చండీగఢ్

భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం
(చండీఘడ్ నుండి దారిమార్పు చెందింది)

చండీగఢ్, ఉత్తర భారతదేశంలోని ఒక నగరం, కేంద్రపాలిత ప్రాంతం.[4] ఇది పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని, కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ ఉత్తర భారతదేశం లోని ప్రముఖనగరాలలో ఒకటి. భారతదేశంలో నగరనిర్మాణ ప్రణాళిక (ప్లాండ్ సిటీ) ద్వారా నిర్మించబడిన నగరాలలో చండీగఢ్ మొదటిది. ఈ నగరానికి స్విట్జర్లాండ్ నగర రూపకల్ప నిర్మాత "లె కార్‌బ్యూసియె" రూపకర్తగా పనిచేసాడు.ఈ నగర నిర్మాణం, రూపకల్పన స్వాతంత్ర్యానికి ముందే జరిగింది.ఈ నగర రూపకల్పన ద్వారా లె కార్‌బ్యూసియె భవనిర్మాణానికి, నగర రూపకల్పనకు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.[5] నగరం ప్రాథమికంగా లె కార్‌బ్యూసియె వలన రూపకల్పన చేయబడినప్పటికీ దీనికి " పిర్రే జన్నరెట్, జాన్ డ్ర్యూ , మ్యాక్స్‌వెల్ ఫ్రై వంటి వారు సహకరించారు. తలసరి ఆదాయంలో చండీగఢ్ రాష్ట్రాలలో , కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది.[6] 2010 లో భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా జాతీయ ప్రభుత్వ పరిశోధనల గుర్తింపు పొందింది.[7] అలాగే చండీగఢ్ రాష్ట్రాలలో , కేంద్రపాలిత ప్రాంతాలలో " హ్యూమన్ డెవలెప్మెంట్ ఇండెక్స్ " లో కూడా ప్రథమ స్థానంలో ఉంది. చండీగఢ్ మెట్రో , పంచకుల , మొహలి కలిసి త్రినగరాలుగా (ట్రై సిటీ) గా గుర్తింపు పొందింది.

చండీగఢ్
పంజాబీ: ਚੰਡੀਗੜ੍ਹ
ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్
దేశంభారతదేశం
నగరం, కేంద్రపాలిత ప్రాంతంచండీగఢ్
ప్రభుత్వ స్థానంచండీగఢ్
Government
 • నిర్వాహకుడువి.పి. సింగ్ బాద్నోర్ (అడ్మినిస్ట్రేటర్)
 • మేయర్శ్రీమతి. రాజ్ బాలా మాలిక్ (2020 జనవరి నుండి)
 • కమీషనర్కె.కె.యాదవ్
విస్తీర్ణం
 • నగరం, కేంద్రపాలిత ప్రాంతం114 కి.మీ2 (44 చ. మై)
 • Rank33
Elevation
350 మీ (1,150 అ.)
జనాభా
 • నగరం, కేంద్రపాలిత ప్రాంతం10,54,686
 • Rank29th
 • జనసాంద్రత9,300/కి.మీ2 (24,000/చ. మై.)
 • Metro9,60,787
 [2]
భాషలు
 • అధికార[3]పంజాబీ
Time zoneUTC+05:30 (IST)
పిన్
160xxx
ప్రాంతీయ ఫోన్ కోడ్91-172-XXX XXXX
ISO 3166 codeIN-CH
Vehicle registrationCH-01 to CH-04, PB-65, HR-70
మానవ పురోగతి సూచికIncrease
0.892
అక్షరాస్యత81.9
యూనియన్ భూభాగం, చండీగఢ్ నగరం అన్ని ప్రాంతాలను కలిగి ఉంది

