అలుగు దుంకిన అక్షరం (కవిత్వ పుస్తకం)

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకం


అలుగు దుంకిన అక్షరం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన కవిత్వ పుస్తకం.[1] 2018 విళంబి నామ ఉగాది సందర్భంగా నీళ్ళను, చెరువులను ఇతివృత్తంగా తీసుకొని 74 కవితలతో మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో ఈ కవితా సంకలనం వెలువడింది.[2]

అలుగు దుంకిన అక్షరం
అలుగు దుంకిన అక్షరం పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: మామిడి హరికృష్ణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నీరుచెరువుపై కవిత్వం
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: మార్చి, 2018
పేజీలు: 186
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-942686-1-1

పుస్తక అంకురార్పణ

మార్చు

మానవ మనుగడలో నీరు అధిక ప్రాధాన్యత కలిగివుంటుంది. 11వ శతాబ్దం నుంచి 1323 వరకూ దక్షిణాదిలో అత్యధిక భాగాన్ని పాలించిన కాకతీయులు నీటి ప్రాముఖ్యతను గుర్తించి నీటి నిర్వహణకు చెరువులు నిర్మించారు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నీటి వనరుల సక్రమ వినియోగానికి అత్యధిక ప్రాధాన్యాన్ని కల్పించి ‘మిషన్ కాకతీయ’, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులు నిర్మించింది.

ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నీరు గురించిన కృషికి తోడుగా నీరు, చెరువు అనే రెండు అంశాలను ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018, మార్చి 18న విళంబి నామ ఉగాది వేడుకలలో భాగంగా 74 మంది కవులతో ‘నీరుచెరువు’ అంశంపై ప్రత్యేక కవి సమ్మేళనం నిర్వహించబడింది. ఆ కవితలన్నీ కలిపి ‘అలుగు దుంకిన అక్షరం’ పేరుతో కవితా సంకలనాన్ని ప్రచురించబడింది.[2]

