ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం

(ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఆసిఫాబాద్ శాసన సభ నియోజక వర్గం, సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం ఉన్నాయి.ఆసిఫాబాద్ నియోజక వర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది.

.

ఆసిఫాబాదు
—  శాసనసభ నియోజకవర్గం  —
ఆసిఫాబాదు is located in తెలంగాణ
ఆసిఫాబాదు
ఆసిఫాబాదు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
ప్రభుత్వం
 - Type కాంగ్రెస్
 - శాసనసభ సభ్యులు కోవ లక్ష్మీ

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2009కి ముందు వరకు ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాణి, రెబ్బెన, తాండూ బెల్లంపల్లి మండలాలు ఉండేవి. 2009లో జరిగిన పునర్విభజన అనంతరం ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి, తిర్యాణి, రెబ్బెన, కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, నార్నూర్, గాదిగూడ పది మండలాలతో ఏర్పడింది.

ఇవి పూర్తిగా ఏజెన్సీ మండలాలు కావడంతో 2009 నుంచి ఎస్టీకి రిజర్వు చేసి, పునర్విభజనకు ముందు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండేది. అప్పుడు బెల్లంపల్లికి చెందిన దాసరి నర్సయ్య,  గుండా మల్లేష్, పాటి సుభద్ర, అమురాజుల శ్రీదేవి శాసనసభకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2009 నుంచి ఎస్టీలకు రిజర్వు కావడంతో తిర్యాణి మండలానికి చెందిన ఆత్రం సక్కు. కోవ లక్ష్మి (అత్తగారి మండలం)లు విజయం సాధించారు.

1972 వరకు ఇది ఎస్టీ నియోజకవర్గంగా కొనసాగింది. 1978 నుంచి 2004 వరకు ఎస్సీలకు, 2009 నుంచి మళ్లీ ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు.[1]

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికలలో ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అమురాజుల శ్రీదేవి సమీప ప్రత్యర్థి సి.పి.ఎం. అభ్యర్థి మల్లేష్ పై 5452 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. శ్రీదేవికి 45817 ఓట్లు రాగా, మల్లేష్‌కు 40365 ఓట్లు లభించాయి.

2004 ఎన్నికలలో వివిధ పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు.
క్రమ సంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 అమురాజుల శ్రీదేవి తెలుగుదేశం పార్టీ 45817
2 జి.మల్లేష్ సి.పి.ఐ 40365
3 జంగంపల్లి రాజమల్లు తెలంగాణ రాష్ట్ర సమితి 14847
4 పి.సుభద్ర ఇండిపెండెంట్ 8053
5 ఎం.విజయలక్ష్మి ఇండిపెండెంట్ 3190
6 కె.శ్రీనివాస్ ఆర్.పి.ఐ (కె) 2688
7 అంబల మహేందర్ ఇండిపెండెంట్ 1450

2009 ఎన్నికలు

మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున అత్రాం సక్కు, భారతీయ జనతా పార్టీ తరఫున శింగం జగ్గారావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆడె రమేష్ లోకసత్తా తరఫున కె.జగపతి రావు పోటీలో ఉన్నారు. మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పెందూర్ గోపి పోటీ పడుతున్నాడు.

2023 ఎన్నికలు

మార్చు

2023 లో ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి.ఈ నియోజక వర్గంలో ప్రధనంగా మూడు పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీ 22,819 ఓట్ల మెజారిటీతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ పై విజయం సాధించారు. ఆసిఫాబాద్ నియోజక వర్గంలో మొత్తం రౌండ్లో వారీగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 18 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీకు 83,052 ఓట్లు 44.97% , భారతీయ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ కు 60,242ఓట్లు 32.62%, భారతీయ జానతా పార్టీ అభ్యర్థి ఆజ్మీరా ఆత్మారామ్ నాయక్ కు 6,613 ఓట్లు 3.58%, నోటాకు 1,515 ఓట్లు 0.82% వచ్చాయి.భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీ 22,810 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు. ఆసిఫాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు.

క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు శాతం
1 కోవ లక్ష్మీ భారత రాష్ట్ర సమితి పార్టీ 83.036 44.97%
2 అజ్మీరా శ్యామ్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 60,238 32.62%
3 అజ్మీరా అత్మారామ్ నాయక్ భారతీయ జనతా పార్టీ 6.609 3.58%
4 నోటా నోటా 1,515 0.82%
5 కోట్నాక్ విజయ కుమార్ ఇండిపెండెంట్ 1,6469 8.92%
6 కనక ప్రభాకర్ బీఎస్ పీ 3,544 1.92%
7 ఆజ్మేరా రామ్ నాయక్ పిఆర్ ఎస్ హెచ్ పి 2,567 1.39%

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[2] 5 ఆసిఫాబాదు (ఎస్.టి) కోవ లక్ష్మీ స్త్రీ బీఆర్ఎస్ 82757 అజ్మీరా శ్యామ్ నాయక్ పు కాంగ్రెస్ 59756
2018 5 ఆసిఫాబాదు (ఎస్.టి) ఆత్రం సక్కు పు కాంగ్రెస్ పార్టీ కోవ లక్ష్మీ స్త్రీ తెలంగాణ రాష్ట్ర సమితి
2014 5 ఆసిఫాబాదు (ఎస్.టి) కోవ లక్ష్మీ స్త్రీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆత్రం సక్కు పు INC N.A
2009 5 ఆసిఫాబాదు (ఎస్.టి) ఆత్రం సక్కు M INC 42907 పెందూర్ గోపి M తెలంగాణ రాష్ట్ర సమితి 27621
2004 244 ఆసిఫాబాదు (ఎస్.సి) అమరాజుల శ్రీదేవి F తె.దే.పా 45817 గుండా మల్లేష్ M CPI 40365
1999 244 ఆసిఫాబాదు (ఎస్.సి) పాటి సుభద్ర F తె.దే.పా 50341 దాసరి నర్సయ్య M INC 38948
1994 244 ఆసిఫాబాదు (ఎస్.సి) గుండా మల్లేష్ M CPI 57058 దాసరి నర్సయ్య M INC 22903
1989 244 ఆసిఫాబాదు (ఎస్.సి) దాసరి నర్సయ్య M INC 40736 గుండా మల్లేష్ M CPI 34804
1985 244 ఆసిఫాబాదు (ఎస్.సి) గుండా మల్లేష్ M CPI 27862 దాసరి నర్సయ్య M INC 23814
1983 244 ఆసిఫాబాదు (ఎస్.సి) గుండా మల్లేష్ M CPI 17623 దాసరి నర్సయ్య M INC 17320
1978 244 ఆసిఫాబాదు (ఎస్.సి) దాసరి నర్సయ్య M INC (I) 15812 గుండా మల్లేష్ M CPI 11963
1972 239 ఆసిఫాబాదు (ఎస్.టి) కోట్నాక భీమ్‌రావు M INC 27279 Sida Mothi M CPI 7945
1967 239 ఆసిఫాబాదు (ఎస్.టి) కోట్నాక భీమ్‌రావు M INC 16862 A. G. Reddy M CPI 10879
1962 250 ఆసిఫాబాదు (ఎస్.టి) కోట్నాక భీమ్‌రావు M INC 13186 Atram Assuvantha Rao M CPI 7391
1957 46 ఆసిఫాబాదు (ఎస్.టి) G. Narayan Reddy M INC 22028 Kashi Ram (ఎస్.టి) M INC 20707

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (26 October 2023). "మొత్తం పది మండలాలు." Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.