ధనసరి అనసూయ
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు[2][3]. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అనంతర కాలంలో తన బావ శ్రీరాముడిని వివాహం చేసుకుని తన పేరును సీతక్కగా మార్చుకున్నారు.[4][5]
సీతక్క | |||
| |||
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 07 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
పదవీ కాలం 2018 - ప్రస్తుతం | |||
ముందు | అజ్మీరా చందులాల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ములుగు శాసనసభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | పోదెం వీరయ్య | ||
తరువాత | అజ్మీరా చందులాల్ | ||
నియోజకవర్గం | ములుగు శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జగ్గన్నపేట్ గ్రామం, ములుగు మండలం, ములుగు జిల్లా సెల్: 9440170702. | 1971 జూలై 9||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | దివంగత శ్రీరాము | ||
సంతానం | సూర్య[1] | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
మతం | హిందూ |
బాల్యం
మార్చుసీతక్క వరంగల్ జిల్లా, ములుగు మండలం జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో 1971 జూలై 9న జన్మించింది. సమయ్య, సమ్మక్క దంపతులకు సీతక్క రెండో సంతానం. సీతక్క పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. ప్రజా సమస్యలపై స్పందించే గుణం సీతక్కకు చిన్నతనం నుంచే అలవరింది. ప్రజలపై జరుగుతున్న అనేక అన్యాయాలపై చదువుతున్న రోజుల్లోనే ప్రశ్నించేది. తదనంతర కాలంలో ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు రగిలిపోయి పోరాటం చేయాలనే ఉద్దేశంతో 1988లో నక్సల్ పార్టీలో చేరారు.[4]
రాజకీయ విశేషాలు
మార్చుధనసరి అనసూయ రెండుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడిన నాయకురాలు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన సీతక్క. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు[6].
నక్సల్ ఉద్యమం
మార్చుధనసరి అనసూయ జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసారు. రాజ్య హింసను కళ్ళకు కట్టే విధంగా నాటకాల ద్వారా ప్రజలకు తెలియ జెప్పేవారు జననాట్యమండలి వారు. కూలీరేట్ల, పాలేర్ల జీతాల పెంపుదలకోసం, అధికవడ్డీలకు వ్యతిరేకంగా, గిరిజన ప్రాంతాలలో భూములు ఆక్రమించుకున్న మైదానప్రాంత భూస్వాములకు, షావుకార్లకు వ్యతిరేకంగా, అమాయక గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు సాగిస్తున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గిరిజన రైతాంగం పోరాటానికి గిరిజనులు దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజనులలో చైతన్యం నింపుతుంటే సంఘం కార్యకలాపాలను వాటిని పోలీసుల ద్వారా అధికార పార్టీ నాయకులు అణచి వేసారు. అందులో భాగంగానే వారిమీద కాల్పులు జరిపి చాలా మందిని చంపివేశారు, కొట్టారు స్త్రీలను అవమానించారు. భూస్వామి నాయకత్వంలో జరిగిన ఈ హత్యలపై ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోలేదు. నిందితులను అరెస్టు చేయడంగాని, హత్యకేసు నమోదుచేసి విచారించడం గాని జరగలేదు. తమను రక్షించవలసిన ప్రభుత్వం భూస్వాములకు, షావుకార్లకు కొమ్ము కాస్తుంటే, వాళ్ల హింసకు, హత్యలకు మద్దతు తెలుపుతుంటే, ఇక గత్యంతరం లేదనుకున్న గిరిజనులు సాయుధపోరాట మార్గం చేపట్టారు. ఈ భూస్వాముల ఆగడాలను ఎదుర్కోవడానికి సాయుధ ప్రతిఘటన తప్ప మరొక మార్గం లేదని అనసూయ పోరాట నిర్ణయానికి వచ్చింది. అప్పటికే బెంగాల్ లోని నక్సల్బరీలో ప్రారంభమైన సాయుధ పోరాట మార్గంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరిష్కార మార్గంలో
