పి.ఆదినారాయణరావు

సినీ నిర్మాత, సంగీత దర్శకుడు
(ఆదినారాయణ రావు నుండి దారిమార్పు చెందింది)

పెనుపాత్రుని ఆదినారాయణరావు (ఆగష్టు 21, 1914 - జనవరి 25, 1991) తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నిర్మాత. ఇతడు భార్య, నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత.

పెనుపాత్రుని ఆదినారాయణరావు
పి.ఆదినారాయణరావు
జననంపి.ఆదినారాయణరావు
ఆగష్టు 21, 1914
కాకినాడ, ఆంధ్ర ప్రదెశ్
మరణం1991 జనవరి 25(1991-01-25) (వయసు 76)
నివాస ప్రాంతంవిజయవాడ
వృత్తిఅంజలీ పిక్చర్స్ అధినేత.
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీత దర్శకుడు , నిర్మాత
భార్య / భర్తఅంజలీదేవి

ఈయన ఆగష్టు 21 1914 సంవత్సరంలో విజయవాడలో కృష్ణాష్టమి రోజున జన్మించారు.

చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన 'పెదగురువు' అనే పట్రాయని నరసింహశాస్త్రి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో బి.ఎ.సుబ్బారావు నిర్మించిన పల్లెటూరి పిల్ల చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి అంజలీదేవి పేరుతో 1953లో అంజలీ పిక్చర్స్ స్థాపించారు. 1955లో నిర్మించిన అనార్కలి చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం ఈయన సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన సువర్ణసుందరి తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. సతీ సక్కుబాయి వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.

ఈయన 1991 సంవత్సరంలో జనవరి 25 న పరమపదించారు.

సంగీతం కూర్చిన సినిమాలు

మార్చు
  1. చండీప్రియ (1980)
  2. కన్నవారిల్లు (1978)
  3. మహాకవి క్షేత్రయ్య (1976) - నిర్మాత కూడాను
  4. అల్లూరి సీతారామరాజు (1974)
  5. భక్త తుకారాం (1973)
  6. పెద్ద కొడుకు (1972)
  7. మోసగాళ్ళకు మోసగాడు (1971)
  8. అగ్ని పరీక్ష (1970)
  9. అమ్మకోసం (1970) - నిర్మాత కూడాను
  10. సతీ సక్కుబాయి (1965)
  11. ఫూల్ కీ సేజ్ (1964)
  12. స్వర్ణ మంజరి (1962) - నిర్మాత కూడాను
  13. మంగయిర్ ఉల్లన్ సెల్వమ్ (1962)
  14. స్వర్ణ మంజరి (1962)
  15. అడుత వీటు పెన్న్ (1960)
  16. ఋణానుబంధం (1960)
  17. మనలనే మంగాయిన్ భాగ్యమ్ (1957)
  18. సువర్ణ సుందరి (1957) - నిర్మాత, రచయిత కూడాను
  19. అనార్కలి (1955)
  20. అనాత్కలి (తమిళం) (1955)
  21. అన్నదాత (1954)
  22. పరదేశి (1953) - నిర్మాత కూడాను
  23. పూంగోదై (తమిళం) (1953)
  24. తిలోత్తమ (1951)
  25. మాయమాలై (తమిళం) (1951)
  26. మాయల మారి (1951)
  27. మాయక్కారి (తమిళం) (1951)
  28. పల్లెటూరి పిల్ల (1950)
  29. గొల్లభామ (1947)

బయటి లింకులు

మార్చు