సంస్కార 1970లో విడుదలైన కన్నడ సినిమా. రామమనోహరచిత్ర బ్యానర్‌పై విడుదలైన ఈ చిత్రానికి తిక్కవరపు పఠాభిరామిరెడ్డి దర్శకుడు, నిర్మాత.[2]

సంస్కార
దర్శకత్వంతిక్కవరపు పఠాభిరామిరెడ్డి
స్క్రీన్ ప్లేగిరీష్ కర్నాడ్
పఠాభి
కథయు.ఆర్.అనంతమూర్తి
నిర్మాతతిక్కవరపు పఠాభి రామిరెడ్డి
తారాగణంగిరీష్ కర్నాడ్,
పి.లంకేశ్,
దాశరథి దీక్షిత్,
బి.ఆర్.జయరాం,
లక్ష్మీ కృష్ణమూర్తి,
స్నేహలత రెడ్డి
ఛాయాగ్రహణంటామ్‌కోవన్
కూర్పుస్టీవెన్ కార్టా
వాసు[1]
సంగీతంరాజీవ్ తారానాథ్
పంపిణీదార్లురాం మనోహర చిత్ర
విడుదల తేదీ
1970
సినిమా నిడివి
113 నిమిషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ
బడ్జెట్1,20,000 (equivalent to 5.3 million or US$66,000 in 2020)

నేపథ్యం

మార్చు

ఈ సినిమా తీసిన తిక్కవరపు పఠాభిరామిరెడ్డిది నెల్లూరు. ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలోను, రవీంద్రనాథ్ టాగూర్ వద్ద శాంతి నికేతన్ లోను చదివాడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఇంగ్లీషు లిటరేచర్ చదివాడు. న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ లో సినిమాల గురించి చదివాడు. పెళ్లినాటి ప్రమాణాలు,శ్రీకృష్ణార్జున యుద్ధము మొదలైన చిత్రాలను నిర్మించిన జయంతి సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. వాస్తవిక చిత్రాలను, ప్రయోజనాత్మకమైన చిత్రాలను నిర్మించాలన్న ఉద్దేశం ఇతడికి ఉండేది. ఒకసారి రాంమనోహర్ లోహియా ఇతని ఇంటికి వచ్చాడు. ఆ సందర్భంలో "సంస్కార" నవల గురించి చర్చకు వచ్చింది. ఆ నవలా రచయిత యు.ఆర్.అనంతమూర్తి మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉంటున్నారనీ, ఆ నవల కన్నడ దేశంలో ఒక విధమైన అలజడి రేపిందని తెలుసుకుని ఆ నవలను సినిమాగా మలిస్తే బాగుంటుందనే ఆలోచన అప్పుడే కలిగింది.[2]

నిర్మాణం

మార్చు

కన్నడ కథ కాబట్టి, కన్నడ దేశంలో ప్రచారంలో ఉన్న నవల కాబట్టి సినిమాను కూడా కన్నడ భాషలో నిర్మించాలని పఠాభి భావించాడు. "మెడ్రాస్ ప్లేయర్స్" అనే నాటక సంస్థలోని అమెచ్యూర్ కళాకారులతో ఈ సినిమాను నిర్మించాలని నిర్ధారణకు వచ్చాడు. ఆ సంస్థ సభ్యుడైన గిరీష్ కర్నాడ్ ను హీరో గా తీసుకోవడమే కాక అతనిచేత సంభాషణలు, స్క్రీన్ ప్లే వ్రాయించాడు. సింగీతం శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాడు. ఈ చిత్ర నిర్మాణానికి అనువైన స్థలంగా శృంగేరీ పీఠానికి సమీపంలో ఉన్న వైకుంఠపురం అనే గ్రామాన్ని ఎన్నుకున్నారు. అయితే ఆ గ్రామంలో షూటింగు జరుపుకోవడానికి శృంగేరీ పీఠాధిపతి శంకరాచార్య అనుమతి కావాలి. అది అంత సులభంగా లభ్యం కాలేదు. మొత్తానికి పీఠాధిపతి అనుమతితో ఆ గ్రామంలో, గ్రామ పరిసరాలలో షూట్ చేసి 20 రోజులలో చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ చిత్రానికి టామ్‌కోవన్ అనే ఆస్ట్రేలియన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో సెట్లు లేవు. ఏ నటునికి మేకప్ వేయలేదు. ఏ పాత్రకైనా గడ్డం పెరగవలసి వస్తే ఆ నటుడికి గడ్డం పెరిగే వరకూ నిరీక్షించారే కాని ఎవరికీ ఎక్కడా గడ్డం అతికించలేదు. ఈ చిత్రంలో పాటలు లేవు. కాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఉంది. ఈ సినిమాకు రాజీ తారానాథ్ సంగీతం చేకూర్చాడు. కేవలం మూడు వాయిద్యాలను మాత్రమే నేపథ్య సంగీతంలో వాడారు. ఈ సినిమాకి లక్ష 20 వేల రూపాయలు ఖర్చయ్యాయి[2].

