గద్వాల్ శాసనసభ నియోజకవర్గం

(గద్వాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి దారిమార్పు చెందింది)

జోగులాంబ గద్వాల జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి

గద్వాల
—  శాసనసభ నియోజకవర్గం  —
గద్వాల is located in Telangana
గద్వాల
గద్వాల
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు డి. కె. అరుణ
గద్వాలలోని పశువైద్యశాల

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ ఫలితంగా ఇంతకు క్రితం ఈ నియోజకవర్గంలో కొనసాగిన అయిజ మండలం ఆలంపూర్ నియోజకవర్గానికి తరలించబడింది. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రేస్, కాంగ్రెస్ (ఐ) లు ఐదుసార్లు, తెలుగుదేశం, జనతా పార్టీలు ఒక్కోసారి గెలుపొందగా, మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అభ్యర్థుల వారీగా చూస్తే డి.కె.సమరసింహారెడ్డి అత్యధికంగా 4 సార్లు విజయం సాధించాడు. అతడి తండ్రి డి.కె.సత్యారెడ్డి రెండు సార్లు గెలుపొందినాడు.[1]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు సవరించు

నియోజకవర్గపు గణాంకాలు సవరించు

 • జనాభా (2001) లెక్కల ప్రకారము: 2,56,542.
 • ఓటర్ల సంఖ్య (ఆగష్టు 2008 నాటికి): 2,17,036.[2]
 • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.51%, 2.37%

నియోజక వర్గ భౌగోళిక సమాచారం సవరించు

కృష్ణా, తుంగభద్రనదుల మధ్యమహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డ ప్రాంతంగా పేరుపొందిన ప్రాంతంలో ఉన్న గద్వాల నియోజకవర్గానికి పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఉత్తరాన మక్తల్ నియోజకవర్గం ఉండగా, దక్షిణాన ఆలంపూర్ నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. తూర్పున కొద్ది భాగం కొల్లాపూర్ నియోజకవర్గం సరిహద్దుగా ఉన్న ఈ నియోజకవర్గం గుండా హైదరాబాదు - కర్నూలు రైల్వే మార్గం వెళ్తున్నది.

ఎన్నికైన శాసనసభ్యులు సవరించు

ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి డి.కె.అరుణ శాసనసభ్యురాలిగా కొనసాగుతున్నది.

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1957 డి.కె.సత్యారెడ్డి స్వతంత్ర అభ్యర్థి పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1962 కె.రాంభూపాల్ భారత జాతీయ కాంగ్రెస్ ఏకగ్రీవ ఎన్నిక -
1967 గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి డి.కె.సత్యారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1972 పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ డి.కె.సత్యారెడ్డి ఎస్.టి.పి.ఎస్[3]
1978 డి.కె.సత్యారెడ్డి జనతా పార్టీ పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1980 ఉపఎన్నిక డి.కె.సమర సింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ (యు)
1983 డి.కె.సమర సింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పాగ పుల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 డి.కె.సమర సింహారెడ్డి[4] భారత జాతీయ కాంగ్రెస్ ఎన్.గోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 డి.కె.సమర సింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ వెంకటరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 డి.కె.సమర సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థి డి.కె.సమరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1999 గట్టు భీముడు తెలుగుదేశం పార్టీ డి.కె.అరుణ భారత జాతీయ కాంగ్రెస్
2004 డి. కె. అరుణ సమాజ్‌వాదీ పార్టీ గట్టు భీముడు తెలుగుదేశం పార్టీ
2009 డి. కె. అరుణ కాంగ్రెస్ పార్టీ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 డి. కె. అరుణ కాంగ్రెస్ పార్టీ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2018 డి. కె. అరుణ కాంగ్రెస్ పార్టీ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి

1999 ఎన్నికలు సవరించు

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టు భీముడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె.అరుణపై 4546 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. గట్టు భీముడు 47807 ఓట్లు పొందగా, అరుణకు 43261 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీచేశారు.

2004 ఎన్నికలు సవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన డి.కె.అరుణ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గట్టు భీముడుపై 38686 ఓట్ల మెజారిటీ సాధించింది. అరుణకు 80676 ఓట్లు లభించగా, గట్టు భీముడుకు 41990 ఓట్లు వచ్చాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణ సమాజ్‌వాది పార్టీ అభ్యరిగా పోటీచేసి గెలిచింది.

2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
143022
డి.కె.అరుణ
  
56.42%
గట్టు భీముడు
  
29.37%
నాగర్‌దొడ్డి వెంకట్రాములు
  
6.64%
ఇతరులు
  
7.57%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు పార్టీ సాధించిన ఓట్లు
1 డి.కె.అరుణ సమాజ్‌వాదీ పార్టీ 80703
2 గట్టు భీముడు తెలుగుదేశం పార్టీ 42017
3 ఎన్.వెంకటరాముడు తెలంగాణ రాష్ట్ర సమితి 9501
4 జి.జుమ్మారెడ్డి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 5555
5 పారుమల కృష్ణ బహుజన్ సమాజ్ పార్టీ 2168
6 డి.కె.ఆంజనేయులు ఇండిపెండెంట్ 1434
7 సత్యం ఇండిపెండెంట్ 855
8 యాపర్ల మన్సూర్ ఇండిపెండెంట్ 789

