జె.భాగ్యలక్ష్మి
జె.భాగ్యలక్ష్మి[ఆంగ్లం:J. Bhagyalakshmi] ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.

విశేషాలు సవరించు
ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 ఫిబ్రవరి 2 న జన్మించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడింది. ఈమె ఆంగ్లసాహిత్యం అధ్యయనం చేసి కమ్యూనికేషన్‌లో శిక్షణ పొందింది. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బుక్ పబ్లిషింగ్ విషయాలలో దేశ విదేశాల డిప్లొమాలను సంపాదించింది. జర్నలిస్టుగా పేరుపొందింది. ఈమె ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) ఆఫీసరుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో మీడియా డైరెక్టరుగా, కేంద్ర సమాచార,ప్రచార మంత్రిత్వశాఖ వారి పత్రిక యోజనకు ఛీఫ్ ఎడిటర్‌గా, పబ్లికేషన్స్ డివిజన్ ఎడిటర్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనికేషన్స్ ప్రచురణల శాఖకు అధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేసింది. ఇండియన్ అండ్ ఫారిన్ రివ్యూ, కమ్యూనికేటర్ వంటి పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, మీడియా సలహాదారుగా, మాస్ కమ్యూనికేషన్ సంస్థలలో గెస్ట్ ఫాకల్టీగా పనిచేస్తోంది.
ఈమె ప్రభుత్వ పత్రినిధిగా, జర్నలిస్టుగా వివిధ అధ్యయనాలకు బంగ్లాదేశ్, జపాన్, శ్రీలంక, చైనా, టిబెట్, భూటాన్, ఈజిప్టు, సిరియా మొదలైన దేశాలలో పర్యటించింది.
రచయిత్రిగా సవరించు
ఇంగ్లీషు తెలుగు భాషలలో రచయిత్రిగా ఈమె 45కు పైగా పుస్తకాలను రచించింది. తొలిరోజులలో జానకి అనే కలంపేరుతో రచనావ్యాసంగం సాగించింది. ఈమె ప్రచురణలలో కథాసంకలనాలు, కవితాసంకలనాలు, సాహిత్య విమర్శ, అనువాదాలు ఉన్నాయి. వివిధ విషయాల గ్రంథాలకు సంపాదకత్వం వహించింది. ఈమె రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక,[1] ఆంధ్రజనత, పుస్తకం, కథాంజలి,ఆంధ్రప్రభ, పత్రిక,అనామిక,ఆంధ్రభూమి, ఉదయం,ప్రజామత,ఢిల్లీ తెలుగువాణి,విజయ మొదలైన తెలుగు పత్రికలలోనే కాక త్రివేణి,[2] విదుర[3] వంటి ఆంగ్ల పత్రికలలో కూడా అచ్చయ్యాయి.
భాషా విషయమై ఈమె అభిప్రాయం ఇలా ఉంది. "ఏ భాషయినా భావప్రకటనకు అది ఒక మాధ్యమమనే నేను భావిస్తాను. మన భాష, పరభాష అనేది ఏదీ ఉండదు. భాషలవల్ల జ్ఞానం విస్తరిస్తుందేగాని కుచించుకు పోదు. ప్రతి భాషలోనూ సహజమైన అందాలుంటాయి. మనం భాషను ప్రేమించగలగితే అందులోని సొగసులు, అందమైన కూర్పులు, మధురసంగీతం మనసును అలరించినట్లు అలరిస్తాయి. ఇంగ్లీషులో వ్రాసినా, తెలుగులో వ్రాసినా, సంస్కృతంలో వ్రాసినా మరే భాషలో వ్రాసినా మౌలికంగా మనం మనమే. మన రచనల్లో మన అవగాహన,దృక్పథాలు, ఆలోచనారీతులే వెల్లడవుతాయి."[4]
రచనలు సవరించు
- ఐవీ కాంప్టన్ బర్నెట్ అండ్ హర్ ఆర్ట్
