పాత చర్చ 6 | పాత చర్చ 7 | పాత చర్చ 8

ఇది పాత చర్చలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా చర్చించాలంటే ఇక్కడ వ్రాయండి.

నియోజక వర్గాల సమాచార లింకుసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా డీ లిమిటేషన్ లేదా పునర్-వ్యవస్థీకరణ తరువాత నియోజక వర్గాలు, వాటి వరుస సంఖ్యలు, వాటిలో గల మండలాల వివరాల కొరకు "ప్రధాన ఎన్నికల ఆఫీసరు, ఆంధ్రపదేశ్" వారి వెబ్-సైట్ లింకును చూడండి. ఇక్కడ చూడండి . నిసార్ అహ్మద్ 20:43, 2 జూలై 2008 (UTC)

చాలా ఉపయోగకరమైన లింకు --వైజాసత్య 01:48, 3 జూలై 2008 (UTC)

వర్గాలలో ఉపవర్గాల సంఖ్యసవరించు

వికీపీడియా పరిణామం చెందేకొద్ది కొత్తకొత్త సౌలభ్యాలు అందుబాటులో వస్తున్నాయి. ఇటీవలే వికీ వ్యాసాల హిట్ల సౌలభ్యం రాగా, ఇప్పుడు కొత్తగా ప్రధాన వర్గంలో ఎన్ని ఉపవర్గాలు ఉన్నాయో తెలుసుకొనే సౌలభ్యం మనకు అందుబాటులో రావడం సంతోషించదగ్గ పరిణామం. ఇది వరకు వర్గం పేజీలో ఉపవర్గములు విభాగంలో ఈ వర్గంలో ఉన్న మొత్తం ... వర్గాలలో ప్రస్తుతం ... ఉపవర్గాలను చూపిస్తున్నాము అని మాత్రమే ఉండేది. ప్రస్తుతం వాటి చివర బ్రాకెట్లలో ఆయా వర్గాలలో ఉన్న ఉపవర్గాల సంఖ్య కూడా ఉండటం నేను గమనించాను. వర్గాల లింకును నొక్కే అవసరం లేనిదే మనకు ఆ సమాచారం తెలియడమే కాకుండా ఉప వర్గాలు లేని వర్గాల లింకును అనవసరంగా నొక్కి సమయం వృధాచేసుకొనే అ(న)వసరం తప్పింది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:30, 4 జూలై 2008 (UTC)

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాసవరించు

నెల్లూరు జిల్లా క్రొత్త పేరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కదా? ఇంక ముందు వ్రాసే వ్యాసాలలోను, మూసలలోను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని వాడమని సూచిస్తున్నాను. "శ్రీ" తరువాత, "పొట్టి" తరువాత ఖాళీలు గమనించ గలరు. పాతవాటిని బాట్ల ద్వారా చేతనైనవారు సమయం దొరికినపుడు మారుస్తారని ఆశిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:59, 6 జూలై 2008 (UTC)

ఇంటి పేర్లకు పేజీలసవరించు

ఇంటి పేర్లకు పేజీలు చేయడం - ఇప్పుడు చేస్తున్న విధంగా - అనవుసరమైన పని అపిస్తున్నది నాకు. ఒకమారు వర్గం:ఇంటిపేర్లులోని వ్యాసాలు తెరిచి చూడండి. వీటిలో చాలావరకు విస్తరణకు అవకాశం అత్యల్పం. అందునా "తటస్థ విధానం", "నిర్ధారింప దగిన ఆధారాలు" తో ఎన్నింటిని విస్తరించడం సాధ్యమౌతుందో ఆలోచించండి. మహా అయితే ఇవి దిక్సూచి (Navigation) పేజీలుగా ఉండిపోతాయి. పోనీ అలాగని అనుకొన్నా కనీసం నలుగురు (ప్రసిద్ధులైన) వ్యక్తుల పేరులన్నా లేకుండా వారి ఇంటి పేరుకు వ్యాసం అవుసరమా? అసలు ఇంటిపేర్లపై వ్యాసాలు ఉండకూడదని నేను అనడం లేదు. దయ చేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దు. కాస్తంత సమాచారం ఉన్న పక్షంలోనే ఆ ఇంటిపేరుకొక వ్యాసం చేయడం ఉచితమని నా అభిప్రాయం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:51, 7 జూలై 2008 (UTC)

చిన్న చిన్న వ్యాసాలుసవరించు

నరమ్తుల్లా గారు ఈ మధ్యలో చాలా ఒక పదంతో కూడా వ్యాసం పేజీలు తయారుచేస్తున్నారు. ఇవి చాలా ఎక్కువగా అయే ముందే హెచ్చరించడం మంచిది. కొంతైనా సమాచారం లేకుండా పేజీలు తయారుచెయ్యడం అంత మంచిది కాదని నా అభిప్రాయం.Rajasekhar1961 06:08, 9 జూలై 2008 (UTC)

చిన్న వ్యాసాల గురించి ఇప్పటికే చాలా సార్లు చర్చ జరిగింది. ఒకటి రెండు వాక్యాల వ్యాసాలే వద్దనుకున్నప్పుడు పూర్తి వాక్యం కూడా లేని కొన్ని పదాలనే వ్యాసంగా పరిగణించలేము. నిర్వహణలో భాగంగా ఇవి తొలిగించబడాలి. వ్యాసాలను వృద్ధి చేయాలనే ఉత్సాహంతో వీటిని సృష్టించిన రహమతుల్లా గారు ఇప్పుడు సమస్యను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:25, 9 జూలై 2008 (UTC)

