జాతీయ రహదారి 216
జాతీయ రహదారి 216 (ఎన్‌హెచ్ 216) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. పూర్వపు ఎన్‌హెచ్ 214, 214A రహదారులను విలీనం చేసి దీన్ని రూపొందించారు. ఇది కత్తిపూడి వద్ద గల ఎన్‌హెచ్ 16 వద్ద మొదలై కాకినాడ, అమలాపురం, దిగమర్రు (పాలకొల్లు), నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, చెరుకుపల్లె, బాపట్ల, చీరాల మీదుగా తిరిగి ఒంగోలు వద్ద ఎన్‌హెచ్ 16 ను కలుస్తుంది.[1][2] విశాఖపట్నం-కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్, ఈ రహదారి వెంబడి ప్రతిపాదించిన ప్రాజెక్టు. [3]
National Highway 216 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 391.3 కి.మీ. (243.1 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | కత్తిపూడి, ఆంధ్రప్రదేశ్ | |||
జాబితా
| ||||
దక్షిణ చివర | ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | కాకినాడ, యానం, అమలాపురం, రాజోలు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం,మచిలీపట్నం, రేపల్లె, చెరుకుపల్లి, బాపట్ల, చీరాల | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుఈ రహదారి మొత్తం పొడవు 391.3 కిలోమీటర్లు (243.1 మై.).[2] ఇది ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల గుండా వెళుతుంది.
జాతీయ రహదారి 216 కత్తిపూడి గ్రామం వద్ద ఎన్‌హెచ్16 నుండి ప్రారంభమై, గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ, యానాం, ముమ్మిడివరం, అమలాపురం , రాజోలు, దిగమర్రు (పాలకొల్లు ), నర్సాపురం, పెడన, మచిలీపట్నం, రేపల్లె, చెరుకుపల్లి, బాపట్ల, చీరాల వంటి పట్టణాల గుండా వెళ్ళి, ఒంగోలు వద్ద ఎన్‌హెచ్ 16తో కలుస్తుంది.
ప్రాజెక్టు వివరాలు
మార్చుకత్తిపూడి-కాకినాడ మధ్య దాదాపు 38 కిలోమీటర్ల పొడవున 10 మీటర్ల మేర నాలుగు లైన్ల దారిగా విస్తరించారు. కాకినాడ శివారు నుంచి కాకినాడ రూరల్‌లోని అచ్చంపేట నుంచి కరప మండలం ఉప్పలంకమొండి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు, 150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.
అమలాపురం ప్రాంతంలో నాలుగు లైన్ల రహదారిగా ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటు పి గన్నవరం సమీపంలోని బోడసకుర్రు వద్ద ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి. 2019 చివరి త్రైమాసికం నాటికి నాలుగు లేన్ల రహదారిని పూర్తి చేయాలని, కాకినాడ వద్ద బైపాస్ రోడ్లకు సంబంధించిన ఫ్లైఓవర్ పనులను 2020 చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఎన్‌హెచ్ 216 వ్యవసాయ ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా కోసం ఈ ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. తూర్పుగోదావరిలోని కోనసీమ ప్రాంతానికి రైలు కనెక్టివిటీ లేనందున ఈ ప్రాంతానికి హైవే అవసరం.
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
మార్చు- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road transport and Highways, India. National Informatics Centre. 30 November 2018. p. 1. Archived from the original (PDF) on 16 April 2019. Retrieved 9 May 2019.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- ↑ "PCPIR to propel growth between Vizag, Kakinada". The Hindu (in Indian English). 2014-09-05. ISSN 0971-751X. Retrieved 2016-08-09.