బాబు మోహన్

సినీ నటుడు, రాజకీయ నాయకుడు
(బాబూమోహన్ నుండి దారిమార్పు చెందింది)

బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యులు, మంత్రి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు...

బాబు మోహన్
BabuMohanActor.jpg
జన్మ నామంపల్లె బాబు మోహన్
జననం (1952-03-19) 1952 మార్చి 19 (వయసు 71)[1]
India బీరోలు
తిరుమలాయపాలెం మండలం
ఖమ్మం జిల్లా
తెలంగాణ
ప్రముఖ పాత్రలు మామగారు
మాయలోడు
జంబలకిడిపంబ

నేపధ్యముసవరించు

ఆయన ఖమ్మం జిల్లాలోని బీరోలులో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.

మాయలోడు, సినిమాతో స్టార్ కామిడియన్ అయ్యాడు.

రాజకీయ జీవితంసవరించు

బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందడు. 2019 లో బీజేపీ లో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయాడు.

కుటుంబంసవరించు

ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబరు 13 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[2]

నటించిన చిత్రాల పాక్షిక జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-20. Retrieved 2013-12-31.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-13. Retrieved 2013-11-17.
  3. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]

బయటి లంకెలుసవరించు