కాంగో గణతంత్రం. దీన్నే కాంగో బ్రజ్జావిల్లె, చిన్న కాంగో లేదా కాంగోఅని కూడా అంటారు.ఇది మధ్య ఆఫ్రికా లోని దేశము.ఈ దేశానికి సరిహద్దులుగా పడమరన గాబన్, నైరుతిగా కామెరూన్, వాయువ్యాన మధ్య ఆఫ్రిక గణతంత్రం, తూర్పు కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం, ఆగ్నేయాన అంగోలా ఆక్రమించిన కబిండా, పక్కనే గినియా జలసంధి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా కాంగో నది డెల్టా లోకి వ్యాపారాన్నినిర్మించిన బంటూ తెగవారి ఆధిపత్యంతో ఉంటుంది.ఈ గణతంత్ర రాజ్యం పూర్వపు ఫ్రెంచి కాలనీ.1960లో స్వతంత్రం వచ్చిన తరువాత మధ్య కాంగోలోని ఫ్రెంచి ప్రాంతమంతా కాంగో గణతంత్ర రాజ్యంగా మారింది.ఈ కాంగో మార్క్సిజం, లెనినిజం అవలంబించే ఏక పార్టీ రాజ్యంగా 1970 నుండి1991 వరకూ ఉంది.బహుళ పార్టీ ఎన్నికలు1992లో జరిగాయి.1997 అంతర్యుద్ధంలో ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసేశారు.

République du Congo
కాంగో గణతంత్రం
Flag of కాంగో గణతంత్రం
నినాదం
"Unité, Travail, Progrès"  (French)
"Unity, Work, Progress"
జాతీయగీతం
లా కాంగోలైసె
కాంగో గణతంత్రం యొక్క స్థానం
కాంగో గణతంత్రం యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
బ్రెజ్జావిల్లె
4°14′S 15°14′E / 4.233°S 15.233°E / -4.233; 15.233
అధికార భాషలు ఫ్రెంచి భాష
ప్రభుత్వం రిపబ్లిక్
 -  అధ్యక్షుడు Denis Sassou Nguesso
 -  ప్రధాన మంత్రి Isidore Mvouba
స్వాతంత్ర్యం ఫ్రాన్స్ నుండి 
 -  Date 15 ఆగస్టుt 1960 
విస్తీర్ణం
 -  మొత్తం 342,000 కి.మీ² (64వది)
132,047 చ.మై 
 -  జలాలు (%) 3.3
జనాభా
 -  2005 అంచనా 3,999,000 (125వది)
 -   జన గణన n/a 
 -  జన సాంద్రత 12 /కి.మీ² (204th)
31 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $4.585 billion (154వది)
 -  తలసరి $1,369 (161వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.520 (medium) (140వది)
కరెన్సీ en:Central African CFA franc (XAF)
కాలాంశం WAT
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .cg
కాలింగ్ కోడ్ +242

చరిత్ర

మార్చు

వలసపాలనకు పూర్వం

మార్చు

బంటు విస్తరణ సమయంలో తెగలను స్థాపించిన బంటు భాషా ప్రజల ఈ ప్రాంతంలో ఉన్న పిగ్మీ ఆదిమవాసీ ప్రజలను తొలగించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన తరువాత పిగ్మీ ప్రజలు ఈ ప్రాంతంలో క్రీ.పూ. 1500 లో కనుమరుగయ్యారు.బకాంగో అనబడే బంటుభాషా ప్రజలు ప్రస్తుత అంగోలా, గబాన్, కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం భూభాగాలను ఆక్రమించారు. బంటు జాతి సమూహం ఈ దేశాల మధ్య జాతిపరమైన సంబంధాలు ఏర్పరచాయి. కొంగో, లోంగో, తేకే వంటి అనేక బాంటూ రాజ్యాలు ఏర్పరిచిన వాణిజ్య సంబంధాలు కాంగో నదీ పరీవాహక ప్రాంతం వ్యాపార కూడలిగా మారడానికి దారి తీసాయి.[1]

 
ఆఫ్రికా వర్ణన (1668) పుస్తకంలోని ఎన్ ' గంగే ఎం ' నియాంబీ న్యాయస్థానం (1668)

1484 లో పోర్చుగీస్ అన్వేషకుడు డియోగో కాయో కాంగో ముఖద్వారానికి చేరుకున్నాడు.[2] బాంటూ రాజ్యాలకు ఐరోపియన్లకు మద్య అత్యావసర వస్తువులు, తయారీ వస్తువులు, హింటర్ ల్యాండు నుండి స్వాధీనం చేసుకున్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలు త్వరితంగా అభివృద్ధి చెందాయి. ఇది అట్లాంటిక్ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా శతాబ్దాలుగా కొనసాగింది. 19 వ శతాబ్దం చివరలో కాంగో నదీ ప్రాంత డెల్టా ప్రాంతంలో ప్రత్యక్ష యూరోపియన్ వలసలు ఆరంభమయ్యాయి. తద్వారా ఈ ప్రాంతంలోని బంటు సమాజాలు శక్తిని కోల్పోయారు.[3]

ఫ్రెంచి వలస పాలన కాలం

మార్చు

1880 లో మకొకో రాజుతో " పియర్రె డీ బ్రజ్జా " ఒప్పందం తరువాత కాంగో నది ఉత్తరాన ఉన్న ప్రాంతంలో ఫ్రెంచి సార్వభౌమత్వాధికారం సాధించింది.[2][4] 1903 లో స్థాపించిన మద్య ఫ్రెంచి వలస స్థావరం కంటే ఈ కాంగో స్థావరం మొట్టమొదటగా ఫ్రెంచి కాంగో స్థావరంగా పిలువబడింది. 1908 లో ఫ్రాన్సు మధ్యధరా కాంగో, గబాన్, చాడ్, ఒబుంగుయి-చారి (ఆధునిక మధ్య ఆఫ్రిక గణతంత్రం) లతో ఫ్రెంచి ఈక్వెటోరియల్ ఆఫ్రికా (ఎ.ఇ.ఎఫ్.) ను నిర్వహించింది. ఫెడరల్ రాజధానిగా బ్రజ్జావిల్లేను రూపొందించారు. వలసరాజ్య పాలన మొదటి 50 సంవత్సరాల కాలంలో కాంగోలో ఆర్థిక వనరుల వెలికితీతపై కేంద్రీకృతమైంది. ఈ పద్ధతులు తరచూ క్రూరమైనవిగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కాంగో-ఓషన్ రైల్రోడ్ నిర్మాణంలో కనీసం 14,000 మంది ప్రాణాలను కోల్పోయినట్లు అంచనా వేయబడింది.[2]

