తైత్తిరీయ బ్రాహ్మణం

తైత్తిరీయ శాఖ అనునది కృష్ణ యజుర్వేదంలో ఒక ముఖ్యమైన శాఖ ఉంది. విష్ణు పురాణంలో తిత్తిరి అనే ఒక యాస్క విద్యార్థికి ఇది సంబంధించింది.[1] ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉంది. తిత్తిరిమహర్షి రచించినది కావున తైత్తిరీయ బ్రాహ్మణము. పైంగియాస్కుడు శిష్యుడు తిత్తిరి. పైంగియాస్కుడు యొక్క గురువు వైశంపాయనుడు. తిత్తిరి శిష్యుడు ఉఖుడు. తిత్తిరి మహర్షి యొక్క ప్రశిష్య్దు ఆత్రేయుడు.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

శాఖలు

మార్చు

యజుర్వేదం లోని ఒక శాఖ అయిన కృష్ణయజుర్వేదము నకు 86 శాఖలు ఉన్నాయి. వీటిలో చాలా నశించిపోయాయి. మిగిలినవి 4 మాత్రమే. ఆ నాలుగులో ప్రధానమైన శాఖ తైత్తిరీయ సంహిత శాఖ. ఈ శాఖకు సంబంధించిన బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం. దీన్నే పరాయాత అని పిలుస్తారు. తైత్తిరీయ సంహిత - (తై.సం.) :- ఇందులో 8 పుస్తకాలు (అధ్యాయాలు) లేదా కాండలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ప్రపాఠకాలుగా ఉపవిభజన చేశారు. ఇవి మరింతగా వ్యక్తిగత శ్లోకాలుగా ఉపవిభజన జరిగింది.

విభాగాలు

మార్చు

తైత్తిరీయ బ్రాహ్మణం మూడు కాండలు గా విభజింపబడింది. దీనిలో మొదటికాండకు పారక్షుద్రము అని, రెండోకాండమునకు ఆగ్నిహోత్రము అని పేర్లు. మూడవ కాండము లోని విభాగాలకు విడివిడిగానే వాటివాటికి పేర్లు ఉన్నాయి. మొదటి, రెండవ కాండములలో ఒక్కొక్క దానిలో ఎనిమిది చొప్పున ప్రపాఠకాలు ఉన్నాయి. మూడవ కాండములో మాత్రము పన్నెండు ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రతి ప్రపాఠకం లోను కొన్ని అనువాకములు ఉంటాయి. మొదటి కాండములో రెండవ ప్రపాఠకంలో అతి తక్కువ సంఖ్యలో ఆరు అనువాకములు ఉన్నాయి. అదేవిధముగా, మూడవ కాండములో ఎనిమిదవ, తొమ్మిదవ ప్రపాఠకాలలో అతి ఎక్కువ సంఖ్యలో ఒక్కొక్క దానిలో ఇరవైమూడు చొప్పున అనువాకములు ఉన్నాయి. మొత్తం ఇందులో 338 అనువాకాలు ఉన్నాయి.

విషయవిభాగం

మార్చు

మొదటికాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో గవామయనశేషవిధి, వాజపేయంవిధి, సోమాది విధి, లగ్న్యాధానవిధి, రాజసూయం, నక్షత్ర్రేష్టకామంత్రాలు మొదలయినవి నిరూపించబడ్డాయి. రెండోకాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో ఉపహోమాలు, కామ్యపశుయాగాలు, అగ్నిహోత్రవిధి, సౌత్రామణి, ఒకేరోజున చేయవలసిన నవం అనే పేరుగల యాగాలు ప్రతిపాదించబడ్డాయి.. మూడోకాండలోని పన్నెండు ప్రపాఠకాలలో దర్శపూర్ణమాసవిధి, మనుష్యపశువిధి, అశ్వమేధం, నక్షత్రేష్టి, అశ్వమేధం, సావిత్రచయనం, నాచికేతాగ్నిచయనం, చాతుర్హోత్రచయనం, వైశ్వసృజాగ్నిచయనం ప్రస్తావించబడ్డాయి.

మొదలు-చివర

మార్చు

ఈ తైత్తిరీయ బ్రాహ్మణం బ్రహ్మ సంధత్తం తన్మే జింవతమ్ అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. చివరన విశ్వమేనా నను ప్రజాయతే అను మంత్రంతో పరిసమాప్తము అవుతుంది.

కాఠకము

మార్చు

తైత్తిరీయ బ్రాహ్మణంలోని మూడు కాండములను అష్టకాలు అని, ప్రపాఠకాలని అధ్యాయాలు అని కూడా అంటారు. మూడవ కాండములోని చవరి మూడు ప్రపాఠకాలని (10,11, 12) కాఠకము అని పేరు. ఈ భాగము ఒకనాడు కఠశాఖకు సంబంధించింది. అందువలన దీనికి ఆపేరు వచ్చింది.

భట్టభాస్కరుడు

మార్చు

తిత్తిరి మహర్షి ఈ చివరి మూడు ప్రపాఠకాలని చెప్పలేదని, ప్రపాఠకాలని ప్రశ్నలు అని భట్టభాస్కరుడు వ్యవహరిస్తాడు, ఈ విషయాలను భట్టభాస్కరుడు తన భాష్యంలో స్పష్టం చేశాడు.[2]

పట్టిక

మార్చు
కాండం ప్రపాఠకం అనువాకం కాండం ప్రపాఠకం అనువాకం కాండం ప్రపాఠకం అనువాకం
I 1 10 II 1 11 III 1 6
2 6 2 11 2 110
3 10 3 11 3 11
4 10 4 8 4 19
5 12 5 8 5 13
6 10 6 20 6 15
7 10 7 18 7 14
8 10 8 9 8 23
9 23
10 11
11 10
12 9
మొత్తం 78 + మొత్తం 96 + మొత్తం 164=338

ప్రాముఖ్యత

మార్చు
  • ఈ సంహితలోని కొన్ని వ్యక్తిగత శ్లోకాలు హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత పొందాయి. ఉదాహరణకు తైత్తిరీయ సంహిత - (తై.సం.) : 4.5, తైత్తిరీయ సంహిత - (తై.సం.) : 4.7 శ్రీ రుద్రం చమకం ఉన్నాయి. అయితే 1.8.6.i శైవెతే త్రయంబకం మంత్రం కూడా ఉంది.
  • కాఠకశాఖ బ్రాహ్మణం యొక్క కొంత భాగం కూడా ఈ శాఖ బ్రాహ్మణంలో చేర్చారు.
  • తైత్తిరీయ బ్రాహ్మణం మూడు కాండలు కలిగి ఉంది.
  • తైత్తిరీయ బ్రాహ్మణము మూడు కాండలుగా విభజించ బడింది. మొదటి కాండను పారక్షుద్ర కాండము అని, రెండో కాండకు అగ్నిహోత్ర కాండము అని, మూడో కాండము లోని విభాగములకు వేరు వేరు గానే పేర్లు ఉన్నాయి.
  • మూడు కాండాలను అష్టకాలని అంటారు.
  • పారక్షుద్ర కాండములో ఎనిమిది ప్రపాఠకాలు ఉన్నాయి.
  • అగ్నిహోత్ర కాండములో ఎనిమిది ప్రపాఠకాలు ఉన్నాయి.
  • మూడో కాండములో పన్నెండు ప్రపాఠకాలు ఉన్నాయి.
  • మూడో కాండము లోని చివరి ప్రపాఠకాలను, ఒకనాడు కఠశాఖకు సంబంధము వలను కాఠకమని పేరుతో పిలుస్తారు.
  • ప్రపాఠకాలను అధ్యాయాలని కూడా అంటారు.
  • ప్రతి ప్రపాఠకంలో అనువాకాలు ఉన్నాయి.
  • ప్రతి ప్రపాఠకంలో కనీసం ఆరు అత్యధికముగా ఇరవై మూడు అనువాకాలు ఉంటాయి.

అరణ్యకం

మార్చు

తైత్తిరీయ అరణ్యకం ఏడు ప్రశ్నలు కలిగి ఉంది.

ఉపనిషత్తులు

మార్చు
  • తైత్తిరీయ ఉపనిషత్తులో శిక్షా వల్లీ, ఆనంద వల్లీ, భృగు వల్లీ అనే మూడు ప్రశ్నలు లేదా వల్లీలు కలిగి ఉంది.
  • తైత్తిరీయ ఉపనిషత్తు, మహానారాయణ ఉపనిషత్తు తైత్తిరీయ అరణ్యకం యొక్క, ఏడవ ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ ప్రశ్నలుగా పరిగణిస్తారు.

ఇతర విషయాలు

మార్చు
  • తైత్తరీయ సంహిత యొక్క కాండము 3, ప్రపాఠకం 5, అనువాకం 1 నుండి నక్షత్ర సూక్తం వస్తుంది.

శ్రౌతసూత్రములు

మార్చు
  • ఆపస్తంబ శ్రౌతసూత్రములు
  • బోధాయన శ్రౌతసూత్రములు
  • వైఖానస శ్రౌతసూత్రములు
  • హిరణ్యకేశి శ్రౌతసూత్రములు

ప్రచురణలు

మార్చు
  • Albrecht Weber, Die Taittirîya-Saṃhitâ, Leipzig, Indische Studien 11-12, Brockhaus (1871, 1872) etext

మూలాలు

మార్చు
  1. https://en.wikipedia.org/wiki/Taittiriya_Shakha
  2. ఏవమశ్వమేథాన్తాని తిత్తిరిప్రోక్తాని కాండాని వ్యాఖ్యాతాని, అథ కాఠకాగ్నికాండాన్యష్టౌ