చరిత్ర

మార్చు

1947 భారతదేశ విభజన తరువాత పంజాబు భూభాగం కూడా విభజించబడింది. తూర్పు పంజాబు భారతదేశం లోనూ పశ్చిమ పంజాబు పాకిస్తాన్ దేశంలోనూ కలుపబడింది. భారతీయ పంజాబుకు లాహోరుకు సమానమైన రాజధాని నగరం అవసరమైంది.[8] చండీగఢ్ అంటే చంఢీదేవి కోట అని అర్ధం.ఇక్కడ ఉన్న హిందూ ఆలయం చండీమందిర్ ఉన్న కారణంగా ఈ నగరానికీ పేరు వచ్చింది. ఈ ఆలయం నగరంలోని పంచకుల ప్రాంతంలో ఉంది..[9] చండీగఢ్‌లో " లె కార్బుజియె " చెక్కిన " ఓపెన్ హ్యాండ్ " శిల్పాలు అనేకం ఉన్నాయి. ఈ శిల్పాలు 26 మీటర్ల ఎత్తు ఉన్నాయి. " ఓపెన్ హ్యాండ్ " ఙాపికలు లె కార్బుజియె శిల్పచాతుర్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ శిల్పాలు శాంతికి చిహ్నాలుగా ఉన్నాయి. తెరచిన హస్తానికి ఇచ్చి తీసుకోవడానికి గుర్తుగా భావించవచ్చు.[10] వీటిలో హైకోర్ట్, అసెంబ్లీ హాలు, సెక్రెటరేట్ ఉన్న కాపిటల్ కాంప్లెక్స్‌లో ఉన్న 6 ఙాపక చిహ్నాలు అసంపూర్తిగా మిగిలిఉన్నాయి. వీటితో జామెంట్రిక్ హిల్, మార్టిర్స్ మెమోరియల్ వద్ద ఉన్న చిత్రాలు కూడా పూర్తిచేయబడలేదు.[11] 1966 నవంబరు 1న సరికొత్తగా రూపుదిద్దుకున్న హర్యానా రాష్ట్రం, పంజాబు రాష్ట్ర తూర్పు భూభాగం నుండి హిందీ మాట్లాడే ప్రజల భూభాగం వేరుచేస్తూ రూపుదిద్దబడింది.చండీగఢ్ నగరం మద్యలో ఉన్నందున దీనిని కేంద్రపాలిత ప్రదేశం చేసి రెండు రాష్ట్రాలకు రాజధానిని చేసారు.[12] ఈ నగర చివరి పాలకుడు బ్రిజిందర్ సింగ్.

నిర్మాణ శైలి

మార్చు

జవహర్‌లాల్ నెహ్రూ ప్రేరేపణపై 1950 దశకంలో ఫ్రెంచి భవన నిర్మాణకారుడు లె కార్బుజియె (architect Le Corbusier) చండీగఢ్ నగరాన్ని, అందులో చాలా భవనాలను రూపొందించాడు. అప్పుడే స్వతంత్రమైన భారతదేశపు ప్రగతిశీల పధం ఇందులో ప్రతిఫలించాలని అతని సంకల్పం.చండీగఢ్ నగరం చదరాలు అమర్చినట్లుగా సెక్టార్లుగా డిజైన్ చేయబడింది. ప్రతి సెక్టారు సుమారుగా 1.5 కి.మీ x 1.5 కి.మీ. చదరం వైశాల్యం ఉంటుంది. ప్రతి సెక్టారు ఒక చిన్న పట్టణంలా, దాని స్వంత మార్కెట్, పూజా స్థలాలు, స్కూళ్ళు, కాలేజీలు కలిగి ఉంటుంది.1 నుండి 60 వరకు సెక్టారులు ఉన్నాయి. కాని సెక్టారు నెం.13 మాత్రం లేదు. 13వ సంఖ్య అదృష్టానికి దూరమని లె కార్బుజియె నమ్మడమే దీనికి కారణం కావచ్చును.

  • సెక్టారు -17: నగరానికి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళతో కళకళలాడుతుంటుంది. నగరవాసులకు సాయంత్రాలు గడపడానికి ఇష్టమైన స్థలం.
  • సెక్టారు - 35: రెస్టారెంట్లు, బార్ల మయం.
  • సెక్టారు - 4: రాళ్ళ తోట (Rock Garden) - పారవేసిన, వదిలేసిన వస్తువులతో నేక్‌ చంద్ అనే కళాకారుడు 30 సంవత్సరాలు శ్రమించి రూపొందించిన విశేష ఉద్యానవనం.
  • సెక్టారు -16: గులాబీ తోటలు
  • సెక్టారు -10: సుఖానా సరస్సు
  • చండీగఢ్ అక్షరాస్యత 97%. ఇక్కడ ఎన్నో మంచి ప్రమాణాలు గల విద్యా సంస్థలున్నాయి.

చండీగఢ్ జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం చండీగఢ్ రాష్ట్ర జనాభా 1,055,450.వారిలో హిందువులు 78.6%, సిక్కులు 16.1%, ముస్లిములు 4%.[13] ప్రపంచ 50 ఉత్తమ నగరాలలో చండీగడ్ ఒకటిగా ఉందని తెలుస్తుంది.[14]

పర్యాటక ఆకర్షణలు

మార్చు

చండీగడ్ నగరంలో పర్యాటక ఆకర్షణీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో పలు విధాలైన తోటలు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి.[15]

  • సుఖ్నా సరస్సు
  • రాక్ తోట
  • లీజర్ లోయ
  • ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్
  • కాపిటల్ సముదాయం
  • కాక్టస్ గార్డెన్
  • చిత్తరువుల నేషనల్ గ్యాలరీ
  • సువాసన గార్డెన్
  • కార్బూసియర్ సెంటర్
  • ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ
  • అంతర్జాతీయ డాల్ మ్యూజియం
  • బటర్ పార్క్

