వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/స్త్రీవాదము - జానపదము 2024

ప్రాజెక్టు నిర్వహణ వనరులు

మార్చు

 

ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయంగా గెలిచినా వారికి బహుమతులు ఉన్నాయి, కానీ మన తెలుగు వికీపీడియాలో గెలిచిన వారికీ నేను నా స్వంత ఖర్చులతో అనగా రూ. 3000/- తో బహుమతులు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకా ఎవరైనా సహాయం చేయగలరా... Tmamatha (చర్చ) 12:57, 2 ఫిబ్రవరి 2024 (UTC)Reply

నేను నా స్వంత ఖర్చులతో అనగా రూ. 5000/- బహుమతుల మొత్తంలో చేరుస్తాను అయితే ఇందులో తెలుగు వికీపీడియాన్ లు పాల్గొన్న 2000/- ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ పోటీకి కేటాయించగలరు. --Kasyap (చర్చ) 15:23, 2 ఫిబ్రవరి 2024 (UTC)Reply

నేను కూడా నా స్వంత ఖర్చుతో అనగా రూ. 5000/- బహుమతుల మొత్తంలో చేరుస్తాను, దీనిని ప్రాజెక్టు బహుమతులు. ఇతర వాటికి కేటాయిద్దాం. అలాగే ఇంకో విషయం, ప్రాజెక్టు నిర్వహణకు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్న క్యాంప్ విజ్ టూల్ చేర్చాను, ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 15:29, 2 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ప్రాజెక్టుకి సూచనలు

మార్చు

నమస్కారం User:Tmamatha గారు,

ప్రాజెక్టు పేజీని రూపొందించి పనులు ప్రారంభించినందుకు ధన్యవాదాలు, ఈ ప్రాజెక్టు చేపడుతున్నందుకు అభినందనలు.

అయితే ప్రాజెక్టు నిర్వహణకి సంబంధించి నా నుండి కొన్ని ముఖ్యమైన సూచనలు:

  1. ప్రాజెక్టు పేజీలో ప్రతి విషయాన్నీ కూలంకషంగా చదవండి, ప్రాజెక్టు అంశాలలో ఉన్న ప్రతి విషయంపై అవగాహన పెంపొందించుకోండి.
  2. ప్రాజెక్టుకి సంబందించి వ్యాసాలు నిర్మించాల్సిన పేజీల లిస్టు ఒకటి సేకరిస్తే తద్వారా పాల్గొనేవారు వ్యాసాలు నిర్మించడంలో అది ఉపయోగపడుతుంది.
  3. ప్రాజెక్టు గురించి చర్చా పేజీల ద్వారా, తెలుగు వికీ మొదటి పేజీ బ్యానర్ ద్వారా, తెలుగు వికీ సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలిసేలా సమాచారం అందించండి.
  4. ప్రాజెక్టుకి సంబంధించి మూసలు నిర్మించడం, అలాగే క్యాంప్విజ్ లేదా ఫౌంటెన్ టూల్ ఉపయోగం గురించి పాల్గొనేవారికి శిక్షణ అందించాలి.
  5. ప్రాజెక్టులో కొత్తగా రాయాలి అనుకునే వారికి వికీలో వ్యాసాలు రాయటంపై శిక్షణ అందిస్తే బాగుంటుంది.
  6. ప్రాజెక్టులో పాల్గొనే వారికి డిజిటల్ సర్టిఫికెట్లు ఇవ్వగలిగితే మంచిది అని నా అభిప్రాయం.


పై విషయాలు అన్ని పోను, ప్రాజెక్టు నిర్వహణ కాలంలో ప్రతి రోజు వికీలో ప్రాజెక్టు ప్రగతిని గమనిస్తూ, ప్రాజెక్టు చర్చా పేజీని తరచుగా పరిశీలిస్తూ ఉండటం చాలా అవసరం. నాకు తోచిన మట్టుకు చెప్పాను, ఇంకా ఇతర సభ్యుల సూచనలు గ్రహిస్తూ ముందుకు వెళ్ళండి. అల్ ది బెస్ట్. నేతి సాయి కిరణ్ (చర్చ) 15:41, 2 ఫిబ్రవరి 2024 (UTC)Reply

