వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు/పాత చర్చ 1

పాత చర్చ 1 | పాత చర్చ 2

.

సెప్టెంబరు 3, 2005 న జరిగిన దుశ్చర్య మార్చు

Setting_up_your_browser_for_Indic_scripts పేజీలో సెప్టెంబరు 3 వ తేదీ నాడు ఒక అగ్జాత సభ్యుడు పేజీలోని విషయాన్నీ చాలావరకు తొలగించి వేసారు. IP అడ్రసు: 220.226.53.12 ఇక్కడ ఒక సూచన పెట్టి ఆ చర్యను rollback చేసాను.--చదువరి 12:51, 6 సెప్టెంబర్ 2005 (UTC)

మంచి పని చదువరి ! బహుశా ఇదే మన తెలుగు వికిపీడియాలో తొలి దుశ్చర్య అనుకుంటా!! --వైఙాసత్య 13:14, 6 సెప్టెంబర్ 2005 (UTC)

Good Job, caduvari! Haa, lEdaMDI, iMtaku muMdu caalaa jariginaayi O rOjayitE main page mottaM tIsEsinaaru kUDaa!

Chavakiran

సెప్టెంబరు 9, 2005 న జరిగిన దుశ్చర్య మార్చు

Wikipedia talk:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? పేజీలో సెప్టెంబరు 9 వ తేదీ నాడు ఒక అగ్జాత సభ్యుడు ప్రయోగం పేరిట దుశ్చర్యకు పాల్పడినాడు. rollback చేసి ఒక సూచన చర్చా పేజీలో పెట్టాను. IP అడ్రసు: 203.197.169.20. --చదువరి 10:08, 9 సెప్టెంబర్ 2005 (UTC)

బహుశా కొత్త సభ్యుడు కూడా అయ్యిండొచ్చు ఈసారికి we will give him benefit of doubt --వైఙాసత్య 11:54, 9 సెప్టెంబర్ 2005 (UTC)
అవును, కొత్త సభ్యుడే కావచ్చు. కేవలం ఉత్సుకత తోనే ఈ పని చేసినట్లు కనిపిస్తున్నది. ప్రయోగశాలలో సభ్యుడు ఇటువంటి ఎన్నో ప్రయోగాలు చేసుకోగలిగే అవకాశం ఉందనే ప్రచారం మరింతగా జరగాలని అనిపిస్తోంది. --చదువరి 12:44, 9 సెప్టెంబర్ 2005 (UTC)

కొన్ని దిద్దుబాట్ల పరిశీలన మార్చు

ఈ రెండు దిద్దుబాట్ల గురించి ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి. ఈ పెద్దాయనకు నేను చెప్పి చెప్పి అలసి పోయాను మార్పు 1 మరియు మార్పు 2 --వైఙాసత్య 22:55, 16 సెప్టెంబర్ 2005 (UTC)

take it easy,
but we can ask for correct links, as they are just yahoo 360 main page.Chavakiran 04:37, 17 సెప్టెంబర్ 2005 (UTC)


ముందు విషయం నాకు అర్ధం కాలేదు. కాస్త వెనక్కి వెళ్ళి పేజీలు చూస్తే అర్ధమయింది. మీరు ఆయనకు వివరంగానే చెప్పారు. అయినా ఇలా చేసారంటే, విషయం అర్ధం కాలేదేమో ననిపిస్తోంది. మళ్ళీ ఒకసారి ఆయన పేజీలో హెచ్చరిక పెడితే మంచిదనుకుంటాను.
తేలిగ్గా తీసుకుని వదిలెయ్యక పోయినా, సభ్యుడికి విషయం అర్ధమవడం కోసం మరో ప్రయత్నం చెయ్యవచ్చనుకుంటా! __చదువరి 14:40, 19 సెప్టెంబర్ 2005 (UTC)


మొత్తము తెలుగు సినిమాల చిట్టా లో దుశ్చర్య మార్చు

మొత్తము తెలుగు సినిమాల చిట్టా పేజీలో సెప్టెంబరు 22 వ తేదీ నాడు ఒక అజ్ఞాత సభ్యుడు దుశ్చర్యకు పాల్పడినాడు. రొల్ల్బచ్క్‌ చేసి ఒక సూచన చర్చా పేజీలో పెట్టాను. IP అడ్రసు: 61.12.8.124. ఈ ఐ పి ని ఒకటో రెండో రోజులపాటు నిరోధించాలని నా అభిప్రాయం. ముందు నాకు చిన్న సమస్య వచ్చింది, అంచేత మొత్తము తెలుగు సినిమాల జాబితా అనే పేజీని సృష్టించాను. అది అవసరం లేదు. __చదువరి 11:53, 22 సెప్టెంబర్ 2005 (UTC)

తొలి సంఘటన కనుక 61.12.8.124. ని హెచ్చరినిచి వదిలేస్తే సరిపోతుందనుకుంట. మొత్తము తెలుగు సినిమాల చిట్టా గురించి ఇంకా ఇక్కడ చూడండి.--వైఙాసత్య 12:07, 22 సెప్టెంబర్ 2005 (UTC)

కొత్త సభ్యులు, సహాయం పేజీలు మార్చు

కొత్త సభ్యులు విరివిగా చేరుతున్న సమయమిది. వికీ గురించి, ఇక్కడ దిద్దుబాట్లు ఎలా చెయ్యాలనే విషయాల గురించి, విధానాల గురించీ వీరు సులువుగా తెలుసుకునేలా ఏర్పాట్లు చెయ్యాలి. ప్రస్తుత సహాయం పేజీలు ఎక్కువగా ఎన్వికీ నుండి ఉన్నదున్నట్లుగా అనువదించినవే. వాటన్నిటినీ పెరిశీలించి, తెవికీకి అనుగుణంగాను, ఇప్పటి వికీ విధానాలకు అనుగుణంగాను మార్చాల్సిన అవసరం ఉంది. నిర్వాహకులు, సీనియరు సభ్యులు ఈ పనిమీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. __చదువరి (చర్చ, రచనలు) 15:11, 7 నవంబర్ 2006 (UTC)

నేను గమనించిన ఇంకొక విషయము. తెవికీలో చాలా సహాయ పేజీలు ఉన్నాయి కానీ చాలా సార్లు అనుసంధానము సరిగా లేదనిపించింది. ఒక్కొక్క సహాయ పేజీని తీసుకొని దాని లింకులు, ఎర్రలింకులు సరిచేయడంతో ప్రారంభించాలి. ఎర్రలింకులని ఇంకొక సహాయ పేజీకి లింకించడమో, ఇక్కడ లేకపోతే ఆంగ్ల సహాయ పేజీలకు లింకు కలపడమో చేయాలి. --వైఙాసత్య 15:26, 7 నవంబర్ 2006 (UTC)


పేజీ చరితం లో కొత్త విశేషం మార్చు

పేజీ చరితం లోకి కొత్త విశేషం వచ్చింది. (వచ్చి చాన్నాళ్ళయిందేమో తెలీదు. నేనీ రోజే చూసాను.) గతంలో చిట్టచివరి దిద్దుబాటును మాత్రం వెనక్కు తీసుకుపోయే సౌకర్యం (rollback) ఉండేది. ఇప్పుడు మధ్యలోని దిద్దుబాట్లను రద్దు చేసే సౌకర్యం (undo) కూడా వచ్చింది. __చదువరి (చర్చ, రచనలు) 02:40, 10 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అరే నేనూ చూడలేదు. ఉపయోగకరమైన సదుపాయం --వైఙాసత్య 14:44, 10 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మాటలబాబు మార్చు

మాటలబాబు ఇప్పడు తనను బహిష్కరించమని కోరుతున్నాడు. ఏంచేద్దాం?--వైఙాసత్య 12:40, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్యగారు అలా ఎందుకు చేశారో వివరణ కోరటానికి బదులు, తనను బహిష్కరించమని అడిగారు మాటలబాబుగారు. ఏమైనా ఈ సభ్యుడు ఇతరులతో మాట్లాడే తీరు బాగోలేదు. అంతే కాక ఈ సభ్యునికి వికీ స్పూర్తి, లక్ష్యాలు, పని చేసే పద్దతి కొద్దిగా తెలియవు. వ్యాసాలు ఒకరు వ్రాస్తే..ఇక అతనే దాని బాగుగోలు చూడాలి అని అనుకొంటున్నాడో ఏమో. ఏవైనా తప్పులు వ్రాస్తే..దాన్ని సరిదిద్దటానికన్నా, తప్పులు పట్టటానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ సభ్యుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూడండి
* సత్త్రియ నృత్యం , ఏమిటి నృత్యం నేను ఎప్పుడు వినలేదు, కనలేదు, నవోంమీ నువ్వు కాని పెట్టి అందరిని మూర్ఖులు చెయ్యడానికి ఒక వ్యాసం రాయడం లేదు కదా!!!
* అయ్యా బాబు కోడాలి గారు, "యం" రాయలంటే, "yaM" రాస్తే అవుతుంది, మీకు ఇది ఒక సలహా పాటిస్తే బాగు పడతారు.
* ఏమిట్రా కోడాలి ఆంటున్నావ్ , నోరు , రాత అదుపులో పెట్టు కో , నేనసలే రాక్షసుల గురించి రాస్తున్నాను. నీ పేరు కూడా చేర్చేస్తా..... ఏదో నీ బాగు కోసం సలహా చెప్పాను , వింటే బాగు పడతావు నీ రచన్లు వికీపీడీయా లో ఉంటాయి. లేదా ఉండవు. ఇంకెప్పుడు ఇటూవంటి పిచ్చిపిచ్చి రాతలు రాయకు
ఇదంతా ఈ సభ్యుడు ఇతర Discussion Boardsలో చాన్నాళ్ళు వ్రాసిన ప్రభావం అనుకొంటున్నాను. ఇతను వికిలో సజావుగా పని చెయ్యాలంటే కొంత తర్ఫీదు అవసరం, లేదా అతని ఇష్టప్రకారమే చెయ్యొచ్చు --నవీన్ 13:26, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ఇప్పుడు విధించిన నిరోధం ఆయనలో/ఆమెలో ఎంతవరకు మార్పు తెస్తుందో చూద్దాం. మార్పు వస్తుందనే నా ఉద్దేశ్యం! పరిస్థితి ఇలాగే కొనసాగితే వికీ నియమాలు సూచించిన విధంగా చర్య తీసుకుందాం. ఇన్నాళ్ళూ సభ్యుని ప్రవర్తన పట్ల తోటి సభ్యులు ఎంతో సహనంగా ఉంటూ వచ్చారు. ఇకముందు అంత సహనంగా ఉండరని నిన్నటి నిరోధంతో ఆయన/ఆమె గ్రహించే ఉండాలి. __చదువరి (చర్చరచనలు) 02:34, 6 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నా మీద ఏదో ఒక చర్య తీసుకొంటే నెను రచనలు చెయ్యచ్చో లేక మానేయాలో ఆలోచిస్తాను. నా మీద చర్చ ఎప్పుడు ముగుస్తుంది, --మాటలబాబు 00:17, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
పైన చదువరి రాసిన వ్యాఖ్య రెండు రోజుల క్రితంది. ఇప్పడు బాగానే పనిచేస్తున్నారుగా. అలాగే కొనసాగించండి --వైఙాసత్య 00:23, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చలో చదువరి చేసిన చివరి వ్యాఖ్యలో అన్నట్టు సభ్యుని ప్రవర్తనను కొద్దిరోజులపాటు గమనించడం జరిగింది. సభ్యుడు వికీ విధివిధానాలకనుగుణముగా నడుచుకోవటంతో బహిష్కరణ విషయం మళ్లీ తలెత్తలేదు. ఇంతటితో ఈ చర్చ ముగిసినట్టే --వైజాసత్య 07:52, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీ చర్చపేజీ మార్చు

మొదటిపేజీ చర్చాపేజీ వాండలిజం గురి అయింది. నేను సరిదిద్దుటకు ప్రయత్నించినా కుదరలేదు. ఇతర నిర్వాహకుల సహాయం చేయమని అభ్యర్థన --అర్జున 10:58, 7 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  నేను సరిచేశా. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:24, 7 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చంద్రకాంతరావు గారు. మీరు ఎలా సరిచేయగలిగారో, టిక్ పెట్టెలు ఏవి నొక్కాలో తెలియచేయండి. సాధారణంగా నేను సరిదిద్దగలుగుతున్నాను. కాని ఈ పేజీ ఎందుకు ఇబ్బంది పెట్టిందో తెలియలేదు.--అర్జున 23:55, 7 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
మనం ఏ కూర్పు వరకు వెనక్కి తీసుకువెళ్ళాలో అది, దానికంటె ముందటి చెక్‌బాక్సులు టిక్కు చేస్తే చాలు. ఇలా మనం ఎంత వెనక్కి అయినా వెళ్ళి అప్పటి కూర్పును పున:స్థాపితం చేయవచ్చు. మీరు మొదటిపేజీ చర్చాపేజీలో వాండలిజం చేసిన సభ్యుడి మార్పులను తొలిగించడానికి "రద్దుచేయి" ఉపయోగిస్తే బాగుండేది, "దిద్దుబాటు రద్దుచేయి" ఉపయోగించడం వలన ఒకే కూర్పు రద్దవుతుంది. "రద్దుచేయి"ని ఉపయోగిస్తే ఆ పేజీలో చివరిసారిగా మార్పులు చేసిన సభ్యుడి అన్ని దిద్దుబాట్లు ఒకే ఒక్క క్లిక్కుతో రద్దు అవుతాయి. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:51, 10 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. --అర్జున 07:50, 13 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీని స్వంత ప్రచారానికి వాడుకునే ప్రయత్నం? మార్చు

Prasanthigroupbangalore అనే వాడుకరిని చూడండి. వాళ్ళ సంస్థ గురించి ప్రచారం తప్ప వాళ్ళు తెవికీలో వ్రాసింది ఏమీ లేదు. ఇలాంటి వాటిపై తెవికీకి ఒక విధానం ఏర్పరచుకోవాలి. — వీవెన్ 23:36, 16 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ఖచ్చితంగా ప్రచారమే. వీటిని వెంటనే తొలిగించాలి. మళ్ళీ ప్రచారం కోసం ప్రయత్నిస్తే సభ్యనామంపై నిరోధం విధించే అవకాశం కూడా పరిశీలించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:46, 17 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతానికి ఈ పుటల లోని విషయాన్ని తీసేసాను. — వీవెన్ 14:33, 18 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి హోదా మార్చు