భౌగోళికం

మార్చు
 
సుఖ్నా సరస్సు

చండీగఢ్ హిమాలయ పర్వతశ్రేణులలోని శివాలిక్ పాదపర్వతాల వద్ద ఉంది. చండీగఢ్ వైశాల్యం 44.5 చదరపు కి.మీ. అలాగే మెట్రో వైశాల్యం 114 చదరపు కి.మీ. నగరసరిహద్దులలో పంజాబు, హర్యానాలు ఉన్నాయి.[16] చండీగఢ్ సముద్రమట్టానికి 321 మీటర్ల ఎత్తున ఉంది.

చండీగఢ్
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
33
 
16
3
 
 
39
 
20
5
 
 
30
 
25
10
 
 
9
 
32
16
 
 
28
 
35
20
 
 
145
 
36
22
 
 
280
 
31
21
 
 
308
 
30
20
 
 
133
 
30
19
 
 
22
 
29
14
 
 
9
 
24
8
 
 
22
 
19
4
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: World Weather Information Service

చండీగఢ్ పరిసరాలలో పంజాబు రాష్ట్రానికి చెందిన మొహలి, పాజ్టలియా, రూప్‌నగర్ ఉన్నాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన అంబాలా, పంచకుల నగరాలు ఉన్నాయి. నగర ఉత్తర భాగంలో స్వల్పంగా హిమాచల ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఉంది.

చండీగఢ్‌లో తేమతో కూడిన ఉప ఉష్ణ వాతావరణం కలిగి ఉంటుంది. చాలా వేడి వేసవి, స్వల్పమైన చలి, అప్పుడప్పుడూ వచ్చే వర్షాలు ఉష్ణోగ్రతలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి. సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 40-1 సెల్షియస్ ఉంటుంది. సంవత్సర సరాసరి వర్షపాతం 1110.7 మి.మీ ఉంటుంది. నగరంలో ఒక్కోసారి శీతాకాలంలో కూడా వర్షాలు కురుస్తుంటాయి. ఉత్తరంలో ఉన్న సిమ్లా, జమ్ముకాశ్మీరు నుండి చలిగాలులు వీస్తుంటాయి.

పర్యావరణం

మార్చు

చండీగఢ్‌లో అధికంగా మర్రి, యూకలిఫ్టస్ ప్లాంటేషన్లు ఉంటాయి. అశోక, కసియా, మల్బరీ, ఇతర చెట్లు ఉన్నాయి. నగరమంతటా వన్యప్రాంతంలాంటి వాతావరణం గోచరిస్తుంది. నగరం చుట్టూ అరణ్యాలు ఉన్నందువలన అగరంలో అనేక జంతువులు, వృక్షాలు కనిపిస్తుంటాయి. జింకలు, సాంబారు జింకలు, బార్కింగ్ డీర్, రామచిలుకలు, వడ్రంగిపిట్టలు, నెమళ్ళు మొదలైనవి అభయారణ్యాలలో ఉన్నాయి. సుఖ్నా సరసులో వైవిధ్యమున్న బాతులు, గీస్ ఉన్నాయి. అలాగే శీతాకాలంలో సైబీరియా, జపాన్ దేశాల నుండి వచ్చే వలసపక్షులను కూడా ఈ సరసు ఆకర్షిస్తుంది. చండీగఢ్ నగరంలో ఉన్న రామచిలుకల అభయారణ్యంలో పలు ఇతర జాతుల పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. నగరంలో ప్రఖ్యాతి వహించిన " జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డేన్ ", టెర్రస్ గార్డేన్, బోగన్‌విల్లా గార్డెన్, శాంతికుంజ్, ఇతర పూదోటలు ఉన్నాయి.

