వికీపీడియా చర్చ:తెవికీ పుష్కర ఉత్సవాలు-Tewiki 11th Anniversary

తాజా వ్యాఖ్య: సభ్యుల సూచనలు, సలహాలు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
మొదటి పేజి
Main
కార్యక్రమ ప్రణాళిక
Program Details
11వ వార్షికోత్సవ సంబరాలు
11th Anniversary Celebrations
ఖర్చులు
Budget
స్పాన్సర్స్
Sponsors
చర్చ
Discussion
నివేదిక
Documentation
కార్యవర్గం
Committee

11 వ వార్షికోత్సవ ఉత్సవాల గురించి ప్రతిపాదనపై ఇక్కడ పేజీ సృష్టించబడినది. సహ సభ్యులు మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇక్కడ ఈ పేజీలో అందించగలరు

వ్యాసరచన పోటీ

మార్చు

ముందుగా వికీమీడియన్లు అందరికీ తెవికీ పదకొండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమ ఏర్పాటు విషయంలో నాదొక సూచన. మనం ఓ వ్యాసరచన పోటీ కూడా నిర్వహించి వాటిలో గెలచినవారికి బహుమతులు అందజేస్తే బావుంటుంది. నా సూచనలు.

  1. పోటీ కోసం వారికి నచ్చిన పూర్తిస్థాయి వ్యాసాలు రచింపజేస్తే బావుంటుంది.
  2. ఎంపికయ్యే వ్యాసాలు అతిశయోక్తి రహితంగా, నోటబిలిటీ ప్రమాణాలకు చేరగలిగేదిగా ఉండాలి.
  3. వీలుంటే నాలుగైదు బహుమతుల్లో మూలాలు చేర్చడం, పూర్తిస్థాయిలో తయారుచేయడం, అవసరమైన ఫోటోలు చేర్చడం, మొదలుగా అనేక ప్రమాణాలతో ఉంటే బావుంటుంది.
  4. అన్ని విధాలుగానూ బావున్న వ్యాసానికి వాటన్నిటికన్నా వేరుగా బహుమతి ఇవ్వడమూ మంచి ఆలోచనే.
  5. ఈ పోటీ ద్వారా సీరియస్ గా ప్రయత్నించే రచయితలకు వికీ మీద, వికీలో తమ అభిరుచికి అనుగుణంగా చేయదగ్గ పనుల మీద మౌలికమైన అవగాహన వచ్చేలా తీర్చిదిద్దవచ్చు.
  6. ఆ క్రమంలో ముందుగా నిర్ణయించుకున్న పరిధుల్లో వికీపీడియన్లు ఆయా విభాగాలలో పనిచేస్తున్న పోటీదారులకు మెంటార్లలా కూడా చేయవచ్చు.

ఇవన్నీ ఆ పోటీ విషయంలో నేను ఊహచేస్తున్న విషయాలు. ఆచరణసాధ్యం కాని విషయాలు తొలగించి మరెవరైనా మరింత మంచి ప్రతిపాదనలు కూడా చేరిస్తే మరీ మంచిది.--పవన్ సంతోష్ (చర్చ) 07:59, 22 అక్టోబరు 2014 (UTC)Reply

  1. ఈ ఆలోచన బాగానె వుంది. అయితే....... వ్యాస రచ పోటీని ముందుగానే నిర్వహించి ... ఫలితాలను ప్రకటించి... అందులో మొదటి/రెండవ బహుమతులను పొందిన వారిని 11వ వార్షికోత్సవాలకు వికీపీడియా ఖర్చులతో ఆహ్వానిస్తే బాగుండునేమో............ Bhaskaranaidu (చర్చ) 15:40, 5 నవంబర్ 2014 (UTC)
  2. వ్యాసరచన కు వాలంటీరుగా ప్రచార బాద్యతలు వహించటానికి నేను సిద్డ్డం - కశ్యప్

కొన్ని ఆలోచనలు

మార్చు
  • వికీపీడీయన్లు తిరుపతి తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి పట్టణాలు, విశేషాలను ఫోటోలు తీసి వాటిని కామన్స్‌లో ఎక్కించాలి. అవి వ్యాసాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఉదాహరణకు శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహం తిరుపతిలో ఉందట కదా.
  • తి.తి.దే వారి సహకారం అందితే, వారి గ్రంథాలయంలోని డిజిటైజ్ చేసిన పుస్తకాలకు మన అందుబాటులో ఉండే విషయం మాట్లాడాలి. వారు కొన్నేళ్ళక్రితం గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ స్కాన్ చేసి పెట్టే కార్యక్రమం చేపట్టారని విన్నాను

