అసన్సోల్
అసన్సోల్, భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని (టైర్-II) మెట్రోపాలిటన్ నగరం. ఇది పశ్చిమ బెంగాల్‌లో రెండవ అతిపెద్ద, రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం. భారతదేశంలో 33వ అతిపెద్ద పట్టణ సముదాయం. అసన్‌సోల్ పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాకు జిల్లాకేంద్రంగా ఉంది.అంతర్జాతీయ పర్యావరణ,అభివృద్ధి సంస్థ, యుకె-ఆధారిత పాలసీ రీసెర్చ్ నాన్-గవర్నమెంటల్ బాడీ 2010లో విడుదలచేసిననివేదికప్రకారం, అసన్సోల్ భారతీయనగరాల్లో11వ స్థానంలోఉంది.ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న100 నగరాల జాబితాలో అసన్‌సోల్ 42వ స్థానంలోఉంది.[11] ప్రభుత్వ ఉద్యోగులకు గృహ అద్దెభత్యంగణన కోసంఈ నగరం వై-కేటగిరీ నగరంగావర్గీకరించారు. ఇది 16% రేటుతో టైర్-II నగరంగామారింది.
Asansol | |
---|---|
Nickname(s): "The City of Brotherhood"[1] and "Land of Black diamonds" | |
Coordinates: 23°41′N 86°59′E / 23.68°N 86.99°E | |
Country | India |
State | West Bengal |
District | Paschim Bardhaman |
Government | |
• Type | Municipal Corporation |
• Body | Asansol Municipal Corporation |
• Mayor | Bidhan Upadhyay |
• Deputy Mayor |
|
• Police Commissioner | Sukesh Kumar Jain, IPS |
విస్తీర్ణం | |
• Metropolis | 326 కి.మీ2 (126 చ. మై) |
• Metro | 1,615 కి.మీ2 (624 చ. మై) |
• Rank | 2nd in West Bengal |
Elevation | 111 మీ (364 అ.) |
జనాభా | |
• Metropolis | 12,43,414 [2][3][4] |
• Rank | 2nd in West Bengal |
• Metro | 30,00,000 |
Demonym | Asansolians / Asansolites/ Asansolbashi |
Languages | |
• Official | Bengali[8][9] |
• Additional official | English[9] |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 713 3xx |
Telephone code | 0341 |
Vehicle registration | WB 37 / WB 38 / WB 44 (WB 44A, WB 44B, WB 44C, WB 44D) |
Sex ratio | 1.08[10] ♂/♀ |
Literacy | 84.82[10] |
Lok Sabha constituency | Asansol (MP — Shatrughan Sinha — TMC) |
Vidhan Sabha constituencies | Asansol Uttar (MLA — Moloy Ghatak —TMC)
Asansol Dakshin (MLA —Agnimitra Paul —BJP) Pandaveswar (MLA — Narendranath Chakraborty —TMC) Raniganj (MLA — Tapas Banerjee —TMC) Jamuria (MLA — Hareram Singh —TMC) Kulti (MLA —Ajay Kumar Poddar —BJP) Barabani (MLA —Bidhan Upadhyay —TMC) |
Police | Asansol-Durgapur Police Commissionerate |
వ్యుత్పత్తి శాస్త్రం