నియోజకవర్గాల వ్యాసాలుసవరించు

ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాల వ్యాసాలు ఇదివరకే పూర్తికాగా ప్రస్తుతం మొత్తం 294 శాసనసభ నియోజకవర్గాల వ్యాసాలు సృష్టి పూర్తయింది. ఇక ఆ వ్యాసాలలో సమాచారం వృద్ధిచేయడమే మిలిగింది. కొన్ని నియోజకవర్గాల పేర్లలో తికమక ఏర్పడుతున్ననూ దీన్ని త్వరలోనే సరైన సమాచారం ద్వారా సరిదిద్దవచ్చు. డీలిమిటేషన్ కమిటీ సిఫార్సు అనంతరపు ఖచ్చితమైన సమాచారం లభిస్తే ఆ తప్పులను సరిదిద్దవచ్చు. కుప్పం శాసనసభ నియోజకవర్గం వ్యాసాన్ని ఆదర్శంగా తీసుకొని సభ్యులు నియోజకవర్గాల వ్యాసాలలో సమాచారం వృద్ధిపరిస్తే ఎన్నికల వరకు వ్యాసాలన్ని పరిపుష్టం కావడమే కాకుండా అనేక విశేష వ్యాసాలు తయారౌతాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 22:12, 13 జూలై 2008 (UTC)

నియోజకవర్గాల వ్యాసాలు అద్భుతం,
వ్యాసాల సమాచారాభివృద్ధికి తోడ్పడండి, ఇంతటి పరిపూర్ణ విషయాలుగల వేదిక కేవలం తెవికీయే అనే స్థితికి తీసుకురాగలగాలి. --నిసార్ అహ్మద్ 19:44, 24 జూలై 2008 (UTC)

Telugu scriptసవరించు

I am unable to write in telugu. I do not know, whether there are some soft ware changes and similar problem experienced by other editors. At the same time, against every division of the page, I am seeing <small>. I donot know this is also an error in the software.Rajasekhar1961 05:45, 14 జూలై 2008 (UTC)

తెలుగులో రాయటానికి నాకు ఏ ఇబ్బందీ కలగట్లేదు కానీ మీరన్నటు విభాగం పక్కన <small>మార్పు</small> అనిమాత్రం కనిపిస్తుంది. ఏమైందో? --వైజాసత్య 12:11, 14 జూలై 2008 (UTC)

పేర్లు, ఇంటిపేర్లుసవరించు

వ్యక్తుల పేర్ల మీద వ్యాసాలు వ్రాసే వ్రాసేటపుడు వారి ఇంటి పేరు గురించి క్రొత్త విధానం ఉచితమని నాకు అనిపిస్తున్నది. ఉదాహరణకు

నా ప్రతిపాదన ఏమంటే ప్రధాన వ్యాసం పేర్లు సూదిని జైపాల్ రెడ్డి, సామర్లకోట వెంకట రంగారావు గా ఉండాలి. ఎస్.జైపాల్ రెడ్డి, ఎస్.వి. రంగారావు వంటి పొడి అక్షరాల పేర్లు దారి మళ్ళింపు పేజీలుగా ఉండాలి. మీ అభిప్రాయాలు తెలుప గలరు. సభ్యుల అభిప్రాయాలను బట్టి వికీపీడియా:శైలి లో తగు మార్గదర్శకాలు వ్రాయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:18, 28 జూలై 2008 (UTC)

  • కాసుబాబు గారూ! మీరు చెప్పింది కరక్టే, నేను చాలా సార్లు ఈ విషయం గురించి చర్చిద్దామనుకున్నాను. ఇంకో సమస్య ఏంటంటే ఒకే పేరుతో ఇంటి పేర్లు వేరు వేరుగా ఉన్నా ఆంగ్లంలో అబ్రివియేట్ చేస్తే అయోమయం రావచ్చు. δευ దేవా 19:36, 28 జూలై 2008 (UTC)
  • పూర్తి పేర్లతో వ్యాసాలు రాయడమే సరైన మార్గమని నా అభిప్రాయం. ఒకవేళ పొడి పేర్లు ప్రాచుర్యంలో ఉంటే వాటికి దారి మార్పు పేజీలు సృష్టించవచ్చు. రవిచంద్ర(చర్చ) 04:02, 29 జూలై 2008 (UTC)
  • కాసుబాబు చెప్పింది చాలా సరైనది. పూర్తి పేరులతోనే ప్రధాన వ్యాసాలు ఉండడం సబబు. అదేవిధంగా చేద్దాం.Rajasekhar1961 13:39, 31 జూలై 2008 (UTC)

ఆభరణాలుసవరించు

ఆభరణాలు మీద వ్యాసాలు మొదలుపెట్టాను. పేర్లల్లో కొంత ప్రాంతీయ భేదాలు కనిపిస్తున్నాయి. అవి చేర్చడం ఎలా? భారతీయులు ఉపయోగించే ఆభరణాల బొమ్మలు ఎవరైనా సంపాందించగలిగితే వ్యాసాలకు వన్నె వస్తుంది. సమాచారంలో గల సందిగ్ధతలను అందరూ కలిసి తొలగిస్తుంటే చక్కని వ్యాసాలు తయారౌతాయి.Rajasekhar1961 08:11, 26 ఆగష్టు 2008 (UTC)

నేను కొన్ని బొమ్మలకోసం ప్రయత్నిస్తాను రవిచంద్ర(చర్చ) 08:28, 26 ఆగష్టు 2008 (UTC)

