ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికలు - 2014
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలంగాణా అపాయిమెంట్ తేదీ 2014 జూన్ 2 అయినందున ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు రెండు విడతలుగా జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలు, ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు.
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి మార్చి 10, 2014 న వెలువరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో పార్టీల ప్రాతిపదికన ఒకే దశలో ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహిస్తారు. జిల్లాల్లో 2014 మార్చి17 న కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్ వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం |
నేపథ్యం
మార్చుస్థానిక ఎన్నికలకు గడువు పూర్తయినా నిర్వహిచంకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానాలు తప్పుపట్టడంతో శాసన సభ, లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌గా మారి సార్వత్రక, శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని వివిధ రాజకీయ పక్షాలు వేసిన పిటిషన్‌లను న్యాయస్థానం తిరస్కరించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాలను సార్వత్రక ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే దాకా వెలువరించరాదని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశం ప్రకారం మున్సిపల్ ఎన్నికల్ని మార్చి 30న, సుప్రీంకోర్టు జారీ చేసిన హుకుం మేరకు స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్‌పీటీసి) ఎన్నికల్ని ఏప్రిల్ 6, 11 తేదీలలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. 50,907 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలు జరుగుతాయి.
రిజర్వేషన్లు
మార్చుసుప్రీం కోర్టు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమీషనరుకు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ఆయా నియోజక వర్గాల రిజర్వేషన్లను విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులలో 50% మహిళలకు కేటాయించింది. షెడ్యూలు తెగలకు 6.99%, షెడ్యూలు కులాలకు 19.31%, వెనుకబడిన తరగతుల వారికి 34% రిజర్వేషన్లు కేటాయించింది.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు
మార్చు- జనరల్ : తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, రంగారెడ్డి, పశ్చిమ గోదావరి.
- జనరల్ (మహిళ) : చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం.
- ఎస్.టి : నల్గొండ.
- ఎస్.టి (మహిళ) : విజయనగరం
- ఎస్.సి : మహబూబ్ నగర్, వై.యస్.ఆర్ కడప
- ఎస్.సి (మహిళ) : ఖమ్మం, వరంగల్
- బి.సి : అనంతపురం, కర్నూలు, నిజమాబాదు
- బి.సి (మహిళ) :ఆదిలాబాదు, గుంటూరు, కరీంనగర్, మెదక్.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు
మార్చుజిల్లా పేరు మొత్తం షెడ్యూలు కులాలు షెడ్యూలు తెగలు వెనుకబడిన తరగతులు జనరల్ శ్రీకాకుళం జిల్లా 38 4 3 22 9 విజయనగరం జిల్లా 34 4 4 17 9 విశాఖపట్నం జిల్లా 39 3 10 10 16 తూర్పు గోదావరి జిల్లా 57 12 3 20 22 పశ్చిమ గోదావరి జిల్లా 46 10 1 14 21 కృష్ణా జిల్లా 49 12 2 13 22 గుంటూరు జిల్లా 57 13 3 12 29 ప్రకాశం జిల్లా 56 14 3 13 26 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 46 12 5 13 16 చిత్తూరు జిల్లా 65 14 3 18 30 వైఎస్ఆర్ జిల్లా 50 9 1 13 27 కర్నూలు జిల్లా 53 10 1 21 21 అనంతపురం జిల్లా 63 10 3 19 31 ఆదిలాబాదు జిల్లా 52 10 11 16 15 కరీంనగర్ జిల్లా 57 12 2 24 19 వరంగల్ జిల్లా 50 9 10 19 12 ఖమ్మం జిల్లా 46 8 15 10 13 నల్గొండ జిల్లా 59 11 7 23 18 హైదరాబాదు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మెదక్ జిల్లా 46 9 3 19 15 నిజామాబాదు జిల్లా 36 7 2 15 12 రంగారెడ్డి జిల్లా 33 6 2 14 11
ఎన్నికల షెడ్యూలు
మార్చుఈ ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలలో రెండు విడతలుగా జరిగినవి.
- నోటిఫికేషన్ తేదీ: మార్చి 10 (ఎన్నికల కమీషనర్ చే)
- నోటిఫికేషన్ జారీ: మార్చి 17 ( ఆయా జిల్లా కలెక్టర్ల చే)
- నామినేషన్ దాఖలుకు తేదీ: మార్చి 17 నుండి మార్చి 20 వరకు
- నామినేషన్ల పరిశీలన : మార్చి 21
- నామినేషన్ ఉపసంహరణ తేదీ: మార్చి 24
- ఎన్నికల తేదీలు : ఏప్రిల్ 6, ఏప్రిల్ 11 (రెండు విడతలు)
- ఎన్నికల లెక్కింపు తేదీ: మే 13 2014
- ఫలితాలు ప్రకటించిన తేదీ : మే 14 2014
- కొన్ని ప్రాంతాలలో రీ పోలింగ్ తేదీ : మే 18 2014[1]
ఫలితాలు
మార్చుప్రాదేశిక ఎన్నికల ఫలితాలు
మార్చుమండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు ఆయా జిల్లాలలో పార్టీల వారీగా గెలుపొందిన ఎం.పి.టీ.సీ, జడ్.పి.టి.సీ సభ్యుల సంఖ్య. తే.13.05.2014ది. నాటి లెక్కింపు ప్రకారం. | |||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అంధ్ర ప్రదేశ్ Z.P.T.C:653 + M.P.T.C: 10092 |
తెలంగాణ Z.P.T.C:443 + M.P.T.C: 6525 | ||||||||||||||||||||||
జిల్లాలు (ZPTC ల సంఖ్య) |
జిల్లాలు (ZPTC ల సంఖ్య |
||||||||||||||||||||||
కాంగ్రెస్ | తె.దే.పా | వై.కా.పా | వామపక్షాలు | ఇతరులు | కాంగ్రెస్ | తెలుగుదేశం | తె.రా.స | వామపక్షాలు | ఇతరులు | ||||||||||||||
ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ZPTC | MPTC | ||||
శ్రీకాకుళం
(38) |
0 | 8 | 22 | 351 | 16 | 276 | 0 | 2 | 0 | 38 | ఆదిలాబాదు
(52) |
10 | 166 | 2 | 63 | 38 | 291 | 0 | 7 | 2 | 109 | ||
విజయనగరం
(34) |
0 | 60 | 24 | 297 | 10 | 169 | 0 | 0 | 0 | 23 | కరీంనగర్
(57) |
14 | 282 | 1 | 36 | 41 | 345 | 0 | 5 | 1 | 149 | ||
విశాఖపట్నం (39) | 0 | 17 | 24 | 332 | 15 | 254 | 0 | 8 | 0 | 43 | వరంగల్
(50) |
24 | 294 | 6 | 128 | 18 | 225 | 0 | 5 | 2 | 53 | ||
తూర్పు గోదావరి (57) |
0 | 2 | 43 | 608 | 14 | 391 | 0 | 0 | 0 | 62 | ఖమ్మం
(46) |
10 | 102 | 22 | 242 | 0 | 0 | 3 | 118 | 9 | 163 | ||
పశ్చిమ గోదావరి
(46) |
0 | 2 | 43 | 597 | 3 | 233 | 0 | 1 | 0 | 70 | నల్గొండ
(59) |
43 | 397 | 2 | 148 | 13 | 114 | 1 | 73 | 0 | 103 | ||
కృష్ణా
(49) |
0 | 2 | 34 | 468 | 15 | 328 | 0 | 6 | 0 | 32 | నిజామాబాద్
(36) |
12 | 229 | 0 | 30 | 24 | 236 | 0 | 0 | 0 | 86 | ||
గుంటూరు
(57) |
0 | 4 | 34 | 469 | 23 | 409 | 0 | 4 | 0 | 26 | మెదక్
(46) |
21 | 296 | 4 | 108 | 21 | 215 | 0 | 0 | 0 | 66 | ||
ప్రకాశం
(56) |
0 | 0 | 25 | 344 | 31 | 405 | 0 | 0 | 0 | 35 | రంగారెడ్డి
(33) |
14 | 219 | 7 | 130 | 12 | 144 | 0 | 10 | 0 | 111 | ||
నెల్లూరు
(46) |
0 | 16 | 15 | 228 | 31 | 308 | 0 | 7 | 0 | 25 | మహబూబ్ నగర్ (64) |
28 | 366 | 9 | 176 | 24 | 290 | 0 | 7 | 2 | 130 | ||
చిత్తూరు
(65) |
0 | 4 | 37 | 459 | 27 | 387 | 0 | 1 | 1 | 50 | మొత్తం | 176 | 2351 | 53 | 1061 | 191 | 1860 | 4 | 225 | 16 | 970 | ||
కడప
(50) |
0 | 9 | 11 | 203 | 39 | 341 | 0 | 0 | 0 | 6 | వివిధ పార్టీలకు వచ్చిన జడ్పీలు, మండల పరిషత్తులు | ||||||||||||
కర్నూలు
(53) |
2 | 43 | 20 | 333 | 30 | 395 | 0 | 8 | 1 | 35 | కాంగ్రెస్ | తె.దే.పా | వై.కా.పా | తె.రా.స | వామ పక్షాలు |
హంగ్ | ఇత రులు |
||||||
అనంతపురం
(63) |
0 | 5 | 41 | 529 | 21 | 303 | 0 | 1 | 1 | 11 | సీమాంధ్ర | ZPTC | 2 | 373 | 275 | 0 | 0 | 0 | 3 | ||||
మొత్తం | 2 | 172 | 373 | 5216 | 275 | 4199 | 0 | 38 | 3 | 456 | MPP | 0 | 358 | 242 | 0 | 0 | 50 | 3 | |||||
* Z.P.T.C లలో కొన్నింటికి ఎన్నికలు జరగలేదు.కొన్ని ఏకగ్రీవమైనాయి. | తెలంగాణ | ZPTC | 176 | 53 | 0 | 191 | 4 | 0 | 10 | ||||||||||||||
* M.P.T.C లలో కొన్నింటికి ఎన్నికలు జరగలేదు.కొన్ని ఏకగ్రీవమైనాయి. | MPP | 114 | 32 | 0 | 113 | 1 | 154 | 11 |
మూలాలు
మార్చు- ↑ కొన్ని కేంద్రలాలో బ్యాలట్ బాక్సుల లో నీరు చేరడం వల్ల , బ్యాలట్ పేపర్లకు చెదలు పట్టడం వల్ల రీ పోలింగు జరుగుతుంది.
- http://www.eenadu.net/ ఆధారంగా (తే.14.05.2014)