సలహామండలి

మార్చు

కవులు - కవితలు

మార్చు
  1. డా. అమ్మంగి వేణుగోపాల్ - నీరు
  2. అంబటి వెంకన్న - నీళ్ళ కింత నీడ దొరికింది
  3. అన్నవరం దేవేందర్‌ - నీళ్ల ముచ్చట
  4. ఎబిజె. సత్యం సాగర్ - గంగమ్మా
  5. అందోజు పరమాత్మ - వర్షం కురిసే రాత్రులు
  6. అరుణ నారదభట్ల - నీటి చుక్కల
  7. అయినంపూడి శ్రీలక్ష్మి - తెలంగాణా వీణపై గోదారి పాట
  8. ఆచార్య మసన చెన్నప్ప - నీటి దేవతా!
  9. బండారి రాజ్ కుమార్ - జీవధార
  10. డా. బండారు సుజాతశేఖర్ - తిరిగి వచ్చిన వసంతం
  11. బిల్ల మహేందర్ - చెరువు
  12. డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ - జలసిరి
  13. సిహెచ్. ఆంజనేయులు - ఇగ మా చేన్లల చెలకల్ల బంగారం
  14. డా. అడువాల సుజాత - చైతన్య రసఝరులు
  15. డా. భీంపల్లి శ్రీకాంత్ - నీటి మొగ్గలు
  16. డా. బెల్లంకొండ సంపత్‌కుమార్ - మూలాలకు మూలం
  17. డా. బుక్కాబాలస్వామి - శ్రీ విళంబి నామ సంవత్సరం
  18. డా. దిలావర్ - పెను దాహం
  19. డా. గంధం విజయలక్ష్మి - పాణ్శాల
  20. డా. కాంచనపల్లి - చెరువు తల్లీ స్వాగతం
  21. డా. లింగంపల్లి రామచంద్ర - ఒచ్చింది నీరు…
  22. డా. మంథని శంకర్ - జలధార
  23. డా. ఎన్. గోపి - నీటి చెరువులు
  24. డా. నాళేశ్వరం శంకరం - మావూరి చెరువు
  25. డా. కాపూరి పాపయ్యశాస్త్రి - చెరువు
  26. డా. పత్తిపాక మోహన్‌ - దువా
  27. డా. రాపోలు సుదర్శన్ - నీటి లిపి
  28. డా. రూప్‌కుమార్ డబ్బీకార్ - నీటి చుక్కపై వేటకొడవలి
  29. ఎస్. రఘు - అభిషేకం
  30. డా. తిరునగరి రామానుజయ్య - నదులకు సమస్కారం
  31. డా. తిరునగరి దేవకీదేవి - బంగారు తెలంగాణ సాధిద్దాం
  32. డా. వాణి దేవులపల్లి - నీరే ప్రాణాధారం
  33. వడ్డేపల్లి కృష్ణ - ఊరి చెరువు!
  34. దొరవేటి - నీకు జయహో
  35. ఘనపురం దేవేందర్ - జల సూక్తం
  36. గొల్లపెల్లి రాం కిషన్ - సుజలాం సుఫలాం
  37. ఇష్రత్ సుల్తాన - నీళ్ళు ప్రాముఖ్యత
  38. జనజ్వాల - మా ఊరి చెరువు
  39. జ్వలిత - ఏసంగెనక ఏ సంఘమెనక
  40. జాజుల గౌరి - నీళ్ళ బాయి
  41. కోటం చంద్రశేఖర్ - వానా వెల్‌కం
  42. కందుకూరి శ్రీరాములు - నీళ్ళ చూపులు
  43. కందాళై రాఘవాచార్య - నీటిమట్టం పెరుగు'డే!!
  44. కోట్ల వెంకటేశ్వరరెడ్డి - నీళ్ళ నిశ్చలానందం
  45. ఎం.వి. రమణ - నీటి అక్షరం
  46. మౌనశ్రీ మల్లిక్ - బతుకు చెరువు
  47. మధుకర్ వైద్యుల - ఊర్లన్నీ ఊటచెలిమెలై
  48. మోహన్ రుషి - తన్నీర్... తన్నీర్..!
  49. మరికంటి - నీటి ఆవశ్యకత!
  50. మామిడి హరికృష్ణ - దోని నీళ్ళు!
  51. మెర్సీ మార్గరెట్ - చివుళ్ళు తొడిగిన మేఘం
  52. నాంపల్లి సుజాత - ఒక్కో బొట్టూ ఒడిసిపట్టు
  53. నీలగిరి అనిత - నీరే ఆధారం
  54. తోట నిర్మలారాణి - ఒక్క బొట్టు కోసల!
  55. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ - నది
  56. పి. గంగాధర్ - గతవైభవం
  57. ఆచార్య పి. లక్ష్మీనారాయణ - మా ఊరి చెరువు
  58. డాక్టర్ పగడాల నాగేందర్ - నెత్తురు నీళ్ళు
  59. పొన్నాల బాలయ్య - ఉసురు
  60. పోతన జ్యోతి - అమృత జలం
  61. పొట్లపల్లి శ్రీనివాస రావు - ఊట చెలిమి
  62. ప్రొఫెసర్ రామా చంద్రమౌళి - దేన్ని తవ్వినా నీళ్ళే
  63. పున్న విజయలక్ష్మి - ఆధారం జీవనాధారం
  64. రేడియం - దండోర
  65. సంగీతపు రాజలింగం - ఓ ఉగాది! జల నిధి!
  66. సీతారాం - నీటి వీలునామా..!
  67. షాజహానా - జల జీవం
  68. సుతారపు వెంకటనారాయణ - జలోదయం
  69. సుంకర రమేశ్ - జలకళ
  70. టి.నరేష్ (సూర్య) - కన్'నీటి' కథ
  71. తైదల అంజయ్య - రెండో ప్రాణం
  72. డా. ఉదారి నారాయణ - నీటి బాగోతం
  73. వఝల శివకుమార్ - అక్షర జలభాష
  74. వనపట్ల సుబ్బయ్య - నదికి నమస్కరిస్తున్నా..

మూలాలు

మార్చు
  1. అలుగు దుంకిన అక్షరం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, హైరదాబాదు, మార్చి 2018.
  2. 2.0 2.1 నమస్తే తెలంగాణ, సంపాదకీయ వ్యాసాలు (6 January 2020). "నీటితత్వమే కవిత్వ దర్శనం". మామిడి హరికృష్ణ. Archived from the original on 19 జనవరి 2020. Retrieved 19 January 2020.