శుక్ల యజుర్వేదం

(శుక్ల యజుర్వేదము నుండి దారిమార్పు చెందింది)

యజుర్వేదం (సంస్కృతం: यजुर्वेदः యజుర్వేద, యజస్సులు "త్యాగం ఫార్ములా", వేదం "జ్ఞానం" ఒక తత్పురుష సమ్మేళనం), హిందూమతం యొక్క నాలుగు వేద గ్రంథాలలో ఒకటి,[1]

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

వేదాలు

మార్చు

వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చుసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనన్న బహుకష్టమని ఎక్కువ మంది పెద్దగాఉత్సాహము చూపించనందున ఒకే వేదరాశి (వేదాలను)ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం నాలుగు భాగములుగా విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. ఆవిధంగా నాలుగు వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము మనకు లభ్యమయ్యాయి. వేదాలలో ఆరు అంగాలు ఎంతో ముఖ్యం. అవి (1) శిక్ష, (2) వ్యాకరణము, (3) ఛందస్సు, (4) నిరుక్తము, (5) జ్యోతిష్యము, (6) కల్పము. వీటినే వేదాంగాలు అని అంటారు.

చరిత్ర

మార్చు

వేదాలు. ఎక్కువగా సి. 1200-1000 బిసి ఈ మధ్యకాలంలో (క్రింద చూడండి), కూర్చిన చేశారు అని అంచనా. యజుర్వేద సంహిత, లేదా "సంకలనం", ప్రార్థనలో చారిత్రక వేద మతం యొక్క త్యాగం చేయటానికి అవసరమైన (మంత్రాలు) కలిగి ఉంది. బ్రాహ్మణాలు, శ్రౌతసూత్రాలు దీనికి జోడించారు. వీటికి అర్థ వివరణ, వాటి ప్రదర్శన వివరాలు సమాచారం కలిపారు. శుక్ల యజుర్వేదం వాజసనేయి సంహిత ప్రాతినిధ్యం వహిస్తుంది. వాజసనేయి అనేది వాజసనేయి శాఖ స్థాపకుడు యాజ్ఞవల్క్య మహర్షి వారి జ్ఞాపకం, సంప్రదాయం నుండి అధికారంగా ఉద్భవించింది ఈ పేరు, వాజసనేయి సంహితలో నలభై అధ్యాయాలుతో కూడినది ఈ కింది సూత్రాలు సంప్రదాయాలకు ఉపయోగించవచ్చును.

మూలరూపం

మార్చు

ఒక్కొక్క వేదంలోను మంత్ర సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తులు అని నాలుగు ఉపవిభాగాలున్నాయి. యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం.

శాఖలు

మార్చు

శుక్ల యజుర్వేదం లోని శాఖలు గురించి ఎన్నో భేదాలు ఉన్నాయి. ఈ వేదంలో తెలిసిన శాఖలు 17 ఉన్నాయి. అవి, (1) జాబాల, (2) కాపోల, (3)వైనతేయ, (4) అవటిక, (5) పారాశర, (6) తాపాయనీయ, (7) కాణ్వ, (8) భౌధేయ, (9) మాధ్యందిన (10) శాపేయ, (11) పౌండ్రవత్స (12) వైధేయ (13) కాత్యాయనీయ (14) ప్రధాన శాఖ (15) బైజావాప భేదం (తో) (16) ఔధేయ, (17) గాలవ శాఖలు అని తెలుస్తున్నది. జాబాల శాఖకు 26, గాలవ శాఖకు 24 ఉపశాఖలు ఉన్నాయి.

ఇప్పుడు దొరుకుతున్న శాఖలు

మార్చు

శుక్ల యజుర్వేదం (కాణ్వ), శుక్ల యజుర్వేదం (మాద్యందిన) అనే రెండు శాఖలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.

శుక్ల యజుర్వేదం (కాణ్వ)

మార్చు

శుక్ల యజుర్వేదం (కాణ్వ) శాఖ (సంహిత) లో 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలు ఉన్నాయి. ఈ శాఖ దక్షిణభారతంలో ప్రచారంలో ఉంది.

శుక్ల యజుర్వేదం (మాద్యందిన)

మార్చు

శుక్ల యజుర్వేదం (మాద్యందిన) శాఖ (సంహిత) లో 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర కండికలు (ఖండాల), 3988 మంత్రాలు, 29625 శబ్దాలు (పదాలు), 88875 అక్షరాలు కనపడతాయి. ఈ శాఖ ఉత్తరభారతంలో ప్రచారంలో ఉంది.

సంహిత విభాగం

మార్చు
అధ్యాయం మంత్రకండికలు మంత్రాలు అధ్యాయం మంత్రకండికలు మంత్రాలు
1 31 137 21 61 61
2 34 95 22 34 267
3 63 79 23 65 83
4 37 82 24 40 40
5 43 150 25 47 50
6 37 117 26 26 62
7 48 140 27 45 45
8 63 150 28 46 50
9 40 117 29 60 60
10 34 139 30 22 177
11 83 122 31 22 22
12 117 129 32 16 16
13 58 132 33 97 97
14 31 165 34 58 58
15 65 136 35 22 28
16 66 280 36 24 24
17 99 106 37 21 55
18 77 89 38 28 75
19 95 120 39 13 116
20 90 100 40 17 17
మొత్తం 1,211 2,585 మొత్తం 764 1,403
మొత్తం 1,211 + 764 మొత్తం 2,585+ 1,403 +
అధ్యాయాలు 1,975 మంత్రకండికలు 3,988

ఉపనిషత్తులు

మార్చు

శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావించబడుతున్నది. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడినుండి నేర్చుకుని ప్రచారం చేసిన యజుర్వేదాన్నే శుక్లయజుర్వేదం అంటారు. ఉపనిషత్కాలపు ప్రాచీన భారతదేశంలో యాజ్ఞవల్క్యుడు గొప్ప ఋషిగా, మహామేధావిగా, బ్రహ్మతత్వవేత్తగా గణనకెక్కాడు. అతని తండ్రి వాజసుడు. కనుక అతడు వాజసనేయుడయ్యాడు. వ్యాస శిష్యుడైన వైశంపాయనుడుకి అతడు శిష్యుడు. గురువు వద్ద యజుర్వేదం అభ్యసించాడు. ఒకసారి గురువుతో తగాదాపడగా గురువు కోపగించి తన వద్ద నేర్చుకున్న విద్యనంతా తిరిగి అప్పగించమన్నాడు. దానితో విద్యనంతా అప్పగించి సూర్యునికై తపస్సు చేసాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి యజుర్వేదమంతా తిరిగి నేర్పాడు. దానికే యజుర్వేద వాజసనేయ శాఖ అని, శుక్ల యజుర్వేదమని పేర్లు వచ్చాయి. యాజ్ఞవల్క్యుడు గురువుకు అప్పగించివేసిన దానికి కృష్ణ యజుర్వేదము అని పేరు వచ్చింది.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
  • Ralph Thomas Hotchkin Griffith, The Texts of the White Yajurveda. Translated with a Popular Commentary (1899).
  • Devi Chand, The Yajurveda. Sanskrit text with English translation. Third thoroughly revised and enlarged edition (1980).
  • The Sanhitâ of the Black Yajur Veda with the Commentary of Mâdhava ‘Achârya, Calcutta (Bibl. Indica, 10 volumes, 1854–1899)
  • Kumar, Pushpendra, Taittiriya Brahmanam (Krsnam Yajurveda), 3 vols., Delhi (1998).

మూలాలు

మార్చు