అంబర్‌పేట మండలం (హైదరాబాదు జిల్లా)
అంబర్‌పేటమండలం, తెలంగాణ రాష్టం, హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]
అంబర్‌పేట | |
---|---|
Amber Shah Miya Sahab | |
![]() Shrine of Amber Shah Baba, Amberpet, Hyderabad | |
Coordinates: 17°23′27″N 78°31′25″E / 17.390941°N 78.523493°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 013 |
Vehicle registration | TS 11 |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర పాలక సంస్థ పరిధిలో ఉంది.[2] ఒక ప్రాంతం. ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఉప్పల్ నుండి కోఠీకి వెళ్ళేదారిలో రామంతపూర్ తరువాత ఉంటుంది.ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, అంబర్‌పేట మండల విస్తీర్ణం 9 చ.కి.మీ., జనాభా 153558.
పరిచయం సవరించు
అంబర్, పేట అనే రెండు పదాల కలయికతో అంబర్‌పేట ఏర్పడింది. అంబెర్గీస్ అనేది పర్షియన్ భాష కాగా, పేట అనే పదానికి ఉర్దూ భాషలో ప్రాంతం అని అర్థం. అంబర్‌పేట అనగా అంబెర్గీస్ యొక్క భూమి. హైదరాబాద్ స్టేట్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చే 1908లో నిర్మించబడి భారతదేశ ఉపఖండంలో అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అంబర్‌పేట పరిధిలోనే ఉండేది. ఇది పడమరన కాచిగూడ నుండి తూర్పున రామంతపూర్ వరకు, ఉత్తరాన విద్యానగర్ నుండి దక్షిణంన ఆజాద్ నగర్ వరకు వ్యాపించి ఉంది.
చరిత్ర సవరించు
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాదారుడైన ప్రసిద్ధ సుఫీ సన్యాసి అంబర్ బాబా పేరుమీదుగా ఈ ప్రాంతానికి అంబర్‌పేట అనే పేరు పెట్టడం జరిగింది. మూసీ నది ఉత్తరభాగంలో ఉన్న ఈ ప్రాంతంలో 18వ శతాబ్దంలో వ్యవసాయ సంఘం స్థాపించబడింది. ఇక్కడ అంబర్ బాబా దర్గా నిర్మించబడి, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతాయి. కుతుబ్ షాహీ ఎరాకు చెందిన అనేక మసీదులు వరంగల్లుకు వెళ్ళే ప్రధాన రహదారికి దగ్గరలోనే ఉన్నాయి. నగరంలో రెండో అతిపెద్ద మసీదు అయిన కుతుబ్ షాహి మసీదు (బడే మసీదు) ఇక్కడనే ఉంది.
బంజరు భూమిగా ఉన్న ఈ ప్రాంతానికి సూఫీ సెయింట్ అంబర్ బాబా వచ్చిన తరువాత దట్టమైన అరణ్యంతో పండ్ల పెంపక క్షేత్రంగా మారిందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. ఒకప్పుడు ఉపపట్టణంగా ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా వాణిజ్య, విద్యాసంస్థలకు ప్రధాన కేంద్రంగా మారింది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు సవరించు
మండలంలో పేరు పొందిన కట్టడాలు సవరించు
- గురువారప్పన్ ఆలయం
- శ్రీరమణ థియేటర్
- శివం టెంపుల్
- సూఫీ అంబర్ బాబా దర్గా
- గాంధీ విగ్రహం
- ఎం.సి.హెచ్. మైదానం
- సెంట్రల్ పోలీస్ లైన్స్ (సిపిఎల్)
- జైస్వాల్ గార్డెన్
- ఆలీ కేఫ్ సర్కిల్
- బాడీ మస్జిద్ ఇబ్రహీం మసీదు
- శ్రీ మహాంకాళి టెంపుల్
- శ్రీరామ మందిరం
- జై హనుమాన్ గుడి
- ఎం.సి.హెచ్. కమాన్
- ఒవైసీ నగర్
రవాణా సవరించు
హైదరాబాద్ - వరంగల్లు రాష్ట్ర రహదారి అంబర్‌పేట నుండే వెలుతుంది. ఇక్కడికి కి.మీ. దూరంలో కాచిగూడ రైల్వేస్టేషను ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంబర్‌పేట నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు 107, 71, 115, 113 నంబరు గల బస్సులను నడుపుతుంది.
ఫ్లైఓవర్ నిర్మాణం సవరించు
అంబర్‌పేటలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు 1.415 కిలోమీటర్లు నాలుగు వరుసల ఫ్లైఓవర్, దానికిరువైపులా రెండు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. గోల్నాకలోని సేలం బైబిల్ చర్చి వద్ద ప్రారంభమయ్యే ప్లైఓవర్ అంబర్‌పేట మార్కెట్ వద్దనున్న ముకరం హోటల్ వద్ద ముగుస్తుంది.[3][4]
మూలాలు సవరించు
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).