తెలుగు సాహిత్యం కాలరేఖ

తెలుగు సాహిత్యంలో తేదీల వారీగా కొన్ని ముఖ్య ఘటనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకు మార్చు

  • క్రీ.పూ. 1,500 - 1,000 కాలం - ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించి మొదటిసారిగా ప్రస్తావన.
  • క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం), ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన
  • క్రీ.పూ. 28 - పూజ్యపాదుడనే కన్నడ (ఆంధ్ర) కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం జైన సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం తెలుగు భాషకు సంబంధించినది కావలెనని కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయం
  • సా.శ. 1వ శతాబ్దం - గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. అందులో పైఠాన్ నగరంలో జరిగిన సంవాదంలో అతను సంస్కృత, ప్రాకృత, దేశ్య భాషలను పరిహరించినట్లు ఉంది. ఆ దేశ్య భాష ఏదో స్పష్టంగా తెలియడంలేదు కాని అప్పటికి ఆధునిక మహారాష్ట్ర భాష ఏర్పడలేదు. పైఠాన్ అప్పటి ఆంధ్ర సామ్రాజ్యానికి ఒక రాజధానిగా ఉండేది. కనుక ఆ దేశ్యభాష తెలుగు అనుకోవడానికి అవకాశం ఉంది.
  • సా.శ. 1వ శతాబ్దిలోనే హాలుడు గాధా సప్తశతి అనే ప్రాకృత కావ్యాన్ని సంకలనం చేశాడు. ఆ గాథలను రచించిన కొందరు ఆంధ్రులై యుండడంవల్లనేమో అందులో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. - అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ వంటివి.
  • సా.శ. 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు నిర్మాణం జరిగిన అమరావతీ స్తూపంలో ఒక రాతి పలక మీద నాగబు అనే తెలుగు పదం ("నాగంబు" రూపాంతరం) కనిపిస్తున్నది. అది ఒక వాక్యంలో భాగంగా కాక వేరుగా ఉంది. మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదం ఇదే.
  • ధనంజయుని కలమళ్ళ శాసనము - సుమారు సా.శ. 575 - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221
  • పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
  • సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
  • అరకట వేముల శాసనము - 8వ శతాబ్దం - ప్రొద్దుటూరు తాలూకా -
  • వేల్పుచర్ల శాసనము - జమ్మలమడుగు తాలూకా -
  • గణ్డ త్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము - రాయచోటి తాలూకా -
  • కొండపఱ్తి శాసనం - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
  • కొరవి శాసనం - 935 - వరంగల్ జిల్లా మానుకోట (మహబూబాబాదు)
  • పణ్డరంగుని అద్దంకి శాసనము - 770 - అద్దంకి
  • యుద్ధమల్లుని బెజవాడ శాసనము - 930 - విజయవాడ
  • జినవల్లభుని కుర్క్యాల శాసనము - 945 - కరీంనగర్ జిల్లా కుర్క్యాల
  • బణపతి దీర్ఘాసి శాసనము - 997 - కళింగపట్నం

నన్నయ యుగము : 1000 - 1100 మార్చు

  • 1045-1060 - నన్నయ భారతాంధ్రీకరణ

శివకవి యుగము : 1100 - 1225 మార్చు

  • 1160 కాలం - నన్నెచోడుడు - కుమార సంభవము
  • 1160-1230 - పాల్కురికి సోమనాధుడు - బసవ పురాణం, వగైరా
  • ? - మల్లికార్జున పండితారాధ్యుడు - శివతత్వసారము
  • 1133-1198 - ఓరుగల్లును పాలించిన కాకతీయరాజు ప్రతాప రుద్రుడు - నీతి సారము

తిక్కన యుగము : 1225 - 1320 మార్చు

  • 1210-1290 - తిక్కన జీవిత కాలం కావచ్చును

ఎఱ్ఱాప్రగడ యుగము : 1320 - 1400 మార్చు

శ్రీనాధుని యుగము : 1400 - 1500 మార్చు

రాయల యుగము : 1500 - 1600 మార్చు

దక్షిణాంధ్ర యుగము: 1600 - 1775 మార్చు

క్షీణ యుగము : 1775 - 1875 మార్చు

  • 1812 : మొదటి తెలుగు నిఘంటువు ప్రచురణ
  • 1816: మద్రాసులో మొదటి తెలుగు ముద్రణాలయం
  • 1818: బ్రౌన్ నిఘంటువు ముద్రణ
  • 1820: మద్రాసు వెర్నాక్యులర్ ‍‍, స్కూల్ బుక్ పబ్లిషింగ్ సొసైటీ స్థాపన.
  • 1832: మద్రాస్ క్రానికల్ మొదటి తెలుగు వార్తాపత్రిక ప్రచురణ
  • 1845: పిడుతూరి సీతారామశాస్త్రి "పెద్దబాలశిక్ష" ప్రచురణ
  • 1851: అద్దంకి సుబ్బారావు తెలుగు వాచకం ప్రచురణ
  • 1853: చిన్నయసూరి మిత్రభేదం ప్రచురణ


  • 1863: వావికొలను సుబ్బారావు జననం
  • 1872: కందుకూరి వీరేశలింగం నీతి కథా మంజరి

ఆధునిక యుగము : 1875 నుండి మార్చు


ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు