అరణ్యకాలు

(అరణ్యకము నుండి దారిమార్పు చెందింది)

ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టముగా ఉండేది. భగవానుడు అంశ అయిన వేదవ్యాసుడు ఈ వేదరాశిని విడివిడిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నాలుగు భాగములుగా విభజించాడు. వేదాలలో సంహితలు మూలగ్రంథాలు. వీటికి వ్యాఖానాలు బ్రాహ్మాణాలు అవతరించాయి. బ్రాహ్మాణాలలోని ఒక భాగంగానే అరణ్యకం ఆవిర్భవించింది.

దస్త్రం:Vyasa2.jpg
వేదవ్యాసుడు
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

అరణ్యకములు

మార్చు

అరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి అరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ప్రతి సంహితలు బ్రాహ్మణాలున్నట్లే అరణ్యకాలు కూడా ఉండేవి. కాలాలు గడిచే కొద్దీ ప్రజల నిరాదరణకు గురై చాలా వరకు నశించి పోయాయి. అథర్వవేదానికి చెందిన గోపథబ్రాహ్మణం అనే బ్రాహ్మణానికి సంబంధించిన అరణ్యకం లేకపోవడము ఇందుకు తార్కాణం.

అరణ్యకాలు అంటే ఏమిటి ?

మార్చు

వేదములలో సంహితలు మహర్షులు దర్శించినవి కావున ఇవి మూలగ్రంథాలు. బ్రాహ్మణాలనేవి సంహితలకు వ్యాఖ్యాన రూపాలు. వేద రాశిలో సంహితలు, బ్రాహ్మణాలు వరుసగా ఒకటి, రెండు స్థానములు కాగా అరణ్యకాలు మూడవ స్థానమును పొందినవి. అరణ్యకాలు అంటే అనేకమంది ద్వారా ఈ క్రింది విధముగా అనేక అర్థాలు ప్రతిపాదించబడినవి.

  1. అరణ్యంలో దీక్షతో అధ్యయనము చేసిన గ్రంథాలే అరణ్యకాలు.
  2. గృహస్థాశ్రమము వదలి సన్యాసము లేదా సన్యసించుట వలన అరణ్యాలకు వెళ్ళి ప్రశాంత వాతావరణములో తపదీక్షతో వేదాధ్యయనము చేయటకు కావలసిన గ్రంథాలే అరణ్యకాలు.
  3. కర్మఫలంతో పాటు జ్ఞానం సంపాదించు మేలు కలయిక అరణ్యకాలు.
  4. యజ్ఞాలలోని రహస్యాలను అరణ్యాలలోనే మహర్షులు చర్చించారు.
  5. బ్రాహ్మణములలో ఉండే గృహస్థాశ్రమ కర్మకాండలు, జ్ఞానం మాత్రము ప్రధానముగా ఉండే ఉపనిషత్తు ల మేలు కలయికయే అరణ్యకాలు.
  6. అరణ్యాలలో మాత్రమే ఆచరించవలసినవి కావున అరణ్యకాలు.
  7. వేదాల సారమే అరణ్యకాలు.

ఔషధ మూలికల నుండి అమృతాన్ని సేకరించినట్లే, వేదాల నుండి సారాన్ని సేకరించి, ఆరణ్యకాన్ని సంకలనం చేసినట్లు మహాభారతం పేర్కొంది. ప్రాణశక్తి, ప్రతీకోపాసనకు సంబంధించిన మంత్రాలు, బ్రాహ్మణాలతో కూడిన వేదాల భాగాన్ని ఆరణ్యక అంటారు. దీని విశిష్టతను చాటుకోవడానికి 'రహస్య బ్రాహ్మణం' అని అంటారు.నిరుక్తంపై తన వ్యాఖ్యానంలో దుర్గాచార్యుడు 'ఐతరేయక రహస్య బ్రాహ్మణ' అంటూ ఐతరేయ అరణ్యకాన్ని ఉటంకించాడు. ఇది రహస్య బ్రాహ్మణ, ఆరణ్యక ఐక్యతను సూచిస్తుంది.ఆరణ్యకాలకు రహస్యాలు అనే పేరు కూడా కలదు దీనికి కారణం ఆరణ్యకం యజ్ఞం యొక్క రహస్యాన్ని అందించడం, కర్మకాండ యొక్క తాత్విక వివరణను కూడా అందించడం. దీనిని ప్రధానంగా బ్రహ్మ విద్యారహస్య అనే పదం ద్వారా కూడా సూచిస్తారు. విషయ విశ్లేషణ పరంగా అరణ్యకకు ఉపనిషత్తుల మధ్య సారూప్యత ఉంది. కాబట్టి, బృహదారణ్యకం వంటి ఉపనిషత్ గ్రంథాలు కూడా నిర్వచించబడ్డాయి. అరణ్యకాల యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రాణవిద్య, ప్రతీకోపాసన. అయితే ఉపనిషత్తులు నిర్గుణ బ్రహ్మాన్ని పొందే విధానాన్ని చెబుతాయి.. రెండుంటికి తేడాలను అర్థం చేసుకోవడంలో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ రెండు గ్రంథాలు వేద రహస్య విద్యను వివరిస్తున్నాయి.

ఉదాహరణకుగాను తైత్రియ బ్రాహ్మణం యందు అరణ్యకాలు పారమార్ధిక వ్యవహార విషయాలను వివరిస్తాయి. కాలం ప్రవహిస్తూనే ఉంటుంది. మనము ఈ అఖండ కాలప్రవాహంలో భాగము మాత్రమే. వ్యవహారానికి గాను కాలాన్ని పగలని, రాత్రులని, సంవత్సర రూపంలో కలిగి విభజించారు. అయితే, ఆచరణాత్మక సమయం అనంతమైనది అవిభాజ్యమైనది. ఇది ఎల్లప్పుడూ తరగని మూలంతో ప్రవహించే, వివిధ నదుల ద్వారా ప్రవహించే గొప్ప నదితో ఇందులో పోల్చబడింది.ఈ అరణ్యకంలోని మూడవ, నాల్గవ శ్లోకాలు ఋతువుల స్వభావాన్ని తెలియజేస్తాయి. వర్షాకాలంలో వ్యాధులు ఉత్పన్నమవటాకిని కారణాలు, పచ్చ కామెర్లు ఎలా వ్యాప్తి చెందుతాయి ఇందులో తెలుపబడినాయి.. ఐదుమహాయజ్ఞముల వివరణ, పుణ్యం సంపాదించడం, పాపం మానేయడం వంటివాటికి అలంకార భాషలో వివరణ ఇవ్వబడినది

ప్రాణ విద్య యొక్క ప్రాముఖ్యత ఆరణ్యకల యొక్క విలక్షణమైన ఇతివృత్తంగా కనిపిస్తుంది. ఐతరేయ అరణ్యకంలో దీని గురించి మరింత ముఖ్యమైన వివరణ ఉంది. ఈ అరణ్యకం వీటికి మద్దతుగా ఋగ్వేద మంత్రాల నుండి ఉల్లేఖనాలను ఇస్తుంది. ఇందులో ప్రాణ విద్య యొక్క వివిధ సంప్రదాయాలను మనకు పరిచయం చేస్తుంది. అన్ని ఇంద్రియాల కంటే ప్రాణాల ఔన్నత్యాన్ని ఇవి నొక్కి చెబుతున్నాయి.

అరణ్యకాలు - సంహితలు

మార్చు

వేద విభాగానికి చెందిన సంహితలు మంత్రములతో కూడినవే మునుముందు వేదం అనుకునేవారు. తదుపరి కాలాములో మంత్రముతో పాటు వ్యాఖ్యాన రూపాలైన బ్రాహ్మణాలు కూడా కలిపిందే "వేదం" అని ఇంకొందరు అభిప్రాయ పడ్డారు. అరణ్యకాలు మాటేమిటి? ఇవి కూడా కర్మభాగంతో పాటుగా జ్ఞాన మార్గమునకు చెందిన ఉపనిషత్తులు కలిగి ఉండుటచే వేదమని పిలువ కూడదని కొందరి అభిప్రాయము. అందుకు కారణము వేదాంతమే ఉపనిషత్తులు అని వ్యవహరించారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

సూచనలు

మార్చు
  1. M. Witzel, Katha Aranyaka, Cambridge:Harvard Oriental Series 2004: xxviii sqq
  2. ed. Michael Witzel, Kaṭha Āraṇyaka, Critical Edition with a translation into German and an introduction. Cambridge: Harvard Oriental Series 2004.
  3. Brahmana 3.10–12; Aranyaka 1–2. In a South Indian recension, the 8 Kathaka chapters are not part of the Brahmana and Aranyaka but form a separate collection.
  4. Keith (1914), p.xxviii
  5. Reference Broken!.
  6. Die Tübinger Kaṭha-Handschriften und ihre Beziehung zum Taittirīya-Āraṇyaka, Sitzungsberichte der Kaiserlichen Akademie der Wissenschaften, philosophisch-historische Klasse 137.4. Wien
  7. M. Witzel, The Katha Aranyaka, Harvard Oriental Series 2004
  8. Die Tübinger Kaṭha-Handschriften und ihre Beziehung zum Taittirīya-Āraṇyaka, Sitzungsberichte der Kaiserlichen Akademie der Wissenschaften, philosophisch-historische Klasse 137.4. Wien

సూచనలు

మార్చు
  • Vaidik Sahitya aur Samskriti ka swarup (in Hindi) by Om Prakash Pande. Vishwa Prakashan (A unit of Wylie Eastern) 1994, New Delhi .ISBN 81-7328-037-1
  • Aitareya Aranyaka – English Translation by A. B. Keith, London 1909
  • Arthur Berriedale Keith, The Aitareya Aranyaka: Edited from the manuscripts in the India Office and the Library of the Royal Asiatic Society with introduction, translation, notes, ... unpublished of the Sankhayana Aranyaka, Eastern Book Linkers (1995) ISBN 81-86339-14-0
  • Aitareya Aranyaka – A Study . Dr. Suman Sharma. Eastern Book Linkers. New Delhi 1981
  • Taittiriya Aranyaka, with Sayana Bhashya . Anandashram, Pune 1926.
  • B.D. Dhawan. Mysticism and Symbolism in Aitareya and Taittiriya Aranyakas, South Asia Books (1989), ISBN 81-212-0094-6
  • Charles Malamoud, Svādhyāya : récitation personelle du Veda Taittirīya-Āranyaka livre II : texte; traduit et commenté par Charles Malamoud. Paris : Institut de civilisation indienne, 1977
  • Houben, Jan. The Pravargya Brāhmaṇa of the Taittirīya Āraṇyaka : an ancient commentary on the Pravargya ritual; introduction, translation, and notes by Jan E.M. Houben. Delhi : Motilal Banarsidass Publishers, 1991.
  • Michael Witzel, Katha Aranyaka : Critical Edition with a Translation into German and an Introduction, Harvard Oriental Series, Harvard Department of Sanskrit and Indian Studies (2005) ISBN 0-674-01806-0
  • Bhagyalata A. Pataskar, The Kaṭhakāraṇyakam (With text in Devanāgarī, Introduction and translation. New Delhi: Adarsha Sanskrit Shodha Samstha / Vaidika Samshodhana Mandala 2009.