1940 - 1943 మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాంసును నాజీలు ఆక్రమించిన సమయంలో ఫ్రీ ఫ్రాంసుకు సంకేత రాజధానిగా బ్రజ్జావిల్ పనిచేసింది.[5] 1944 లో జరిగిన బ్రజ్జీవిల్లే కాన్ఫరెంసులో ఫ్రెంచి వలసవాద విధానంలో ప్రధాన సంస్కరణలను ప్రకటించింది. యుద్ధానంతరం భౌగోళికంగా కంగా ఎ.ఇ.ఎఫ్.లో కేంద్ర స్థానంలో ఉండడం, ఫెడరలు ప్రభుత్వానికి బ్రజ్జావిలు రాజధానిగా ఉన్న ఫలితంగా కాంగో పాలనాపరమైన, మౌలిక సదుపాయాల వ్యయం అధికరించబడడం ద్వారా కాంగోకు ప్రయోజనం చేకూరింది.[1] 1946 రాజ్యాంగం స్వీకరించిన తరువాత ఫోర్తు గణతంత్రంకును స్థాపించి ఫ్రెంచి శాసనసభను కూడా ఇక్కడ రూపొందించింది.

1958 లో ఐదవ గణతంత్రాన్ని స్థాపించిన ఫ్రెంచి రాజ్యాంగం పునర్నిర్మాణం అనుసరించి ఎ.ఇ.ఎఫ్. రాజ్యాంగ భాగాలుగా విభజించబడింది. అవి అన్నీ ఫ్రెంచి కమ్యూనిటీలో స్వతంత్ర కాలనీగా మారింది. ఈ సంస్కరణల సమయంలో మద్య కాంగో 1958 లో కాంగో గణతంత్రంగా గుర్తించబడింది.[6] 1959 లో మొదటి రాజ్యాంగాన్ని ప్రచురించింది.[7] 1959 ఫిబ్రవరిలో బ్రజ్జావిల్లెలో జరిగిన అల్లర్ల ఫలితంగా మోబోకి (జాక్యూస్ ఒపాంగాల్టుకు అనుకూలంగా ఉండేవారు), లారిసు, కాంగోలు (ఫ్రెంచ్ ఈక్వెటోరియల్ ఆఫ్రికాలో ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతి మేయర్ ఫల్బెర్ట్ యులౌకు మద్దతు ఇచ్చారు), ఫ్రెంచ్ ఆర్మీని స్వాధీనం చేసుకున్నారు.[8] 1959 ఏప్రెలులో నూతన ఎన్నికలు జరిగాయి. 1960 ఆగస్టులో కాంగో స్వతంత్రం పొందాక యులౌ మాజీ ప్రత్యర్థి అయిన ఓపాంగల్ట్ అతని క్రింద పనిచేయడానికి అంగీకరించాడు. కాంగో గణతంత్రం మొదటి అధ్యక్షుడిగా యుల్యూ ఉన్నారు.[9] పోండి-నోయిరేలో రాజకీయ ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉండటంతో యులౌఫు రాజధానిని బ్రజ్వావిల్లేకు తరలించారు.

స్వతంత్రం తరువాత

మార్చు
 
Alphonse Massamba-Débat's one-party rule (1963–1968) attempted to implement a political economic strategy of "scientific socialism"

1960 ఆగస్టు 15 న " గణతంత్రం ఆఫ్ కాంగో " ఫ్రాన్సు నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందింది. దేశానికి మొదటి అధ్యక్షుడుగా యూలౌ నియమించబడ్డాడు. కార్మిక అంశాలు, రాజకీయ ప్రత్యర్థుల కారణంగా 3 రోజుల తిరుగుబాటు తరువాత ఆయన అధ్యక్షపదవి నుండి తొలగించబడ్డాడు.[10] స్వల్పకాలం కాంగో క్లుప్తంగా దేశం బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆల్ఫోన్స్ మస్సాబా-డెబాట్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

1963 రాజ్యాంగం ఆధ్వర్యంలో మస్సాబా-డెబాట్ 5 సంవత్సరాల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[1] మస్సంబా-డెబాట్ పదవీకాలంలో "శాస్త్రీయ సామ్యవాదాన్ని" దేశం రాజ్యాంగ సిద్ధాంతంగా అవలంబించింది.[11] 1965 లో కాంగో సోవియట్ యూనియన్, పీపుల్స్ గణతంత్రం ఆఫ్ చైనా, ఉత్తర కొరియా, ఉత్తర వియత్నాంతో సంబంధాలను ఏర్పరచింది.[11] మస్సంబ-డెబాట్ పాలనలో ఆయన పార్టీ మిలటరీ విభాగానికి శిక్షణ ఇవ్వడానికి అనేక వందల క్యూబన్ సైనిక దళాలను దేశంలోకి ఆహ్వానించింది. 1966 లో మారియన్ న్యావాబికి నాయకత్వంలో జరిగిన తిరుగుబాటును అణచడానికి ఈ దళాలు సహకరించాయి. ఏదేమైనా, దేశంలోని వివిధ సంస్థాగత, గిరిజన, సైద్ధాంతిక విభాగాలను మసాబా-డెబాట్ మధ్య సయోధ్యను పునరుద్దరించలేకపోయాడు.[11] 1968 సెప్టెంబరులో ఆయన పాలన హింసరహిత తిరుగుబాటుతో ముగిసింది.

 
Marien Ngouabi changed the country's name to the People's Republic of the Congo, declaring it to be Africa's first Marxist–Leninist state. He was assassinated in 1977.