సర్వర్ ఇబ్బందులుసవరించు

ఈ మధ్యలో సమాచారాన్ని చేర్చడానికి సర్వర్ చాలా సమయం తీసుకుంటుంది. చాలా సార్లు విఫలమై పోతుంది. బయటి కేఫ్ ల నుండి కూడా ఇలాంటి ఇబ్బంది ఉన్నది. ఇది మీరందరూ అనుభవిస్తున్నారా. సర్వర్ లోగాని, లేదా వికీపీడియా వ్యవస్థలో ఏదైనా లోపం ఏర్పడిందా అని అనుమానం కలుగుతుంది. దీనిని గుర్తించడం ఎలాగో తెలియడం లేదు. అమెరికా ఆర్ధిక వ్యవస్థలోని లోట్లు వికీలో ప్రభావం చూపుతున్నాయా ? ఇది సాఫ్ట్ వేర్ లో అనుభవం ఉన్న సీనియర్లు తెవికీ, ఇవికీలో కూడా తరచి చూచి చెప్పాల్సిన విషయం. నా కంప్యూటర్ కొత్తది. మిగతా వెబ్ సైట్లతో ఈ ఇబ్బంది కలగడం లేదు. వికీ దగ్గర మాత్రమే ఎందుకు తెలియదు. మన తెలుగు వికీపీడియన్లు ఆర్ధికంగా సహాయం చేయక పోవడం వలన ఇలాంటిది జరగడం లేదు కదా.Rajasekhar1961 04:19, 22 సెప్టెంబర్ 2008 (UTC)

నా వరకైతే ఏ సమస్యా లేదు. కాకపోతే నేను చేరిన మొదటి నుంచీ అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నాను. ఇలాంటివి నాకు తెలిసి వికీమీడియా సాఫ్టువేరు ను క్రమంగా అప్‌డేట్ చెయ్యడం వల్ల వచ్చే సమస్యలు. కాకపోతే ఏదైన కీలక సమస్య లు అయితే వాటిని యుద్ధ ప్రాతిపదికన సరి చేయడం జరుగుతుంది. మిగతా సభ్యుల నుంచి కూడా విందాం... మీలాగే సమస్యలు ఎదుర్కొనే వారు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో తెలిస్తే ఇవికీ వారి అధికారుల సలహా కోరవచ్చు. రవిచంద్ర(చర్చ) 14:40, 22 సెప్టెంబర్ 2008 (UTC)

కామన్స్ లోకి బొమ్మల కాపీసవరించు

Image:Kitchen table.jpg దీనిని కామన్స్ లోకి కాపీ చేయడం తెలపండి. మేజా పేజీలో దీని అవసరం ఉన్నది.Rajasekhar1961 14:47, 14 అక్టోబర్ 2008 (UTC)

ఇలా చేయవచ్చును. ఆంగ్ల వికీలో ఆ బొమ్మలో {{copy to commons}} అనే మూస ఉంచండి. అప్పుడు "Copy to Commons via CommonsHelper" అనే లింకు వస్తుంది. ఆ లింకును అనుసరిస్తే కామన్స్‌లోకి అప్‌లోడ్ చేయవచ్చును. అయితే మీకు కామన్స్‌లో సభ్యత్వం ఉండాలి. ప్రస్తుతానికి నేను అప్‌లోడ్ చేశాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:45, 14 అక్టోబర్ 2008 (UTC)


తెవికీ! గమ్యమెటూసవరించు

ఇటీవల కాలంలో తెవికీ కొత్త వ్యాసాలను చూస్తే ఆశ్చర్యం కల్గుతుంది. విజ్ఞాన సర్వస్వమంటే విజ్ఞానదాయక అంశాలనే అందరూ అనుకుంటారు. శాస్త్రసాంకేతికాలు, చరిత్ర, భౌగోళికం, సాహిత్యం, ఆర్థిక, సామాజిక, క్రీడా, రాజకీయ తదితర అంశాలపై వ్రాయడానికి బోలెడంత అవకాశం ఉంది. వీటిపై ప్రస్తుతమున్న అంశాలు కూడా తక్కువే. కాని ఇటీవల కాలంలో ఇలాంటి వ్యాసాలు కాకుండా ఎవరికి వారు విజ్ఞానానికి సంబంధం లేని వ్యాసాలు సృష్టిస్తున్నారు. ప్రతివారికి వ్రాసే అవకాశం ఉంది నిజమే కాని ఇలా వ్రాస్తే మన తెవికీ ప్రయాణం దారితప్పవచ్చు. దీనిపై మనం ముందుగా చేయవలసింది వికీ విధానాలు తయారుచేయడం. అంతేకాకుండా కొత్త వ్యాసం సృష్టి కనీసం 2 కేబిలైనా ఉండాలని నేను మరోసారి నొక్కి చెబుతున్నా. నాలుగు వాక్యాలు కూడా లేని సమాచారాన్ని వ్యాసంగా ఎలా పరిగణిస్తాం. భవిష్యత్తులో వృక్షాలుగా మారడానికి అవకాశం లేని ప్రస్తుత మొలకలను కూడా తొలిగించాలి. వికీ విధానాలు మారకుంటే ప్రస్తుతమున్న చురుకైన సభ్యులు సహనం కోల్పోయే అవకాశముంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:33, 21 అక్టోబర్ 2008 (UTC)