వికీపీడియా:అధికార_హోదా_కొరకు_విజ్ఞప్తి/అర్జున చూచి సహాయం చేయండి. --అర్జున 13:56, 27 డిసెంబర్ 2011 (UTC)

సంపుటి.కామ్ ప్రచారమా? మార్చు

Recently there has been quite a number of links added to the domain samputi.com, which I have come across while doing other clean-up across the wikis. I wasn't sure of your community's attitude to such addition of links so I have left them alone and brought the matter to you as an administrator (who I am hoping speaks English). Billinghurst 04:27, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks for bringing to my attention. The linked site looks to be a good source of information and appears to be run by non profit. I will discuss with other Admins and address the same. --అర్జున 04:51, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks for taking the time to consider. They have done a bit of en:WP:LINKFARM on at enWP, some removed, some not. Thanks for the 2012 wishes :-) Billinghurst 04:57, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం పై దుశ్చర్య మార్చు

ఎలక్ట్రికల్_ఇంజనీరింగ్ పై IP సభ్యుడు దుశ్చర్యకు పాల్పడటంతో నిరోధించాను. చూడండి ప్రత్యేక:BlockList. ఇతర నిర్వాహకులు అప్రమత్తంగా వుండవలసినదిగా కోరుచున్నాను. --అర్జున 12:54, 8 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, గమనించాను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:34, 8 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు వ్యాసాలపై స్పందన మార్చు

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాలపర్తి వెంకటేశ్వర్లు పై స్పందించండి.--అర్జున (చర్చ) 11:05, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ అసంపూర్ణంగా ముగిసింది.--అర్జున (చర్చ) 16:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ముందు సలహాలు, సూచనలు ప్రతిపాదించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:42, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ముగిసిపోయిన చర్చలను కూడా మళ్ళీ మొదలుపెట్టాలంటే వికీలో ఎమిదేళ్ళ నుంచి ముగిసిన వేలాది చర్చలున్నాయి. ఇప్పటికే వ్యాసాల కంటే చర్చలకే అధిక సమయం పోతుంది. అదే సరైనదనుకుంటే వ్యాసాలలో సమాచారం చేర్చడం ముగించి చర్చలు మాత్రమే చేస్తుండాల్సి వస్తుందేమో! 106.66.55.100 12:14, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి మార్చు

వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి నిర్ణయించడానికి దాని చర్చాపేజీలో స్పందించండి.--అర్జున (చర్చ) 06:26, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సంపుటి.కామ్ ప్రచారమా?(2) మార్చు

నా చర్చాపేజీలో హెచ్చరిక వ్యాఖ్య" m:User:COIBot/XWiki/samputi.com A heads up that COIBot has identified an IP address going on a bit of a spree adding a site's url. Billinghurst (చర్చ) 08:57, 22 మే 2013 (UTC)" ప్రకారం, బాట్ తోటో లేక మానవీయంగానో సంపుటి.కామ్ లింకులు చాలా వ్యాసాలకు చేర్చటం జరుగుతుందని గమనించాను. సంవత్సరం క్రితం కూడా ఇలానే జరిగింది. మూడు రోజుల నిరోధం విధించాను.--అర్జున (చర్చ) 10:00, 22 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ లింకులన్నీ వెంటనే తొలగించాలి. దీనికి హేతువులు.
  • ఇలాంటి స్పాములను ప్రోత్సహిస్తే మరిన్ని వెబ్‌సైట్లు ఇలాంటి పద్ధతులు వినియోగిస్తాయి. అప్పుడు తెవికీ వ్యాసాలన్నీ బయటి సైట్లకు లింకులతో నిండిపోతాయి.
  • ఈ సంపుటి.కామ్ వ్యాసాల్లో తెలుగు వికీలో పొందుపరచలేనంత విభిన్నమైన సమాచారమేమీ లేదు.
  • బయటి లింకులు ఇస్తున్న సంస్థ స్వఛ్ఛందమా, వ్యాపారదృష్టితో పనిచేస్తున్నదా అన్నది వికీ పట్టించుకోదు. (ఉదాహరణకు: ఐ.ఎం.డి.బి - చాలా సినిమాలు, నటుల వ్యాసాలకు ఐ.ఎం.డి.బి బయటి లింకులున్నాయి. ఐ.ఎం.డి.బి ఒక రికార్డుల సంపుటం. అలాంటి ఫార్మాటు వికీలో కూడదు మరియు ఐం.ఎ.డి.బి రికార్డులో ఉన్న సమాచారమంతా వికీలో ఉండే అవకాశం లేదు. అందుకే ఐ.ఎం.డి.బికి లింకిస్తారు.)
--వైజాసత్య (చర్చ) 10:50, 22 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున ఫైళ్ల లైసెన్స్ ధృవీకరించండి మార్చు

బొమ్మల నాణ్యత పెంచడంలో భాగంగా, నా ఫైళ్ల జాబితాను HTML టేబుల్ రూపంలో పెట్టాను. సముచితవినియోగం అని పేర్కొన్న వాటిని పరిశీలించి హేతువులను ధృవీకరించితే సంబంధిత టాగ్ లో చెప్పినట్టు పరామితిని చేర్చండి. ఉచితము, స్వేచ్ఛావినియోగమైతే ఆ దస్త్రం ఫైలు లో ఏమి చేయనవసరంలేదు. దేనికైనా నా ఫైళ్లజాబితాను మీరు తనిఖీ చేసినట్లు ఆ బొమ్మ దగ్గర వికీ సంతకం చేయండి. ఇలా చేస్తేఎంతమంది దీనిలో తోడ్పడినా పని సులభంగా గందరగోళం లేకుండా చేయవచ్చు. నేను నా బొమ్మ కాని మొదటవరుసకి ఉదాహరణగా ధృవీకరించాను. ఏమైనా సందేహాలుంటే ఇక్కడే రాయండి.--అర్జున (చర్చ) 03:11, 21 అక్టోబర్ 2013 (UTC)

ఇటీవలి నాపనులు మరియు ఫైళ్ల తొలగింపుకి తాజా పద్ధతులు మార్చు

క్రితం ఫైళ్ల తొలగింపుకి పూర్తిగా మానవీయంగా చాలా పేజీలలో మార్పులు చేయవలసివచ్చేది. బొమ్మలకు, వ్యాసాలకు ఒకే విధమైన పద్ధతి వుండేది. ఈపని విధానం నిర్వహణకు అంత అనుకూలమైనది కాదు. ట్వింకిల్ ను స్వాగతమూసకొరకు తెచ్చినా, దానితో ఇంకా కొన్ని పనులు చేయటానికి ఇటీవల ప్రయత్నించాను. అయితే ట్వింకిల్ పూర్తిగా స్థానికీకరణ తో అందుబాటులో లేదు కాబట్టి, కొన్ని చర్యలు అసంపూర్తిగా అవుతున్నాయి. దోషం కనబడినప్పుడు మానవీయంగా వాటిని సరిచేయాలి. అటువంటి సమస్యలను సంబంధిత మూసల చర్చాపేజీలలో రాశాను. ఇది ఒక్కరితో మంచి స్థాయికి వెళ్లదు. ఎక్కువమంది నిర్వహణ పై దృష్టిపెట్టి అవసరమైతే కొంత కాలము కొత్త వ్యాసాలను తగ్గించుకొని, సమస్యలను తెరముందుకు తీసుకువచ్చి పరిష్కారాలు కనుక్కోవాలి. అందరు నిర్వాహకులకు దీనిస్థితి తెలియాలని ఇక్కడ ఈ వ్యాఖ్య రాస్తున్నాను. నేను గత ఆరేళ్లగా చాలా చొరవతో రకరకాల పనులు చేశాను. కొంతమంది అభ్యంతరాలు తెలిపిన తరువాత సాధ్యమైనంతవరకు చర్చించి చేశాను. కాని చర్చలకు కనీస సభ్యులు కూడా పాల్గొనే స్థితిలో లేక పోవటంతో అప్పుడప్పుడు చొరవతో ముందుకు పోవలసివచ్చింది. ఇది సహసభ్యులకు బాధకలిగిస్తే క్షమించండి. తెవికీమహోత్సవం తరువాత తెవికీలో పని తగ్గించుకుందామనుకున్నా వికీమేనియాకి వెళ్లిరావడంవలన, దశాబ్దిఉత్సవాలురాబోతున్నందున తెవికీ నాణ్యత పెంచడంకోసం మరల ఎక్కువ సమయం కేటాయించి ఇంకొన్ని పనులు చేయాల్సివచ్చింది. బొమ్మలపై నకలుహక్కుల పని కొంత ఆదిశలోనిదే. ఇకపై నాకున్న వ్యక్తిగత సమయాభావం పల్ల నేను పెద్దగా కొత్త ప్రతిపాదనలలో పాల్గొనలేను. అప్పుడప్పుడు కనబడుతూ, నాకు వీలైనంతవరకు వరకు అందుబాటులో వుంటాను. --అర్జున (చర్చ) 14:26, 21 అక్టోబర్ 2013 (UTC)

స్థానికీకరణ సమస్య మార్చు

Oversight కు అనువాదం పరాకు గా వుండేది. అయితే దీని అర్ధం suppress కు సమానమని వికీ లో తెలిపారు కనుకు పూర్తి తొలగింపు అనేది మెరుగైనదని మార్చాను. అయితే ఈ మార్పులు చేతనం కాక, ఆంగ్ల పదము కనబడుతున్నది. స్థానికీకరణ పై పనిచేసిన సభ్యులు, నిర్వాహకులు బగ్ చూసిఅక్కడే మీ సూచనలు తెలపండి. --అర్జున (చర్చ) 06:54, 13 నవంబర్ 2013 (UTC)

నేను అక్కడ వ్యాఖ్యను చేర్చాను. — వీవెన్ (చర్చ) 14:02, 13 నవంబర్ 2013 (UTC)
వీవెన్ గారి సత్వర స్పందనకు ధన్యవాదాలు. చాలా రోజుల ఈ సమస్యతో సతమతమవకుండా మీ దృష్టికి తీసుకువచ్చివుంటే ఇంకా తొందరగా పరిష్కారం లభించేది. మీరిచ్చిన మూడు ఐచ్ఛికాలలో ఏది మెరుగైనదో మీరే ప్రతిపాదించండి. అలానే చేద్దాం.--అర్జున (చర్చ) 00:59, 14 నవంబర్ 2013 (UTC)

మూస దోషం మార్చు

మూస చర్చ:Non-free reduce లో వ్యాఖ్యచూసి సహాయం చేయండి. --అర్జున (చర్చ) 13:53, 27 నవంబర్ 2013 (UTC)

నా సవరణలలో దోషమే కారణమని తెలిసి పరిష్కరించాను--అర్జున (చర్చ) 13:55, 27 నవంబర్ 2013 (UTC)

V.T.Eతెలుగులోకి మార్చు

ఇటీవలి చేర్చిన మూసలు లేక ఇతరత్రా మార్పుల మూలంగా మార్గదర్శక పెట్టెలలో V.T.E తెలుగులోకనబడుట లేదు. User:వైజాసత్య మరియు User:Veeven , User:C.Chandra_Kanth_Rao మరియు ఇతర సాంకేతిక నిపుణులైన సభ్యులు వీటిని తిరిగి తెలుగులో కనబడేటట్లు చేయమని అభ్యర్ధన. తెలుగు వికీపీడియా స్వయంశిక్షణ కు కొత్త తెరపట్టులు అత్యవసరంగా తీయవలసినందున, ఒకటి రెండు రోజులలో ఈ పని చేయగలిగితే బాగుంటుంది. --117.202.102.187 10:31, 16 డిసెంబర్ 2013 (UTC)

నేను కొంత ప్రయత్నించాను కాని ఎక్కడ పొరపాటు ఉందో తెలుసుకోలేకపోయాను. కొంతకాలం క్రితం V.T.Eలు సమాంతరంగా కాకుండా నిలువుగా కనిపిస్తున్నప్పుడు ఆ సమస్యను అధికమించడానికి ఆంగ్లవికీ నుంచి పెద్ద ఎత్తున మూసలు దిగుమతి చేయబడ్డాయి. ఏ మూసలో దీన్ని మార్పులు చేయాలో తెలుసుకొంటే సమస్య తీరుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:23, 16 డిసెంబర్ 2013 (UTC)
Navbar మూసలో మార్పులు చేశాను కాని ప్రతిఫలించడం లేదు.--అర్జున (చర్చ) 13:29, 16 డిసెంబర్ 2013 (UTC)
  చేశాను --వైజాసత్య (చర్చ) 02:40, 17 డిసెంబర్ 2013 (UTC)
మాడ్యూల్లో నేను మార్పు చేసిన తర్వాత, అర్జున గారు మళ్ళీ కొత్త కూర్పు తేవటం వళ్ళ తెలుగీకరణ పోయింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి మళ్లీ ఏర్పడితే. ఈ మార్పులు చెయ్యాలి. --వైజాసత్య (చర్చ) 02:47, 17 డిసెంబర్ 2013 (UTC)
వైజాసత్య గారికి ధన్యవాదాలు. మూసలోనుండి మాడ్యూలు కు మారిందన్నమాట. మూసలు తాజాకరణలో భాగంగా దిగుమతి చేసుకొనేటప్పుడు, పాత పేజీలేకపోతేనే దిగుమతి అయితే బాగుండేది. --అర్జున (చర్చ) 04:02, 17 డిసెంబర్ 2013 (UTC)
బహుశా ImportUpdate వాడినందున ఉన్న మూసలు తాజా అయినట్లున్నాయి. ఇక ముందు దీనిని వాడడంలో జాగ్రత్త వహిస్తాను. --అర్జున (చర్చ) 05:52, 18 డిసెంబర్ 2013 (UTC)

నిర్వాహక, అధికార హోదాల తొలగింపు విజ్ఞప్తి మార్చు

గత కొన్నేళ్ళుగా నేను తెవికీలో చురుగ్గా లేను. నిర్వాహకునిగా, అధికారిగా పనుల్లో పాల్గొనడం అసలే లేదు. నాకు ఆ హోదాలు ఉండటం వలన ప్రస్తుతం తెవికీకి ఉపయోగమేమీ లేదు. అందుచేత నేను ఆ హోదాలను వదలుకుని మామూలు సభ్యునిగా తెవికీలో కొనసాగదలచుకున్నాను. నా ఈ హోదాలను తొలగించవలసినదిగా ఇతర నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. --చదువరి (చర్చరచనలు)