--వైజాసత్య (చర్చ) 06:24, 31 అక్టోబరు 2014 (UTC)Reply


ఇక్కడ మీ సూచనలు, సలహాలు మరేవైనా మొటికాయలు, అక్షింతలు గట్రాలు

మార్చు

మునుపు మాలాంటి యువకులు కొందరు ముందుకువచ్చి దశమ వార్షికోత్సవం నిర్వాహణలో పాలుపంచుకున్నాము. ఈసారి నిర్వాహణ బాధ్యతలను కొంతమంది సీనియర్ సభ్యులు తీసుకోవాలని మాలాంటి వారి కోరిక. --Pranayraj1985 (చర్చ) 09:05, 4 నవంబర్ 2014 (UTC)

ఇక కార్యక్రమాలలో విజయవాడ అనుభవం దృష్ట్యా నా కొన్ని సూచనలు

మార్చు
  • కార్యక్రమం రెండురోజులు అనుకొంటే మొదటి రోజు ఉదయం నుండి భోజనాల వరకూ పరిచయాలు, నాలుగైదు ముక్కల చిన్న చిన్న ప్రసంగాలు.
  • మధ్యాన్నం తరువాత మూడు రకాలైన ఆటలు సాయంత్రం వరకూ.
  • ఆటలు సాయంత్రానికి అయిపోతే అపుడు చర్చలు రాత్రి వరకూ.
  • రెండో రోజు .....నాకు ప్రస్తుతం ఐడియా లేదు :)....విశ్వనాధ్ (చర్చ) 11:41, 31 అక్టోబరు 2014 (UTC)Reply

సభలో తీర్మానాలు

మార్చు

జరగబోయే సభలో వికీపీడియా అభివృద్ధికి ఏమైనా తీర్మాలు చేయాలి. అందులో ఒకటి: వికీపీడియా గురించి సమగ్ర నివేధిక తయారు చేసి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఆంధ్ర/ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి ఈ విషయంలో ప్రభుత్వం తగు సహకారం ఇవ్వాలని కోరాలి. (ఎలాంటి సహకారము ఇవ్వాలో అందులో పొందు పరచాలి) Bhaskaranaidu (చర్చ) 15:28, 5 నవంబర్ 2014 (UTC)

కోశాధికారి

మార్చు

కోశాధికారిగా ఇప్పటికే తెవికీ 10 ద్వారా మంచి అనుభవం ఉన్న కశ్యప్ ను అదే పనికి మెంబర్‌గా ప్రతిపాదిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతర్ం ఉంటే తెలియచేయగలరు...విశ్వనాధ్ (చర్చ) 07:06, 4 నవంబర్ 2014 (UTC)

  1. కోశాధికారిగా కశ్యప్ ప్రతిపాదన నాకు అంగీకారమే Pranayraj1985 (చర్చ) 09:02, 4 నవంబర్ 2014 (UTC)
  2. నాకూ సమ్మతమే Bhaskaranaidu (చర్చ) 11:03, 4 నవంబర్ 2014 (UTC)
  3. కశ్యప్ వంటి అనుభవం గల వ్యక్తి కోశాధికారిగా సమర్ధుడు అని నా మద్దతు తెలియజేస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 05:40, 5 నవంబర్ 2014 (UTC)
  4. కశ్యప్ కోశాధికారిగా ఉండడం నాకు అంగీకారమే. --t.sujatha (చర్చ) 12:39, 5 నవంబర్ 2014 (UTC)
  5. ఎవరైనా సమ్మతమే. JVRKPRASAD (చర్చ) 07:29, 11 నవంబర్ 2014 (UTC)

అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శి

మార్చు

ఎల్లంకి భాస్కరనాయుడు Bhaskaranaidu గారిని 11 వ వార్షికోత్సవాలకు అద్యక్షులుగా, మరియు తమ్మిపూడి సుజాత t.sujatha గారిని ఉపాధ్యక్షులుగా, ప్రణయ్‌ Pranayraj1985 ను కార్యదర్శిగా ప్రతిపాదిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియచేయగలరు...విశ్వనాధ్ (చర్చ) 14:06, 4 నవంబర్ 2014 (UTC)

సభ్యుల అంగీకారం

మార్చు

మద్దతు

మార్చు
  1. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:14, 4 నవంబర్ 2014 (UTC)
  2. భాస్కరనాయుడు మరియు సుజాత గార్లు తమకున్న వికీ అనుభవాల్ని, తమ ఉద్యోగవ్యవహార అనుభవాలను మేళవించి ఈ సమావేశాలను నిర్వహించి తద్వారా తెలుగు వికీపీడియా ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి.--Rajasekhar1961 (చర్చ) 05:38, 5 నవంబర్ 2014 (UTC)
  3. * ఎవరైనా సమ్మతమే. JVRKPRASAD (చర్చ) 07:31, 11 నవంబర్ 2014 (UTC)

వ్యతిరేకత

మార్చు

అభిప్రాయం

మార్చు

CISA2K సహకారం

మార్చు

CISA2K నుండి గత దశాబ్ధి ఉత్సవాలకు విష్ణువర్ధన్ (వాడుకరి:Visdaviva) గారి ద్వారా అపూర్వమైన సహాకారం అభించింది. అదే విధంగా ఆయన వ్యక్తిగతంగానూ ఎంతో శ్రమించి ఉత్సవాలను విజయవంతంగా జరపడంలో సహాయపడ్డారు. ఇపుడు జరుపబోవు ఈ 11వ వార్షికోత్సవాలలో కూడా గతంలోలానే తెలుగు వికీపీడియాకు CIS నుండి, మరియు మీరు రహమానుద్దీన్ ఇద్దరూ మాకు తోడ్పాటు అందించాలని మా ఆకాంక్ష

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల సమావేశాలు

మార్చు

1. మొదటి సమావేశం (28.12.2014)

మార్చు

మొదటి సమావేశం గత ఆదివారం గోల్డెన్ త్రెషోల్డ్ లో నిర్వహించిన తెలుగు వికీమీడియా హాకథాన్ -2014 కు ముందు ఉదయం సభ్యుల అందరి మధ్య జరిగింది. దీనిలో పాల్గొన్న సభ్యులు

  1. రాజశేఖర్
  2. భాస్కరనాయుడు
  3. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  4. కొంపెల్ల శర్మ
  5. విశ్వనాధ్
  6. వీవెన్
  7. రహ్మానుద్దీన్
  8. పవన్ సంతోష్
  9. ప్రణయ్‌రాజ్ వంగరి

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్ధేశ్యం

  • తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం.
  • తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం.
  • తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం.
  • తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం.
  • తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం.
  • గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం.

స్థలం మరియు తేదీలు

  • తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం నిర్వహించడానికి స్థల నిర్ణయంకు మరికొన్ని రోజుల సమయం అవసరం. వార్షికోత్సవ తేదీలు కూడా నిర్ణయించాలి.

చేయవలసిన పనులు

  • బడ్జెట్ వేగంగా పూర్తి చేయాలి
  • ముందస్తు వికీ శిక్షణ ఎక్కడెక్కడో నిర్ణయించాలి
  • వసతి ఏర్పాట్ల గురించి నిర్ణయించాలి
  • తిరుపతికి వెళ్ళి ముందుగా కార్యక్రమం అమలు పనులు చూడాలి

జరిగిన పనులు

2. రెండవ సమావేశం (28.12.2014)

మార్చు

రెండవ సమావేశం బుధవారం (28.12.2014) నాడు ఉదయం 11 గంటలకు స్కైప్ ద్వారా జరిగింది. దీనిలో పాల్గొన్న సభ్యులు

  1. రాజశేఖర్
  2. భాస్కరనాయుడు
  3. టి. సుజాత
  4. విష్ణువర్ధన్,
  5. విశ్వనాధ్
  6. ప్రణయ్‌రాజ్ వంగరి