మార్చుధనసరి అనసూయ 1988 లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు సీతక్కా 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఫూలన్ దేవి రచనల నుండి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ కులవాద వివక్షతో కోపంగా ఉన్న ఆదివాసులు సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ మార్గంలో జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరి సంవత్సరాలు ముందుకుసాగినా ఆదివాసులమీద, ఇతర అణగారిన వర్గాలమీద మౌనంగా నిశ్శబ్దంగా శతాబ్దాలుగా సాగిపోతున్న మెరికల్లాంటి యువతీయువకులు ఆ మార్గంలో ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ మార్గానికి హింసనూ దౌర్జన్యాన్నీ అడవులలో, కొండలు, గుట్టలలో నిరంతరం మృత్యువు వెన్నాడుతుండగా నిద్రాహారాలు కరువై అత్యంత కఠోరమైన పోరాటం సాగిస్తూ ఆ ఉద్యమంలోకి ప్రవేశించడం, ఈ దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకత్వాన్ని భరించి బానిసల్లా బతికేకంటే, మనుషుల్లా గౌరవ ప్రదంగా జీవించాలన్న ఈ పరిస్థితి కారణంగా ప్రగాఢమైన వాంఛ ఆ సమయంలోనే తన నిర్ణయాలు తీసుకున్నా వ్యవస్థలోపల తమ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విశ్వాసాన్ని కోల్పోయి ఎటువంటి ప్రజాస్వామిక పరిష్కారం అందులో నక్సలైటు మార్గంలో కూడా నెరవేరలేదు. నక్సలైటుపార్టీ సభ్యులలో కొన్ని సైద్ధాంతిక వివాదాలు, వ్యక్తిగత విభేదాల అప్రదిష్ట పాలయింది చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు.
జన జీవనస్రవంతి
మార్చుమావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు పిలుపునిచ్చారు.తెలిసీ తెలియని వయస్సులో అమాకత్వంతో తప్పుదారి పట్టిన యువతలో కొందరు నేటికీ నిషేధిత మావోయిస్టు సంస్థలో కొన సాగుతున్నారని వారు వెంటనే జనజీవన స్ర వంతిలో కలవాలని అడవుల్లో కుటుంబాలను విడిచి అనారోగ్యాల పాలవుతూ సాధించేదేమీలేదన్నారు నందమూరి తారక రామారావు తమ బిడ్డల జాడ కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని చెప్పా రు. అత్యంత స్నేహ పూరితంగా మనస్ఫూర్తిగా మీ రాక కోసం ఎదురుచూస్తుందని పేర్కొన్నారు. పోరుబాట వదిలి లొంగిపోయారు. వివిధ హోదాల్లో పనిచేసి సీతక్క కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాలు గడిపాడు, ఈ సమయంలో ఆమె దళకమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకుంది వారికి ఒక కొడుకు. ఆ సమయంలో తనకు తాను పోలీసులకు లొంగిపోయింది, ఇక ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి వచ్చారు.2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్.ఎల్.బి చదివింది, చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. సీతక్క సామాజిక సేవలో చురుకుగా ఉండి, స్థానికంగా నాయకురాలిగా పేరుఉన్నందున, అప్పుడు ఎపి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పోరుబాటను వీడిన సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.[7] జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె మొదటిసారి బ్యాలెట్ పోరులో దిగారు, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఆమెకు ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసే అవకాశం కల్పించింది.[8]
రాజకీయ జీవితం
మార్చుసీతక్క తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయింది. ఆమె 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది.[9] తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయింది. ఆమె తర్వాత 2018 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది.
ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్పై 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచింది.[10][11][12] సీతక్క 2022 డిసెంబరు 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితురాలైంది.[13]
ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూనే తన ఉన్నత విద్యను కొనసాగించారు సీతక్క. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వలస గిరిజనుల వెనుకబాటు (The social exclusion and deprivation of the Gotti Koya tribe) పై ఆమె పీహెచ్‌డీని 2012 లో మొదలు పెట్టి 2022 లో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె పీహెచ్‌డీని అందుకున్నారు.[14][15][16]
కరోనా సమయంలో సీతక్క చేసిన సేవలు ప్రజల్లో మరింత అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట మండలాల పరిధిలోని దాదాపు 275 గ్రామాలకు రేషన్, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు అడవి దారుల్లో పాదయాత్ర చేసి స్వయంగా అందజేశారు.