  • చదువరి గారికి, మీరు ఇటీవల మరల తెవికీలో క్రియాశీలమవటం నాతోసహా చాలామంది సభ్యులకు సంతోషాన్నిచ్చింది. తెవికీ గత మూడేళ్లుగా పెద్దగా అభివృద్ధికాని విషయం మీకు తెలిసినదే. మీ రాకతో మరియు మీ సలహాలతో తెవికీ అభివృద్ధి మెరుగవుతుందని చాలామంది ఆశిస్తున్నారు. కావున, ఒకటి రెండు నెలలు తరువాత ఆలోచించి విజ్ఞప్తిని అవసరమైతే మరల చేర్చమని కోరుతున్నాను. అదీకాక నిర్వాహక హోదా వుంటే మీరు అప్పుడప్పుడు చేసే పనులకైనా సౌలభ్యంగా వుంటుంది. ఇంకొక విషయం అధికారి హోదా తొలగించుకోవాలనుకుంటే మెటాలో మాత్రమే అభ్యర్ధన చేయాలి. నిర్వాహకులుగా, అధికారులుగా ఎన్నిక సభ్యులచేత జరుగుతుంది కాబట్టి ఏ హోదా తొలగించుకోవాలన్నా సభ్యులకు తెలియపరచి స్పందనలేమైనా వుంటే పరిశీలించి ఆ తరువాత అభ్యర్ధన చేస్తే మంచిదని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 11:04, 30 డిసెంబర్ 2013 (UTC)

మూసల దిగుమతి కి జాగ్రత్తలు మార్చు

నేను ఆంగ్లంనుండి ఇటీవలి మూస దిగుమతి చేసినప్పుడు (ఉదా:వికీపీడియా:Copy-paste ) ఊహించని విధంగా మీడియావికీ పేరుబరిలోని పేజీలు కూడా దిగుమతి జరగడం కొన్నాళ్ల తరువాత గమనించాను. దీనివలన సవరణ పెట్టెలో సందేశాలు ఆంగ్లములోనికి వెళ్లిపోయాయి. వాటిని వెతికి సవరించడానికి మరల సగంరోజు పట్టింది.అందుకని మూసలు దిగుమతి చేసేటప్పుడు వివరాలు చూసి దిగుమతి చేస్తే మంచిదని నేను నేర్చుకున్న పాఠం ఇతరులకు ఉపయోగపడుతుందని తెలుపుతున్నాను.--అర్జున (చర్చ) 07:37, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Template, Module దిగుమతి చేసేటప్పుడు జాగరూకత మార్చు

నేను ఇటీవల జాషువా వ్యాసంలో వర్గాల చూపించడంలో దోషము కనబడినప్పుడు, కొన్ని మూసలు మరియు మాడ్యూళ్ళు దిగుమతి చేసినపుడు సమచారము తారుమారయినట్లు గమనించాను. Module page ని Template పేజీలోకి చేర్చడం జరిగింది.కొంత వరకు సవరించాను. కాని స్క్రిప్ట్ దోషాలు కొన్ని మూసలలో కనబడుతున్నాయి. వీటిగురించి ఆంగ్ల వికీలో సహాయ అభ్యర్ధన చేశాను. తెలుగు వికీ సభ్యులు కూడా సహాయపడమని కోరుతున్నాను . కొత్త Module లో ఆంగ్ల వికీపరిమితులు వుండవచ్చు కావున ఇకపై దిగుమతులు చేసేటప్పుడు నిర్వాహకులు మరింత జాగరూకతతో వ్యవహరించితే మంచిది--అర్జున (చర్చ) 02:06, 10 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారికి, తప్పకుండా జాగ్రత్త తీసుకుంటాము అని తెలియజేస్తున్నాను.JVRKPRASAD (చర్చ) 02:21, 10 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పై న చెప్పిన దోషంఆంగ్ల వికీ సభ్యుని సలహా ప్రకారం సరిదిద్దబడింది. JVRKPRASAD గారి స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 08:11, 10 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

[Global proposal] m.వికీపీడియా.org: (అందరూ) పేజీలను మార్చడం మార్చు

 
MediaWiki mobile

Hi, this message is to let you know that, on domains like te.m.wikipedia.org, unregistered users cannot edit. At the Wikimedia Forum, where global configuration changes are normally discussed, a few dozens users propose to restore normal editing permissions on all mobile sites. Please read and comment!

Sorry for writing in English but I thought as administrators you would be interested. Thanks, Nemo 22:26, 1 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఐపీ అడ్రస్‌లపై నిరోధం తొలగించుట గురించి మార్చు

తెవికీలో నిరోధం చిట్టా గమనిస్తే సుమారు పదేళ్ళ క్రిందట చాలా ఐపీ అడ్రస్‌లపై శాశ్వత నిరోధం విధించినట్లుగా గమనించారు. సాధారణంగా ఐపీ అడ్రస్‌లు స్థిరమైనవి కావు కాబట్టి ఆ నిరోధం ఇప్పుడు ఇతరులపై ప్రభావం చూపవచ్చు. ఐపీ అడ్రస్‌లపై అనేక సంవత్సరాల క్రిందట విధించిన నిరోధాన్ని నేను తొలగించదలుచుకున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పగలరు. దుశ్చర్యలకు పాల్బడితే మళ్ళీ నిరోధం విధించడానికి ఎలాగూ అవకాశం ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:12, 28 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సి. చంద్ర కాంత రావు గారు, నమస్కారము. ఎవరైనా పునరుద్ధరించమని అడిగితే, వారి నుండి సంజాయిషీ కోరి, సరి అయిన సమాధానము పొంది, ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటేనే, అటువంటివి పునరుద్ధరణ చేయవచ్చును. మీరు అనుకున్నట్లు అన్నీ పునరుద్ధరిస్తే వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువేమో ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 15:20, 28 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, ఐపీ అడ్రస్ లపై నిరోధం ఉన్నంతవరకు వారు దిద్దుబాటు చేసే అవకాశమే ఉండదు కాబట్టి పునరుద్ధరించమని వారి నుంచి అభ్యర్థనలు రావు. పదేళ్ళ క్రిందట నిరోధించబడిన ఐపీ అడ్రస్‌లపై నిరోధం కొనసాగించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎప్పుడో ఎవరో చేసిన దుశ్చర్యలకై ఆ ఐపీ అడ్రస్‌లు ఉపయోగించే అందరికీ తెవికీని దూరం చేయలేము కదా! ఇలా కొనసాగించడం కొందరి వికీ దిద్దుబాట్ల హక్కులను పరిమితం చేసినట్లవుతుంది మరి! అసలు కొన్ని ఐపీ అడ్రస్‌లపై ఎందుకు నిరోధం విధించారో అర్థం కావడం లేదు కూడా. వారి దిద్దుబాట్లు కూడా లేవు. బహుశా ఆ వ్యాసాలు తొలగించబడి ఉంఛవచ్చునేమో! అసలు 2006 ఫిబ్రవరికి ముందు నిరోధించినవారికి వారిపై ఎవరు నిరోధం విధించారో కూడా తెలియట్లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:11, 28 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
శాశ్వత నిరోధం అనేది అనవసరమైన చర్య. పునరుద్దరించండి. మొదట్లో పొరపాట్లు ఎల్లపుడూ ఉండకపోవచ్చు- దాని వలన నష్టాలు కూడా ఏమీ లేవు...--విశ్వనాధ్ (చర్చ) 17:06, 28 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
whois service (ఉదా :http://myip.ms/view/ip_addresses/1854502144/110.137.117.0_110.137.117.255 )ఒకసారి చూసి ISP sites అయితే నిరోధము తొలగించవచ్చు. --అర్జున (చర్చ) 12:47, 29 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

షిరిడీ సాయిబాబా మార్చు

వాడుకరి:Koneti Kumar గారు షిరిడీ సాయిబాబా అనుయాయుల గురించిన వ్యాసాలను తయారుచేస్తున్నారు. వాటిని వికీకరించి; ఒక వ్యక్తికి సంబంధించిన వ్యాసంగా చేస్తే బాగుంటుంది. వీటిని వ్యాసంగా మార్చడానికి వాడుకరికి వివరంగా చర్చిస్తే బాగుంటుంది. ఇక్కడ చర్చించండి.--Rajasekhar1961 (చర్చ) 06:20, 2 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామవ్యాసాల దిద్దుబాట్లలో నిబంధనలు అతిక్రమించుట మార్చు

గత కొన్ని నెలలుగా తెవికీలో ఇద్దరు సభ్యులు (భాస్కరనాయుడు మరియు గుళ్ళపల్లి) గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చడంలో భాగంగా అప్రామాణికమైన మరియు తప్పులతడక వెబ్‌సైట్ నుంచి అధికమొత్తంలో సమాచారాన్ని కాపీచేస్తున్నట్లుగా ఇటీవలే గమనించాను. ప్రామాణిక గ్రంథాలు మరియు ప్రామాణిక వెబ్‌సైట్లు నుంచి కొంతకొంత మేరకు మాత్రమే సమాచారం గ్రహిస్తూ అభివృద్ధి పర్చాల్సిన తెవికీ వ్యాసాలలో ఒకే వెబ్‌సైట్ నుంచి అధికమొత్తంలో సమాచారం పొందడం నిబంధనలను అతిక్రమించినట్లుగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా కేవలం యాంత్రికంగా ఆ వెబ్‌సైట్లో పొందుపర్చబడిన సమాచారం చాలావరకు తప్పుగా ఉంది. గ్రామాల యొక్క ఆల్టిట్యూట్ (సముద్రమట్టం నుంచి ఎత్తు) ఒక్కో మండలంలో ఒక్కో విధంగా ఉంది. మండలంలోని అన్ని గ్రామాలలో ఎత్తు ఒకే విధంగా ఉంది. ఇది వాస్తవవిరుద్ధం. ఒక మండలానికి దాని సరిహద్దు మండలానికి ఒకేసారి వందల మీటర్ల తేడా ఉండటం కూడా అసంభవం. రైలుమార్గాలు, ప్రధాన రహదారులు వెళ్ళే మండలాలలో కూడా ఇంతగా తేడా ఉండటం ఈ సమాచారం తప్పుగా ఉందనడానికి నిదర్శనం. సమీప గ్రామాలు అనే విభాగంలో ఎక్కడో వంద కిమీ దూరంలోని, పట్టణాలు చేర్చబడ్డాయి. రవాణా సౌకర్యాలు లేని గ్రామాలకు కూడా ఫలానా పట్టణం నుంచి రవాణా సౌకర్యం ఉన్నట్లుగా తప్పుగా పేర్కొనబడింది. ఇలా చిన్న వ్యాసంలోనే విపరీతమైన తప్పులు మరియు అప్రామాణికమైన వెబ్‌సైట్ నుంచి అధికమొత్తంలో సమాచారం తీసుకొనడం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లుగా పరిగణించబడుతుంది. సదరు సభ్యులకు అవకాశం ఇచ్చి, పై లోపములు సవరించుకోని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలియజేయనైనది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:42, 23 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలకు ఆధారితమైన వేబ్ సైట్ లో తప్పులు వున్నట్లు ముందుగానే గమనించాము. ఉదాహరణకు ఒక మండలానికి చెందిన అన్ని గ్రామాలకు సముద్రపు మట్టము ఎత్తు అన్నిటికి ఒకేలా వుండటము గమనించాము. అది తప్పు కావచ్చునేమోనని భావించాము. అదే విధంగా గ్రామ మద్య వున్న దూరాలకు సంబందించి తప్పులు వుండ వచ్చు. సందేహిస్తూనే ప్రారంబించాము. మొదట్లోనే ఈ వెబ్ సైట్ ప్రామాణికము కాదని తెలిపి వుంటే దాని జోలికి వెళ్ళే వారము కాదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా బెదిరింపుగా నోటీసు ఇవ్వడము సమంజసముగా లేదు. ఒక్క సారి చెప్పి ..... వినకపోతే అప్పుడు చెప్పాల్సినది పోయి ఉన్నట్టుండి ఒక్కసారే ఈ విధంగా చెప్పడము సరికాదు. చెప్పితే ఏమనుకుంటారో ? అనే సందేహం కూడ వెలిబుచ్చారు. అధికారులు ఏ విషయములోనైనా నాకు ఒక సారి చెప్పిన సలహాలను పాటించని సందర్బాలనుగాని, వ్వతిరేకించిన సంధర్బాలను మచ్చుకొకటి ప్రస్తావించ గలరా??? నేను ఎవ్వరితోను తగాదా తెచ్చుకునే వ్వక్తిని కాను. ఇదంతా చెపుతున్నది నాపై మీరు తీసుకోబోయే చర్యలు వద్దనటానికి ఏమాత్రము కాదు. నా చర్చా పేజీలో అడిగారు కాబట్టి దానికి సమాదానము ఏదో ఒకటి వుండాలి గనుక ఇది వ్రాస్తున్నాను. మీరు తీసుకోబోయే చర్యలకు ఇది ఏమాత్రము అవరోదము కాదు. భాస్కరనాయుడు (చర్చ) 12:51, 24 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]
"..వేబ్ సైట్ లో తప్పులు వున్నట్లు ముందుగానే గమనించాము" -ఆ వెబ్‌సైట్లో ఉన్న సమాచారం తప్పని ముందే తెలుసని చెబుతున్నారు. కాబట్టి ఆ వెబ్‌సైటు ప్రామాణికం కాదని మరొకరు చెప్పనక్కర్లేదు. మీరు చేసిన తప్పేమిటో మీకు అర్థమైంది కాబట్టి ఇక ఆయా తప్పులను సవరించడం మొదలుపెట్టండి. రావు గారు రాసిన దాంట్లో బెదిరింపేమీ కనిపించడం లేదు, అపార్థం చేసుకోకండి. దాని గురించిన చర్చను పొడిగించకుండా, ఇప్పుడు ఏమేం సవరణలు చెయ్యాలనే దానిపై దృష్టి పెడదాం. __చదువరి (చర్చరచనలు) 17:52, 24 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదివరకు గ్రామవ్యాసాలలో ఖాళీవిభాగాలు చేర్చేసమయంలో గుళ్ళపల్లి గారికి పలు సార్లు చర్చాపేజీలలో తెలియజేసిననూ ఏ మాత్రం పట్టించుకోకపోవడం, ఇతర సభ్యులు కూడా తగినంతగా సహకారం అందించకపోవడం మరియు ఏకపక్షంగా సభ్యులపై చర్య తీసుకోవడానికి సరైన నిబంధనలు లేకపోవడం తదితర కారణాల అనుభవంతో ఈ సారి పరిస్థితిని గమనించి సహసభ్యులు సహకారం అందించకున్ననూ ఒకే నిర్వాహకుడు సభ్యులపై చర్య తీసుకొనే విధంగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంతో నేను ఈ ప్రక్రియను చర్చాపేజీల నుంచి కాకుండా ఏకంగా రచ్చబండనుంచి ప్రారంభించడం జరిగింది. రెండో రోజు మాత్రమే ప్రక్రియలో భాగంగా నిర్వాహకుల నోటీసుబోర్డులో పేర్కొనడం జరిగింది. అంతేకాని ఇంకనూ సభ్యులకు ఎలాంటి హెచ్చరిక లేదా నోటీసు జారీచేయలేదని గమనించగలరు. ఈ ప్రక్రియ ఇంకనూ చాలా ఉంది. సంబంధిత సభ్యులకు చర్చాపేజీలలో తెలుపకుండా, హెచ్చరిక జారీచేయకుండా, సవరించుకోవడానికి సమయం ఇవ్వకుండా నిరోధం విధించే అవకాశం లేదు. నిరోధం అనేది ఈ ప్రక్రియ మొత్తాన్ని సభ్యులు ఖాతరుచేయకుండా నిరంతరంగా నిబంధనల ఉల్లంఘన చేస్తున్నప్పుడు చివరి చర్యగా మాత్రమే జరుగుతుంది. పరిస్థితిని గమనించి కాపీహక్కుల ఉల్లంఘనలు మరియు తప్పుడు సమాచారం చేర్చడం మానుకున్నారు కాబట్టి ఈ ప్రక్రియ ఇంతటిలో దాదాపు సమాప్తం అయినట్లే. కనీసం ఇకముందైనా పెద్దమొత్తంలో మార్పులు చేసే సందర్భంలో చదువరి గారు అభిప్రాయపడినట్లు మరొకరిచే చెప్పించుకోవాల్సిన పరిస్థితి తెప్పించుకోకండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:54, 24 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో JVRKPRASAD గారి నిర్వాహక హోదా రద్దు ప్రతిపాదన మార్చు

