ఇండియా కూటమి

భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో 2023లో స్థాపించబడిన పెద్ద-గుడార ప్రతిపక్ష కూటమి
(భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి నుండి దారిమార్పు చెందింది)

ఇండియా కూటమి (ఆంగ్లం: Indian National Developmental Inclusive Alliance) అనేది భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలోని 26 రాజకీయ పార్టీల కూటమి.[1]

ఇండియా కూటమి
స్థాపన తేదీ18 జూలై 2023; 16 నెలల క్రితం (2023-07-18)
రాజకీయ వర్ణపటం
రంగు(లు)    (Official)
  (Alternative)
కూటమి27 రాజకీయ పార్టీలు
లోక్‌సభ స్థానాలు
142 / 543
రాజ్యసభ స్థానాలు
98 / 245
శాసన సభలో స్థానాలు
1,708 / 4,036
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల జాబితా

ఇండియా(ఐఎన్‌డిఐఎ) అంటే ది ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్ కాగా 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడం దీని ప్రాథమిక లక్ష్యం.[2]

ఉద్భవం

మార్చు

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్, దీనిని సాధారణంగా I.N.D.I.A. అని సంక్షిప్తంగా పిలుస్తారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి 26 పార్టీల నాయకులు ప్రకటించిన ప్రతిపక్ష ఫ్రంట్. బెంగళూరులో జరిగిన సమావేశంలో ఈ పేరు ప్రతిపాదించబడింది. ఇందులో పాల్గొన్న 26 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కొన్ని వర్గాలు ఈ పేరును భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆపాదించగా,[3] మరికొందరు దీనిని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారని పేర్కొన్నారు.[4]

చరిత్ర

మార్చు

పాట్నాలో మొదటి సమావేశం - ఐక్యత కోసం సమన్వయం

మార్చు

బీహార్‌లోని పాట్నాలో జరిగిన మొదటి ప్రతిపక్ష పార్టీల సమావేశం 2023 జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఇందులో కొత్త కూటమికి సంబంధించిన ప్రతిపాదనను వివిధ రాజకీయ పార్టీల సభ్యులు తీసుకొచ్చారు. ఈ సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి.[5]

బెంగళూరులో రెండవ సమావేశం - అధికారిక ప్రకటన

మార్చు

కర్ణాటకలోని బెంగళూరులో జూలై 17, 18వ తేదీలలో జరిగిన రెండవ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించింది. ఇందులో పొత్తు ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు ఈ జాబితాలో మరో పది పార్టీలు చేర్చబడ్డాయి. కూటమి పేరు ఖరారు చేసి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టారు.[6] ఈ సమావేశంలో మూడో సభను ముంబై నగరంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.[7]

ముంబైలో మూడవ సమావేశం - ముందస్తు ప్రణాళికలు

మార్చు

మూడవ ప్రతిపక్ష పార్టీల సమావేశం 2023 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు ముంబై నగరంలో జరిగింది. ఈ సమావేశానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆతిథ్యం ఇవ్వగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రెండు రోజుల చర్చల్లో, కూటమి రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాన ఎన్నికల అంశాలపై చర్చించింది, సమన్వయ కమిటీని రూపొందించింది. 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోరాడాలని మూడు పాయింట్ల తీర్మానాన్ని ఆమోదించారు.[8][9][10]

భావజాలం, లక్ష్యాలు

మార్చు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకారం, కూటమి సిద్ధాంతం అభివృద్ధివాదం, సమగ్రత, సామాజిక న్యాయం సూత్రాల చుట్టూ తిరుగుతుంది. వారి ప్రయత్నాలను కలపడం ద్వారా, సభ్య పార్టీలు ప్రజాస్వామ్య విలువలను రక్షించడం, సంక్షేమం, పురోగతిని సాధించడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)ని ఓడించే లక్ష్యంతో ఇది ఏర్పడింది.[11]

సభ్యత్వం ఉన్న పార్టీలు

మార్చు

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ భారతదేశంలోని వివిధ రకాల రాజకీయ పార్టీలను కలిగి ఉంది. కూటమిలోని 26 సభ్య పార్టీలు:[12]

పార్టీ నాయకుడు లోగో/జెండా లోక్ సభ రాజ్యసభ అసెంబ్లీ కౌన్సిల్ నోట్స్
INC భారత జాతీయ కాంగ్రెస్
 
మల్లికార్జున్ ఖర్గే
 
50 29 722 43 జాతీయ పార్టీ
DMK ద్రవిడ మున్నేట్ర కజగం
 
ఎం. కె. స్టాలిన్
 
24 10 139  – పుదుచ్చేరి, తమిళనాడు
TMC తృణమూల్ కాంగ్రెస్
 
మమతా బెనర్జీ
 
23 13 226  – పశ్చిమ బెంగాల్, మేఘాలయ
JD (U) జనతాదళ్ (యునైటెడ్)   నితీష్ కుమార్
 
16 5 46 25 బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్
SS (UBT) శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)   ఉద్ధవ్ ఠాక్రే 6 3 17 9 మహారాష్ట్ర
NCP నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ   శరద్ పవార్
 
