డి.వి.యస్.ప్రొడక్షన్స్
(డి.వి.యస్. ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
డి.వి.యస్.ప్రొడక్షన్స్ తెలుగు సినిమారంగంలో నిర్మాణ సంస్థ. దీని అధిపతి డి.వి.యస్.రాజు.[1]
నేపథ్యం
మార్చుఈ సంస్థ అధిపతి డి.వి.యస్ రాజు 1950 ప్రాంతంలో మద్రాసుకు వచ్చి సినీ లితీ వర్క్స్ అనే ముద్రణాశాలను నెలకొల్పి సినిమా వాల్ పోస్టర్లు ముద్రిస్తూ ఉండేవాడు. సంగీత దర్శకుడు టి.వి.రాజు అతనిని ఎన్.టి.రామారావుకు పరిచయం చేసాడు. తరువాత అతను ఎన్.టి.ఆర్ నిర్మించిన సినిమా పిచ్చి పుల్లయ్య లో భాగస్వామిగా పనిచేసాడు. తరువాత ఎన్.ఎ.టి. సంస్థ నిర్మించిన తోడుదొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి కథ సినిమాలకు కూడా డి.వి.ఎస్.రాజు భాగస్వామిగా ఉన్నాడు. ఆ తరువాత డి.వి.ఎస్.రాజు తన స్వంత నిర్మాణ సస్థ డి.వి.ఎస్. ను నెలకొల్పి మంగమ్మ శపథం సినిమాను నిర్మించాడు. సినిమా నిర్మాణంతోబాటు అంచెలంచెలుగా ఎదిగి జాతీయ ఫిలిం అభివృద్ధి కార్పొరేషన్‌కు ఛైర్మన్ కాగలిగారు
నిర్మించిన సినిమాలు
మార్చు- మా బాబు (1960) 1960, డిసెంబర్ 22న తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్.
- మంగమ్మ శపథం (1965)[2] జానపద తెలుగు సినిమా.[3] దీనిని నిర్మాత డి.వి.ఎస్.రాజు డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించారు.
- పిడుగురాముడు (1966) విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.
- గండికోట రహస్యం (1969) విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం.
- చిన్ననాటి స్నేహితులు (1971) కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్ బాబు, వాణిశ్రీ తదితరులు నటించారు.[4]
- ధనమా దైవమా (1973)
- జీవనజ్యోతి (1975)
- జీవిత నౌక (1977)
- అల్లుడు పట్టిన భరతం (1980)
- ముఝే ఇన్`సాఫ్ చాహియే (1983)
- చాణక్య శపధం (1986)
- జయం మనదే (1986)
- భానుమతి గారి మొగుడు (1987)
మూలాలు
మార్చు- ↑ "Dvs Raju". dvsraju.co.in. Retrieved 2021-04-06.
- ↑ "Mangamma Sapadam (1965)". Indiancine.ma. Retrieved 2021-04-06.
- ↑ నాటి 101 చిత్రాలు: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (10 October 1971). "చిన్ననాటి స్నేహితులు చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 4. Retrieved 4 October 2017.[permanent dead link]