వాడుకరి:JVRKPRASAD గారు తోటి వాడుకరుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రవర్తనకు సంబంధించి గమనించిన కొన్ని విషయాలు:

  1. మర్యాదగా వ్యవహరించరు. పిచ్చిరాతలు, చెత్త రాతలు, ఎవడు, కెలకడం, అతిగా, అతి తెలివిగా పత్తిత్తు వంటి మాటలు వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మరింత అసభ్యకరమైన భాషనూ వాడారు. బూతులు తిట్టలేదు సంతోషించండి అంటూ సమాధానమిచ్చిన సందర్భమూ ఉంది. నా నైజం ఇంతే అని అన్నారు. ఆయన సంయమన లేమికి, అమర్యాదకర చర్చలకూ కింద ఇవ్వబడినవి కొన్ని ఉదాహరణలు:
    1. ఈ పేజీలో, మొలక వ్యాస పేజీల సృష్టిని అరికట్టేందుకు నిరోధం విభాగంలో జరిగిన చర్చ
    2. రచ్చబండలో తెలుగు పదాలు కూడా చచ్చిపోతున్నాయి విభాగంలో అజ్ఞాత వాడుకరికి ఆయన ఇచ్చిన సమాధానం
    3. ఈ పేజీలో విశ్వనాథ్ తొలగించిన పేరాకు నాసమాధానం విభాగంలో జరిగిన చర్చ
  2. ఆయనకు వికీ నియమాల పట్ల అంతగా అవగాహన లేదు. ఆ అవగాహన ఉన్నవాళ్ళు సూచించే మార్పుల పట్ల గౌరవం లేదు.
    1. ఈ పేజీలో, రైల్వే వ్యాసాలు వాటి మూలాలు విభాగంలో ఆయన చేసిన చర్చ దీనికో మచ్చుతునక.
    2. ఈ పేజీలో జరిగిన చర్చ కూడా ఇందుకో చక్కని ఉదాహరణ.
  3. చర్చను విషయానికి పరిమితం చెయ్యకుండా దాన్ని వ్యక్తిగత దూషణల స్థాయికి దించడం ఆయన సాధారణంగా చేస్తూంటారు.
  4. ఆయన తెవికీలో నిర్వాహకుడయ్యుండీ ఇలా ప్రవర్తించడం శోచనీయం. సముదాయానికి మార్గదర్శకత్వం చెయ్యాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించకూడదని గతంలో జరిగిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఈ పేజీలో, మీ చర్చా ధోరణి ఉప విభాగంలో జరిగిన చర్చ దీనికో ఉదాహరణ.

ఈ కారణాల వలన ఆయన నిర్వాహక బాధ్యతలను నిర్వహించేందుకు అనర్హులని నా అభిప్రాయం. ఆయన్ని ఆ బాధ్యతల నుండి తప్పించాలని నా ప్రతిపాదన. మీ అభిప్రాయాలు చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 06:06, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

  • వికీ సభ్యులు 16 అక్టోబరు2016లోగా తమ స్పందనను తగిన విభాగంలో వివరించి తమతమ సభ్యనామంతో సంతకం చేయమని మనవి. అనామకంగా స్పందించే వారి వ్యాఖ్యలు, అభిప్రాయాలు పరిగణించబడవు.--అర్జున (చర్చ) 04:56, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
గమనిక: ఓటింగులో పాల్గొని తమ నిర్ణయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కు అందరికీ ఉంది. ఓటింగ్ కాలపరిమితి ముగిసే వరకు సభ్యులు ప్రతిపాదనను సమర్థించినా, విమర్శించినా వారిపై ఎవరూ ఎలాంటి చర్చ చేయరాదు. ఇలా చేయడం ఇతర సభ్యుల ఓటింగ్ నిర్ణయంపై ప్రభావం చూపవచ్చు. చర్చకు సంబంధించిన విషయంపై ఏదేని అభిప్రాయం తెలపాలనుకుంటే అభిప్రాయాలు విభాగంలో మాత్రం వ్రాయండి.

ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను మార్చు

  1.   ' -- సి. చంద్ర కాంత రావు- చర్చ 17:24, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2.   ' --' కె.వెంకటరమణచర్చ 17:33, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3.   '..--Viswanadh (చర్చ) 04:55, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4.   '..--Palagiri (చర్చ) 07:26, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5.   '..--t.sujatha (చర్చ) 23:37, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6.   '..--రవిచంద్ర (చర్చ) 01:41, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7.   '..--Meena gayathri.s (చర్చ) 03:43, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8.   '--Rajasekhar1961 (చర్చ) 07:42, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను మార్చు

తటస్థం మార్చు

JVRKPRASAD గారిని ఇదివరకే ఈవిషయం గురించి వివరించడం జరిగింది. కానీ వారు తమ వైఖరి అలాగే కొనసాగిస్తున్నట్లున్నారు. వారు వికీలో అత్యంత చురుకైన వాడుకరి. కానీ ఒక్క అగ్గిపుల్ల మొత్తం అడవినే కాల్చివేస్తున్నదన్నట్లు ఆయన వాడే పరుష పదజాలం ఆయన చేసే/చేసిన/చేస్తున్న మొత్తం కృషిని సర్వనాశనం చేస్తున్నది. వీరికి వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వికీ అభివృద్దికి ప్రయత్నం చేస్తున్నారు. వీరి వైఖరిపై అధికారికంగా హెచ్చరించే ప్రయత్నం ఇప్పటివరకు జరుగలేదు. ప్రస్తుతం చేపట్టిన ఈ చర్యను ఆయన నిర్వాహకత్వం నుండి తొలగించుటకు బదులుగా ఆయనను హెచ్చరించి ఆయననుండి రాతపూర్వక హామీ తీసుకునేలాగా ఉంటే సమంజసంగా ఉండవచ్చు అనునది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రసాద్ గారూ తమ వైఖరి, ముఖ్యంగా పరుష పదజాలం వాడి ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం, ఇతర వికీపీడియనులను తెవికీ నుండి దూరంగా ఉంచడం లాంటి ప్రయత్నాలు మానివేయాలి. ఇతరులు కూడా ఆయన విమర్శలలో నిర్మాణాత్మకమైనవిని గుర్తించి వీటిని ఆచరించవచ్చు. ఉదాహణకు చదువరి AWB ద్వారా తామరతంపరగా చేస్తున్న మార్పులని ఎత్తిచూపడం నిర్మాణాత్మకమైన విమర్శ. కానీ ప్రసాద్ గారూ వీటిని చెప్పిన విధానము సరిగా లేదు. చదువరి గారు కూడా వీటిని వ్యక్తిగతంగా తీసుకిని మార్పులు మానివేయడానికి బదులుగా ప్రసాద్ గారిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివి నిర్వాహకులు జోక్యం చేసుకొని సరిదిద్దాలని మనవి.--తెగించినోడు (చర్చ) 10:28, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెగించినోడు గారు, మీ స్పందనలకు ధన్యవాదములు. ముఖ్యంగా, ఎవరికి ఎటువంటి హామీ పత్రం కావాలన్నా ఇస్తాను. కానీ, ముందు ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు అనేది నా ప్రశ్న. ఒక చర్చ ఏదైనా నాది తీసుకోండి. నేను అడిగే దానికి సమాధానము ఉండదు. అనవసరముగా చర్చ పొడిగింపు. మధ్యలో అనామక వాడుకరి వ్యక్తిగత దూషణ. ఆ తదుపరి కేవలం చర్చల కోసమనే వాడుకరుల వ్యక్తిగత మానసిక దాడి, హింస, ఇలా అనేకం వాటితో కొనసాగిస్తారు. ఇది వారి అలవాటేమో ? ఇంతకాలం నన్ను దూషించిన వారి అందరి నుండి, నాకు కూడా హామీ పత్రం కావాలి. ఒకరి తరువాత జీవితకాలం ఇలాగే వేధిస్తున్నారు, అసలు ఏ పని చేయనివ్వడం లేదు వీళ్ళు. ఇక్కడ ఏదో కాసేపు తోచిన పని చేసుకునే వాళ్ళకు ఇంత మానసిక క్షోభ పెట్టడం అవసరమా ? నా ఆరోగ్య సమస్యలు గురించి నేను అనేక సార్లు చెప్పాను. అయినా ఫలితం లేదు, అదే దాడిని కొనసాగిస్తున్నారు. సహజంగా ఈ వయసులో నన్ను ఎవరైనా అంటే నేను ఊరుకోను (నిజ జీవితంలో కూడా) అని అనేక సార్లు వాడుకరులకు తెలియజేసాను. నామానాన నన్ను పని చేసుకోనివ్వండి అని ఎల్లప్పుడూ అడుగుతునే ఉంటాను. కానీ హింసపెట్టేందుకు మాత్రమే నాతో ప్రయత్నం జరుగుతుంది. నేను ఎవరికీ లొంగను, పదిమందితో గ్రూపులో ఉండను. నేను ఒంటరిగా ఉండటమే నాకు అలవాటు అని కూడా చెబుతునే ఉన్నాను. నిర్వాహకత్వం నుండి తొలగించితే వచ్చే ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాకు ప్రతి ఒక్కరితో దూరంగా ఉంఛటం, బెదిరించటం, భయపెట్టడం, ఇంకా ఎలా ఎవరికితోచినవి వారు వారికి అర్థమయ్యే భాషలో వ్రాసుకుంటున్నారు. అదంతా మొత్తం అబద్ధం. ఏదైనా చర్చలో నన్ను ఆవేశ పరిస్తే అక్కడే నేను వ్రాయాలనుకున్నది, వ్రాసి అక్కడితో వదలి వేస్తాను. నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధలేని వాళ్ళ గురించి నాకు ఏముంటుంది, వాళ్ళెవరో నేనెవరో. నాకు ఎదుటి వాళ్లతో మాట్లాడటము నాకు చేతకాక పోవచ్చును. నేను నా వ్యక్తిగత జీవితంలో ఇంటి బయటకు ఎక్కడికీ వెళ్ళను, ఎవరూ స్నేహితులు నాకు లేరు అని కూడా చెప్పాను. నా గౌరవ, మర్యాదల కోసం, వ్యక్తిగత జీవితం మీద వీళ్ళ దాడులు ప్రభావం చూపిస్తున్నాయి, కనుక నేను ఆ విధంగా వారికి జవాబు ఇచ్చాను తప్ప, వికీ వాడుకరులు మాత్రం ఒకవైపు వారికోసం మాత్రం చూసుకుంటున్నారు, నన్ను దోషిగా చెస్తున్నారు. ఇది చాలా తప్పు అనిపిస్తుంది. తదుపరి, వికీకి భారతీయ చట్టాలు, సైబర్ క్రైం చట్టాలు, సోషల్ మీడియా, మీడియా, ప్రెస్, తెలుగు సంస్కారాలు, ఇలాంటి వాటికి అతీతం (ఏ రకంగా వర్తించవు) అని చెప్పేవాళ్ళు చెబుతూ, పెంపుడు పిల్లిని నాలుగు గోడల మధ్యన అందరం కలిసి కుమ్మేస్తాం, బయటకు చెప్పకూడదు మరియు మేము చేయాలనుకున్నది పూర్తి అయ్యేదాకా మారు మాట్లాడ కూడదు అనే ధోరణితోనూ, ఇంకా దీని మీద నేనేదో బెదిరించి, భయపెడుతున్నానని అభియోగాలు మోపుతున్నారు. (సశేషం) 14:39, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అభిప్రాయాలు మార్చు