ఆర్ధికరంగం

మార్చు
 
లె కార్బూసియర్ చేత రూపుదిద్దుకున్న శాసనసభ
 
లె కార్బూసియర్ చేత రూపుదిద్దుకున్న పంజాబ్, హర్యానా హైకోర్టు

2012 ఆర్.బి.ఐ గణాంకాలు నిధి జమచేయడంలో దేశంలో చండీగడ్ 12వ స్థానంలోనూ రుణాలు అందించడంలో 10 వ స్థానంలోనూ ఉందని తెలియజేస్తున్నాయి.చండీగడ్ నగరంలో ప్రజలకు ప్రభుత్వం అత్యధికంగా ఉపాధి కల్పిస్తుంది. మూడు ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్నందువలన ప్రభుత్వం ప్రజలకు అత్యధికంగా ఉపాధి కల్పించడానికి వీలుకలుగుతుంది. ఈ కారణంగానే చండీగడ్ " పెంషన్ అందుకునేవారి స్వర్గంగా " గుర్తింపు పొందింది. " ఆర్డినెంస్ ఫ్యాటరీస్ బోర్డ్ " సంస్థకు చెందిన " ఆర్డినెంస్ కేబుల్ ఫ్యాక్టరీ " భారతపభుత్వం చండీగడ్‌లో స్థాపించింది. చండీగడ్‌లో ప్రభుత్వసంస్థలతో చేర్చి మొత్తం 15 మద్య, బృహత్తర సంస్థలు ఉన్నాయి.అంతేకాక చండీగడ్‌లో " 2000 " స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు నమోదయ్యాయి. కాగితం తయారీ, బేసిక్ మెటల్, అల్లాయ్స్, మెషనరీ పరిశ్రమలు ప్రధాఅమైనవి. అదనంగా ఆహారతయారీ సస్థలు, శానిటరీ వేర్, ఆటోపార్ట్స్, మెషిన్ టూల్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలెక్ట్రికల్ అప్లయంసీస్ సంస్థలు గుర్తించతగినవి. 99,262 తలసరి ఆదాయంతో చండీగడ్ దేశంలో సంపన్న నగరంగా గుర్తింపు పొందింది.[17] 2004 చండీగడ్ మొత్తం ఉత్పత్తి విలువ 2.2 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా.

చండీగడ్‌లో 3 ప్రధాన తయారీ సంస్థలు వారి కార్యాలయాలను ఏర్పాటు చేసాయి. అవి వరుసగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ,, (ఎఫ్.ఐ.సి.సి.ఐ), ది పి.హెచ్.డి చంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, (పి.హెచ్.డి.సి.సి.ఐ), ది కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, (సి.సి.ఐ) సంస్థల ప్రాంతీయ ప్రధానకార్యాలయాలు సెక్టర్ 31లో ఉన్నాయి.

చండీగడ్ ఐ.టి పార్క్ (రాజీవ్ గాంధీ చండీగర్ టెక్నాలజీ పార్క్ ) స్థాపనతో చండీగడ్ ఇంఫర్మేష టెక్నాలజీ ప్రపంచంలో ప్రవేశించింది. చండీగడ్ నుండి ఢిల్లీ, హర్యానా, పంజాబు, హిమాచల్ ప్రదేశ్ లకు సౌకర్యవంతమైన రోడ్డు మార్గాలు ఉండడం కూడా ఐ.టి అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఐ.టి టాలెంట్ పూల్ ఐ..టి బిజినెస్ సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేసే వారిని కూడా ఆకర్షిస్తుంది. పలు ఇండియన్ ఫర్ంస్ అలాగే క్యుయార్క్, ఇంఫోసిస్, డెల్, ఐ.ఐ.ఎం.బి, టెక్‌మహీంద్రా సంస్థలకు నగరంలోనూ నగరం వెలుపల కార్యాలయాలు ఉన్నాయి.

చండీగఢ్‌ జిల్లా

మార్చు

చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో చండీగఢ్ జిల్లా పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది.[18] జిల్లా ప్రధాన కార్యాలయాలు చండీగడ్ లోనే ఉన్నాయి.చండీగఢ్ జిల్లా ఉత్తర రైల్వేలోని చండీగఢ్ రాష్ట్రంలో ఒక భాగం.జాతీయ స్థాయిలో జిల్లా, జనాభా ర్యాంక్ స్థానంలో 51 ర్యాంక్ గా ఉంది.రాష్ట్ర స్థాయిలో 1 వ స్థానంలో ఉంది.2011 భారత జనాభా ఔవుట్‌గ్రోత్ ప్రకారం చండీగఢ్ జిల్లాను కూడా పరిపాలనాపరంగా చండీగఢ్ నగరపాలక సంస్థగా ప్రకటించారు.చండీగఢ్ రైల్వే స్టేషన్‌లో ప్రతిరోజూ 66 రైళ్లు ప్రయాణిస్తున్నాయి.దీనిని గ్రేడ్ బి రైల్వే స్టేషన్‌గా పరిగణించారు.[19]

జిల్లా భౌగోళికం

మార్చు

జిల్లా ప్రధాన కార్యాలయం చండీగఢ్ నగరం.జిల్లాలో ప్రధానంగా పంజాభీ, హిందీ మాట్లాడతారు.జిల్లా విస్తీర్ణం 114 చ.కి.మీ.ఇది సముద్ర మట్టానికి సరాసరి 334 మీటర్ల ఎత్తులో ఉంది.[20]

జిల్లాలో పట్టణాలు

మార్చు

జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 5 జనగణన పట్టణాలు ఉన్నాయి.[21]

  • చండీగడ్ - (నగరపాలక సంస్థ) - జనాభా - 970,602 2
  • మణి మజ్రా - (జనగణన పట్టణం) - జనాభా 15,489
  • డారియా - (జనగణన పట్టణం) - జనాభా 14,470
  • మౌలి జాగ్రన్ - (జనగణన పట్టణం) - జనాభా10,786
  • బెహ్లానా - (జనగణన పట్టణం) - జనాభా 8,281
  • ఖుడా అలీషర్ - (జనగణన పట్టణం) - జనాభా 6,831

జిల్లాలో గ్రామాలు

మార్చు

జిల్లాలో 5 గ్రామాలు ఉన్నాయి.[21]

  • ధనాస్ - జనాభా - 7,094
  • కైంబ్వాలా - జనాభా - 6,050
  • రాయ్‌పూర్ కలాన్ & మఖన్ మజ్రా - జనాభా - 4,887
  • రాయ్‌పూర్ ఖుర్ద్ - జనాభా - 7,492
  • సారంగ్ పూర్ - జనాభా - 3,468

విద్య

మార్చు
 
పంజాబ్ విశ్వవిద్యాలయం కోసం పియరీ జీన్నెరెట్ నిర్మించిన గాంధీ భవన్

చండీగఢ్‌ జిల్లాలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న పలు విద్యాసంస్థలు, పంజాబు యూనివర్శిటీ మొదలగు విద్యాసంస్థలు జిల్లా, నగర ప్రజలకు విద్యను అందిస్తున్నాయి.ఈ విద్యాసంస్థలు ప్రపంచం అంతటి నుండి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.

జిల్లా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జిల్లా జనాభా 9,60,787.అందులో పురుషులు 45% మంది ఉండగా, స్త్రీలు 55%మంది ఉన్నారు.జన సాంధ్రత చ. కి.మీ.కు 9258 మంది జనాభాను కలిగి ఉంది.లింగ విష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 829 స్త్రీలును కలిగి ఉంది.ఇది జాతీయ సరాసరి 928 కంటే తక్కువ. అక్షరాస్యత 86.77% ఇది జాతీయ సరాసరి 72% కంటే ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 90.81% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 81.88% ఉంది.జిల్లా మొత్తం జనాభాలో 6 సంవత్సరాల వయస్సులోపు గల పిల్లలు 10.8% మంది ఉన్నారు.[21]

జిల్లా న్యాయ వ్యవస్థ

మార్చు

చండీగఢ్ జిల్లాలో ఈ సెషన్స్ విభాగానికి చెందిన 30 కోర్టులు ఉన్నాయి.చండీగఢ్ జిల్లా కోర్టు 1966 నవంబరు 1 ఏర్పడింది.జాస్మెర్ సింగ్ మొదటి జిల్లా & సెషన్స్ జడ్జిగా,సబ్ జడ్జి ఫస్ట్ క్లాస్, చండీగఢ్ కోర్టుకు సోహన్ లాల్ వర్మలను గా నియమించారు.2014 లో 10 కొత్త కోర్టులు, అంటే అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కోర్టులు 4, 6 కోర్టులు సివిల్ జడ్జి కోర్టులు (జూనియర్) -6 సృష్టించినప్పుడు కోర్టుల సంఖ్య 30 పెరిగింది.[22]

కోర్టుల వివరాలు

మార్చు
  • జిల్లా కోర్టు & సెషన్స్ జడ్జి -1
  • అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కేర్టులు - 09 (ఇందులో సిబిఐ కేసులను విచారించడానికి 01 ప్రత్యేక కోర్టు, మహిళలపై ఘోరమైన నేరాలకు సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ కేసులకు సంభందించిన 01 ప్రత్యేక కోర్టుతో సహా).
  • సివిల్ జడ్జి కోర్టు -1 (సీనియర్ డివిజన్),
  • చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు -1
  • సబార్డినేట్ కోర్టులు -18 (ఎన్.ఐ. యాక్ట్ సెక్షన్ 138 కింద వ్యవహరించే 2 ప్రత్యేక కోర్టులతో సహా) పనిచేస్తున్నాయి.

అవి అన్నీ చండీగఢ్ సెక్టార్ -43 లో కొత్తగా నిర్మించిన జిల్లా కోర్టుల సముదాయంలో ఉన్నాయి. చండీగఢ్ లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ నుండి కాలినడకన జిల్లా కోర్టుల సముదాయానికి చేరుకోవచ్చు.కొత్త జిల్లా కోర్టుల సముదాయంలో 31 కోర్టు గదులు ఉన్నాయి.ఇది నాలుగు అంతస్థులతో నిర్మించబడింది. , జిల్లా బార్ అసోసియేషన్ ప్రారంభ సభ్యులు 15-20 మంది సభ్యులు నుండి, ప్రస్తుతం 3000 మంది సభ్యులుకు చేరుకుంది.

