వికీపీడియా చర్చ:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ

The following discussion is an archived record of a request for comment. Please do not modify it. No further edits should be made to this discussion.
A summary of the debate may be found at the bottom of the discussion.

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో విధానం గురించిన ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనను సవివరంగా ఈ చర్చాపేజీలో చర్చించి, మార్పుచేర్పుల సూచనలు ఇచ్చి విధానానికి తుది రూపు ఇవ్వడంలో తోడ్పడాలని వాడుకరులకు వినతి. కేవలం మార్పుచేస్తే బాగుంటుంది అని వదిలెయ్యకుండా, ఏమి మార్చాలో, ఎలా మార్చాలో కూడా సూచించవలసినదిగా విజ్ఞప్తి. సూచనలను #వాడుకరుల సూచనలు విభాగంలో రాయండి. అభిప్రాయాలను ఇతర విభాగాల్లో రాయండి. __చదువరి (చర్చరచనలు)

చురుకుదనం పరిశీలన తరచుదనం

"ప్రతి మూడు నెలలకు ఒకసారి - జనవరి మొదటి వారం, ఏప్రిల్ మొదటి వారం, జూలై మొదటి వారం, అక్టోబరు మొదటి వారంలో ఈ పరిశీలన జరుగుతుంది. అందుకు xtools లేదా అటువంటి ఇతర పరికరాలను వాడుకోవచ్చు." తెలుగువికీలో నిర్వాహకుల సంఖ్య, పని తక్కువకాబట్టి, సంవత్సరం కొకసారి జరిపితే సరిపోతుంది. --అర్జున (చర్చ) 04:32, 28 జనవరి 2019 (UTC)Reply

ఆరు నెలల కాలానికి అయితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 04:30, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply
సంవత్సరం కంటే ఆరు నెలలు మెరుగైన కొలత అని నా ఉద్దేశం.__చదువరి (చర్చరచనలు) 05:50, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply
సరే. కాని ఇటువంటి పనులకై పనిచేసేవారు అంతగా లేరు. ప్రయత్నించి చూద్దాం. --అర్జున (చర్చ) 09:54, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply
ఆరు నెలల కాలానికి అయితే బాగుంటుంది.--యర్రా రామారావు (చర్చ) 10:45, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply

మూడు నెలల నుండి ఆరు నెలల కాలానికి (ఏప్రిల్ మొదటి వారం, అక్టోబరు మొదటి వారంలో) అని సవరించాను. __చదువరి (చర్చరచనలు) 06:51, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply

అర్జున గారూ, ఈ సమీక్షను నిర్వాహకులు, అధికారులు మాత్రమే కాక, కనీసం 1000 దిద్దుబాట్లు చేసిన వాడుకరులెవరైనా చెయ్యవచ్చని మార్చాను, గమనించండి. అసలు దిద్దుబాట్ల సంఖ్యను లెక్కించేందుకు ఒక బాటు ఉంటే అత్యుత్తమం. ఇలాంటిదొకటి ఎన్వికీలో ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు పరిశీలించగలరా? __చదువరి (చర్చరచనలు) 01:25, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply
ఎక్స్-టూల్స్ లో లేని కొన్ని గణాంకాలను క్వారీ ద్వారా వెలికి తీయవచ్చు. గమనించగలరు.--రహ్మానుద్దీన్ (చర్చ) 14:53, 19 ఫిబ్రవరి 2019 (UTC)Reply

చురుకుదనానికి కొలబద్ద

తెవికీ చిన్న వికీకాబట్టి, సంవత్సరానికి 60 నిర్వాహక ఎడిట్లు చేస్తే చురుకుగా వున్నట్లు లెక్కించితే సరిపోతుంది. --అర్జున (చర్చ) 04:36, 28 జనవరి 2019 (UTC)Reply

ఆరు నెలలకు 50 అనేది సరైన కొలత అని నా ఉద్దేశం.

నిర్వహణా బాధ్యతల విషయంలో స్పష్టత

నిర్వహణా బాధ్యతలను మీరు ఏ విధంగా లెక్కించదలిచారో ఒకసారి స్పష్టంగా రాస్తే బావుంటుంది వాడుకరి:Chaduvari గారూ. ఎందుకంటే తొలగింపులు, నిరోధాలు, పేజీలు లాక్ చేయడాలు, హక్కులు ఇవ్వడాలు, దిగుమతులు వంటివి మాత్రమే ఎంచేందుకు తేలికగా కనిపిస్తాయి. https://xtools.wmflabs.org/adminstats/ వంటి ఉపకరణాలు వాడినా ఆ చర్యలే కనిపిస్తాయి. అయితే పాలసీలు, కొత్త నిర్వాహక హక్కుల మార్గదర్శకాల అంశాల్లో నిర్ణయం (ప్రతిపాదన ఎవరైనా చేయవచ్చు కానీ నిర్ణయం సాధారణంగా నిర్వాహకులే చేస్తారు), హెచ్చరికలు (ఇవి కూడా ఎవరైనా చేయవచ్చు కానీ నిర్వాహకులు చేయాలి, లేకపోతే నిర్వహణ కుంటుపడుతుంది) వంటివి కూడా నిర్వహణా బాధ్యతల్లో భాగమే. అవి చేశారో లేదో ఎలా గమనిస్తామన్నది తర్వాత చూద్దాం. ముందు అసలు ఉపసంహరణ పాలసీ వర్తించేప్పుడు ఏవేవి నిర్వహణా చర్యలన్నది సుస్పష్టంగా నిర్వచించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 06:14, 28 జనవరి 2019 (UTC)Reply

కింద ఇచ్చిన మార్పుచేర్పులను పరిగణన లోకి తీసుకోవాలని నా అభిప్రాయం.
  1. ఎక్స్‌టూల్స్‌లో చూపించే మార్పులు
  2. వికీపీడియా పేరుబరిలో - రచ్చబండను మినహాయించి - చేసే మార్పుచేర్పులు.
  3. మూస పేరుబరిలో చేసే మార్పుచేర్పులు
  4. మొదటిపేజీ నిర్వహణ
__చదువరి (చర్చరచనలు) 04:30, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఇవి కూడా పరిశీలించండి

రచ్చబండ లో చర్చకు పెట్టిన ఐదు వరస విభాగాలలో కనీసం మూడింటికి స్పందించక పోయిననూ--యర్రా రామారావు (చర్చ) 10:45, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply

రచ్చబండ సాధారణ చర్చలకు సంబంధించిన పేజీ కదా అనే ఉద్దేశంతో దాన్ని నిర్వాహక నియమాల్లో చేర్చలేదు. ఇతర సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూద్దాం.__చదువరి (చర్చరచనలు) 06:43, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply

రామారావు గారూ! రచ్చబండలో చర్చ నిర్వాహకులు మాత్రమే కాక మరెవరైన చేయవచ్చు. అంతేగాక క్రమేపీ రచ్చబండలో కేంద్రీకృతమై ఉన్న చర్చలు వికేంద్రీకరణ అవుతాయి, వికీపీడియా విస్తరించేకొద్ది అది జరిగుతుందన్నది పెద్ద సముదాయాలు ఉన్న వికీపీడియాలను చూస్తే తెలుస్తోంది. కాబట్టి వికీపీడియా పేరుబరిలో చర్చలు ఒకానొక కొలమానంగా సరిపోతుందన్నది నా అభిప్రాయం. పవన్ సంతోష్ (చర్చ) 17:04, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply

పరిశీలనా పద్ధతి విభాగానికి చేసిన మార్పులు

పరిశీలనా పద్ధతి విభాగంలో కొన్ని మార్పులు చేసాను, పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 06:49, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply

అలాగే.. @Arjunaraoc: @Pavan santhosh.s: @యర్రా రామారావు: ప్రవేశికలో తొలి పేరాగ్రాఫును చేర్చాను, చూడగలరు. __చదువరి (చర్చరచనలు) 07:07, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply
బావుంది చదువరి గారూ. --పవన్ సంతోష్ (చర్చ) 04:15, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply
బాగున్నాయి చదువరి గారూ --యర్రా రామారావు (చర్చ) 03:32, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply

స్వచ్చందంగా తప్పుకున్నవారు తిరిగి చేరేందుకు

నిర్వాహక బాధ్యతల్లోంచి తప్పించే మూడు పద్దతుల్లోనూ స్వచ్చందంగా తప్పుకునే పద్దతి లెక్క వేరు. స్వచ్చంద కృషి చేసేప్పుడు జీవితంలో ఇతరత్రా ఒత్తిళ్ళూ, హడావుడి వస్తే వికీ విరామమో, విశ్రాంతో తీసుకోవడం కద్దు. అలా చేయడం ఆ వికీపీడియన్ దీర్ఘకాలం కొనసాగడానికి సహకరిస్తుందన్న సిద్ధాంతాలూ ఉన్నాయి. వీటన్నిటిని పురస్కరించుకుని ఒక నిర్వాహకుడు/రాలు తాను స్వచ్చందంగా తప్పుకోవాలని భావిస్తే, వారు తిరిగి పనిచేయగల ఉత్సాహం పుంజుకుని వచ్చినప్పుడు చర్చ అవసరం లేకుండా ఆ బాధ్యత ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాను. అయితే మిగిలిన రెండు పక్షాల్లోనూ (అచేతనం కావడంతో సముదాయం తప్పించాల్సి వస్తేనే, దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణ ఋజువై తొలగిస్తేనో) ప్రతిపాదన, చర్చ తప్పనిసరిగా జరిగి గతంలో జరిగినట్టు ఎందుకు జరగదో, తమ కృషి ఎలా మెరుగ్గా వికీపీడియాకు ఉపకరిస్తుందో వివరించి, సముదాయం చర్చలో సాధారణ ఏకాభిప్రాయానికి వచ్చాకనే బాధ్యతలు ఇవ్వాలి. ఈ ప్రతిపాదన ఇతర సభ్యులూ, విధాన ప్రతిపాదకుని చర్చ కోసం పెడుతున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 17:13, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply

పై ప్రతిపాదనలకు నేను ఏకీభవిస్తున్నాను.అయితే ఒకటి, రెండు పక్షాలలో తిరిగి ఎంత కాలం తరువాత నిర్వాహక హోదా కొరకు ప్రతిపాదన|స్వీయ ప్రతిపాదన చేయవచ్చు --యర్రా రామారావు (చర్చ) 03:11, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ, స్వీయ ప్రతిపాదనలకు కాలావధులు నియమించే విషయం ఏమీ నేను ఆలోచించలేదండీ. --పవన్ సంతోష్ (చర్చ) 04:15, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఓటింగు విధానం

నిర్వాహకత్వ హక్కు ఉపసంహరణ ప్రతిపాదనలు వచ్చినపుడు, ఒక్కో అభిప్రాయానికి (అనుకూలం, వ్యతిరేకం, తటస్థం) ఎన్ని ఓట్లు పడ్డాయా (క్వాంటిటీ) అని కాకుండా, వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రాముఖ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం ఓట్ల సంఖ్య ప్రాతిపదిక కాకూడదు. రవిచంద్ర (చర్చ) 17:42, 10 ఫిబ్రవరి 2019 (UTC)Reply

రవిచంద్ర గారి సవరణ వికీ స్ఫూర్తి విషయంలో చాలా ముఖ్యమైనది. దీనికి నా మద్దతు. --పవన్ సంతోష్ (చర్చ) 11:41, 11 ఫిబ్రవరి 2019 (UTC)Reply
దీనికి నామద్దతు ప్రకటిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:24, 12 ఫిబ్రవరి 2019 (UTC)Reply
రవిచంద్ర గారూ ఈ విషయం ఈవరకే ఉంది కదా!? ఒకవేళ మీరు చెప్పేది నాకు అర్థం కానట్లైతే, విశదీకరించగలరు. __చదువరి (చర్చరచనలు) 04:32, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
చదువరి గారూ, పరిశీలనా పద్దతి అనే విభాగంలో రద్దుకు బలమైన కారణాలను చూపించాలి. అనే పాయింటు ఉంది కదా. దీని గురించేనా మీరంటున్నది? నేను అంటున్నది దీనికి జెనరలైజేషన్ లాంటిది. రద్దుకైనా, రద్దుకు వ్యతిరేకమైనా బలమైన కారణాలు చూపించాలి. ఓట్ల సంఖ్య ఒక్కటే ప్రాతిపదిక కారాదు. రవిచంద్ర (చర్చ) 05:12, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
రవిచంద్ర గారూ, పనిలో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి విభాగంలో "నిర్ణయం తీసుకునేటపుడు, కేవలం ఓట్లను మాత్రమే పరిగణన లోకి తీసుకోకుండా, వాడుకరులు రాసిన అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. ఇది వికీపీడియా స్ఫూర్తి." అని ఉంది కదా.. దాని గురించి రాసానండి. మీరు పైన చెప్పిన విభాగంలో కూడా అలాగే మార్చుకుందాం. __చదువరి (చర్చరచనలు) 05:37, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
అవును మీరు రాసింది నేను సరిగా చూడలేదు. సరిగ్గా నేను అనుకున్నదీ అదే. రవిచంద్ర (చర్చ) 06:09, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
రవిచంద్ర గారూ, మరోసారి పరిశీలించిన మీదట నాకు ఇలా అనిపించింది. పరిశీలనా పద్దతి అనే విభాగంలో ఇది రాయనక్కర్లేదు అనుకుంటానండి. ఒక విధానం ప్రకారం దిద్దుబాట్ల లెక్క అనే పద్ధతిలో ఉపసంహరణ ఖాయమైంది. కానీ ఆ నిర్ణయాన్ని తిరగదోడే విషయమై చర్చ ఇది. అందుగ్గాను వోటింగు మెజారిటీ బలీయమైనదని నాకు తోస్తోంది. మీరూ ఓసారి ఆలోచించండి. __చదువరి (చర్చరచనలు) 02:59, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply

సందేహాలు

1. స్వంత తప్పిదాలు పరిగణనలోకి తీసుకోవచ్చా?

2. XTools ప్రకారం నిర్వాహక చర్యలు 12 విభాగాలు ఉన్నవి. నియమాలలో నిర్వాహక ఎడిట్లు 6 నెలల కాలంలో 50 చేయాలి అనుకున్నాం. ఏ విభాగంలో నైననూ 50 నిర్వాహక ఎడిట్లు చేయవచ్చా? లేక ఏ విబాగంలో ఎన్నిటికి తక్కువ కాకుండా చేయాలి? అలా అయినప్పుడు కొన్ని విభాగలలో నిర్వాహక ఎడిట్లు చేసే అవసరం కలగపోవచ్చు లేదా కలగనూ వచ్చు.

3. ఈ నియమాలు వలన నిర్వాహకులు గతంలో కన్నా చురుకుగా నిర్వాహక ఎడిట్లు చేస్తారనుటలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి పక్షంలో ప్రస్తుతం 14 మంది నిర్వాహకులు ఉన్నారు. తలా 50 ఎడిట్లు చేయాల్సి వస్తే 700 నిర్వాహక ఎడిట్లు ఉండాలి.ఈ పరిస్థితి సాధారణంగా ఉండక పోవచ్చు. ఇంకా ఎక్కువే ఉండవచ్చు.ఒక వేళ అనుకోని సమయాలలో, లేదా ఊహలకు అందని పరిస్థితులలో 6 నెలలు కాలంలో వికీపీడియాలో 700 ఎడిట్లుకు తక్కువ వస్తే ఎలా పరిగణనలోకి తీసుకోవాలి.

4. ఆ ఆరు నెలలు కాలంలో ఎన్ని నిర్వాహక ఎడిట్లు వికీపీడియాలో సంభవించినవి లెక్కించుటకు తగిన అవకాశం ఉన్నదా?

గమనిక:ఇవి అన్నీ నాకు పూర్తిగా తెలిసి మీ ముందు ఉంచుట లేదు.నాకు తోచిన, వచ్చిన ఆలోచనలు మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:24, 12 ఫిబ్రవరి 2019 (UTC)Reply

యర్రా రామారావు గారూ, మంచి ఆలోచనలు సార్.
1 - అర్థం కాలేదు. వివరించగలరు.
2 - 50 దిద్దుబాట్లు ఏ విభాగంలో చేసినా సరిపోతుంది.
3 - మంచి పాయింటు లేవనెత్తారు. నా ఉద్దేశం - నిర్వాహకులందరూ కలిసి చెయ్యాల్సిన మొత్తం కనీస నిర్వాహక దిద్దుబాట్ల సంఖ్యకు (14 మంది నిర్వాహకులు X 50 దిద్దుబాట్లు = 700) మూడో నాలుగో ఐదో రెట్లు దిద్దుబాట్లు జరిగితేనే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. అంటే మొత్తం నిర్వాహకులందరూ కలిసి చేసిన నిర్వాహక దిద్దుబాట్లు 2100/2800/3500 ఉంటేనే ఈ నిబంధన అమలౌతుంది. మూడా నాలుగా ఐదా అనే విషయమై మీ అభిప్రాయం చెప్పండి సార్.
4 - అవకాశం ఉంది. కానీ దీన్ని ఆటోమేట్ చేసేందుకు ఒక బాటు ఉంటే బాగుంటుంది. వాడుకరి:Arjunaraoc, వాడుకరి:Pavan santhosh.s గార్లు ఈ బాటు విషయాన్ని పరిశీలీంచగలరు. __చదువరి (చర్చరచనలు) 01:19, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ, మొదటి పాయింటు అర్థమైంది. తాను చేసిన తప్పులనే సవరించుకుంటే, వాటిని పరిగణించవచ్చా అనేది ప్రశ్న, కదా! పరిగణించవచ్చు అని నా అభిప్రాయం. అవసరమైన దిద్దుబాట్ల సంఖ్యను పొందేందుకు, కావాలని తప్పులు చేసి, వాటిని సవరించే ప్రయత్నం చేస్తారు అని నేను భావించడం లేదు. ఒకవేళ అలా జరిగితే తెలిసిపోతుంది - ఒక ప్యాటర్న్ కనబడుతుంది. అప్పుడే తగు చర్య తీసుకోవచ్చు.
యర్రా రామారావు గారూ, మొత్తం కనీస నిర్వాహక దిద్దుబాట్ల సంఖ్య గురించి కొంత పరిశోధించాను. ఆరు నెలల కాలానికి ఆ సంఖ్య 1400 ఉండాలని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 02:03, 17 ఫిబ్రవరి 2019 (UTC)Reply
చదువరి గారూ మార్గ దర్శకాలుపై సందేహాలుకు తావు ఉండకూడదని నాఆలోచనలు వివరించాను. ఆరు నెలల కాలానికి 1400 ఉండాలని మీ ఉద్దేశం పై నేను ఏకీభవిస్తున్నాను.కాకపోతే దీనిమీద మరింత మంది అభిప్రాయం తెలిపితే బాగుంటుంది. ఆలోచించి నా సందేహాలుపై వివరణలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 13:12, 17 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఆలోచనల్లో

చాలా మంది వాడుకరులు ఇలా కొంత కాలం స్థబ్దంగా ఉండి తిరిగి సమయం కుదిరినపుడు మళ్ళీ చైతన్యమవుతారు. అలాంటి వారికి ఈ ఉపసంహరణ అనేది ఒక రకమైన అవమానంగానో లేదా వారిని తక్కువచేసినట్టో అనిపించవచ్చు. అలాంటి నిరాశాపూరితమైన ఆలోచన వలనతిరిగి చైతన్యమవకుండా అలాగే స్థబ్దంగా ఉండిపోవచ్చు. సమయాభావం వలన రాయలేని వారు వారికి వారుగా స్వచ్చందంగా తప్పుకోవాలనుకోవచ్చు, దీనికి కారణం వారిని ఎవరో తొలగిచడం కూడా వారికి అవమానంగా భావించవచ్చు, తమకు తాముగా వైదొలగి ఆపై సేవలను నిలిపివేసే అవకాశం ఉంది. మరోసారి స్థబ్దంగా ఉన్న నిర్వహకులను అందరినీ సంప్రదించి వారు నిజంగా వికీలో రాయడానికి సమయం కుదరడం ? లేదా వికిలోకి రావడానికి ఇష్టపడటం లేదా? అనే విషయాలపై చర్చించాలి. ప్రస్తుతం పైన ఉదహరించిన నియమనిబంధనలలో కూడా మార్పులు చేయాలని, పాలసీ రూపొందించే ముందు ఈ విషయాలపై కొంత చర్చించి నిర్ణయం తీసుకోగలరని నా మనవి..B.K.Viswanadh (చర్చ) 01:09, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply

B.K.Viswanadh గారూ, సమయాభావం వల్ల రాయలేక స్వచ్ఛందంగా తప్పుకునే నిర్వాహకులు తిరిగి తాము నిర్వాహక బాధ్యతలు వహించగలమని నిర్ణయించుకోగానే ఏ చర్చా లేకుండా కేవలం వారి ప్రకటన ఆధారంగా హక్కులు ఇవ్వవచ్చన్న నిబంధన పరిశీలించండి. నిర్వాహక హక్కుల ఉపసంహరణ అన్నది అవమానకరమని భావిస్తే ఈ నియమం అలా భావించేవారికి ఒక గౌరవమే కదా. ప్రత్యేకించి వికీపీడియాలో తాము స్వేచ్ఛగా నచ్చినప్పుడు పనిచేసుకోవచ్చన్న ఆలోచనను గౌరవించేలా దీన్ని చేర్చాను. మీ ఉద్దేశం తెలియజేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 02:26, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply
B.K.Viswanadh గారూ, మనం ఇక్కడ చేస్తున్నది విధాన రూపకల్పన మాత్రమేనండి. మనందరం చర్చించి ఒక విస్తృత ఏక్జాభిప్రాయానికి వచ్చాకే ఇది విధానమౌతుంది. అప్పటి వరకూ ఇది ప్రతిపాదనే. మీ అభ్యంతరాలు చెప్పారు, బానే ఉంది. విధానం ఎలా ఉండాలో సూచనలు కూడా చెయ్యాలని కోరుతున్నాను. మీరన్నట్టుగానే, సూచనలు చెయ్యమని నిర్వాహకులకు ఒక వారం కిందటే పేరుపేరునా రచ్చబండలో విజ్ఞప్తి చేసాను, గమనించే ఉంటారు. నిర్వాహకులే కాదు, వాడుకరులందరూ ఈ చర్చలో పాల్గొనవచ్చు. __చదువరి (చర్చరచనలు) 04:31, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
పవన్ సంతోష్ మరియు చదువరి గార్లకు, ఈ చర్చ కేవలం విధాన రూపకల్పనకు మాత్రమే అయితే ఇంత చర్చ అవసరం కాదేమో?. ప్రస్తుత కాలానుగుణ మార్పులను అనుసరించి చూస్తే అందరూ చాలా సున్నితంగానూ, అభిమానం కలవారుగానూ, ప్రతి విషయానికి అతిగా స్పందిస్తూ త్వరగా నిర్ణయాలు తీసుకునే వారుగానూ ఉన్నారు. అందుకే నా కొన్ని ఆలోచనలు
  • స్వచ్చందంగా తప్పుకున్నవారు మళ్ళీ చేరేందుకు ఉత్సాహం చూపిస్తే మళ్ళీ నిర్వహకత్వానికి అనుమతి కోరవచ్చు ఇది కొంతవరకూ సమంజసమే అయినా..... నా నిర్వహత్వాన్ని పునరుద్దరించమని వాడుకరి అడగాలి ? అడగటంలో ఇబ్బందులు లేకపోతే ఒకే.
  • నిర్వహక ఎడిట్లు నిర్దేశించిన ప్రకారం చేయలేదని బాధ్యత నుండి తొలగించిన నిర్వహక సభ్యుడు, సామాన్య వాడుకరిగా ఆపై కొనసాగుతారా?, సామాన్య ఎడిట్లైనా చేస్తారా?, దీనిపై సభ్యుల చర్చాపూర్వక స్పష్టత అవసరం అని నా అభిప్రాయం
  • నిర్వహకుడిగా తొలగించిన అనంతరం నిర్వహక మార్పులు చేయడం ప్రారంభిస్తే అపుడు ఏం చేస్తారు? మళ్ళీ నిర్వహకత్వానికి ప్రతిపాదిస్తారా?, రద్దును కొంతకాలానికి రద్దు చేస్తారా?, రద్దును ఎత్తివేస్తారా?, వాడుకరి మార్పులపై చర్చలు జరిపి తదనంతరం నిర్ణయం తీసుకుంటారా?
  • సంవత్సరానికి ఇన్ని నిర్వహక మార్పులు అనేదానిపై ఒకరి అభిప్రాయం మాత్రమే ఉంది. మరికొందరి అభిప్రాయాలూ, ఎన్ని అనే దానిపై నిర్ధారణకు మరికొంత చర్చ అవసరం అనుకుంటున్నాను..B.K.Viswanadh (చర్చ) 07:23, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
B.K.Viswanadh గారూ, విధాన రూపకల్పనకు మాత్రం కాబట్టే చర్చ అవసరం అని నా అభిప్రాయం.
  1. "..సామాన్య వాడుకరిగా ఆపై కొనసాగుతారా?" - నాకు తెలిసినంతలో, వాడుకరి అసలు దిద్దుబాట్లు చెయ్యకుండా ఎన్నాళ్ళున్నా వాడుకరిగా కొనసాగుతూనే ఉంటారు, తాను స్వచ్ఛందంగా ఖాతాను మూసేసుకుంటే తప్ప. ఆ సంగతి విస్పష్టంగా చెప్పాలి అనేది మీ అభిప్రాయమా?
  2. "అయితే స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్న నిర్వాహకుడు/రాలు తిరిగి తన సమయాన్ని నిర్వహణకు కేటాయించగలమని, సమర్థంగా నిర్వహించగలమని నిర్ణయించుకుని, దాన్ని నిర్వాహకుల నోటీసుబోర్డులో తెలిపితే వేరే ఏ చర్చ అవసరం లేకుండా అధికారులు వారికి హక్కులు తిరిగి ఇస్తారు. ఇతర విధాలుగా నిర్వాహకత్వ ఉపసంహరణ జరిగితే మళ్ళీ ప్రతిపాదించవలసి (స్వయంగా గాని, ఇతరుల ద్వారా గానీ) వస్తుంది." అనేది ప్రతిపాదన. మీ అభిప్రాయం చెప్పండి.
  3. "సంవత్సరానికి ఇన్ని నిర్వహక మార్పులు అనేదానిపై ఒకరి అభిప్రాయం మాత్రమే ఉంది. మరికొందరి అభిప్రాయాలూ, ఎన్ని అనే దానిపై నిర్ధారణకు మరికొంత చర్చ అవసరం అనుకుంటున్నాను.."- ఇద్దరి - అర్జున గారిది, నాదీ- అభిప్రాయాలున్నాయి. మీ అభిప్రాయం కూడా చెప్పగలరు. __చదువరి (చర్చరచనలు) 08:15, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
"సామాన్య వాడుకరిగా కొనసాగుతారా?" దీనికి నా సమాధానం. (ప్రస్తుత కాలానుగుణ మార్పులను అనుసరించి చూస్తే అందరూ చాలా సున్నితంగానూ, అభిమానం కలవారుగానూ, ప్రతి విషయానికి అతిగా స్పందిస్తూ త్వరగా నిర్ణయాలు తీసుకునే వారుగానూ ఉన్నారు) ఒక వాడుకరిని నిర్వహకహోదా నుండి తప్పిస్తే ఆ వాడుకరి ఎలా ఫీల్ అవ్వవచ్చు వికీలో ఎక్కువగా మార్పులు చేసిన, చేస్తున్న, అందరితో సఖ్యతగా ఉందే వాడుకరులను నిర్వహకుడిగా ప్రతిపాదిస్తుంటారు. తదనంతరం వారు తమ మార్పులనే చేస్తూ నిర్వహక పనుల్లో ఎక్కువగా పాల్గొనకపోతే వారిని తొలగించాలనుకుంటున్నాం. తొలగించిన తరువాత వారు ముందు ఉన్నట్టే, రాస్తున్నట్టే వికీలో కొనసాగటం జరుగుతుందా?, కొనసాగకపోతేనో?. దీనిద్వారా మనం ఏక్టివ్ వాడుకరులను కోల్పోయే అవకాశం ఉందా? ఉంటే దీనిపై కొంత చర్చద్వారా స్పస్ఠత కావాలేమో అనేది నా సందేహం..B.K.Viswanadh (చర్చ) 08:55, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
B.K.Viswanadh గారూ,
"దీనిద్వారా మనం ఏక్టివ్ వాడుకరులను కోల్పోయే అవకాశం ఉందా?" - ఆ అవకాశం లేదు. నిర్వాహకత్వం ఉంటేనే ఇక్కడ పనిచేస్తాను లెకపోతే అసలు వికీలో పనే చెయ్యను అని అనుకునే నిర్వాహకులు మనలో ఉన్నారని నేను అనుకోవడం లేదు.
మీ సూచనల కోసం చూస్తున్నాను సార్. __చదువరి (చర్చరచనలు) 01:44, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply

చదువరి గారు దీనిపై నేను మరోసారి మొత్తం చదివిన అనంతరం తటస్థంగా ఉండాలనుకుంటున్నాను.. నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే..B.K.Viswanadh (చర్చ) 14:53, 18 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నిర్వాహకత్వానికి గణాంకాలెందుకు ?

(చర్చ దీనికి సంబంధించినది అని భావించి, రచ్చబండలో నుండి ఇక్కడకు మార్చడమైనది)

