులపరిశీలనలోభాగంగా తాజా మూసలు చాలా ఆంగ్లవికీనుండి దిగుమతి చేయవలసి వస్తున్నది. వీటిని ఒకటి తర్వాత ఒకటి దిగుమతి చేయడంచాలాసమయం పడుతున్నది. 'importupload' హక్కు పొందితే వీటిని సులభంగా చేయవచ్చు. మన తెవికీలో ఇప్పటివరకు ఎవరికీలేనందున దీనికొరకు స్టివార్డ్ లను అనుమతి కోరుదామనుకుంటున్నాను. మీ స్పందనను వారం రోజులలో (4 నవంబర్ 2013 లోగా) తెలియచేయండి
- మద్దతు
- --K.Venkataramana (talk) 09:45, 28 అక్టోబర్ 2013 (UTC)
- పాలగిరి (చర్చ) 04:46, 31 అక్టోబర్ 2013 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 05:59, 31 అక్టోబర్ 2013 (UTC)
- మీరు నకలుహక్కుల విషయంలో ఇంకా కఠినంగా ఉంటారని ఆశిస్తూ, రహ్మానుద్దీన్ (చర్చ) 07:23, 31 అక్టోబర్ 2013 (UTC)
- ఆంగ్లవికీలో చాలా కఠిన నియమాలుంటాయి. అక్కడి నుంచి మూసల దిగుమతికి అభ్యంతరం లేదు కాని బొమ్మల తొలగింపు విషయంలో మాత్రం ఆలోచించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:59, 31 అక్టోబర్ 2013 (UTC)
- తెవికీ మెరుగునకు ఒక్కరైనా తప్పక హక్కు కలిగి ఉండాలి...విశ్వనాధ్ (చర్చ) 08:57, 31 అక్టోబర్ 2013 (UTC)
- అర్జునరావుగారి ప్రతిపాదనకు నేను మద్దతతు తెలుపుతున్నాను.--t.sujatha (చర్చ) 11:38, 31 అక్టోబర్ 2013 (UTC)
- --వైజాసత్య (చర్చ) 05:24, 4 నవంబర్ 2013 (UTC)
- <పై వరుసలో # తర్వాత మీసంతకం చేయండి>
- వ్యతిరేఖం
- <పై వరుసలో # తర్వాత మీసంతకం చేయండి>
- తటస్థం
- <పై వరుసలో # తర్వాత మీసంతకం చేయండి>
- దీనిలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ప్రతిపాదన 8-0 ఆధిక్యతతో ఆమోదించబడింది. (Resolution for providing importupload right to User:Arjunaraoc is approved with 8-0 majority)--అర్జున (చర్చ) 03:52, 5 నవంబర్ 2013 (UTC)
- తదుపరి చర్యలు
స్టివార్డులు ఈ హక్కుని తిరస్కరించి import వాడుకోమన్నారు. నేను కావలసిన మూసలన్నీ నా ఆంగ్ల వాడుకరిపేజీయొక్క ఉపపేజీలో పెట్టి దానిని దిగుమతి చేసుకుంటే చాలావరకు మూసలు దిగుమతి అయ్యాయి. నిర్వాహకులెవరైనా ప్రయత్నించదలిస్తే ఉపయోగంగా వుంటుందని తెలియచేస్తున్నాను.
- స్టివార్డు తో సంప్రదించి మూడు నెలలపాటు ఈ హక్కుని పొందగలిగాను. పాలగిరి గారి వ్యాసానికి కావలసిన en:Category:Chembox Template అన్నీ దిగుమతి చేయటం ద్వారా పరీక్షించాను. ఎవరైనా ఎక్కువ మూసలను దిగుమతి చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి. --అర్జున (చర్చ) 13:56, 17 నవంబర్ 2013 (UTC)
డైనమిక్ పేజ్ లిస్ట్ ఎక్స్టెన్షన్ స్థాపన
మార్చుడైనమిక్ పేజ్ లిస్ట్ ఎక్స్టెన్షన్ స్థాపన వలన సహాయంకోరుతున్న పేజీలను రచ్చబండలోని సహకారం స్థితి పెట్టెలోనే చూపించడానికి వీలవుతుంది. ఇంకా ప్రాజెక్టులలో ఇతరత్రా కూడా వుపయోగముంటుంది. కనుక దీనిని స్థాపనకు సభ్యుల స్పందన వారంలోగా (6 డిసెంబర్ 2013 లోగా)తెలియచేయండి. --అర్జున (చర్చ) 06:15, 29 నవంబర్ 2013 (UTC)
- మద్దతు
- < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
- వ్యతిరేఖం
- < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
- తటస్థం
< ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు చిహ్నం
మార్చుతెలుగు వికీ మిత్రులారా తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు చిహ్నం నేను తయారు చేసిన చిహ్నం చూసి మీ అభిప్రాయాలను తెలుపండి
--Sureshsuthari (చర్చ) 10:47, 13 డిసెంబర్ 2013 (UTC)సురేష్ సుతారి
- Sureshsuthari గారి వ్యాఖ్యకు, దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక వర్గ సభ్యులు విశ్వనాధ్.బి.కె ,ప్రణయ్ రాజ్ వంగరి ,కశ్యప్ రహ్మానుద్దీన్ మరియు విష్ణు త్వరలో స్పందించితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 05:13, 2 జనవరి 2014 (UTC)
- దయచేసి మీరు చేసిన లోగోలను teluguwiki@googlegroups.com వద్ద లోడ్ చేసి అక్కడ సలహాలు సంప్రదింపులు జరపండి. మీరు చేసినవి నచ్చితే ఇక్కడ అప్లోడ్ చేద్దాం..కృతజ్నతలు...విశ్వనాధ్ (చర్చ) 08:00, 2 జనవరి 2014 (UTC)
- విశ్వనాధ్ గారికి, మన క్రియాశీలక సభ్యులు వికీలో నే ఎక్కువమంది వున్నప్పుడు,చర్చలు సాధ్యమైనంతవరకు వికీలోనే చేయటం మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 03:17, 3 జనవరి 2014 (UTC)
- కాని అవసరం లేని ఫొటోలను అప్లోడ్ చేయడం అనవసరం కదా. తరువాత బావున్నట్టుంటే తప్పక వికీలో అప్లోడ్ చేసి దానిని గురించి చర్చలు జరుపవచ్చును..విశ్వనాధ్ (చర్చ) 07:12, 3 జనవరి 2014 (UTC)
- విశ్వనాధ్ గారికి, ప్రక్రియకు అవసరమైన ఫోటోలు వికీలో ఎక్కించడంవలన దోషమేమిలేదు. ముందు ముందు ఇటువంటి ప్రక్రియలకు ఉదాహరణగా వుపయోగపడతాయి. పెద్దగా క్రియాశీలంగా లేని మెయిలింగ్ లిస్టులో చర్చలవలన ఉపయోగంలేదు.--అర్జున (చర్చ) 06:13, 12 జనవరి 2014 (UTC)
- దయచేసి మీరు చేసిన లోగోలను teluguwiki@googlegroups.com వద్ద లోడ్ చేసి అక్కడ సలహాలు సంప్రదింపులు జరపండి. మీరు చేసినవి నచ్చితే ఇక్కడ అప్లోడ్ చేద్దాం..కృతజ్నతలు...విశ్వనాధ్ (చర్చ) 08:00, 2 జనవరి 2014 (UTC)
భాషలో దోషాల మూకుమ్మడి సవరణ
మార్చువ్యాసాల భాషలో దొర్లే తప్పులను సరిచేసుకోవాల్సి ఉంది. బాటొకదాన్ని తయారుచేసి నడిపితే బాగుంటుందని నాకనిపిస్తోంది. కొన్ని పదాలు కొన్ని సందర్భాల్లో తప్పైనా మరి కొన్ని సందర్భాల్లో ఒప్పు కావచ్చు. ప్రస్తుతానికి అలాంటివాటిని వదిలేసి, ఏ సందర్భంలోనైనా తప్పే అయ్యే పదాల విషయంలో బాటును నడపొచ్చు. నాకు తోచినవి కింద రాస్తున్నాను. ఇలాంటి మరిన్ని పదాలను చేర్చుకంటూ ఏ నెలకో రెణ్ణెల్లకో ఓ సారి బాటు నడిపి కొత్తగా చేరే తప్పులను, శైలికి విరుద్ధంగా ఉన్నవాటినీ సవరించుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి బాటులు ఈసరికే రాసి నడుపుతూ ఉండి ఉంటే, ఈ ప్రతిపాదన ఓ బాటు కాలం లేటైనట్టే.