నమస్కారం నేతి సాయి కిరణ్ గారు, మీ అమూల్యమైన సూచనలు, సలహాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రాజెక్టు పేజీ చదివి అందులోని విషయాలు సంగ్రహించి ప్రాజెక్టు పేజీ తయారుచేయడం జరిగినది. ఆ ప్రాజెక్టు పేజీలో నాకు తెలిసిన వ్యాసాల జాబితా చేర్చడం జరిగింది.
తెలుగు వికీ బ్యానర్ ని ప్రణయ్‌రాజ్ వంగరి గారిని అడగడం జరిగినది. అలాగే ఈ రోజు రాత్రి 12పిఎం లోపు అందరికి చర్చా పేజీల్లో సందేశం పంపిస్తాను. వాడుకరులకు క్యాంప్విజ్ లేదా ఫౌంటెన్ టూల్ గురుంచి శిక్షణ ఇద్దాం అనుకుంటున్నాను. డిజిటల్ సర్టిఫికెట్లతో పాటు పది వ్యాసాల కంటే ఎక్కువ రాసినవారికి ఈ ప్రాజెక్టు తరుపున ఒక స్టార్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను.
ఇంకా ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో ఎవరైనా తెలుపగలరు. Tmamatha (చర్చ) 14:10, 3 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ప్రాజెక్టు గడువు

మార్చు

Tmamatha గారూ, స్త్రీవాదము - జానపదము 2024 వికీప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మీకు ధన్యవాదాలు. గత సంవత్సరం ఈ పోటీని ఏప్రిల్ 15 వరకు పొడగించారు. మరి ఈ సంవత్సరం కూడా గడువు పొడగించారా? లేక ముగిసిందా..? తెలుపగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:51, 2 ఏప్రిల్ 2024 (UTC)Reply

నమస్కారం ప్రణయ్‌రాజ్ వంగరి గారు. స్త్రీవాదము - జానపదము 2024 వికీప్రాజెక్టు మార్చి 31వ తేదీన ముగిసింది. 1742 వ్యాసాలతో తెలుగు వికీపీడియా మొదటి స్థానంలో ఉంది. వ్యాసాల మూల్యాకనం జరుగుతున్నది, 10 రోజుల్లో విజేతలను ప్రకటిస్తాను. Tmamatha (చర్చ) 03:44, 3 ఏప్రిల్ 2024 (UTC)Reply
ధన్యవాదాలు @Tmamatha గారు. పోటీ ముగిసింది కాబట్టి పోటీకి సంబంధించిన సైట్ నోటీస్ ను తీసేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:06, 3 ఏప్రిల్ 2024 (UTC)Reply
అలాగేనండి. ధన్యవాదాలు Tmamatha (చర్చ) 05:15, 3 ఏప్రిల్ 2024 (UTC)Reply

ఫలితాలు?

మార్చు

@ Tmamatha గారూ నమస్కారం.. స్త్రీవాదము - జానపదము 2024 వికీప్రాజెక్టు విజయవంతంగా ముగిసి తెలుగు వికీపీడియా మొదటి స్థానంలో ఉండటం హర్షణీయం. కొత్తవాడుకరిగా నేనూ ఈ ప్రాజెక్టులో పాల్గొని నావంతు ఉడతా సాహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ఫలితాలు వెలువడలేదు. ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టవచ్చో తెలియజేయగలరు.--Muktheshwri 27 (చర్చ) 14:40, 17 ఏప్రిల్ 2024 (UTC)Reply

Muktheshwri 27 నమస్కారం అండి, ఫలితాలు జూన్ 10 లోపు ప్రకటించే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాము. నేతి సాయి కిరణ్ (చర్చ) 12:20, 5 జూన్ 2024 (UTC)Reply

మూల్యాంకనం

మార్చు

@ నేతి సాయి కిరణ్ గారు, స్త్రీవాదం-జానపదము ప్రాజెక్టు మూల్యాకనం గురుంచి మీడియా వికీ వాళ్లు సందేశం పెట్టారు. మూల్యాంకనం చివరి రోజు జూన్ 7th అండి. ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి మీకు వీలవుతుందా, మూల్యాంకనం చేయడానికి సమయం సరిపోతుందా?

  • నాకో ఒక సందేహం అండి స్త్రీవాదం-జానపదము ప్రాజెక్టు లో స్త్రీవాదానికి సంబంధించి వేరే ఇతర స్త్రీల వ్యాసాల కూడా ఉన్నాయి. అవి మీరు పరిగణలోకి తీసుకుంటారా?

నమస్కారం మమతా గారు,

నేను ప్రయత్నిస్తాను అండి జూన్ 7 లోపు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను.