1968 డిసెంబరు 31 న గౌబి (తిరుగుబాటులో పాల్గొన్నాడు) అధ్యక్షుడిగా బాధ్యత వహించాడు. ఒక సంవత్సరం తరువాత కాంగో ఆఫ్రికా మొట్టమొదటి ప్రజల గణతంత్రంకుగా " కాంగో పీపుల్స్ గణతంత్రంకు "ను ప్రకటించాడు. జాతీయ విప్లవ ఉద్యమం పేరును " కాంగో లేబరు పార్టీ "గా మార్చుతానని ప్రకటించాడు. 1972 లో ప్రయత్నం చేసిన తిరుగుబాటులో జరిగిన హత్యాప్రయత్నం నుండి తప్పించుకున్నప్పటికీ కానీ 1977 మార్చి 16 న హత్యకు గురయ్యాడు. 11 సభ్యుల మిలిటరీ కమిటీ ఆఫ్ ది పార్టీ ఒక తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. జోషిమ్ యోమ్బి-ఒపాంగోను గణతంత్రం అధ్యక్షుడిగా నియమించింది. రెండు సంవత్సరాల తరువాత యోమ్బి-ఒపాంగో అధికారం నుండి బలవంతంగా తొలగించబడి డెనిస్ సాస్సా న్గుసెసో కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[1]

సస్సూ న్గుసెసో ఈ దేశాన్ని తూర్పు బ్లాక్ తో కలిపి సోవియట్ యూనియనుతో ఇరవై సంవత్సరాల స్నేహపూర్వక ఒప్పందంపై సంతకం చేశాడు. సంవత్సరాలు గడిచిన తరువాత సాస్యు తన రాజకీయ అణివేతను ప్రదర్శించి తన నియంతృత్వాన్ని కాపాడటానికి తక్కువ కృషిచేసాడు.[12]

బహుళ పార్టీ ప్రజాస్వామ్య సమయములో కాంగో మొట్టమొదటి ఎన్నికైన ప్రెసిడెంటు (1992-1997) గా పదవీబాధ్యత వహించిన పాస్కల్ లిసాయుబా ఆర్థిక సంస్కరణలను అమలు చేసి స్వేచ్ఛాయుత ఆర్ధివిధానాన్ని ప్రవేశపెట్టడానికి చేయటానికి ప్రయత్నించారు. 1997 మధ్యకాలంలో కాంగోలో పౌర యుద్ధం సంభవించినప్పుడు పునరుద్ధరించబడిన వార్షిక ఒప్పందం ప్రకటించాడానికి ప్రయత్నించింది.[13]

1997 లో అధికారం కొరకు లిస్సాబా, సాస్యు పౌర యుద్ధంలో పోరాడటానికి ప్రారంభించినప్పుడు కాంగో ప్రజాస్వామ్య పురోగతి దారి తప్పింది. 1997 జూలైలో ప్రణాళిక చేయబడిన అధ్యక్ష ఎన్నికలు లిసౌబా, సాస్సా క్యాంపుల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. 5 జూను మాసంలో అధ్యక్షుడు లిసావుబా ప్రభుత్వ దళాలు బ్రాసావిల్లెలో సాస్యు సమ్మేళనాన్ని చుట్టుముట్టాయి. సాస్యు తన ప్రత్యేక సైన్యం సభ్యులను ("కోబ్రాస్" అని పిలుస్తారు) ప్రతిఘటించమని ఆజ్ఞాపించాడు. అలా ప్రారంభం అయిన సంఘర్షణలు 4 మాసాలు కొనసాగాయి. కలహాల కారణంగా బ్రజ్జావిల్లే చాలా నాశనం కావడం దెబ్బతినడం జరిగాయి. అల్లర్లలో వేలాది పౌర మరణాలు సంభవించాయి. అక్టోబరు ప్రారంభంలో అంగోలాన్ ప్రభుత్వం సాసౌలను అధికారంలో నిలబెట్టడానికి కాంగో మీద దండయాత్రను ప్రారంభించింది. అక్టోబరు మధ్యలో లిస్సాబా ప్రభుత్వం పడిపోయింది. కొంతకాలం తర్వాత సాస్యు తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించాడు.[1]

 
అక్టోబరు 2015 లో బ్రజ్విల్లేలో అనుకూల రాజ్యాంగ సంస్కరణల ర్యాలీ. రాజ్యాంగ వివాదాస్పద సంస్కరణలు తరువాత వివాదాస్పద ఎన్నికలలో ప్రదర్శనలు, హింసలను చూసింది.

2002 లో వివాదాస్పద ఎన్నికలలో సాస్యు దాదాపు 90% ఓట్లు సాధించాడు. ఆయన ప్రధాన ప్రత్యర్థులైన లిసాయుబా, బెర్నార్డు కొలేలాస్లు ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించబడ్డారు. మిగిలిన విశ్వసనీయ ప్రత్యర్థి ఆండ్రే మిలోంగో ఎన్నికలను బహిష్కరించాలని తన మద్దతుదారులకు సలహా ఇచ్చిన తరువాత పోటీ నుండి వైదొలిగాడు.[14] 2002 జనవరిలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆమోదించబడిన ఒక కొత్త రాజ్యాంగం అధ్యక్షుల కొత్త అధికారాలను మంజూరు చేసి తన పదవీకాలాన్ని విస్తరించింది. ఒక నూతన ద్విసభ అసెంబ్లీని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ పరిశీలకులు ఆర్గనైజేషన్ ఆఫ్ ది ప్రెసిడెంటల్ ఎలెక్షన్ అండ్ ది కాంస్టిట్యూషనల్ అబ్జర్వర్ల రిఫరెండం " రెండూ కూడా కాంగోను ఏకపార్టీ ప్రభుత్వంగా గుర్తించాయి.[15] అధ్యక్ష ఎన్నికల తరువాత పాస్టర్ ఎన్టుమి నేతృత్వంలోని ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య పూల్ ప్రాంతంలో తిరిగి పోరాటం ప్రారంభమైంది. 2003 ఏప్రెలులో వివాదం అంతం చేయడానికి శాంతి ఒప్పందం మీద సంతకం చేయబడింది.[16]

2009 జూలైలో సాస్యు అధ్యక్ష ఎన్నికలో కూడా విజయం సాధించాడు.[17] ప్రభుత్వేతర సంస్థ మానవ హక్కుల కాంగో అబ్జర్వేటరీ ఆధారంగా ఈ ఎన్నికలో మోసం, అసమానతలు అతి తక్కువగా ఉన్నాయని గుర్తించింది.[18] 2015 మార్చిలో సస్యూ తన పదవిలో మరికొంత కాలం అధికంగా కొనసాగడానికి అక్టోబరులో ప్రజాభిప్రాయాన్ని అమలు చేయాలని ప్రకటించాడు. అది 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో అతడిని అనుమతించడానికి మార్గం సుగమం చేసింది.