తప్పు/శైలికి విరుద్ధం | ఒప్పు/శైలికి అనుగుణం |
---|---|
ఆశక్తి, ఆశక్తులు | ఆసక్తి, ఆసక్తులు |
భాద్యత | బాధ్యత |
భందము, భంధము, బందము | బంధం |
అనుభందము, అనుభంధము, అనుబందము | అనుబంధం |
శాఖాహారం | శాకాహారం |
సమైఖ్య | సమైక్య |
"కారణములను" (శైలి) | కారణాలను |
డబుల్ స్పేసు | సింగిల్ స్పేసు |
వ్యాకరణ చిహ్నాల ముందు ఖాళీ పెట్టడం, చిహ్నం తరువాత పెట్టకపోవడం (శైలి) | చిహ్నానికి ముందు ఖాళీ ఉండకూడదు, తరువాత ఉండాలి |
--చదువరి (చర్చ • రచనలు) 13:43, 1 జనవరి 2014 (UTC)
- ఈ విషయమై ఈ పాటికే కృషి జరిగిందని ఇప్పుడే చూసాను. వికీపీడియా:భాషాదోషాల_పట్టిక, సాధారణ_పదదోషాలు_-_తప్పొప్పుల_పట్టిక పేజీల్లో తప్పొప్పుల జాబితా కూడా చూసాను. నాకు తోచిన పదాలను అక్కడే చేరుస్తాను. --చదువరి (చర్చ • రచనలు) 13:56, 1 జనవరి 2014 (UTC)
- చదువరి గారూ, చక్కని ఆలోచన. కొంత పరిమిత కృషి జరిగింది కానీ, ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. జయంత్ కుమార్ అనే సభ్యుడు ఒక పట్టిక ప్రారంభించాడు కానీ వాటిని బాటుచే ఇంకా దిద్దించలేదు. ఇక నుండి మీరు బాటుచే సవరించాలనుకున్నవి వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక లోని పట్టికలో చేర్చండి. నేను వాటిని అనుసంధానించి అచ్చుతప్పులు దిద్దటానికి ఒక స్క్రిప్టు వ్రాస్తాను. --వైజాసత్య (చర్చ) 05:01, 2 జనవరి 2014 (UTC)
- భాషాదోషాల పట్టిక మరియు సాధారణ పదదోషాలు-తప్పొప్పుల పట్టిక రెండింటినీ కలిపి ఒకే జాబితా తయారుచేస్తే బాగుంటుందేమో. రహ్మానుద్దీన్ ఇలాంటి జాబితా ఆధారంగా ఒక బాట్ ను కొంతకాలం నడిపించారు. ఇలా సమగ్రమైన పదదోషాల జాబితా తయారుచేసి; బాట్ ను నడిపి తెవికీ వ్యాసాలలోని తప్పుల్ని సవరిస్తే వ్యాసాల నాణ్యత మెరుగుపడుతుంది. చాలా బాగా ప్రణాలిక తయారుచేసి నడిపిస్తే ఫలితాలు బాగుంటాయి.Rajasekhar1961 (చర్చ) 06:27, 2 జనవరి 2014 (UTC)
- చదువరి గారూ, చక్కని ఆలోచన. కొంత పరిమిత కృషి జరిగింది కానీ, ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. జయంత్ కుమార్ అనే సభ్యుడు ఒక పట్టిక ప్రారంభించాడు కానీ వాటిని బాటుచే ఇంకా దిద్దించలేదు. ఇక నుండి మీరు బాటుచే సవరించాలనుకున్నవి వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక లోని పట్టికలో చేర్చండి. నేను వాటిని అనుసంధానించి అచ్చుతప్పులు దిద్దటానికి ఒక స్క్రిప్టు వ్రాస్తాను. --వైజాసత్య (చర్చ) 05:01, 2 జనవరి 2014 (UTC)
తెలుగు అంకెలు, హిందూ అంకెలు రెండూ చూపించవచ్చు..
మార్చుతెలుగు అంకెలు, హిందూ అంకెలు (అరబిక్ అంకెలు?) వాడే విషయాన్ని గతంలో మనం చర్చించాం. అయితే రెండూ వాడొచ్చని హిందీ వికీపీడియాలో గమనించాను. అక్కడ పేజీ పైభాగంలో ఏ అంకెలు కావాలో ఎంచుకునే సౌలభ్యం సందర్శకులకు ఉంది. దీన్ని మనమూ పెట్టుకోవచ్చేమో వికీ సాంకేతికులు పరిశీలించగలరు. --చదువరి (చర్చ • రచనలు) 16:57, 6 ఫిబ్రవరి 2014 (UTC)
- నా అభిరుచులు లో, ఉపకరణాల ట్యాబ్ లో, ఇంటర్ఫేసు సంబంధిత విభాగంలో "అంకెల పరివర్తన, అంకెలను తెలుగు, అరబ్బీ అంకెల మధ్య మార్చటానికి ఒక ఉపకరణం" అన్న ఎంపికను ఎంచుకుంటే మెకు అలా పని చేస్తుంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:49, 8 మే 2014 (UTC)
సాహిత్యం ప్రాజెక్టు గురించి
మార్చుతెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చర్చించి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే పనిలో భాగంగా సాహిత్యం ప్రాజెక్టును ప్రారంభించాను. దీనికి సంబంధించిన వివరాలు ఆ ప్రాజెక్టు పేజీలోనే పొందుపరిచాను. కొంత కొంతగా అభివృద్ధి చేయాలి కనుక తేలికైన సోపానాలను ప్రారంభించాను. సాహిత్య ప్రాజెక్టులో సాహిత్య వ్యాసాలను అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్నవారు సభ్యత్వం స్వీకరించాలని మనవి.
ఈ ప్రాజెక్టులో భాగంగా జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలైన ఇతర భాషా రచయితల గురించి కూడా వ్యాసాలు తయారు చేస్తున్నాము. కనుక సోదర భారతీయ భాషలు వచ్చిన అహ్మద్ నిసార్ గారు, పాలగిరి గారు తదితరులు, ఆంగ్ల భాష నుంచి తెలుగులో చక్కని అనువాదాలు చేయగలిగిన వికీసభ్యులు పాలుపంచుకుంటే మరింత వేగంగా ముందుకుపోవచ్చు. అలాగే సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న పలువురు వికీ సభ్యులు కూడా చేరితే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రాజెక్టు లంకె ఇది.--పవన్ సంతోష్ (చర్చ) 05:55, 20 ఫిబ్రవరి 2014 (UTC)
- Pavan santhosh గారు కన్నడ భాషా జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల కన్నడ వ్యాసాలను తెలుగులోకి అనువదించగలను.Palagiri (చర్చ) 06:53, 20 ఫిబ్రవరి 2014 (UTC) 06:53, 20 ఫిబ్రవరి 2014 (UTC)
- పాలగిరి గారూ కృతజ్ఞతలు. మీరు ఆ ప్రయత్నం చేయండి. నా వద్ద కూడా తెలుగులో కన్నడ సాహిత్యవేత్తల గురించి కొంత సమాచారం ఉంది కనుక మీ కృషికి ఉడతా భక్తిగా నేను ఏదోకటి జోడించగలను.--పవన్ సంతోష్ (చర్చ) 07:37, 20 ఫిబ్రవరి 2014 (UTC)
- Pavan santhosh గారు కన్నడ భాషా జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల కన్నడ వ్యాసాలను తెలుగులోకి అనువదించగలను.Palagiri (చర్చ) 06:53, 20 ఫిబ్రవరి 2014 (UTC) 06:53, 20 ఫిబ్రవరి 2014 (UTC)
సీఐఎస్-ఏ2కే వారి తెలుగు భాష కు సంబంధించిన ముసాయిదా కార్యప్రణాళికపై చర్చ
మార్చుసీఐఎస్-ఏ2కే వారి తెలుగు భాష కు సంబంధించిన ముసాయిదా కార్యప్రణాళిక పై చర్చ చేయవలసి ఉంది. ఇందులోని అంశాలను ఒక్కొక్కటిగా చర్చించి, సహసభ్యులు వారి సూచనలు సలహాలు తెలుపగలరు. ఇందుకు సంబంధిత చర్చా పేజీ వద్ద తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:36, 26 మే 2014 (UTC)
కార్టూనిస్టు పామర్తి శంకర్ గురించి పేజీ
మార్చు‘సాక్షి’ ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది ఆయన్ను వరించింది. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది.
ఈ సందర్భంగా వారి గురించి కార్టునిస్టులలో వారి పేరును చేర్చితే బావుంటుంది అనుకుంటున్నాను.
నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ ఎనిమిదేళ్లుగా ‘సాక్షి’ దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్‌కు గతంలో నాలుగుసార్లు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. బ్రెజిల్, ఇరాన్, చైనా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆయన వేసిన వాటిలో దలైలామా, బ్రూస్లీ, మదర్ థెరిసా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామా తదితర ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు శంకర్ గీసిన ఈ క్యారికేచర్ 2013 డిసెంబర్ 6న ప్రచురితమైంది. గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కార్టూనిస్టులోకం దీన్ని ఆస్కార్, నోబెల్ ప్రైజుగా పరిగణిస్తుంటుంది. ఈ అవార్డు కింద 10 వేల యూరోల నగదు లభిస్తుంది. పోర్చుగల్‌లో ఏటా నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ అవార్డును బహూకరిస్తారు.
- కట్టా శ్రీనివాస్ గారూ ఫేస్బుక్లో మనం చర్చించినట్టుగా వారి పేజీని తయారుచేసి అభివృద్ధి చేద్దాము. ప్రణయ్ తో పాటుగా మరికొందరు ఈ విషయమై మనకు సహకరిస్తే మరింత బావుంటుంది. సమయోచితమైన ప్రతిపాదనకు ధన్యవాదాలు. కార్టూన్ నోబెల్ గా పరిగణించే అవార్డ్ ఆసియాలోనే తొలిసారిగా మనవారికి లభించడం చాలా చాలా గొప్ప విషయం. ఐతే మీకున్న వీలును అనుసరించి తెలుగు వికీపీడియన్లు ఆయన వ్యాసాన్ని అభివృద్ధి చేసి, తద్వారా అభినందనలు క్రియారూపకంగా తెలిపారన్న విషయాన్ని మీరు ప్రెస్ వారికి తెలియజేయగలిగితే (కుదిరితేనే సుమా) తెవికీకి కూడా మంచి ప్రచారం లభించినట్టు అవుతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:34, 17 అక్టోబరు 2014 (UTC)
- పామర్తి శంకర్ గురించి మీరు మంచి వ్యాసాన్ని తెవికీలో తయారుచేయవచ్చును. సరైన మూలాలను చేర్చడం మరచిపోవద్దు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:36, 17 అక్టోబరు 2014 (UTC)
Dynamic Page List పొడిగింత స్థాపన
మార్చు సహాయం అందించబడింది
వర్గాలపేజీల ప్రదర్శన మరిన్ని వివరాల ఆధారంగా చేయగలిగే డైనమిక్ పేజీ లిస్ట్ పొడిగింత (Dynamic page list) తెలుగు లో స్థాపించితే ఉదాహరణకు సహాయం చేయబడిన పేజీలను కాలానుగుణంగా ప్రదర్శించే వీలుంది. మరిన్ని వివరాలకు మెటాలో DPL సహాయ పేజీ చూడండి . ఈ స్థాపన ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను వారం రోజులలో (2015-06-27లోపల) తెలపండి. --అర్జున (చర్చ) 07:19, 20 జూన్ 2015 (UTC)
- సమ్మతి
- JVRKPRASAD (చర్చ) 07:42, 20 జూన్ 2015 (UTC)
- -- కె.వెంకటరమణ⇒✉ 01:53, 25 జూన్ 2015 (UTC)
- <పై వరుసలో # తరువాత, అవసరమైతే మీ వ్యాఖ్య మరియు వికీ సంతకం చేయండి>
- వ్యతిరేకం
- <పై వరుసలో # తరువాత, అవసరమైతే మీ వ్యాఖ్య మరియు వికీ సంతకం చేయండి>
- తటస్థం
- <పై వరుసలో # తరువాత, అవసరమైతే మీ వ్యాఖ్య మరియు వికీ సంతకం చేయండి>
- JVRKPRASAD ,కె.వెంకటరమణ ల స్పందనలకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదన సర్వసమ్మతితో ఆమోదించబడింది. The proposal to install Dynamic page list extension is approved unanimously. --అర్జున (చర్చ) 04:02, 29 జూన్ 2015 (UTC)
- https://phabricator.wikimedia.org/T104163 బగ్ నమోదు చేయబడింది. --అర్జున (చర్చ) 04:06, 29 జూన్ 2015 (UTC)
మొదటి పేజి కి ఈ వారపు బొమ్మా ప్రతిపాదన
మార్చుఆంగ్ల వికి లాగానే తెవికి కి ఈ వారపు బొమ్మా అనె భాగాన్ని చేరిస్తే ఎల ఉంటుంది?. తెవికి లొ మరుగున్న పడ్డ బొమ్మలకు గుర్తింపు మరియు కొత్త బొమ్మలను చేర్చడానికి వాడుకరులు ఉత్సాహం చుపుతారని నా అభిప్రాయం. ధన్యవాదాలు. KingDiggi (చర్చ) 04:32, 7 నవంబర్ 2016 (UTC)
వికిపిడియా లో చేర్చ బడిన విషయాలు దిద్దుబాట్లు
మార్చుఅయ్యా,
రచయతగా అనుభవము,రెఫరెన్సు కలిగి వెలువరించిన విషయాలను కొందరు తమ స్వార్థ అభిప్రాయముల' కొరకు సoపాదకియము చేయుట ఇబ్బందికరముగాను,అవగావాహనలేని వారి అభిప్రాయములు చొప్పించటము అనైతికముగాను ఉంది.ఒక కులము,సామాజిక స్థితిగతులను మార్పు చేసేందుకు మరొకరికి అనగా వేరొక సామాజిక స్థితి గలవారు చేయుట,మార్చుట సరి అయినది కాదు.ఈ విషయము గురించి శ్రీ ప్రనయ్ గారితో చర్చించాను.దీనిపైన చర్య తీసికొవలసినదిగా కోరుతున్నాను.
డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్. 2016-12-25T12:00:26 డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్
- User:డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్ గారికి, సంబంధిత వ్యాస చర్చా పేజీలో చర్చించండి. అందరూ పాల్గొనటంకొరకు {{సహాయం కావాలి}} మూస చేర్చండి. --అర్జున (చర్చ) 11:37, 28 నవంబర్ 2019 (UTC)
ధ్రువీకరించిణ అంశాలను తొలగించరాదు
మార్చుఅయ్యా, వికీపీడియాలో ధ్రువీకరిoచి తెలుపబడిన అంశాలను తొలగించరాదు.ఈ విషయములో అతిక్రమిoచు రచయతలను block list లో పెట్టoడి.డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్, 2016-12-29T06:51:48 డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్
:User:డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్ గారికి, సంబంధిత వ్యాస చర్చా పేజీలో చర్చించండి. అందరూ పాల్గొనటంకొరకు {{సహాయం కావాలి}} మూస చేర్చండి. --అర్జున (చర్చ) 11:37, 28 నవంబర్ 2019 (UTC)
ప్రతిపాదన: తదుపరి తెవికీ సమావేశానికి కో-లివ్ కాన్ఫరెన్స్ హాల్ వినియోగం
మార్చుఅందరికీ వందనాలు!
ఇటీవలె నేను హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నూతనంగా ప్రారంభించబడ్డ కో-లివ్ అనే ఒక హాస్టల్ లో చేరాను. ఇందులో అనేక సదుపాయాలతో బాటుగా ప్రొజెక్టర్ / స్క్రీన్ / స్పీకర్లు అమర్చబడిన ఒక కాన్ఫరెన్స్ రూం కలదు. అది చూడగానే ఠక్కున నా మదిలో మెదిలించి తెవికీ సమావేశాలే! దీనికి సంబంధించి టూకీగా కొందరి అభిప్రాయాలను అడగగా, రచ్చబండ లో ఒక పోస్టు వేసి, వీలైనంత త్వరగా ఇక్కడ తెవికీ సమావేశాలు నిర్వహించవలసిందిగా సూచన వచ్చింది. దీనిపై మీరు నన్ను నేరుగా సంప్రదించవచ్చును. నా టెలిగ్రాం ఐడి: t.me/sasisaphr
ఇదే వేదిక యొక్క చిరునామా: https://www.google.com/maps/place/Colive+Garnet/@17.4474757,78.3606525,17z/data=!4m8!1m2!2m1!1sCoLive++Gachibowli!3m4!1s0x0:0xc470fca2aec23a75!8m2!3d17.4480727!4d78.3647744 ధన్యావాదాలు - శశి 2019-11-25T14:10:59 Veera.sj
- శశి గారు. మనకు ఉచితంగా అందుబాట్లో ఉండాలి కద. ఉచితంగా వారు వాడుకోనిస్తారా?.B.K.Viswanadh (చర్చ) 05:32, 27 నవంబర్ 2019 (UTC)
- B.K.Viswanadh గారు, ఈ వసతి గృహం లో నేను నివసిస్తున్నాను. కావున నేను దీనిని వాడుకొనవచ్చును. నా అతిథులని కూడా ఆహ్వానించుకొనవచ్చును.. ఇవన్నీ నాకు ఉచితమే. సందేహమే వలదు. ఇందులో ఉన్న పార్టీ ఏరియాకు పలు మార్లు బయట నుండి స్నేహితులను ఆహ్వానించాను. ఎటువంటి సమస్యా లేదు. కావున ఈ సౌకర్యాన్ని నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు వినియోగించుకొనమని మనవి. అసలే నాకు మెంటల్ గా? ఎప్పుడు మనసు మార్చుకొంటానో తెలియదు! ఈ వసతి గృహం నుండి మారానంటే, ఈ సౌకర్యం వేరే వసతి గృహాల్లో ఉండకపోవచ్చును. - శశి (చర్చ) 11:38, 2 డిసెంబరు 2019 (UTC)
స్వాగత సందేశం రూపు
మార్చు" తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. " | |||
| |||
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు తయారు చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి. | |||
1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము |
5.వికీపీడియా:పరిచయము 2 తరచుగా పరిహరించదగ్గ దోషాలు | ||
2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు |
6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి | ||
3.సహాయం:సూచిక బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ |
7. వీడియో పాఠాలు. మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం | ||
4. వికీపీడియా:ప్రశ్నలు |
8. వికీపీడియా:సహాయ కేంద్రం | ||
విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి. తెలుగు వికీపీడియా ద్వారా తెలుగు ప్రజలందిరికీ ఉపయోగపడే విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి తీసుకురావటంలో మీ ఆసక్తికి మరొక్కసారి ధన్యవాదములు. మీరు చేసే ప్రతి సవరణ, భాషను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. Nskjnv (చర్చ) 15:37, 21 జూలై 2021 (UTC) |
వికీలో చేరిన వారికి మన మొదటి పలకరింపు స్వాగతం, నాకింకా గుర్తు నేను ఖాతా సృష్టించగానే ప్రభాకర్ గౌడ్ నోముల గారు స్వాగతం పలికారు. ఆ సందేశం చూసిన తరువాత వికీ పట్ల ఒక అవగాహన కలిగింది. వికీలో ఏం చేయొచ్చో , వికీ మనకు ఎలా ఉపయోగపడుతుంది అర్థమైంది.