చర్చించిన అంశాలు

  • రాజశేఖర్ గారు 11వ వార్షికోత్సవాల గురించి టి. సుజాత గారికి వివరించారు. దానికి సంబంధించి జరిగిన పనులు తెలిపారు.
  • విశిష్ట వికీపీడియన్లకు పుష్పగుచ్చం, శాలువాతో సన్మానం చేస్తే బాగుంటుందని భాస్కరనాయుడు గారు సూచించారు.
  • వ్యాస రచన గురించి జరిగిన చర్చలో ‘‘లయోలా, కె.బి.ఎన్ కాలేజి నుంచి విద్యార్థులు వస్తారు. వాళ్లు కాకుండా ఇతర కాలేజీలకు వ్యాస రచన పోటి పెట్టాలి. అది ఈ వారంలో ఫైనల్ అవ్వాలి. వివరాలతో కూడిన పోస్టర్ తయారుచేయండని’’ విష్ణువర్ధన్ గారు అన్నారు.
  • వార్షికోత్సవ బడ్జెట్ పనులు పూర్తిచేసి ఈ వారంలో వికీమీడియా ఫౌండేషన్ కి, సిఐఎస్ కి రిక్వెస్ట్ పెట్టాలని విష్ణువర్ధన్ గారు సూచించారు.
  • వచ్చేవారం అనగా జనవరి 5,6 తేదీలలో ఒకసారి తిరుపతి పర్యటనచేసి, అక్కడి పరిస్థితులు గమనించాలి.
  • వీలైంనంత తొందరగా ఉత్సవాల వేదిక, తేదీలు; కార్యక్రమ ప్రణాళిక; బడ్జెట్; ముందు అడ్వాన్స్; పబ్లిసిటీ; ముందస్తు అకాడమీల నిర్వాహణ పనులు పూర్తికావాలి.

3. మూడవ సమావేశం (04.01.2015)

మార్చు
  1. బడ్జెట్ ఖరారు చేయడం.
  2. కార్యక్రమ ప్రణాళిక
  3. రెండురోజుల కార్యక్రమాలు
  4. విశిష్ట వికీ పురస్కారం ఎవరి పేరున ఇవ్వాలి
  5. అతిధులు ఎవరు
  6. బహుమతులు ఎన్ని, ఎవరికి, ఎలా- వీటిని అత్యవసరంగా చర్చించి తవరగా ఒక కొలిక్కి తీసుకురావాలి..--విశ్వనాధ్ (చర్చ) 15:48, 3 జనవరి 2015 (UTC)Reply


  • మూడవ సమావేశం ఆదివారం (04.01.2014) నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్యం 1.30 నిల వరకు స్కైప్ ద్వారా జరిగింది. దీనిలో పాల్గొన్న సభ్యులు
  1. రాజశేఖర్
  2. భాస్కరనాయుడు
  3. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  4. కొంపెల్ల శర్మ
  5. మురళీమోహన్
  6. విశ్వనాధ్
  7. కశ్యప్
  8. ప్రణయ్‌రాజ్ వంగరి

చర్చించిన అంశాలు

  1. వార్షికోత్సవ బడ్జెట్ ప్రణాళకపై చర్చించి సభ్యుల సలహాలను తీసుకోవడం జరిగింది. ఈ రోజు రాత్రికి పూర్తిచేసి, వికీమీడియా ఫౌండేషన్ కి రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది.
  2. అతిధులు గురించిన చర్చ జరిగింది. జిల్లా కలెక్టర్ వంటి ప్రముఖులను ఆహ్వనిస్తే మీడియా కవరేజి బాగుంటదని ఒక సూచన.
  3. సమావేశ తేదీలు నిర్ణయించడానికి కొంత సమయం కావాలి. తిరుపతి వెళ్లిన తర్వాతకాని నిర్ణయించలేము. ఎందుకంటే 14వ తేది రెండవ శనివారం అవడంవల్ల కళాశాలు సెలవులు ఉంటాయేమో అన్న అనుమానం ఉంది.
  4. విశిష్ట వికీపీడియన్ అనేది ఎలాంటి ప్రాతిపదికన ఎన్నిక చేయాలన్న విషయం చర్చించాలి.
  5. తిరుపతి ప్రాంతంలోని ఫోటోగ్రాఫర్స్ తో ఒక ఫోటో ఎగ్జిబిషన్ (తెలుగు సంస్కృతి గురించిన) ఏర్పాటుచేస్తే బాగుంటుందని రహ్మనుద్దీన్ ఇచ్చిన సలహా మేరకు సమావేశంలో చర్చ జరిగింది.
  6. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవంలో మీడియా పార్టనర్ గా సహకరించిన కంప్యూటర్ ఫర్ యు మ్యాగజైన్ వారిని ఈసారి కూడా మీడియా పార్టనర్ గా ఆహ్వానించాలి.
  7. నాల్గవ సమావేశం 6వ తేది సాయంత్రం జరపాలని నిర్ణయించడమైనది.

4. నాల్గవ సమావేశం (06.01.2015)

మార్చు

నాల్గవ సమావేశం మంగళవారం (06.01.2014) నాడు రాత్రి 8 గంటల నుండి 9.30 నిల వరకు స్కైప్ ద్వారా జరిగింది. దీనిలో పాల్గొన్న సభ్యులు

  1. రాజశేఖర్
  2. భాస్కరనాయుడు
  3. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  4. టి. సుజాత
  5. మురళీమోహన్
  6. విశ్వనాధ్
  7. కశ్యప్
  8. ప్రణయ్‌రాజ్ వంగరి

చర్చించిన అంశాలు

  1. 2014 సంవత్సరంలో వికీపీడియాలో చురుకుగా పాల్గొన్నవారిలో 5 మందికి విశిష్ట వికీపీడియన్ అని బహుమతి ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. అది ఏ పేరుతో ఇస్తే బాగుంటుంతో అన్న విషయంపై రచ్చబండలో చర్చించి నిర్ణయించాలి.
  2. వ్యాసరచన పోటీ గురించి ఎలాంటి కొలమానం, నిబంధనలు ఎలాంటివి ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. వ్యాసరచన మార్గదర్శకంకోసం ఒక వీడియో ఉంటే బాగుంటుందని కశ్యప్ సూచించారు.
  3. రెండు రోజుల సమావేశంలోని వివిధ కార్యక్రమాలలో ఒక్కో కార్యక్రమానికి ఒక్కో వికీపీడియన్ బాధ్యత తీసుకుని నడిపించాలని, అంతేకాకుండా మొత్తం కార్యక్రమానికి ఒకరు అనుసంధానకర్తగా ఉండాలని రాజశేఖర్ సూచించి, టి. సుజాత ను కార్యక్రమ అనుసంధానకర్తగా వ్యవహరించమని కోరారు.
  4. తిరుపతిలోని మీడియా మరియు పత్రిక విలేఖరులకు ఒక వికీ అవగాహన కార్యక్రమం నిర్వహించాలి.
  5. ఇతర భారతీయ భాషల నుండి వచ్చిన ఒక్కో వికీపీడియన్ తో ఒక్కో తెలుగు వికీపీడియన్ కలిసి వ్యాసాల అనువాదాలు చేయిస్తే బాగుంటుందని సూచించారు.

సభ్యుల సూచనలు, సలహాలు

మార్చు

భాస్కరనాయుడి గారి ద్వారా -

1. చేతి పుస్తకము/కరపత్రాలు / సామాజిక మాధ్యమాలు

మార్చు
ముందుగా చేతి పుస్తకం ద్వారా /కరపత్రాలు / గోడ పత్రికల ద్వారా / ఇతర మాద్యమాల ద్వార ప్రచారం జరగాలి. చేతి పుస్తకం (hand book) కొత్తవారికి/ ఇదివరకే చేరిన వారికి రచనలు కొనసాగించేలా ప్రోత్సాహ కరంగా వుండాలి. దీనిని ప్రత్యేకంగా రూపొందించాలి. మన ప్రయాణ మార్గంలో ఎదురయ్యే కళాశాలలు, గ్రంధాలయాలు, ఇతర సంస్థల చిరునామాలు సేకరించి వారికి చేతిపుస్తకాలు/కరపత్రాలు పంపిణి చేయాలి. వారు అంగీకారంతో ఆయా సంస్థలలో మన అవగాహన కార్యక్రమము చేయవచ్చు. ఆ యాప్రాంతాలలో ప్రాంతీయంగా వున్న వున్న వికీపీడియన్లను కలుపు కోవాలి.
ముందుగా ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని రూపొందించి దానిని సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ , వాట్సప్ లో పంపిణీ చేయగలిగితే ఎక్కువ మంది తెలుగువారి కి ఈ సమాచారం చేరవేయవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11
49, 23 డిసెంబరు 2014 (UTC)

