శ్రీకాకుళం (ఘంటసాల)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం లోని గ్రామం
(శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) నుండి దారిమార్పు చెందింది)

శ్రీకాకుళం (ఆంగ్లం: Srikakulam), కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 132., ఎస్.టి.డి.కోడ్ = 08671.

శ్రీకాకుళం (ఘంటసాల)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి తిరుమలశెట్టి భవాని
జనాభా (2011)
 - మొత్తం 7,153
 - పురుషులు 3,647
 - స్త్రీలు 3,506
 - గృహాల సంఖ్య 2,207
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్ 08671
కృష్ణా జిల్లా

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

ఘంటసాల మండలంసవరించు

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

ఈ గ్రామం ఒకప్పుడు శాతవాహనులకు రాజధానిగా ఉండేది. క్రీ.శ. 2వ శతాబ్దంలో శ్రీకాకుళం మహానగరంగా అభివర్ణించారు.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

శ్రీకాకుళం గ్రామం 16°12′00″N 80°51′00″E / 16.2000°N 80.8500°E / 16.2000; 80.8500.[3] వద్ద ఉంది. ఇది 9 metres (32 ft) సగటున ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీప ంలో తెలుగురావుపాలెం, చోరగుడి, పెనుమత్చ, కొడాలి గ్రామాలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొడాలి, కొల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 45 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీకాకుళం

గామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

బ్యాంకులుసవరించు

ఆంధ్రా బ్యాంక్.

విద్యుత్తు సౌకర్యంసవరించు

ఈ గ్రామంలో 2014,నవంబరు-3న 33/11కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం వలన, ఈ గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలయిన పాపవినాశనం, గోగినేనిపాలెం, తెలుగురావుపాలెం, అచ్చంపాలెం, సూరపనేనివారిపాలెం, వీరమాచనేనివారిపాలెం మొదలగు గ్రామాలలోలో వోల్టేజ్ సమస్య తీరిపోతుంది. [8]

సహకారసంఘంసవరించు

ఈ గ్రామంలో సహకారసంఘం నిధులు 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని, 2015,జూన్-4న ప్రారంభించారు. [14]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

 1. శీలంవారి పాలెం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
 2. శ్రీకాకుళం గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో, శ్రీమతి తిరుమలశెట్టి భవాని సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

దివిసీమకు చెందిన ఈ కృష్ణా నది తీర గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర మహా విష్ణువు మందిరం, శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామి మందిరం (శివాలయం) ఉన్నాయి. ఇంకా రామాలయం, హనుమాన్ మందిరం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం, వినాయకుని గుడి ఉన్నాయి.

శ్రీ రాజ్యలక్ష్మీ భోగ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయంసవరించు

 1. శ్రీకాకుళం గ్రామంలో వెలసిన ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖమాసం (మే నెల) లో శుక్ల త్రయోదశి నుండి బహుళ విదియ వరకు ఐదు రోజులపాటు, అత్యంత వైభవంగా నిర్వహించెదరు. [5]
 2. ఈ ఆలయానికి అయినంపూడి గ్రామంలో 16.44 ఎకరాలు, శ్రీకాకుళం గ్రామంలో 9.25 ఎకరాలు, తెలుగురావుపాలెంలో 16.73 ఎకరాలు, పాపవినాశనం గ్రామంలో 11.45 ఎకరాలు, గోగినేనిపాలెంలో 15.41 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇదిగాక, తెలుగురావుపాలెంలో 8.82 ఎకరాల చేపలచెరువు ఉంది. వీటిని 3 సంవత్సరాలకొకసారి బహిరంగ వేలంద్వారా కౌలుకు ఇచ్చి, వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం ఖాతాలో జమచేయుదురు. [13]
 3. ఈ స్వామివారిని కీర్తించుచూ నాటి ప్రముఖ రచయిత శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయకశతకం లోని 108 పద్యాలను, ఆలయప్రాంగణంలో రాతి శాసనాలరూపంలో భద్రపరచారు. ఈ పద్యాలను వారి వారసులు శ్రీ కాసుల కృష్ణంరాజు, రాజశ్రీధర్ లు, ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు గాయకులు శ్రీ శ్రీకృష్ణచే ఆలపింపజేసి, సీ.డీ.రూపంలో నిక్షిప్తం చేసారు. ఈ సీ.డీ.లను 2016,ఫిబ్రవరి-4వ తేదీనాడు ఆలయంలో ఆవిష్కరించారు. [16]
 4. ఈ ఆలయం ప్రాంగణంలో, శ్రీ కాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని, 2016,ఫిబ్రవరి-11వ తేదీనాడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని శ్రీ కాసుల పురుషోత్తమ కవి వంశీకులైన శ్రీ జాడల్రిజా సాగర్ రాజు, శ్రీ కాసుల కృష్ణంరాజు, శ్రీ కాసుల శ్రీధరరాజు ఏర్పాటు చేసారు. [17]
 5. ఈ ఆలయ ప్రాంగణంలో 2016,ఫిబ్రవరి-11, గురువారం రాత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ, భాషా సాంస్కృతికశాఖ, దివి ఐతిహాసిక పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ కృష్ణదేవరాయల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. [18]

శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, స్వామివారి 54వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2014,మే-25,26,27 లలో ఘనంగా నిర్వహించారు. 26న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 27న స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. [6]

శ్రీ ప్రసన్నమల్లికార్జునస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, 30-జూన్,2014, సోమవారం నాడు, వర్షం కోసం ప్రత్యేకపూజలు నిర్వహించారు. కృష్ణానదీ జలాలు, 11 నీటిముంతలతో శివునికి రుద్రాభిషేకపూజలు, జలాభిషేకపూజలు నిర్వహించారు. [7]

శ్రీ రామాలయంసవరించు

శ్రీకాకుళం గ్రామంలో, దేవాదాయశాఖ నిధులు రు. 3 లక్షలు మరియూ గ్రామస్థుల విరాళాలు రు. 15 లక్షలతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే నెల-8వ తేదీ శుక్రవారం నుండి మూడురోజులపాటు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 9వ తేదీ శనివారంనాడు, తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆధ్వర్యంలో 108 కలశాలతో, హోమగుండాల వద్ద, విశిష్టపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర కృష్ణానదీ తీరాన, వేదపండితుల ఆధ్వర్యంలో జలాధివాసం పూజలు నిర్వహించారు. 10వ తేదీ ఆదివారం ఉదయం 9-31 గంటలకు శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. [10],[11] & [12]

 
శ్రీకాకుళాంధ్ర దేవాలయం
 • లభించిన సమాచారం ప్రకారం ఇక్కడ విష్ణు అనే వీరుడు తన తెగ లేదా ప్రాంతాన్ని కాపాడి ప్రజాభిమానం చూరగొన్నాడు. అతను విష్ణువు అంశ కలిగి ఉన్నాడని భావించి జనులు అతనికి మందిరం నిర్మించి ఉండవచ్చును.[4].
 • ఆలయంలో ప్రధాన మందిరం శాతవాహనుల కాలంనుండి నిలిచిఉన్నదనిపిస్తుంది. (క్రీ.పూ. 2వ లేదా 3వ శతాబ్దము). అలాగయితే ఇది దేశంలో అతి పురాతనమైన ఆలయాలలో ఒకటి. 'విష్ణు' అనే నాయకుడు శాతవాహనులకు ముందుకాలం వాడయ్యుండాలి. దీనికి కరనమ్
 • ఆలయం ప్రాచీనతే కాకుండా ఈ వూరు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది.
 • విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్ర మార్గంలో (క్రీ.శ.1518లో) ఇక్కడి విజయవాడ, కొండపల్లి దుర్గాలను జయించాడు. తరువాత ఈ మందిరం గురించి విని ఇక్కడి స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ రాజుకు కలలో నీల మేఘము డాలు డీలు సేయగజాలు [5] విష్ణువు దర్శనమిచ్చి ఆండాళ్‌తో తనకు రంగమందయిన పెండ్లి సెప్పుమని ఆనతిచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగు, యేను తెలుగు వల్లభుండ, తెలుగు కండ ... యెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స యని తలచి ఆముక్త మాల్యద ప్రబంధమును తెలుగు భాషలో రచించాడు.
 • తరువాతి కాలంలో కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి విధానంలో వ్రాసిన ఆంధ్రనాయక శతకము చాలా ప్రసిద్ధ చెందింది. అప్పటికి ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నందున కవి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ! హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అనే మకుటంతోశతకాన్ని వ్రాశాడు.
 • కృష్ణా నది, రైవిస్ కాలువ ఈ గ్రామం చుట్టూరా ఉన్నాయి. గ్రామంలో చాలా చెరువులున్నాయి.

సమీప దేవాలయాలుసవరించు

 
మరకత రాజేశ్వరి

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలో 2014,డిసెంబరు-8వ తేదీన ఇసుక క్వారీని ప్రారంభించారు. [9]

గ్రామజనాబాసవరించు

జనాభా (2011) - మొత్తం 7,153 - పురుషుల సంఖ్య 3,647 - స్త్రీల సంఖ్య 3,506 - గృహాల సంఖ్య 2,207

భారతీయ జనాభా లెక్కలు, 2001 సం. ప్రకారం, ఈ గ్రామ జనాభా వివరాలు క్రింద విధముగా ఉన్నాయి :[6]

 • 1,976 చెందిన కుటుంబాలకు. మొత్తం జనాభా: 7,835.
 • పురుషుల జనాభా: 3.877
 • మహిళా జనాభా: 3.958
 • 6 సంవత్సరాల కింద పిల్లలు: 913 (అబ్బాయిలు:- 446, అమ్మాయిలు: - 467)
 • మొత్తం అక్షరాస్యులు: 4.796

గణాంకాలుసవరించు

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7835.[7] ఇందులో పురుషుల సంఖ్య 3877, స్త్రీల సంఖ్య 3958, గ్రామంలో నివాస గృహాలు 1976 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2924 హెక్టారులు.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Srikakulam". External link in |title= (help); Missing or empty |url= (help); |access-date= requires |url= (help)CS1 maint: discouraged parameter (link)
 3. "Srikakulam village at Fallingrain.com". Archived from the original on 2015-07-25. Retrieved 2014-11-17.
 4. "శేషు మాధవరావు వ్యాసం". Archived from the original on 2007-12-30. Retrieved 2007-12-07.
 5. ఆముక్త మాల్యద
 6. Srikakulam at Our Village India.org[permanent dead link]
 7. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

[4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-8; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-11; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-28; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జులై-1; 1వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబరు-4; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-9; 6వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-9; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా; 2015,మే-10; 10వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-12; 1వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-21; 2వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-5; 1వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-5; 41వపేజీ. [16] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-5; 41వపేజీ. [17] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-12; 1వపేజీ. [18] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-12; 3వపేజీ.

బయటి లింకులుసవరించు