2014 లో 10 కోత్త కోర్టులు ఏర్పడుటకు ముందు 20 కోర్టులు జిల్లా కోర్టు కాంప్లెక్స్, సెక్టార్ -17, చండీగఢే పనిచేస్తున్నాయి.ఇవి 2013 జనవరి 25న న చండీగఢ్ లోని న్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్సు కాంప్లెక్సుకు మార్చబడ్డాయి.[22]

వినోదం

మార్చు

చండీగఢ్ నగరంలో రాష్ట్రాంతర క్రీడా బృందాలు అనేకం ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ.పి.ఎల్) లోని కింగ్స్ XI పంజాబు ఒక భాగం. నగరంలో బత్రా, నీలం , కిరన్ వైల్ వంటి సినిమాహాళ్ళు , పలు మాల్స్ , పి.వి.ఆర్ ఎలెంటే మాల్, పి.వి.ఆర్ సెంట్రా మాల్, వేవ్ ఎంపోరియం మాల్, డి.టి మాల్, ఫన్ రిపబ్లిక్ , ఎలెంటే మాల్ (ఉత్తర భారతదేశంలో అత్యంత పెద్దది) వంటి మల్టీ కాంప్లెక్స్ ఉన్నాయి.[23] నగరంలో సెక్టర్ 1 లో ఉన్న " రాక్ గార్డెన్, సెక్టర్ 16 లో ఉన్న " జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ " ప్రపంచ ప్రఖ్యాత కలిగినవిగా గుర్తింపు పొందాయి. అంతర్జాల అనుసంధానంలో చండీగఢ్ ప్రత్యేకత సంతరించుకుంది.

వాతావరణం

మార్చు

సరాసరి ఉష్ణోగ్రత

మార్చు
  • వసంతకాలం : వసంతకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. (ఫిబ్రవరి-ఏప్రిల్) అత్యధిక ఉస్ణోగ్రత 20-13 సెల్షియస్ ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 5-12 సెల్షియస్ ఉంటుంది.
  • హేమంతం : (సెప్టెంబరు నుండి నవంబరు మద్య) వరకు ఉంటుంది. అత్యధిక ఉస్ణోగ్రత 20-10 సెల్షియస్ ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 6- 0 సెల్షియస్ ఉంటుంది.
  • వేసవి: వేసవికాలం (ఏప్రిల్ మద్య జూన్) లో అత్యధికంగా ఉష్ణోగ్రత 40 సెల్షియస్ చేరుకుంటుంది. వేసవి సరాసరి ఉష్ణోగ్రత 39-30 సెల్షియస్ చేరుకుంటుంది.
  • వర్షపాతం:- వర్షాకాలం జూలై-సెప్టెంబరు మద్య వరకు ఉంటుంది. చండీగడ్ చాలినంత వర్షపాతం అందుకుంటుంది. ఒక్కోసారి భారీవర్షాలు కూడా సంభవిస్తాయి. ఆగస్టు - సెప్టెంబరు మాసాలలో నైరుతి ఋతుపవనాల కారణజ్ంగా సాధారణ వర్షపాతం ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల కారణంగా నగరంలో భారీ వర్షపాతం సంభవిస్తుంది. చండీగడ్ నారంలో అత్యధికంగా నమోదైన వర్షపాతం 195 మి.మీ.
  • శీతాకాలం:- శీతాకాలం (నవంబరు-ఫిబ్రవరి) చలి అత్యల్పంగా ఉంటుంది ఒక్కోమారు చలి కొంచం అధికంగా ఉంటుంది. శీతాకాల ఉష్ణోగ్రత 14-5 సెల్షియస్ ఉంటుంది. ఒక్కోసారి వర్షపాతం కూడా ఉంటుంది. ఈ సమయంలో వడగళ్ళు కూడా పడుతుంటాయి. 2013 సోమవారం 7న చండీగడ్‌లో ఉష్ణోగ్రత 30 సంవత్సరాల అల్ప ఉష్ణోగ్రతకు (6.1సెల్షియస్) ఉంది. ప్రజలు దీనిని ఎముకలు కొరికే చలిగా వర్ణించారు.

వాతాపరణ పట్టిక

మార్చు
శీతోష్ణస్థితి డేటా - చండీగడ్
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అల్ప °C (°F) 2.1
(35.8)
4.3
(39.7)
9.4
(48.9)
14.9
(58.8)
20.2
(68.4)
22.4
(72.3)
21.0
(69.8)
20.3
(68.5)
17.8
(64.0)
13.0
(55.4)
6.5
(43.7)
2.7
(36.9)
12.9
(55.2)
సగటు వర్షపాతం mm (inches) 46.6
(1.83)
33.9
(1.33)
29.3
(1.15)
11.3
(0.44)
24.2
(0.95)
112.6
(4.43)
276.3
(10.88)
282.8
(11.13)
179.0
(7.05)
41.6
(1.64)
6.7
(0.26)
18.9
(0.74)
1,063.2
(41.83)
సగటు వర్షపాతపు రోజులు 3.8 3.9 2.6 2.4 2.5 7.1 12.9 13.3 6.1 1.9 1.3 1.9 59.7
Source: World Meteorological Organisation[24]

చండీగ District ్ జిల్లా ఉత్తర రైల్వేలోని చండీగ state ్ రాష్ట్రంలో ఒక భాగం, జనాభా ర్యాంక్ జాతీయ స్థాయిలో 51 వ స్థానంలో ఉంది, రాష్ట్ర స్థాయిలో 1 వ స్థానంలో ఉంది. G ట్‌గ్రోత్ (2011) తో చండీగ District ్ జిల్లాను కూడా చండీగ మునిసిపల్ కార్పొరేషన్‌గా పరిపాలనాపరంగా ప్రకటించారు. చండీగ Railway ్ రైల్వే స్టేషన్‌లో ప్రతిరోజూ 66 రైళ్లు ప్రయాణిస్తున్నాయి, కాబట్టి దీనిని గ్రేడ్ బి రైల్వే స్టేషన్‌గా పరిగణిస్తారు.

ఇచట జన్మించిన ప్రముఖులు

మార్చు
  • అభినవ్ బింద్రా, ఒలింపిక్ బంగారు పతకగ్రహీత
  • నీరజ భానోత్, విమాన సహాయకురాలు, మోడల్
  • జీవ్ మిల్కా సింగ్, ప్రొఫెషనల్ గోల్ఫర్
  • యువరాజ్ సింగ్, భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు
  • కపిల్ దేవ్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్
  • దినేష్ మోంగియా, భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్
  • నవల్‌ప్రీత్, రంగులు, చిత్రనిర్మాత
  • కిరణ్ ఖేర్, నటీమణి, రంగస్థల నటి
  • గుల్‌ పనాగ్‌, భారతీయ నటి
  • ఆయుష్మాన్ కుర్రానా, భారతీయ చిత్ర నటుడు
  • నెక్ చాంద్ సైనిక్, స్థానిక కళాకారుడు, చండీగఢ్ రాక్ గార్డెన్ సృష్టికర్త
  • యామి గౌతమ్, భారతీయ నటి
  • ముఖేష్ గౌతమ్, పంజాబీ చిత్ర దర్శకుడు
  • సర్వీన్ చావ్లా, భారతీయ నటి అష్దెన్ అవార్డులు - యు.కె యొక్క
  • రమేష్ కుమార్ నిభోరియా, విజేత
  • భారతీ వర్మ, ప్రఖ్యాత శక్తి నిపుణుల
  • ప్రభ్జాట్ కౌర్ బైన్స్ అంతర్జాతీయ శక్తి నిపుణుల ( యూనివర్శిటీ గోల్డ్ పతక)
  • ఆదివారం సేథీ, స్వర్గం యొక్క మేనేజింగ్ డైరెక్టర్
  • మిల్కా సింగ్, స్వతంత్ర భారతదేశం అత్యుత్తమ అథ్లెట్ . " భాగ్ మిల్కా సింగ్ భాగ్ ' అనే చిత్రంలో తన జీవితం ఉత్పత్తి చేయబడింది . జీవ్ మిల్కా సింగ్ తన కుమారుడు.