అయితే ఈ స్వాగత సందేశంలో కొన్ని మార్పులు చేస్తే కొత్త వాడుకరులకు మరింత మెరుగైన అవగాహన కలిపించ్చవచ్చని అనిపించింది, Kasyap గారు తన చర్చా పేజీలో నిర్మించిన స్వాగత సందేశం కొంచెం ఆసక్తికరంగా అనిపించింది, దాంట్లో కొన్ని మార్పులు చేసి ఇక్క చేరుస్తున్నాను.
తెవికీలో చేరే వాడుకరులకు నిరంతరంగా కృషి చేస్తూ స్వాగత సందేశం అందించే Nrgullapalli గారు, ప్రభాకర్ గౌడ్ నోముల గారు అలాగే Rajasekhar1961, చదువరి, అర్జున గార్లు ఇతర సముదాయ సభ్యులు స్పందించవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 13:06, 1 సెప్టెంబరు 2021 (UTC)
- @Nskjnv గారూ, స్వాగతం మూసను సంస్కరించే పని చేపట్టినందుకు ధన్యవాదాలు.
- స్వాగతం మూసకు కింది లక్షణాలు ఉండాలని నేను భావిస్తాను. నేను చూపిన ఉదాహరణలు నా అభిప్రాయాన్ని చెప్పేందుకు వాడిన ఉదాహరణలు మాత్రమే. పైన మీరు తయారు చేసిన మూసలో అవి ఉన్నాయనో లేవనో మాత్రం కాదు.
- కొత్తవారిని మరీ ఉక్కిరిబిక్కిరి చేసేలా కాకుండా, కచ్చితంగా అవసరమైన, కనీసమాత్రపు సమాచారం మాత్రమే ఉండాలి. (ఉదాహరణకు, సహాయం శీర్షిక గురించి చెప్పాలి, సహాయ కేంద్రం గురించో, సంప్రదింపు కేంద్రం గురించో అక్కర్లేదు)
- అత్యంత సులువైన, సరళమైన రీతిలో వికీని పరిచయం చెయ్యాలి. అలాంటి లింకులే ఇవ్వాలి. (ఉదాహరణకు విజువల్ ఎడిటరు వాడే సహాయం చూపాలి గానీ, వికీటెక్స్టు ఎడిటరును వాడే సహాయం పేజీలను చూపకూడదు)
- తప్పు సమాచారాన్ని, కాలదోషం పట్టిన సమాచారాన్ని, ఇంగ్లీషులో ఉన్న సమాచారాన్నీ చూపే పేజీలకు లింకులు ఇవ్వరాదు. అవసరమైన మేరకు వాటిని తగు విధంగా సంస్కరించి మాత్రమే ఆ లింకులు ఇవ్వాలి.
- కొత్తవారికి అవసరం లేని సమాచారం ఉండరాదు (ఉదాహరణకు ఖాతా ఎందుకు సృష్టించుకోవాలి అనే లింకు ఇవ్వనక్కర్లేదు)
- పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 06:57, 2 సెప్టెంబరు 2021 (UTC)
- @Nskjnv గారూ, స్వాగతం మూసను సంస్కరించే పని చేపట్టినందుకు ధన్యవాదాలు.పైన చదువరి గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.వాటి ప్రకారం ఇంకా ఏమైనా తుదిమెరుగులు, సవరణలు ఉంటే చేసి, కొత్త వాడుకరులకు స్వాగతం చెప్పటానికి ఉపయోగించవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:57, 5 సెప్టెంబరు 2021 (UTC)
- @Nskjnv గారూ, ఈ కొత్త మూసలో మీకిష్టమైన అంశాలపై పని చెయ్యవచ్చు. ఆయా అంశాలను పరిశీలించండి అంటూ ప్రధాన విషయాధార వర్గాల మూల వర్గపు లింకు ఇస్తే బాగుంటుంది.