2009 ఎన్నికలు సవరించు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు డి.కె.అరుణ పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి జడ్పీటీసీ సభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి పోటీలో పడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నుండి ఆశించి పార్టీ ఫిరాయించిన మాజీ శాసనసభ్యుడు గట్టు భీముడు, భారతీయ జనతా పార్టీ తరఫున బి.రాజశేఖర్ రెడ్డి, లోక్‌సత్తా పార్టీ తరఫున మురళీ శ్రీనివాస్ పోటీచేశారు. ప్రధానపోటీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె.అరుణ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.[5]

నియోజకవర్గ ప్రముఖులు సవరించు

రాజా కృష్ణ రాంభూపాల్
గద్వాల సంస్థానాధీడుడైన రాంభూపాల్ 1962లో గద్వాల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1957లో పోటీపడిన డి.కె.సత్యారెడ్డి, పాగ పుల్లారెడ్డిల సయోధ్యలో భాగంగా రాజీ అభ్యర్థిగా రాంభూపాల్‌కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం లభించింది. ఆ తరువాత ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం నుండి మరో అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాలేడు.
పాగ పుల్లారెడ్డి
స్వాతంత్ర్య సమరయోధుల జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన[6] పాగ పుల్లారెడ్డి మహాత్మాగాంధీ స్పూర్తితో జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై అనేక ఉద్యమాలలో పాలుపంచుకున్నాడు. స్వాతంత్ర్యానంతరం రాజకీయాలలొ అనేక పదవులు పొంది గద్వాల పట్టణానికి సేవలందించాడు. 1972లో గద్వాలలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఘనత కూడా ఇతనిదే. 1972 శాసనసభ ఎన్నికలలో డి.కె.సత్యారెడ్డిపై విజయం సాధించి ఆరేళ్ళపాటు శాసనసభ్యుడిగా కొనసాగినాడు. అంతకు క్రితం 1952లో తొలి శాసనసభ ఎన్నికలలో గెలిచిన ఘనత కూడా ఇతనిదే. 1983లో డి.కె.సమరసింహారెడ్డి చేతిలో ఓడిపోయాడు. అక్టోబరు 20, 2010న మరణించాడు.[7]
డి.కె.సత్యారెడ్డి
పురపాలక సంఘము చైర్మెన్‌గాను, 1978లో శాసనసభ్యుడిగాను ఎన్నికైన డి.కె.సత్యారెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నేతగా ఎదిగాడు. ఇప్పటికీ గద్వాల నియోజకవర్గంలో డి.కె. వారసులే రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
సమర సింహారెడ్డి
నాలుగు సంవత్సరాలకు పైగా రాష్ట్ర కేబినెట్‌లో పంచాయతిరాజ్ మంత్రిగా, 14 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేసిన సమర సింహారెడ్డి గద్వాలకు చెందిన రాజకీయ నాయకుడు. 1979 నుంచి 1994 వరకు గద్వాల అసెంబ్లీ నియోజక వర్గం తరఫున శాసనసభ్యుడిగా వ్యవహరించాడు. 1994లో స్వంత తమ్ముడు భరత సింహారెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత అధికార పదవులకు దూరమైనాడు. గద్వాల నియోజకవర్గపు ప్రస్తుత శాసనసభ్యురాలు డి.కె.అరుణ ఇతని మరదలు.
భరత సింహారెడ్డి
సమరసింహారెడ్డి సోదరుడైన భరత సింహారెడ్డి గద్వాల పట్టణపు రాజకీయనేతలలో ఒకడు. 1994 శాసనసభ ఎన్నికలలో భరత సింహారెడ్డిపై 32 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గం శాసనసభ్యురాలైన డి.కె.అరుణ ఇతని భార్య.
డి.కె.అరుణ
స్వాతంత్ర్యసమరయోధుడు, మఖ్తల్ శాసనసభ సభ్యుడు, 2005, ఆగష్టు 15న నారాయణ పేటలో నక్సలైట్ల తూటాలకు బలైన చిట్టెం నర్సిరెడ్డి కూతురైన డి.కె.అరుణ ప్రస్తుతం గద్వాల నియోజకవర్గపు శాసనసభ్యురాలు. ప్రస్తుత మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈమె సోదరుడు. 2004 శాసనసభ ఎన్నికలలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా డి.కె.అరుణ కాంగ్రెస్ రెబెల్‌గా సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటిచేసి గెలుపొందినది. 1996లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 3700 ఓట్ల తేడాతో మల్లికార్జున్ చేతిలో ఓడిపోయింది. 1999 శాసనసభ ఎన్నికలలో గద్వాల స్థానం నుంచి పోటీ చేయగా మళ్ళీ తృటిలో విజయం చేజారింది. కేవలం 1800 ఓట్ల తేడాతో గట్టు భీముడు గెలవగా, 2004 ఎన్నికలలో గట్టు భీముడిపై గెలిచింది. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి[8] వరుసగా రెండో సారి శాసనసభ్యురాలిగా ఎన్నికకావడమే కాకుండా రాష్ట్రమంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా నియమితురాలైంది.[9]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. Sakshi (8 November 2018). "చరిత్రాత్మకం.. గద్వాల చరితం". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
 2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
 3. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి
 4. 1985 ఎన్నికలలో తొలుత గోపాలరెడ్డి స్వల్ప తేడాతో గెలిచాడు. అయితే సమరసింహారెడ్డి కోర్టుకు వెళ్ళి పోరాడగా, కోర్టు గోపాలరెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చి సమరసింహారెడ్డి ఎన్నికైనట్టుగా ప్రకటించింది
 5. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
 6. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008
 7. ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010
 8. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009
 9. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009