  1. అయితే స్త్రీవాదం అంటే మహిళల గురించి అనే ఉద్దేశంతో చాల మంది జానపదానికి సంబంధం లేని వ్యాసాలు కూడా రాసారు. కానీ, వ్యాసాలు మహిళల గురించే రాశారు కాబట్టి వాటిని అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించాను.
  2. వ్యాస నిడివి 300 పదాలు ఉన్న కూడా వాటిని పరిగణించాలి అని నిర్ణయిచాను, ఎందుకంటె చాల ఆంగ్ల వ్యాసాల్లో అన్నన్నీ పదాలు లేకుండా ఉన్న చిన్న వ్యాసాలు ఉన్నాయి కాబట్టి వాటిని తెలుగులో పెద్దగా రాయటం కూడా కష్టమే కాబట్టి.
  3. ప్రధానంగా వ్యాస నిడివి, పరిమితులు ముఖ్య పరిగణాలుగా తీసుకుంటున్నాను, తద్వారా మనకున్న ఈ 1700 పైగా వ్యాసాల సమీక్ష చేయడం సులభం అవుతుంది. ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 12:19, 5 జూన్ 2024 (UTC)Reply
ఇది కదా వికీ కిరణం అంటే..! Muralikrishna m (చర్చ) 13:57, 5 జూన్ 2024 (UTC)Reply
ఈ ప్రాజెక్టులో పాల్గొన్న అందరికీ అభినందనలు. వందలాదిగా సృష్టించిన వ్యాసాల్లో కొన్నిటిని నేను గమనించాను. వాటిలో కింది లోపాలు కనిపించాయి:
  • వ్యాకరణదోషాలతో కూడుకుని ఉన్న భాష
  • అనువాదాల్లో దోషాలు - మూలంలో ఉన్న అర్థాన్ని కాకుండా వేరే అర్థాన్నో, వ్యతిరేకార్థాన్నో చూపించే భాష.
@Nskjnv గారూ, ఉధృతంగా జరిగే ప్రాజెక్టులలో లోపాలు మామూలు కంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది, ఒప్పుకుంటాను. కానీ, అదే సమయంలో వ్యాకరణ దోషాలు, అనువాద దోషాలూ ఉండే వ్యాసాలు అభిలషణీయం కాదు. మరీ ముఖ్యంగా, బహుమతులు ఉన్న పోటీలలో ఇలాంటివి పోటీ ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అనేక తప్పులతో 100 వ్యాసాలు రాసినవారికి, దోషరహితంగా 50 వ్యాసాలు రాసినవారి కంటే మెరుగైన బహుమతి రావడం వాంఛనీయం కాదు. పైగా తప్పులు సరిచెయ్యడానికి ఆయా వ్యాసాలపై మళ్ళీ మరింత కృషి, మరింత సమయం అవసరమౌతాయి. అంచేత, అంకెలను మాత్రమే కాకుండా, వ్యాకరణం వంటి ముఖ్యమైన నాణ్యతాంశాలను కూడా పరిగణిస్తే భవిష్యత్తు పోటీలకు, బహుమతులకూ సార్థకత ఏర్పడుతుందని నా అభిప్రాయం.__ చదువరి (చర్చరచనలు) 10:32, 13 జూన్ 2024 (UTC)Reply
@Chaduvari గారు నమస్కారం, ఈ పోటీలో చాలా మట్టుకు అనువాద వ్యాసాలు ఎక్కువ. మీరు అన్నట్లు వ్యాకరణ దోషాలు ఉండడం సహజమే, వాటిని సరి చేయడానికి మనం మరో మార్గం చూడాల్సిందే. ఇప్పటికే ప్రాజెక్టు బహుమతులు ఇవ్వడంలో ఆలస్యం అయింది.
మరి ముఖ్యంగా ప్రాజెక్టులో ఎక్కడ కూడా మనం వ్యాకరణ పరమైన షరతులు పెట్టలేదు కాబట్టి ప్రాజెక్టులో ముందుగా అనుకున్న విధంగా వ్యాసాల సంఖ్య, నిడివి మాత్రమే బహుమతుల కోసం పరిగణిస్తున్నము.
దాదాపుగా వ్యాసాల మూల్యాంకనం కూడా పూర్తయిపోయింది..వచ్చే ప్రాజెక్టుల్లో మీ సూచనలను చేరుస్తూ తగు విధంగా రూపొందిస్తాము.
ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 02:04, 17 జూన్ 2024 (UTC)Reply