భౌగోళికం

మార్చు
 
Climate diagram for Brazzaville
 
Republic of the Congo map of Köppen climate classification.

కాంగో ఉత్తర-సహారా ఆఫ్రికా పశ్చిమ మధ్య భాగంలో 4 ° - 5 ° ఉత్తర అక్షాంశం, 11 ° - 19 ° తూర్పు రేఖాంశంలో ఉంటుంది. దక్షిణ, తూర్పు సరిహద్దులో కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం ఉంది. పశ్చిమ సరిహద్దులో గాబోన్, ఉత్తర సరిహద్దులో కామెరూన్, మధ్య ఆఫ్రికా గణతంత్రం, నైరుతీ సరిహద్దులో కబిండా ఉన్నాయి. ఇది అట్లాంటిక్ మహాసముద్ర చిన్న తీరం కలిగి ఉంది.

రాజధాని బ్రజ్జావిల్లె, కాంగో నదీ తీరంలో ఉంది. దేశం దక్షిణసరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ గణతంత్రం రాజధాని కిన్షాసా ఉంది.

దేశం నైరుతి ప్రాంతం తీరప్రాంత మైదానం, కౌయిలౌ- నియారీ నదీ ముఖద్వారం ఉంది. దేశ అంతర్భాగం దక్షిణ, ఉత్తర ముఖద్వారాల మధ్య కేంద్ర పీఠభూమి పెరుగుతున్న అడవులు పెరుగుతున్న దోపిడీ ఒత్తిడికి గురౌతూ ఉన్నాయి.[19]

భూమధ్యరేఖ భూమధ్యరేఖలో ఉన్న కారణంగా సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ (61 ° ఫారెంహీట్, 21 ° సెంటీగ్రేడు (70 ° ఫారెంహీటు) మధ్య సగటు ఉష్ణోగ్రతలు 24 ° సెంటీగ్రేడు (75 ° ఫారెంహీట్), రాత్రులు ° ఫారెంహీటు. సరాసరి వార్షిక వర్షపాతం 1,100 మిల్లీమీటర్లు (43 సెంటీమీటర్లు) దక్షిణాన నీయారి లోయలో 2,000 మిల్లీమీటర్లు (79 అం) ఉంటుంది. పొడి సీజన్ జూన్ నుండి ఆగస్టు వరకు ఉంటుంది. దేశంలో ఎక్కువ భాగం తడి సీజన్లో రెండు మార్లు వర్షపాతం ఉంటుంది: ఒకటి మార్చి-మే, సెప్టెంబరు-నవంబరులో మరొకటి ఉంటుంది.[20]

2006-07లో " వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ " లోని పరిశోధకులు సంగ్రో రీజియన్లోని ఓసెసో జిల్లాలో కేంద్రీకృతమైన భారీ అటవీ ప్రాంతాల్లో గొరిల్లాలను అధ్యయనం చేశారు. వారు 1,25,000 పశ్చిమ లోతట్టు గొరిల్లాల క్రమంలో జనాభాను గుర్తించారు. మానవుల నుండి గొరిల్లాల ఏకాంతవాసం అత్యంత అధికంగా సంరక్షించబడుతుంది.[21]

ఆర్ధికం

మార్చు
 
Cassava is an important food crop in the Republic of the Congo.

ఆర్ధికవ్యవస్థ అనేది గ్రామీణ వ్యవసాయం, హస్తకళలు, పెట్రోలియం ఆధారిత పారిశ్రామిక రంగం, [22] సేవలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. బడ్జెట్ సమస్యలు, అవసరానికంటే అధికమైన సిబ్బంధి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నది. అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థానంలో పెట్రోలియం వెలికితీతకు ప్రధాన్యత ఇవ్వబడింది. 2008 లో చమురు రంగం జి.డి.పి.లో 65%, ప్రభుత్వ ఆదాయంలో 85%, ఎగుమతిలో 92%గా ఉంది.[23] దేశంలో బృహత్తర ఖనిజ సంప ఉంది.

1980 వ దశకం ప్రారంభంలో వేగంగా పెరుగుతున్న చమురు ఆదాయాలు ప్రభుత్వం జి.డి.పి. పెరుగుదల సగటున 5% అభివృద్ధితో ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించింది. ఇది ఆఫ్రికాలో అత్యధిక శాతం. ప్రభుత్వం దాని పెట్రోలియం సంపాదనలో గణనీయమైన భాగం ఆదాయంలోటును పూడ్చడానికి దోహదపడింది. 1994 జనవరి 12 న ఫ్రాన్సిస్ జోన్ కరెన్సీల విలువ 50% తగ్గిపోయి 1994 లో ద్రవ్యోల్బణం 46% దారితీసింది. కానీ తరువాత ద్రవ్యోల్బణం సద్దుమణిగింది.

[24]

 
బ్రజోవిల్లె, సూదితో కుట్టడం నేర్చుకునే యంగ్ మహిళలు

అంతర్జాతీయ సంస్ధల మద్దతుతో ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుతో ఆర్థిక సంస్కరణలు కొనసాగాయి. 1997 జూనులో పౌర యుద్ధం విస్ఫోటనం అయిన కారణంగా సంస్కరణ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. 1997 అక్టోబరులో యుద్ధం ముగిసి సాస్యు న్యుయెస్సో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారం పునరుద్ధరించడం పట్ల ఆసక్తి కనబర్చాడు. అయినప్పటికీ 1998 డిసెంబరులో చమురు ధరలు తగ్గడం, సాయుధ పోరాటాల పునః ప్రవేశం ద్వారా ఆర్థిక పురోగతి తీవ్రంగా దెబ్బతిన్నది. ఇది గణతంత్రం బడ్జెట్ లోటును మరింత దిగజార్చింది.

