భారతీయ నాట్యం
భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం, భారతీయ నృత్యం అంటారు. దేశంలో అనేక నాట్యరీతులు కానవస్తాయి. శాస్త్రీయంగా చూస్తే ప్రతీ రాష్ట్రంలోనూ సాంస్కృతిక నృత్యాలు ఉన్నాయి. అలాగే భారతీయ సినిమా రంగంలో నాట్యం ప్రత్యేకత సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నది.
నాట్యం(Dance) అనేది ఫ్రెంచి పదం డాన్సెర్ నుండి ఉద్భవించింది. దీనిని సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలుగా చెప్పుకోవచ్చు. అంటే లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం అన్నమాట. భారతీయ నాట్యరీతులు అనేక విధాలున్నా వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. అవి
- సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు
- జానపద, గిరిజన నృత్యాలు.
ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులనూ, ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి. సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటిని ఆధునిక నృత్యాలు అనవచ్చు.
భారతీయ శాస్త్రీయ నృత్యం
మార్చుభారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలుతో కళకళలాడుతోంది. భారతదేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం. బిన్న సంస్కృతులతో కూడిన భారతదేశంలో సంస్కృతికి అనుగుణంగా భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బోదించిన నాట్య శాస్త్రంలో విధంగా అభినయం, నాట్యం కలిసి ఉండాలి.
శాస్త్రీయ నాట్యరీతులు
మార్చుజానపద నాట్యరీతులు
మార్చు- ఆంధ్రా: వీధి నాటకం, బుర్రకథ, గంటమర్ధాల, కోలాటం, పేరిణి, తోలుబొమ్మలాట, ధింసా నృత్యం, చిందు నృత్యం
- అసోం: బిహు, ఖేల్ గోపాల్, రస్ లీల్, కనోయ్, తబల్ చోంగ్లి, అంకియనాత్
- బీహార్: జతాజతిన్, జదుర్, ఛౌ, కథాపుత్లి, బఖో, జిజియా, సమోచక్వా, కర్మ, గాట్నా, నాట్నా
- గుజరాత్: గర్భ, దాఁడియారస్, టిప్పణి, గోంఫ్, భావై
- గోవా: ధక్తో, షిగ్మో, తలగడి, టోంగమేల్, మూసల్ ఖేల్, కొర్రిడింబో
- హర్యానా : జుమర్, ఫాగ్, దాఫ్, ఢమాల్, లూర్, గుగ్గ, ఖోరియా, గగోర్, స్వాంగ్
- హిమాచల్ ప్రదేశ్ : జోరా, జూలి, దాఁగి, మహాసు, జద్దా, జైంతా, చర్హి, గిద్దా ఫర్హాన్, లుడ్డి, ముంజ్రా, గూర్ఖాలి
- జమ్ము కాష్మీర్ : రౌఫ్, హికత్, చక్రి, కుడ్, దమాలి, దండినాధ్
- కర్ణాటక : హుత్తరి, సుగ్గి, కునిత, యక్షగానం
- కేరళ : కైకొత్తికళి, కలియాట్టం, తప్పటిక్కలి, కూడియాట్టం
- మహారాష్ట్ర : తమాషా, కథాకీర్తన్, లెజిమ్, దండానియా, గఫా, దహికల, లోవని, మౌని, దశావతార్ (బొహాడ)
- మధ్యప్రదేశ్ : మాచా
- ఒడిషా : గుమార సంచార్, చాద్యా దండనాధ
- పంజాబ్ : గిద్దా (మహిళలు), భాంగ్రా (పురుషులు), నక్వల్, భాంద్
- రాజస్థాన్ : గినాడ్, గంగోర్, తెరహ్ తాల్, ఖయాల్, జులన్ లీలా, జుమా, సుయిసిని, గోపికాలీల, చామర్ గిందా
- తమిళనాడు : పిన్నల్ కోలాటం, కోలాటం, కుమ్మి, కావడి, కరగమ్, వెదురు నాట్యం, త్రాడు నాట్యం
- ఉత్తర ప్రదేశ్ : నౌతంకి, రస్ లీల, చప్పేలి, కజ్రి, జోరా, రామ్ లీల
- పశ్చిమ బెంగాల్ : కథి, జాత్ర, బౌల్, కథా కీర్తన్, లామా
- తెలంగాణ : పేరిణీ నృత్యం
చిత్రమాలిక
మార్చు-
శాస్త్రీయ నృత్యం అయిన భరతనాట్యం
-
కూచిపూడి నాట్య ప్రదర్శన ఇస్తున్న యామినీ రెడ్డి
-
ఒడిస్సీ ప్రదర్శిస్తున్న నృత్య కళాకారులు
-
రాజమండ్రి కోటిపల్లి బస్టాండు వద్ద ఆలయ నృత్యకళాక్షేత్రంలోని స్తూపం
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు"భిన్న సంస్కృతుల మేళవింపు భారతీయ నాట్యం" - వ్యాసం - ఈనాడు 30-12-2008 - రచన: సిహెచ్.కృష్ణప్రసాద్