హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనములు అంటారు. అవి

  1. సాంఖ్యము: కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడినది. ప్రకృతి లేక మూల ప్రకృతి విశ్వసృష్టికి కారణమని సాంఖ్య సిద్ధాంతము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుష సంయోగమువలన బుద్ధి జనించును. పురుషుడు బుద్ధిచేయు చేష్టలను తనవిగా భావించుకొని సంసారములో బంధింపబడును. ప్రకృతి, పురుషుల స్వభావమును గ్రహించి, ఈ బంధమునుండి విడివడుటయే మోక్షము.
  2. యోగము: పతంజలి మహర్షి యోగదర్శనమును రచించెను. ఇందులో మనసును నిగ్రహించుటకు తగిన ఉపాయములు బోధింపబడినవి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యఅహారము, ధ్యానము, ధారణ, సమాధి అను పది రకములైన అభ్యాసములచే మానవుడు ప్రకృతి-పురుష వివేకము పొంది ముక్తుడగును.
  3. న్యాయము: న్యాయ దర్శనమును గౌతమ మహర్షి ప్రవర్తింపజేశారు.
  4. వైశేషికము: వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే భగవంతుడు. అని న్యాయదర్శనములో చెప్పారు.
    జీవులు కర్మ బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతికోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో మోక్షం లభిస్తుంది.
  5. పూర్వమీమాంస: వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త జైమిని మహర్షి. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు.
    కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.
  6. ఉత్తరమీమాంస: వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువ, డినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనము అనీ, బ్రహ్మసూత్రములు అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.

1. షడ్దర్శనములు

దర్శనం కర్త సిద్ధాంతం ప్రధాన గ్రంధము ప్రథమసూత్రము విశేషము ప్రసిద్ధ ఆచార్యులు
సాంఖ్య దర్శనము కపిలమునిః ప్రకృత్తియే విశ్వం యొక్క మూలం మూలక సమ్మేళనం త్రిగుణముల ప్రాధాన్యత
యోగ దర్సనము పతంజలి యోగము ద్వారా మోక్ష మార్గం యోగ సూత్రం యోగానుశాసనము' యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి
న్యాయ దర్సనము గౌతమ ముని ప్రపంచ నిర్మాణము ఈశ్వరేచ్చ, ఆయనే పాలకుడు న్యాయ సూత్రం ప్రమాణము- ప్రమేయము- సంశయము- ప్రయోజనము- దృష్టాంతము- సిద్ధాంతము- అవయవము- తర్కము- నిర్ణయము- జల్పము- వితండము- హేతునిర్ణయము- నిగ్రహము- శ్రేయసాధనములు తర్కధారితదర్శనము
వైశేషిక దర్శనము కణాదుడు పరమాణువాదం దీనిచేతనే ధర్మం వ్యవహరించుబడుచున్నది పరమాణువులచే ఈ సంసారము విస్తరించుబడుచున్నది, వాటిచేతనే నాశనముగుచున్నది.
పూర్వమీమాంస జైమిని వేదాలపై ఆధారపడిన జీవితం, కర్మ సిద్ధాంతము- సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ద కర్మ మీమాంస సూత్రం అధాతో ధర్మజిజ్ఞాస: కర్మకాండాధారితదర్సనము
ఉత్తరమీమాంస (వేదాంత) బాదరాయణుడు బ్రహ్మసూత్రము, ఉపనిషత్తులు, భగవద్గీత అధాతో బ్రహ్మజిజ్ఞాస: జ్ఞానకాండాధారితదర్సనము
శంకరాచార్యుడు అద్వైతవాదము జ్ఞానమార్గము నిర్గుణ-నిరాకారబ్రహ్మము శంకరభాష్యము
రామానుజాచార్యుడు విశిష్టాద్వైతము భక్తిమార్గము సాకారబ్రహ్మము శ్రీభాష్యము
మాధవాచార్యుడు ద్వైతవాదము
వల్లభాచార్యుడు శుద్ధాద్వైతవాదము
నింబకాచార్యుడు ద్వైతాద్వైతవాదము

२) మూడు వేదాంతదర్సనముము

దర్సనము కర్త సిద్ధాంతము ముఖ్యగ్రంధము విశేషము ప్రసిద్ధాచార్యుడు
చార్వక దర్సనము దేవగురు బృహస్పతి
జైన దర్సనము ఋషభదేవుడు
బౌద్ధ దర్సనము బుద్ధుడు

ఇవన్నీ వేదములు ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు (చార్వాకులు, బౌద్ధులు, జైనులు ఇలాంటి వారు) చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి.


వనరులు

  • హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ప్రచురణ