మార్చు" అసన్ ",సాధారణంగా ముప్పై మీటర్ల పొడవు పెరిగే ఒక జాతి చెట్టు. ఇది దామోదర్ నది ఒడ్డున కనిపిస్తుంది; "సోల్" భూమిని సూచిస్తుంది."అసన్‌సోల్," అనే పేరు ఈ రెండు పదాల కలయిక. అసన్సోల్ దామోదర్ ఒడ్డున దానిభూమి ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న నగరం .[12]
చారిత్రాత్మకంగా బ్రిటీష్ కాలంలో ఈ నగరం అస్సెన్సోల్‌గా ఆంగ్లీకరించబడింది.అయితే స్వాతంత్ర్యం తర్వాత పేరు మార్చబడింది.[13]
చరిత్ర
మార్చుఈ ప్రాంతం విష్ణుపూర్ రాజ్యంలో భాగంగా ఉందని నమ్ముతారు.బ్రిటిష్ వారిఆవిర్భావం వరకు ఈ ప్రాంతాన్ని మల్లా రాజవంశీకులు సుమారువెయ్యి సంవత్సరాలుపాలించారు. అసన్‌సోల్‌లోని ఛోటోడిఘరి గ్రామం,దోమోహని గ్రామం వద్ద విష్ణుపూర్ శైలిలో ఉన్న ఆలయం ఈ సిద్ధాంతానికి మద్దతు ఇస్తుంది.[14]
అవలోకనం
మార్చుఅసన్సోల్ ఒక కాస్మోపాలిటన్ నగరం. ఇది చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో దిగువన ఉంది.ఇది దామోదర్,అజయ్ నదుల మధ్య జార్ఖండ్‌లో ఎక్కువ భాగాన్నిఆక్రమించింది. మరో నది,బరాకర్,దిషేర్‌ఘర్ దగ్గర దామోదర్‌లో కలుస్తుంది.రెండు చిన్న వాగులు, నునియా,గరుయ్ అసన్సోల్ దాటి ప్రవహిస్తాయి.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా పశ్చిమ వైపున ఉండగా, దుర్గాపూర్ ఉపవిభాగం తూర్పు వైపున ఉంది.దక్షిణాన దామోదర్ నదికి అడ్డంగా పురూలియా,బంకురా జిల్లాలు ఉన్నాయి.ఉత్తరాన దుమ్కా,బీర్భమ్ జిల్లాలు ఉన్నాయి.ధన్‌బాద్ జిల్లా ఒక ప్రధాన బొగ్గు గనుల ప్రాంతం, అసన్‌సోల్‌తో సన్నిహితసంబంధాలను కలిగిఉంది.రెండూదామోదర్ లోయలో ఉన్నాయి.
ఈ నగరం గ్రాండ్ ట్రంక్ రోడ్డు ద్వారా,దుర్గాపూర్,బుర్ద్వాన్,కోల్‌కతాతో రైలుద్వారా అనుసంధానించబడి ఉంది.ఇది పెద్ద రైల్వే వర్క్‌షాప్‌లు,రైల్వే కాలనీతో కూడిన ముఖ్యమైన బొగ్గు-వ్యాపార రైల్వేకేంద్రం.
పోలీస్ స్టేషన్లు
మార్చుఅసన్సోల్ ఉత్తర పోలీస్ స్టేషన్ రాణిగంజ్ సిడి బ్లాక్, అసన్సోల్ నగరపాలక సంస్థ,ఇతర కొన్ని భాగాలపై అధికార పరిధిని కలిగిఉంది.దాని అధికారపరిధి 50 కిమీ 2 ఉంది.[15][16]
అసన్సోల్ నగరపాలక సంస్థ లోని కొన్ని భాగాలపై అసన్సోల్ దక్షిణ పోలీస్ స్టేషన్ అధికార పరిధిని కలిగి ఉంది.దాని అధికారపరిధి 69కిమీ 2 ఉంది.[15][16]
అసన్సోల్, దుర్గాపూర్ ఉపవిభాగాలు రెండూ అసన్సోల్ మహిళా పోలీస్ స్టేషన్ అధికార పరిధిలో ఉన్నాయి.[15][16]
రాణిగంజ్, జమురియా,హీరాపూర్,కుల్టీ పోలీస్ స్టేషన్‌లు కూడా అసన్సోల్ నగరపాలక సంస్థ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి.[15][16]
2015 జూన్ 3 నాటి కోల్‌కతా ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం , కుల్తీ, రాణిగంజ్, జమురియా పురపాలిక ప్రాంతాలు అసన్సోల్ నగరపాలక సంస్థ అధికార పరిధిలో చేర్చబడ్డాయి.