2. ప్రచార మాధ్యమాలు

మార్చు
ప్రసార మాధ్యమాలను ఆహ్వానించి వారికి తెవికి గురించి తగు ప్రచారము చేయడానికి ప్రోత్సాహం కల్పించాలి

3. ముఖ్య అతిధులకు ఆహ్వానము

మార్చు
తిరుపతిలో ప్రాంతీయంగా వున్న ప్రముఖులను (రాజకీయ ప్రముఖులు/విధ్యాప్రముఖులు మొ|| వారిని ప్రధాన సమావేశానికి ఆహ్వానించాలి. అహ్వానాన్ని మన్నించిన వారికి వికీపీడియా గురించి కొంత ఆవగాహన కలిగించాలి.
విశిష్ఠ అతిధిగా 2014 తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, చిత్తూరు జిల్లా వాసి శ్రీ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11
46, 23 డిసెంబరు 2014 (UTC)

4. విద్యార్థులకు వ్వాసరచన పోటి ... పురస్కారాలు

మార్చు
తిరుపతిలోని విజ్ఞాన భారతి కళాశాల/ఉన్నతపాఠశాల విద్యార్తులకు వ్యాసరచ పోటీ నిర్వహించి గెలుపొందిన వారికి పురస్కారాలు ఇవ్వాలి.
కేవలం తిరుపతి మాత్రం కాక, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కళాశాలలను వ్యాసరచనలో భాగం చేయాలి.

5. వికీపీడియన్లకు పురస్కారాలు

మార్చు
గత సమావేశంలో అనుకున్నట్లు వికీపీడియాలో అత్యధిక కృషి చేసిన వారిలో ఐదు మందికి తగు పురస్కారాలు ఇవ్వాలి.
ఈ పురస్కారానికి అర్హులుగా..... 2014 లో వికీపీడియా లోని అన్ని సోదర ప్రాజెక్టులలో కలిపి అత్యధిక మార్పులు చేసిన సభ్యులను ఎన్నుకోవాలి.
ఈ పురస్కారానికి వికీపీడియన్ ఆఫ్ ది ఇయర్ /2014 సంవత్సర వికీపీడియన్ / ఈ ఏటి ఉత్తమ వికీపీడియన్ అని పేరు పెట్టవచ్చు.
ఈ పురస్కారమునకు ప్రఖ్యాత రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు పురస్కారం గా వ్యవహరించే ప్రతిపాదనను సభ్యులు చర్చించవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11
47, 23 డిసెంబరు 2014 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు గారు పెద్ద రచయితేమీ కాదు. ఆయనకంటే తెలుగులో గొప్ప రచయితలు చాలామందే ఉన్నారు. వికీపురస్కారానికి ఆయన పేరు పెట్టడానికి కారణం తెలుగు విజ్ఞానసర్వస్వరంగంలో ఆయన చేసిన కృషివళ్లే. విజ్ఞానసర్వస్వమైన వికీపీడియాలో కృషిని గుర్తించడానికి అంతకంటే మంచి పురస్కారమేముంటుంది. కాబట్టి అదే పేరు కొనసాగించాలని నా సూచన --వైజాసత్య (చర్చ) 12:02, 23 డిసెంబరు 2014 (UTC)Reply
ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రముఖుడి పేరుతో పలానా సంవత్సర విశిష్ట వికీపీడియన్ అని పెడితే మనలో, బయట చాలా మందికి కొందరి గురించిన సమాచారం ప్రతి సంవత్సరం తెలుస్తూ ఉంటుంది..విశ్వనాధ్ (చర్చ) 15:33, 23 డిసెంబరు 2014 (UTC)Reply
వికీపురస్కారానికి తిరుపతి స్థానికుడైన నామిని పేరు పేరు పెట్టవచ్చుననే అలోచన చాల గొప్పది. ప్రతిపాదించిన సుల్తాన్ ఖాధర్ గారికి చాల ధన్యవాదాలు. దీనికి నాపూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. వాడుకరి:Bhaskaranaidu (చర్చ) 15:43, 23 డిసెంబరు 2014 (UTC)Reply
తిరుపతి స్థానికునిగానో, ఒక మంచి రచయితగానో నామిని పేరు పెడితే అది మంచి సంప్రదాయానికి దారితీయదు. ప్రస్తుతం ఉన్న తెలుగు సాహిత్యలోకంలో లేనిపోని వివాదాలకు ఎంతోకొంత మూలబీజమవుతుంది. పేరు పెట్టాలంటే అతను అందరికీ విజ్ఞానం, 'స్వేచ్ఛా విజ్ఞానం, విజ్ఞాన సర్వస్వం వంటి అంశాల్లో మైలురాయి కాదగ్గ కృషి చేసిన వ్యక్తి అయితేనే మనం ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోగలుగుతాము. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన పల్లెమనసు తెలిపే స్వచ్ఛమైన కథలు, మధురమైన చిత్తూరు యాస వంటివి వ్యక్తిగతంగా ఇష్టపడే వ్యక్తినే అయినా నేను కేవలం నిష్పాక్షిక దృష్టితో ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 16:48, 31 డిసెంబరు 2014 (UTC)Reply