నేను కూడా ఇలాంటి కొన్ని వ్యాసాలను చూస్తున్నాను. తొందరగా వ్యాసాల సంఖ్య పెంచడానికి కాకుండా ఎటువంటి ఆసక్తికరమైన అంశాలను చేరిస్తే వికీపీడియా నిజమైన విజ్ఞాన ఖని అవుతుందని మనం ఆలోచించాలి. ఇలా చేస్తే, సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఆంగ్ల వికీపీడియాను కొన్ని పాఠశాలల్లో కూడా వాడుతున్నారని విన్నాను. మన లక్ష్యాల్లో ఇది కూడా ఒక భాగం కావాలి. రవిచంద్ర(చర్చ) 16:35, 21 అక్టోబర్ 2008 (UTC)
నిర్వాహకులున్నదెందుకూ..అలాగ అప్పుడప్పుడూ కత్తరింపులు వేస్తూ సరైన దిశలో తెవికీ అనే మహావృక్షము పెరిగేందుకు దోహదపడటానికే కదా..--వైజాసత్య 19:57, 21 అక్టోబర్ 2008 (UTC)
నిర్వాహకుల అభిప్రాయాల మద్య తేడాలుంటాయి. నా అభిప్రాయం ప్రకారం చేయాలంటే చాలా వ్యాసాలు, వ్యాసాలలోని సమాచారం తొలిగించాల్సి రావచ్చు. కాని నిర్వాహకులు ఒక్కరి అభిప్రాయాలకనుగుణంగా చేయడానికి వీలుండదు కదా! అందుకే ప్రస్తుతమున్న పాలసీలను సమీక్షించి, అవసరమైతే కొత్త పాలసీలను చేర్చి ఒక సమగ్రమైన తెవికీ రాజ్యాంగం ఏర్పాటుచేస్తే దానికగుణంగా విజ్ఞానసర్వస్వాన్ని ముందుకు నడిపించవచ్చు. ---- C.Chandra Kanth Rao(చర్చ) 19:20, 22 అక్టోబర్ 2008 (UTC)
చంద్రకాంతరావు గారూ, నిర్వాహకుల మధ్యన, సభ్యుల మధ్యన ఇలాంటి అభిప్రాయబేధాలుండటం వికీల్లో కొత్తేమీ కాదండి. వికీతత్వాల్లో మీరూ ఒక కోవకు చెందినవారు..అలాగే విరుద్ధమైన కోవకూ చెందినవారుంటారు..ఈ ఆంగ్లవికీ వ్యాసం చదవండి en:Deletionism and inclusionism in Wikipedia - తెవికీ నిర్వాహకులందరూ చదవవలసిన వ్యాసమిది. నేను మధ్యేవాదినైనా తరచూ మీలాగే డిలీషనిజం (కత్తరింపువాదం) వైపు మొగ్గుతుంటాను --వైజాసత్య 20:32, 22 అక్టోబర్ 2008 (UTC)

తెలుగులో వ్రాయటంసవరించు

తెవికీ లొ ఏదైనా పేజీ ని మార్చడానికి ప్రయత్నించినప్పుడు ఎడిటర్ తెలుగులో రాయడానికి వీలు కలిపిస్తొంది. మనం 'తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి' ని ఎంచుకుంటే నేరుగా తెలుగులో వ్రాయచ్చు. నేను నా పీసీ లో మీడియావికీ వె. 1.13 install చేసి, తెలుగుని మీడియావికీ భాషగా ఎంచుకున్నా. అన్నీ తెలుగు లోనే వస్తున్నాయి కానీ ఎడిటర్ మాత్రం మాములుగా ఇంగ్లీషు లోనే వ్రాయడానికి ఉపకరిస్తోంది. తెవికీ లొ ఎడిటర్ లా తెలుగులో పేజీలను వ్రాయాలంటే ఏమి చెయ్యలి? అదనపు extensions install చేసుకొవాలా? లేదా ప్రత్యేక పేజీల్లో ఏమైనా మార్పులు చెయ్యాలా? దయచేసి సహాయపడగలరు

ఎవరి కొరకు ఆ వ్యాసాలుసవరించు

గత కొద్ది రోజులుగా తెలుగు వికీపీడియాలో కొందరు సభ్యులు అజ్ఞాతంగా ఉంటూ నాస్తికవాదం, హేతువాదం, మతవిమర్శల వ్యాసాలు వ్రాస్తూ సభ్యులను, పాఠకులను రెచ్చగొట్టేవిధంగా చేస్తున్నారు. ఇలాంటి రచనలు చేయడానికి తెవికీ వేదిక కాదు. ఉద్దేశ్యపూర్వకంగా రచనలు చేయడం అంతకన్నా తగదు. కేవలం ఇలాంటి రచనల కోసమే కొందరు సభ్యులు పనిచేస్తున్నారనిపిస్తోంది. వికీపీడియాలో రచనలు చేసేది మనకొరకు కాదు. మన వాదనలు వినిపించడానికి అసలే కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయిననూ వికీ నియమాలతో నాకేంటి పని అన్నట్లుగా ఉంది వ్యవహారం. చూసేవారికీ, చదివే వారికీ ఒక హద్దుంది ప్రస్తుతం ఆ పరిధిని దాటింది. తెలుగు విజ్ఞానసర్వస్వాన్ని తెలుగు ప్రజలందరికీ ఉపయోగపడేలా తయారుచేస్తూ, తెలుగు ప్రజలు మెచ్చుకొనేవిధంగా రూపొందిస్తే, తెవికీ సభ్యులకు ఈ బృహత్కార్యం ఒక గర్వకారణమే. తెలుగు ప్రజలకు ఉపయోగపడేలా వ్యాసాలు వ్రాయడానికి ఆకాశమంత అవకాశం, భూగోళమంత పరిధి ఉంది. తెలుగు బాష గురించి, తెలుగు వ్యక్తుల గురించి, తెలుగు సంస్కృతి గురించి, తెలుగు నేల గురించి ఎన్నయినా వ్రాయవచ్చు. ఇలాగే భారతీయ వ్యక్తులు, సంస్కృతి, నగరాలు గురించి ఎంతో వ్రాయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన వ్యక్తులు, నగరాలు లాంటివీ వ్రాయవచ్చు. శాస్త్రసాంకేతికాలు, క్రీడల వంటికీ స్థానం ఇవ్వవచ్చు. ఇవేవీ నాకు తెలియదు, నా వాదన నేను వినిపిస్తానంటే కుదరదు. ప్రతి సభ్యునికీ స్వేచ్ఛ ఉంది, నిజమే, దానికీ హద్దుంది. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రతి హక్కులపై నిర్బంధనాలు ఉన్నట్లే ఇక్కడా తోటి సభ్యుల ముఖ్యంగా పాఠకుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. ఒకరు హేతువాదం, నాస్తికవాదమంటే మరొకరు మతమంటారు. వారికి ఇది తప్ప మిగితా విషయాలు తెలియదనుకోలేం. అయినా అదే వ్రాస్తున్నారంటే ఖచ్చితంగా అది ఉద్దేశ్యపూర్వకంగానే. ఆంగ్లవికీలో ఉందికదా అని చెప్పవచ్చు కాని ఆంగ్ల వికీ సభ్యులు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు. పాఠకులు కూడా అంతే కాబట్టి ప్రతి ప్రాంతం గురించి లోతుగా ఉంటుంది. కాని తెలుగు భాష పరిమితమైనది . ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నారు కాని తెలుగు వికీ చూస్తున్నారంటే వారికి తెలుగు భాషపై మమకారం ఉన్నట్లే. వారు చూసే వ్యాసాలు కూడా దానికి భిన్నంగా ఏమీ ఉండరాదు. తెలుగునేలకు సంబంధించి ప్రతి గ్రామ వ్యాసం ఉన్నట్లే ఏదో ఒక దేశానికి సంబంధించిన ప్రతి గ్రామపు వ్యాసాలు చేర్చలేము కదా! కాని ఇటీవలి కొన్ని వ్యాసాలు చూస్తే ఈ హద్దుదాటినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. గౌరవప్రదంగా సూచించినా వినడం లేదు. ఇక వారి రచనలన్నీ తొలిగించడానికి, ఐపి అడ్రస్‌లన్నీ బ్లాక్ చేయడానికి సభ్యులు చొరవచూపుతారని ఆశిస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:05, 6 నవంబర్ 2008 (UTC)

