పెనుకొండ

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండల పట్టణం
(పెనుగొండ (అనంతపురం జిల్లా) నుండి దారిమార్పు చెందింది)


పెనుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పట్టణం, అదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇక్కడ గల పెనుకొండ కోట వలన ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. దీని పరిపాలనా నిర్వహణ పెనుకొండ నగరపంచాయితీ నిర్వహిస్తుంది

రెవెన్యూ గ్రామం
పటం
నిర్దేశాంకాలు: 14°05′05″N 77°35′48″E / 14.0846808°N 77.5966537°E / 14.0846808; 77.5966537
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండలంపెనుకొండ మండలం
విస్తీర్ణం
 • మొత్తం65.55 km2 (25.31 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం27,382
 • సాంద్రత420/km2 (1,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి976
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 85572 Edit this on Wikidata )
పిన్‌కోడ్515110 Edit this on Wikidata

చరిత్ర సవరించు

 
పెనుకొండ కోట ముఖద్వారం
 
సీత తీర్థం కోనేరు, పెనుకొండ దుర్గం
 
పెనుకొండ ఆర్ టి సి బస్ డిపో

సా.శ. 1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాకా విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నాళ్ళ పాటు పెనుకొండకు మార్చారు.[2]

గ్రామ భౌగోళికం సవరించు

ఈ గ్రామ విస్తీర్ణం 6555 హెక్టార్లు.

గణాంకాలు సవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామంలో 6752 ఇళ్లున్నాయి. మొత్తం జనాభా 27382. గ్రామంలో మగవారి సంఖ్య 13860, ఆడవారి సంఖ్య 13522. [3]

విద్యా సౌకర్యాలు సవరించు

సమీప ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అనంతపురంలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు సవరించు

జాతీయ రహదారి 44 (భారతదేశం) పై ఈ పట్టణం వుంది. ఊరిలో రైల్వే స్టేషన్ ఉంది.

భూమి వినియోగం సవరించు

2011 జనగణన ప్రకారం, రెవిన్యూ గ్రామ పరిధిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • అడవి: 2247 హెక్టార్లు
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 325 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2067 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 63 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 205 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 374 హెక్టార్లు
 • బంజరు భూమి: 1098 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 171 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1360 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 283 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 121 హెక్టార్లు
 • చెరువులు: 161 హెక్టార్లు

ఉత్పత్తి సవరించు

వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు

పర్యాటక ఆకర్షణలు సవరించు

 • పెనుకొండ పెద్దకొండ: పెనుకొండ కొండ మీదకు ప్రభుత్వ నిధులతో తారు రోడ్డును 2012 వ సంవత్సరంలో ఏర్పాటు చెయడం జరిగింది. ముఖ్యంగా పెనుకొండ కొండపై నిర్మించబడిన నరసింహ స్వామివారిదేవాలయము, కోనేరు, చెరువు, శత్రు దుర్భేధ్యమైన కోట చూడదగిన ప్రదేశములు. ఇక్కద నరసింహస్వామివారి దేవాలయం ముందు విశాలమైన మైదానము ఉంది. ఇది వాహనములు నిలుపుటకు, విడదికొరకు అనువైన ప్రదేశం.
 • పెనుకొండ కోట: బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి.
 • బాబా ఫక్రుద్దీన్ దర్గా
 • యెర్రమంచి గేటు: ఇందులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారు. పెనుకొండలో 365 దేవాలయాలు వుండేవని చరిత్ర చెబుతోంది. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించారు.
 • షేర్ ఖాన్ మసీదు
 • జామియా మసీదు
 • పాంచ్ బీబీ దర్గా
 • బాబయ్యకొండ (ఛిల్లాపహడ్)
 • గగన మహాల్
 • గాలి గోపురం
 • తిమ్మరుసు బందీఖానా
 • కుంభకర్ణ విగ్రహం
 • కాళేశ్వరస్వామి ఆశ్రమం
 • అజితనాధ దేవాలయం.

ప్రముఖులు సవరించు

 
పరిటాల రవి

భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు.ఇతను కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర పేరుతో రెండు సినిమాలు తీశాడు. రాష్ట్రంలోని రాజకీయ నాయకుల్లో ఒకడైన పరిటాల రవీంద్ర ఈ నియోజక వర్గం నుండే ప్రాతినిధ్యం వహించాడు.

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
 2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 4. "మా వ్యాసకర్తలు - [[భారతి (మాస పత్రిక)]] - సంపుటము 40 సంచిక 2- ఫిబ్రవరి 1963 - పేజీ100". Archived from the original on 2016-03-05. Retrieved 2021-12-28.

వెలుపలి లింకులు సవరించు


"https://te.wikipedia.org/w/index.php?title=పెనుకొండ&oldid=3887456" నుండి వెలికితీశారు