- @Kasyap గారూ, కొత్త మూస తయారయ్యే లోపు, ప్రస్తుతం వాడుతున్న మూస లోనే మన ప్రాజెక్టు లింకు కూడా చేరిస్తే బాగుంటుంది. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 05:07, 8 సెప్టెంబరు 2021 (UTC)
- మరొక్క సంగతి.. తెవికీలో ప్రణయ్ రాజ్ గారిది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. ఐదేళ్ళుగా నిరంతరాయంగా ఆయన రోజుకో వ్యాసం రాస్తూ ఉన్నారు. ఇది తెవికీలోనే కాదు, వికీమీడియా వికీల్లో మరే వికీలోనూ ఎవ్వరూ సాధించని ఘనత. వికీలో కొత్తగా రాసేవారికి స్ఫూర్తి నిచ్చి, ఉత్తేజపరచే అంశం. అంచేత దాన్ని స్వాగతం మూసలో చేర్చవచ్చునని నా అభిప్రాయం. __ చదువరి (చర్చ • రచనలు) 06:47, 7 సెప్టెంబరు 2021 (UTC)
- @చదువరి గారూ, మీరందించిన సూచనలను బట్టి మార్పులు చేయవచ్చు, అయితే దీనికి సంబంధించి సమూహ సభ్యులనుండి మరికొన్ని స్పందనలకు వేచి చూస్తున్నాను. అవి వచ్చిన తరువాత మీరు పైన చెప్పిన వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంకా అవసరమైన విషయాలను చేరుస్తు ఆ రూపుని ఇక్కడ మీ దృష్టికి తీసుకువస్తాను. Nskjnv ☚╣✉╠☛ 15:37, 22 సెప్టెంబరు 2021 (UTC)
- @Nskjnv గారు, తెవికీలో ఎక్కువ మంది సభ్యులు పెద్దగా పట్టించుకోని స్వాగత సందేశంపై ఆసక్తితో కొత్త ప్రతిపాదన చేయడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే మీ ప్రతిపాదనకు నేపథ్యం అనగా స్వాగత సందేశం లక్ష్యాలు, ప్రస్తుత సందేశం బలాలు, బలహీనతలు, ప్రతిపాదిత సందేశం ఎ విధంగా మెరుగైనదని తెలియపరచలేదు కావున మీ ప్రతిపాదనపై ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించలేకపోతున్నాను. మీరు గత పదిహేనేళ్లుగా స్వాగత సందేశం మారినతీరుని విశ్లేషించి, అలాగే ఇంగ్లీషు లేక ఇతర వికీలలో స్వాగత సందేశాలను పరిశీలించి, ప్రస్తుత స్వాగత సందేశంపై కొత్త వాడుకరుల స్పందనలను సమీకరించి, దాని ఫలితంగా ప్రతిపాదన చేసి సభ్యుల స్పందనలతో సవరించి మార్పుచేయటం మంచిదని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 06:18, 13 సెప్టెంబరు 2021 (UTC)
- అర్జునగారూ, ఈ స్వాగత సందేశం రూపు ప్రస్తావించడానికి నేననుకున్న ముఖ్య కారణాలు:
- వికీలో చేరే వాడుకరులు మొదటగా చూసేది స్వాగత సందేశం, అది వారి మార్గాలను సులభంగా కనుగొనేలా, వికీ పైన వారి అవగాహన పెంచేదై ఉండాలి.
- అంతర్జాల యుగంలో వస్తున్న మార్పులతో, గ్రాఫిక్స్ ఇమేజరీ ఉపయోగం ఎక్కువై విషయాలని స్ఫుటంగా, స్పష్టంగా (క్రిస్ప్ అండ్ క్లియర్) చూపే ధోరణి ఆచరణలో ఉంది. అందుకే వికీలో కూడా కేవలం సమాచారం పైనే కాకుండా చిత్రాలు, వీడియోలు , ఆడియోలపై ద్రుష్టి పెడుతున్నారని అని విశ్వసిస్తున్న.
- ఇలాంటి సమయాలలో జనాలని ఆకర్షించే విదంగా స్వాగత సందేశం ఉండాలి, 10000 బైట్ల సమాచారాన్ని చదవడానికి సమయం కేటాయించాలి అది కొంచెం కష్టం... దానికి బదులు ముఖ్యమైన 5-10 అంశాలను పైన చూపిన రూపులో ఉన్నట్లు చేర్చాలన్నది నా అభిప్రాయం.
- ఆంగ్ల వికీలో స్వాగత సందేశానికి సంబంధించి వివిధ ఉద్దేశిత స్వాగత రూపులను ఇక్కడ చూడవచ్చు. వారు వాడుకరుల దిద్దుబాట్లను బట్టి వివిధ రూపుల స్వాగత సందేశం అందిస్తున్నారు.
- అయితే ఈ కొత్త రూపు సమాచారాన్ని స్ఫుటంగా, స్ఫష్టంగా అందించగలదని నమ్ముతున్నాను.. ఇందులో ఇంకొన్ని గుణాత్మక మార్పులు అవసరం అవి సమూహ సభ్యుల సూచనలతో చేర్చవచ్చు.
- అర్జునగారూ, ఈ స్వాగత సందేశం రూపు ప్రస్తావించడానికి నేననుకున్న ముఖ్య కారణాలు:
- ఇక తెలుగు వికీలో గత 15 సంవత్సరాలుగా స్వాగత సందేశం రూపులో వచ్చిన మార్పుల గురించి నాకంటే మీరే చక్కగా విశ్లేషించగలరు, కావున ఆ విషయంలో మీ సహాయం కోరుతున్నాను.
- ఈ విషయంలో Nrgullapalli, ప్రభాకర్ గౌడ్ నోముల , శ్రీరామమూర్తి గార్ల సూచనలు చాలా అవసరమని భావిస్తున్న .. అలాగే సమూహ సభ్యులందరు మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 15:31, 22 సెప్టెంబరు 2021 (UTC)
- @Nskjnv గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు తెలిపిన వాటితో పాటు, నా దృష్టిలో గల కొన్ని లక్ష్యాలు ఏమిటంటే: 1) స్వాగత సందేశం ద్వారా చేరిన వాడుకరులకు సమగ్రమైన, వీలైనంత తాజాపరచబడిన, గందరగోళానికి వీలైనంత ఆస్కారంలేని సమాచారం అందించాలి. 2) వికీపీడియా ఖాతా తెరిచినవారు అప్పటికే వికీపీడియాలో సంబంధిత పేజీలను చదివి వుంటారు. కావున ప్రక్కపట్టీ లో గల లింకులను మరల స్వాగత సందేశంలో పెట్టటం ఉపయోగం వుండదు, వారు రచనలు చేయటానికి లేక చర్చలలో పాల్గొనటానికి కావలసిన ముఖ్య సమాచారం ( తెలుగు టైపింగ్, సంతకం చేయటం, సహాయం అభ్యర్ధించటం లాంటివి) తెలియచేయాలి. 3) స్వాగత సందేశంలో అంశాలు 5 లోపల వుండడం మెరుగు 4) వికీపీడియా స్వేచ్ఛగా పాలు పంచుకొనే సముదాయం కనుక, కొత్త వారిని వారు కోరకుండా ప్రాజెక్టులలో చేర్చటం మంచిది కాదు. ప్రాజెక్టు ఆహ్వాన సందేశాన్ని, తొలి స్వాగత సందేశం తర్వాత వేరుగా చేర్చవచ్చు. 4) నాణ్యత గల వీడియో పాఠాలేమైనా వుంటే వాటి లింకులు సంబంధిత పేజీలలోచేర్చడం మెరుగు. ఏమైనా క్లిష్టమైన అంశాలకు తప్పించి పాఠ్య రూపంలో చదవడం, అర్ధం చేసుకోవడం, వీడియో కంటే వేగవంతమైనది. 5) వికీపీడియా లో రచనలు చేయటానికి తగిన సమాచారం వివిధ రకాలుగా పొందవచ్చు, కొంతమందికి పుస్తకరూపం ఇష్టమవ్వచ్చు, మరికొంతమంది స్లైడుల రూపం ఇష్టమవ్వచ్చు. ఆ ఇష్టాలకు సంబంధించిన లింకులుండాలి. 6) స్వాగత సందేశంలో చాలా అరుదుగా మార్పులు జరిగేలా తీర్చిదిద్దడం మంచిది.