ప్రయాణవసతులు

మార్చు
 
లోపలి నుండి చండీగఢ్ విమానాశ్రయం

భారతదేశంలో అత్యధికంగా వాహనాలను ఉపయోగిస్తున్న నగరాలలో చండీగఢ్‌కు ప్రధమస్థానం.[25] వెడల్పైన రహదార్లు, చక్కని నిర్వహణ మార్గమంతా వాహనాల పాత్కింగ్ సౌకర్యం ఉండడం ఇందుకు కారణమని భావించవచ్చు. " ది చంఢీగఢ్ ట్రాంస్‌పోర్ట్ " ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ నుండి ప్రభుత్వ బసులను నిర్వహించే అధికారాన్ని అందుకున్నది. ఇది సెక్టర్లలో 17 , నగరంలో 43 బస్సులను నడుపుతుంది.[26] సి.టి.యు పొరుగు రాష్ట్రాలైన పంజాబు , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీలకు కూడా బస్సు సేవలనను అందిస్తుంది. చండీగఢ్ జాతీయరహదారి 22 , జాయీయరాదారి 21తో రోడ్డు ద్వారా అనుసంధానం చేస్తుంది. చండీగఢ్ రైల్వేస్టేషన్ ఇండియన్ రైల్వే నార్తన్ రైల్వే జోన్‌లో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, కొలకత్తా,విశాఖపట్నం,జైపూర్,లక్నో,భోపాల్, ఇండోర్, త్రివేండ్రం , అమృత్‌సర్ వంటి ప్రముఖ నగరాలకు రైలు వసతి కల్పిస్తుంది. అంతేకాక ఇక్కడి నుండి అంబాలా , కొల్లం,పానిపట్, తిరువనంతపురం వంటి దక్షిణ భారతీయ ప్రముఖ నగరాలకు కూడా రైలు వసతి కల్పిస్తుంది. " చంఢీగఢ్ విమానాశ్రయం " భారతీయ ప్రముఖనగరాలకు కమర్షియల్ విమాన సేవలను అందిస్తుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్, ఇండోర్ నగరాలకు విమానసేవలు అందిస్తుంది. సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణదశలో ఉంది. చంఢీగఢ్ మెట్రో రైలు విధానం 2018 నాటికి కార్యరూపం దాల్చనుంది. .

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
  2. "censusindia.gov.in/2011-prov-results/paper2/prov_results_paper2_indiavol2.html". Office of the Registrar General & Census Commissioner, India. Archived from the original (PDF) on 25 డిసెంబరు 2018. Retrieved 26 March 2012.
  3. "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 122–126. Archived from the original (PDF) on 13 మే 2012. Retrieved 16 February 2012.
  4. "Official Website of Chandigarh Administration". chandigarh.gov.in. Archived from the original on 2019-02-19. Retrieved 2021-01-12.
  5. "Business Portal of India". Archived from the original on 2013-10-17. Retrieved 2014-04-30.
  6. "Front Page News : Monday, July 26, 2010". Chennai, India: The Hindu. 17 September 2008. Archived from the original on 2012-11-07. Retrieved 2010-07-26.
  7. "India's cleanest: Where does your city stand?: Rediff.com News". News.rediff.com. 13 May 2010. Retrieved 2010-07-26.
  8. Chandigarh History – History Of Chandigarh India – Origin & History of Chandigarh
  9. "The Official Government Website". Archived from the original on 2011-06-02. Retrieved 2014-04-29.
  10. Frommer's India (2010) Pippa de Bruyn, John Wiley & Sons, p613 ISBN 9780470556108
  11. "Capitol Complex, as Le Corbusier wanted it, remains incomplete". Indian Express. 2010-06-19. Retrieved 2013-07-02.
  12. "1st November 1966 - Haryana Day - History - Haryana Online - North India". Haryana Online. Archived from the original on 2013-10-02. Retrieved 2013-07-08.
  13. "List of districts of Chandigarh". www.census2011.co.in. Retrieved 2021-01-12.
  14. The Hindu Business Line
  15. "Places to See". chandigarhtourism.gov.in. Chandigarh Tourism. Retrieved 19 March 2014.
  16. "Falling Rain Genomics, Inc – Chandigarh". Archived from the original on 2009-01-16. Retrieved 2014-04-29.
  17. "Chandigarh's the richest of 'em all". Archived from the original on 2008-09-24. Retrieved 2014-04-29.
  18. "Chandigarh (UT) | DISTRICTS OF INDIA". districts.nic.in. Retrieved 2021-01-12.
  19. "Chandigarh District | Chandigarh - RailYatri". www.railyatri.in. Retrieved 2021-01-12.
  20. "Chandigarh District | Chandigarh District Map". www.onefivenine.com. Retrieved 2021-01-12.
  21. 21.0 21.1 21.2 "Villages & Towns in Chandigarh Tehsil of Chandigarh, Chandigarh". www.census2011.co.in. Retrieved 2021-01-12.
  22. 22.0 22.1 "History/District Court in India | Official Website of District Court of India". districts.ecourts.gov.in. Retrieved 2021-01-12.
  23. "Elante Mall Review - Chandigarh". textilefabricgarment.com. Archived from the original on 2013-10-02. Retrieved 2013-08-25.
  24. World Weather Information Service-Chandigarh Archived 2014-12-24 at the Wayback Machine, World Meteorological Organisation. Retrieved 29 September 2012.
  25. Top Ten Towns with Highest Nos. of Car Ownership in India
  26. "Chandigarh Transport Undertaking ISBT". Archived from the original on 2015-03-18. Retrieved 2014-04-30.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చండీగఢ్&oldid=4225284" నుండి వెలికితీశారు