కొంపెల్ల విశ్వం

కొంపెల్ల విశ్వంప్రముఖ రచయిత. ముఖ్యంగా సినిమాలకు, టి.వి.సీరియళ్లకు రచనలు చేశాడు. ఇతడు ముమ్మిడివరంలో జన్మించాడు. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా కాశ్మీరులో పనిచేశాడు. పిమ్మట హైదరాబాద్ కోర్టులో పనిచేశాడు. చామంతి, సక్కనోడు, ఉమ్మడి కుటుంబం, కొంగుముడి మొదలైన సినిమాలకు రచయితగా ఉన్నాడు. ఎ.వి.ఎం. బ్యానర్‌పై నిర్మించబడిన కొన్ని టి.వి.సీరియళ్లకు ఇతడు సంభాషణలు వ్రాశాడు. ఇతడు చివరి దశలో ఆధ్యాత్మికంవైపు ఆకర్షితుడైషిర్డీ సాయిబాబా భక్తుడిగా మారిపోయాడు. ఇతడు సాయి సేవా సత్సంగ్ అనే ట్రస్టును స్థాపించి సంఘసేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇతడు 2013, అక్టోబరు 1న చెన్నైలో తన 62వ యేట గుండెపోటుతో మరణించాడు[1],[2].

రచనలుసవరించు

కథలుసవరించు

ఇతని కథలు ఆంధ్రప్రభ, రచన, జ్యోతి, కడలి, ఆంధ్రజ్యోతి, స్వాతి, చుక్కాని, స్రవంతి, పుస్తకం, ప్రగతి, యువ, ఆంధ్రపత్రిక, పుస్తకప్రపంచం, ఇండియాటుడే, విపుల, చతుర, ఆంధ్రపత్రిక, స్వప్న, ప్రజాతంత్ర, అనామిక, వనిత తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. కొన్ని "కొంపెల్ల విశ్వం కథలు" అనే పుస్తకంగా వచ్చింది. కథానిలయంలో లభించే ఇతని కథలు కొన్ని[3]:

 1. 'కాలం' కథ
 2. అక్షింతలు
 3. అబద్ధం
 4. అబ్బాయిగారు-అమ్మాయిగారు
 5. అభిమాన పాఠకుడు
 6. అమ్మలూ! నువ్వునాదగ్గరకు రావద్దులే !
 7. ఆకలి కథ
 8. ఆమెకు ఇద్దరు
 9. ఆరాధన
 10. ఇష్టం
 11. ఈ పిల్లులు పాలు తాగవు
 12. ఊరు అంటుకుంది
 13. ఎన్జీవో భార్య
 14. ఎన్నికలు
 15. కాళ్ళు
 16. కొండముచ్చు-మల్లెపువ్వు
 17. కోర్టు
 18. గొలుసు
 19. గౌరవం
 20. చచ్చుకథ
 21. చేటపెయ్య
 22. చేదు మిఠాయి
 23. తోడు
 24. నీతి లేని ఆడది
 25. పడవ
 26. పిచ్చితల్లి
 27. పేదవాడికి జై
 28. ప్రతిపక్షం
 29. ప్రపంచం దేనిమీద నడుస్తోంది?
 30. ప్రాణంలేని ప్రాణి
 31. ప్రియురాలు
 32. బచ్చీ బీమార్ హోయీ
 33. మంట
 34. మగజాతి కథ
 35. మానవత్వానికి మారణహోమం
 36. మామూలుమనిషి
 37. మిడిల్ క్లాస్
 38. ముందుచూపు
 39. ముద్దుగుమ్మతో ముగ్గురబ్బాయిలు
 40. ముసుగు
 41. మౌనరాగం
 42. రాజహంస
 43. రాజ్యహింస
 44. లంగరు దొరకని నౌక
 45. లంచం
 46. లెక్కల మాస్టారు
 47. లోకాన పిచ్చోళ్లు
 48. వీళ్లూ మనుషలే
 49. వ్యవస్థ
 50. శాకాహారి
 51. సత్యవతి
 52. సీటు
 53. సుందరి మొగుడొచ్చాడు
 54. స్వప్నకిరీటం

ఇతరములుసవరించు

 • శ్రీ శిరిడీ సాయి ఆరతులు
 • బ్రతుకు (నవల)

సినిమాల జాబితాసవరించు

ఇతడు రచయితగా పనిచేసిన కొన్ని సినిమాలు:

 1. త్రివేణి సంగమం (1983)
 2. జననీ జన్మభూమి (1984)
 3. శ్రీమతి కావాలి (1984)
 4. కొంగుముడి (1985)
 5. సక్కనోడు (1986)
 6. ఉమ్మడి మొగుడు (1987)
 7. పూల రంగడు (1989)
 8. చామంతి (1992)
 9. మా ఇంటి ఆడపడుచు (1996)

మూలాలుసవరించు

 1. రైటర్ కొంపెల్ల నో మోర్[permanent dead link]
 2. రైటర్ కొంపెల్ల విశ్వం పాస్డ్ అవే[permanent dead link]
 3. "కథానిలయం జాలస్థలిలో కొంపెల్ల విశ్వం వివరాలు". Archived from the original on 2016-06-03. Retrieved 2016-12-23.