చంద్రకాంతరావు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వ్రాసేవారు తమకు తాము నాస్తికులమని ప్రకటించేటపుడు, వారికి మతము తో పనేముంది? మతములపై వ్రాసే అధికారం ఎవరిచ్చారు? ఇతర మతాల పట్ల దురుసుగా ప్రవర్తించడమేంటి? ఇతర మతాలకు గౌరవించనిలేనివారు, తమ స్వమతాలకు ఎలా గౌరవించ గలుగుతారు? ఇలాంటి దురుసువారు 'ముసైలిమా' లాంటి ఫిత్నాలకు 'ప్రవక్త'ల జాబితాలో చేర్చేస్తున్నారు, ఆదమ్-హవ్వా, పార్వతీ పరమేశ్వరులు ఒకరే, వసుధపై నివసించే మానవులంతా ఒకే కుటుంబమంటే, ఈ వాక్యాలను చెరిపేస్తున్నారు. ఈ శైలి విజ్ఞతా భరితమా లేదా మానసిక రుగ్మతా?

మనకు, రాబోయే తరానికి విజ్ఞానాన్ని, విజ్ఞాన భాండాగారాన్ని అందజేయాలనే సంకల్పం, విశ్వమానవ కళ్యానం, వసుదైక కుటుంబం, లాంటి విషయాల పట్ల విశ్వాసం, పరమత సహనం, మొదలగు అంశాలు మన ధృడ సంకల్పాలయితే, ఇలాంటి వ్యాసాలకు మొక్కలోనే త్రుంచివేయాలి. లేకుంటే విజ్ఞాన సర్వస్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వికీ నిర్వాహకులకు ఇదో పరీక్ష. తగిన నిర్ణయాన్ని వేగిరంగా తీసుకోండి నిసార్ అహ్మద్ 16:42, 6 నవంబర్ 2008 (UTC)

మతం, హేతువాదం, నాస్తికవాదం, మొదలైనవన్నీ వికీపీడియాలో ఉండదగ్గవే. (అంటే నా ఉద్దేశ్యం ఇక్కడ వాటిని తటస్థ దృక్కోణంతో రాయగలిగితే ఓకే). కాకపోతే వాటిలో ఉన్న సమాచారం విజ్ఞాన సంబంధమైన విషయాలు తప్ప ఏ వర్గానికీ చెందిన పాఠకుల/ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకుండా ఉండేటట్లుగా మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.(ఒక మతం గురించి రాసేటపుడు మరో మతంపై విమర్శలు తగవు). వికీ విది విధానాలు సరిగా అర్థం చేసుకోని వారు కూడా ఇలా రాసిఉండవచ్చును కనుక ఎవరైనా సరే, ఇలాంటి వాటిని నిస్సందేహంగా తొలగించవచ్చు. ఒకవేళ వారు కారణాలు అడిగితే , రాసిన సదరు సభ్యుల పేజీలో కాస్త ఓపికగా ఎందుకు తొలిగించామో వివరణ ఇస్తే బాగుంటుంది. రవిచంద్ర(చర్చ) 17:55, 6 నవంబర్ 2008 (UTC)
తప్పకుండా హద్దు దాటుతున్నట్లు కనిపిస్తుంది కాని తొలగించడానికి తొందర తగదు. అవుసరమైన చోట "ఆధారాలు చూపిచండి" అని సూచన ఇద్దాము. ఆధారాలు లేని, వివాదానికి అవకాశమున్న భాగాలు (లేదా పూర్తి వ్యాసాలు) తొలగిద్దాము. కాని "ఈ సబ్జక్టుపై వ్యాసాలు ఉండకూడదు" అన్న నియమం ఇప్పటికి లేదు. కనుక over reaction వద్దు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:42, 6 నవంబర్ 2008 (UTC)
నాస్తికులమని చెప్పుకొనే వారికి మతాలతో సంబంధమేముందని నిస్సారు గారు చాలా మంచి పాయింటు చెప్పారు. అలాంటప్పుడు ఇతర మతాలపై విమర్శలు ఎందుకు? నాస్తికుడైనంత మాత్రానా అతని మానాన అతను ఉండటం మేలు. ఇతర మతాలపై విమర్శలు చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చిలిపిచేష్టలే తప్ప హుందాతనం అనిపించుకోదు. కాసుబాబు గారు చెప్పినట్లు ఆధారాలు చూపించండి అనే సూచన వద్దు. ఆధారాలు లేవని కాదు, నాస్తికవాదానికీ ఎన్నో విమర్శలు ఉన్నాయి. మత నమ్మకాలను నమ్మకపోవడమే ప్రపంచంలో అతిపెద్ద మూఢనమ్మకం అంటారు. ఇలా ఒకరికి ఒకరు ఆధారాలతో వాదన చేయడంతోనే సరిపోతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:53, 6 నవంబర్ 2008 (UTC)
రవిచంద్ర గారు చెప్పినట్లు మతం, హేతువాదం, నాస్తికవాదం వికీలో ఉండదగ్గవే, కాదని నేనడం లేదు. ఇదివరకే అలాంటి వ్యాసాలు ఉన్నాయి కాని ఇటీవల వ్యాసాలు హద్దులు దాటాయి. వాటిని ఎవరికీ అభ్యంతరం లేని రీతిలో వికీకరిస్తే చాలు. నేను తొలిగించాలని చెప్పేవి ఇటీవల అజ్ఞాత సభ్యుడు/సభ్యులు (ఒకరో ఇద్దరో తెలియదు) ఉద్దేశ్యపూర్వకంగా వ్రాసిన వ్యాసాలు మాత్రమే. అసలు అజ్ఞాత సభ్యులకు సున్నితమైన వ్యాసాలలో అవకాశం ఎందుకివ్వడం. ఆ వ్యాసాలను అర్థసంరక్షణ చేస్తే సరిపోతుంది. ఐపి అడ్రస్ తో వ్రాయడం కూడా ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నట్లనిపిస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:16, 6 నవంబర్ 2008 (UTC)
ప్రస్తుతానికి ఈ సున్నిత వ్యాసాలను అర్ధసంరక్షణలో పెట్టడం అన్న ఆలోచనకు నా మద్దతు కూడా తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన --వైజాసత్య 04:23, 7 నవంబర్ 2008 (UTC)
అలాగే చేయడం మంచిది. నా మద్దతు కూడా పరిగణించండి. రవిచంద్ర(చర్చ) 04:26, 7 నవంబర్ 2008 (UTC)

