ఫ్రెంచి భాష

ఒక ప్రపంచ భాష
(French language నుండి దారిమార్పు చెందింది)

ఫ్రెంచి భాష ప్రపంచ వ్యాప్తంగా 11.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. రోమన్ సామ్రాజ్యం నాటి లాటిన్ భాష నుండి ఉద్భవించిన పలు భాషలలో ఫ్రెంచ్ లేదా ఫ్రెంచి భాష ఒకటి. ఫ్రాన్స్ దేశస్థుల మాతృభాష అయిన ఈ భాష 54 పై బడి దేశాలలో వాడుకలో ఉన్నప్పటికీ, ఫ్రాన్స్ బయట కెనడా, బెల్జియం, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, మొనాకో, ఆఫ్రికాలోని కొన్ని భాగాలలో బాగా వ్యాప్తి చెందింది.

ఫ్రెంచి
Français
మాట్లాడే దేశాలు: క్రింది ప్రపంచ పటములో చూపబడినది 
ప్రాంతం: ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియాలో భాగాలు
మాట్లాడేవారి సంఖ్య: 17.5 కోట్ల మంది
భాషా కుటుంబము:
 ఫ్రెంచి
భాషా సంజ్ఞలు
ISO 639-1: fr
ISO 639-2: fre (B)  fra (T)
ISO 639-3: fra 
Map-Francophone World.svg
ఫ్రెంచి భాష మాట్లాడు ప్రదేశాల చిత్రపటము.

Information:

  ఫ్రెంచి ఏకైక భాషగా గుర్తించబడినది.
  ఫ్రెంచి అధికార భాషగా గుర్తించబడినది లేక జనబాహుళ్యంలో ప్రచారమై ఉన్నది.
  ఫ్రెంచి సాంస్కృతిక భాషగా గుర్తించబడినది.
  ఫ్రెంచి అల్పసంఖ్యాక భాషగా గుర్తించబడినది

ఫ్రెంచి భాష 29 దేశాలలో అధికార భాష. అంతే కాక, ఈ భాష ఐక్య రాజ్య సమితిలోని అంగాలకు అధికార భాష. ఐరోపా సమాఖ్య లెక్కల ప్రకారం 27 సభ్యదేశాలలో 12.9 కోట్ల మంది (26%) ఈ భాష మాట్లాడుతుండగా, వీరిలో 5.9 కోట్ల మందికి (12%) ఇది మాతృభాష కాగా మిగిలిన 7 కోట్ల మందికి (14%) ఇది రెండవ భాష - తద్వారా ఫ్రెంచి భాష ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో ఆంగ్ల భాష, జర్మన్ భాషల తర్వాత మూడవ స్థానంలో ఉంది.

నాటక రచయితలుసవరించు

  1. అయనెస్కో యూజీన్

సినిమాలుసవరించు

  1. డే ఫర్ నైట్
  2. వాటెల్[1]
  3. ది లైఫ్ ఇన్ రోజ్
  4. మనోన్ అఫ్ ది స్ప్రింగ్
  5. ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్
  6. వెల్కమ్ టు ది స్టిక్స్
  7. అమేలి
  8. సంసార

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, పుట 15 (19 July 2018). "నగర ముంగిట్లో గ్లోబల్ సినిమా". Archived from the original on 30 July 2018. Retrieved 31 July 2018.