ఆర్. సామల

తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
(రమేష్ సామల నుండి దారిమార్పు చెందింది)

ఆర్. సామల (రమేష్ సామల) తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] 2015లో వచ్చిన కొలంబస్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[2]

ఆర్. సామల
జననం
రమేష్ సామల

మే 12
విద్యఎంఏ (నాటకరంగం)
విద్యాసంస్థహైదరాబాదు విశ్వవిద్యాలయం
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
తల్లిదండ్రులు
  • పోశాలు (తండ్రి)
  • లక్ష్మీ (తల్లి)

జననం, విద్య

మార్చు

రమేష్ సామల మే 12న పోశాలు - లక్ష్మీ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా వారిలో రమేష్ ఆఖరివాడు. తండ్రి వ్యవసాయం చేసేవాడు.

స్వగ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యను చదివిన రమేష్, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా వరంగల్ పట్టణంలో చదువుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖ నుండి నాటకరంగంలో ఎంఏ పూర్తిచేసి, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాడు.[3]

నాటకరంగం

మార్చు

పాఠశాల స్థాయినుండే బుర్రకథలు, నాటకాలు వేసేవాడు. ఆల్ ఇండియా రేడియోలో కవిత్వ రచన పఠనం కూడా చేసాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వహించిన నాటకరంగ శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నాడు. యవనిక నాటకరంగ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడు.

సినిమారంగం

మార్చు

సినిమారంగ ప్రవేశం

మార్చు

ఎంఏ పూర్తికాగానే 2001లో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ద్వారా త్రివిక్రమ్- విజయ భాస్కర్ రూపొందించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి అప్రెంటిస్ గా చేరాడు. ఆ సినిమా మధ్యలోనే విజయ భాస్కర్ కి రమేష్ పనితనం నచ్చి విక్రమ్ కె కుమార్ తొలి సినిమా ఇష్టం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా సిఫార్సు చేశాడు. ఆ సినిమా తరువాత మళ్ళీ విజయ భాస్కర్ హిందీతో తీసిన తుజ్హే మేరీ కసం సినిమాకి పనిచేసాడు. మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు.[4] ఆ తర్వాత వరుసగా సురేందర్ రెడ్డి, వైవిఎస్ చౌదరి, కె. రాఘవేంద్రరావు వంటి దర్శకుల వద్ద పనిచేశాడు.

రచయితగా

మార్చు

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంతో నితిన్, నిత్యా మీనన్ నటించిన ఇష్క్‌ సినిమాకు మాటలు రాయడంతో సినిమా రచయితగా మారాడు.[5] దృశ్యం -2 తెలుగు రీమేక్ సినిమాకి మాటలు రాసాడు.[6]

దర్శకుడిగా

మార్చు

2015లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా కొలంబస్ తో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, మిస్తీ చక్రవర్తి, సీరత్ కపూర్ ప్రధాన నటులుగా నటించారు.[7][8]

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "With hope and confidence". The Hindu. 2015-10-19. ISSN 0971-751X. Archived from the original on 2015-10-20. Retrieved 2023-05-15.
  2. "అలా 'కొలంబస్' డైరెక్ట్ చేసే ఛాన్సొచ్చింది". Samayam Telugu. 2015-10-26. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
  3. "Tollywood Director R Samala Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2017-09-11. Retrieved 2023-05-15.
  4. "Ramesh Samala Interview - News". IndiaGlitz.com. 2015-10-26. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
  5. "చిట్ చాట్ : రమేష్ సామల – కొలంబస్ చిత్రం విజయవంతం చేసిన ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. |". 2015-10-26. Archived from the original on 2015-10-30. Retrieved 2023-05-15.
  6. "Drushyam 2 Review: Engaging enough but…". Telugu Cinema. 2021-11-25. Archived from the original on 2021-11-25. Retrieved 2023-05-15.
  7. "ColumbusUA". The Times of India. 2015-10-22. ISSN 0971-8257. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
  8. "Columbus Telugu Movie Review". 2015-10-24. Archived from the original on 2015-10-22. Retrieved 2023-05-15.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్._సామల&oldid=4349605" నుండి వెలికితీశారు