- కాపిటల్ విట్‌నెస్: సెలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ జి.కె.రెడ్డి ISBN 978-81-7023-316-9
- హాపీనెస్ అన్‌బౌండ్ (కవితలు)ISBN 978-81-220-0536-3
- ఎ నాక్ అట్ ది డోర్ (కవితలు)ISBN 978-81-220-0685-8
- వెబ్ ఫార్చ్యూన్ స్మైల్డ్ (కవితలు) ISBN 978-81-220-0722-8
- మిస్సింగ్ వుడ్స్ (కవితలు)
- కాదేదీ కవిత కనర్హం (కథలు)
- మరో మజిలీ (కథలు)
- మాదీ స్వతంత్ర దేశం (కథలు)
- వసంతం మళ్ళీ వస్తుంది (కవితలు)
- రవీంద్రగీతాలు (అనువాదం)
- ఐ విల్ నాట్ లెట్ టైం స్లీప్ (కవితలు - అనువాదం మూలం: ఎన్.గోపి)
- ఆహ్నికం (కవితలు - అనువాదం)
- డ్యూ డ్రాప్స్ (అనువాదం)
- మానావాధికారాలు (అనువాదం)
- కథాభారతి (హిందీ కథలు తెలుగులోకి అనువాదం)
- అబ్దుల్ కలాం కవితలు (ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ రచన అనువాదం)
- దట్స్ ఒకే: తమన్నా అండ్ అదర్ రెవరీస్ (పత్రికలలో వచ్చిన కాలమ్స్)
కథల జాబితా సవరించు
కథానిలయంలో లభ్యమవుతున్న జె.భాగ్యలక్ష్మి కథలు[5]
- అంతరాంతరాలు
- అనుకున్నదొకటీ...
- అనూహ్యం
- అమ్మ చెప్పిన మాట
- అర్థాలే వేరులే
- ఈ ప్రశ్నకు బదులేది?
- ఈశ్వర వదనం
- ఉడ్ బి కలెక్టర్
- ఉలిపికట్టె
- ఎవరి విలువలు నాన్న
- ఏక్ థా లడకా
- ఓ కౌన్ థీ
- ఓ సుమనా తిరిగిచూడు
- కబ్ హువా
- కల్యాణి
- కాదేదీ కవితకనర్హం
- కాలం మారింది
- కావ్యన్యాయం
- చరమరాత్రి
- జపనీస్ బొమ్మ
- జుజు జిందాబాద్
- ట్రస్ట్
- తారుమారు
- నాది తప్పే
- నాన్నగారు వచ్చేసారు
- నారీహృదయం
- నిన్న-రేపు
- నిర్మల
- నీవెరుగని నిజం
- పుణ్యంకొద్దీ
- పునర్జన్మ
- పూలలో మధువు
- పెన్నిధి
- పేరులో ఏముంది
- ఫ్రీడమ్ అట్ మిడ్నైట్!
- బొమ్మ-బొరుసూ
- మనిసి
- మరీచిక
- మరో మజిలీ
- మర్రిచెట్టు
- మాదీ స్వతంత్రదేశం
- మూసలో బొమ్మ
- రంగుల వల
- రిస్క్
- రూట్స్
- రైలుప్రయాణం
- రోశనీ
- వందనోటు
- వాంగ్మూలం
- విప్లవ
- శివాని
- సావిత్రి
- స్పీడ్ మనీ
పురస్కారాలు సవరించు
- రఫీ అహమ్మద్ కిద్వాయి బహుమతి
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమరచయిత్రి అవార్డు
- జ్యేష్ఠ లిటరరీ అవార్డు
- కథా అవార్డు
- ఆర్.కె.నారాయణ్ అవార్డు
- ఢిల్లీ తెలుగు సంఘం ప్రతిభా పురస్కారం
- సిద్ధార్థ కళాపీఠం విశిష్టవ్యక్తి పురస్కారం
- గృహలక్ష్మి స్వర్ణకంకణము
మూలాలు సవరించు
- ↑ జె., భాగ్యలక్ష్మి (1975-07-04). "అర్థాలేవేరులే". ఆంధ్రసచిత్రవారపత్రిక: 29-30. Archived from the original on 2016-03-10. Retrieved 2014-12-01.
- ↑ త్రివేణి
- ↑ విదుర
- ↑ జె., భాగ్యలక్ష్మి (2013). వసంతం మళ్ళీ వస్తుంది (1 ed.). హైదరాబాదు: సూర్య ప్రచురణలు. p. 9.
- ↑ "కథానిలయంలో జె.భాగ్యలక్ష్మి కథలు".[permanent dead link]