కలవారి సంసారం

కలవారి సంసారం 1982లో విడుదలైన తెలుగు నాటక చలన చిత్రం. మహేశ్వరి కంబైన్స్ పతాకంపై దోనేపూడి బ్రహ్మయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి, హరనాథ్ ప్రధాన తారాగణంగా గల ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా మాదిరెడ్డి సులోచన రాసిన "అగ్ని పరీక్ష" నవల ఆదారంగా చిత్రీకరించబడినది.[1]

కలవారి సంసారం
(1982 తెలుగు సినిమా)
Kalavari Samsaram.jpg
దర్శకత్వం కె. ఎస్. రామిరెడ్డి
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
కైకాల సత్యనారాయణ,
నిర్మల,
రాజేంద్రప్రసాద్,
హరనాథ్,
అల్లు రామలింగయ్య,
సూర్యకాంతం,
సుధాకర్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఈ తరం పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

కోదండరామయ్య, చలపతి, రఘుపతి ముగ్గురు అన్నదమ్ములు. కోటీశ్వరులుగా పేరు పొందారు. కోదండరామయ్యకి తమ్ములంటే అభిమానం. వ్యసనాలకులోనై మరణించిన రఘుపతిని తలుచుకొని ఏడుస్తూ వుంటాడు. ఉమ్మడికుటుంబం. అతని భార్య కాంతమ్మ భర్త లాంటిదే. మరిది పిల్లలు, నా పిల్లలు అని ఏనాడు భేదం చూపి ఎరగదు. రామయ్యకు, మోటార్ రిపేరింగు కంపెనీ ఉంది. అడితీ దుఖాణం ఉంది.ఇంకా ఎన్నో వ్యాపారాలు చేస్తాడు. అతని ఆదాయవ్యయ సంగతులు ఎవరికీ తెలియదు. రోజుకు పది మంది ఆశ్రితజనం ఆయింట వుంటారు. పిల్లలంతా పిల్ల జమీందారులా పెరుగుతున్నారు. ఇంటిలోని ఆడవారుకు జమా ఖర్చులు తెలియదు.

కావలసిన వస్తువులు, బట్టలు అన్నీ పద్దు వ్రాయించి తెచ్చుకోవటమే. అలాంటి పరిస్థితులలో కోదండరామయ్య చనిపోతాడు. చనిపోయేముందు తమ ఆర్థికపరిస్థితి గురించి కొడుకు విష్ణువర్ధన్ కు వివరించి, కుటుంబగౌరవం కాపాడమని మాట తీసుకుంటాడు. అస్తవ్యస్తంగా వున్న ఆర్థికపరిస్థితిని చక్కదిద్దటానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు విష్ణు. ఇంటిలోని దుబారా ఖర్చులు తగ్గిస్తాడు. పద్దువ్రాసి వస్తువులు తెప్పించే పద్ధతి మానిపిస్తాడు. ఇంటివారంతా కర్కోటకుడని తిడుతున్నా పట్టించుకోడు. ఈ కష్టసమయములో తోడు కావాలని మధ్యతరగతి అమ్మాయి సుజాతను వివాహమాడుతాడు. సుజాత అత్తవారి సూటిపోటిమాటలను పట్టించుకోక విష్ణుకు అండగా నిలుస్తుంది. ఎన్నో వొడిదడుకులను ఎదురుకొని అన్నీ సరిదిద్దుతాడు విష్ణు.

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Kalavari Samsaram (Review)". Filmiclub.

బాహ్య లంకెలుసవరించు