1.సి. చంద్ర కాంత రావు, మీరు అప్పుడప్పుడు వస్తారు. మీకు తోచింది వ్రాసి వెళ్ళిపోతారు. నేను వాడే భాషకు నిర్వాహకత్వానికి సంబంధం ఎంతవరకు ఉంది ? నాకు మానసిక హింస, నన్ను వ్యతిరేకించే వారితో, ఇద్దరి మధ్యన జరిగినది అది గ్రూపుకు ఎలా అంటగటతారు ? వికీ మూలసూత్రాలు అంటూ ఎంతటి వారినయినా ఏకవచన సంబోధన, వ్యాసాలు వ్రాయాలి అన్న దానికి నేను వ్యతిరేకం. అందుకే నామీద దాడి చేసే వారికి మాత్రం నా మూలసూత్రాలు ప్రకారం నాభాష ప్రయోగం చేస్తాను. నా భాష పద్ధతి నాకుంది. ఒక్కొక్క వాడుకరి ఎందుకు నాతో వాదనకు దిగుతున్న కారణాలు, మానసిక హింస, వ్యక్తిగత దాడులు అన్నీ వివరంగా చెప్పమన్నా కూడా ప్రజలకు తెలియజేస్తాను. ఇక్కడ గ్రూపు రాజకీయాలతో న్యాయం ఒక పక్షాన మాత్రమే ఉంటుంది. మనకు భారత సైబర్ క్రైం మరియు కంప్యూటర్ నేరాలు అనేవి వికీకి వర్తిస్తాయా లేదా ? వీలయితే న్యాయపోరాటానికి కూడా వెళ్ళవచ్చునంటే తప్పకుండా మొత్తం సమాచారం అంతా వారికి అందిస్తా. నిర్వాహకత్వం, ఆ తదుపరి ఏకంగా వెలివేస్తారా ? అసలు తొలగించాల్సిన వాళ్ళని తొలగించకుండా వెనకేస్తుకొస్తున్నారు. నన్ను ఒకమాట అనవసరముగా అంటే నేను వంద అంటాను. తప్పేంటీ ?JVRKPRASAD (చర్చ) 01:28, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారు, వికీకి మరియు మీకు నావల్ల పొందిన నష్టం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీ అభిప్రాయమునకు సంతోషము. ఇద్దరి మధ్యన వాదాలు, సంవాదాలు జరిగి సమస్య పరిష్కరించుకునే సందర్భాలు అనేకం. అలాంటివు ఎన్నోసార్లు, ఎంతమందికో లేక కొందరికో జరుగుతూ ఉంటాయి. వాటిని ఓ మాలగా కూర్చి, జతచేసి కొద్దికాలం వ్యవధితో ఒక్కొక్కడూగా ఒక జీవితకాలం పాటు వాటిని చూపిస్తూ ఉండటం, కాలం ఇలాగే చర్చలు చేస్తూ ఉండటం వికీ మూలసూత్రాలలో ఒకటా అని నేను అడుగుతున్నాను. మరొకడు కొన్ని రోజులకు ఏదో లేపుకుని చర్చ మొదలు పెడతాడు. పని చేయరు. పనిచేసేవాడిని చేయనివ్వరు. కేవలం ఈర్ష్యా, అసూయ, ద్వేషం మనుషులు. నన్ను ఎందుకు వీళ్ళు వదల లేక పోతున్నారు ? నా జోలికి రాకుండా ఉండరు. వచ్చే వాళ్ళకి బుద్ధి చెప్పరు. నన్ను ఎదో అంటారు, నేను వంద అంటాను. ఇదే సరిపోతోంది. నన్ను అంటేనే నేను అంటాను, ఎవడి గురించో నాకేం పని ? వికీ మూలసూత్రాలు మారాలి. తదుపరి, చర్చ జరుగుతూ ఉండగా మధ్యలో కావాలని వ్యక్తిగతంగా దాడి జరుగుతుంది. నేను ఊరుకోను. చర్చ పక్కదారి పట్టిస్తారు. ఎవరు ముందుగా అన్నది తెలుసుకోండి. నన్ను వ్యతిరేకించే వారు జాబితా ఎలాగూ ఇప్పుడు తయారు అవుతుంది. నిదానంగా అయినా, కొంతయినా వాస్తవం, వెనక వెన్నుపోట్లు గురించి, అసలు నిజానికి జరిగింది అన్నీ వివరంగా తెలియజేస్తాను. JVRKPRASAD (చర్చ) 01:28, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పరుష పదజాలం ఉపయొగించడం వలన, వాడుకరులతో సంయమనంతో చర్చించకపోవడం వలన వాడుకరులు తెవికీకీ దూరంగా పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ పదజాలం, వికీకి నష్టం. వారికి వికీ అభివృద్ధికి చేసిన కృషికి వ్యక్తిగతంగా అభిమానిస్తాను. కాని నిర్వాహకునిగా ఆయన యితర సభ్యులపై, సరియైన సూచనలు యిచ్చేవారిపై సరియైన చర్చలు చేయడం లేదన్నది నా అభిప్రాయం. వ్యాసాలపై చర్చిస్తే అవి వ్యక్తిగతంగా తిసుకొంటున్నారు. వికీ నియమాలపై కూడా వారికి అంత అవగాహన లేదు. ఉదాహరణకు రైల్వే వ్యాసాల మొలకలను విపరీతంగా సృష్టిస్తున్నారు. అప్పుడు సరైన మూలాలనుంచండి అని తెలియజేసాను. దానికి ఆయన వ్యాసాలు వాటి మూలాలు లింకులో అక్షరం పెడితే చాలు. పనిచేసినట్లే అని అందరూ అంటారు. పని చేసే వాడు వాడికి తోచినట్లు చేస్తాడు. సొంత వ్యాసాలు అంటారు. మూలాలు అంటారు. కాస్త బుర్రలు పెట్టండి. సొంత వ్యాసాలకు మూలాలు ఎక్కడి నుండి వస్తాయి. మూలాలు ఉన్న వ్యాసాలే వ్రాయలి అందరూ అని నియమము పెట్టండి. చాలా సార్లు చెప్పాను రైల్వేవ్యాసాలు జోలికి కొన్నాళ్ళు ఆగమని. మర్యాదగా చెప్పితే ఎవడికి అర్థం కాదా? ఏమిటి ఈ వాదనలు. ఇంక మూసుకోండి. అని అన్నారు. వికీవ్యాసాలలో వాక్యాలకు మూలాలుండాలనే కనీస నియమం కూడా తెలియదని తెలుస్తుంది. ఈ మధ్య ఇంటిపేర్లు ఏక వాక్యలు వ్రాసినప్పుడు అవి సాధారణ వ్యాసాలని వాటిని వ్యాసాలుగా పరిగణించవచ్చని తెలియజేసారు. కనీస నియమాలు తెలియనప్పుడు కొత్తవాడుకరులకు ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తారు? అందువల్ల నిర్వాహకునిగా అనర్హులని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణచర్చ 05:08, 9 అక్టోబరు 2016 (UTC) (విషయంపై చర్చించండి. వ్యక్తిగతంగా దుషణలు చేయకండి.)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, నేను నిర్వాహకునిగా ఉంటే జనాలు దూరంగా వెళ్ళిపోతారా ? ప్రతిసారి ఇదే మీరు మాట్లాడతారు. మీరు చూపిన చర్చా భాగం తదుపరి మనము అస్సలు మాట్లాడుకోలేదా ? కావాలని ఎక్కడెక్కడివో ప్రచారానికి తీసుకొచ్చినట్లుగా ఉంది. నేను అడిగిన దానికి సరి అయిన సమాధానము చెప్పకుండా, గొడవలకు దారి తీస్తున్నారనే విషయం ఎవరూ ప్రస్తావించరు. నాకు మూలాలు గుర్తించి తెలియదా ? దీన్ని ఏమంటారు ? వ్యక్తిగత దూషణ కాదా ? ఇంటిపేర్లు ఏక వాక్యాలు వ్యాసాలు ఇది వరకు వ్రాసినవి ఉన్నాయి అని చెప్పాను కదా ! (దాని చర్చ భాగం పెడితే మంచిది) ప్రత్యేక తరగతికి చెందినవిగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పలేదా ? నేను సాధారణ వ్యాసాలుగా ఉండాలని ఎక్కడ చెప్పాను ? కనీస నియమాలు నాకు తెలియదు అంటే నేను మాత్రం ఎదుటి వాళ్ళను ఏం అనకూడదా ? నన్ను ఒకరి తరువాత ఒకరు విడతల వారీగా కొంతకాలంగా, గ్రూపుగా ఒకేసారి "రేఫ్' చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. నేను ఎవరికీ లొంగను. మీ కోరికలు నేను తీర్చను. కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ప్రపంచానికి విప్పదీసి చూపిస్తాను తప్పకుండా. నన్ను ఇంతలా వేదనకు గురిచేసిన ఎవరినీ అంత తేలికగా వికీ వరకే పరిమితం చేయటం అనేది ఎట్టిపరిస్థితులలో వదిలే ప్రసక్తి లేదు అని ఎప్పటికైనా తెలుసుకుంటారేమో ? నేను సాధారణ వికీపీడియన్‌గా ఉంటా, నన్ను ఎవడన్నా అనవసరంగా మానసిక హింస, గొడవలు చేసుకుంటే, చర్చలలో వ్యక్తిగత దూషణలు చేయటం, కావాలని బురద జల్లడం, ఇత్యాది ఏమైనా నాకు మనసుకు కష్టం కలిగితే అలాంటి వాళ్ళకు బూతులుతో సమాధానము చెబితే బావుంటుందా ? అలాంటి వాడికి ఎలా చెప్పాలి సమాధానం ? నా మాటలకి, పనులకు స్వతంత్రతకు అడ్డుగా ఉండే ఆ పదవి ఏదో నాకు వద్దని నేను చాలాసార్లు చెప్పాను. అది ఎవరికీ తెలియడము లేదు. ఎంతబాగా ఇంతకు ముందు నిర్వాహకులు, అధికారులు ఎంత బాగా ఉద్ధరించారో, ఉద్దరిస్తున్నారో చాలా బాగా చూస్తున్నాను. నన్ను తొలగించిన తదుపరి ఎవడన్నా నన్ను కెలికితే దాని (బూతులు) సమాధానానికి తెలుగు వికీ మూసేసుకోవాల్సి వస్తుంది అంటారా ? నన్ను కెలకెద్దు అంటే ఎందుకు నాది కెలుకుతారు ?JVRKPRASAD (చర్చ) 06:13, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

2. Palagiri గారు, మీకు నాకు అసలు చర్చలే లేవు. మీ అభిప్రాయానికి సంతోషం.JVRKPRASAD (చర్చ) 07:34, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

3. నేను మొదటి నుండి ఎవరినీ విమర్శించినది లేదు. దానికి ఉన్న ఒకే కారణం. అందరూ సేవా గుణంతో ఇందులో పని చేస్తున్నరనే అందుకే ఏ చర్చల్లో అయినా అందరూ సమానమే అనుకొనేవాడిని ఉదా- ప్రసాద్ గారిని ఎలా చూసేవాడినో ఒక చర్చలో ఇక్కడ ఇస్తున్నాను..

  • మీరిద్దరూ కూడా తెవికీ కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్న వికీపీడియన్లు. ఇద్దరికీ సమాన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రసాద్ గారు వయసు రీత్యా మనకు తండ్రి లాంటి వారు. ఆయన రాసుకొనేది రాసుకోనిద్దాం. ఆయన చెప్పినట్టు కొంత సమయం ఇచ్చి తరువాత మనం అడుగుపెట్టవచ్చు. Viswanadh (చర్చ) 06:26, 17 ఫిబ్రవరి 2016 (UTC)

ఆపై మరికొన్ని చర్చల అనంతరం చర్చల్లో ఆయనకు నచ్చచెప్పే విషయంలో నాపై విమర్శలు చేయడం చేసాడు..ఇలా

  • నేను వ్యక్తిగత దూషణలను చేస్తే, ఎవరిపై చేసానో తెలియచేస్తే వారిని క్షమించమని అడుగుతాను. అంతే కాదు వికీ నుండి కూడా సెలవు తీసుకుంటాను...దయచేసి తెలియచేయగలరు......(ప్రసాద్ గారిప్రవర్తన పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సభ్యులను అడిగి, మళ్ళీ తొందరపాటు తగదని దానిని వెంటనే తొలగించాను..దానికి ఆయన స్పందన, ఆపై సభ్యుల స్పందన చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది) --Viswanadh (చర్చ) 07:20, 26 జూన్ 2016 (UTC)
  • నువ్వు నన్ను తప్పుపట్టి, క్షమించగలను అంటావా ? నిన్ను వదిలే సమస్య లేదు. నాలోని తప్పుని చూపటానికి నీ జీవితం చాలదు. నువ్వు ముందు నీ తప్పులు అన్నీ ఒప్పుకో. ముందు నీ పిచ్చి తగ్గించుకో. నువ్వు ఒక పిచ్చోడివి. నీ మానసిక స్థితి బాగోలేదు, పిచ్చివాడివి కాబట్టి ఇలాంటి వ్రాతలు వ్రాస్తున్నావు.
  • "ఏ దొంగనాకొడుకు ఈ క్రింద పేరాలను తొలగించాడు", "ఏ దరిద్రుడు ఈ పేరాలను తొలగించాడు"
  • నువ్వు బుర్ర చెడి మాట్లాడుతున్నావు. పిచ్చోడిలా రాస్తున్నావు. అసలు జరిగినది నీకు ఏం తెలుసు ? వరుసగా వ్రాస్తాను, ఏ మాత్రం నీకు బుద్ది ఉంటే వేరే వాళ్ళచేత చదివించుకో.