భౌతికవాదులు, కనబడే విషయాలను మాత్రమే నమ్ముతారు. పారదర్శక పదార్థాలైన నీరు, గాలి, గాజు, చక్కెర, ఉప్పు, కాంతి (ఇవి కనబడవు), కానీ వీటిని మాత్రం నమ్ముతారు. పరమేశ్వరుడు కనబడడు కాబట్టి వాణ్ణి నమ్మరు. ఇప్పటి వరకూ ఎవ్వరూ వీక్షించని ఎలక్ట్రాన్ ను మాత్రం నమ్ముతారు. ఎలక్ట్రాన్ ఉపయోగాలెక్కువగదా అందుకు నమ్ముతారు. పరమేశ్వరుణ్ణి గూడా సామాన్య ప్రజానీకం చూడలేదు, పరమేశ్వరుడు సర్వోపకారి, అయిననూ వీరు నమ్మరు. వీరికి Theism కు Atheism, Rationalism కు Irrationalism కు, Sufism కు Sophism తేడా తెలీదు. వీళ్ళంతా సోఫిస్టులు. ఇతరులకు నొప్పించడాని మాత్రమే తమ వాదనా శక్తిని ఉపయోగిస్తారు. ఈ నమ్మకస్తులు నమ్మి ఊరుకుంటే పరవాలేదు, హేతువాదం ముసుగులో వితండవాదం చేస్తూ మార్గభృష్టులై చివరకు ఓ రకమైన మానసిక ఆందోళనకు గురై (ఆధ్యాత్మికానందము, మోక్షము (మగ్‌ఫిరత్) వీళ్ళ నసీబులో లేదు) తమ (వికార) ఆలోచనా శైలితో సంతృప్తి చెంది, మతాలపై మరియు విశ్వాసాలపై రాళ్ళు రువ్వుతూ పైశాచికానందం పొందుతారు (పిచ్చోడి చేతిలో రాయి చందం). వీళ్ళంతా షైతాన్ కు పూర్తిగా లొంగిపోయినవారు. ఇలాంటి విషయాలు గల వ్యాసాలను ఒక వర్గం చేసి, వీటిలో పరిచయం, ఉపోధ్ఘాతం మరియు సార్వజనీయ విజ్ఞాన విషయాలు మాత్రమే ఉండేటట్లు చూడడం మనందరి బాధ్యత. మతపరమైన భావనలను రెచ్చగొట్టడం ఒక ఫిత్నా, ఇది అత్యంత హేయమయినది, ఇలాంటి ఫిత్నాలను 'మొగ్గలోనే త్రుంచివేయడం' అత్యుత్తమం. ఇలాంటి వాక్యాలను నిక్కచ్చిగా తొలగించండి. నిసార్ అహ్మద్ 05:58, 7 నవంబర్ 2008 (UTC)