6.ఇతర సంస్థల సహకారం

మార్చు

తిరుపతిలో ఇతర భావసారూప్య సంస్థలైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగము మరియు తిరుమల తిరుపతి దేవస్థానము ల సహకారం వీలైతే తీసుకోవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:52, 23 డిసెంబరు 2014 (UTC)Reply

7.వికీపీడియన్లకు / ఇతరులకు సమావేశానికి ఆహ్వానించుట గురించి

మార్చు
తిరుపతి వార్షికోత్సవానికి సహ వికీపీడియన్లను కూడ ఆహ్వానించాలి. అటువంటి ఆహ్వానానికి ఎవరు అర్హులో సూచించాలి.

ఉదా: 2014 వ సంవత్సరంలో కనీసం 1000 దిద్దుబాట్లు (అన్నీ కలిపి) చేసిన వారు మాత్రమే అర్హులుగా......???? నిర్ణయించాలి. వీరితో బాటు దిద్దుబాట్ల సంఖ్యతో సంబంధంలేకుండా నిర్వహకులను కూడ ఆహ్వానించాలి. వికీపీడియా నుండి వారికి ప్రయాణపు ఖర్చులు, భోజన ,వసతి కల్పించాలి.

వికీపీడియన్లు కాని వారిలో ఒకరిద్దరిని భాషా పండితులను కూడ అవ్యానించాలి. తెవికికి భాషా సంబందమైన విషయంలో వారి సలహాలను కోరాలి.
  • 2014 లో 1000 దిద్దుబాట్లు చేసినవారే సభకు ఆహ్వానితులుగా నిర్ణయించిన సభ్యులు చాలా మంది అనర్హకుల జాబితాలో చేరుతారు.Palagiri (చర్చ) 04:11, 23 డిసెంబరు 2014 (UTC)Reply
2014 అనే కాదు. వికీపీడియన్ అయిన అందరూ ఆహ్వానితులుగా ఉండేలా చూడాలి..విశ్వనాధ్ (చర్చ) 05:54, 24 డిసెంబరు 2014 (UTC)Reply

8.చొక్కాలు.. టోపీలు.. మొదలగునవి

మార్చు

ప్రతి తెలివి సమావేశంలో చొక్కాలు ( టీ షర్టులు) ఇచ్చే సాంప్రదాయం కొన సాగుతున్నది. దాంతో బాటు ఈ సమావేశంలో వికీపీడియా చిహ్నంతో వున్న టోపీ ఇస్తే బాగుంటుంది.

దీనికి గాను గంపగుత్తగా ఒకే సంస్థకు తయారీ బాధ్యతలను అప్పగించవచ్చు. ఈ చొక్కా ఆకృతి వికీపీడియనులలో ఎవరైనా రూపొందించవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:47, 23 డిసెంబరు 2014 (UTC)Reply
గతంలో పంచిన చొక్కాలు చాలా నాసి రకంగా ఉన్నాయి.ఈ సారి అటువంటి పొరబాటు జరుగకుండా చూడాలి.Palagiri (చర్చ) 04:05, 23 డిసెంబరు 2014 (UTC)Reply

9.సమావేశానంతరము......

