శ్రీ ఆది శంకరాచార్యులు వారు అద్వైతం వేదాంతము అను గొప్ప మేడను అధ్యాస అను పునాది మీద కట్టిరి. ఈపునాదికి మొదట ఉప్పరపని చేసినవారు బౌద్ధులు. ప్రాజ్ఞలు ప్రజ్ఞానేత్రముతో పఠింపదగిన బ్రహ్మసుత్రములకు భాష్యము వ్రాయబోవుచు శ్రీయాచార్యులవారు అద్వైతమునకు పీఠికగా అధ్యాసభాష్యమును రచించిరి. ఈ పునాదిలోనే ఇసుకనే గీతాభాష్యమునందును వెదజల్లిరి. ఈ రేణువులే మధూవమగు వారి కవితా గానములో స రిగా మ ప ధ ని. ఇందులో ముఖ్యాంశములు: 1. బ్రహ్మము అనగా పరమేశ్వరుడు ఒకడే ఉన్నాడు, వేరేమి లేదు. 2. బ్రహ్మములో జగద్ భ్రాంతి (అధ్యాస) కలుగును. 3 జగత్తులేనే లేదు.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

మూడు పదార్ధములు

మార్చు

ఇందులో మూడు పదార్ధములు చూపుచున్నారు. 1. పరమేశ్వరుడు లేక బ్రహ్మము. 2. జీవాత్మ లేక నేను. 3. ప్రపంచము లేక జడము.

బ్రహ్మము

మార్చు

బ్రహ్మము సత్+చిత్+ఆనంద+స్వరూపము. సత్ అనగా ఎల్లప్పుడు నశింపక ఉండునది. చిత్=చేతన స్వరూపము, అనగా ఎరుకయే స్వరూపముగా గలది. ఆనందముగూడ ఆయనస్వరూపము. పరమేశ్వరుడు చచ్చిపోవు స్వభావము కలవాడనిగాని, ఎపుడును ఏడ్చుచు కూరుచుండువాడని గాని ఎవడును అనుకొనడు. కావున పరమేశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడని అనినచో ఎవరువాదింపరు.

జీవుడు లేక నేను

మార్చు

నేను అను ఎరుకకు తావు అయిన వాడు జీవుడు. ఇతడు దేహీంద్రయాదులగు ఉపాధులతో కూడుకొని ఉన్నాడు. ఇతడే ఆత్మ, జీవాత్మ, ప్రత్యగాత్మ, చిదాత్మ, కర్త, భోక్త. ఇతడు సుఖముకొరకు దేవులాడును. ఆ సుఖము కొరకు ఎన్నియో దుఃఖములను అనుభవించును.

ప్రపంచము లేక జడము

మార్చు

బుద్ధి మొదలగు శరీరము వరకు అయిన ప్రకృతి పరిణామమెల్లయు జడము. ఇది అసత్తు, అచేతనము. సచ్చిత్ స్వరూపుని కంటే వేరయిన దెల్లయు జడము. ఇది నేను కంటే వేరు. కావున దీనికి నీవు అని వేదాంతములలో వాడుక. ఈజడమే ఈజగత్తు. లేకండగనే ఉన్నాననిపించునది.

అధ్యాస

మార్చు

చీకటిలో త్రాడు చూచి పామనుకొను చున్నాము. త్రాటియందు పాము అధ్యస్తము అనగా ఆరోపితము అగుచున్నది. ఒక వస్తువునందు మరియొక వస్తువును ఆరోపించుట అధ్యాస. ఆకాశమున చంద్రుడు ఒక్కడె వెలుగుచున్నను దృష్టిదోషము కలవానికి ఇరువురు కానిపింతురు. దవదవుల ఎండమావులు కానిపించును. ఇట్టి మిధ్యారోపమే అధ్యాస.

నాయిల్లు నాశరీరము నాచేయి నామనస్సు అని మనము వ్యవహరించుచున్నాము. వీటికంటె వేరుగా నేను అని ఇక పదార్ధము ఉంది. ఈ నేనే దర్శనములు వక్కాణించు చిదాత్మ. ఆచిదాత్మకంటె వేరయిన ఇల్లు శరీరము చేయి మనస్సు ఇవి జడములు, అనాత్మ పదార్ధములు లేక నీవు.

ఈనేను నీవులు లేక చిజ్జడములు చీకటి వెలుగులవలె వేరువేరు దినుసులు. నేను నీవు కాదు, నీవు నేను కాదు. నేను = చిదాత్మ. నీవు = జడము. చిదాత్మనుండు ధర్మములు జడమునందుండు ధర్మములు చిదాత్మలో ఉండవు. దేహము కంటే ఇంద్రిఅయముల కంటే మనస్సు కంటే నేను వేరుగా నున్నను ఆదేహధర్మములను ఆ ఇంద్రియధర్మములను ఆ అంతఃకరణధర్మములను ఈ నేను యందు ఆరోపించుచున్నాము. నేను ఎర్రగా నున్నానని దేహధర్మమును ఆరోపించుచున్నాము. ఈ ఆరోపము పేరే అధ్యాస.