ప్రస్తుత పాలనా యంత్రాంగం ఒక కష్టతరమైన అంతర్గత శాంతికొరకు కృషిచేస్తుంది. 2003 నుండి రికార్డుస్థాయిలో చమురు ధరలు అధికంగా ఉన్నప్పటికీ పేదరికాన్ని తగ్గించడానికి క్లిష్టమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. సహజవాయువు, వజ్రాలు ఇటీవలి కాంగో ఎగుమతులలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. 2004 వ సంవత్సరంలో డైమండ్ ఎగుమతుల్లో అధికభాగం పొరుగున ఉన్న డెమొక్రాటిక్ గణతంత్రం ఆఫ్ కాంగో నుండి అక్రమ రవాణా చేయబడిందని ఆరోపణలు వచ్చాయి.[25][26]

కాంగో గణతంత్రంలో పెద్ద ఎత్తున బేస్ మెటల్, బంగారం, ఇనుము, ఫాస్ఫేట్ నిక్షేపాలు ఉన్నాయి.[27] ఈ దేశం ఆఫ్రికాలో ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనైజేషన్ ఆఫ్ బిజినెస్ లా " లో సభ్యదేశంగా ఉంది.[28] కాంగో ప్రభుత్వం దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 2009 లో దక్షిణ ఆఫ్రికా రైతులకు 2,00,000 హెక్టార్ల భూమిని లీజుకునేందుకు ఒక ఒప్పందంపై సంతకం చేసింది.[29][30]

కాంగో గణతంత్రం జి.డి.పి. 2014 లో 6% అధికరించింది. 2018 లో 5.8%, 2020 lO 1.7% ఉంది.[31][32]

ప్రయాణ సౌకర్యాలు

మార్చు
 
Maya-Maya Airport in Brazzaville.

Transport in the Republic of the Congo includes land, air and water transportation. The country's rail system was built by forced laborers during the 1930s and largely remains in operation. There are also over 1000 km of paved roads and two major international airports (Maya-Maya Airport and Pointe Noire Airport) which have flights to destinations in Europe, Africa, and the Middle East. The country also has a large port on the Atlantic Ocean at Pointe-Noire and others along the Congo River at Brazzaville and Impfondo.

గణాంకాలు

మార్చు

Religion in the Republic of the Congo by Pew Research Center (2011)[33]

  Protestantism (51.4%)
  Catholicism (30.1%)
  Other Christian (4.4%)
  Other religions (14.1%)
Population[34]
Year Million
1950 0.8
2000 3.2
2016 5.1

అల్ప జనసాంధ్రత కలిగిన కాంగో గణతంత్రం దేశంలో ప్రజలు నైరుతి భాగంలో కేంద్రీకృతమై ఉన్నారు. ఉత్తరప్రాంతంలో విస్తారంగా ఉన్న ఉష్ణమండల అరణ్యప్రాంతాలను జనావాసాలు లేకుండా నిర్జనంగా వదిలివేయబడుతున్నాయి. అందువల్ల ఆఫ్రికాలో అధికంగా పట్టణీకరణ చెందిన దేశాలలో కాంగో ఒకటిగా ఉంది. 70% జనాభా బ్రజ్జావిల్లే, పాయింటే-నోయిరే మొదలైన పట్టణప్రాంతాలలోనూ 534 కిలోమీటర్ల (532 కిలోమీటర్లు) ) పొడవుగా ఉండి రెండు ప్రధాన నగరాలను కలుపుతున్న రైలుమార్గం వెంట ఉన్న గ్రామాలు, చిన్న పట్టణాలలో ఉంది. ఇటీవల సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో, పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు వేగంగా క్షీణించాయి. ఆర్థిక మద్దతు, జీవనోపాధి కోసం ప్రజలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను వదిలి ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారు.[35]

సాంప్రదాయికంగా, భాషాపరంగా కాంగో గణతంత్రం జనాభా వైవిధ్యంగా ఉంది.-దేశంలో 62 మాట్లాడే భాషలు వాడుకలో ఉన్నాయి.[36] ప్రజలు జాతిపరంగా మూడు వర్గాలుగా విభజించబడ్డాయి. కాంగో అతిపెద్ద జాతి సమూహంగా ఉంది. వీరు జనాభాలో దాదాపు సగం మంది ఉన్నారు. కాంగో అతి ముఖ్యమైన ఉపవిభాగాలు బ్రజోవిల్లె, పూలు ప్రాంతాలలో లారి, పాయయ్-నోయూర్ పరిసరాలలో ఉన్న విల్లీ అట్లాంటిక్ తీరప్రాంతానికి చెందినవి. రెండవ అతిపెద్ద సమూహం టీక్ బ్రజ్వావిల్లేకు ఉత్తరం వైపు జనాభాలో 17% మంది నివసిస్తున్నారు. 12% బోలాంగు ప్రజలు వాయువ్య బ్రజ్జావిల్లెలో నివసిస్తున్నారు.[37][38] కాంగో జనాభాలో 2% మంది పిగ్మీలు ఉన్నారు.[39]

1997 యుద్ధానికి ముందు కాంగోలో సుమారు 9,000 మంది యూరోపియన్లు, ఇతర ఆఫ్రికన్లు కాంగోలో నివసించారు. వీరిలో ఎక్కువమంది ఫ్రెంచిప్రజలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రజలలో కొంత భాగం మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది.[35] కాంగోలో సుమారు 300 మంది అమెరికన్ బహిష్కృతులు నివసిస్తున్నారు.[35]

సి.ఐ.ఎ. వరల్డ్ ఫాక్ట్ బుక్ ఆధారంగా కాంగో గణతంత్రం ప్రజలలో ఎక్కువగా కాథలిక్లు (33.1%), అవేకెనింగ్ లూథరన్లు (22.3%), ఇతర ప్రొటెస్టంట్లు (19.9%) ఉన్నారు. ఇస్లాం అనుచరులు 1.6% ఉన్నారు. ఇది ప్రధానంగా పట్టణ కేంద్రాలలో విదేశీ కార్మికుల ప్రవాహం కారణంగా ఏర్పడ్డారు.[40]