పరిపాలన
మార్చుఅసన్సోల్ నగరపాలక సంస్థ ద్వారా అసన్సోల్ నగరపాలన సాగుతుంది.1850లో, అసన్సోల్ పౌర అవసరాలను చూసేందుకు యూనియన్ కమిటీని ఏర్పాటు చేశారు. అసెన్సోల్ (ప్రస్తుతం అసన్సోల్) పురపాలక సంఘం 1885లో ఆమోదించబడింది, కానీ 1896లో సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభించింది.[17] ఇది 1994లో నగరపాలక సంస్థ స్థాయి కల్పించబడింది.[18] 2011 నుండి దానికి స్వంత పోలీస్ కమిషనరేట్ ఉంది.[19] 2015లో,కుల్తీ,జమురియా,రాణిగంజ్ పురపాలికలు రద్దు చేయబడి,ఆ ప్రాంతాలు అసన్సోల్ నగరపాలక సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి.అందువల్ల అసన్సోల్ సరైన నగర పరిమితుల్లో బర్న్‌పూర్‌తో సహా పాత అసన్‌సోల్ ప్రాంతం,అలాగే రాణిగంజ్, చినకూరి,మిథాని,బరాకర్,కుల్టీ, డిషెర్‌ఘర్,నీమత్‌పూర్,సీతారాంపూర్,జమురియా వంటి ఇతర ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి.[20]
అసన్సోల్-దుర్గాపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎడిడిఎ) ఏప్రిల్ 1980లో అసన్సోల్ ప్లానింగ్ ఆర్గనైజేషన్,దుర్గాపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ విలీనం ద్వారా స్థాపించబడింది. అసన్సోల్-దుర్గాపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికార పరిధి అసన్సోల్ నగరపాలక సంస్థ జమురియా పంచాయతీ సమితి,ఆండాల్,పాండబేశ్వర్,దుర్గాపూర్-ఫరీద్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు,దుర్గాపూర్ నగరపాలక సంస్థ,కాంక్సా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో కొంతభాగాన్ని నిర్వహించే ప్రాంతాలకు సేవలు అందిస్తుంది.[21]
జనాభా గణాంకాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1951 | 1,85,000 | — |
1961 | 2,89,000 | +56.2% |
1971 | 3,76,000 | +30.1% |
1981 | 6,37,000 | +69.4% |
1991 | 9,42,000 | +47.9% |
2001 | 10,73,000 | +13.9% |
2011 | 12,43,414 | +15.9% |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[22] అసన్సోల్ మొత్తం జనాభా 12,43,414, అందులో 6,46,052 మంది పురుషులు,5,97,362 మంది స్త్రీలు ఉన్నారు.[3] నగర పరిధిలోని జనాభా అక్షరాస్యత రేటు 83.30%గా ఉంది.[23][24] అసన్సోల్ మొత్తం జనాభాలో ప్రధాన మతాలు లైన హిందూ జనాభా 75.18% మంది,ఇస్లాం జనాభా 21.26% మంది, 1.09% మంది జనాభా సిక్కు మతాన్ని అనుసరించేవారు కాగా, జనాభాలో 0.99% మంది క్రైస్తవమతానికి కట్టుబడి ఉన్నారు.[25]
దక్షిణ బెంగాల్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ కోల్‌కతాకు, మాల్దా, సిలిగురి, మిడ్నాపూర్, బంకురా,సియురి,పురూలియా,బుర్ద్వాన్,కల్నా,హౌరా,బరాక్‌పూర్,దిఘా,బోల్పూర్, కిర్నాహార్,బెర్హంపూర్ వంటి అనేకఇతర గమ్యస్థానాలకు రోజువారీ బస్సులు ద్వారా సేవలును అందిస్తుండి.ఉత్తర బెంగాల్ రాష్ట్రరోడ్డు రవాణసంస్థ ఉత్తర బెంగాల్‌లోని మాల్దా, రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్ వంటి నగరాలు,పట్టణాలకు బస్సు సర్వీసులను నడుపుతోంది. అనేక ఇతర ప్రైవేట్ మోటారు వాహనాలు సేవలుకూడా ఉన్నాయి.