4 3 22 3 మహారాష్ట్ర, నాగాలాండ్
CPI (M) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) సీతారాం ఏచూరి   3 5 81  – జాతీయ పార్టీ
SP సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్
 
3 3 110 9 ఉత్తర ప్రదేశ్
IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్   కె. ఎం. ఖాదర్ మొహిదీన్
 
3 1 15  – కేరళ, త్రిపుర
JKNC జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్   ఫరూక్ అబ్దుల్లా
 
3  –  –  – జమ్మూ కాశ్మీర్
CPI కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా   దొరైసామి రాజా
 
2 2 21 2 కేరళ, తమిళనాడు, మణిపూర్
AAP ఆమ్ ఆద్మీ పార్టీ   అరవింద్ కేజ్రీవాల్
 
1 10 161  – జాతీయ పార్టీ
JMM జార్ఖండ్ ముక్తి మోర్చా
 
హేమంత్ సోరెన్ 1 2 29  – జార్ఖండ్
KC (M) కేరళ కాంగ్రెస్ (ఎం)   జోస్ కె. మణి
 
1 1 4  – కేరళ
VCK విదుతలై చిరుతైగల్ కట్చి   తోల్. తిరుమావళవన్
 
1  – 4  – తమిళనాడు
RSP రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మనోజ్ భట్టాచార్య
 
1  –  –  – కేరళ
RJD రాష్ట్రీయ జనతా దళ్   లాలూ ప్రసాద్ యాదవ్
 
 – 6 81 14 బీహార్, జార్ఖండ్
RLD రాష్ట్రీయ లోక్ దళ్ జయంత్ సింగ్
 
 – 1 10  – ఉత్తర ప్రదేశ్
MDMK మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం   వైకో
 
 – 1  –  – తమిళనాడు
CPI (ML) L కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ దీపాంకర్ భట్టాచార్య
 
 –  – 13  – బీహార్
KC కేరళ కాంగ్రెస్   పి. జె. జోసెఫ్
 
 –  – 2  – కేరళ
AD (K) అప్నా దళ్ (కామెరవాడి)   కృష్ణ పటేల్  –  – 1  – ఉత్తర ప్రదేశ్
AIFB ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జి. దేవరాజన్  –  –  –  – పశ్చిమ బెంగాల్
PDP జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ   మెహబూబా ముఫ్తీ  –  –  –  – జమ్మూ కాశ్మీర్
MMK మణితనేయ మక్కల్ కచ్చి ఎం. హెచ్. జవహిరుల్లా  –  –  –  – తమిళనాడు
KMDK కొంగునాడు మక్కల్ దేశియా కచ్చి   ఇ. ఆర్. ఈశ్వరన్
 
 –  –  –  – తమిళనాడు
IND స్వతంత్ర అభ్యర్థి  – -  – 1 28 6  –
భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి 142 98 1732 120 INDIA

మూలాలు

మార్చు
  1. "Opposition names alliance INDIA in run-up to 2024 elections". The Economic Times (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.
  2. Hrishikesh, Cherylann Mollan & Sharanya (18 July 2023). "Opposition meeting: 26 Indian parties form alliance to take on PM Modi". BBC News. Archived from the original on 20 July 2023. Retrieved 18 July 2023.
  3. Nair, Sobhana K. (18 July 2023). "Picking the name INDIA for alliance, Opposition parties frame 2024 battle as BJP vs the country". The Hindu. Retrieved 21 July 2023.
  4. Ghosh, Poulomi (19 July 2023). "'Who gave INDIA name? Who can't arrive at consensus…': BJP's dig 10 points". Hindustan Times. Retrieved 21 July 2023.
  5. "Tenets of unity: On the Opposition meet in Patna". The Hindu. 25 June 2023.
  6. "విపక్ష కూటమి ఇండియా |". web.archive.org. 2023-09-05. Archived from the original on 2023-09-05. Retrieved 2023-09-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Opposition alliance named 'INDIA', 11-member coordination committee to decide on all important issues". The Times of India. 2023-07-19. ISSN 0971-8257. Archived from the original on 19 July 2023. Retrieved 2023-07-19.
  8. "Opposition Meeting: లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ.. 'ఇండియా' కూటమి తీర్మానం | opposition alliance finalises coordination committee". web.archive.org. 2023-09-05. Archived from the original on 2023-09-05. Retrieved 2023-09-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Live Updates: INDIA bloc forms 14-member coordination panel, says seat-sharing formula for 2024 Lok Sabha polls soon". The Indian Express (in ఇంగ్లీష్). 1 September 2023.
  10. "I.N.D.I.A Opposition bloc 2-day meet ends, resolution adopted, coordination committee formed". IndiaTV (in ఇంగ్లీష్). 1 September 2023.
  11. "Opposition Alliance Unveils Name "INDIA" – Indian National Developmental Inclusive Alliance". Akhil Bharat Times News. 18 July 2023. Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.
  12. https://www.ndtv.com/india-news/the-26-opposition-parties-that-have-formed-mega-alliance-for-2024-lok-sabha-election-4217778