ఇవి కొందరి సభ్యులపై ఆయన రాతలు, బెదిరింపులు

  • వాడుకరి:Vin09, చిన్నపిల్లడిలా నేను పత్తిత్తు అని మాట్లాడవద్దు. అసలు తొలగింపులు వద్దు మొర్రో అంటే వినకుండా పెడచెవిని పెట్టినందుకు నేను మార్పులు రద్దు చేసాను
  • మీ పని ఏదో మీరు చేసుకోండి. నన్ను అనవసరముగా కెలకవద్దు. మీ మర్యాద కూడా పోగొట్టుకోవద్దు. కొన్నాళ్ళు ఆగమని, నా జోలికి రావద్దని అంటే అర్థం కావడము లేదా ? ఎవడికైనా వ్రాయాలనుకుంటే వ్రాసుకోండి. నన్ను ఎందుకు కెలకడం. పిచ్చి పిచ్చి వ్రాతలు వ్రాయవద్దు. మీరు చెప్పినట్లు ఎవడు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఎవడికి తోచినట్లు వాడి పద్దతిలో వ్రాస్తారు.
  • నాతో సరిపడదని తెలిసి ఎందుకు గొడవలు పెట్టుకోవడం ? మీలాంటి వారికి నేను లొంగను. మీలాంటి వారి మాటలు నాకు ప్రయోజనం లేదు. కావాలనే ఏదో కెలికి గొడవలు పెట్టుకుని నాది తప్పు అంటారా ? సరే. నేను ఏ న్యాయస్థానముకు వెళ్ళాలో వెళ్ళి, నా అఫిడవిట్ పూర్తి సమాచారంతో సమర్పించుకుంటాను. JVRKPRASAD (చర్చ) 05:50, 22 ఆగష్టు 2016 (UTC)

చివరిగా ఇక్కడ ఉచితంగా సేవాగుణంతో చేస్తున్న ఈపని ఎవరిచేతో బూతులు తిట్టించుకొని ఉన్న పరువు పోగొట్టుకొనేటందుకు కాదు. వయసు పెద్దది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, తిడతా, దాడి చేస్తా అంటే ఎవరూ ఉండరు. ఏమీ మేసేజ్ ఇవ్వకుండా నిశ్శబ్ధంగా తప్పుకుంటారు. దీని వలన నష్టపోయేది వికీ మాత్రమే కాదు. అవగాహనతో పనిచేసే అందరూ వెళ్ళిపోయాక ఇక చేయడానికి ఏమీ ఉండదు. ఇంతకాలం ఎంటో కష్టపడి, ఇతర భారతీయ భాషలతో పోటీపడి తెలుగు వికీ గుర్తింపు తెచ్చి ఒక మంచి స్థితికి తీసుకొచ్చింది. ఇలా బ్రష్టు పట్టీంచేందుకు కాదు. అవసరం అయినపుడు నిర్భయంగా నిజాయితీగా అభిప్రాయాన్ని తెలియచేయలేకపోవడం అన్నిటికంటే అధమం...--Viswanadh (చర్చ) 16:14, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
4. ముందుగా ఎవరు వ్యక్తిగతంగా దాడి చేశారు. చర్చ ఎలా తీసుకెళ్ళారో పుస్తకం వేస్తాను. ఒక్కొక్క ముక్క ఎత్తి చూపించటంతో జనాలకు అర్థం కాదు, పతివ్రతలు ఎవరో తెలుస్తుంది. దేశంలో జనాలు నిర్ణయిస్తారు. ఈ పై పేరా కూడా నేను కూడా మొదటి నుండి అడిగే ప్రశ్న దానికి సమాధానం. నాకు ఒకరితో చర్చ చేయాలని ఉండదు. నా పని నేను చేసుకుంటాను, అభిప్రాయము చెబుతాను, ఆ తరువాతే చర్చ కాకుండా వ్యక్తిగతంగా నన్ను దూషిస్తేనే నేను తగు సమాదానము చెబుతూ ఉంటాను. JVRKPRASAD (చర్చ) 16:30, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
5. Viswanadh గారికి, మీ అభిప్రాయాన్ని తగినటువంటి విభాగంలో చేర్చం‍డి.--అర్జున (చర్చ) 05:09, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
6. అర్జున గారు, ఒక అధికారి అయి ఉండి, కొంపలు కాలిపోయేదాకా చూస్తూ ప్రేక్షకునిగా ఎక్కడో వికీకి అందనంత దూరంలో ఉంటే ఏం ప్రయోజనం ? కేవలం పంచనామా చేయాడానికే వికీ అధికారి అన్నట్లుగా ఉండటం ఎంతవరకు సమంజసం ? JVRKPRASAD (చర్చ) 06:31, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈవిషయం మీద తొందరపాటు చర్య పనికిరాదు. దీనివల్ల తె.వి.కీ వచ్చే అదనపు ఉపయోగం ఏమీలెదు. మిగతా సముదాయంలో నవ్వులపాలు గావటం తప్ప ఉపయోగం లేదు. వి.కీ వాడుకరి భాషా విషయం పక్కనబెట్టితే ఆయన చేసిన అభియోగాలలో కొంత నిజంకూడా వున్నది.అది పరిశీలించండి. --Nrgullapalli (చర్చ) 04
39,13 అక్టోబరు 2016 (UTC)

JVRK PRASAD గారి స్పందనలు మార్చు

  1. వాడుకరి: చ....రి, నువ్వు నేను వికీలో పుట్టిన దగ్గర నుండి వ్రాస్తే ఇంకా బావుండేది. నీకు ఇంకా చాలా సమాచారం దొరికేది. నువ్వు మరియు ఇతరులు చేసిన చెత్త పనులు ఎత్తి చూపితే నీలాంటి వాళ్ళు నా మీద చర్యలు, నిషేధాలు అంటూ వాగుతూ ఉంటారు. ఈ నిర్వాహక పదవి నా స్వతంత్రతకు అడ్డుగా ఉంటే ఎప్పుడో తొలగించమని, రద్దు చేయమని వ్రాసాను. అది నీకు కనిపించ లేదు. కేవలం నేను ఒకే ఒక వాడుకరి అన్న విధంగా ఉంటే నీలాంటి వెన్నుపోటు గాళ్ళకు, భజనగాళ్ళకు ఎప్పుడూ ఎదురు నిలిచే ఉంటాను. నీ గ్రూపు ఇలాగే ప్రవర్తిస్తోంది. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చావు. నీ క్రింద, ఎవడి కిందో నేను పనిచేయటం లేదు. నీ ఇష్టం వచ్చినట్లు వ్రాయకు. నీలాంటి వాడితో నాకు అవసరము లేదు. నీతో జీవితంలో మాట్లాడను అని నీకు ముందే చెప్పాను. నువ్వే నాతో కెలుక్కుంటున్నావు. నీ గురించి నేను నీ పేరు పెట్టి కానీ, నీకు సరాసరి సమాధానము కానీ ఎక్కడా వ్రాయడం లేదు. అనవసరముగా నువ్వు నన్ను కెలికెతే, నిన్ను కూడా 'రా' అంటాను. నీ కంటే దరిద్రంగా వ్రాయగలను. నన్ను వికీ నుండి తొలగిస్తావా ? నువ్వు తొలగిస్తే నేను ఊరుకోవాలా ? ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు ? వికీ అనేది నీ సొంత ఆస్థా ? నేనేమన్నా నీకు పనివాడినా ? (నాకు ఎవరూ నీతులు చెప్పనవసరము లేదు. నా గురించి తెలిసి తెలియక రాస్తే నా సమాధానము ఇలాగే, ఇంకోలా ఉంటుంది) JVRKPRASAD (చర్చ) 07:48, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నువ్వు ఎన్నో సం.లకు వచ్చీ రాగానే, నన్ను ఒక వాడుకరికి క్షమాపణ చెప్పమన్నావు. నేను చెప్పను అన్నాను, కారణాలు వివరించాను. ఎటువంటి వివరాలు కోసమైనా నిన్ను ఫోను చేయమన్నాను. నేను చేస్తానన్నాను, నీ దగ్గరకు వస్తానన్నాను. నీ నుండి సమాధానం లేదు. తదుపరి జీవితంలో నీతో మాట్లాడను అని చెప్పాను. నీ అహం దెబ్బతింది. ఆ తర్వాత చేస్తున్న నీ తప్పులు అన్యమనస్కంగా చెప్పాను. ఉదా: ఉన్నది --> ఉంది, వస్తున్నది-->వస్తుంది, నడుస్తున్నది --> నడుస్తుంది ఇలా అనేక ఒకే అర్థం వచ్చే పదాలు నీకు తోచినట్లు, నచ్చినట్లు మరుగున పడేసి నీకు ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి, కొన్ని పదాలు అసలు వికీలో లేకుండా చేసావు. ఇది అడిగినందుకు నీకు నెప్పి వచ్చింది. ఇలా నీకు ఏదో రకంగా నీకు నా మీద కక్ష్య పెరిగింది. అసలు నువ్వు ప్రస్తుతం వికీకి వచ్చి వాలింది కేవలం నన్ను ఏదో చేయాలనే ఆరాటంతోనే అనేది సుస్పష్టం. ఇప్పుడు పదవి ఏదో తొలగించాలని నీ ప్రతిపాదన. ఒక మనిషి తను గొప్ప మేధావి అనుకోవచ్చు, కానీ తను మాత్రమే గొప్ప మేధావి అనుకోవటం తప్పు. ఇన్ని సం.లు అయినా ఈ రోజుకు కూడా, నీ పేరు, నీ కుటుంబం గురించి ఇంతవరకు ఎక్కడ చెప్పుకోలేని వాడివి, నీతి నిజాయితీ లేనివాడివి, నువ్వు 2005 సం.లో వచ్చావు. ఎన్ని వ్యాసాలు వ్రాసావు. నువ్వు అధికారి ఎలా అయ్యావో వివరించమంటావా ? నువ్వు వికీకి చేసిన సేవ ఎంతుంది, ఏమిటో చెప్పుకోలేవు. నీ మొత్తం సమాచారం ప్రజలకు చూపించ మంటావా ? నేను నీలాంటి గ్రూపులలో ఉండను. ఒంటరిగానే ఎప్పుడూ ఉంటాను. నీకేంటీ ? ప్రజాస్వామ్యంలో తప్పులు చేస్తే ఎత్తి చూపిస్తే తప్పేంటీ ? మీకు వ్యతిరేకంగా మాట్లాడతానని, నా మీద ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు దాడి చేస్తారా ? వ్యక్తిగతంగా నాలోని తప్పు ఎంచే ఏం అర్హత నీకు ఉందో చెప్పు ఒక్కసారి. నిన్ను కూడా ఎవరూ ఏరకంగానూ వదలి పెట్టరు. అది కూడా తెలుసుకో. ఇంతటితో ఏదో అయిపోతుందిలే అనుకోవడం నీ భ్రమ మాత్రమే. ఆ తర్వాత ఇంకా ఏంచేస్తావు ? ఒకటి మాత్రం గుర్తుంచుకో. నువ్వు ఎదుటి వ్యక్తిని సుపరిమళాన్ని పంచే మనసున్న మల్లెపువ్వు మనిషి అనుకుంటే నీకు మంచి మాటలు లభిస్తాయి, అదే నీ మనసులో పెంట, బురద మనసు మనిషి అని నువ్వు రాళ్ళు వేయడం చేసావనుకో, ఆ బురద, పెంట మొత్తం నీ మొహాన్నే చిందులేస్తాయి. ఆప్పుడు ఎదుటి వ్యక్తి కంటే హీనమయిపోతావు. అది నీకు తెలియదు అనుకోవాలా ? JVRKPRASAD (చర్చ) 01:47, 9 అక్టోబరు 2016 (UTC)--[ప్రత్యుత్తరం]
ఒక మహాకుంభకోణానికి ఏనాటి నుండో తెరలు లేపుతునే ఉన్నారు. ఇంతకు ముందు నచ్చిన వాళ్ళకి నిర్వాహకత్వ పదవులకు నేను అడ్డుగా ఉన్నానని ఇలాగే తప్పించి ఆ పని జరిపించారు. ఆ తరువాత కొంత కాలానికి వైజాసత్య గారికి తెలిసి తనకు తానుగా నన్ను ప్రతిపాదించారు. ఇప్పుడు ఒకటి రెండు పనిచేసే యాక్టివ్ అధికారులు వికీకి అవసరం ఉన్నది. దానికోసం నేను భాక్రానంగల్ డ్యాం లేదా చైనా గోడలా ఉన్నాను. నన్ను ఎలాగైనా తొలగించాలి అన్న దురుద్దేశ్యంతో కొన్ని సంవత్సరాలుగా విడతలు వారీగా రెచ్చిపోయి రెచ్చగొట్టి, పైశాచిక ఆనందంతో నానుండి వాళ్లకు కావల్సిన, రావల్సిన, పొందవలసిన సమాచారము ఏవిధంగా పొందిన తదుపరి దాడి మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక అధికారి అయితే వెంకటరమణ ఖాయం. ఇద్దరు అయితే రెండో వ్యక్తి ఎవరికి ఇవ్వాలి ? నాకు ఇవ్వటము సుతారాము ఇష్టం లేదు. నాకు ఆ అధికారి పదవి అవసరము లేదు. ముందు నన్ను రెచ్చగొట్టిన వాళ్ళ మీద చర్యలేవి ? అడిగితే సమాధానము ఉండదు. ఏ సంస్థలలోనూ ఈ రకంగా ఉండదు. నన్ను నిర్వాహకత్వం నుండి తొలగిస్తే తిరిగి తొలగించిన వారే మళ్ళీ ఎన్నుకొనే అవకాశం లేదు, కొత్తవారు ఎవరూ వికీ అందుబాటులో ఉండరు. అందువల్ల నన్ను తిరిగి ఎన్నుకోవటం అనేది జీవితంలో జరగదు. నిర్వాహకుడు కాని దాని వల్ల ఇంక అధికారి అనే పదవి అస్సలు తలపులలోనే ఉండదు. ఇది దురహంకారం, కుట్ర కాదా ? నా పదవి తొలగించే బదులు నేను అస్సలు వికీకి కొన్ని నెలలు రాను. లేదా నా పదవి మీద నిషేధం పెట్టండి. ఆ తదుపరి, అప్పుడు ఏమంత వికీ అభివృద్ధి, కొత్తవారు వస్తారో చూడోచ్చు కదా. నన్ను కొన్ని నెలలు రావద్దని చెప్పకుండా, నా పదవి తొలగించాలని ప్రతిపాదనలు. మీరందరూ నన్ను కొన్ని నెలలు దూరంగా ఉండమని తీర్మానం చేయవచ్చు కదా ! అలా కాకుండా ఈ విధంగా చేయడం ఇది వాడుకరి జీవితానికి చేస్తున్న ఒక దుర్మార్గం చర్య. వాడుకరులు ఆలోచించండి. --JVRKPRASAD (చర్చ) 11:01, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చలో నా పేరును ప్రస్తావించారు కనుక చర్చించవలసి వచ్చింది. అనవసరంగా ఏవో కుంభకోణాలు జరుగుతున్నాయని తెబుతున్నారు. దానికి ఆధారమేమి? అధికారిగా నన్ను ఖాయం అని తెలియజేసారు. ఎవరు ఏ చర్చలో ప్రస్తావించారు? నిర్వాహకత్వం, అధికారులు సముదాయం మద్దతు లేకుండా ప్రస్తుతం అయ్యే అవకాశాలు వికీలో ఉన్నాయా? అనవసరంగా నన్ను పై చర్చలో ఎందుకు లేవదీసారు? చూసేవాళ్లకు ఏవో తెరవెనుక కార్యక్రమాలు జరిగినట్టు ఉంటుంది. నేను వికీలో చేరినప్పటి నుండి ఏ సమావేశాలకు ప్రత్యక్షంగా గానీ, స్క్రైప్ లో గానీ పాల్గొనలేదు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పురస్కారానికి కూడా హాజరు కాలేదు. కొన్ని నెలల తరువాత పాలగిరి గారు శ్రీకాకుళం వచ్చినప్పుడు నాకు అందజేసారు. వికీలో ఉన్న వివిధ వ్యక్తులతో వికీ చర్చాపేజీలలో చర్చిస్తున్నానే గానీ వ్యక్తిగతంగా గానీ, మొబైల్ లోగానీ, సామాజిక మాధ్యమాలలో గానీ చర్చించడంలేదు. నా యొక్క చర్చా పేజీలలో వ్యాసాలపై సమస్యలు, సాంకేతిక సమస్యలు వాడుకరులు తెలియజేస్తారే గానీ యితర విషయాలను చర్చించడం లేదు. అనవసరంగా ఏదో తెరవెనుక జరుగుతున్నదని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆధారాలు లేనిదే అటువంటి చర్చలు తగదని విజ్ఞులు తెలుసుకోవాలి.-- కె.వెంకటరమణచర్చ 12:06, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అన్ని ప్రశ్నలకు మీ వరకు మాత్రం నా ఊహగా వ్రాసింది మాత్రమే. ఇంతకంటే ఇందులో ఏమీలేదు. మీరు వ్రాసింది అసత్యం కాదు. నేను అసత్య ప్రచారం చేయడం కూడా లేదు. అన్నీ మీకు తెలియాలి అని కూడా లేదు కదా ! పార్టీలో జరిగే నిర్ణయాలు, చర్చలు అనేవి అభ్యర్థికి తెలియదు కదా ! JVRKPRASAD (చర్చ) 12:14, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మధ్యన ఇలా మానసిక హింస చేసినపుడు కొంతకాలం దూరంగా ఉండి నేను ఆంగ్ల వికీపీడియాలో చేసాను. అసలు ముందుగా నన్ను హింస పెట్టిన వాళ్ళకి బుద్ధి చెప్పరా ? ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రతిచర్చ మొత్తం చదివితే తెలుస్తుంది. అసలు వికీలో న్యాయం, ధర్మం, నీతి అనే వాటికి చోటు ఉందని ఎలా నమ్మాలి జనాలు ? --JVRKPRASAD (చర్చ) 19:47, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]


JVRKPRASAD గారు ఇక్కడ రాసిన స్పందనలతో కొన్ని విషయాలు (మరింత) స్పష్టమయ్యాయి:

  1. చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని అన్యాపదేశంగా బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపు గతంలో జరిగిన ఒక చర్చలో కూడా చేసారు. ఆప్పుడు ఆ వాడుకరి అలా బెదిరించకూడదని చెప్పారు కూడాను. అదే బెదిరింపు ఇప్పుడూ చేసారు. ఇలాంటి బెదిరింపులు వికీ నియమాలకు విరుద్ధం. ఎన్వికీ ఇలా చెబుతోంది: Do not make legal threats on Wikipedia. Users who do so are typically blocked from editing while the threats are outstanding. Legal threats should be reported to Administrators' noticeboard/Incidents or elsewhere to an administrator."
  2. నా వ్యక్తిగత సమాచారాన్ని - నా అసలు పేరు, కుటుంబ సమాచారం మొదలైనవి - నేను బయటపెట్టలేదని రాసారు. ఆ సమాచారాన్ని బయటపెడతానని నన్ను బెదిరిస్తున్నారు. పూర్తిగా నా వ్యక్తిగతమైన సంగతులు, తనకు ఏమాత్రం సంబంధం లేనివి బయటపెట్టడం వికీ నియమాలకు విరుద్ధం. వ్యక్తిగత దాడులు చేసే విషయంలో హద్దులు దాటారాయన. వికీలో ఏమాత్రం ఉపేక్షించలేని నడవడిక ఇది.
  3. వ్యక్తిగత దాడులను ఆపలేదు సరికదా, వాటిని ఇనుమడింపజేసారు. మహా కుంభకోణం అంటూ ఓ కుట్ర సిద్ధాంతాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఆధారాలేమీ చూపని తీవ్రమైన ఆరోపణలివి. తీవ్రమైన ఆరోపణలకు అంతే తీవ్రమైన ఆధారాలుండాలి. కానీ తన ఆరోపణలకు ఆయన ఒక్క ఆధారం కూడా చూపలేదు.
  4. నిర్వాహకుడిగా ఉండేందుకు ఆయన అనర్హుడని మరింతగా స్పష్టమైంది. __చదువరి (చర్చరచనలు) 05:18, 10 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, JVRKPRASAD గారి నిర్వాహక హోదా అంతు చూసేదాకా వదిలిపెట్టేటట్లు లేకున్నారు సుమా.--తెగించినోడు (చర్చ) 10:07, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తెగించినోడు గారు, పైన పేర్కొన్న నాలుగు అభిప్రాయాలకు, నా తరపున, నాకు తోచిన, నచ్చిన చెప్పదలచుకున్న సమాధానములు చెప్పమంటే చెబుతాను. ఎవరి అభిప్రాయము వారిది కదా ! ఏమంటారు ? --JVRKPRASAD (చర్చ) 12:54, 14 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, దాదాపు అందరు కీలక సభ్యులు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది విచారించదగ్గ అంశం. మీ అభిప్రాయము మీరు తప్పకుండా చెప్పండి. కానీ అదే సమయంలో మీరు కూడా ఇంట్రాస్పెక్ష్జన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదేమో..ఆలోచించగలరు.--తెగించినోడు (చర్చ) 08:12, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెగించినోడు గారు, నా స్పందనలు తరువాత తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. JVRKPRASAD (చర్చ) 08:50, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం మార్చు

వాడుకరి:JVRKPRASAD గారు తెలుగు వికీపీడియాలో విశేష కృషి చేస్తున్న కొద్దిమంది సభ్యులలో ఒకరైనప్పటికి వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు లో తెలిపినట్లు వికీపద్దతులు మరియు విధానాల అవగాహన లోపం మరియు దానివలన ఆచరణ లోపం మరియు ఇతర సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం మరియు తోటి సభ్యులతో సఖ్యతతో వ్యవహరించండం లో లోపాలు, చర్చలో వివిధ సభ్యులు ఉటంకించిన లింకులను చూస్తే తెలుస్తుంది. నిర్వాహక హోదా రద్దు ప్రతిపాదనకు 8 మంది సభ్యులు సమర్ధించగా, వ్యతిరేకత ఏ సభ్యుడు తెలియచేయలేదు. తటస్థంగా ఒక సభ్యుడు నిర్వాహకహోదారద్దు ప్రతిపాదనకు బదులుగా హెచ్చరించటం గురించి సూచించారు. అలాగే వాడుకరి:JVRKPRASAD గారు కూడా కొన్ని నెలల నిరోధం తీర్మానం గురించి వ్యాఖ్యానించారు.

కేవలం రాత ప్రధానంగా సముదాయపు సమిష్టి కృషిపై ఆధారపడిన వికీపీడియాలో వికీసభ్యులతో గౌరవంగా చర్చలు జరపడడం అత్యంత ప్రధానమైనది. నిర్వాహకహోదాలో వున్న వ్యక్తి అలా చేయలేకపోతే, వికీలో చేరే కొత్త సభ్యులకు భయం కలిగే అవకాశం మరియు దానితో వికీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువ. అనుభవమున్న ఇతర సభ్యులు కూడా తమ తమ కృషిని తగ్గించుకొనడంతోపాటు, చాలామంది సభ్యులు అటువంటి చర్చలకు దూరంగా వుండే అవకాశం కూడా అనుభవమే. (వాడుకరి:JVRKPRASAD గారు తమ వ్యాఖ్యలలో కొన్ని సార్లు తన చర్చలకు సమాధానం రావటంలేదనటమే దీనికి ఒక నిరూపణ).

గతంలో కొంతకాలం వాడుకరి:JVRKPRASAD గారు స్వచ్ఛందంగా కొంతకాలం తెవికీలో పనిచేయకున్నా మరల పనిచేయడం ప్రారంభించినతరువాత పాత ధోరణే కనబడడం తెలిసినదే. అందువలన మరియు సముదాయం నిర్వాహకహోదా రద్దు ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వెలిబుచ్చినందున, నిర్వాహకహోదా రద్దు ప్రతిపాదన విజయవంతమైనదిగా ప్రకటించడమైనది. --అర్జున (చర్చ) 16:58, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

English Translation of above decision for information of Stewards

Though User:JVRKPRASAD is one of the few most active contributors to Telugu Wikipedia, lack of understanding of wiki policies and there by their implemenation, as well as notrespecting the opinions of other wikipedians and not interacting with them in a civil manner is clearly visible from the links provided in the discussion. 8 members supported the proposal to desysop. none opposed it. only one member was neutral and suggested giving a warning. Even User:JVRKPRASAD mentioned about ban for few months in his comments.

Due to the importance of written word for Wikipedia community colloboration, behaving in a civil manner with other wikipedians is most important. If a person in admin role does not practice Civility, it scares newbiews and thereby leads to loss of new contributors. It is observed that even experienced wikipedians will reduce their involvment and will keep away from such discussions. (Commenting by User:JVRKPRASAD that there is no response sometimes to his discussion proposals is one such evidence)

In the past User:JVRKPRASAD voluntarily stopped working in Telugu Wikipedia. But once he restarted working, his old style of uncivil behaviour has become visible again. Hence and inview of the consensus by the community, the proposal to desysop User:JVRKPRASAD is declared as successful. --అర్జున (చర్చ) 17:18, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Request to Stewards on meta to implement the above decision--అర్జున (చర్చ) 17:27, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ నిర్ణయ ఫలితం ప్రజాస్వామ్య పద్దతి లేకుండా, సొంత వ్యాపార సంస్థలా ప్రకటించేశారు. కనీసం సొంత వ్యాపారాల్లో అయినా రెండో వైపు సంజాయిషీ అడుగుతారు. అదికూడాలేదు. కావాలనే ఈర్ష్యా, అసూయ, ద్వేషాలతో నిర్ణయించినట్లుగానే తోచటానికి అవకాశమే ఎక్కువగా కనబడుతోంది. దీని వల్ల నాకు వచ్చే నష్టం ఏమీలేదు. వికీలోని ఏ విషయాన్ని అయినా ఎక్కడయినా ఏదయినా తీసి వాడుకోవచ్చును. మరి చర్చలు కూడా బయటకు తీసి ఎందుకు వాడుకో కూడదో మరి ? ఇక్కడ జరిగిన చర్చలన్నీ నా కావాలసిన న్యాయం పొందేవరకు బయట ప్రపంచంలో అందరితో ఈ చర్చలు గురించి చర్చించుకుంటే వికీకి వచ్చే నష్టం ఏమిటో నాకు అర్థం కాదు. (సశేషం) JVRKPRASAD (చర్చ) 17:58, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సమూహ నిర్ణయాన్ని స్టీవార్డులు ఆమోదించారు. తెవికీలో నిర్వాహకుల సంఖ్య 15కు తగ్గింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:31, 18 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Saurabh Bhatnagar మార్చు

వాడుకరి:Saurabh Bhatnagar ను గమనించవలసినది. అది తమనూ, తమ కంపెనీనీ ప్రమోటు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఖాతాయేమోనని నాకు అనుమానంగా ఉంది. కారణాలివి:

  1. వాడుకరి పేజీ తప్ప మరేమీ రాయలేదు.
  2. ఈ వాడుకరి పేజీలో ప్రమోషను తప్ప మరేమీ లేదు.
  3. అంతా ఇంగ్లీషే ఉంది, తెలుగు వచ్చినట్లే లేదు. ఉత్తర భారతీయుడు. తెలుగు రాష్ట్రాల్లో నివసించిన దాఖలాల్లేవు.

ఈ వాడుకరి ఇక్కడ ఇతర రచలేమైనా చేస్తారా, చేస్తే ఎలా ఉండబోతున్నాయనేది గమనించి, తగు చర్యలు తీసుకోవాలి. లేదా ఈ అనుమానమే మీకూ కలిగితే వెంటనే చర్యలు తీసుకోవచ్చు. (నేను ట్వింకిల్ ARV ద్వారా నిర్వాహకులకు సందేశం పంపబోతే మూణ్ణాలుగు సార్లు విఫలమైంది. ఎంచేతో తెలీదు.) __చదువరి (చర్చరచనలు) 05:34, 3 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పరిస్థితులు తలెత్తడం వల్లనే డెలిబరేట్ గా తమను ప్రమోట్ చేసుకునేందుకు వాడుకరి పేజీ తయారుచేస్తే అంగీకరించకూడదన్న నియమం ఉందిట. అయితే తెలుగులో అలాంటి అవసరం వచ్చిందా అన్నది ఆలోచించాలి. ఇకపోతే నా వంతుగా ఈ వాడుకరిని పరిశీలిస్తాను. మీరిచ్చిన హెచ్చరికకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:16, 4 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదొక సమస్యగా మారుతున్నట్టే ఉంది, ఈ వాడుకరి పేజీ గమనించండి. --పవన్ సంతోష్ (చర్చ) 10:45, 10 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకటి USP మరోటి YSP. బాగుంది వీళ్ళ usp. తమతమ వ్యాపార కళల్నీ, కలల్ని, పగటికలల్నీ వెదజల్లేందుకు తెవికీని వాడుతున్నారు. YSP ప్రస్తుతానికి పర్లేదేమోననిపిస్తోంది. (అన్నట్టు.. చాలా తక్కువ తప్పులున్నాయా వ్యాసంలో.) __చదువరి (చర్చరచనలు) 11:50, 10 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Vamsimallavamsi చేసిన దుశ్చర్య మార్చు

వాడుకరి:Vamsimallavamsi {{Withdrawn}} అనే మూసలో చెత్త పోసారు. ఆ చెత్తతో పాటు {{Delete}} అనే మూసను కూడా పెట్టారు. ఈ రెండో మూసను ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీలు సత్వర తొలగింపు వర్గం లోకి చేరతాయి. ఆ వర్గంలో అన్ని మూసలు ఉన్నాయేంటా అని ఆశ్చర్యపోయాను. తీగ లాగితే, తేలింది ఈ దుశ్చర్య. ఆయన కొత్త వాడుకరి అయినప్పటికీ ఒక హెచ్చరిక ఈసరికే పొంది ఉన్నాడు. ఇకముందు దుశ్చర్యలు ఆపుతారనే ఆశాభావంతో, చివరి హెచ్చరికతో సరిపెట్టాను. __చదువరి (చర్చరచనలు) 18:01, 2 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పెండింగులో ఉన్న తొలగింపు ప్రతిపాదనలు మార్చు

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీకి అనుబంధంగా ఉన్న ఉపపేజీల్లో కొన్ని తొలగింపు ప్రతిపాదన చర్చలు ఫలితం కోసం వేచి ఉన్నాయి. నిర్వాహకు లెవరైనా ఫలితాన్ని వెలువరించగలరు. __చదువరి (చర్చరచనలు) 11:42, 13 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Nrgullapalli నిరోధం తొలగింపు అభ్యర్థన మార్చు