సభ్యులు నిర్ణయం తీసుకొనేదాకా నేను తెవికీ నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నాను. తెవికీ నియమాలను పట్టించుకోని, తెవికీ సభ్యులపై గౌరవం లేని, అసలు తెవికీలో సభ్యత్వమే లేని ఒక వ్యక్తి, సభ్యులను కించపరిచే విధంగా మతవిశ్వాసాలకు విరుద్ధంగా వ్యాసాలు రచిస్తే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అభ్యంతరకర వాక్యాలు రాసినా, తాను రాసిందే వేదమని దాన్ని ఎవరూ తెరపరాదని అతడనుకుంటే మనమెందుకూ? నిర్వాహకులు, అధికారుల దిద్దుబాట్లు రద్దుచేస్తుంటే మనం ప్రేక్షకపాత్ర వహించాల్సిందేనా? అర్థం పర్థం లేని వ్యాసాలు సృష్టిస్తుంటే వదిలివేయాల్సిందేనా? సభ్యులను హేళనగా మాట్లాడుతుంటే మౌనంగా ఉండాల్సిందేనా? ఎదురుదాడికి దిగి మతవిశ్వాసాలకు అనుగుణంగా కుప్పలు తెప్పలుగా వ్యాసాలు రచిస్తే అప్పుడెలా ఉంటుంది. సభ్యులు తీసుకున్న నిర్ణయం అనంతరం నాభవిష్యత్తు కార్యక్రమం వెల్లడిస్తా. అంతవరకు సెలవు ..................-- C.Chandra Kanth Rao(చర్చ) 21:10, 7 నవంబర్ 2008 (UTC)
వ్యక్తిగతదాడిని తెవికీ ఎప్పుడూ సహించలేదు..ఇంతకు ముందు కూడా కఠినంగానే చర్యలు తీసుకున్నాం. ఏ ఏ ఐ.పీలనుండి ఇలాంటి చర్యలు జరుగుతున్నాయో తెలియజేస్తే వాటిని పరిశీలించి బహిష్కరిద్దాం. వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు చూడండి --వైజాసత్య 06:50, 10 నవంబర్ 2008 (UTC)
ఇప్పుడు బహిష్కరించి లాభం లేదు. వ్యాసాలు తొలిగించడానికి ఆలోచించడం అవసరం.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:16, 28 నవంబర్ 2008 (UTC)

కొన్ని కీలకమైన నిర్ణయాలుసవరించు

ఈ మధ్య వస్తున్న "వ్యాసాల" గురించి చంద్రకాంత్ గారి అభ్యంతరాలలో చాలా వాటితో నేను ఏకీభవిస్తాను. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ గమనించాలి అని అందరికీ మనివి చేస్తున్నాను.

  • పరిధి - తెలుగు వికీ పరిధి ఏమిటి? ఎలాంటి వ్యాసాలు ఉండవచ్చును? ఎలాంటి వ్యాసాలు ఉండకూడదు? ఉన్న వ్యాసాలు ఎలా వ్రాయకూడదు? en:Wikipedia:Notability ని తెలుగు వికీ పరిధిలో ఎలా అన్వయించాలి?
  • అంగీకారయోగ్యం - (Blatantly scandalous or opinionated or vulgar వ్యాసాలు నేరుగా తుడిచేయడానికి ఎవరూ వెనుకాడనక్కరలేదు. కాని మిగిలిన వాటికి) ఇలాంటి వ్యాసాలు అభ్యంతరకరమని కొద్దిమంది నిర్వాహకులు నిర్ణయించడం ఎంతవరకు సబబు? ప్రస్తుతం ఒక given period లో నలుగురైదుగురు కూడా నిర్వాహకులు active గా ఉండడంలేదు. వారి అభిప్రాయాలు ఇంత పెద్ద ప్రాజెక్టుపై రుద్దవచ్చునా? ఇంతకు ముందు చిన్న వ్యాసాలు తొలగించడానికి వచ్చిన ప్రతిపాదన చర్చలో కొందరు సభ్యులు చాలా దృఢంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ ఏకవచన వినియోగానికి కొందరు ససేమిరా అంటున్నారు. Minority view point ను ముదురుగా త్రొక్కిపారవేయడం సరవుతుందా?
  • అమలు చేయగలగడం - ఒకవేళ ఒకరి వ్రాతలు అభ్యంతరకరమని అనుకొన్నా గాని వారి ఐ.పి.ని నిషేధించినందువలన నిజంగా ప్రయోజనం ఉంటుందా? వేరే మార్గాలు ప్రయత్నించనక్కరలేదా? ఒక అనామకుడు కారుకూతలు కూస్తుంటే ఎంతవరకు ఆపగలం? ఇంటర్నెట్‌లో పనిచేసేవారికి ఇలాంటి సమస్యలు తెలియకపోవు.

తెలుగు వికీ లక్ష్యం లేకుండా చెల్లా చెదురౌతుందని చంద్రకాంత్ గారికి ఆందోళన కలిగింది. ఇది నిజంగా పెద్ద సమస్యే. కాని తొందర పడి సభ్యులను నిరోధించడం వలన లేదా వ్యాసాలు తుడిచేయడం వలన పరిష్కారం లభించదు. దయచేసి పునరాలోచించండి. అందరం కలిసి సముచితమైన మార్గాన్ని అన్వేషించుదాం. ప్రస్తుతానికి en:Wikipedia:Notability కి సమాంతరంగా వికీపీడియా:విషయ ప్రాముఖ్యత అనే విధానం ప్రతిపాదించి చర్చకు పెడతాను. సభ్యులు సహకరించమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:14, 9 నవంబర్ 2008 (UTC)