అతిసూక్షము అతిసుద్ధము అగు ఈనేనునకు (జీవునకు) బాహ్యజగత్తుతో సంబంధము కలుగునపుడు ఈఆరోపము కలుగుచున్నది. ఈ నేను అనే చిదాత్మ లేక వ్యక్తిగత్మగు ఆత్మవిషయధర్మములచే అనగా జడధర్మములచే ఆవరింపబడి నేను అను ఎరుకకు పాల్పడెను. ఇది సాక్షికాదు కర్త. ఇది అపరోక్షము కాదు కావుననే దీనికి అర్ధభావము ఉండును.

దేహాదులను నేనే అనుకొనుట భ్రాంతి. ఇది నైసర్గికము. అనాది. ఇది అధ్యాస. అన్ని భ్రమలకు ముమ్మొదట ఇట్టి కారణములు ఉండును. బ్ర్హహ్మమునందు జగత్ భ్రాంతి కలుగుటకు ఇట్టి కారణసామగ్రి కలదా? అసలు జగత్తునకును బ్రహ్మమునకును సామ్యము కలదా? బ్రహ్మము సత్తు, జగత్తు అసత్తు. బ్రహ్మము చిత్తు, జగత్తు అచిత్తు. బ్రహ్మము ఆనందము. జగత్తు దుఃఖము. ఇక రెంటికి పోలిక ఎడ?

దీని ప్రణాలి ఇది కాదు. జీవుడు జడ రథమును అధిరోహించినవాడు. ఆరధమునుకూడ తాననుకొనుచున్నాడు. జీవుడు దేహమను చొక్కాతొడుక్కున్నాడు. ఆచొక్కా కూడా తాననుకొనుచున్నాడు.

శంకరులవారి అభిప్రాయము యేమనగా జగత్తనికాని, జగదాకారమనిగాని యేదియు లేదు. ఉన్నదొక బ్రహ్మమే. బ్రహ్మము తక్క జీవాత్మయని వేరొకటిలేదు. జీవాత్మ పరమార్ధమున లేదు. బ్ర్హ్మహ్మమునందు జీవాత్మ అధ్యస్త మగుచున్నది. ఈ అధ్యాస వలనే మానికి దుఃఖములు. అధ్యాసకే అవిద్య అని మారుపేరు. అవిద్యను తొలగించుటకే వేదాంత శాస్త్రము దండధారి. ఇదియే శంకరదర్శనము.

బౌద్ధ దర్శనము

మార్చు

నేటి నైయాకుల మతమున జ్ఞానము త్రిక్షణస్థాయి. ఒక క్షణమున పుట్టును, ఒక క్షణము ఉండును, మూడవ క్షణమున మూలబడును. బౌద్ధులదర్శనమున జ్ఞానము క్షణికము. దీనికి స్థితిలేదు. వెంటనే గిట్టును. వీరు రెండు సత్యములను అంగీకరింతురు. 1. సంవృత సత్యము. 2. పరమార్ధ సత్యము. సంవృత సత్యమును తరవగా తరవగా దీనికి పునాది లేదనియు ఉళక్కి అని తెలియును. ఇంకాలోతుగా దిగినచో ఆఉళక్కియు ఉళక్కి అని తెలియును. ఇది మాధ్యమిలుల మతము. దీనిపేరు అప్రతిష్ఠిత సర్వధర్మవాదము. ఇక పరమార్ధ సత్యమేమనగా ధర్మధాతువు. అది అనిర్వచనీయము. దీనికే మరొక పేరు శున్యము. శూన్యము అభావవాదము కాదు, భావవాదమును కాదు. ఇది అఛ్ఛ్హేధ్యము, అభేధ్యము, దృఢము, సారము, అదాహి, అవినాశి. ఇట్టి శూన్యత్వము పేరే వజ్రము.

దీనికిని శంకరదర్శనముకును గల పోలికని బట్టి పలువురు శంకరదర్శనమును ప్రచ్ఛన్న బౌద్ధమని అన్నారు. కాని అదినిక్కము కాదు. శంకరులు బ్రహ్మమును చాటుచేసికొని శూన్యమతమును స్థాపింపలేదు. ప్రత్యుత వారి పరమగురువులగు శ్రీ గౌడపాదులు వారివలె వలసినగదానిని కైకొని శూన్యసిద్ధాంతమును ధ్వంసము చేసిరి.

మూలములు

మార్చు

1930-భారతి మాస పత్రిక- వ్యాసము- అధ్యాస- రచయిత-శ్రీ వేలూరి శివరామశాస్త్రి