తెవికీలో చురుకైన నిర్వాహకుల కొరత చాలా కాలం నుంచి ఉన్నదే. దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ పనులు చేయకపోవడం ఒకరకమైతే, ఇతర (స్వంత) పనులవల్ల తెవికీ సెలవులో ఉండటం మరొకటి. నిర్వాహణ పనులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, నిర్వహణకై సభ్యుల నుంచి విమర్శలు, చివాట్లు ఎదుర్కోవడం, నిర్వాహణ చేసిన వారిపైనే తోటి నిర్వాహకులు దాడిచేయడం ముఖ్యమైన మరొక్కరకం. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం తెవికీలో నిర్వాహకులు పలువులు ఉన్ననూ నేను చురుకైన నిర్వహణ నిర్వహించాను. అదే సమయంలో సభ్యుల నుంచి చీవాట్లు కూడా ఎదుర్కొన్నాను. నిర్వహణ ఇబ్బందులు నిర్వహణ చేసేవారికే తెలుస్తుంది. తోటి నిర్వాహకుల నుంచి ఎలాంటి సరైన సహకారం లేకపోవడం, పైగా పొరపాట్లు చేసిన వారికే మద్దతు తెల్పడం తదితర కారణాలతో నా నుంచి నిర్వహణ పనులు తగ్గిపోయాయి. నేను నిర్వహణ మానివేయుటకు కొంతముందు కూడా సరైన ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్ళి ఒక సభ్యుడిని పలుమార్లు హెచ్చిరించి తన ధోరణి ఎంతకూ మార్చుకోనందున ఒకరోజు, ఆ తర్వాత 3 రోజులు, ఆ తర్వాత వారం రోజులు నిరోధం విధించాను. వారం రోజుల నిరోధం రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతుందనగా తోటి నిర్వాహకులే ఆ సభ్యునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ నిరోధం తొలగించాలని ప్రతిపాదించడం నా నిర్వహణ పనులకు అడ్డంకిగా మారింది. ఎవరో ఒక తప్పు చేయగానే నేనేమీ చర్యలు తీసుకోలేను. చాలా కాలం నుంచి మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేస్తూ, ఎంత చెప్పిననూ ధోరణి మార్చుకొనక నిర్వాహణకు ఇబ్బందిగా మారినప్పుడు కూడా తోటి నిర్వాహకులు సహకరించకపోవడం ఇంతగా కాకున్నా కొంతైనా మునుపటి నుంచే కొనసాగుతోంది. రచ్చబండలో, నిర్వాహకుల నోటీసుబోర్డులో వివరించినప్పుడు వ్యాఖ్యానించని నిర్వాహకులు నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు భిన్నంగా వ్యాఖ్యానించడం సమంజసం అనిపించలేదు. ఒకానొకప్పుడు నేను ఒంటిచేత్తో నిర్వాహక పనులు కూడా చేసిన సంగతి అప్పటి సభ్యులకు బాగా తెలుసు. కేవలం నిర్వహణ కోసమే ఎంతో కాలం నా సమయం వెచ్చించాను. తెవికీకి ఒకప్పుడు పాఠకులు బ్రహ్మరథం పట్టారంటే నా వంతు కృషి కూడా ఉందని నమ్ముతున్నాను. వ్యాస నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ తెవికీని నాణ్యమైన విజ్ఞానసర్వస్వంగా మార్చడానికి అహరహం కృషిచేశాను. చివరికి తోటి నిర్వాహకులు అడ్డుతగిలి నన్ను నిర్వహణ పనుల నుంచి దూరం చేశారు. అయిననూ నేనేమీ తెవికీకి శాశ్వతంగా దూరం కాలేను. తోటి నిర్వాహకుల ధోరణి నచ్చనందుకు తాత్కాలికంగా మాత్రమే పక్కకు జరిగాను. తెవికీలో మళ్ళీ చురుకుగా ఉండాలనీ, రోజూ నిర్వహణ పనులు చేయాలనీ, తెవికీని చక్కదిద్దాలనీ, తెవికీకి పూర్వవైభవం తీసుకురావాలనీ నా మనసు ఉబలాటపడుతోంది. కాని ఇప్పుడు నిర్వహణ పనులు చేయడం లేదనీ ఏకంగా నిర్వహకత్వానికే ఎసరు తీసుకురావడం వింతగా తోస్తోంది. అసలు దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారికే ఈ నిబంధన వర్తింపజేస్తే బాగుంటుందేమో ! రెండేళ్ళవరకు దిద్దుబాట్లు చేయనివారిని ఎలాగూ స్టీవార్డులు తొలగిస్తారు (వారు కూడా ఏకపక్షంగా తొలగించరు. చర్చద్వారా, మెయిల్ ద్వారా సంప్రదిస్తారు). మరి ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యం ఎందుకో తెలియడం లేదు. తెవికీలో నిర్వాహకుల కొరత అంటూనే నిర్వాహకులను తొలగించడం ఎందుకో అర్థం కావడం లేదు. నిర్వహణ పనులు చేసే వారికి ఇబ్బంది కల్గజేయకుండా ఉంటే నిర్వాహకులు స్వచ్ఛందంగా మరియు సంతోషంగా పనిచేస్తారు. నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చు. కొంతకాలం క్రితమే ఇలాంటి సంఘటన కూడా జరిగింది. విజ్ఞానసర్వస్వం అంటే ఆషామాషీ కాదు. ఇందులో పనిచేయడం అంటే అనుకున్నంత సులభం కాదు. కాని ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చనే నిబంధనతో ఎవరికి వారు తమ ఇష్టమైనట్లు దిద్దుబాట్లు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేముకదా ! ఆ సమయంలో దానికి తగ్గట్టు బలమైన నిర్వహణ తప్పనిసరి. అదే ఇప్పుడు కొరవడింది. ఒకానొకప్పుడు దిద్దుబాట్ల సంఖ్య ఆధారంగా సభ్యులను అభినందించడం, పతకాలు ప్రధానం చేయడం ఉండేది. తెవికీ ప్రగతికి కావలసింది సంఖ్య కాదు నాణ్యత మాత్రమే అనీ, గణాంకాలకు ప్రాధాన్యత ఇస్తే తెవికీ నాణ్యత కుంటుపడుతుందనీ నేను పదేపదే చెప్పి చివరికి ఆ పద్దతిని మాన్పించాను. ఇప్పుడు నిర్వాహక పనులకు కూడా గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. గణాంకాలు పెంచుకోవడానికి నిర్వాహకుల మధ్య పోటీ ఏర్పడి చివరికి అసలైన నిర్వహణ కుంటుపడుతుంది లేదా సభ్యుల మధ్యన పోటీతో పాటు ఘర్షణ వాతావరణం ఏర్పడి నిర్వాహకుల మధ్య మనస్పర్థలు తలెత్తి చివరికి తెవికీకే నష్టం కలగవచ్చు. గతంలో దిద్దుబాట్లు పెంచుకోవడానికి సభ్యులు ఎలా పోటీపడ్డారో నాకు బాగా తెలుసు. చివరికి ఈ దిద్దుబాట్ల మోజులో పడి సభ్యులు హీనమైన దిద్దుబాట్లు చేసి వ్యాస నాణ్యతను తీవ్రంగా దిగజార్చారు. నిర్వహణ పనులకు కూడా గణాంకాలు వర్తింపజేస్తే నిర్వాహకులు నిర్వాహక పనులు చేయడం కంటే తమ గణాంకాలు చూసుకోవడానికే సమయం సరిపోతుందేమో! ఇప్పుడు చురుకైన నిర్వాహకులే కొద్దిమంది. వారిలో నిర్వహణ పనులు చేసేవారిని లెక్కించడానికి అరచేయి కూడా అవసరం లేదు. ఉన్న నిర్వాహకులను కాపాడుకోవాలి, వారి నిర్వాహక పనులకు సహకారం అందించాలి, అంతేకాని గణాంకాల ప్రకారం మీరు చురుకుగా లేరు కాబట్టి మీ నిర్వాహకత్వం పోతుందంటే ఇన్నేళ్ళు తెవికీకై అహరహం కృషిచేసిన వారిని అవమానపర్చడమే అవుతుంది. అంతేకాదు ఇప్పుడు చురుకైన నిర్వాహకులలో కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది. అసలీ ఆలోచన ఎందుకు ? ఏవో కొన్ని వికీలలో ఉన్నంత మాత్రానా అలాంటి నిబంధన మనకెందుకు ? ఈ నిబంధనకు ప్రాతిపాదిక ఏమిటి? తెవికీని చక్కదిద్దడానికి ఉన్న అవకాశాలు వదిలి ఈ నిబంధనపై సభ్యుల దృష్టి మళ్ళించడమెందుకు? పోనీ ఈ నిబంధనే చేశామనుకుందాం, అప్పుడు తెవికీ నిర్వహణ బాగుపడుతుందనే నమ్మకం ఉందా ? నిర్వహణ బాగుపడాలంటే నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మెరుగుపర్చాలి. తెవికీని ప్రగతిపథంలో నడిపించడానికి ఇతర వికీలలో మెరుగైన నిబంధనలు గమనించి అలాంటి పద్దతులు పాటించడానికి ప్రయత్నిస్తే నైనా తెవికీ బాగుపడవచ్చు. నిర్వాహకుడిగా కొనసాగాలంటే ఆ గణాంకాలను ఒక్క రోజులో సాధించవచ్చేమో కాని అది పిల్లచేష్టలా ఉంటుంది. అలాంటి అవసరం ఉండరాదు. నిర్వాహకత్వం అనేది హుందాగా కొనసాగాలి. అది స్వచ్ఛందంగా చేయాల్సిన ఒక విధినే కాని బాధ్యతగా మారరాదు. నిర్వాహకత్వం అనేది ఉత్సాహంగా చేసేటట్లుగా ఉండాలి కాని గణాంకాలను చేరుకోవడానికి ఆయాసపడేటట్లుగా కారాదు. నిర్వాహకత్వం అనేది శాశ్వతం కాదు, కాని ఏదో కొంతకాలం చురుకుగా ఉండనంత మాత్రాన (గణాంకాలు చూపనంతమాత్రాన) దూరం చేయడం భావ్యమూకాదు. ఇప్పుడు చురుకుగా ఉన్న సభ్యులు ఏవైనా నిబంధనలు రూపొందించుకోవచ్చు. పాలసీలు తయారుచేయడం కష్టమేమీ కాదు. కాని ఆ నిబంధనలు ఒకప్పుడు తెవికీ ప్రగతికి తోడ్పడినవారికి బాధ కలిగించకుండా ఉంటేచాలు. నిర్వాహకుల సంఖ్యకు పరిమితి ఉండి, ఆ పరిమితి వల్ల కొత్తగా నిర్వాహకులను తీసుకోవడం ఇబ్బందిగా ఉండి, ఇప్పుడున్న నిర్వాహకులు తెవికీకీ భారం అయితే చురుకుగా లేని నిర్వాహకులను తప్పకుండా తొలగించవచ్చు. కాని ఇప్పుడు తెవికీలో ఈ సమస్య ఏ మాత్రంలేదు. కాదుకాదు, ఇవేమీ కాదు, గణాంకాలే ముఖ్యం, నిర్వహణకు గణాంకాలే ప్రాతిపదిక, వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా సరే తెవికీలో నిర్వహణ గణాంకాలు చూపాల్సిందే అంటే మాత్రం మొదటగా నన్నే తొలగించండి. ఎందుకంటే నేను గణాంకాలను పూర్తి వ్యతిరేకిని. ఒకవేళ గణాంకాలకే మొగ్గుచూపుతూ నిబంధన చేస్తే నిర్వాహకత్వానికి రాజీనామా చేసేవారిలో నేనే ముందుంటాను. నిర్వాహణ అనేది సాధారణంగా సభ్యులు పొరపాట్లు చేసినప్పుడే తలెత్తుతుంది. సభ్యులు పొరపాట్లు చేయనప్పుడు నిర్వాహకులు తమ నిర్వాహణ గణాంకాలకై తామే కొత్త సభ్యుల లేదా అనామకుల (ఐపి అడ్రస్) అవతారమెత్తి పొరపాట్లు సృష్టించే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అలాచేసే అవకాశాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేము. తెవికీ అనేది ఇంకనూ చిన్న వికీనే. రోజూవారీ దిద్దుబాట్ల సంఖ్య చూసిననూ పరిమితమే. అందులో నిర్వహణ గణాంకాలకు సరిపడా పొరపాట్లు ఉండాయనుకోవడం అనుమాస్పదమే. నిర్వహణ దిద్దుబాట్ల సంఖ్యకై నిర్వాహకులు అతిగా ప్రవర్తిస్తే చివరికి కొత్త సభ్యుల పాలిట శాపంగామారి తెవికీ ప్రగతి మరింత కుంటుపడవచ్చు. నిర్వాహకులు కేవలం గణాంకాలపైనే దృష్టిపెడితే తెవికీ శుద్ధి, వ్యాసనాణ్యత తదితర గణాంకేతర నిర్వహణ పనులు కుంటుపడటం ఖాయం. అసలే చురుకైన నిర్వహకుల కొరత ఉన్న తరుణంలో కొత్తగా నిర్వాహకుల గణాంకాలు చూడటానికి ఒకరిద్దరిని కేటాయిస్తే అది వృధాప్రయాసగానే మారేపరిస్థితి తలెత్తవచ్చు. మొదటిపేజీ నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన కార్యము. దీన్ని నిర్వహణ గణాంకాలలో చేర్చినప్పుడు పలువులు నిర్వాహకుల మధ్య ఈ శీర్షిక నిర్వహణకు పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. దేనికైనా సరే పోటీ ముఖ్యమే కాని అది స్నేహపూర్వకంగా ఉండాలి కాని ఘర్షణ లేదా ఉద్రిక్తతగా ఉండరాదు. మొత్తంగా చూస్తే ఈ నిబంధనలు సభ్యులు పొరపాట్లు చేయాలని ప్రోత్సహించేటట్లుగా ఉన్నాయి. సభ్యులు చేసే పొరపాట్లకై నిర్వాహకులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం శోచనీయమైన విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:18, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నేను నిర్వహణ మానివేయుటకు కొంతముందు కూడా సరైన ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్ళి ఒక సభ్యుడిని పలుమార్లు హెచ్చిరించి తన ధోరణి ఎంతకూ మార్చుకోనందున ఒకరోజు, ఆ తర్వాత 3 రోజులు, ఆ తర్వాత వారం రోజులు నిరోధం విధించాను. వారం రోజుల నిరోధం రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతుందనగా తోటి నిర్వాహకులే ఆ సభ్యునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ నిరోధం తొలగించాలని ప్రతిపాదించడం నా నిర్వహణ పనులకు అడ్డంకిగా మారింది.

అన్నారు కదా. ఆ తోటి నిర్వాహకులు మీరు చేసిన నిరోధాన్ని అడ్డగోలుగా ఎత్తివేశారా, మిమ్మల్ని తొలగించమని ప్రతిపాదించారా? సరైన ప్రక్రియ ప్రకారం ముందుకువెళ్ళి మీరు నిరోధించినప్పుడు, వారు ఆ నిరోధం మీద మాట్లాడగలగడం అనే తమ హక్కునే వినియోగించుకుని ఉంటే అది మీకు ఎలా అడ్డంకి అయిపోతుంది. పోనీ మీమీద నాలుగో మూల స్తంభానికి వ్యతిరేకంగా ఆ చర్చలో వ్యక్తిగత దాడులు ఏమైనా జరిగాయా? లేదు కదా. (మీరు ఆ చర్చను పరిశీలించుకునేందుకు వీలుగా లింకులు ఏమీ ఇవ్వలేదు, మీరు రాసిన వాక్యాల ఆధారంగానే రాస్తున్నాను) ఉదాహరణకు పలు చర్చల్లో, పలు నిర్ణయాలపై మీరు వ్యతిరేకాభిప్రాయాలు వెలువరించిన, వ్యంగ్య బాణాలు సంధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, వాటిని అమలుచేసినవారో, నిర్ణయాలు తీసుకున్నవారో మీరు అడ్డంకి అనుకునివుంటే జరిగేది చర్చ కాదు రచ్చ. కానీ పలు సందర్భాల్లో చర్చల్లో మీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది, కొండొకచో స్వీకరించకపోయీ ఉండొచ్చు. మిమ్మల్ని అడ్డంకి అని మాత్రం వ్యాఖ్యానించడం జరగలేదు. స్వీకరించినా, తిరస్కరించినా అభిప్రాయం లేక చర్చ చేయగల హక్కును అడ్డంకి అని వ్యాఖ్యానించడం సరికాదు. అది అలా ఉంచితే తర్వాతి కాలంలో మీరు ఏ వాడుకరి గురించి అయితే ప్రస్తావిస్తున్నారో, ఆ వాడుకరిని మీరు ఎవరినైతే అడ్డంకి అంటున్నారో ఆ నిర్వాహకులు హెచ్చరించడం, నిరోధించడం మీరు చూసేవుంటారు కదా. మరి మీరు చేసిన కృషిని ముందుకు తీసుకుపోవడమో, మీకు సహకరించడమో అని అనిపించలేదా? --పవన్ సంతోష్ (చర్చ) 02:47, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply

మరోవైపున దాదాపు ఐదేళ్ళ పాటు కొనసాగిన నిర్వాహకుడొకరు చర్చల్లో నేరుగా దుర్భాషలు ఆడి ఆ విధంగా నాలుగో మూలస్తంభాన్ని అపహాస్యం చేసి సముదాయంలో సుహృద్భావం మీదే దెబ్బకొట్టి, పలువురు తోటి నిర్వాహకులు మొత్తుకున్నప్పుడు, కొందరు సున్నిత మనస్కులైన వాడుకరులు వచ్చినదారినే పోయినప్పుడు మీకు అసమంజసం అనిపించలేదు. ఆ నిర్వాహకుని చర్చాపేజీలోకి వెళ్ళి హెచ్చరించి, ప్రక్రియ ప్రకారం తొలగించిన దాఖలా లేదు. ఆ పని వేరే నిర్వాహకుడు తాను సచేతనం అయ్యాకా చేసేంతవరకూ వహించినది మహా సహనమే. ఆమాటకి వస్తే మొత్తం సముదాయమే ఏళ్ళ తరబడి సహిస్తూ, భరిస్తూ వచ్చింది. మరి వేరే సందర్భంలో కేవలం మర్యాదపూర్వకంగా ఫలానా నిర్ణయం సరైనదే, కాకపోతే వాడుకరి నేర్చుకున్నానంటున్నాడు ఒక అవకాశం ఇచ్చిచూద్దామని చెప్పిన మాటల్లో మాత్రం సామంజస్యం కనిపించలేదు. బహుశా మర్యాదపూర్వకంగా మాట్లాడే నిర్వాహకుడు భిన్నాభిప్రాయం కూడా వ్యక్తం చేసినా సమంజసం కాకపోయి ఎప్పుడూ దుర్భాషలాడే నిర్వాహకుడు వేరెవరిని ఏమన్నా దులిపేసుకునే అప్రకటిత నియమం ఏదైనా ఉందేమో. --పవన్ సంతోష్ (చర్చ) 03:36, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply
వాడుకరి:C.Chandra Kanth Rao గారు రాసిన దానిలో నాకు అర్థమైనవివి:
  • నిర్వాహకులు చురుగ్గా ఉండాలనే దాని పట్ల ఆయనకు భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే.. "తెవికీలో చురుకైన నిర్వాహకుల కొరత చాలా కాలం నుంచి ఉన్నదే" అని, "ఇప్పుడు చురుకైన నిర్వాహకులే కొద్దిమంది." అనీ ఆయన అన్నారు.
  • "అసలు దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారికే ఈ నిబంధన వర్తింపజేస్తే బాగుంటుందేమో" - అని అన్నారు. సరిగ్గా ఈ ప్రతిపాదనలో ఉన్న ముఖ్యమైన విషయం కూడా అదే. వారి అభిప్రాయం ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నట్టు గానే ఉంది. వారు మరోసారి ఈ ప్రతిపాదనను చదవాలని కోరుతున్నాను.
  • "అంతేకాని గణాంకాల ప్రకారం మీరు చురుకుగా లేరు కాబట్టి మీ నిర్వాహకత్వం పోతుందంటే ఇన్నేళ్ళు తెవికీకై అహరహం కృషిచేసిన వారిని అవమానపర్చడమే అవుతుంది." - పద్ధతి సరిగా లేదని వారు అంటున్నారు. వేరే, మరింత సబబైన పద్ధతిని సూచించమని వారిని కోరుతున్నాను. ఈ ప్రతిపాదనను తెవికీకీ వీలైనంత ప్రయోజనకరంగా ఉండాలనేదే మనందరి ఉద్దేశం.
  • "నిర్వహణ బాగుపడాలంటే నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మెరుగుపర్చాలి." - భేషైన సలహా. ఏయే నిబంధనలను ఎలా మెరుగుపరచాలో కూడా వారి అభిప్రాయం చెబితే బాగుంటుంది.
  • "సభ్యులు పొరపాట్లు చేయనప్పుడు నిర్వాహకులు తమ నిర్వాహణ గణాంకాలకై తామే కొత్త సభ్యుల లేదా అనామకుల (ఐపి అడ్రస్) అవతారమెత్తి పొరపాట్లు సృష్టించే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.", "సభ్యులు చేసే పొరపాట్లకై నిర్వాహకులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం శోచనీయమైన విషయం." అని కూడా రాసారు. ఉన్న సమస్యను బాగ సాగతీసి, స్వరూపం మార్చి చూపించే అవకాశం ఈ వ్యాఖ్యల ద్వారా కలుగుతుందని నాకు అనిపించింది. ఆ వ్యాఖ్యల వలన నిర్వాహకుల సదుద్దేశాన్నే శంకించడమనే ప్రమాదం ఉందని అందరం గ్రహించాలి. ఏదో రకంగా నిర్వాహకత్వాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకుంటుంది? ఉండదు గాక ఉండదు. ఆయన ఉద్దేశం కూడా అది కాకపోవచ్చు.
  • "అసలే చురుకైన నిర్వహకుల కొరత ఉన్న తరుణంలో కొత్తగా నిర్వాహకుల గణాంకాలు చూడటానికి ఒకరిద్దరిని కేటాయిస్తే.." అని రాసారు. నిర్వాహకుల పనితీరును విశ్లేషించేది మరొక నిర్వాహకుడే కానవసరం లేదు, వాడుకరులెవరైనా చెయ్యవచ్చు అని మార్చుకుందాం.
  • "ఒకానొకప్పుడు నేను ఒంటిచేత్తో నిర్వాహక పనులు కూడా చేసిన సంగతి అప్పటి సభ్యులకు బాగా తెలుసు. కేవలం నిర్వహణ కోసమే ఎంతో కాలం నా సమయం వెచ్చించాను. తెవికీకి ఒకప్పుడు పాఠకులు బ్రహ్మరథం పట్టారంటే నా వంతు కృషి కూడా ఉందని నమ్ముతున్నాను. వ్యాస నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ తెవికీని నాణ్యమైన విజ్ఞానసర్వస్వంగా మార్చడానికి అహరహం కృషిచేశాను. తెవికీ ప్రగతికి కావలసింది సంఖ్య కాదు నాణ్యత మాత్రమే అనీ, గణాంకాలకు ప్రాధాన్యత ఇస్తే తెవికీ నాణ్యత కుంటుపడుతుందనీ నేను పదేపదే చెప్పి చివరికి ఆ పద్దతిని మాన్పించాను." - ఇవి సాధించినందుగ్గాను వారికి అభినందనలతో.. __చదువరి (చర్చరచనలు) 05:32, 14 ఫిబ్రవరి 2019 (UTC)Reply
నాకు ఈ చర్చను సాగదీయాలని లేదు కాని సభ్యుడు:పవన్ నాపై చేసిన కొన్ని అభియోగాలకు సరైన సమాధానాలు తెవికీ సమూహానికి ఇచ్చే బాధ్యత నాపై ఉందని అభిప్రాయపడుతున్నాను. లేనిచో నేనే తప్పుచేశానని కొందరు పొరపడే అవకాశమూ ఉంది. ముందుగా నేను విశదపర్చాల్సింది "పలు చర్చల్లో, పలు నిర్ణయాలపై మీరు వ్యతిరేకాభిప్రాయాలు వెలువరించిన ... ... మీరు అడ్డంకి అనుకునివుంటే జరిగేది చర్చ కాదు రచ్చ" అనే అంశం గురించి. నిజమే చర్చలలో నేను భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకాభిప్రాయాలు వెలిబుచ్చాను. అసలు ప్రజాస్వామ్య పద్దతి అంటే ఏమిటి? చర్చలలో కాకుండా మన అభిప్రాయాలు (అవి వ్యతిరేక అభిప్రాయాలైనా సరే ) ఎక్కడ చెప్పాలి. ఒక చర్చలో అందరూ ఒకే అభిప్రాయం వెలిబుచ్చాలా? అలా అయితే అది చర్చ ఎలా అవుతుంది? సభ్యులు స్చేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పినప్పుడే సరైన నిర్ణయం/ఫలితం వస్తుందనేది నిజం కాదా? చర్చలలో మన వ్యతిరేక లేదా భిన్నాభిప్రాయాలు చెప్పినప్పుడు అది అడ్డంకి ఎలా అవుతుంది? చర్చ ముగిసి ఆ నిర్ణయాన్ని (సమూహ నిర్ణయాన్ని) అమలుచేసేటప్పుడు అభ్యంతరపర్చినప్పుడు మాత్రమే అది అడ్డంకి అవుతుంది. (నాకు మాత్రం నిర్ణయం అమలు జరిగే సమయంలో అడ్డుతగిలింది నిజం కాదా?) దానికీ దీనికీ పోలిక లేదు. భిన్నాభిప్రాయాలు/ వ్యతిరేకాభిప్రాయాలు వ్యక్తపర్చడానికీ అడ్డంకికీ చాలా తేడా ఉంది. ఒకవేళ చర్చలో కాని ఓటింగులో కాని బలమైన వాదన వినిపించడంతో ఆ చర్చ/ఓటింగ్ ఫలితం విఫలమైననూ, దానికి ప్రధానపాత్ర వహించిన సభ్యుడిని అడ్డంకిగా భావించడానికి వీలులేదు. అది చర్చలో భాగంగా మాత్రమే పరిగణించాలి. ఉదా:కు ఒక అధికార హోదాకై ప్రతిపాదనలో 13 సభ్యులు మద్దతు ప్రకటించిననూ కేవలం ఒకేఒక సభ్యుడి బలమైన వ్యతిరేకత వల్ల అధికారి హోదా లభించలేదు. అంతమాత్రాన ఆ వ్యతిరేక అభిప్రాయాలిచ్చిన సభ్యుడిని అడ్డంకిగా భావించలేము కదా! ఇక రెండవది "ఆ వాడుకరికి ఒక అవకాశం ఇచ్చిచూద్దామని ..." అంశం కూడా సరైనది కాదు. ఎందుకంటే ఒక అవకాశం కాదు కదా అవకాశాలపై అవకాశాలు ఇచ్చిననూ ఆ వాడుకరి సద్వినియోగం చేసుకోలేకపోయారు. రచ్చబండలో, ఆ సభ్యుడి చర్చాపేజీలో తెలిపి అందరి దృష్టికి తెచ్చి హెచ్చరికలు కూడా ఇచ్చిన తర్వాత మాత్రమే భవిష్యత్తులో మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా నిబంధనల ప్రకారం ముందుగా కేవలం ఒకరోజు నిరోధంతో ప్రక్రియ ప్రారంభించాను. అదేమీ శాశ్వత నిరోధం కూడా కాదు. కనీసం దిద్దుబాట్లు ఆపివేస్తేనైనా తదుపరి నిరోధం నుంచి తప్పించుకోవచ్చు. అలాంటప్పుడు ఆ సభ్యుడికి దిద్దుబాట్లు అయినా ఆపి, పని నేర్చుకోవల్సిందిగా చెప్పాల్సింది కాని ఏకంగా నిరోధం ఎత్తివేయాల్సిందిగా మరో చర్చనే ప్రారంభించడం కొనసాగుతున్న ప్రక్రియకు అడ్డంకి కాదా? మీరు ప్రారంభించిన చర్చకు ఇద్దరు మినహా సభ్యులు కూడా ప్రతిస్పందించలేరంటే సభ్యులు కూడా పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే చాలు. (ఆ సభ్యుడిపై ఆ తర్వాత కూడా నిరోధం గురించిన చర్చ వచ్చిందీ అంటే సభ్యుడు అసలే మాత్రం నేర్చుకోలేరు మరియు నిబంధనల ఉల్లంఘన మానలేరని విశదమౌతుంది). ఇక "చర్చల్లో నేరుగా దుర్భాషలు ఆడే నిర్వాహకుడి" గురించి చెప్పాలంటే అసలు ఆ సమయంలో నేను చురుకుగానే లేను. ఆ సంగతి నా దిద్దుబాట్లే చెబుతాయి. పోనీ నేనేమైనా ఆ సభ్యుడి దుర్భాషలకు ఏమైనా మద్దతు తెలిపానా? ఓటింగ్ ప్రారంభమైన తర్వాత తొలి ఓటు కూడా నాదే. మరి చర్చలలో పాల్గోనప్పుడు కేవలం ఓటింగ్ సమయంలో ఎలా వచ్చారన్నది మీ లాంటి వారికి సందేహం ఉన్నదని ఇప్పుడే గ్రహించాను. అసలు కారణమేమంటే ఒక నిర్వాహకుడు (అధికారి కూడా) నాకు మెయిల్ పంపి తెవికీలో మళ్ళీ చురుకుగా ఉండాలనే ప్రతిపాదన చేయడంతో ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి వచ్చింది (కొన్నేళ్ళ క్రితం కూడా సీఐఎస్ పదవిలో ఉన్న ఒక అభ్యర్థితో జరిగే చర్చలలో మీరు నాతో పాటు పలు నిర్వాహకులకు మెయిళ్ళు పంపి మన అభిప్రాయాలు రాయించిన సంగతి మీకు గుర్తుందనే అనుకుంటాను). ఒకవేళ చురుకుగా ఉన్నాసరే తప్పనిసరిగా ప్రతి చర్చలలో మన అభిప్రాయాలు ప్రకటించాలని ఏమీ లేదు. స్వచ్ఛందంగా చేసే పనిలో ఎవరినీ బలవంతం చేయరాదు. ఈ దానికే మీరు "... వహించినది మహా సహనమే" అనే మాటను ఉపయోగించారు. "బహుశా మర్యాదపూర్వకంగా మాట్లాడే నిర్వాహకుడు భిన్నాభిప్రాయం కూడా వ్యక్తం చేసినా సమంజసం కాకపోయి ఎప్పుడూ దుర్భాషలాడే నిర్వాహకుడు వేరెవరిని ఏమన్నా దులిపేసుకునే అప్రకటిత నియమం ఏదైనా ఉందేమో" అని చివరగా మళ్ళీ రాశారు. దుర్భాషలాడే నిర్వాహకుడిని ఇదివరకు చెప్పినట్లుగా నేనేమీ మద్దతు ప్రకటించలేను పైగా వ్యతిరేక ఒటు వేశాను. భిన్నాభిప్రాయం గురించి కూడా ఇదివరకే తెలిపాను. చర్చలలో, అభిప్రాయాలలో భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్య పద్దతిలో అత్యావశక్యం. ప్రజాస్వామ్యపద్దతిలో నడిచే తెవికీలో ఏ సభ్యుడైనా తమ అభిప్రాయాలు ప్రకటించవచ్చు. చర్చలో ఒక విషయంపై (వ్యవస్థపై కాదు) సభ్యుడు కొన్ని నిబంధనలకు లోబడి ఎంతైనా వాదించవచ్చు. ఈ అవకాశం అందరికీ ఇవ్వాలి. వ్యతిరేక అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలిచ్చే సభ్యులను అడ్డంకిగా భావించడమే పొరపాటు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:16, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఈ చర్చలో నా అభిప్రాయాలపై స్పందించిన చదువరి గారికి కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు నేను వెలిబుచ్చే అభిప్రాయాలు కొందరు సభ్యులు అడ్డంకిగా భావిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది. ప్రజాస్వామ్య పద్దతిలో మన అభిప్రాయాలను స్వేచ్ఛగా మరియు నిర్భయంగా రాసే అవకాశం తెవికీతో పాటు ప్రజాస్వామ్యపద్దతిలో నడిచే ఏ వ్యవస్థలోనైనా ఉందనేది నేను సభ్యులకు తెలియపరుస్తున్నాను. ఇక ఈ చర్చా విషయంలోకి వస్తే చాలా వాటికి సూచనలు, అభిప్రాయాలు అడిగారు. కొంతసమయం తీసుకొని మొత్తం ప్రతిపాదనలను పరిశీలించి తప్పకుండా నా అభిప్రాయాలు తెల్పగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:23, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply

చంద్రకాంతరావు గారూ, "వ్యతిరేక అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలిచ్చే సభ్యులను అడ్డంకిగా భావించడమే పొరపాటు." అన్నదే మీ ఉద్దేశమైతే, నిర్ణయం అమలు అవుతున్న సమయంలో ఆ నిర్ణయం పరిధిని వారం నుంచి కొద్దిరోజులకు కుదించుకొమ్మని కోరడం, పోనీ మీ భాషలో నిరోధం ఎత్తివేయమని వేరే చర్చ ప్రారంభించడమైనా, నిర్ణయంపై వ్యతిరేకత కూడా కాదు, అమలులో భిన్నాభిప్రాయం అవుతుంది. మీరు తిరస్కరించగలరు, తిరస్కరించారు కూడా. నేను మీ నిర్ణయమే అంతిమమని భావించి తల ఒగ్గడమూ జరిగింది తప్ప నిర్వాహక హక్కులను దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా తిరగదోడలేదు. నేను కూడా సముదాయ సభ్యులే పరిశీలించుకునేందుకు వీలుగా ఆ చర్చ లింకు ఇక్కడే ఇస్తున్నాను. ఇలాంటి చర్చ అడ్డంకి కాజాలదు. ఇక మీతో నాకు కొద్దిపాటిదైనా మంచి కామ్రేడరీ ఉంది, ఆ ముక్క మీరూ గుర్తుచేసుకోవడం సంతోషమే. కానీ మీరు తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించమని చర్చించినా "అడ్డంకి" అవుతుందని ఎన్నడూ ఊహించలేదు. ఎలాగూ లింకు ఇచ్చాను కాబట్టి ఎవరు కావస్తే వారు చదువుకుని తమ తమ అభిప్రాయాలు ఏర్పరుచుకునే వీలుంది. స్వస్తి. --పవన్ సంతోష్ (చర్చ) 16:25, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply
పవన్ గారూ నేను చర్చ ఆపాలనీ చూస్తున్ననూ మీరు పొరపాటు నాదేనన్నట్లుగా రాస్తున్నారు. నేను చెప్పిన "వ్యతిరేక అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలిచ్చే సభ్యులను అడ్డంకిగా భావించడమే పొరపాటు" అనేది కేవలం చర్చ జరుగుతున్న సమయానికి మాత్రమే సంబంధం అని గమనించగలరు. "నేను మీ నిర్ణయమే అంతిమమని భావించి తల ఒగ్గడమూ జరిగింది తప్ప నిర్వాహక హక్కులను దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా తిరగదోడలేదు" అని అన్నారు కాని వాస్తవంగా అలా జరుగలేదు. మీరు నిర్వాహక హక్కులు దుర్వినియోగం చేశారని నేను చెప్పడంలేను కానీ మీరు నా నిర్ణయానికి వ్యతిరేకంగా అమలు జరుగుతున్న ప్రక్రియకు భిన్నంగా మళ్ళీ చర్చ తీశారు, ఒక విభాగమే సృష్టించి సభ్యులకు చర్చను కొనసాగించమనీ కోరారు (కాని సభ్యులెవరూ స్పందించలేరనుకోండి). "మీరు తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించమని చర్చించినా "అడ్డంకి" అవుతుందని ఎన్నడూ ఊహించలేదు" అని కూడా అన్నారు కాని కేవలం పున:పరిశీలన మాత్రమే కాకుండా ఏకంగా చర్చనే తీశారు కదా! మీ ప్రతిపాదనను నేను అంగీకరించని తర్వాత నిబంధనల ప్రకారం అక్కడితో మీ ప్రయత్నాన్ని ఆపాల్సింది కాని మీరు అంతటితో ఆపక "చర్చను, ఇకపై నిర్వాహకుల నోటీసుబోర్డులో సాగించాల్సివుంటుంది. కనుక ఈ చర్చను నిర్వాహకుల నోటీసుబోర్డుకు కాపీ చేసి, అక్కడ సాగించేందుకు ప్రయత్నిద్దాం" అనీ, "... పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్తూ, చర్చ కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను" అనీ నిర్వాహకుల నోటీసు బోర్డులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లింకు ఇస్తున్నాను ఎవరైనా పరిశీలించుకోవచ్చు. శుభం సి. చంద్ర కాంత రావు- చర్చ 19:29, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply

వాడుకరి:C.Chandra Kanth Rao, వాడుకరి:Pavan santhosh.s గార్లకు, ఈ విషయంపై చర్చను మరోచోట, మరో సమయంలో చేద్దాం. ఈ పేజీలోని ప్రతిపాదనను చర్చించి, ఒక తుదిరూపానికి తీసుకువచ్చి, అమల్లోకి తీసుకువచ్చే దాకా ఆగుదాం. ఆ తరువాత ఈ వివాద విషయంపై చర్చ కొనసాగిద్దాం. రచ్చబండలో ఎలాగూ రాసారు కదా, అక్కడే చర్చిద్దాం. ప్రస్తుతానికి చర్చను ఈ ప్రతిపాదనకే పరిమితం చేద్దామని మీ ఇద్దరికీ వినతి. __చదువరి (చర్చరచనలు) 01:37, 16 ఫిబ్రవరి 2019 (UTC)Reply

చదువరి గారూ, అలాగేనండీ. ఈ చర్చ ఈ చర్చాపేజీలో ఇక చేయను. ఇద్దరమూ చెరొక లింకూ ఇచ్చాం కాబట్టి ఎవరైనా పరిశీలించుకునేందుకు వీలు ఎలానూ ఉంది. ఉంటానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 06:21, 16 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నిర్వాహక పనులు అంటే పొరబాట్లు దిద్దడం మాత్రమేనా?

పైన వాడుకరి:C.Chandra Kanth Rao గారు "సభ్యులు పొరపాట్లు చేయనప్పుడు నిర్వాహకులు తమ నిర్వాహణ గణాంకాలకై తామే కొత్త సభ్యుల లేదా అనామకుల (ఐపి అడ్రస్) అవతారమెత్తి పొరపాట్లు సృష్టించే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు." అనీ, వాడుకరి:యర్రా రామారావు గారు "స్వంత తప్పిదాలు పరిగణనలోకి తీసుకోవచ్చా? ", "6 నెలలు కాలంలో వికీపీడియాలో 700 ఎడిట్లుకు తక్కువ వస్తే ఎలా పరిగణనలోకి తీసుకోవాలి." అనీ రాసిన వాక్యాల వెనుక ఎవరైనా వికీపీడియా నియమాలు ఉల్లంఘిస్తూ, వికీపీడియా స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఉద్దేశపూర్వకంగానో, మరోలానో పొరబాట్లు చేస్తే వాటిని సరిదిద్దడం, హెచ్చరికలు పంపడం వంటివే ప్రధానంగా నిర్వాహక బాధ్యతలు అన్న ఉద్దేశాలు, భావాలు పునాది అని నేను అర్థం చేసుకుంటున్నాను. సముదాయం ఇతరత్రా చేసిన నిర్ణయాలు అమలు చేయడం కూడా దీనిలో భాగమని వారు అనుకుంటూ ఉండవచ్చు, చాలావరకూ అది పెద్దగా ఆ వాక్యాల్లో ప్రతిఫలించడం లేదు. ఈ నేపథ్యంలో నిర్వాహక పనులు అంటే పొరబాట్లు దిద్దడమేనా? అన్న ప్రశ్న వేసుకుని నా సమాధానం రాస్తున్నాను. దీనిపై తోటి సభ్యులూ తమ ఆలోచనలు పంచుకుంటే ఈ థ్రెడ్ మొత్తంగా చాలా ఉపయుక్తంగా తయారవుతుందనుకుంటాను.

నిర్వాహక చర్యలు
  • పొరబాట్లు దిద్దేలాంటివి: పేజీ తొలగింపులు, పునరుద్ధరణలు, నిరోధాలు, నిరోధాల తొలగింపు, సంరక్షించడం, సంరక్షణ తొలగింపు - ఇవన్నీ నిర్వాహకులు, అధికారులు మాత్రమే చేయగల పనుల్లో పొరబాట్లు దిద్దేలాంటివి. పైన సహ వికీపీడియన్లు వెలువరించిన ఉద్దేశాలన్నీ వీటి గురించే. ఇవీ ముఖ్యమైన పనులే కానీ, ఏకైక పనులు కావు.
  • ఇతర నిర్వాహక చర్యలు: ముఖ్యమైన మూసలు, మాడ్యూల్స్ వంటి ఇతరేతర అంశాలను దిగుమతులు చేసుకోవడం ఇతర నిర్వాహక చర్యలోకి వస్తాయి. హక్కులు కల్పించడం అన్నది అధికారులు చేయగల ఇతర పనులు.
  • పాలసీ రూపకల్పన, అమలు వంటివాటిలో నిర్ణయాలు: పాలసీలు, మార్గదర్శకాలు ఎవరైనా ప్రతిపాదించవచ్చు, తమ అభిప్రాయాలు చెప్తూ అనుకూలంగానో, ప్రతికూలంగానో రాయవచ్చు, కానీ నిర్ణయం ప్రకటించేప్పుడు మాత్రం పైన అభిప్రాయం ప్రకటించని తటస్థుడైన నిర్వాహకుడే (కొన్ని చిన్న వికీల్లో సచేతనమైన నిర్వాహకులే లేని పక్షంలో సీనియర్ సభ్యులు చేయవచ్చు. మనకా బాధ ఉండదు.) సముదాయం ఏకాభిప్రాయాన్ని అర్థంచేసుకుని పాలసీ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. పాలసీల అమలు విషయంలోనూ, వ్యాసాల తొలగింపు విషయంలోనూ సందిగ్ధతలు వచ్చినప్పుడు, చర్చ జరుగుతున్నప్పుడు నిర్వాహకులు పాలసీని వ్యాఖ్యానిస్తూ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది.
పరిపోషకమైన పనులు
  • మొదటి పేజీ నిర్వహణ: మొదటి పేజీ నిర్వహణ నిర్వాహకులే చేయాల్సిన పని కాదు. కానీ చేయదగ్గ పని. ఎందుకంటే, ఎందరెందరో పాఠకులు మొదట అడుగిడే అతి ప్రాముఖ్యమున్న మొదటి పేజీలో పాలసీలకు విరుద్ధమైన సమాచారం చోటుచేసుకునే అవకాశాన్ని నివారిస్తూ, తెలుగు వికీపీడియాలో ఉన్నంతలో అత్యంత నాణ్యమైన కంటెంట్ ప్రదర్శిస్తూండడం నిర్వాహకుల్లో కొందరు చేపట్టదగ్గ పని. ఇందులో ఈ వారం వ్యాసాలు, మీకు తెలుసా, ఈవారం బొమ్మ, చరిత్రలో ఈరోజు అన్న నాలుగు విభాగాలు ఉండగా, వాటిలో మొదటి రెండింటిమీదా చాలా చాలా పని ఉంటుంది. ఈ వారం వ్యాసాలకు ప్రతిపాదించడం, పనికివచ్చే వ్యాసాలను ఎంపిక చేసి మిగిలినవి తిరస్కరించడం, వాటికి మంచి ప్రవేశిక రాసి పెట్టడం వంటివి 52 వారాలకు చేయాలి. అలానే ఇప్పుడు రాస్తున్న వ్యాసాల్లో మంచి ఆసక్తిదాయకమైన అంశాలను తీసుకుని మీకు తెలుసా ఎప్పటికప్పుడు తాజాగా 52 వారాలకు చేర్చాలి. ప్రస్తుతానికి సంవత్సరాలుగా ప్రధానంగా బాధ్యత అంతా వాడుకరి:K.Venkataramana గారే మోస్తున్నారు. వాడుకరి:రవిచంద్ర ఆయనకు సాధ్యమైనంత మేరకు మంచి సాయం చేస్తున్నారు.
  • మంచి వ్యాసాలు మీద పని: మంచి వ్యాసాల ప్రతిపాదనలు, సమీక్ష కేవలం నిర్వాహకులే చేసే పనికాదు. వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలులోని ప్రమాణాలైన శైలి, నమ్మదగ్గ మూలాలు, వ్యాస పరిధి, తటస్థత వంటివి, ఉండకూడని మౌలిక పరిశోధన, కాపీహక్కుల సమస్యలు వంటివి మంచి వ్యాసం సమీక్షలో సైద్ధాంతికంగా చెప్పుకోవడం కాకుండా అమలులోకి తీసుకురావడానికి ఏమేం చేయాలో సూటి సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది, వాటిని ప్రతిపాదకులు అమలు చేయాలి. ఇవి రెండు విధాల నిర్వాహక పనికి ఉపకరిస్తాయి. ఒకటి సమీక్షించడం ద్వారా వాడుకరులకు ఈ అంశాల్లో సమస్యలు లేని పాఠ్యం రాయగల సమర్థత పెంపొందించి తద్వారా అసలు నిర్వహణా పనులు చేయాల్సిన తప్పిదాలు జరిగే అవకాశం పరిహరించవచ్చు, రెండు అసలంటూ వీటిని ఎలా అమలులోకి తీసుకువచ్చి ఒక వ్యాసాన్ని ఇలాంటి పరిధిలో తయారుచేయవచ్చు అన్న అవగాహన నిర్వాహకుడిలో ఉంటే అతను సరైన నిర్ణయాలు చేయడానికి ఉపకరిస్తుంది. కాబట్టి ఈ పని నిర్వహణకు మంచి పరిపోషకం.
ఇవన్నీ కాక
  • మూసల మీద పనిచేయడాన్ని కూడా ఈ సమీక్ష పరిధిలో పెట్టారు వాడుకరి:Chaduvari గారు.
  • ఇంకా పని సరిపోలేదనుకుంటే మొదటి పేజీలో వార్తల్లో అన్న విభాగం పెట్టుకుని, రోజువారీగానో, వారం వారీగానో వార్తల్లో ఉన్న వ్యాసాలు తయారుచేస్తూ, దిద్దుతూ, ఆ విభాగాన్ని విజయవంతంగా అప్డేట్ చేస్తే బోలెడంత పని.

ఇవన్నీ నిర్వాహకుడి పనులు సమీక్షించినప్పుడు ఆ పరిధిలోకి వచ్చేవే. ఇందులో ఎన్ని కేవలం తప్పొప్పులు దిద్దుకునే పనులు ఉన్నాయంటే, కొన్నే. ఈ పనులన్నీ చేయడానికి, మరీ ముఖ్యంగా ఇప్పటివరకూ తీసుకున్న పాలసీ నిర్ణయాలకు పేజీలు పెట్టుకోవడం, మొదటి పేజీని నిర్వహించడంలోనే ఎంతో పనికి ఆస్కారం ఉన్నప్పుడు, తామే తప్పులు చేసి తామే దాన్ని దిద్దుకుంటూ కూర్చోవడం అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాకూడదు. ఇన్ని ఉన్నాకా కూడా అలాంటి పనులు చేసే నిర్వాహకులే ఉంటే (నేను ఉంటారనుకోను) వారిని సాక్ పప్పెట్ విచారణ పద్ధతిలో విచారించి నిర్ణయం తీసుకుని సముదాయం చర్యలు తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మరోసారి చెప్పేదేమంటే నిర్వాహక పనులు కేవలం తప్పులు దిద్దడమే కాక మరి ఇంకెన్నో ఇతర నిర్మాణాత్మకమైన పనులతో కూడుకుని ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 03:00, 15 ఫిబ్రవరి 2019 (UTC)Reply

వాడుకరి:JVRKPRASAD సలహా, సూచన, అభిప్రాయములు

నిర్వాహాకుని చురుకుదనం పరిశీలన

ఒక వాడుకరి నిర్వాహాకుని (నిర్వాహాకురాలు)గా స్థితిని పొందేందుకు కొన్ని కొలమానాలతో పదవిని పొందడం జరుగుతుంది. ఏ కారణాల వల్లనో తను తెవికీలో స్వచ్చందంగా, పూర్వపు కాలంలో పాల్గొన్నట్లుగా కొంతకాలం నుండి తన సేవలు తెవికీకి అందించ లేని పరిస్థితులు వచ్చి ఉండచ్చును. ఇటువంటి సందర్భంలో స్వచ్చంద సేవ అనేది పూర్తిగా అది వారి వారి వ్యక్తిగత మైనది.

  • ఒక నిర్వాహకునిగా నియమించుటకు కనీస ప్రమాణకాలం పరిమితి ఆరు (6) నెలలు ఇచ్చు అధికారం అధికారులకు ఉంది. ఈ ఆరు నెలల కాలంలో తెవికీలో జరిగిన పనులను, ఇతర నిర్వాహకులు చేసిన పనులు ప్రగతిని పరిగణలోకి తీసుకోవాలి.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీలో గతించిన ఆరు నెలల కాలంలో చేసిన అతి తక్కువ కృషి యొక్క లెక్కని లెక్కించాలి, పట్టిక రూపొందించాలి.
  • ఒక నిర్వాహకు(రాలు)డు ఉంటూ నిర్వాహక పనులు కాకుండా, ఇతర సేవల పనులు ఎన్ని తెవికీకి చేసిననూ పదవికి వారు చేసిన సాధారణ కృషిని జోడించకూడదు.
  • నిర్వాహకుని దిద్దుబాట్లు ప్రతి ఆరు నెలల కాలవ్యవధిలో నిర్వాహాకత్వానికి ప్రమాణంగా తీసుకొనరాదు.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీలో గతించిన ఆరు నెలల కాలంలో చేసిన అతి తక్కువ కృషి యొక్క లెక్కని లెక్కించి, వారి పదవిని తప్పించే ముందు వారు ఏ కారణం వల్ల పనుల్లో పాల్గొనలేక పోతున్నారో ముందుస్తుగా ఏవిధమైన సమాచారము ఇవ్వని వారితో (వారి కారణాలు తెవికీ తెలుసుకోవల్సిన అవసరం లేదు) ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపరాదు.
  • ఒక నిర్వాహకు(రాలు)డును బ్రతిమాలి, బామాలి బలవంతంగా తెవికీ పనులలో పాల్గొనమని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతిపాదించ కూడదు. ఇది ఒక స్వంచ్చంద సేవ మాత్రమేనని ప్రతివారు గ్రహించాలి.
  • స్వంత తప్పిదాలు పనిగట్టుకొని ఎవరూ చేయరు. కానీ ఒకవేళ అలా పనిగట్టుకొట్టుకొని చేసే వ్యక్తులను తేలికగా ఇతరులు తెలుసుకో గలగుతారు, అటువంటి వారి పనులను చర్చలో పెట్టవచ్చును.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీ నుండి స్వచ్చందంగా తప్పుకోవటం అనేది బహు అరుదు. సమూహం ద్వారా తొలగించ వలసి ఉంటుంది. ప్రత్యక్ష వాడుకరులు కంటే పరోక్ష వాడుకరులు (వ్యక్తిగతంగా తరచుగా ఒకరినొకరు కలుసుకొనక, సమాచారము పంచుకొనక, ఒంటరిగా, దూరంగా ఉండేవారు, ...... ఇలాంటివారు) నిర్ణయం అనేది చాలా విలువైనది, పరిగణనలోకి తీసుకోదగ్గది.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీ నుండి తొలగించ బడినా సాధారణ వాడుకరిగా వారి సేవలు భవిష్యత్తులో కొనసాగించ వచ్చును.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీ నుండి తొలగించ బడినా వారిని అగౌరవ పరచినట్లు కాదు, వారిని కించపరచినట్లుకాదు, చిన్నతనం చేసినట్లు కాదు. కేవలం తెవికీ రోజువారీ పనులు కోసం కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లుగా భావించాలి.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీ నుండి తొలగించ బడినా లెదా స్వంచ్చందంగా తప్పుకున్నా తిరిగి ఒక మాజీ నిర్వాహాకునుగా పరిగణించి, తిరిగి అటువంటి వారికి తెవికీ సేవలలో పాల్గొనాలనుకునే ఉద్దేశ్యం, సమయం దొరికినప్పుడు ఆనాటి స్థితి, పరిస్థితులలను దృష్టిలో ఉంచుకుని అప్పుడు వారిని ఎలా తీసుకోవాలో సమూహం నిర్ణయించు కోవచ్చును. ఎకాఎకీగా తిరిగి అధికారం ఇవ్వడం అనేది మాత్రం సమంజసం కాదు.
  • ప్రస్తుత లేదా మాజీ అయినటువంటి నిర్వాహకులతో తెవికీలో వారితో ఒకే విధంగా వాడుకరులు గౌరవించి స్పందించాలి. వారినుండి నేర్చుకోవాల్సినవి ఎన్నే ఉంటాయి.
  • ఒక నిర్వాహకుని యొక్క నిర్ణయాన్ని ఇతర నిర్వాహాకులు వెంటనే వారి స్పందనలు తెలియజేయాలి. ఒక నిర్ణయం ఒక నిర్వాహాకుడు ఏదైనా సందర్భంలో తీసుకున్న తదుపరి అతిగా చర్చలు ఆ విషయము మీద అనవసరం అవుతాయి. ఓక నిర్వాహకుని మంచి నిర్ణయం ఇతర నిర్వాహకులు సమిష్టి నిర్ణయంగా తీసుకొని గౌరవించాలి.
  • సీనియర్ సభ్యుల నిర్ణయాలను ఇతర సభ్యులు గౌరవించుకోవాలి, పాటించాలి. మాజీ నిర్వాహకులు అనగా వారికి తెవికీ మీద అవగాహన ఉంటుంది.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీ నుండి తొలగించ బడినా లెదా స్వంచ్చందంగా తప్పుకున్నా వారు వారి పదవి నుండి వాలంటరీగా (స్వంచ్చందంగా) వారికివారే తప్పుకున్నట్లుగానే భావించాలి.
  • ఒక నిర్వాహకు(రాలు)డు తెవికీలో గొప్ప సాంకేతిక నిపుణుడు అయి ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. వారికి తోచిన, చేయగలిగిన సేవలు చేయుటకు అభ్యంతరం ఉండకూడదు.(సశేషం)---JVRKPRASAD (చర్చ) 07:38, 16 ఫిబ్రవరి 2019 (UTC)Reply
  • "నిర్వాహకుడు తెవికీలో గతించిన ఆరు నెలల కాలంలో చేసిన అతి తక్కువ కృషి యొక్క లెక్కని లెక్కించాలి, పట్టిక రూపొందించాలి." - అతి తక్కువ కృషిని లెక్కించాలా!? అర్థం కాలేదు.
  • "నిర్వాహకుని దిద్దుబాట్లు ప్రతి ఆరు నెలల కాలవ్యవధిలో నిర్వాహాకత్వానికి ప్రమాణంగా తీసుకొనరాదు." - తీసుకొనరాదా? అయితే ఎలా చెయ్యాలో వివరించగలరు.
  • "నిర్వాహకుడు తెవికీలో గతించిన ఆరు నెలల కాలంలో చేసిన అతి తక్కువ కృషి యొక్క లెక్కని లెక్కించి, వారి పదవిని తప్పించే ముందు వారు ఏ కారణం వల్ల పనుల్లో పాల్గొనలేక పోతున్నారో ముందుస్తుగా ఏవిధమైన సమాచారము ఇవ్వని వారితో (వారి కారణాలు తెవికీ తెలుసుకోవల్సిన అవసరం లేదు) ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపరాదు." - అంటే తొలగించేముందు వారికి సమాచారం అందించవద్దనా మీరనేది? సమాచారం అందరికీ అందించాలి, దానిలో వివక్ష కూడదు అనేది నా అభిప్రాయం.
  • "నిర్వాహకుడు తెవికీ నుండి స్వచ్చందంగా తప్పుకోవటం అనేది బహు అరుదు. సమూహం ద్వారా తొలగించ వలసి ఉంటుంది. ప్రత్యక్ష వాడుకరులు కంటే పరోక్ష వాడుకరులు (వ్యక్తిగతంగా తరచుగా ఒకరినొకరు కలుసుకొనక, సమాచారము పంచుకొనక, ఒంటరిగా, దూరంగా ఉండేవారు, ...... ఇలాంటివారు) నిర్ణయం అనేది చాలా విలువైనది, పరిగణనలోకి తీసుకోదగ్గది." - (ఈ ప్రత్యక్ష పరోక్ష అనే భావన అర్థం లేనిదని నా ఉద్దేశం. అయితే ఈ విషయంపై నేనిక ఇక్కడ చర్చించను.) వాడుకరులందరి అభిప్రాయాలన్నీ ఒకే విలువ కలిగి ఉంటాయి. ఒకదానికి విలువ ఎక్కువ, మరోదానికి తక్కువ అనేవి ఉండవు.
  • "ప్రస్తుత లేదా మాజీ అయినటువంటి నిర్వాహకులతో తెవికీలో వారితో ఒకే విధంగా వాడుకరులు గౌరవించి స్పందించాలి. వారినుండి నేర్చుకోవాల్సినవి ఎన్నే ఉంటాయి." - గౌరవం అనేది డిమాండు చేసి పొందేదో, నియమానుసారం పొందేదో కాదు. వ్యక్తులు వారివారి ప్రవర్తన మేరకు గౌరవం పొందుతారు.. అని నా అభిప్రాయం. మర్యాద ఇవ్వడం మాత్రం వికీలో తప్పనిసరి.
  • "నిర్వాహకుని యొక్క నిర్ణయాన్ని ఇతర నిర్వాహాకులు వెంటనే వారి స్పందనలు తెలియజేయాలి. నిర్ణయం నిర్వాహాకుడు ఏదైనా సందర్భంలో తీసుకున్న తదుపరి అతిగా చర్చలు ఆ విషయము మీద అనవసరం అవుతాయి. ఓక నిర్వాహకుని మంచి నిర్ణయం ఇతర నిర్వాహకులు సమిష్టి నిర్ణయంగా తీసుకొని గౌరవించాలి." నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ అర్థమైనంత మేరకు స్పందన రాస్తున్నాను.. మంచి నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. అంత మంచిది కాదనుకున్నప్పుడు ఆ సంగతి చెప్పాల్సిందే. మంచిది కాదని తేలితే, ఆ నిర్ణయాన్ని తిరగదోడాల్సిందే.
  • "సీనియర్ సభ్యుల నిర్ణయాలను ఇతర సభ్యులు గౌరవించుకోవాలి, పాటించాలి. మాజీ నిర్వాహకులు అనగా వారికి తెవికీ మీద అవగాహన ఉంటుంది." వాడుకరికి సీనియారిటీ ఉన్నంత మాత్రాన వారి నిర్ణయాన్ని గౌరవించాలనేమీ లేదు. నిర్ణయం సరైనదైతేనే ఆ నిర్ణయానికి గౌరవం లభిస్తుంది.
  • "నిర్వాహకుడు తెవికీ నుండి తొలగించ బడినా లెదా స్వంచ్చందంగా తప్పుకున్నా వారు వారి పదవి నుండి వాలంటరీగా (స్వంచ్చందంగా) వారికివారే తప్పుకున్నట్లుగానే భావించాలి." - తొలగించబడితే అది స్వచ్ఛందం ఎలా అవుతుంది సార్? ఇది తార్కికంగా లేదు.
  • "నిర్వాహకుడు తెవికీలో గొప్ప సాంకేతిక నిపుణుడు అయి ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. వారికి తోచిన, చేయగలిగిన సేవలు చేయుటకు అభ్యంతరం ఉండకూడదు." - అవును.
__చదువరి (చర్చరచనలు) 03:02, 17 ఫిబ్రవరి 2019 (UTC)Reply
  • ప్రతి నిర్వాహకుడు తెవికీలో గతించిన ప్రతి ఆరు నెలల కాలంలో నిర్వాహకుడుగా చేసిన కృషి వివరాలు అందరివీ ఒక పట్టిక రూపొందించాలి. అందులో అతి తక్కువ కృషి చేసిన నిర్వాహకుడు ఎవరో వాడుకరులు గుర్తించ గలరు. ఈ విధంగా ప్రతి ఆరు నెలల కాలం పట్టికలు అన్నీ ఒక జాబితాగా అన్ని వివరాలతో అందరికీ అందుబాటులో అందించాలి. ప్రతి నిర్వాహకుడు తను చేసిన కృషిని కూడా తెలుసుకోవచ్చును. నిర్వాహకులలో పోటీ మనస్థత్వం పెరుగుటకు అవకాశం ఉండవచ్చును.
  • నిర్వాహకునిగా ఉంటూ నిర్వాహకత్వానికి సంబంధం లేని సాధారణ దిద్దుబాట్లు అనేవి తన పదవికి మాత్రం లింకుగా తీసుకొనరాదు. కానీ వికీ అభివృద్ధికి సాధారణ దిద్దుబాట్లు అత్యవసరం, అవసరం అయినవి ఆయన కృషికి గుర్తింపుగా తీసుకోవచ్చును.
  • నిర్వాహకుడు తెవికీలో గతించిన ఆరు నెలల కాలంలో చేసిన అతి తక్కువ కృషి యొక్క లెక్కని లెక్కించి నప్పుడు ఎంత వరకు వారు సేవలు వికీకి అందించారో అందరూ తెలుసుకోవచ్చును. ఆరు నెలల పాటు ఒక నిర్వాహుకుడు ఎటువంటి సేవలు అందించలే నప్పుడు, ఆయనకు వ్యక్తిగతంగా స్వంచంధ సేవలు అందించే సమయం లేనట్లుగా గుర్తించాలి. తెవికీలో ఎందుకు సేవలు స్వచ్చందంగా పాల్గొనక లేక పోతున్నారో, ప్రతి వాడుకరి యొక్క వ్యక్తిగత కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం వికీలి అస్సలు ఉండకూడదు. వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారం ఏ ఒక్క వాడుకరికి అందించ బడదు అని ఒక పాలసీ చేసుకోవాలి. నిర్వాహాకునిగా ఉంటూ, కనీసం ఆరు నెలలకు అప్పుడప్పుడు అయినా బాధ్యతలలో పాలుపంచుకోనప్పుడు ఆ పదవి నిరర్ధకంగా మారిపోతుంది. సమాచారం అంతా తెవికీలోనే ఉంచితే, ఒక నిర్వాహాకునిని తొలగించే ముందు ఎటువంటి సూచనలు, సలహాలు, ఇత్యాదివి అందించారో ఒక రికార్డుగా అందిరికీ తెలుస్తుంది, భద్రంగా ఉంటుంది, భవిష్యత్తుకు ఒక మూలంగా ఉంటుంది. ఇతర పద్ధతులు ద్వారా అయితే ఏమి జరిగిందో ఎవరికీ ఏమీ తెలియదు.
  • ప్రత్యక్ష, పరోక్ష వాడుకరులు అనే భావం కొన్ని విషయాలలో అమలు అవుతున్నాయి, ఆ విధంగా ఉండకూడదు. వాడుకరుల అందరి అభిప్రాయములకు ఒకే విలువ తప్పకుండా ఇవ్వాలి.
  • వాడుకరులలో గౌరవభావం పెంపొందించుకుంటే, తెవికీకి కూడా ఒక విధమైన గౌరవం పెరుతుంది.
  • నిర్వాహకుని మంచి నిర్ణయాలు ఇతర నిర్వాహాకులు గౌరవించాలి.
  • మాజీ నిర్వాహుకుల నుండి ఇతర నిర్వాహాకులు, వాడుకరులు తెలుసుకోవాల్సినవి మంచి విషయాలు అనేకం ఉంటాయి.
  • తొలగించబడిన నిర్వాహకుడు ఒక మాజీ నిర్వాహకుడు. మాజీలు తప్పులు చేసిన వారు లేదా తెవికీలో పాల్గొనలేని వారు కావచ్చు అంత మాత్రాన వారు చెడ్డవారు కాదు. వారిని పనిగట్టుకొని మనసులో ఆగౌరవభావంతో చూడకూడదు. అందరూ స్వచ్చంద సేవకులు మాత్రమే, ఇది నెలవారీ జీతం పొందే వ్యవస్థ కాదు. ఇక్కడ వ్యక్తుల సమూహం నిర్ణయం మీదనే సేవలు అందించే ప్రతి వాడుకరి యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
  • తెవికీ అంటే అన్నీ ఉచిత సేవలు అందించే ఒక వ్యవస్థ అని ప్రతివారు తెలుసుకోవాల్సి ఉంటుంది.
JVRKPRASAD (చర్చ) 13:44, 17 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నిర్వాహాకుని తొలగింపు

  • ఒక చురుకుదనం లేని లేదా మౌననిర్వాహాకునిని తెవికీ తొలగించాలనుకున్నప్పుడు, సమూహ నిర్ణయం ద్వారా ఆ నిర్వాహకుని అభిప్రాయం వ్యక్తిగతంగా తెవికీలో పొందు పరచమని అడగటం ఉత్తమం.
  • నిర్వాహకుని పనితనం గణాంకాలు అంటే ఆయన/ఆవిడ హాజరు శాతం, చేసిన సేవ, పనులు, మొదలైనవి మాత్రమేనని గ్రహించాలి.
JVRKPRASAD (చర్చ) 02:14, 18 ఫిబ్రవరి 2019 (UTC)Reply
  • నిర్వాహాకుడుగా ఉంటూ నెలల తరబడి అందుబాటులో లేనప్పుడు కొత్తవాడుకరలకు ఏ చిన్నపాటి సందేహం నివృత్తి జరగదు.
  • నిర్వాహాకుడు ప్రతి వాడుకరి యొక్క సందేహాలు వెంట వెంటనే తీర్చగలిగినప్పుడు మాత్రమే తెవికీ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.
  • నిర్వాహాకుడు సాంకేతికంగా తెలిసి ఉంటే అటువంటి వారు ఇతరులకు నేర్పగలిగి ఉండాలి.
  • కుట్రలు, కుతంత్రాల మనస్థత్వంతో ఇతర నిర్వాహాకులను, వాడుకరులను ఇబ్బంది పెట్టే మనిషిని నిర్వాహక పదవి నుండి సత్వరమే తొలగించాలి.
  • తెవికీ గౌరవ భంగం కలిగించే పనులు చేసే, సమూహా మనసులు పక్కదారి పట్టించి, బహుమతులు వగైరా తీసుకువచ్చే నిర్వాహాకుని వెంటనే తొలగించాలి.
JVRKPRASAD (చర్చ) 02:27, 18 ఫిబ్రవరి 2019 (UTC)Reply

వాడుకరుల సూచనలు

చర్చావిషయంపై వాడుకరులు చేసిన సూచనలను వెలికితీసి ఈ విభాగంలో పెడుతున్నాను. వాడుకరులు నేరుగా ఈ విభాగంలో రాయవచ్చు - కానీ సూటిగా సూచనలను మాత్రమే రాయాలి. అభిప్రాయాలను వేరే విభాగంలో రాయండి. __చదువరి (చర్చరచనలు) 01:47, 17 ఫిబ్రవరి 2019 (UTC)Reply

స్వచ్ఛంద ఉపసంహరణ

చురుగ్గా లేని కారణంగా సముదాయంచే తొలగింపు

అర్జున: మూడు నెలలకు ఒకసారి కాకుండా సంవత్సరానికి ఒకసారి చురుకుదనాన్ని సమీక్షించాలి

చదువరి, యర్రా రామారావు: ఆరు నెలలకు ఒకసారి సమీక్షించాలి

మార్పు:ఆరు నెలలకు ఒకసారి సమీక్షించాలి.


పవన్ సంతోష్: ముందు అసలు ఉపసంహరణ పాలసీ వర్తించేప్పుడు ఏవేవి నిర్వహణా చర్యలన్నది సుస్పష్టంగా నిర్వచించాలి.

