కోదండరాం
కోదండరామ్ అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్ కోదండరాం గా సుపరిచితుడు. ఆయన ఒక విద్యావేత్త, ఆచార్యులు, రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (T-JAC)కి అధ్యక్షులు. తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అద్యక్ష్యుడు.
ముద్దసాని కోదండరామి రెడ్డి | |||
ప్రొఫెసర్ . కోదండరాం | |||
పదవీ కాలం 16 ఆగస్టు 2024 – 30 జనవరి 2027 | |||
నియోజకవర్గం | గవర్నర్ కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సెప్టెంబరు 5, 1955 ఊటూర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ జన సమితి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె. | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | విద్యావేత్త , ఆచార్యులు, రాజకీయనేత. |
వ్యక్తిగతం
మార్చుమంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లిలో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు. విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లోనే జరిగింది. వరంగల్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదులో చేరాడు. 2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2009 డిసెంబరు 24న తెలంగాణ రాజకియ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) కన్వీనర్ గా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ కొత్త రాష్ట్రము ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సమితితో విభేదించి కొత్తగా తెలంగాణ జన సమితి పేరుతో ప్రాంతీయ పార్టీని 2018 మార్చి 31న ప్రారంభించాడు. [1][2]
ఎమ్మెల్సీగా
మార్చుకోదండరామ్ 2024 జనవరి 25న తెలంగాణ శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3][4]
కోదండరామ్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించగా ఆ నియామకాన్ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని 2024 జనవరి 30న ఉత్తర్వులు ఇచ్చింది.[5] గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా 2024 ఆగష్టు 16న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.[6][7] [8].[9]
అవార్డులు
మార్చు- వరల్డ్ పీస్ ఫెస్టివల్ అవార్డు 2014 (శాంతి దూత అవార్డు).[10]
మూలాలు
మార్చు- ↑ Telangana Jana Samithi vows to fulfil people’s wishes
- ↑ Kodandaram gets EC nod for political dive, names new party Telangana Jana Samithi | Hyderabad News - Times of India
- ↑ Eenadu (25 January 2024). "గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక.. తమిళిసై ఆమోదం". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Prabha News (25 January 2024). "గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదందరామ్, మీర్ అమీర్ అలీ ఖాన్…". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Eenadu (30 January 2024). "గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ NT News (16 August 2024). "ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.
- ↑ Shiva (2024-08-16). "BIG BREAKING: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమెర్ అలీఖాన్". www.dishadaily.com. Retrieved 2024-08-16.
- ↑ ABN (2024-08-16). "Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్." Andhrajyothy Telugu News. Retrieved 2024-08-16.
- ↑ Eenadu (16 August 2024). "ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణం". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.
- ↑ Telangana News (2015-02-21). "Shanti Dootha Award Prof Kodandaram". Telanganastateofficial.com. Retrieved 2016-12-01.