మార్చు

విజయ వాడ సమావేశం సందర్భంగా (దశమ వార్షిక ఉత్సవాలు) నిర్వహించిన మాదిరి తిరుపతి సమావేశాలు అయిన అనంతరము రెండు రోజులు తిరుపతి చుట్టుప్రక్కల వున్న కళాశాలలో రెండు రోజులు తెవికి అవగాహన సదస్సు నిర్వహించాలి.

10. ముందస్తు సమావేశాలు

మార్చు

జనవరి 2015 లో వారానికి ఒక సమావేశము జరిపి పై విషయాలను కూలంకషంగా పరిశీలించి నిర్ణయించి సహ సభ్యుల ఆమోదం పొందాలి.

11. జమాఖర్చు

మార్చు

జమాఖర్చు (బడ్జెట్) కొరకు WMF వారికి ముందుగా సవివరంగా ప్రతిపాదన పంపించాలి. దాని తయారీ ముందు జరగాలి. లేదంటే ఏపనీ జరగక అందరిపై వత్తిడి తీవ్రమవుతుంది. ఈ నెలలో అది పూర్తి కావాలి..విశ్వనాధ్ (చర్చ) 13:44, 23 డిసెంబరు 2014 (UTC)Reply

12. 13,14. 1సహా వికీపీడియన్లు ఏమైనా సూచనలు చేయ వచ్చును.

మార్చు



తెవికీ గురించి నిష్ణాతుల ప్రసంగాలు

మార్చు

గత నెలవారీ సమావేశంలో కార్యక్రమం గురించిన కీలకమైన చర్చలో టి.విష్ణువర్థన్ తెవికీ ప్రమాణాలు, వ్యాసాలపై నిష్ణాతులచే మాట్లాడించాలని ప్రతిపాదించారు. దీనిపట్ల వికీపీడియన్లలో కూడా సానుకూలమైన స్పందన వెలువడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు, వివిధ పత్రికల, భారతీయ విద్యాప్రమాణాలపై నిర్వహించిన అతిపెద్ద సర్వేల రిపోర్టులకు సంపాదకత్వం వహించిన వ్యక్తి శ్రీ దూసనపూడి సోమసుందర్ ను సంప్రదించాను. వారిని రేపటెల్లుండిలో వ్యక్తిగతంగా కలిసి తెవికీలో పత్రికారంగం గురించిన వ్యాసాలు, సంపాదకులు, వంటి విషయాల పట్ల తెవికీ ప్రమాణాలు పరిశీలించి వాటి గురించి ప్రసంగించమని కోరదామని భావిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 07:28, 26 జనవరి 2015 (UTC)Reply

స్వరలాసిక గారి సారధ్యంలో రాజశేఖర్ గారూ, నేనూ మరికొందరు వికీపీడియన్లు పత్రికల ప్రాజెక్టును వికీపీడియాలో ప్రారంభించి, రాజశేఖర్ గారు నాణ్యమైన కాపీహక్కులు లేని తెలుగు పత్రికలను తెలుగు వికీసోర్సులో చేరుస్తూవున్న సందర్బంలో ఈ ప్రయత్నం మనకు ఉపకరిస్తుందని నా భావన.--పవన్ సంతోష్ (చర్చ) 07:35, 26 జనవరి 2015 (UTC)Reply

ఉచిత బహుమతులు

మార్చు

సమావేశం కార్యక్రమములు నిర్వహించే వారందరికీ ముందుగా నమస్కారములు. మీరు సభ్యులకు అందించే ఉచిత బహుమతులు మాలాంటి కొంతమందికి ఆ వస్తువులు అన్నీ మాకు పోస్టు (కొరియర్) ద్వారా మా నివాసములకు పంపు ఏర్పాటు చేస్తే చాలా సంతోషిస్తాము. అవి మాకు వ్యక్తిగత గ్రంథాలయము నందు భద్రపరచు కొనుటకు అవకాశము ఇచ్చిన వారు అగుదురు. దయచేసి నిర్వాహక పెద్దలు గ్రహించగలరని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 07:41, 26 జనవరి 2015 (UTC)Reply

Return to the project page "తెవికీ పుష్కర ఉత్సవాలు-Tewiki 11th Anniversary".