మార్పు: ఏయే చర్యలనుపరిగణన లోకి తీసుకోవాలో చేరుస్తూ పరిశీలన పద్ధతిలో తగు మార్పులు చెయ్యబడ్డాయి.


యర్రా రామారావు: రచ్చబండ లో చర్చకు పెట్టిన ఐదు వరస విభాగాలలో కనీసం మూడింటికి స్పందించక పోయిననూ, చురుకుదనం లేమికి కొలమానంగా భావించాలి.

చదువరి, పవన్ సంతోష్: రచ్చబండను ఒక కొలమానంగా భావించలేము.


యర్రా రామారావు: నిర్వహకుని నిర్వాహక దిద్దుబాట్లు 50 ఉండాలని అంటున్నారు, సరే. కానీ మొత్తం నిర్వాహక దిద్దుబాట్లు కనీస స్థాయిలో ఎన్ని ఉండాలి?

చదువరి: మొత్తం నిర్వాహకులందరూ కలిసి చెయ్యాల్సిన కనీస దిద్దుబాట్ల సంఖ్య 1400 ఉండాలి.

మార్పు: <ఇంకా చెయ్యలేదు>


చదువరి: నిర్వాహక దిద్దుబాట్లను లెక్కించేందుకు ఒక బాట్ ఉంటే బాగుంటుంది.


చంద్రకాంతరావు: అసలు దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారికే ఈ నిబంధన వర్తింపజేస్తే బాగుంటుందేమో

చదువరి: నిబంధనలు ప్రతిపాదిస్తున్నది అలాంటివారికే.


చంద్రకాంతరావు: సమీక్షించేందుకు నిర్వాహకుల సమయం ఖర్చౌతుంది.

మార్పు: నిర్వాహకులే కాకుండా, కనీసం వెయ్యి దిద్దుబాట్లు చేసిన వాడుకరి ఎవరైనా సమీక్షించవచ్చు.


యర్రా రామారావు: తామే చేసిన తప్పులను సవరించుకుంటే వాటిని నిర్వాహక గణాంకాల్లోకి పరిగణించవచ్చా?

జెవిఆర్‌కె ప్రసాద్: పరిగణించవచ్చు. స్వంత తప్పిదాలు పనిగట్టుకొని చేసే వారి పనులను చర్చలో పెట్టవచ్చును

చదువరి: పరిగణించవచ్చు.


జెవిఆర్‌కె ప్రసాద్: నిర్వాహకుని దిద్దుబాట్లు ప్రతి ఆరు నెలల కాలవ్యవధిలో నిర్వాహాకత్వానికి ప్రమాణంగా తీసుకొనరాదు


పనిలో లోపాలు, దుష్ప్రవర్తన కారణంగా తొలగింపు

నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం

పవన్ సంతోష్: నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం - స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నవారు, తాము కోరుకున్నపుడు ఏ చర్చా లేకుండా తిరిగి నిర్వాహకత్వాన్ని పొందవచ్చు. తొలగింపబడిన వారు మామూలు పద్ధతిలో ప్రతిపాదన, చర్చల ద్వారా పొందాల్సి ఉంటుంది.

యర్రా రామారావు: ఈ ప్రతిపాదన అంగీకారమే.

చదువరి: ఈ ప్రతిపాదన అంగీకారమే.

మార్పు: ఈ అంశం ప్రతిపాదనలో వివిధ విభాగాల్లో చేర్చబడింది.

జెవిఆర్ కె ప్రసాద్: నిర్వాహకుడు తెవికీ నుండి తొలగించ బడినా లెదా స్వంచ్చందంగా తప్పుకున్నా తిరిగి అటువంటి వారికి తెవికీ సేవలలో పాల్గొనాలనుకుంటే ఎకాఎకీగా తిరిగి అధికారం ఇవ్వడం అనేది మాత్రం సమంజసం కాదు. ఆనాటి స్థితి, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పుడు వారిని ఎలా తీసుకోవాలో సమూహం నిర్ణయించు కోవచ్చును. 

ఎనిమిది నియమాలు - పద్దెనిమిది అనుమానాలు

నిర్వాహకత్వానికి గణాంకాలను ఆపాదించడానికి క్రింది కారణాల వల్ల నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
1) నిర్వాహకులను గణాంకాలతో పోల్చలేము. నిర్వహణ అంటే నిర్వహణే. వారు చేసే పనులకు ఏ గణాంకమూ సాటిరాదు. నిర్వాహకులకు గణాంకాలను ఆపాదించడమంటే నిర్వాహకుల హోదాను దిగజార్చడమే అవుతుంది. అసలు కొన్ని నిర్వాహక పనులు గణాంకాలకు ఏ మాత్రం అందవు. కాని అలాంటి పనులే చాలా ముఖ్యమైనవి.
2) నిర్వాహకత్వానికి గణాంకాలు చూపెట్టడమంటే పరోక్షంగా బలవంతం చేయడంగా భావించవల్సి ఉంటుంది. ఇది స్వచ్ఛంధంగా పని చేయాల్సిన వికీ నియమానికి విరుద్ధం. సభ్యులైనా, నిర్వాహకులైనా ఇక్కడ చేసేది స్వచ్ఛంద పనే అనేది అందరికీ తెలిసిందే. స్వచ్ఛందంగా చేసే పనిలో గణాంకాలను అందుకోవాలనీ, లేనిచో మీ నిర్వాహక హోదా పోతుందనీ చెప్పడం సమంజసమేనా?
3) మెరుగైన నిర్వాహకుడు గణాంకాలను చూపడానికి ఇష్టపడడు. అలాంటివారిని నిర్వాహకులుగా తొలగించడం భావ్యమేనా! ఏ నిర్వాహకుడు ఏ సమయంలో ఉపయోగపడతాడో ఊహించలేము. సెలవులో ఉన్న నిర్వాహకుడు కూడా హఠాత్తుగా తెవికీలో వచ్చి ఒక పెద్ద సమస్యను తన నిర్వాహకత్వంతో పరిష్కరించవచ్చు. ఇవన్నీ గణాంకాలకు అందనివి.
4) గణాంకాల వల్ల పోటీ ఏర్పడవచ్చు. నిర్వాహకుల మధ్యన మనస్పర్థలు, వాదోపవాదాలు జరిగే అవకాశాలూ ఉన్నాయి. ఇదివరకు సాధారణ దిద్దుబాట్ల మధ్యనే పోటీ ఏర్పడిన సంగతి కూడా చూశాము. సాఫీగా నడవాల్సిన ప్రక్రియను మనకు మనమే అవాంతరాలు తెచ్చిపెట్టుకునే ఇలాంటి నిబంధనలు చేయకపోవడమే మంచిది.
5) గణాంకాలను చేరుకోజాలనని భావించిన నిర్వాహకుడు స్వచ్ఛంద ఉపసంహరణ చేసి కొంత కాలానికి మళ్ళీ నిర్వాహకుడు అయ్యే అవకాశముంది. మళ్ళీ మళ్ళీ ఉపసంహరణలు చేయడం, నిర్వాహకునిగా చేరడం వల్ల ఇతర నిర్వాహకులకు చికాకుగా అనిపించవచ్చు. తెవికీ సముదాయానికి ఇలాంటి పని భారంగా మారవచ్చు. స్వచ్ఛంద ఉపసంహరణ చేసిన నిర్వాహకుడు మళ్ళీ ఎంతకాలానికి నిర్వాహకుడు కావాలనే కాలం కూడా నిర్దేశించబడలేదు. ఈ అవకాశంతో గణాంకాలను చేరుకోలేని నిర్వాహకుడు ఉద్దేశ్యపూర్వకంగా స్వచ్ఛంద రాజీనామా చేసి కొంతకాలానికే మళ్ళీ సరాసరిగా నిర్వాహకుడౌతాడు. మరో 6 నెలలకు గణాంకాలు సరిపోనప్పుడు మళ్ళీ ఇదేవిధంగా చేస్తూ ఆయారాం గయారాంల మాదిరిగా తయారయ్యే అవకాశాలున్నాయి. (నిర్వాహకులను శంకించడం కాదు కాని ఈ అవకాశం మాత్రం ఉంది అని భావించండి)
6) నిర్వాహకుల గణాంకాల పని చూడటం తెవికీకి అదనపు భారంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి తెవికీలో నిర్వహణ చేసే చురుకైన సభ్యుల కొరత ఉంది. అలాంటప్పుడు నిర్వాహక గణాంకాలను చూడడమనేది సభ్యులపై మరింత భారం వేయడమే అవుతుంది. దీనితో ఆ మేరకు ఇతర పనులు కుంటుపడటం ఖాయం.
7) గణాంకాల వల్ల చురుకైన సభ్యుల పని వృధా కావడం జరుగుతుంది. గణాంకాలు పరిశీలించడం, ప్రతిపాదనలు చేయడం, సమీక్షలు చేయడం, అభిప్రాయాలు రాయడం ... ఇదంతా వృధాపని కిందనే పరిగణించవచ్చు. చురుకైన సభ్యుల విలువైన కాలాన్ని వృధాచేయడంగానే భావించవల్సి వస్తుంది.
8) గణాంకాలపై మోజుతో ఉండే సభ్యుల వల్ల తెవికీ నాణ్యత ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు గణాంకాల మోజులో పడే నిర్వాహకుల వల్ల నిర్వహణ నాణ్యత తగ్గిపోదనే నమ్మకం ఏమిటి? నిర్వాహకులందరూ గణాంకాలపై మోజుతో ఉన్నవారనీ దీని అర్థం కాదు, కాని ఈ విధంగా చేయరనే నమ్మకం ఏమిటి?
9) నిర్వాహకులు గణాంకాలు చేరుకోవడానికి ఉరుకులు వేయడం, గణాంకాలను చేరుకోలేని నిర్వాహకులను తొలగింపు ప్రతిపాదనలు చేయడం, ఓటింగులు, నిర్ణయాలు ... ఇవన్నీ గమనించే వారికి తమాషాగా, పూర్తి వినోదాత్మకంగా కనిపించడం ఖాయం. దీనికి అదనంగా ప్రక్రియలో దొర్లే పొరపాట్లపై వాదవివాదాలు షరామామూలే. తమాషా చూసేవారికి తెవికీ ఒక సర్కస్‌గా మారినా ఆశ్చర్యం లేదు. పలు చర్చలలో ఇప్పటికే కొందరు వ్యక్తులు కొత్త సభ్యుల అవతారమెత్తి సీనియర్ సభ్యులను సతాయించి తమాషా చూస్తున్నారు, మనకూ చూపిస్తున్నారు కూడా. తెవికీని బాగా పరిశీలించే వారికి ఇవన్నీ అనుభవమే.
10) నిర్వహణకు సరిపడా దిద్దుబాట్లు లేనప్పుడు నిర్వాహకులే కొత్తసభ్యుల అవతారమెత్తవచ్చు లేదా అనామకులు (ఐపీ అడ్రస్‌తో) వ్రాయవచ్చు కూడా. ఇలా చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. నిర్వాహకులను శంకించడం కాదు కాని ఈ అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని మాత్రం గుర్తించాలి. ఒక నియమం లేదా పాలసీ చేసేటప్పుడు ఇప్పటి పరిస్థితే కాకుండా భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కూడా ఊహించాల్సి ఉంటుంది. రేపు కొత్తగా వచ్చే నిర్వాహకులు ఎవరు, ఎలాంటివారు అనేది కూడా ఊహించాల్సి ఉంటుంది. ఎందుకంటే పదేళ్ళ క్రితం ఉన్న సభ్యులకు ఇప్పటి సభ్యులకు చాలా తేడా ఉంది. ఇలాంటి వారు రేపు నిర్వాహకులుగా మారరని గ్యారంటీ ఏమిటి? కొత్త సభ్యుల అవతారమెత్తిననూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్టీవార్డులకు చిక్కకుండా ఉండటం పెద్దపనేమీ కాదు. ఈ విషయాలన్నీ మనం ముందస్తుగానే పరిశీలించాలి.
11) పోలీసులే దొంగతనాలు చేయించి, దొంగలను పట్టుకొన్నట్లు చూపించి టార్గెట్లను చేరుకున్నట్టు చూపి ప్రమోషన్లు పొందే కథలను నవలలలో చూస్తుంటాము. అదే ప్రక్రియ ఇక్కడ జరగదని నమ్మడం ఏమిటి? దేనికైనా సరే మనం అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. అలా జరగదు అని అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీలులేదు.
12) అసలు నిర్వాహక ఎడిట్లను ఖచ్చితంగా విభజించలేము. నిర్వాహక ఎడిట్లకు, నిర్వాహకేతర ఎడిట్లకు మధ్య తేడా చూపడానికి ఎలాంటి సరైన కొలమానం చాలా వాటికి లేదు. అలాంటప్పుడు నిర్వాహక ఎడిట్ల సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకోవడం ఇబ్బందికర పరిణామాలకు దారితీయవచ్చు. వికీపీడియా పేరుబడితో (రచ్చబండ మినహా) చేసే మార్పులు, మూసలలో మార్పులు, మొదటిపేజీ నిర్వహణ మార్పులు నిర్వాహకులు కాని ఎవరైనా సభ్యులు చేయవచ్చు. ఆ పని సభ్యులే చేస్తే నిర్వాహకులు ఏమి చేయాలి?
13) నిర్వహణ దిద్దుబాట్ల సంఖ్యకు సరిపడా దిద్దుబాట్లు చేయకున్ననూ ఓటింగ్ ద్వారా సముదాయం కొనసాగించవచ్చనే దానికి అర్థం ఏమిటి? ఒకవైపు గణాంకాలు చేరుకోవాలనీ, మరోవైపు గణాంకాలు చేరుకోలేని నిర్వాహకులను ఓటింగ్ ద్వారా కొనసాగించవచ్చనీ భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అంటే తెవికీ సముదాయానికి "నచ్చిన" నిర్వాహకుడు గణాంకాలను చేరుకోవల్సిన అవసరం లేదన్నమాట ! అలాంటప్పుడు గణాంకాలెందుకు? "నచ్చని" నిర్వాహకులను ఎలాగూ ఓటింగ్ ద్వారా తొలగించే అవకాశం ఇప్పటికే ఉంది (కాకుంటే ప్రస్తుతానికి వారు చేసే పొరపాట్లకై ఎదురుచూడాల్సి ఉంటుంది !)
14) సమీక్ష అనంతరం నోటీసు ఇవ్వాలనీ, నోటీసు తర్వాత స్టీవార్డులను తెల్పి తొలగింపు అమలుచేయాలనీ ఉంది. తొలగింపుకే నిర్ణయం అన్నప్పుడు నోటీసు ఎందుకు? నోటీసు ఇస్తున్నామంటే సదసు సభ్యుడి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. మరి అతనిచ్చే వివరణ ఆధారంగా ఏమైనా మినహాయింపులు ఉన్నాయా ? ఉంటే ఎలాంటి మినహాయింపులు ? వివరణ సంతృప్తికరంగా లేనప్పుడు మాత్రమే తొలగింపుకై స్టీవార్డులను సంప్రదించాలి. కాని అభిప్రాయాలలో ఈ విషయం స్పష్టంగా లేదు. ఒకవేళ మినహాయింపులే లేనప్పుడు నోటీసులు ఎందుకు?
15) ఒక నిర్వాహకుడు గణాంకాలను చేరుకోకున్ననూ ఓటింగులో సభ్యుల "సహకారం"తో గట్టెక్కవచ్చు. మరో నిర్వాహకుడు తొలగింపునకు గురికావచ్చు. అంటే ఇక్కడ గణాంకాలు ముఖ్యమా? ఓటింగ్ ముఖ్యమా? ఓటింగే ముఖ్యమైతే గణాంకాలెందుకు? గణాంకాలే ముఖ్యమైతే ఆ తర్వాత మళ్ళీ ఓటింగ్ ఎందుకు? ఓటింగులో సంఖ్యకు కాకుండా అభిప్రాయాలకు విలువ ఉంటుంది, ఉండాలి కూడా. అలాంటప్పుడు ఏ ఒక్క సభ్యుడైనా బలమైన వాదన వినిపిస్తే మొత్తం ఓటింగుపై ప్రభావం తప్పకుండా పడుతుంది. మరి ఇంత చేసినా సమస్య మొదటికే వచ్చినట్లు కాదా?
16) గణాంకాలు చేరుకోలేని నిర్వాహకునిపై ముందుగా తొలగింపు చర్చ ప్రారంభించాలి, ఆ తర్వాత ఓటింగు, ఓటింగులో ప్రతిపాదన నెగ్గిన పిదప సదరు నిర్వాహకునికి నోటీసు, తర్వాత నోటీసు పరిశీలన .. చిన్న విషయానికి సుధీర్ఘమైన ప్రక్రియ జరిపిననూ చివరికి సాధించేది అనుమానమే. అలాంటప్పుడు ఈ ప్రక్రియ మొత్తం సభ్యులకు పనిభారమే తప్ప తెవికీకి లభించే నికర ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు. నిర్వాహకుడు స్వచ్ఛందంగా వదులుకుంటే ఏమీకాదు, కనీసం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 2 సం.లలో దిద్దుబాట్లు ఏమీ చేయకున్ననూ స్వచ్ఛందంగా వదులుకున్నట్లే, కాని కొత్త నిబంధనల ద్వారా బలవంతంగా నిర్వాహకహోదా తొలగిస్తే మాత్రం నియమాలు బాగా తెలిసిన ఆ తొలగింపు నిర్వాహకుడు తెవికీలో జరిగే నిర్వాహణ లోపాలను కడిగిపారేస్తే అప్పుడున్న నిర్వాహకులు నోరెళ్ళబెట్టాల్సి వచ్చే పరిస్థితిని కూడా మనం ముందుగా ఊహించాలి. లేదంటే కోరి కొరవితో తల గోక్కున్నట్లే అవుతుంది.
17) స్వచ్ఛందంగా చేసే పని కాబట్టి సాధారణంగా తీరిక సమయంలోనే నిర్వాహక పనులు చేస్తుంటారు. కొందరు ఉదయం, కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం, కొందరు అర్థరాత్రి సమయంలో తెవికీకి సమయం వెచ్చిస్తుంటారు. కొత్త సభ్యులు సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే దిద్దుబాట్లు చేస్తుంటారు. పొరపాటు చేసేది ఎక్కువగా కొత్త సభ్యులే కనుక ఆ పొరపాట్లను చక్కదిద్దడానికి ఆ సమయంలోనే నిర్వహణ పనులు చేసేవారికి గణాంకాలు అందుతాయి. అర్థరాత్రి సమయంలో తెవికీకి సందర్శించే నిర్వాహకులకు చేయడానికి ఏమీ ఉండకపోవచ్చు. అలాంటివారు నిర్వాహక హోదాలను త్యజించాల్సిందేనా?
18) గణాంకాలను చేరుకోలేని ఒక నిర్వాహకుడిని తొలగించకుండా ఉండేందుకు ఓటింగ్ ద్వారా అవకాశం ఉంది. అంటే నిర్వహణ గణాంకాలు లేకున్ననూ కొనసాగవచ్చన్న మాట (అదీ ఎవరైనా ప్రతిపాదన చేసినప్పుడే, తొలగింపు ప్రతిపాదన చేయనప్పుడు అదీ ఉండదు). మరి ఎవరిని బలి చేయడానికి ఈ నిబంధనలు. ఇదివరకే చెప్పినట్లు రెండేళ్ళవరకు తెవికీలో చురుకుగా లేనివారు ఎలాగూ తొలగింపునకు గురౌతారు. అంతకాలం కూడా ఆగడానికి మనకు ఓపిక లేనట్లయితే ఒక సంవత్సరంగా మార్చుకోవచ్చు. అంతేకాని ఈ గణాంకాల గారడీలెందుకు? గణాంకాలు చూపని నిర్వాహకులు తెవికీకి భారమేమీ కాదు. నిబంధన పెట్టి గణాంకాలు చూపాలన్ననూ అలాంటి నిర్వాహకులు గణాంకాలు చూపెడతారనే నమ్మకమూ ఉండదు. మొత్తానికి ఈ పాలసీ ప్రతిపాదన ఉద్దేశ్యమేమిటి?
గమనిక: చర్చలో ఏ సభ్యుడైనా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. ఇది ప్రజాస్వామ్య పద్దతి. తెవికీకి కూడా ప్రజాస్వామ్య పద్దతులే పునాది అని గమనించగలరు. పై అభిప్రాయాలను తేలిగ్గా కొట్టిపారేయకుండా బాగా ఆలోచించండి. ఈ అభిప్రాయాలన్నీ తెవికీ సంస్కరణలకేనని భావించండి. వ్యతిరేక అభిప్రాయాలు ఇచ్చానని కాకుండా ఎందుకు ఇచ్చాననే విషయం కూడా ఆలోచించండి. సమర్థన అభిప్రాయాలకన్నా, విమర్శనాభిప్రాయాలే పాలసీల రూపకల్పనకు, భవిష్యత్తులో జరగబోతే విపత్పరిణామాలకు బాగా దోహదపడతాయని గ్రహించండి. కొన్ని అభిప్రాయాలలో నిర్వాహకులను శంకించడం కాదు కాని అలాంటి అవకాశాలూ ఉన్నాయనీ అర్థం చేసుకోండి. తెవికీ ప్రగతే ముఖ్యం కాబట్టి రేపు నిర్వాహకుల మధ్య వాదోపవాదాలు జరగకుండా, నిర్వాహకుల విలువైన సమయం వృధాకాకుండా, నిర్వహణ గణాంకాలపై గందరగోళం తలెత్తకుండా, నిర్వాహకుల మధ్య దిద్దుబాట్ల పోటీలు ఏర్పడకుండా, గణాంకాలను చేరుకోలేని నిర్వాహకులకు బాధ కలుగకుండా ... తదితర కారణాలతో ఈ పాలసీ రూపకల్పనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 17 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఇదివరకు నేను రచ్చబండలో తెల్పిన అభిప్రాయాలకు కూడా సరైన విధంగా అర్థం చేసుకోలేకపోయారనిపిస్తోంది. ఉదా:కు "నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారికే అనే వాక్యానికి చదువరి గారు సమాధానం ఇస్తూ "సరిగ్గా ఈ ప్రతిపాదనలో ఉన్న ముఖ్యమైన విషయం కూడా అదే" అన్నారు. నా అభిప్రాయంలో "వారికే" అని ఉంది కాని "వారికి కూడా" అనే అర్థంలో సమాధానం వచ్చింది. దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ పనులు ఏ మాత్రం చేయని వారికైతే గణాంకాల అవసరమే ఉండదు. పై అభిప్రాయాలకు కూడా సమాధానం ఇచ్చేవారు బాగా పరిశీలించమని కోరుచున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:23, 17 ఫిబ్రవరి 2019 (UTC)Reply
గణాంకాల గురించి నాకు కూడా పట్టింపు లేదు. నేను ఇందులో తటస్థంగా ఉండదలుచుకున్నాను. కానీ నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ కచ్చితంగా ఉండాలి అని నా అభిప్రాయం. ముఖ్యంగా నిర్వాహకులుగా కొద్ది రోజులు పనిచేసే ఏదేని కారణాల వలన తెవికీకి పూర్తిగా దూరంగా ఉన్నవారు కేవలం నిర్వాహకుల జాబితాలో ఉండటం వల్ల తెవికీకి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. క్రియాశీలకంగా ఉన్న నిర్వాహకులు తెవికీలో నిర్వహణా సమస్యలు వెంటనే పరిష్కరించడం కుదరకపోయినప్పుడు కొంతమంది ఇంతమంది నిర్వాహకులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? అనే అభిప్రాయాలు వెలిబుచ్చడం చూశాను.
  • మీరు నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణకు అనుకూలమా, వ్యతిరేకమా?
  • వ్యతిరేకం అయితే కేవలం గణాంకాల ద్వారా నిర్వహకుడిగా తొలగించడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారా?
  • ఒకవేళ అనుకూలం అయితే తొలగింపుకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలిగా? అందుకు కొన్నాళ్ళు తెవికీకి దూరంగా ఉన్నవారు అనుకున్నాము. అది ఎంతకాలం అని మీరనుకుంటున్నారు? ----రవిచంద్ర (చర్చ) 13:00, 18 ఫిబ్రవరి 2019 (UTC)Reply
నిర్వహకహక్కుల ఉపసంహరణ జరగాలి అనుకుంటే కొన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క దిద్దుబాట్లు చేయని నిర్వహకుల వారి కొరకు అయితే నాకు అభ్యంతరం లేదు. లేదా నిర్వహక దిద్దుబాట్లు యొక్క కాలపరిమితిని మరికొంత పెంచడం మార్పుల యొక్క సంఖ్యనూ తగ్గించడం చేయాలని నా అభిప్రాయం..B.K.Viswanadh (చర్చ) 14:50, 18 ఫిబ్రవరి 2019 (UTC)Reply

