సుప్రీమ్ (2016 సినిమా)
సుప్రీమ్ 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. సాయి కార్తీక్ సంగీతం, సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహణం అందించారు.
సుప్రీమ్ | |
---|---|
దర్శకత్వం | అనిల్ రావిపూడి |
రచన | అనిల్ రావిపూడి (కథ / కథనం / మాటలు) |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నా |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మే 5, 2016 |
సినిమా నిడివి | 142 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹50 crore (US$6.3 million) (ప్రపంచ వ్యాప్తంగా)[1] |
తారాగణం
మార్చుప్రధాన తారాగణం
- సాయి ధరమ్ తేజ్ (టాక్సీ డ్రైవర్ బాలు)
- రాశి ఖన్నా (సబ్ ఇన్స్పెక్టర్ బెల్లం శ్రీదేవి)
- మాస్టర్ మికైల్ గాంధీ (రాజన్ పాత్ర)[2]
సహాయక తారాగణం
- రాజేంద్ర ప్రసాద్ (బాలు తండ్రి)
- కబీర్ సింగ్ దుహా (విక్రమ్ సర్కార్)
- రవి కిషన్ (బీకు)
- సాయి కుమార్ (నారాయణ రావు)
- మురళీమోహన్ (న్యాయమూర్తి)
- తనికెళ్ళ భరణి (కమిషనర్)
- ఆలీ (డాక్టర్)
- పోసాని కృష్ణ మురళి (సంగీతకారుడు శివయ్య)
- వెన్నెల కిశోర్ (కానిస్టేబుల్ కిషోర్)
- జయప్రకాశ్ రెడ్డి (M.L.A)
- రఘుబాబు (బెల్లం శ్రీదేవి తండ్రి)
- వినీత్ కుమార్ (పట్నాయక్)
- శ్రావణ్ (పోలీసు అధికారి)
- షిజు (రాజా రావు)
- పృథ్వీరాజ్ (టామ్)
- సత్యం రాజేష్ (రాజేష్)
- సుడిగాలి సుధీర్ (మూవీ డైరెక్టర్)
- గిరిధర్ (వెంకటేష్)
- ప్రభాస్ శ్రీను (క్రూజ్)
- సప్తగిరి (విమానాశ్రయంలో ఒక వ్యక్తి)
- కారుమంచి రఘు (M.L.A అనుచరుడు)
- ఫిష్ వెంకట్ (పోలీసు అధికారి)
- రాఘవ (కానిస్టేబుల్ రాఘవ)
- పింగ్ పాంగ్ సూర్య (బెల్లం శ్రీదేవి సోదరుడు)
- శ్రీనివాస రెడ్డి (సంగీతకారుడు సీనయ్య)
- నారిపెద్ది శివన్నారాయణ (బెల్లం శ్రీదేవి మామయ్య)
- శంకర్ మెల్కోటే (పారిశ్రామికవేత్త)
- తోటపల్లి మధు (ఎం.పి)
- హరిబాబు (హరి)
- గుండు సుదర్శన్ (తాగుబోతు)
- గౌతమ్ రాజు (హీరో)
- శృతి సోధీ (ప్రత్యేక గీతం)
- సురేఖా వాణి జానకి (బెల్లాం శ్రీదేవి తల్లి)
- రజిత (బెల్లం శ్రీదేవి అత్త)
- మీనా (బెల్లం శ్రీదేవి సోదరి)
పాటలు
మార్చుసాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన యముడికి మొగుడు సినిమాలోని అందం హిందూళం పాటని ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. పాటలని అల్లు అరవింద్ చేతులమీదుగా 2015 ఏప్రిల్ 14 న ఆదిత్యా మ్యుజిక్ కంపెనీ ద్వారా విడుదల చేశారు.[3][4]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ట్యాక్సీ వాలా" | శ్యామ్ కాసర్ల | జస్ప్రీత్ జాస్జ్, దివిజ కార్తీక్ | 3:03 |
2. | "ఆంజనేయుడు నీవాడు" | రామజోగయ్య శాస్త్రి | కార్తీక్, సూరజ్ సంతోష్ దీప్తి పార్థసారథి | 4:14 |
3. | "బెల్లం శ్రీదేవి" | రామజోగయ్య శాస్త్రి | సాయి చరణ్ | 4:07 |
4. | "చలో చలో" | రామజోగయ్య శాస్త్రి | కృష్ణ చైతన్య | 2:32 |
5. | "అందం హిందూళం (రీమిక్స్)" | వేటూరి సుందరరామ్మూర్తి | చిత్ర, రేవంత్ | 4:23 |
మొత్తం నిడివి: | 18:21 |
మూలాలు
మార్చు- ↑ ['Supreme' worldwide total box office collection: Sai Dharam Tej's film ... https://www.ibtimes.co.in › supr... ]
- ↑ "Watch out for Isha’s Supreme sizzle"
- ↑ "Supreme (Audio Review)". Indiaglitz.
- ↑ "Supreme (Audio launch)". Errabus.com. Archived from the original on 2019-08-17. Retrieved 2019-08-17.