రైల్వే
మార్చుకోల్కతాను ఉత్తర భారతదేశంతో కలిపే దాదాపు అన్ని రైళ్లు సీల్దా రాజధాని, హౌరా రాజధాని, హౌరా దురంతో, సీల్దా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, యువ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ దురంతో సహా అసన్‌సోల్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. ఫలితంగా, అసన్సోల్ న్యూ ఢిల్లీ, జమ్మూ,అమృత్‌సర్,లూథియానా,అలహాబాద్,కాన్పూర్,లక్నో,డెహ్రాడూన్,జైపూర్, కోట,జోధ్‌పూర్,జైసల్మేర్,గ్వాలియర్,భోపాల్,ఇండోర్,పాట్నా,రాంచీ వంటి నగరాలతో మంచి అనుసంధానం పొందుతోంది. ముంబై, అహ్మదాబాద్, సూరత్ వంటి పశ్చిమ నగరాలు,భువనేశ్వర్,విశాఖపట్నం,విజయవాడ,చెన్నై,బెంగుళూరు,త్రివేండ్రం వంటి దక్షిణ నగరాల వైపు మంచి ప్రయాణ సౌకర్యాల సేవలు అందుతున్నాయి.ఇది ఈశాన్య ప్రాంతంలోని గౌహతితో కూడా అనుసంధానించబడి ఉంది.[26]
గాలి
మార్చునగరానికి సమీప విమానాశ్రయం అసన్సోల్ నుండి నగర బస్సు సేవలు కేంద్రం నుండి దాదాపు 25 కిలోమీటర్లు (16 మై.) దూరంలోని ఆండాళ్‌లో దేశీయ విమానాశ్రయం కాజీ నజ్రుల్ ఇస్లాం విమానాశ్రయం ద్వారా నగరానికి సేవలు ఉన్నాయి.
కోల్‌కతాలోని డమ్ డమ్‌లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అసన్సోల్ నగరానికి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం
ఆర్థిక వ్యవస్థ
మార్చునగరానికిఅసన్సోల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దాని ఉక్కు ,బొగ్గు పరిశ్రమలు, రైల్వేలు దాని వ్వాపార, వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది.
విద్య
మార్చుఅసన్సోల్ నగరంలో అనేక విద్యా సంస్థలలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.
పాఠశాలలు
మార్చు- అసన్సోల్ రామకృష్ణ మిషన్ ఉన్నత పాఠశాల
- అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చి పాఠశాల
- గ్రీన్ పాయింట్ అకాడమీ
- బర్న్‌పూర్ రివర్‌సైడ్ పాఠశాల [27]
- డిఎవి పబ్లిక్ స్కూల్, అసన్సోల్ [28]
- దోమోహని కెలెజోరా ఉన్నత పాఠశాల
- లోరెటో కాన్వెంట్
- సెయింట్ పాట్రిక్స్ ద్వితీయ ఉన్నత పాఠశాల
- సెయింట్ విన్సెంట్స్ ఉన్నత, సాంకేతిక పాఠశాల
- సుభాస్పల్లి బిద్యానికేతన్
- సిటీ మాంటిస్సోరి ఉన్నత పాఠశాల
- తూర్పు రైల్వే ఉన్నత పాఠశాల [29]
- అసన్సోల్ నార్త్ పాయింట్ పాఠశాల
- కేంద్రీయ విద్యాలయం, అసన్సోల్
- కలకత్తా బాలుర, బాలికల పాఠశాల
- నారాయణ పాఠశాల
కళాశాలలు/విశ్వవిద్యాలయాలు
మార్చు- అసన్సోల్ ఇంజనీరింగ్ కళాశాల
- అసన్సోల్ బాలికల కళాశాల
- అసన్సోల్ పాలిటెక్నిక్
- బన్వారిలాల్ భలోటియా కళాశాల, అసన్సోల్
- బిధాన్ చంద్ర కళాశాల, అసన్సోల్
- దేశబంధు మహావిద్యాలయం
- కన్యాపూర్ పాలిటెక్నిక్
- కాజీ నజ్రుల్ ఇస్లాం మహావిద్యాలయం
- కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం
- ఖండ్రా కళాశాల
- కుల్టీ కళాశాల
- రాణిగంజ్ బాలికల కళాశాల
- సెయింట్ జేవియర్స్ కళాశాల, అసన్సోల్
- త్రివేణి దేవి భలోటియా కళాశాల
ప్రముఖ వ్యక్తులు
మార్చు- కాజీ నజ్రుల్ ఇస్లాం
- షర్మిలా ఠాగూర్
- తిమిర్ బిస్వాస్
- అర్జున్ అత్వాల్
- వివేక్ సింగ్ (చెఫ్)
- SS అహ్లువాలియా
- అజితేష్ బందోపాధ్యాయ
- మనోజ్ కుమార్ ముఖర్జీ
- రిత్విక్ దాస్
మూలాలు
మార్చు- ↑ "Indian Cities and Their Nicknames - Complete List". 22 July 2015. Retrieved 25 December 2019.
- ↑ "Siliguri, India Metro Area Population 1950-2021".
- ↑ 3.0 3.1 "Asansol City Population Census 2011 - West Bengal". census.gov.in. Retrieved 3 July 2020.[permanent dead link]
- ↑ "The Kolkata Gazette" (PDF). Notification No. 335/MA/O/C-4/1M-36/2014 dated 3 June 2015. Department of Municipal Affairs, Government of West Bengal. Archived from the original (PDF) on 12 March 2017. Retrieved 9 March 2017.
- ↑ 5.0 5.1 "Asansol City". asansolmunicipalcorporation. Archived from the original on 15 ఆగస్టు 2022. Retrieved 24 November 2020.
- ↑ 6.0 6.1 "Asansol Info".
- ↑ 7.0 7.1 "Asansol Durgapur Development Authority". sudawb.org. Retrieved 24 November 2020.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). Nclm.nic.in. Ministry of Minority Affairs. p. 85. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 28 August 2019.
- ↑ 9.0 9.1 "Fact and Figures". Wb.gov.in. Retrieved 28 August 2019.
- ↑ 10.0 10.1 "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). censusindia.gov.in. Retrieved 12 March 2022.
- ↑ "World's fastest growing urban areas (1)". City Mayors. 7 December 2010. Retrieved 16 March 2011.
- ↑ "Indian Laurel". Retrieved 25 December 2019.
- ↑ (1884-85). "General Report - Public Instruction In Bengal".
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 5 February 2018. Retrieved 21 April 2017.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ 15.0 15.1 15.2 15.3 "District Statistical Handbook 2014 Bardhaman". Tables 2.1, 2.2. Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 21 January 2019. Retrieved 23 September 2018.
- ↑ 16.0 16.1 16.2 16.3 "Asansol Durgapur Police Commissionerate". Find your police station. Asansol Durgapur Police. Archived from the original on 22 January 2012. Retrieved 18 February 2017.
- ↑ "পাতা:গবর্ণমেণ্ট্ গেজেট্ (মার্চ) ১৮৮৬.pdf/৩৪০ - উইকিসংকলন একটি মুক্ত পাঠাগার". bn.wikisource.org. Retrieved 25 December 2019.
- ↑ "Asansol Municipal Corporation". Asansol Municipal Corporation.
- ↑ "Asansol-Durgapur Police Commissionerate". Asansoldurgapurpolice.in.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 12 March 2017. Retrieved 9 March 2017.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Welcome to ADDA". addaonline.in.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". censusindia.gov.in. Archived from the original on 26 December 2018. Retrieved 20 February 2019.
- ↑ "Asansol growing faster than Kolkata, says UN report". The Times of India. Retrieved 20 February 2019.
- ↑ "Kolkata | History, Population, Government, & Facts". Encyclopædia Britannica (in ఇంగ్లీష్). Retrieved 20 February 2019.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". censusindia.gov.in. Retrieved 18 December 2021.
- ↑ "Asansol Jn Train Railway Station". Make My Trip. Archived from the original on 23 May 2010.
- ↑ "TMC confident of scripting history in Asansol". The Statesman. 12 April 2022. Retrieved 10 August 2022.
- ↑ "CBSE 10: Stellar show fuels doctor dreams for Bengal girl". The Times of India (in ఇంగ్లీష్). May 7, 2019. Retrieved 8 March 2022.
- ↑ "Eastern Railway High School". erhsasansol.com. Archived from the original on 2023-01-23. Retrieved 2023-01-23.