గంగారత్నం ప్రముఖ రంగస్థల, సినిమా నటీమణి. ఈమె గయ్యాళి మహిళ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించింది.

జవ్వాది గంగారత్నం
జననంగంగారత్నం
1893
గంగలకుర్రు అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా India
మరణం2001 సెప్టెంబరు
ఈదూరు
వృత్తిరంగస్థల నటి , చలనచిత్ర నటి
మతంహిందూ మతం
భార్య / భర్తజవ్వాది వెంకటరత్నం
పిల్లలుఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
రైతుబిడ్డ సినిమాలో గంగారత్నం, వేదాంతం రాఘవయ్య, సుందరమ్మ

జీవిత విశేషాలు మార్చు

ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో 1893లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, గంగలకుర్రు గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే ఈమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. ఈమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె భర్త మరణించాడు. ఫలితంగా ఈమె జీవనోపాధి కోసం 17 సంవత్సరాల పిన్నవయసులోనే నాటకాలలో వేషం వేయడం ప్రారంభించింది. 1936లో సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తొంభై సంవత్సరాల వయసు వరకు నటజీవితాన్ని కొనసాగించింది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె చివరి దశలో పేదరికాన్ని అనుభవిస్తూ 2001లో తన 108వ యేట మరణించింది.[1]

నాటకరంగం మార్చు

జీవనోపాధి కోసం అతి పిన్నవయసులోనే నాటకాలు వేయడం ప్రారంభించిన గంగారత్నం ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకంలో కలహకంఠిగా, చింతామణి నాటకంలో శ్రీహరిగా పాత్రలు ధరించింది. చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర పోషించాలంటే ఒక్క గంగారత్నమే దానికి సమర్థురాలనే పేరు గడించింది. విద్యుత్ దీపాలు లేని ఆ రోజుల్లో, దివిటీల వెలుగులో దీపాల కాంతిలో నాటక ప్రదర్శనలు నిర్వహించే రోజులలో కూడా ఈమె అధ్భుతంగా నటించి పేరు సంపాదించుకుంది. ఆ రోజుల్లో రంగస్థలంపై ఉద్దండులైన యడవల్లి సూర్యనారాయణ, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నరసింహారావు, ఉప్పులూరి సంజీవరావు, నెల్లూరు నాగరాజు మొదలైనవారితో నటించింది. ఈమె 1936- 1985 మధ్యకాలంలో సినిమాలలో నటించింది. సినిమాలలో నటించడం మానివేసిన తరువాత మళ్ళీ నాటకరంగంలో పునఃప్రవేశం చేసి సుమారు 20 సంవత్సరాలు అనేక పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించింది.

సినిమా రంగం మార్చు

ఈమె క్రమంగా నాటకాల నుండి చలనచిత్ర రంగంలోనికి ప్రవేశించింది. కాకినాడకు చెందిన కొమ్మారెడ్డి నాగేశ్వరరావు 1936లో నిర్మించిన ప్రేమవిజయం అనే సాంఘిక చలనచిత్రంలో తొలిసారిగా నటించింది. తరువాత ఈమె అనేక ప్రఖ్యాత చలన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ఈమె నటించిన చివరి చిత్రం శ్రీవారి శోభనం. ఈమె గయ్యాళి పాత్రలను అతి సహజంగా పోషించి మంచి పేరు సంపాదించుకున్నది. ఈమె పోషించిన గయ్యాళి పాత్రలు తరువాతి తరం నటి సూర్యకాంతానికి ఆదర్శ ప్రాయం అయ్యాయి.

నటించిన చిత్రాలు మార్చు

మూలాలు మార్చు

  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2012). విశ్వబ్రాహ్మణ సర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 79–80.