రచ్చబండలో వాడుకరి:Nrgullapalli విజ్ఞప్తి, దానిపై చర్చ మార్చు

తెలుగు వికీపీడియా సముదాయానికి విజ్నప్తి,
నేను గుళ్ళపల్లి నాగేశ్వర రావుని. కొన్ని సాంకేతిక విషయాలు తెలియకపోవడంతో జరిగినవాటి వల్ల నన్ను నిరోధించారు. ఇప్పుడు అవి నేర్చుకున్నాను. ఇదివరకు తెలుగు వికీపీడియా కోసం ఎంతో సమయం ఖర్చుపెట్టి పనిచేశాను, ఇకముందు నేర్చుకున్న విషయాలను ఉపయోగించి తెలుగు వికీపీడియాకు మరింత సమయం పనిచేస్తాను. కనుక నా నిరోధాన్ని తొలగించమని విజ్నప్తి.— Preceding unsigned comment added by 157.48.2.238 (talk)

గుళ్ళపల్లి గారు, ఆసక్తి, ఉత్సాహం ఉండి తన సమయాన్ని పూర్తిస్థాయిలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకే వెచ్చించి పనిచేస్తూంటారు. ఈరోజు ఆయన కోరగా నేను వ్యక్తిగతంగా ఆయనను, భాస్కర నాయుడు గారిని కలిసినప్పుడు గుళ్ళపల్లి గారు విజువల్ ఎడిటర్ ఉపయోగించి తేలికగా, సరైన లింకులు ఇచ్చే పద్ధతి వంటివి నేర్చుకుని, పాలసీ అంశాలు, మౌలికాంశాలు వంటి అనేక అంశాలను గురించి చర్చించి అవగాహన విస్తృతపరుచుకున్నారు. తన సమయాన్ని వెచ్చించి, తెవికీలో వ్యాసాలను సకారాత్మకంగా అభివృద్ధి చేసేందుకు ముందుకువస్తున్నందున ఈ నిరోధాన్ని తగ్గిస్తూ, తొలగించడం సమంజసం అని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:40, 12 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
గత 4 సంవత్సరాలుగా గుళ్ళపల్లిగారు తెవికీలో కృషి చేస్తున్నారు... ఆయన కోరికను మన్నించి నిరోధాన్ని తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:02, 12 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యునికి అవకాశాలపై అవకాశాలు ఇచ్చి సరిదిద్దుకోమని పలుమార్లు చెప్పిననూ పరిస్థితిలో మార్పు లేనందున, మళ్ళీమళ్ళీ అవేపొరపాట్లు చేస్తున్నందున రచ్చబండచర్చ, సభ్యుడి చర్చాపేజీలో తెలిపిన ప్రకారం చర్య తీసుకోబడింది. ముందుగా ఒకరోజు, ఆ తర్వాత 3 రోజులు నిరోధం విధించిననూ దిద్దుబాట్ల వైఖరిలో మార్పులేదు కాబట్టి నిరోధకాలం పెంచబడింది. పొరపాటు జరిగినట్లుగా సదరు సభ్యుడు కూడా అంగీకరించాడు. ఇప్పుడు నేర్చుకున్నట్టు తెలుపుతున్నారు. అవకాశమిచ్చిననూ పొరపాట్లను సరిదిద్దుకోనందున మాత్రమే నిరోధం విధించబడింది కాబట్టి ప్రస్తుతమున్న నిరోధకాలం తగ్గించే అవసరం లేదు. మరో 4 రోజుల అనంతరం ఆటోమేటిగ్గా నిరోధం తొలిగించబడుతుంది. నిరోధకాలం అనంతరం అవాంఛనీయ దిద్దుబాట్లు లేనప్పుడు మళ్ళీ నిరోధం విధించే పరిస్థితే ఉండడు. సభ్యులు గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:59, 12 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
వికీకి కావలసినది సభ్యులు తప్పు చెయ్యకుండా ఉండడమే. నాగేశ్వరరావు గారి విషయంలో తప్పులను నివారించేందుకు చెయ్యాల్సిన ప్రయత్నాలను మనం చేస్తూనే ఉన్నాం. పవన్ సంతోష్ గారు స్వయంగా వివరించడంతో ఆయన తన తప్పులను గ్రహించినట్లుగాను, వాటిని సవరించుకునే దిశలో ఆలోచిస్తున్నట్లుగానూ తెలుస్తోంది. మనకు కావలసినదీ అదే.
చేసిన తప్పులకు కాదు నిరోధం, ఇక చెయ్యకుండా ఉండేందుకు. అందుకు ఆయన మానసికంగాను, సాంకేతికంగానూ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది కాబట్టి, నిరోధాన్ని తగ్గించవచ్చు. సముదాయం ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. __చదువరి (చర్చరచనలు) 03:16, 13 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకుల నోటీసుబోర్డులో చర్చ మార్చు

పైన చర్చను, Nrgullapalli చర్చ పేజీలోనూ ఉన్న ఈ విజ్ఞప్తి చరిత్రను పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్తూ, చర్చ కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:21, 13 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మండలం మరియు గ్రామాలు మార్చు

ప్రతి మండలానికి మరియు గ్రామానికి వెర్వేరు వ్యాసం ఉండాలి. గ్రామ వ్యాసాల్లొ మండల సమాచరం కన్నా, మండల వ్యాసం లొ గ్రామాలు, MRO, Tahsildar, నియోజికవర్గం, వివరలు ఉంటే బాగుంటుంది. గ్రామ వ్యాసాల్లొ sarpanch, పంచయతి గురించి ఉండాలి. ఎలా అంటే, దేశ్ం వివరాలు రాష్ట్రంలొ, రాష్ట్రం వివరాలు జిల్లాలొ, జిల్లా వి పట్టణంలొ రయము కదా. ఉదాహరణకి గుంటూరు నగరం, గుంటూరు పట్టణం, గుంటూరు జిల్లా, పేర్లు ఒక్కటే కాని అన్ని వెర్వేరు. ఒక్కటే పెరు ఉన్నంత మాత్రాన రెండు కలిపి రాయము కదా. నేను కొన్ని పేజీలి ఇలా మార్చాను. దీని పై మి అభిప్రాయం తెలియజేయగలరు. ధన్యవాదాలు.--Vin09(talk) 06:10, 31 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ అంశం కేవలం నిర్వాహకుల నోటీసుకు మాత్రమే రావాల్సిన సంగతి కాదని నా అభిప్రాయం. ఇది ప్రత్యేకించి నోటబిలిటీ పాలసీకి సంబంధించిన అంశం. మంచి విషయమే లేవనెత్తారు, దీనిపై నిర్ణయం అయిన తర్వాత నిర్వాహకులో, మీరో ఎవరో ఒకరు ప్రత్యేకించి విషయప్రాధాన్యత (గ్రామాలు, మండలాలు) అన్న ఓ పాలసీ పేజీ రూపొందించి దానిలో చేర్చుదాం. ప్రస్తుతానికి దీన్ని చర్చకు రచ్చబండకు తరలిస్తున్నాను. (ఇతర వాడుకరులకు మనవి-ఇక్కడి చర్చ రచ్చబండలో మండలం మరియు గ్రామాలు అన్న దగ్గరకి తరలింది, అక్కడే చర్చించమనవి, ఒక్కమారు దీనిపై ఓ స్పష్టత వచ్చాకా ఏర్పడే పాలసీ పేజీకి కూడా ఇక్కడ నుంచి లింకు ఇస్తాం) --పవన్ సంతోష్ (చర్చ) 06:23, 5 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

‎2405:204:638b:7701:9d31:ce10:1e47:a4d3 అనామక వాడుకరి దుశ్యర్యలు మార్చు

ఐ.పి.నెం. ‎2405:204:638b:7701:9d31:ce10:1e47:a4d3 గల వాడుకరి పేజీలలోని సమాచారాన్ని తీయడమే పనిగా పెట్టుకున్నాడు. చరవాణి ద్వారా సవరణలు చేస్తూ ముఖ్యమైన సమాచారాన్ని, దస్త్రాలను, తొలగించడం అనేక రోజులుగా చేస్తున్నాడు. ఈ ఐ.పి.నెంబరును నిరోధించినప్పటికీ, కొంత వ్యవథిలోనే కొద్ది భేధంతో ఆ ఐ.పి నెంబరు మార్పు చేయబడి మరలా తన దుశ్చర్యలను చేస్తూ పోతున్నాడు. ఈ ఐ.పి.నెంబరును ఎలా పూర్తిగా నిరోధించాలో పరిశీలించగలరు.----కె.వెంకటరమణచర్చ 06:08, 4 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Improved search in deleted pages archive మార్చు

Please help translate to your language

During Wikimedia Hackathon 2016, the Discovery team worked on one of the items on the 2015 community wishlist, namely enabling searching the archive of deleted pages. This feature is now ready for production deployment, and will be enabled on all wikis, except Wikidata.

Right now, the feature is behind a feature flag - to use it on your wiki, please go to the Special:Undelete page, and add &fuzzy=1 to the URL, like this: https://test.wikipedia.org/w/index.php?title=Special%3AUndelete&fuzzy=1. Then search for the pages you're interested in. There should be more results than before, due to using ElasticSearch indexing (via the CirrusSearch extension).

We plan to enable this improved search by default on all wikis soon (around August 1, 2017). If you have any objections to this - please raise them with the Discovery team via email or on this announcement's discussion page. Like most Mediawiki configuration parameters, the functionality can be configured per wiki. Once the improved search becomes the default, you can still access the old mode using &fuzzy=0 in the URL, like this: https://test.wikipedia.org/w/index.php?title=Special%3AUndelete&fuzzy=0

Please note that since Special:Undelete is an admin-only feature, this search capability is also only accessible to wiki admins.

కృతజ్ఞతలు! CKoerner (WMF) (talk) 18:39, 25 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Deletion of page మార్చు

Hi. I marked my user page for deletion 11 month ago. When can I expect to have it deleted? -- Tegel (చర్చ) 17:25, 3 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిష్పాక్షికత దెబ్బతీసే మార్పుచేర్పులు మార్చు

గతకొన్ని రోజులుగా వాడుకరి:Jiksaw1 అనేవారు బహుశా తెలియక, నిష్పాక్షికతకు దెబ్బతీసేలా సమాచారాన్ని ప్రామాణిక ఆధారాల నుంచి కాకుండా కొన్ని పాక్షికమైన సోర్సుల నుంచో, లేక తన స్వంత అభిప్రాయాల నుంచో తీసుకువస్తూ - తెలుగు వికీపీడియా వ్యాసాల్లో నిష్పాక్షికతకు భంగం కలిగిస్తున్నారు. ఉదాహరణకు కంభం అన్న పదం నుంచి ఖమ్మం అన్నది వచ్చిందన్న స్థలనామ పరిశీలనాంశాన్ని పక్కన పెట్టి ముసునూరి కమ్మ రాజులు పాలనకాలం క్రీ.శ. 950లో కమ్మమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 550 ఏళ్లు ఈ కోట ముసునూరి కమ్మ ప్రభువుల ఆదీనంలో ఉంది. అంటూ ఆధారాలు ఇవ్వని వాక్యాలు రాసి వాటికి అనుగుణంగా కమ్మమెట్టు (ఖమ్మం ఖిల్లా) అని ఏకపక్షంగా వ్యాసం పేరు మార్పు చేసేశారు. ఈరకం మార్పులే ఎన్నో వ్యాసాల్లో చేశారు. కమ్మ కులస్తులు శూద్రవర్ణంలో అగ్రకులస్తులన్నది అందరికీ తెలిసిన అంశమే. చారిత్రకంగా శూద్రకులస్తులకు రాజ్యాధికారం ఆంధ్రదేశంలో ఉండడమూ తెలిసిందే. వీటిని పక్కనపెట్టి ఆయన కమ్మకులస్తులు క్షత్రియులని మౌలిక పరిశోధన, అభిప్రాయాలు ఆధారంగా కమ్మ వ్యాసాన్నికమ్మ క్షత్రియ అన్న పేరుకు తరలించారు. అంతేకాక ఏ విధమైన శాస్త్రీయాధారమూ, చారిత్రక సమర్థనా లేని చౌదరి అన్న పదం చక్రధర్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. చౌదరి అనగా ధర్మ రక్షకుడు మరియు పాలకుడు అని అర్థం. అన్న వాక్యాలు చేర్చుకుంటూ పోయారు. నిజానికి చౌదరి అన్న పదానికి చౌత్-ధరి - చౌత్ (నాలుగవ వంతు పన్ను) స్వీకరించేవాడన్న అర్థం ఉంది. ఉత్తర భారతదేశంలోని జమీందార్లు సంప్రదాయికంగా ఉపయోగించే ఈ పదాన్ని తమ నాయుడు అన్న పౌరుష నామం వదిలి కోస్తా జిల్లాల కమ్మవారు గత వంద సంవత్సరాల నుంచి ఎందుకో స్వీకరించారు. ఇటువంటి చారిత్రక వాస్తవాలు పక్కనపెట్టి రాసుకుంటూ పోతున్నారు. ఇంకా ముసునూరి నాయకులు వ్యాసాన్ని ఎన్నోసార్లు ముసునూరి కమ్మరాజులు అన్న దానికి మారుస్తూపోయారు. నేను ఎన్నోమార్లు తిప్పికొట్టాను. ఇది కూడా చారిత్రకంగా రాసిన విషయాలు పక్కనపెట్టి పాక్షికంగా మార్చుకుపోయారు. ఆ వ్యాసంలో వాడిన మూలాల్లో కూడా చరిత్రకారులు వీరిని నాయకులు అనే అనగా, ఆయన స్వంతంగా కాయిన్ చేసిన (లేదా వేరే అప్రమాణ రచనల్లో వాడిన) కమ్మరాజులు అన్నపదాన్ని కొనసాగించారు. నేను చర్చ:ముసునూరి నాయకులులోనూ, కమ్మ వ్యాసం చర్చలోనూ ఈ అంశాలు చర్చించే మార్పులు చేశాను. ఆ వాడుకరి చర్చ పేజీలో ఈ విషయాల గురించి చెప్పాను. కానీ స్పందన లేదు సరికదా, ఏ ఆధారాలు లేకుండా మార్పులు మాత్రం చేసుకుపోతున్నారు, సమాచారం తీసివేస్తున్నారు. (ఉదాహరణకు ఇక్కడ చూడండి) నేను ఇప్పటికే చెప్పాను కాబట్టి వాడుకరిని మూలాలు లేని సమాచారం చేర్చవద్దని, సరైన సమాచారం తొలగించవద్దని హెచ్చరించాలి. అలానే ఆ వాడుకరి మార్పులు గమనిస్తూ ఉండాలి. దయచేసి ఈ విషయంలో సహ నిర్వాహకుల సహకారం అభ్యర్థిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:19, 10 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]