- గత కాలపు స్వాగత సందేశాలు కొంతవరకు పై లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చెందాయి. మీరు వాటిని పరిశీలించి ప్రతిపాదన సవరించితే బాగుంటుంది. ఆంగ్ల వికీలో తొలి స్వాగత సందేశం మూస ప్రధానంగా పోల్చి చూడటానికి వాడవచ్చు. అర్జున (చర్చ) 10:51, 25 సెప్టెంబరు 2021 (UTC)
- ఈ విషయంలో Nrgullapalli, ప్రభాకర్ గౌడ్ నోముల , శ్రీరామమూర్తి గార్ల సూచనలు చాలా అవసరమని భావిస్తున్న .. అలాగే సమూహ సభ్యులందరు మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 15:31, 22 సెప్టెంబరు 2021 (UTC)
- సాయి కిరణ్ గారూ, స్వాగత సందేశం కలర్ ఫుల్ గా, కొత్త వాడుకరులను ఆకట్టుకునేలా చాలా బాగుంది. నా తరపున కొన్ని సూచనలు ఉన్నాయి.
- స్వాగత సందేశం మనం చర్చా పేజీలో పెట్టిన తర్వాత ఆ వాడుకరికి ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళాలి. అలా అయితే తిరిగి వికీపీడియాలోకి వచ్చి చూస్తాడు. (మెయిల్ వెళ్తుంటే ఒకే)
- కొందరు, వ్యాసాలు చదువుతూ చదువుతూ వ్యాసం వెనక ఉన్నది ఎవరో అని తెలుసుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో భాగంగానే అకౌంట్ క్రియేట్ చేస్తారు. అలాంటి వాడుకరులకు కేటాయించబడిన గురువు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి. ఇటువంటి వాడుకరులే వికీలో వ్యాసాలు రాయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే నేనూ ఈ కోవకు చెందిన వాణ్ణే.. నేనూ ఇలానే నాకు తెలియకుండా వాడుకరి పేజీ సృష్టించుకున్నాను.(ఇక్కడ నా గొప్పతనం చెప్పుకోవడం లేదు. నా అనుభవం చెబుతున్నా అంతే😊)
- చాలా మంది వ్యాసం చదువుతూనే మొబైల్ వ్యులోనే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. వారికి డెస్క్‌టాప్ వ్యు అనే ఆప్షన్ మొబైల్లో ఉంది అన్న విషయం తెలియవచ్చు లేదా తెలియక పోవచ్చు. కానీ మనం పెట్టే స్వాగత సందేశం మొబైల్ వ్యూలో కూడా సరిగ్గా కనబడేట్టు ఉంటే బాగుంటుంది.
మీరు చెప్పినట్టు Nrgullapalli, ప్రభాకర్ గౌడ్ నోముల , శ్రీరామమూర్తి గార్ల సూచనలూ, సలహాలూ చాలా అవసరం కాబట్టి వారి ప్రతిస్పందనలు కూడా వాస్తాయేమో చూద్దాం.--అభిలాష్ మ్యాడం 14:06, 1 అక్టోబరు 2021 (UTC)
- సాయి కిరణ్ గారూ, స్వాగతం మూసను సంస్కరించే పని చేపట్టినందుకు ధన్యవాదాలు.
- స్వాగతం మా అభిప్రాయాలు కోరినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు ... నాగుర్లపల్లి, శ్రీరామమూర్తి గార్ల లాంటి పెద్దల పక్కన మీరు, అభిలాష్ మ్యాడం గారు, అభిప్రాయం నన్ను అడగడం చాలా సంతోషం. దశాబ్దకాలంగా నాగుర్లపల్లి గారు, ప్రతిరోజు వారిది బాధ్యతగా స్వాగతం పలుకుతారు,(వీరిని తప్పకుండా అభినందించాలి.) నేను, శ్రీరామమూర్తి గారు, అర్జునరావు గారు, వెంకటరమణ గారు అప్పుడప్పుడు,,, స్వాగతం పలుకుతాం... ఇక నా అభిప్రాయం... అర్జున గారు, చదువరి గారు చాలా మార్పులు చేశారు. ఇప్పుడు బాగానే ఉంది. గతంలో కొన్ని చెప్పాను, మళ్లీ గుర్తు చేస్తున్న ఇప్పుడు మొబైల్ వాడకందారులు సెర్చ్ ఇంజన్లు ఏ ప్రశ్న అడిగినా వికీపీడియా ప్రకారం అనే సమాధానం వికీపీడియా పేజీలు నేరుగా ఓపెన్ అవుతుంది. అలా వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగి ఖాతా తీసుకుంటున్నారు. ముఖ్యమైన అంశం నేను చెప్పాలనుకున్నది ఇక్కడే ఖాతా తీసుకునే సమయంలో ఖాతాదారుని ఈమెయిల్ తో పాటు మొబైల్ నెంబరు అభ్యంతరం లేని వారు ఇవ్వడానికి ఒక కాలం పెట్టాలని గతం నుండి ఈ ప్రతిపాదన చేస్తున్న ఇది వికీనియమాల కు అనుకూలమో వ్యతిరేకమో నాకు తెలియదు. ఇవి సాధ్యమవుతుందో లేదో పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి. ఇక రెండవది. గురుకుల పేజీ ప్రారంభించాము. ఇది సూపర్ మంచి పని. ఇక్కడ కూడా అభ్యంతరం లేని వారు గురువుగారు. వారి ఫోన్ నెంబర్ కూడా పెడితే బావుంటుందని నా ప్రతిపాదన. ఈ మొబైల్ నెంబరు ప్రతిపాదన అన్న కేవలం నలుగురిని కొత్త వాడుకరులు నిలబెట్టడానికి మాత్రమే. ఇక మూడవది. ఖాతా తీసుకున్న కొత్త వినియోగదారునికి లేదా ఏదైనా పేజీ ఓపెన్ చేయండి అనే వికీపీడియా పేజీ నేరుగా డెస్క్_ టాప్ లోకి పోయే విధంగా చూడండి. ధన్యవాదాలు. _ ప్రభాకర్ గౌడ్చర్చ 15:21, 3 అక్టోబరు 2021 (UTC)
విడిగా అక్షరాలరూపంలో పదాలు రాసేటప్పుడు ఏది ప్రామాణికం
మార్చుసాధారణంగా తెలుగుభాషలో పదాలకు బదులుగా పొడి అక్షరాల రూపంలో రాస్తుంటాం.తెవికీలో అసలు వీటికి సరియైన ప్రామాణికం ఏమిటి, ఎలా రాయాలి అనే దానిపై సందిగ్ధం ఉంది.తెవికీలో వివిధ రకాలుగా రాస్తున్నాం. అలా రాసే కొన్ని పదాలకు రాసే ఉదాహరణలు.