ఆమెకు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలో ములుగు అభ్యర్థిగా ప్రకటించగా[17], ములుగు ఎమ్మెల్యేగా గెలిచి[18], రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2023 డిసెంబర్ 7న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[19][20] మంత్రులందరిలో సీతక్క ప్రమాణం (Minister Seethakka).. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘‘పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నానను’’... అని ఆమె అనగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది.[4][21]
ఆమె డిసెంబర్ 14న డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది.[22] ఆమెకు 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా[23], డిసెంబర్ 24న ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించారు.[24]
ఎన్నికల చరిత్ర
మార్చుసంవత్సరం | కార్యాలయం | నియోజక వర్గం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | ఫలితం | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|
2004 | ఆంధ్రప్రదేశ్ శాసనసభ | ములుగు | తెలుగుదేశం పార్టీ | 41,107 | పోదెం వీరయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | 55,701 | ఓటమి | ||
2009 | 64,285 | 45,464 | గెలుపు | |||||||
2014 | తెలంగాణ శాసనసభ | 39,441 | అజ్మీరా చందులాల్ | తెలంగాణ రాష్ట్ర సమితి | 58,325 | ఓటమి | ||||
2018 | భారత జాతీయ కాంగ్రెస్ | 88,971 | 66,300 | గెలుపు | ||||||
2023 | 1,02,267 | బడే నాగజ్యోతి | 68,567 | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (6 January 2023). "పోటీకి రెడీగా ఎమ్మెల్యే సీతక్క కొడుకు..!". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.
- ↑ https://m.dailyhunt.in/news/india/telugu/namasthetelangaana-epaper-namasthe/ennikala+barilo+maaji+mahilalu-newsid-102044182
- ↑ A. B. P. Desam (7 December 2023). "నక్సలైట్ నుంచి మంత్రిస్థాయి వరకు-అంచెలంచెలుగా సీతక్క రాజకీయ ప్రస్థానం". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ 4.0 4.1 4.2 "Seethakka: పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నా.. మంత్రిగా అనసూయ అలియాస్ సీతక్క". ABN ఆంధ్రజ్యోతి. 7 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Sridhar, P. (2023-12-07). "Naxal turned politician Seethakka set to don new role as tribal welfare minister in Telangana". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-12-15.
- ↑ tps://thefederal.com/states/south/telangana/maoist-turned-mla-seethakka-replaces-guns-with-grains-to-help-poor/
- ↑ https://www.news18.com/news/buzz/guns-to-governance-meet-naxal-turned-mla-delivering-food-to-adivasis-on-bullock-cart-2586745.html
- ↑ Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=739
- ↑ https://www.news18.com/amp/assembly-elections-2018/telangana/mulug-st-election-result-s29a109/
- ↑ BBC Telugu (12 December 2018). "తెలంగాణ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ కూటమి 21 స్థానాల్లో గెలుపు". BBC News తెలుగు. Archived from the original on 14 April 2020. Retrieved 14 April 2020.
- ↑ Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ సందీప్, పూల (11 October 2022). "Seethakka:'నక్సలైట్.., లాయర్.., ఎమ్మెల్యే.., ఇప్పుడు డాక్టర్.. ఇవన్నీ అనుకోకుండానే అయిపోయా'". ది టైమ్స్ అఫ్ ఇండియా సమయం. Retrieved 8 December 2023.
- ↑ SADAM, RISHIKA (27 October 2022). "From Naxalite to lawyer to MLA, now with PhD: Meet Seethakka, Congress 'phenomenon' in Telangana". The Print. Retrieved 9 December 2023.
- ↑ Sakshi (8 December 2023). "'జనసిరి' సీతక్క". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ TV9 Telugu (15 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే." Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Andhrajyothy (7 December 2023). "రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (8 December 2023). "రుద్రమలై కదలాలి.. ఓరుగల్లు మురవాలి". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Andhrajyothy (14 December 2023). "అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
- ↑ Sakshi (24 December 2023). "TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రుల నియామకం". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.