సెన్సార్ అనుమతులు

మార్చు

ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు చూచి ఇది ఒక ప్రత్యేకమైన కులానికి సంబంధించిన కథ అని ప్రదర్శనకు అనుమతులు నిరాకరించారు. బొంబాయిలోని సెన్సార్ బోర్డుకు ఈ సినిమాను పంపారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రదర్శనకు అనువుగా లేదని తీర్పు ఇచ్చారు. దానితో నిర్మాత భారతప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. అప్పటి పార్లమెంటు సభ్యుడు నటుడు కొంగర జగ్గయ్య ఈ సినిమా ప్రదర్శన అనుమతులకోసం నిర్మాతకు తోడ్పడ్డాడు. జగ్గయ్య అప్పటి సమాచారశాఖా మంత్రి దగ్గరకు నిర్మాత పఠాభిరామిరెడ్డిని తీసుకుని పోయి పరిచయం చేశాడు. గుజ్రాల్ ఈ సినిమాను చూసి బాగా ఇష్టపడ్డాడు. అదే సమయంలో బెంగళూరులో ఈ సినిమాపై నిషేధం ఎత్తివేయాలని విద్యార్థులు సమ్మెకు దిగారు. మేధావులు, కవులు ప్రభుత్వానికి విన్నపం చేశారు. ఈ సినిమా గురించి పార్లమెంటులో ఒకరోజు చర్చ జరిగిన తరువాత ఒక్క కట్ కూడా లేకుండా ప్రదర్శనకు అనుమతి లభించింది. అయితే ఎ సర్టిఫికెట్ లభించింది. చిత్ర నిర్మాణం పూర్తయ్యాక సంవత్సరానికి ఇది సెన్సార్ ఇబ్బందులను అధిగమించి విడుదల అయ్యింది[2]. ఈ సినిమా ఆర్థికంగా విజయవంతమయ్యింది.

నటీనటుల ఎంపిక

మార్చు

ఈ చిత్రానికి నిర్మాత అందరూ కొత్త నటీనటులను ఎన్నుకున్నాడు. మెడ్రాస్ ప్లేయర్స్ అనే సంస్థలోని ఔత్సాహిక కళాకారులను ఈ సినిమా కోసం ఎంపిక చేశాడు. కథా నాయకుడిగా గిరీష్ కర్నాడ్, కథా నాయికగా తిక్కవరపు పఠాభి రామిరెడ్డి భార్య "స్నేహలతా రెడ్డి" నటించారు. ఈ చిత్రంలో చిన్నచిన్న పాత్రలు ధరించిన వారిలో చాలామంది విద్యావంతులు, జర్నలిస్టులు, రచయితలు ఉన్నారు. కొంత మందిని బెంగళూరులోని గుబ్బిథియేటర్స్ నాటక సంస్థ నుండి ఎన్నుకున్నాడు[2].

నారాయణప్ప అనే బ్రాహ్మణుడు బ్రాహ్మణ విధులన్నీ విడిచిపెట్టి మద్యమాంసాలు సేవించాడు; భగవధారాధన విడిచి పెట్టాడు; వెలయాలిని పెట్టుకున్నాడు. అలా ఉంటూ అతను మరణించాడు. అటువంటప్పుడు బ్రాహ్మణ ఆచారాల ప్రకారం అతనికి దహన సంస్కారాలు చెయ్యవచ్చునా? చెయ్యకూడదా? అన్నది అగ్రహారంలో పెద్ద్ద సమస్యయి కూచున్నది. గ్రామంలోని బ్రాహ్మణులంతా కలిసి తమ నాయకుడు, గౌరవనీయుడు, పండితుడూ అయిన ప్రాణేశాచార్యను సలహా అడిగారు. ప్రాణేశాచార్య సంధిగ్ధంలో పడ్డాడు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం మీద ఇంకో వ్యక్తికి ఎంతవరకూ హక్కున్నది? గ్రంధాలు, పుస్తకాలు తిరిగేసినా అతని కేమీ పరిష్కారం కనిపించలేదు. ప్రాణేశాచార్య వైవాహిక జీవితం సుఖమయం కాదు. వివాహమైనప్పట్నుంచి అతని భార్య రోగిష్టిగానే వున్నది. నారాయణప్ప భౌతిక దేహం ఇంకా అలా వుండగానే అతను, ఆ వెలయాలితో తటస్థపడి, ఆమెను అనుభవించాడు. తానేం చేశాడో ప్రాణేశాచార్య తెలుసుకున్నాడు. పాప పంకిలమైన బాట మీద తీర్థయాత్రకు బయలు దేరాడు. ధర్మశాస్త్రాలు వల్లిస్తూ నీతులు చెప్పడం సంస్కారం కాదనుకున్నాడు. నారాయణప్పకు అంత్యక్రియలు జరపడానికి నిశ్చయించుకున్నాడు[2].

పురస్కారాలు

మార్చు

భారత ప్రభుత్వం ఈ చిత్రానికి 1970 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపిక చేసింది. కన్నడ భాషాచిత్రానికి ఇదే తొలి జాతీయ పురస్కారం. ఈ పురస్కారం క్రింద నిర్మాతకు స్వర్ణ కమలం, 40 వేల రూపాయల నగదు లభించాయి. ఈ చిత్రానికి బొంబాయి ఫిల్మ్‌ ఫోరం "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు"ను ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఉత్తమకథ, ఉత్తమ సహయనటుడు, ఉత్తమ ఛాయాగ్రహణం విభాగాలలో ఈ చిత్రానికి రాష్టస్థాయి చలనచిత్ర పురస్కారాలను అందజేసింది[2]. ఈ చిత్రం పలు భారతీయ భాషలలోకి అనువదించబడింది.

మూలాలు

మార్చు
  1. "Kannada Movies Info".
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "స్వర్ణపతకం పొందిన చిత్రం సంస్కార". విజయచిత్ర. 6 (7): 6–7, 69. 1 January 1972.

బయటి లింకులు

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=సంస్కార&oldid=4035403" నుండి వెలికితీశారు