2011-12 సర్వే ప్రకారం మొత్తం గర్భధారణ రేటు స్త్రీకి 5.1 పిల్లలు, పట్టణ ప్రాంతాల్లో 4.5 గ్రామీణ ప్రాంతాల్లో 6.5.[41]

నగరం విభాగం జనసంఖ్య
బ్రాజ్జావిల్లే బ్రాజ్జావిల్లే 1,373,382
పాయింటే- నొయిరే పాయింటే- నొయిరే 715,334
డోలిసీ నియరీ 83,798
కయీ బౌయెంజా 71,620
ఇంప్ఫొండో లికౌలా 33,911
క్యూస్సో సంఘా 28,179
మదింగౌ బౌయెంజా 25,713
ఒవాండో కువెట్టే 24,736
సిబిటి లెకొమౌ 22,951
లౌట్టే బౌయెంజా 19,212

ఆరోగ్యం

మార్చు

2004 లో ఆరోగ్యరక్షణ కొరకు ప్రభుత్వ జి.డి.పి.లో 8.9% వ్యయం చేయగా ప్రైవేట్ వ్యయం 1.3% ఉంది.[42] 2012 నాటికి ఎయిడ్సు ప్రాబల్యం అధికంగా ఉంది. 15 నుండి 49 సంవత్సరాల వయస్కులలో 2.8% ఉంది.[40] 2004 లో ఆరోగ్యరక్షణ వ్యయం తలసరి US $ 30 డాలర్లు ఉంది.[42] జనాభాలో పోషకాహారలోపం అధికంగా ఉంది. [42] కాంగో-బ్రజ్జావిల్లెలో పోషకాహార లోపం సమస్యగా ఉంది.[43] 2000 ల ప్రారంభంలో (దశాబ్దంలో) 1,00,000 మందికి 20 వైద్యులు ఉన్నారు.[42]

2010 నాటికి జననకాలంలో శిశు మరణాల రేటు 560 మరణాలు / 100,000 ఉంది. శిశు మరణాల రేటు 59.34 మరణాలు / 1,000 ఉంది. [40] స్త్రీల పోషకాహార లోపం అరుదుగా ఉంది.[44]

సంస్కృతి

మార్చు

కొంగోల సంస్కృతిని వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్తర నియోరి వరదప్రాంతంలో కాంగో నది వరకు విస్తరించి ఉన్న సవన్నా అడవులు, కఠినమైన పర్వతాలు, మాయోంబు వరకు విస్తరించి ఉన్న అటవీప్రాంతం, 170 కి.మీ. అట్లాంటిక్ తీరం ప్రభావితం చేస్తున్నాయి. అనేక జాతుల సమూహాలు, వివిధ రాజకీయ నిర్మాణాల ఉనికి (కొంగో సామ్రాజ్యం, లోగాం రాజ్యం తేకే, ఉత్తర నాయకత్వాల సామ్రాజ్యం) సాంప్రదాయిక సంస్కృతులలో అలాగే అనేక పురాతన కళాత్మక వ్యక్తీకరణలతో వైవిధ్యాన్ని అందిస్తున్నాయి. కాంగోలో విలి నెయిల్ ఫెషెస్, బొండే విగ్రహాలు (చాలా చిన్నవి అయినప్పటికీ కళాత్మకతను ప్రతిబింబిస్తుంటాయి), పునూ, కువెల్ వింత ముసుగులు, విలాసవంతమైన కనాబాలు, టెకే ఫెషీస్, ఆసక్తికరమైన శ్మశానవాటికలు, స్మారక సమాధులు, లారీ దేశం వంటి ప్రత్యేక అంశాలు ఉన్నాయి. కాంగోలో గణనీయమైన వలసరాజ్యాల నిర్మాణ వారసత్వం కూడా ఉంది. ఈ రోజు వారు దీనిని వారి పూర్వీకుల వారసత్వంలో భాగంగా వారి పర్యాటక రాజధానిగా భావిస్తున్నారు. ఈ కళాకృతులను కనీసం బ్రజ్జీవిల్లెలో పునరుద్ధరించడానికి వారు అధికంగా కృషి చేస్తున్నారు.

కాంగోలో పర్యాటకం చాలా తక్కువ ఉంది. పోయిన్-నోయిరే, బ్రజ్జావిల్లే నుండి రాకపోకల సౌకర్యాలు తగినంతగా లేవు. స్థిరమైన సమాచార నెట్వర్కు లేదు. అనేక పర్యాటక ప్రాంతాలు సందర్శించడాని వీలు లేనంత సౌకత్యరహితంగా ఉంటాయి. విరుద్దంగా దక్షిణ ప్రాంతంలో అధిక జనాభా కలిగిన, అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కొన్ని కొంతవరకు సందర్శించడానికి అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు భారీ చైలు పర్వతాలు సందర్శించడానికి దాదాపు అసాధ్యంగా ఉంటుంది.

అనేక మంది కాంగో గాయకులు దేశానికి సుదూరప్రాంతాలకి చేరుకున్నారు: ఫ్రాంకో-కోంగోలిస్ రాపర్ పాసీ ఫ్రాంసులో పనిచేసిన "టాంప్టేషన్స్" వంటి అనేక ఆల్బంలు విజయవంతంగా విక్రయించబడ్డాయి

కాంగో రచయితలు గణతంత్రం ఆఫ్రికా, ఫ్రెంచి మాట్లాడే ప్రపంచంలో గుర్తింపును పొందారు. వీరిలో అలైన్ మబన్కేయు, జీన్-బాప్టిస్ట్ తటి లౌటర్డు, జెన్నాట్ బాల్యు టిచెల్లే, హెన్రీ లోప్సు, లస్సీ మౌబౌటీ, టిచికాయ యు టమ్సీ ప్రాముఖ్యత కలిగిన వారు ఉన్నారు.