- తెలుగు దేశం – (టీడీపీ) – (టిడిపి) - (టి.డి.పి.) – (టీ.డీ.పీ.)
- యువజన శ్రామిక రైతుపార్టీ – (వైసీపీ) – (వైసిపి) – (వై.సి.పి.)- (వై.సీ.పీ)
- తిరుమల తిరుపతి దేవస్థానం – (టీటీడీ) –(టిటిడి) - (టి.టి.డి.)- (టీ.టీ.డీ)
- భారతీయ జనతాపార్టీ – (బీజేపీ) – (బిజెపి)- (బి.జె.పి.) - (బీ.జే.పీ)
ఇలా రాస్తున్నాం. పైవాటిలో మొదటి మూడు రకాలు ఎక్కువుగా రాస్తున్నారు.నాలుగవ రకం పొడి అక్షరాలు చాలా అరుదుగా రాస్తున్నారు. దినపత్రికలలో పై వాటిలో మొదటి పొడి అక్షరాల రూపంలో రాస్తున్నారు. దీనికంటూ తెవికీలో ఒక ప్రామాణికం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కావున సముదాయం చర్చించి ఒక నిర్ణయం చేయాలని కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:42, 10 నవంబరు 2021 (UTC)
- సంక్షిప్త పదాలు లేదా క్లుప్త పదాలు (Acronyms) రాసేటప్పుడు టిడిపి, టిటిడి, వైసిపి, తితిదే, బిజెపి లాంటి రూపాలకే నా ఓటు. అక్షరాలకు దీర్ఘాలు ఉండకూడదని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 17:14, 10 నవంబరు 2021 (UTC)
- @యర్రా రామారావు గారూ, వికీపీడియా:శైలి#వ్యక్తుల పేర్లు, వికీపీడియా:శైలి#కిలోమీటర్లు పొట్టి పదం లను పరిశీలించండి. ఆ ప్రమాణాలను మార్చాలనుకుంటే ప్రతిపాదన పెట్టండి. ఆ ప్రతిపాదనను ఈ పేజీకి అనుబంధ పేజీగా పెట్టండి. ఆ పేజీని, దానిలో తీసుకున్న నిర్ణయాన్ని ఉదహరిస్తూ "వికీపీడియా:శైలి" పేజీని తగువిధంగా సవరించుకోవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 01:28, 11 నవంబరు 2021 (UTC)
- రవిచంద్ర గారి అభిప్రాయమే నా అభిప్రాయం కూడానూ.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 03:59, 11 నవంబరు 2021 (UTC)
- రవిచంద్ర గారి ప్రతిపాదన బాగుంది. Nskjnv ☚╣✉╠☛ 07:17, 11 నవంబరు 2021 (UTC)
- నేను ఈ చర్చను రచ్చబండలో సాధారణ చర్చకు పెట్టటానికి బదులుగా పొరపాటున ప్రతిపాదనలలో ప్రవేశపెట్టాను. అసలు దీని ఉద్దేశ్యం వేరొకటి. నేను ఈ చర్చలో నా అభిప్రాయం కూడా రాయాల్సింది. దీని మీద గతంలో వికీపీడియా:శైలి#వ్యక్తుల పేర్లు విభాగంలో పొడి అక్షరాలు రాసేటపుడు ఎలా రాయాలి అనే దానిపై వివరణ ఉంది. దానికి ఉదాహరణగా ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు అని రాయాలని చూపించారు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)దాని ప్రకారం పైన నేను ఉదహరించిన నాలుగులో మూడవది (టి.డి.పి.) దీర్ఘం లేకుండా, అక్షరాల మధ్య ఖాళీ లేకుండా చుక్క పెట్టిరాయాలి. అయితే ఈ చర్చను ఎందుకు ప్రవేశపెట్టానో అనే ఒక సందేహం రావచ్చు. నేను వ్యాసాలలో సవరించేటప్పుడు ఇలా ఇన్ని రకాలుగా రాస్తున్నారు, శీర్షికలు పొడి అక్షరాలతో సృష్టించేటప్పుడు కూడా పైన వివరించిన ప్రకారం ఒకే పద్దతి పాటించకుండా పలు విధాలుగా రాస్తున్నారని అందరూ గమనించటానికి రచ్చబండ సాధారణ చర్చలో ప్రవేశపెట్టాల్సింది, పొరపాటున ప్రతిపాదనలలో పెట్టాను. దీనికి నేను క్షంతవ్యుడను.అయితే ఈ చర్చలో రవిచంద్ర గారూ , ప్రణయ్ రాజ్ గారూ, Nskjnv గారూ టిడిపి, టిటిడి, వైసిపి, తితిదే, బిజెపి పై వాటిలో రెండవ దానిపై అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ఇలా వాడటానికి ZWNJ (Zero Width Non Joiner) కాని పొడిపదాలకు సమస్య లేదుకానీ, ZWNJ సమస్య ఉన్న పదాలకు సమస్య ఉంది.దానికి ఉదాహరణగా ఎన్.టి.రామారావు కు బదులు ఎన్‌టి.రామారావు అని రాయాలి. గతంలో ఉన్న ఆ ప్రమాణాలను మార్చాలనుకుంటే చదువరి గారు సూచించినట్లు ప్రతిపాదనను తయారుచేసి ఈ పేజీకి అనుబంధ పేజీగా పెట్టి, దానిలో తీసుకున్న నిర్ణయాన్ని ఉదహరిస్తూ "వికీపీడియా:శైలి" పేజీని తగువిధంగా సవరించుకోవాల్సిఉంది. గతంలో వికీపీడియా:వ్యక్తుల పేర్లు లో వివరించిన పద్దతి సరియైనది.కాకపోతే ఇబ్బందల్లా మనం రాసుకున్నవి మనం పాటించకపోవటంలో తలెత్తుచున్న ఇబ్బందులు ఇవి.దాని వలన వ్యాసాలు ఉన్న పేజీలకు కూడా (అవుట్ గోయింగ్ లింకులు) ఎర్ర లింకులు చాలా ఎక్కువగా ఉంటున్నవి.వాటిని ప్రత్యేకంగా పైన చూపిన నాలుగు పద్దతులలో పరిశోదిస్తేకానీ, లింకు వ్యాసానికి కలవని పరిస్థితి. అలా కలిపిన చాలా లింకులు దృష్టిలో పెట్టుకుని నేను ఈ చర్చను వాడుకరులు గమనించటానికి ప్రవేశపెట్టాను తప్ప సవరించాలనే ఉద్దేశ్యంతో కాదని గమనించగోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:53, 12 నవంబరు 2021 (UTC)