ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ
ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ ప్రముఖ సినీ, నాటక రచయిత. వీరు 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను, మాటలను అందించారు.[1] వీరి కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా నడుస్తాయి.
ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ | |
---|---|
![]() ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ | |
జననం | ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ |
ఇతర పేర్లు | ఆకెళ్ళ |
ప్రసిద్ధి | తెలుగు రచయిత, సాహితీ కారులు |
జననం సవరించు
ఆకెళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో జానకీ, రామయ్య దంపతులకు జన్మించారు.
రచనారంగం సవరించు
చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించారు. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి అడుగుపెట్టారు. మొదటగా చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు వ్రాసి పంపించడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవల రచించారు. వీరు సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీనిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి. టీవీ సీరియల్స్‌కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశారు. సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాల్లో రచన చేశారు. 1997లో తొలిసారిగా ‘కాకి ఎంగిలి’ అనే నాటకాన్ని రాశాడు. తరువాత ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్’ లాంటి చారిత్రక నాటకాలు రాశారు.[1]
సినిమాలు సవరించు
నాటికలు సవరించు
అమ్మ, రేపటి శత్రువు నాటికలతో నాటక రచయితగా మారాడు. ఆకెళ్ళ రాసిన నాటికలు 3 సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. హైదరాబాదులోని రవీంద్రభారతిలో 2022 మే 21న ఆకెళ్ళ రాసిన 25 నాటికల సంకలనం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నాటక రచయిత వల్లూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.[2]
- కాకి ఎంగిలి
- క్రాస్ రోడ్స్
- ఎయిర్ ఇండియా
- మూడో పురుషార్ధం
- ఆరు పిశాచాలు
- ఓం
- అన్నా! జిందాబాద్
- ఇదొక విషాదం
- మీ ఇల్లెక్కడ
- కొత్తనాయకుడు
- ఋషి
- పరుగు
- ఆ కలనేత
- పెద్దలూ జాగ్రత్త
- అంజలి
- మమత హాస్పిటల్స్
- అమ్మ
- భవదీయం
- రేపటి శత్రువు
- నాలుగో సింహం
- ఇండియన్ గ్యాస్
- మూడోపాదం
- పెద్దలకు మాత్రమే
- ఆంబోతు
- శాంతియుద్ధం
- కొత్త సైన్యం
- తలుపు
- అరవై దాటాయి. ఎందుకు?
- సహప్రయాణం
- నక్షత్రం
- ఒంటికన్ను
- అదిగో... వాళ్ళ పిల్లే
- జీవనవేదం
- గడి
- స్వేచ్ఛ
- చట్టమే నన్ను రక్షిస్తుంది
- తెలకపిండి తాయారమ్మ
- జరుగుతున్న కథ
- తల్లిదండ్రులూ... జాగ్రత్త
- భయం
అవార్డులు సవరించు
- విశాలాంధ్ర అవార్డు
- ఆంధ్రప్రభ అవార్డు
- యువ చక్రపాణి అవార్డు
- విజయ మాస పత్రిక అవార్డు (2సార్లు)
- సాహిత్య అకాడమీ అవార్డు - కాకి ఎంగిలి నాటకం.
- 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకున్నారు.[1]
- కళారత్న (హంస) ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[3]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 1.2 "నా నాటకాల మూలసూత్రాలు". Sakshi. 2020-02-10. Archived from the original on 2022-05-22. Retrieved 2022-05-22.
- ↑ "ఆకెళ్ళ నాటికలు ఆవిష్కరణ, ఆంధ్రజ్యోతి హైదరాబాదు ఎడిషన్, పుట 7". epaper.andhrajyothy.com. 2022-05-22. Archived from the original on 2022-05-23. Retrieved 2022-05-23.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 April 2020. Retrieved 17 April 2020.