సంహితము

(సంహిత నుండి దారిమార్పు చెందింది)

సంహిత అనగా బాగా మేలు చేసేది అనిఅర్ధం. ప్రతి వేదంలోకూడా సంహిత ఉంటుంది. ప్రతి వేదంలోనూ నాలుగు విభాగాలుంటాయి. (1) సంహిత (2) బ్రాహ్మణాలు (3) అరణ్యకాలు (4) ఉపనిషత్తులు

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

వేదశాస్త్రం

మార్చు

"సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై" - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. "సంధి" అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదము లోని శాస్త్రమును సంధించునది సంహితము. (సంహితమ్ = కూడుకొనునది). వేద సంహిత అంటే మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే. రచన కాదు. అంటే వేద ద్రష్టలైన ఋషులు వీటిని రచించలేదు (వేదాలు "అపౌరుషేయాలు"). వీటిని దర్శించి, స్మరించి, కూర్చారు (సంకలనం చేశారు) [1]

సంహిత అర్థం

మార్చు
  • "సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.
  • వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.[2]

చతుర్వేద సంహితలు

మార్చు
  • ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.
  • యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది.
  • సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకొనే గానవిధిని తెలుపుతుంది.
  • అధర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.
  • యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత.

అనంతర సంహితలు

మార్చు

వేదాల అనంతరం వచ్చిన క్రింది గ్రంథాలు కూడా 'సంహిత" పేరుతో ప్రసిద్ధమయ్యాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. వేదం - జీవన నాదం - రచన: దాశరథి రంగాచార్య - ప్రచురణ: ఎమెస్కో అర్ష భారతి, విజయవాడ (2007)
  2. విశ్వదర్శనం - భారతీయ చింతన - నండూరి రామమోహనరావు - లిఖిత ప్రచురణలు, విజయవాడ (1997, 2003)

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సంహితము&oldid=3228796" నుండి వెలికితీశారు