విజయవాడ-గూడూరు రైలు మార్గము

విజయవాడ-గూడూరు రైలు మార్గము భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను, గూడూరు లను అనుసంధానించే రైలు మార్గము. ప్రధాన రైలు మార్గములయిన హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము లోని భాగం ఈ మార్గము.[1][2]

విజయవాడ-గూడూరు రైలు మార్గము
విజయవాడ-గూడూరు రైలు మార్గములో విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఒక ముఖ్యమైన రైలు
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
తమిళనాడు
చివరిస్థానంగూడూరు
చెన్నై సెంట్రల్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1899
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు455 కి.మీ. (283 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
ఆపరేటింగ్ వేగం160 km/h (99 mph) వరకు
మార్గ పటం

భౌగోళికం

మార్చు

తూర్పు కనుమలు, బంగాళాఖాతం మధ్య ఉన్న కోరమాండల్ తీరం వెంట విజయవాడ-గూడూరు రైలు మార్గము నడుస్తుంది. విజయవాడ నుండి బయలుదేరిన వెంటనే ప్రధాన రైలు మార్గము కృష్ణానదిని దాటుతుంది.[3][4]

అధికార పరిధి

మార్చు

విజయవాడ-గూడూరు రైలు మార్గము దక్షిణ మధ్య రైల్వే యొక్క పరిపాలనా అధికార పరిధిలో గూడూరు ఉంది.[5]

చరిత్ర

మార్చు

1890 సం.లో దక్షిణ మరాఠా రైల్వే కంపెనీ గోవాతో గుంతకల్లును ఒక మీటర్ గేజ్ మార్గము (లైన్) తో పాటుగా, విజయవాడతో మార్మగోవాను అనుసంధానం చేసింది.[6] 1893 నుండి 1896 సం.ల మధ్యకాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము నందు, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[7][8] 1899 లో విజయవాడ-గూడూరు రైలు మార్గము లింకు నిర్మాణం భారతదేశ తూర్పు తీరంలో రైళ్ల నడపటం ద్వారా ప్రారంభించబడింది.[6] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు స్వాధీనం చేసుకున్నారు.[9]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

మార్చు

1950 సం.ప్రారంభంలో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదించడం జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే లను దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో దక్షిణ రైల్వే లోని గుంతకల్లు రైల్వే డివిజను దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ రైల్వే డివిజను మధ్య రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ అనేదాన్ని దక్షిణ రైల్వే నుండి వేరుచేసి ఆగ్నేయ రైల్వే/ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) గా ఏర్పాటు చేశారు.[10]

విద్యుధ్ధీకరణ

మార్చు

హౌరా-చెన్నై మెయిల్ దక్షిణ తూర్పు రైల్వే లో 1965 సం.లో ఒక డీజిల్ ఇంజిన్ (డబ్ల్యుడిఎం-1) చే నడపబడిన మొదటి రైలుగా ఉంది. [11] విజయవాడ-చెన్నై విభాగం 1980 సం.లో పూర్తిగా విద్యుద్దీకరణ జరిగింది.[12] ఈ క్రింది విభాగాల విద్యుదీకరణ పని పూర్తి చేయడం ఈవిధంగా ఉంది:

  • 1979-80; విజయవాడ-చీరాల
  • 1980-81; చీరాల-ఒంగోలు, ఒంగోలు-ఉలవపాడు, ఉలవపాడు-బిట్రగుంట, బిట్రగుంట-పడుగుపాడు, పడుగుపాడు-గూడూరు
  • 1983-85; గూడూరు-వేంకటగిరి, వేంకటగిరి-రేణిగుంట, రేణిగుంట-తిరుపతి
  • 1982-85; ఆర్కోణం-రేణిగుంట
  • 1987-89; కృష్ణ కెనాల్-గుంటూరు, గుంటూరు-తెనాలి [13]

వేగ పరిమితులు

మార్చు

చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ వరకు ఉన్న రైలు మార్గము (గ్రాండ్ ట్రంక్ మార్గం), 160 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును. విజయవాడ-గూడూరు రైలు మార్గము ప్రధాన రైలు మార్గములో భాగం కనుక, ఇది కూడా ఒక "గ్రూప్ ఏ" మార్గముగా వర్గీకరించారు.[14] ఇతర బ్రాంచి మార్గములలో 100 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును.[15]

ప్రయాణీకులు ప్రయాణాలు

మార్చు

ఢిల్లీ-చెన్నై రైలు మార్గములో, న్యూ ఢిల్లీ, మథుర, ఆగ్రా కంటోన్మెంట్., గౌలియార్, ఝాన్సీ, భూపాల్, భూపాల్ హబీబ్‌గంజ్, నాగ్‌పూర్, విజయవాడ, నెల్లూరు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లు భారతీయ రైల్వేలలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషన్లలో ఇవి ఉన్నాయి.[16]

విజయవాడ-గూడూరు ప్రధాన రైలు మార్గములో చెన్నై సెంట్రల్, విజయవాడ జంక్షన్, నెల్లూరు , బ్రాంచి రైలు మార్గములో తిరుపతి, కాట్పాడి జంక్షన్లు భారతీయ రైల్వేలలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషన్లలో ఇవి ఒకటిగా ఉన్నాయి.[17]

మూలాలు

మార్చు
  1. "3rd rail line joining Duvvada, Gudur to be completed in 5 yrs". The Business Standard. Vijayawada. 3 November 2015. Retrieved 26 March 2016.
  2. "Goods train derailment: SCR cancels several trains". The Hindu. Vijayawada. 25 April 2014. Retrieved 26 March 2016.
  3. "Coastal Plains of India". Country facts – the world at your finger tips. Archived from the original on 2013-05-30. Retrieved 2013-01-17.
  4. "The Coastal Plains of India". Zahie.com. Archived from the original on 2019-09-18. Retrieved 2013-01-17.
  5. "Vijayawada Gudur Jan Shatabdi". India Rail Info. Retrieved 2013-02-10.
  6. 6.0 6.1 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-01-19.
  7. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-04.
  8. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
  9. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  10. "Geography – Railway Zones". IRFCA. Retrieved 2013-01-23.
  11. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
  12. "IR History Part VII (2000-present)". IRFCA. Retrieved 17 March 2014.
  13. "History of Electrification". IRFCA. Retrieved 2012-11-10.
  14. "Chapter II – The Maintenance of Permanent Way". Retrieved 17 March 2014.
  15. "Chapter II – The Maintenance of Permanent Way". Retrieved 2013-01-02.
  16. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 మే 2014. Retrieved 17 March 2014.
  17. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 2014-05-10. Retrieved 2018-06-04.

బయటి లింకులు

మార్చు