స్త్రీ వాదము - జానపదం ప్రాజెక్టు ఫలితాలు

మార్చు

మహిళా సాధికారతను సాధిస్తూ జానపద విజ్ఞానాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో “ఫెమినిజం అండ్ ఫోక్లోర్” అన్న పేరుతో ఒక ప్రాజెక్టు జరిగింది. అదే విధంగా తెవికీలో “స్త్రీ వాదం - జానపదం” అనే పేరుతో 2024 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 వరకు ప్రాజెక్టు నిర్వహించుకొని స్త్రీల సాధికారతకు మనవంతు సహకారం చేశాము.

ఈ ప్రాజెక్టును 2015 లో మొదటిసారి రాజశేఖర్ గారు తెవికీలో నిర్వహించారు ( https://w.wiki/8c7K ) ఈ పేజీ ప్రకారం ఆ తరువాత 2024లో మళ్ళీ ఈ ప్రాజెక్టుని మమత గారు నిర్వహించడం విశేషం….

2024 సంవత్సరంలో ప్రపంవ్యాప్తంగా 43 భాషా సముదాయాలు పాల్గొంటే వాటిల్లో తెలుగు వికీపీడియా 1742 వ్యాసాలు పొందుపరిచి మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధిక వ్యాసాలు పొందుపరిచి తెలుగు వికీపీడియా మొదటి స్థానంలో నిలవడం ఇదే మొదటి సారి కూడాను.... ఈ ప్రాజెక్టు తెలుగు వికీ చరిత్రలో అంతర్జాతీయ కీర్తిని జోడిస్తూ, మరో మెయిలు రాయిని చేర్చింది అని తెలియజేయటానికి గర్వపడుతున్నాను.

ఈ పోటీలో చురుకుగా పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచి స్థానిక బహుమతులు అందుకోవడానికి ఎంపికైన వికీపీడియన్ల వివరాలు క్రింద ప్రకటించడం జరిగింది.

మొదటి బహుమతి: దివ్య గారు (801 వ్యాసాలతో స్థానిక వికీపీడియాలో మొదటి స్థానం, అంతర్జాతీయ స్థాయిలో మూడోస్థానం.) రెండవ బహుమతి: ప్రవళికగారు (515 వ్యాసాలతో స్థానిక వికీపీడియాలో రెండో స్థానం, అంతర్జాతీయ స్థాయిలో ఐదో స్థానం) మూడవ బహుమతి: ముక్తేశ్వరి గారు. (ఒక కొత్త వికీపీడియన్ గా 167 వ్యాసాలతో స్థానిక వికీపీడియాలో మూడో స్థానం)

అంతే కాకుండా ఈ పోటీలో దివ్య గారు ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచారు , అలాగే ప్రవళిక గారు ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచారు.

బహుమతులు గెలుచుకున్న ఈ ముగ్గురు వాడుకరులు మహిళలే అయి ఉండటం ఒక విశేషం అయితే అందులో ఒకరు కొత్త వికీపీడియన్ కావడం మరో విశేషం. ప్రాజెక్టు పేరుకు తగ్గట్టుగా మహిళా సాధికారతను నిలబెట్టుకోవడం తెవికీకి గర్వకారణం. విజేతలకు అభినందనలు.

అదే విధంగా పోటీలో చురుగ్గా పాల్గొన్నవాడుకరి:Muralikrishna m, వాడుకరి:Palagiri, వాడుకరి:v Bhavya, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:KINNERA ARAVIND, వాడుకరి:Edla praveen, వాడుకరి:స్వరలాసిక, వాడుకరి:Thirumalgoud, వాడుకరి:Vjsuseela, వాడుకరి:Tmamatha, వాడుకరి:Kasyap, వాడుకరి:Batthini Vinay Kumar Goud, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:RATHOD SRAVAN, వాడుకరి:MYADAM ABHILASH, వాడుకరి:Meena gayathri.s వాడుకరులు అందరికి అభినందనలు, శుభాకాంక్షలు.

ఇట్లు


మీ నేతి సాయి కిరణ్ (చర్చ) 04:22, 2 నవంబరు 2024 (UTC)Reply

ప్రాజెక్టు నిర్వహించిన వారికి, విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:19, 2 నవంబరు 2024 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/స్త్రీవాదము - జానపదము 2024".