సినిమాలు వంటి ఇతర కళా ప్రక్రియలు తరచుగా పురోగతి సాధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 1970 తరువాత సమస్యాత్మక రాజకీయ పరిస్థితి, సినిమా ఉత్పత్తి కష్టమై చిత్రపరిశ్రమ మూసివేత స్థాయికి చేరుకుంది. వార్షికంగా చిత్రనిర్మాతలు ఎవ్వరూ చలనచిత్రం తయారు చేయకపోయినా నిర్మాతలు వారి వీడియో చిత్రాలను నేరుగా ప్రసారం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు కాంగో సంస్కృతి, కళ, మీడియా పెట్టుబడుల కొరత కారణంగా అసంపూర్ణంగా నిలిచింది.

విద్య

మార్చు
 
School children in the classroom, Republic of the Congo

1991 కంటే విద్యాభివృద్ధి కొరకు ప్రభుత్వ వ్యయం 2002-05 లో తక్కువగా ఉంది.[42] 16 సంవత్సరాల వయస్సు వరకు నిర్భంధ విద్య ఉచితం.[45] కానీ ఆచరణలో ఖర్చులు ఉన్నాయి.[45] 2005 లో నికర ప్రాథమిక నమోదు రేటు 44%, 1991 లో 79% కంటే తక్కువగా ఉంది.[42] ఆరు నుంచి పదహారుల మధ్య విద్య తప్పనిసరి. ఆరు సంవత్సరాల ప్రాథమిక పాఠశాల పూర్తి తరువాత విద్యార్థులు ఒక బాకలారియాట్ పొందటానికి ఏడు సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేయాలి.

దేశంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బ్యాచులరు డిగ్రీని మూడు సంవత్సరాలలో పొందగలరు. తరువాత 4 సంవత్సరాల అధ్యయనం చేసి మాస్టరు డిగ్రీ పొందవచ్చు. దేశంలోని ఏకైక ప్రభుత్వ విశ్వవిద్యాలయం మెరీన్ న్గౌబిబి విశ్వవిద్యాలయం-వైద్య, న్యాయ ఇతర రంగాలలో కోర్సులను అందిస్తుంది.

విద్యాబోధన అన్ని స్థాయిలలో ఫ్రెంచిభాషలో బోధించబడుతుంది. విద్యా వ్యవస్థ మొత్తం ఫ్రెంచి వ్యవస్థగా చెప్పవచ్చు.

ప్రభుత్వము,రాజకీయాలు

మార్చు

కాంగో గణతంత్రం అధికారికంగా ప్రజాస్వామ్య దేశాల సరసన చేరుతుంది.డెన్నిస్ సస్సౌ ఎన్గ్యూస్సో చేత పరిపాలింపబడుతోంది.అంతర్జాతీయంగా సస్సౌ సామ్యవాద పరిపాలన అవినీతిమయంగా తయారయింది.వాటిని బయటకు పొక్కకుండా చేసినా ఒక ఫ్రెంచి పరిశోధన అతనికి ఫ్రాన్సులో ఉన్న 110 బ్యాంకు ఖాతాలు, విలాసవంతమైన ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నది.ఈ పరిశోధనలన్నిటినీ సస్సౌ జాత్యహంకార, వలసవాద ధోరణులుగా కొట్టిపారేశాడు.

మానవ హక్కులు

మార్చు

2008 లెక్కల ప్రకారం మీడియాలో ఎక్కువశాతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది.అక్కడ ఒక ప్రభుత్వ దూరదర్శని,3 ప్రభుత్వ రేడియో కేంద్రాలు,3 ప్రభుత్వ తరఫున ఉన్న ప్రైవేటు రేడియో కేంద్రాలు,, ఒక ప్రభుత్వ వార్తా పత్రిక ఉన్నాయి. ఎక్కువ మంది పిగ్మీ జాతీయులు, బంటూ మాస్టర్ల దగ్గర బానిసలుగా ఉన్నారు.దేశం మొత్తం ఈ రెండు జాతుల మధ్యనే అమరి ఉంది.పిగ్మీ బానిసలు వారి పుట్టుక నుంచి వారి బంటు అధిపతులకి సొంతం.దానిని వారు వారి అచారంగా వ్యవహరిస్తారు. పిగ్మీ జాతీయులే వేటకి, చేపలుపట్టటానికి, అడవిగ్రామాలలో పనికి బాధ్యులు.పిగ్మిలు, బంటూలు ఒకేలాగా పిగ్మీలు అధిపతుల దయాధర్మాలపై బతుకుతారు అంటారు.వారి పనికి వారికి ఒక్కొక్క సారి సిగిరెట్లు, వాడేసిన దుస్తులు ఇస్తారు.ఒక్కోసారి అవికూడా ఇవ్వరు.ఇప్పుడిప్పుడే యునిసెఫ్, మానవహక్కుల కార్యకర్తలు వీటి గురించి మాట్లాడుతున్నారు.పిగ్మీ జాతీయుల రక్షణకై ఒక చట్టం కాంగో పార్లమెంటులో వోటింగుకై ఎదురుచూస్తొంది.

ప్రాంతాలు

మార్చు

ముఖ్య వ్యాసం: గణతంత్రం ఆఫ్ కాంగో లోని శాఖలు, గణతంత్రం ఆఫ్ కాంగో లోని మండలాలు,, గణతంత్రం ఆఫ్ కాంగో లోని జిల్లాలు

గణతంత్రం ఆఫ్ కాంగో 12 ప్రాంతాలుగా విభజించబడింది. ఈ ప్రాంతాలు మండలాలు లేదా జిల్లాలుగా విభజించబడ్డాయి. అవి:

బొయెంజా, కవెట్టె

కవెట్టె-ఒయెస్ట్, కోయిలావ్

లెకౌమౌ, బ్రజ్జావిల్లె

లికౌఅలా, నియారి

ప్లేటెయాక్స్, పూల్

సంఘ, పాయింట్ నొయిరె

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Background Note: Republic of the Congo". Department of State. March 2009.
  2. 2.0 2.1 2.2 Olson, James S. & Shadle, Robert. Historical Dictionary of European Imperialism, p. 225. Greenwood Publishing Group, 1991. ISBN 0-313-26257-8. Accessed 9 October 2011.
  3. Boxer, C. R. The Portuguese Seaborne Empire, 1415–1825, A. A. Knopf, 1969, ISBN 0090979400
  4. "BBC NEWS – Africa – The man who would be Congo's king".
  5. United States State Department. Office of the Historian. A Guide to the United States' History of Recognition, Diplomatic, and Consular Relations, by Country, since 1776. "Republic of the Congo". Accessed 9 October 2010.
  6. United States State Department. Bureau of African Affairs. Background Notes. "Republic of the Congo". Accessed 9 October 2011.
  7. Robbers, Gerhard (2007). Encyclopedia of World Constitutions. Infobase Publishing. ISBN 0-8160-6078-9. Accessed 9 October 2011.
  8. CONGO REPUBLIC: BRAZZAVILLE RIOTS AFTERMATH. Reuters (27 February 1959)
  9. "Fulbert Youlou facts, information, pictures – Encyclopedia.com articles about Fulbert Youlou".
  10. Alain Mabanckou "The Lights of Pointe-Noire" ISBN 978-1620971901. 2013. p.175
  11. 11.0 11.1 11.2 Shillington, Kevin (2005). Encyclopedia of African history. CRC Press. p. 301. ISBN 1579582451.
  12. Shillington, Kevin (2005). Encyclopedia of African history. CRC Press. p. 302. ISBN 1579582451.
  13. Country Report Congo-Brazzaville. The Economist Intelligence Unit. 2003. p. 24.
  14. "Congo, Republic of". Freedom House. 2006. Archived from the original on 15 అక్టోబరు 2009. Retrieved 12 June 2009.
  15. "Congo approves new constitution". BBC. 24 January 2002. Retrieved 12 June 2009.
  16. "Congo peace deal signed". BBC. 18 March 2003. Retrieved 15 June 2009.
  17. "17 candidates in Congo presidential race: commission". AFP. 13 June 2009. Retrieved 15 June 2009.
  18. Vote results expected as opposition alleges fraud Archived 27 జూలై 2009 at the Wayback Machine. France24 (16 July 2009).
  19. Map: Situation de l'exploitation forestière en République du Congo. (PDF) . Retrieved on 25 February 2013.
  20. Samba G.; Nganga D.; Mpounza M. (2008). "Rainfall and temperature variations over Congo-Brazzaville between 1950 and 1998". Theoretical and Applied Climatology. 91 (1–4): 85–97. doi:10.1007/s00704-007-0298-0. Retrieved 11 June 2008.[permanent dead link]
  21. "'Mother Lode' Of Gorillas Found In Congo Forests : NPR". Retrieved 15 August 2008.
  22. "Congo-Brazzaville". Energy Information Administration, U.S. Government. Archived from the original on 23 మార్చి 2008. Retrieved 11 డిసెంబరు 2018.
  23. Republic of the Congo Archived 2009-05-04 at the Wayback Machine World Bank
  24. "Congo, Republic of". EconStats. Archived from the original on 28 ఏప్రిల్ 2009. Retrieved 11 June 2009.
  25. "Kimberley Process Removes the Republic of Congo from the List of Participants". Kimberley Process. 9 July 2004. Archived from the original on 10 మే 2009. Retrieved 11 డిసెంబరు 2018.
  26. "2007 Kimberley Process Communiqué". Kimberley Process. 8 November 2007. Archived from the original on 4 మార్చి 2008. Retrieved 11 డిసెంబరు 2018.
  27. "Mining in Congo". MBendi. Archived from the original on 27 డిసెంబరు 2016. Retrieved 14 జూన్ 2009.
  28. "OHADA.com: The business law portal in Africa". Retrieved 22 March 2009.
  29. Goodspeed, Peter (21 October 2009) "South Africa's white farmers prepare to trek to the Congo". Archived from the original on 18 February 2011. Retrieved 10 September 2016.. National Post.
  30. Congo hands land to South African farmers. Telegraph. 21 October 2009.
  31. "Republic of the Congo GDP Annual Growth Rate". Trading Economics. Archived from the original on 2023-01-10. Retrieved 2023-01-10.
  32. "Republic of the Congo GDP and Economic Data". Global Finance. Retrieved 14 January 2016.
  33. "Table: Christian Population as Percentages of Total Population by Country". Pew Research Center's Religion & Public Life Project. 19 December 2011. Archived from the original on 11 మే 2017. Retrieved 11 డిసెంబరు 2018.
  34. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  35. 35.0 35.1 35.2 Background Note: Republic of the Congo United States Department of State. Accessed on 21 August 2008.
  36. "Languages of Congo". SIL International. Retrieved 13 June 2009.
  37. Levinson, David (1998). Ethnic groups worldwide. Greenwood Publishing Group. pp. 120–121. ISBN 978-1-57356-019-1.
  38. "Congo Overview". Minority Rights Group International. Retrieved 13 June 2009.
  39. "Les pygmées du Congo en "danger d'extinction"". Le Monde. 5 August 2011. Retrieved 5 November 2017.
  40. 40.0 40.1 40.2 "Congo, Republic of the". CIA – The World Factbook. Archived from the original on 9 January 2021. Retrieved 30 May 2007.
  41. Congo. Enquête Démographique et de Santé 2011–2012. Centre National de la Statistique et des Études Économiques (CNSEE), Brazzaville. December 2012
  42. 42.0 42.1 42.2 42.3 42.4 42.5 "Human Development Report 2009". Archived from the original on 17 జనవరి 2010. Retrieved 24 జూన్ 2014.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link). undp.org
  43. "IRIN Africa – CONGO: Grappling with malnutrition and post-conflict woes – Congo – Food Security – Health & Nutrition". IRINnews. Retrieved 23 January 2015.
  44. "CONGO (BRAZZAVILLE): UNFPA Leads Fight Against FGM " UNFPA in the News". Archived from the original on 29 నవంబరు 2014. Retrieved 11 డిసెంబరు 2018.
  45. 45.0 45.1 Refworld | 2008 Findings on the Worst Forms of Child Labor – Congo, Republic of the Archived 10 మే 2011 at the Wayback Machine. UNHCR. Retrieved on 25 February 2013.