1) మీరు నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణకు అనుకూలమా, వ్యతిరేకమా? → నిర్వాహక హక్కులు శాశ్వతంగా ఉండాలని చెప్పడం లేదుకదా! ఇంగ్లాండ్ లార్డ్స్ సభలో ఒకసారి సభ్యుడైతే జీవితకాలం సభ్యుడిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెవికీలో ఒకసారి నిర్వాహక హోదా పొందితే శాశ్వతంగా ఉండాలని మనం అనుకోవడం లేదు. గత కొన్నేళ్ళలోనే ఎందరికో నిర్వాహక హోదా దూరమైంది. స్టీవార్డులు రెండేళ్ళు ఎలాంటి దిద్దుబాట్లు చేయని నిర్వాహకులను ముందుగా సముదాయం మరియు సంబంధిత నిర్వాహకుని అభిప్రాయాలు అడుగుతారు. రచ్చబండలో తెల్పిననూ మనమూ అభ్యంతరపర్చడం లేదు. కాబట్టి రెండేళ్ళు చురుకుగా లేని నిర్వాహకులు తొలగింపునకై గురౌతున్నారు. దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు. ఈ ప్రక్రియ సాఫీగా కొనసాగుతోంది. నిర్వాహకహోదా దుర్వినియోగం చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకొని వారి నిర్వాహకహోదా తొలగించడానికి ఇప్పటికే అవకాశం ఉంది, ఆ పని కూడా చేస్తున్నాము. దీనికీ నా సహకారం అందజేశాను.
2) ... కేవలం గణాంకాల ద్వారా నిర్వహకుడిగా తొలగించడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారా? → గణాంకాల ఆధారిత ప్రతిపాదిత నియమాలకే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. గణాంకాల ఆధారిత ప్రక్రియ చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దీనికి కారణాలు ఇప్పటికే చెప్పాను.
3) ... తొలగింపుకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలిగా? ... అది ఎంతకాలం అని మీరనుకుంటున్నారు? → ఇప్పటికే నిర్వాహకుల తొలగింపు 2 రకాలుగా జరుగుతోంది. మొదటిరకం ప్రకారం స్టీవార్డులే రెండేళ్ళు చురుకుగా లేని నిర్వాహకులను (అభిప్రాయం కోరి స్పందించనప్పుడు) తొలగిస్తున్నారు. రెండోరకం నిర్వాహక హక్కుల దుర్వినియోగం చేస్తే మనమే సభ్యుల అభిప్రాయాల/ఓటింగు ప్రకారం తొలగిస్తున్నాము. ఇటీవలే జరిగిన ఇలాంటి తొలగింపు ప్రక్రియలో చురుకుగా ఉన్న తెవికీ సముదాయం మొత్తం దాదాపుగా పాల్గొంది. ఈ ప్రక్రియపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు. అంటే 2 రకాలుగా నిర్వాహకహోదా తొలగింపు ఇప్పటికే అమలులో ఉంది. (కాలవ్యవధి మరియు నిర్వాహక హక్కుల దుర్వినియోగం). కాలవ్యవధి 2 సం.లు సరిపోతుందనుకుంటున్నాను. ఇది మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఒక సం.కి మనం తగ్గించుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:36, 19 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ విధివిధానాల ప్రతిపాదనలో నాకు ఎటువంటి అభ్యంతరాలు కనిపించలేదు. యథాతథంగా అమలు చేయవచ్చు.స్వరలాసిక (చర్చ) 03:00, 22 ఫిబ్రవరి 2019 (UTC)Reply
నిర్వాహకత్వ హక్కల ఉపసంహరణ విధివిధానాల ప్రతిపాదనలు సమంజసంగానే ఉన్నాయి. వీటి అమలుకు నా అంగీకారాన్ని తెలియజేస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:51, 23 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నా నిర్ణయం

ఈ విషయం గురించి చర్చ కూలంకషంగా జరిగింది. సభ్యుల అభిప్రాయాలకు ధన్యవాదాలు. ఈ నిబంధనలు ఏ ఒక్క నిర్వాహకుడిని ఉద్దేశించినవి కావు. కాబట్టి వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి.

  • 1. స్వచ్ఛంద ఉపసంహరణ: నిర్వాహకుడు స్వచ్ఛందంగా తానే తప్పుకోవడం.... ఈ విషయంలో సమస్య లేదు కాబట్టి యధాతధంగా అమలుచేయవచ్చును. సదరు నిర్వహకుడు మరళ చురుకుగా మారినప్పుడు తిరిగి సముదాయం అనుమతించాలి (ఏవిధమైన ప్రతిపాదన, చర్చలు లేకుండా).
  • 2. చురుగ్గా లేకపోవడం వలన స్టీవార్డులు నిర్వాహకత్వాన్ని ఉపసంహరించడం. చర్చ ఎక్కువగా ఈ విషయం మీదనే జరిగింది. దీనికి తప్పకుండా కొలమానం అవసరం. అయితే మధ్యమంగా ఆరు నెలలకొకసారి గణాంకాలను చూచి 20 నిర్వాహక మార్పులను ఒక కొలమానంగా తీసుకొనవచ్చును.
  • 3. పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైన వాటి కారణంగా సముదాయం చర్చించి, నిర్ణయించిన మేరకు నిర్వాహకత్వ బాధ్యతలను తొలగించడం. ఇందులో చర్చించాల్సినది ఎక్కువగా లేదు కానీ సముదాయం ముందుగా చర్చించి, సదరు నిర్వాహకునికి ముందుగా హెచ్చరించిన పిదపనే నిర్ణయం తీసుకొనిన బాగుంటుంది. అందరికీ ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:39, 1 మార్చి 2019 (UTC)Reply
Rajasekhar1961 గారూ, ఇది మీ అభిప్రాయం అని రాసారు. కానీ మధ్యవర్తిగా అని కూడా రాసారు. అది కొంత అయోమయాన్ని కలిగిస్తోంది. ఒకవేళ ఇది మీ అభిప్రాయం ఐతే.., ఆ మధ్యవర్తిగా అనే మాట తొలగిస్తే అయోమయం తొలగుతుంది. (అభిప్రాయాలు తెలిపే సమయం మించిపోక ముందే రాసి ఉంటే, నాబోంట్లకు కొంత ఉత్సాహంగా ఉండేది.) ఒకవేళ ఇది మీ నిర్ణయమైతే దాన్ని విస్పష్టంగా "నిర్ణయం" అని ప్రకటించాలి. అప్పుడు కూడా ఆ మధ్యవర్తి అనే మాట పొసగదు. పోతే.. పై అభిప్రాయంలో కింద రాసిన విషయమై స్పష్టత అవసరం అని నాకు తోస్తోంది:
  • మొదటి దానిలో "సదరు నిర్వహకుడు మరళ చురుకుగా మారినప్పుడు తిరిగి సముదాయపు అనుమతించాలి." - అంటే.. స్వచ్ఛందంగా తప్పుకున్న నిర్వాహకుడు వెనక్కు తిరిగి రావాలని అనుకున్నపుడు, తిరిగి మామూలు పద్ధతిలో నిర్వాహకత్వ ప్రతిపాదన చేసుకోవాలని మీ ఉద్దేశమా? ("సముదాయపు అనుమతించాలి" అని అనడంతో నాకీ అనుమానం వచ్చింది సార్.) __చదువరి (చర్చరచనలు) 15:17, 1 మార్చి 2019 (UTC)Reply
చదువరి మీ చొరవకు ధన్యవాదాలు. మరింత స్పష్టత కోసం మార్పులు చేశాను.--Rajasekhar1961 (చర్చ) 15:45, 1 మార్చి 2019 (UTC)Reply
నిర్ణయం ప్రకటించినందుకు ధన్యవాదాలు, Rajasekhar1961 గారు.__చదువరి (చర్చరచనలు) 16:17, 1 మార్చి 2019 (UTC)Reply
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to the project page "నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ".