ఆకాష్ చోప్రా
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ | 1977 సెప్టెంబరు 19||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం పేస్ కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batsman | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 245) | 2003 అక్టోబరు 8 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 అక్టోబరు 26 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997-2009/10 | ఢిల్లీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010-2011/12 | రాజస్థాన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | హిమాచల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2009 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | రజస్థాన్ రాయల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2020 జూలై1 |
ఆకాశ్ చోప్రా (జననం 1977 సెప్టెంబరు 19) భారత క్రికెట్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత, యూట్యూబర్. అతను 2003 నుండి 2004 చివరి వరకు భారత క్రికెట్ జట్టు కోసం ఆడాడు[1]
ప్రస్తుతం, అతను Viacom18 కోసం హిందీ క్రికెట్ వ్యాఖ్యానం చేస్తున్నాడు.[2] అతను ESPNcricinfo కోసం కాలమ్ రైటర్‌గా పనిచేశాడు.[3]
చాలా కొద్దికాలం పాటు సాగిన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఆకాష్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి,[4] 23 సగటుతో 437 పరుగులు చేశాడు. భారత దేశీయ క్రికెట్‌లో ఢిల్లీ క్రికెట్ జట్టు, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు, రాజస్థాన్ క్రికెట్ జట్ల తరఫున ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.
క్రికెట్ కెరీర్
మార్చుఅంతర్జాతీయ
మార్చుచోప్రా 2003 చివరలో న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో అహ్మదాబాద్‌లో తొలి అంతర్జాయ్తీయ మ్యాచ్ ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా అతన్ని ఎంచుకున్నారు.[1] 2003–04లో మొహాలీలో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై రెండు అర్ధ సెంచరీలు సాధించి చోప్రా అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో, అతను వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి మెల్‌బోర్న్, సిడ్నీలలో రెండు సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యాలతో సహా అనేక పెద్ద భాగస్వామ్యాల్లో కనిపించాడు. ఆ సిరీస్‌లో కొత్త బంతిని దాని మెరుపు పోయేదాకా ఆడి, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్, VVS లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు భారీ స్కోర్లు చేసేందుకు దోహదం చేసాడు.[1]
తరువాతి పాకిస్తాన్ పర్యటనలో, అతను వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి మరో సెంచరీ భాగస్వామ్యం సాధించాడూ. ముల్తాన్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారీ ఇన్నింగ్స్ ఓటమిని సాధించడాంలో భారత మొదటి ఇన్నింగ్స్‌లో 600 పైచిలుకు పరుగులు చేసింది. రెండో టెస్టులో గాయపడిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో ఆడిన యువరాజ్ సింగ్ సెంచరీ చేసాడు. అయితే, భారత జట్టు ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది.[5] చివరి టెస్టుకు గంగూలీ తిరిగి వచ్చినప్పుడు, చోప్రాను తొలగించి యువరాజ్‌ని కొనసాగించారు.
2004 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బెంగుళూరులో జరిగిన మొదటి టెస్టులో టెండూల్కర్ గాయపడటంతో చోప్రా సెహ్వాగ్ భాగస్వామిగా తిరిగి వచ్చాడు. అయితే, ఆమ్యాచ్‌లో భారీ ఓటమితో, టెండూల్కర్ తిరిగి వచ్చిన తర్వాత చోప్రా చెన్నైలో జరిగిన తదుపరి మ్యాచ్‌లో స్థానం కోల్పోయాడు. ఆ మ్యాచ్‌లో యువరాజ్, భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ స్థానంలో యువరాజ్ కూడా ఇబ్బంది పడడంతో, చోప్రాను నాగ్‌పూర్‌లో జరిగిన మూడో టెస్టుకు తిరిగి పిలిచారు. అయితే, ఆ మ్యాచ్‌లో చోప్రా రెండుసార్లూ విఫలమవడం, ఆస్ట్రేలియా 35 సంవత్సరాలలో మొదటిసారిగా భారతదేశంలో ఒక సిరీస్‌ను గెలుచుకోవడం జరుగాయి. అతని కెరీర్ సగటు క్రమంగా 46.25 నుండి 23కి తగ్గిపోయింది. చోప్రా స్థానంలో ఢిల్లీ సహచరుడు గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టులో సెహ్వాగ్ భాగస్వామిగా ఉండే పోటీలో గంభీర్, వసీం జాఫర్‌లు అతన్ని అధిగమించారు. నెమ్మదిగా చేసే స్కోరింగ్ రేటు కారణంగా అతన్ని, వన్డే ఇంటర్నేషనల్ జట్టులో తీసుకునేందుకు పరిగణించనేలేదు.
IPL
మార్చుఅతను IPL 2008, IPL 2009 లలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడినప్పటికీ, పరుగులెత్తే టి-20 క్రికెట్‌కు అతని పద్ధతి సరిపోదని భావించి చివరికి తొలగించారు.
2008 సెప్టెంబరులో, SNGPL (పాకిస్తాన్ నుండి క్వాయిడ్-ఐ-అజామ్ ట్రోఫీ విజేతలు)తో జరిగిన నిస్సార్ ట్రోఫీలో ఆకాష్, ఢిల్లీ తరపున ఆడి, 4, 197 పరుగులు చేశాడు. [6] మ్యాచ్ డ్రా అయినప్పటికీ, మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో SNGPL, ట్రోఫీని గెలుచుకుంది. [7] చాలా కాలం పాటు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన తర్వాత, చోప్రా రంజీ ప్లేట్ విభాగంలో అతిథి ఆటగాడిగా రాజస్థాన్‌లో చేరాడు. [8] రాజస్థాన్ మొదటి ప్లేట్ డివిజన్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత, 2010-2011 సీజన్‌లో రంజీ ట్రోఫీని గెలుచుకోవడంలో అతను తోడ్పడ్డాడు. అతను ఢిల్లీతో, రెండు రాజస్థాన్‌తో మొత్తం మూడు రంజీ టైటిళ్లను గెలుచుకున్నాడు. 8,000కు పైగా ఫస్ట్‌క్లాస్ పరుగులు చేసిన అతికొద్ది మంది భారతీయ క్రికెటర్లలో అతను ఒకడు.
క్రికెట్ కామెంటరీ కెరీర్
మార్చుస్టార్ స్పోర్ట్స్‌కి చాలా కాలం పాటు టెలివిజన్ వ్యాఖ్యానం చేశాడు. [9] అతని క్రికెట్ వ్యాఖ్యాన శైలి నవజ్యోత్ సింగ్ సిద్ధూను పోలి ఉంటుంది. [10] వ్యాఖ్యానంలో అతను చాలా వన్ లైనర్లను, రైమ్స్‌నూ ఉపయోగిస్తాడు. ప్రతి ఆటగాడికి, షాకి, సిట్యుయేషన్‌కి అతను వన్ లైనర్లు, చిన్న పద్యాలనూ వాడతాడు. అతను హిందీ లైవ్ టీవీ కామెంటరీ మధ్య పద విన్యాసాలు, ఇడియమ్స్‌ని కూడా ఉపయోగిస్తాడు. వాడిన మాటలనే మళ్ళీ మళ్ళీ వాడుతూంటాడు. ఒకే పద్ధతిలో ఉండే వాక్యాలను వివిధ ఆటగాళ్ళకు వాడూతూంటాడు. తరచుగా అభిమానులు అతని వ్యాఖ్యానాన్ని విమర్శిస్తూంటారు. [11] [12]
2018–19 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ మధ్య, అతను 7 నెట్‌వర్క్ కోసం వ్యాఖ్యానించాడు, సోనీ టెన్ 2 పై వ్యాఖ్యానం కోసం వాయిస్ కూడా ఇచ్చాడు. [13]
2023 జనవరిలో, అతను స్టార్ స్పోర్ట్స్‌ను విడిచిపెట్టి, వయాకామ్ 18 నెట్‌వర్క్‌లో చేరాడు. దక్షిణాఫ్రికా ట్వంటీ20 లీగ్, SA20 లో స్పోర్ట్స్ 18, జియో సినిమా యాప్‌లో హిందీ వ్యాఖ్యానం చేస్తాడు.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Aakash Chopra". Cricinfo. Archived from the original on 15 February 2007. Retrieved 6 February 2007.
- ↑ 2.0 2.1 "Suresh Raina, RP Singh, Pragyan Ojha, and Aakash Chopra in Viacom18's Expert Panel for SA20". www.news18.com (in ఇంగ్లీష్).
- ↑ "The Insider: Decoding the craft of cricket by Aakash Chopra | ESPN Cricinfo". www.espncricinfo.com. Retrieved 2023-03-05.
- ↑ http://content-aus.cricinfo.com/ci/content/player/27639.html Cricinfo
- ↑ Vasu, Anand (8 April 2004). "Yuvraj or Chopra? India's selectorial dilemma". Cricinfo. Retrieved 7 February 2007.
- ↑ "Chopra and Kohli stretch lead to 384".
- ↑ "Mohammad Nissar Trophy at Delhi, Sep 15–18 2008".
- ↑ Aakash Chopra to represent Rajasthan Archived 4 నవంబరు 2010 at the Wayback Machine
- ↑ "IPL 2023: Aakash Chopra No Longer A Part Of Disney Star, Will Do Commentary For Sports18 & JioCinema". kheltalk.com.
- ↑ "Aakash Chopra reveals why he honed his craft in Hindi commentary, not English". circleofcricket.com.
- ↑ "Twitter Trolled Aakash Chopra After His Commentary Tweet On Dhoni's Winning Shot". www.rvcj.com.
- ↑ https://cricketaddictor.com/cricket/aakash-chopra-posts-brilliant-reply-after-a-fan-takes-a-dig-at-his-commentary/&ved=2ahUKEwjguZj_3f36AhXDALcAHdtzA-M4ChAWegQIDRAB&usg=AOvVaw0qzQ0P_zYWnIR6WADUcvwQ[dead link]
- ↑ ""Bangladesh are saying that it is not Diwali time but they have prepared for a whitewash" - Aakash Chopra". sportskeeda.com.