  • కాసుబాబు గారి సూచనలు సమంజసంగాఉన్నాయి..రామాయణ విషవృక్షం లాంటి పుస్తకాలను మనం నిషేధించలేదు.సల్మాన్ రష్దీ '"సాటనిక్ వర్సెస్" పుస్తకంరాస్తే వ్యతిరేకించిన ముల్లాలు అతని తలకు వెల కట్టారు.ఫత్వా జారీచేశారు.ఈ దేశంలో కూడా ఆ పుస్తకాన్ని నిషేధించేదాకాఊరుకోలేదు.అప్పట్లో వాజ్ పాయ్ "పుస్తకాలను నిషేధించటం పరిష్కారం కాదు.అంతకంటే పెద్ద పెద్ద పుస్తకాలతో జవాబివ్వాలి" అన్నాడు..జ్ఞానం అన్నిదిక్కులనుండీ రానివ్వండి.. మంచి చెడ్డలు రెండే మతములు కాబట్టి మంచిని ఉంచి చెడును వడపోయండి.చంద్రకాంత్ చెప్పినట్లు ఇంకా ఎక్కువ జ్ఞానంతో ఋజువులతో మతసమర్దన చేసుకోవటం మంచిది. --Nrahamthulla 18:03, 9 నవంబర్ 2008 (UTC)
నోటబిలిటి ఒక స్థిరమైన గిరిగీసిన ప్రాంతం కాదు. తెవికీ పెరిగే కొద్ది నోటబిలిటీ నియమాలు కూడా మారుతుంటాయి. 40వేల వ్యాసాలప్పుడు నోటబిలిటీకి నోచుకోని వ్యాసాలు, 4 లక్షలకు చేరినప్పుడు తెవికీలో స్థానం సంపాదించుకోవచ్చును. అయినా కాసుబాబు గారన్నట్టు కొన్ని మార్గదర్శకాలు తప్పకుండా ఉండాలి. ఒకరిద్దరు నిర్వాహకులు తెవికీపై ఇప్పుడు బలమైన ప్రభావం చూపినా మూలసూత్రాలకి కట్టుబడినంతవరకూ, దీర్ఘకాలంలో ఒక సమతుల్యానికి చేరుకుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అందువల్ల తాత్కాళికంగా కొంత గతితప్పిందని అనిపించినా ఆందోళన చెందవద్దు. సమీక్షించి కొంత దిశాసవరణ చేద్దాం. అనానిమషులతో ఓపిక వహించటం ముఖ్యం (మాటలబాబును గుర్తుచేసుకోండి). అంతమాత్రం చేత ఆ వ్రాతలపై తగిన చర్యలు తీసుకోవద్దని కాదు. మైనారిటీ అభిప్రాయలకు కూడా కొంతమైన మద్దతుంటేనే వాటిని వికీలో చేర్చయోగ్యమైన అభిప్రాయాలుగా స్వీకరిస్తారు. ఒక సభ్యుని యొక్క సొంత అభిప్రాయాలను మైనారిటీ అభిప్రాయంగా అందలమెక్కించలేము. వ్యాసాలను నిషేధించడం వికీనైజం కాదు. --వైజాసత్య 16:09, 10 నవంబర్ 2008 (UTC)

తెవికీ గతి తప్పుతున్నదా?సవరించు

గత కొద్ది రోజులుగా తెవికీలో చోటు చేసుకుంటున్న మార్పులను చూస్తుంటే తెవికీ గతి తప్పుతున్నదా లేక నేను భ్రమ పడుతున్నానా అనిపిస్తున్నది. నాకు తెలిసిన తెవికీలో చంద్రకాంత రావు గారు ఏది చేసినా కరక్టే. బలమయిన కారణం లేనిదే ఏదీ చేయరు. (నేను గమనించినవాటిని పరిగణనలోకి తీసుకొని చెబుతున్న నా వ్యక్తిగత అభిప్రాయం). చంద్రకాంత రావు గారు ఒక వ్యాసం తొలగించాలనో లేక మార్పులు చేయాలనో ప్రతిపాదిస్తే దానికి ఒక ఖచ్చితమయిన కారణం ఉండి ఉంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి అసలు విషయాన్ని పరిశీలిద్దాము:

ఈ మధ్య కొన్ని 'వివాదాస్పద ' వ్యాసాలు తయారవుతున్నాయి. నా దృష్టిలో వివాదాస్పదం కావచ్చు కానీ కొందరి దృష్టిలో కాకపోవచ్చేమో!! కానీ ఆ వ్యాసాలు/వాక్యాలు తెవికీలో ఉండకూడదు అనిపిస్తున్నది. అందరు సభ్యులు ఒక సమిష్టి కుటుంబంగా ఎంతో శ్రమించి తెవికీలో వ్యాసాలు రాస్తున్నారు. కానీ ఈ వివాదాస్పద వ్యాసాల వల్ల ఆ సభ్యులు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకు నేను కూడా ఒక ఉదాహరణ. నేను వ్యాసాలు రాయకపోయినా తెవికీలో ఏమీ మార్పులు సంభవించవు కానీ, మున్ముందు మిగతావారు కూడా అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తద్వారా తెవికీ మనుగడకే ముప్పు సంభవించినా ఆశ్చర్యపోనక్కర లేదు. కాబట్టి ఇలాంటివి ఆదిలోనే తుంచివేయడం చాలా సమంజసం. నిర్వాహకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి చింతిస్తున్నాను. --Svrangarao 16:30, 10 నవంబర్ 2008 (UTC)

రంగారావు గారు, మీరు చెప్పినట్లు తోటి నిర్వాహకులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారనేదానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇలా చేయడం వల్ల చురుకైన సభ్యులు అసంతృప్తి చెందడం ఖచ్చితంగా జరిగుతుంది. కొత్త సభ్యుల, అనామకుల చెత్త వ్యాసాలకే ప్రాధాన్యత ఇస్తే తెవికీ లక్ష్యం సాధించలేదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:13, 28 నవంబర్ 2008 (UTC)

వికీపీడియాలో కనీసం వుండవలసిన వ్యాసాల జాబితాసవరించు

వికీపీడియాలో కనీసం వుండవలసిన వ్యాసాల జాబితా, కాసుబాబు గారు తయారు చేశారు, దాని పేరు, మరియు లింకు తెలుపగలరా నిసార్ అహ్మద్ 15:39, 11 నవంబర్ 2008 (UTC)

నేను తయారు చేయలేదు. మీరు వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు గురించి అడుగుతున్నారు అనుకొంటాను. అవి అన్ని వికీపీడియాలకూ కలిపి వికీమీడియాల వారు చేసిన జాబితా. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:32, 11 నవంబర్ 2008 (UTC)

అవునండీ, ఇదే, చాలా థ్యాంక్స్ నిసార్ అహ్మద్ 16:48, 11 నవంబర్ 2008 (UTC)

నిజం-చర్చాపేజీసవరించు

నిజం అనే వ్యాసపు చర్చాపేజీలో 'నిజం (సినిమా)' చర్చాపేజి వున్నది, సభ్యులు సరిదిద్దగలరు నిసార్ అహ్మద్ 18:56, 22 నవంబర్ 2008 (UTC)