తెలుగు సినిమాలు 1963

తెలుగు సినిమాలు 1963 ఈ సంవత్సరం 27 చిత్రాలు వెలుగు చూశాయి. నందమూరి 12 చిత్రాల్లోనూ, అక్కినేని రెండు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ అభినయించారు.

లవకుశ

మార్చు

తెలుగులో పూర్తి రంగుల చిత్రంగా లలితాశివజ్యోతి వారి 'లవకుశ' విడుదలై నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో సంచలన విజయం సాధించింది. తొలి విడతలో 26 ప్రింట్లతో విడుదలై, 26 కేంద్రాలలోనూ 150 రోజుల వరకు ప్రదర్శితమై, 14 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని, తొలిసారిగా 250 రోజులకు నాందీ పలికి, 470 రోజులు వరకు ప్రదర్శితమైంది 'లవకుశ'. పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రకెక్కి వందరోజులకు రూ. 25 లక్షలు పోగుచేసి, 365 రోజులకు కోటి రూపాయలను నాటి 25 పైసలు, రూపాయి టిక్కెట్లపై వసూలు చేసింది. ఆ నాటి రూపాయి విలువ నేటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఆ కొలమానంలో చూసుకుంటే ఈ చిత్రం వసూళ్ళు నేటికీ రికార్డుగా నిలిచాయనే చెప్పాలి. అంతకు ముందున్న రికార్డుల కంటే ఈ చిత్రం మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఆ నాడు మన రాష్ట్ర జనాభా 3 కోట్లు మాత్రమే, అయితే ఈ సినిమాను నూరు కేంద్రాలలో 1.98 కోట్ల మంది ప్రజలు ఆదరించినట్లు ఆ నాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. అంటే ప్రతి కేంద్రంలోనూ ఆ యా కేంద్రాల జనాభా కంటే నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడై అప్పటికీ ఇప్పటికీ కనివినీ ఎరుగని చరిత్రను సొంతం చేసుకుందీ చిత్రం. (ఉదాహరణకు 1-1-1964 తేదీన వరంగల్‌ రాజరాజేశ్వరి థియేటర్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో ఆ చిత్రాన్ని 4, 34, 800 మంది చూసినట్లు ఆధారం ఉంది. ఆ నాటి వరంగల్‌ జనాభా ఒక లక్ష మాత్రమే). అలాగే ఆ తరువాత కూడా ఈ చిత్రం అప్రతిహతంగా నడచి అన్ని కేంద్రాలలో సంయుక్తంగా అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. 'నర్తనశాల'లో యన్టీఆర్‌ బృహన్నల పాత్రను పోషించడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. అలాగే ఆ చిత్రం కూడా సంచలన విజయం సాధించి, రెండు వందల రోజులు ప్రదర్శితమై దేశవిదేశాల్లో కీర్తిప్రతిష్ఠలను సంపాదించింది. ఈ యేడాది విడుదలైన ఇతర చిత్రాలలో "శ్రీకృష్ణార్జున యుద్ధం, చదువుకున్న అమ్మాయిలు, పరువు - ప్రతిష్ఠ, గురువును మించిన శిష్యుడు" శతదినోత్సవం జరుపుకోగా, యన్టీఆర్‌, బి.విఠలాచార్య కలయికలో రూపొందిన తొలి చిత్రం 'బందిపోటు' కూడా పెద్ద హిట్‌అయి శతదినోత్సవం జరుపుకుంది., 'లక్షాధికారి' చిత్రం కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. 'శ్రీతిరుపతమ్మ కథ' అప్పట్లో విజయం సాధించకున్నా, రిపీట్‌ రన్‌లో బాగా ఆడింది.


జాబితా

మార్చు
  1. అదృష్టవతి
  2. అనురాగం
  3. ఆప్తమిత్రులు
  4. అనుబంధాలు
  5. ఇరుగు పొరుగు
  6. ఎదురీత
  7. కానిస్టేబుల్ కూతురు
  8. గురువును మించిన శిష్యుడు
  9. చదువుకున్న అమ్మాయిలు
  10. చిత్తూరు రాణీ పద్మిని
  11. జ్ఞానేశ్వర్
  12. తల్లి బిడ్డ
  13. తోబుట్టువులు
  14. దేవసుందరి
  15. దొంగ నోటు
  16. నాగ దేవత
  17. నర్తనశాల
  18. నిరపరాధి
  19. పరువు ప్రతిష్ఠ
  20. పునర్జన్మ
  21. పెంపుడు కూతురు
  22. బందిపోటు
  23. మంచి చెడు
  24. మంచిరోజులు వస్తాయి
  25. మహా వీర భీమసేన
  26. లక్షాధికారి
  27. లవకుశ
  28. వాల్మీకి
  29. విష్ణుమాయ
  30. శ్రీ తిరుపతమ్మ కథ
  31. శ్రీకృష్ణార్జున యుద్ధం
  32. సవతి కొడుకు
  33. సోమవార వ్రత మహత్యం


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |