బంగారు మనిషి 1976 లో ఎ. భీమ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో ఎన్. టి. రామారావు, లక్ష్మి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా 1976, ఆగష్టు 25న విడుదలయ్యింది. ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి పి.పేర్రాజు నిర్మాత.

బంగారు మనిషి
సినిమా
శైలిడ్రామా మార్చు
మూల దేశంభారతదేశం మార్చు
సినిమా లేదా టీవీ షో మూల భాషతెలుగు మార్చు
ప్రచురణ తేదీ25 ఆగస్టు 1976 మార్చు
దర్శకులుఎ. భీమ్‌సింగ్ మార్చు
స్క్రీన్ ప్లేగొల్లపూడి మారుతీరావు మార్చు
తారాగణంఅల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు మార్చు
సంగీత దర్శకుడుకె.వి.మహదేవన్ మార్చు
బంగారు మనిషి
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
నిర్మాణం పి.పేర్రాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
లక్ష్మి, హేమాచౌదరి
సంగీతం కె. వి. మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన కొసరాజు రాఘవయ్య, సి.నారాయణరెడ్డి, దాశరథి
నిర్మాణ సంస్థ త్రివేణి ప్రొడక్షన్స్
భాష తెలుగు

కలెక్టర్ ఆఫీసులో బంట్రోతు రంగన్న కొడుకు వేణు. అవినీతికి పాల్పడి అక్రమ వ్యాపారాలు చేస్తూ సంపన్నుడైన భానోజీరావు కొడుకు ప్రసాద్. మరో కలవారి బిడ్డ గీత. వీరు ముగ్గురూ క్లాస్‌మేట్స్. వేణు పెద్ద చదువులు చదివి తండ్రి బంట్రోతుగా ఉన్నచోటనే కలెక్టరుగా వస్తాడు. గీత కుటుంబం పరిస్థితుల వల్ల తారుమారై కలెక్టరాఫీసులోనే టైపిస్టుగా చేరుతుంది. ప్రసాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అవుతాడు. ప్రేమించి పెళ్ళాడాలనుకున్న వేణు, గీత పరిస్థితుల ప్రభావం వల్ల దూరమౌతారు. అయినా బంగారం లాంటి మనిషి వేణు అవరోధాలను అధిగమించి భానోజీరావు అక్రమాలను, అవినీతిని ఎలా నిర్మూలించిందీ, గీతను ఎలా తనదాన్ని చేసుకుందీ, తండ్రిని ఖాతరు చేయకుండా ప్రసాద్ స్నేహితుడికి ఎలా తోడ్పడిందీ చిత్రంలో చూపారు[2].

సాంకేతికవర్గం

మార్చు
  • కథ: త్రివేణి యూనిట్
  • మాటలు: గొల్లపూడి మారుతీరావు
  • పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నృత్యం: వెంపటి సత్యం
  • ఛాయాగ్రహణం: విఠల్ రావు
  • కళ: సూరన్న
  • కూర్పు:పాల్ దురై సింగం
  • దర్శకుడు: ఎ.భీమ్‌సింగ్
  • నిర్మాత: పి.పేర్రాజు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
  1. ఇది మరోలోకం ఇది అదో మైకం తెల్లని చీకటి - ఎస్.జానకి - రచన: కొసరాజు రాఘవయ్య
  2. నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత ఎక్కడి కెళుతుందీ దేశం ఏమైపోతుంది హిమశైల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను బ్రతుకే - పి.సుశీల - రచన: దాశరథి
  4. నిండుకుండ తొణకనే తొణకదు అది తొణికినా తడపకుండా - పి.సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి
  5. మేలుకో వేణుగోపాలా నన్నేలుకో
  6. సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా సూటిగా సొర్గాన్ని చూపిస్తారా - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు రాఘవయ్య

మూలాలు

మార్చు
  1. "బంగారు మనిషి". Archived from the original on 2020-01-05. Retrieved 2020-04-04.
  2. రెంటాల (5 September 1976). "చిత్రసమీక్ష - బంగారు మనిషి". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 5 April 2020.[permanent dead link]